Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sandeha Nivāriṇī · Prabodha 10
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
10
స్వామి:
ఏమి? చాలా ఆనందముగా నున్నావే?
2
▾
Meaning
Keep
భక్తుడు:
మానవుడు
ఆనందమయుడని,
తమరే
సెలవిచ్చియున్నారు
గదా?
3
▾
Meaning
Keep
స్వామి:
అయితే
ఎల్లప్పుడూ
ఇదేమాటయందే,
ఇదే
స్థితియందే
ఉండవలెను
కదా?
అట్లుంటున్నావా?
4
▾
Meaning
Keep
భక్తుడు:
సాధ్యమయినంతవరకు
ప్రయత్నించుచున్నాను.
5
▾
Meaning
Keep
స్వామి:
ప్రయత్నమేమి
వచ్చినది?
యథార్థము
తెలిసిన
ఒక
మాటతో
చింత,
దుఃఖము
ఎగిరిపోదా?
6
▾
Meaning
Keep
భక్తుడు:
యథార్థము
ఏది,
స్వామి?
7
▾
Meaning
Keep
స్వామి:
ఉన్నదంతయు
అసత్యమే,
పాడే
పాటలు,
ఆడే
ఆటలు,
అన్నియు
అసత్యమే
అని
తెలిసికొనిన
యథార్థము
తప్పక
కనిపించును.
ఇన్ని
అసత్యభావములు,
ఊహలు
కర్మలు
ఎత్తివేసిన
క్రింద
సత్యము
కనిపించును.
ఇన్నింటిని
పైన
వేసికొని
సత్యమేది
అన్న
ఎట్లు
కనిపించును?
8
▾
Meaning
Keep
భక్తుడు:
ఇవన్నియు
మాత్రము
చేసినది,
చూచునది,
అన్నది
అనిపించుకొన్నది,
అనుభవించునది,
ఎట్లు
అసత్యమని
తెలుప
వీలగును?
9
▾
Meaning
Keep
స్వామి:
అసలు
అన్నియు
అనుభవించువాడు
ఎవరు
అనునది
మొదట
తెలుసుకో,
నేను
నేను
అని
దేహమును
పోల్చుకొనుచున్నావే;
అదే
మొదట
అసత్యము,
అనుభవించు
నేనే
అసత్యమయినపుడు
అనుభవించు
కర్మలు
సత్యమెట్లు?
అన్నింటికి
ఒకే
ఆత్మయున్నది.
అనుభవించునది
తాను
కాదు.
ఆలకించునది
తానుకాదు.
సర్వసాక్షి
నీవు.
10
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
ఆత్మ
అన్నిటియందు,
అంతటా
ఉన్నదని
అందురే,
చచ్చిన
దేహమునకూడా
ఉన్నదా?
11
▾
Meaning
Keep
స్వామి:
ఓహో!
మంచి
ప్రశ్నే
వచ్చినది.
ఇది
నీకు
వచ్చిన
ప్రశ్నయా
లేక
చచ్చిన
మనిషికి
వచ్చిన
ప్రశ్నయా?
12
▾
Meaning
Keep
భక్తుడు:
నాకే
స్వామి!
13
▾
Meaning
Keep
స్వామి:
నాయనా!
సుషుప్తిలోనుంచి
లేచిన
తరువాత
కదా
నేనున్నానంటావు?
అదేవిధముగా
శవములో
కూడను
ఆత్మ
ఉండనే
ఉన్నది.
14
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
చావు
అంటారే,
ఆత్మ
ఉండినపుడు
చావు
ఎట్లు?
15
▾
Meaning
Keep
స్వామి:
నిజముగా
విచారిస్తే
చావే
లేదు,
బ్రతుకూ
లేదు.
చలనము
లేని
శరీరమును
చావనియు,
చలనముతో
ఉన్నదానిని
బ్రతుకు
అనియు
అందురు,
చూడు!
స్వప్నములో
చచ్చిన
శరీరములు
బ్రతికిన
శరీరములు
ఎన్నియో
చూస్తారు,
జాగృతి
కలిగిన
వెనుక
అవి
అన్నియు
లేనివే.
అదే
విధముగా
ఈ
చరాచర
ప్రపంచము
లేదు.
చావంటే
అహం
వృత్తి
ఉపశమించుటయే,
తిరిగి
పుట్టుట
అంటే
అహంవృత్తి
పుట్టుటయే.
ఇవే
జననమరణములని
అందురు.
నాయనా!
ఈ
చావు
పుట్టుకలు
అహంకారమునకే
కాని,
నీకు
లేవు.
16
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
నేనెప్పుడూ
ఉందునా?
17
▾
Meaning
Keep
స్వామి:
తప్పక,
అహంవృత్తి
ఉన్నప్పుడు
ఉన్నావు.
అది
లేనప్పుడూ
ఉన్నావు.
వృత్తికి
మూలము
నీవు
కాని,
వృత్తి
నీవు
కావు.
18
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
ముక్తిని
పొందినారని
అందురే?
అది
ఏది?
19
▾
Meaning
Keep
స్వామి:
పైన
చెప్పిన
చావుపుట్టుకల
మూలము
తెలిసికొని
అహంవృత్తిని
సమూలంగా
నాశనము
చేయవలెను.
అప్పుడు
ఉన్న
స్థితినే
ముక్తి
అందురు.
20
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
నేను
చావనపుడు
నేను
మీరు
ఒక్కటే
కదా?
21
▾
Meaning
Keep
స్వామి:
కాదని
ఎవరనిరి?
ఆ
ఒక్కటను
భావము
దృఢముగా
నిశ్చయించుకొన్న
వేరు
లేనే
లేదు.
22
▾
Meaning
Keep
భక్తుడు:
అంతవరకు
ఆ
సత్యమైన
నేను
అసత్యమైన
నేనులో
ఐక్యమయ్యేటట్లు
చేయుటకు
గురువు
సిఫార్సు
కావలెనని
కొంతమంది
అందురే,
అది
ఎంతవరకు
సత్యము?
23
▾
Meaning
Keep
స్వామి:
ఇన్ని
నేనులు
ఉంటేకాదా,
సిఫార్సుకు
మరొకరు
కావలెను.
అంతా
ఒక్కటే
అయినపుడు
సిఫార్సు
ఎందుకు?
అయితే
ఆ
నేను
అను
అహం
పోయేటంతవరకు
మాత్రము
చెప్పే
నేను,
వినే
నీవు
మాత్రము
ఉండవలెను.
అది
వీడిన
తరువాత
చెప్పేదెవరితో?
వినేదెవరు?
అంతా
ఒక్కటే,
ఆత్మ
ప్రతిబింబజీవుడైనాడు
అంతేకదా?
24
▾
Meaning
Keep
భక్తుడు:
అసలు
చిదాభాసమనగా
ఏమి
స్వామి?
25
▾
Meaning
Keep
స్వామి:
చిదాభాసం
అంటే,
చిత్తునుండి
అభాసముగా
తోచిన
అహంవృత్తి.
ఈ
ఒకటే
మూడై,
మూడు
అయిదై
అయిదు
అనేకమైంది.
ఒకటిగా
తోచిన
అహం
(సత్వ)
వృత్తి,
రజస్తమోగుణ
సంపర్కమువల్ల
మూడయి,
ఆ
మూడింటితో
పంచభూతోత్పత్తియై,
ఆ
అయిదింటివల్ల
అనేకం
కలిగింది
కదా.
అదియే
శరీరము
నేను
భ్రాంతిని
కల్పిస్తుంది.
ఆకాశరూపంగా
చెప్పవలసి
వస్తే,
చిదాకాశం,
చిత్తాకాశం,
భూతాకాశం
అని
మూడు
విధములు.
26
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
చిదాకాశము
ఏది?
27
▾
Meaning
Keep
స్వామి:
అదియే
ఆత్మ.
28
▾
Meaning
Keep
భక్తుడు:
చిత్తాకాశమంటే?
29
▾
Meaning
Keep
స్వామి:
దాని
ప్రతిబింబమే
చిత్తాకాశము.
అదే
చిత్తమన్నమాట
ఆ
చిత్తము
మనోబుద్ధి
అహంకారములుగా
మారినప్పుడు
అంతఃకరణము
అంటారు.
లోపల
పనిచేసే
ఇంద్రియాలను
అంతఃకరణాలని
అందురు.
ఆ
అంతఃకరణాలతో
కూడిన
చిదాభానునే
జీవుడంటారు.
30
▾
Meaning
Keep
భక్తుడు:
భూతాకాశమంటే
ఏమి?
31
▾
Meaning
Keep
స్వామి:
చిదాకాశము
యొక్క
అభాసమైన
చిత్తాకాశమే.
భూతాకాశాన్ని
చూచునపుడు
చిన్మయమని
అందురు.
అందుకనే
బాబూ
“మన
ఏవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః”
అన్నారు.
మనస్సే
ఎన్నెన్ని
భ్రాంతులనో
కల్పించును.
32
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
ఆ
భ్రాంతి
ఎట్లు
పోతుంది
స్వామి
మరి?
33
▾
Meaning
Keep
స్వామి:
దానిని
మర్మము
విచారణవల్ల
తెలిసికొన్న
అనేకం
అయిదు
మూటిలోనా,
మూడు
ఒకటి
లోనా
లయించి,
తాను
తానుగా
నుంటాడు.
తలనొప్పి
వచ్చింది
అనుకో,
మందువేసి
పోగొట్టుకొంటాడు.
అపుడు
మామూలుగానే
ఉంటాడు.
శరీరం
నేననే
భ్రాంతి
తలనొప్పివంటిది.
విచారణ
అనే
మందు
వేస్తే
పోతుంది.
34
▾
Meaning
Keep
భక్తుడు:
విచారణ
మార్గము
అందరికీ
పట్టుబడుతుందా?
35
▾
Meaning
Keep
స్వామి:
బాబూ!
అది
పక్వచిత్తులకే
పట్టు
పడును.
కాని,
అందరికీ
అసాధ్యము.
36
▾
Meaning
Keep
భక్తుడు:
పరిపక్వచిత్తులగుటకు
ఎట్లు
చేయవలెను?
37
▾
Meaning
Keep
స్వామి:
మొదటి
స్థానమునకే
వస్తివి
చూడు,
దానికే
జపము,
ధ్యానము,
ఆరాధన,
ప్రాణాయామాది
యోగాలు
ఉన్నవి
కదా.
క్రమంగా
ఆ
కర్మలవల్ల
పరిపక్వచిత్తులై
విచారణ
మార్గానుసారము
ఉన్న
తన్ను
తెలిసికొనగలరు.
పక్వ
చిత్తులకు
ఆత్మ
నీకన్నా
వేరుకాదు.
అంతా
ఆత్మయే.
38
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
స్వామి!
జప,
ధ్యాన,
భజనలు
మాత్రమే
తమరు
చెప్పితిరి.
పరిపక్వచిత్తులగుటకు
కొంతమంది
మౌనము
వహింతురే
దాని
ప్రయోజన
మేమి?
మౌనమంటే
ఏమి?
39
▾
Meaning
Keep
స్వామి:
ఆత్మస్ఫూర్తియే
మౌనము.
ఆత్మస్ఫూర్తి
లేనిది
మౌనమెట్లు
ఆత్మ
అవుతుంది?
ఆత్మస్ఫూర్తిచెందక,
నోరుమూసుకొని
మాట్లాడకుండా
ఉన్నంత
మాత్రమున
మౌనం
కాదు.
కొందరు
మౌనం
మౌనం
అని
అంటారు.
కాగితంమీదనో
పలకలమీదనో
వ్రాస్తారు.
చూపెడతారు.
అదంతా
వ్యవహార
మౌనం,
కాని,
మౌనమన్న
ఎడతెగని
భాషన్నమాట.
దానిని
పొందటమనేదేలేదు.
సదా
ఉండేదే.
మరుగుపరచే
విషయవృత్తులను
తోసి
వేయవలెనే
కాని
మౌనం
పొందటం
ఎవరిచేతను
కాదు.
40
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే,
చాలామంది
వాక్మౌనం
చేస్తారే,
దానివల్ల
ఏమి
ప్రయోజనం
లేదన్నమాట!
41
▾
Meaning
Keep
స్వామి:
ఉండకేమి.
బాహ్య
ప్రతిబంధక
నివారణార్థము
వాక్మౌనం
అవలంభించినా,
దాని
మూలమున
ఆలోచనా
అభివృద్ధి,
మితవాక్కు,
పరుల
అశాంతి
బాధలకు
గురికాక,
తన
యోచనాచింతనకు
ఏకాగ్రత,
అంతేకాక
వృథా
మాటలతో
తన
మెదడును
దుర్వినియోగ
పరచక
వాక్మౌనంవల్ల
మెదడునకు
అభివృద్ధి.
ఆ
మెదడుతో
స్థిరత్వమునకు,
స్మరణకు
బలము.
ఈ
ఫలితములు
సాధనా
సమయములకు
తోడ్పడును.
42
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే,
సంపూర్ణజ్ఞానికి
ఇవన్నియు
అవసరము
లేదా?
43
▾
Meaning
Keep
స్వామి:
సంపూర్ణజ్ఞాని
లోకమునందే
లేడు.
వానికి
లోకమే
అవసరము
లేనప్పుడు
ఇవన్నియు
ఎందుకు?
44
▾
Meaning
Keep
భక్తుడు:
అట్లయిన
చాలామంది,
జ్ఞానులు,
జ్ఞానులు
అంటారే
వారెవరు?
45
▾
Meaning
Keep
స్వామి:
పైన
చెప్పిన
మౌనులవంటివారే.
ఊరికే
అంతా
జ్ఞానమందురే
కాని
సంపూర్ణజ్ఞానమున్న
వానికి
లోకమే
లేదు.
అంతా
ఒకటిగనే
ఉండును.
అట్టివారు
తర్కజ్ఞానులు,
లోకజ్ఞానులు
కాని
యథార్థజ్ఞానులు
కారు.
46
▾
Meaning
Keep
భక్తుడు:
యథార్థజ్ఞాను
లెటువంటివారు,
మరి!
47
▾
Meaning
Keep
స్వామి:
యథార్థ
జ్ఞానులు,
“క్షీరే
యధా
క్షిప్తం,
తైలం
తైలే,
జలం
జలే,
సంయుక్త
మేకతాం
యాతి
తధాత్మాన్యాత్మవినునిః,”
అన్నట్లు,
కేవలం
జ్ఞానసిద్ధిని
పొందినవాడు
పాలలో
పాలవలె,
నూనెలో
నూనెవలె,
నీటిలో
నీటివలె
లీనమైనట్లు
స్థూలశరీర
పతనానంతరము
ఆత్మలో
లీనమయిపోవును.
కొంతమందికి
మాత్రము
కొన్ని
కొన్ని
సంస్కారములు
మిగిలి
ఉండును.
ఆ
సంస్కారములే
సంకల్ప
రూపముగా
నిలచి
యుండును.
ఆ
సంస్కారములు
తీరేటంతవరకు
ఇష్టము
వచ్చిన
దేహముతో
లోకములో
సంచరిస్తూ
ఉండును.
అదియును
భగవత్
సంకల్పమువల్లనే,
వారినే
దైవాంశ
సంభూతులనియు
అందురు.
48
▾
Meaning
Keep
భక్తుడు:
ఈ
భేధము
ఎందుకు
రావలెను
స్వామి!
49
▾
Meaning
Keep
స్వామి:
వారివారి
సాధనాసంకల్పములను
పట్టివచ్చును.
మామిడికాయలు
తిని
త్రేపులో
ఆ
వాసన
ఎందుకు
రావాలన్న
దానికి
ఎట్లు
అర్థము?
తిన్నది
అదే
కనుక
త్రేపుకూడా
దాని
వాసనే
వచ్చును.
50
▾
Meaning
Keep
భక్తుడు:
అట్టివారికి
కూడను
ఉపాధి
యుంటుందా?
51
▾
Meaning
Keep
స్వామి:
లేకున్న
పనులెట్లు
చేయుదురు!
వారికి
కూడ
ఉండును.
అయితే
అతి
సూక్ష్మముగా
విదేహముక్తిపర్యంతం
ఉంటుంది.
52
▾
Meaning
Keep
భక్తుడు:
అది
ఎట్లున్నది
స్వామి!
53
▾
Meaning
Keep
స్వామి:
నీటిపై
గీచిన
గీత
గీస్తున్నంతసేపు
కనిపించును.
ఆ
వెనుక
ఉండదు.
అట్లే
చేస్తున్నంతసేపు
ఉండును.
కనిపించును.
తక్షణము
అదృశ్యమగును.
54
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
జ్ఞానికి
వైరాగ్యము
చిహ్నమని
సెలవిస్తిరే,
ఇది
ఎట్లు
పొసగుతుంది?
55
▾
Meaning
Keep
స్వామి:
అది
నిజమే
నాయనా!
విరాగమే
జ్ఞాని
చిహ్నము.
ప్రారబ్ధవశాత్తు
వారికి
రాగము
కలిగినా
అది
శరీరానికే
కాని
తనకు
కాదని
తెలిసికొనవలెను.
ఆ
రాగమువల్ల
జీవన్ముక్తి
సుఖానికి
భంగమేకాని,
విదేహముక్తికి
జ్ఞానమే
ప్రధానము.
56
▾
Meaning
Keep
భక్తుడు:
జ్ఞానము
లేకున్నను,
వైరాగ్యమున్నంత
మాత్రమున
ముక్తి
కలుగునా?
57
▾
Meaning
Keep
స్వామి:
పిచ్చివాడా!
పక్వము
కాక
పండవునా?
జ్ఞానము
లేక
వైరాగ్యములేదు.
వైరాగ్యము
లేక
మోక్షము
లేదు.
58
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
భక్తి
యేది
ఇందులో?
59
▾
Meaning
Keep
స్వామి:
మొదటికే
వస్తివి.
జ్ఞానమునకు
మునుపు
ఆ
రూపముగా
నుండును.
దానికి
మునుపు
అనురక్తిగా
ఉండును.
ఇవి
అన్నియు
ఒకటే
నాయనా!
అనురక్తి-పువ్వు,
భక్తి-కాయ,
పక్వము-జ్ఞానము
వైరాగ్యము-పండు.
ఈ
మూడు
ఒకటి
లేక
ఒకటి
జరుగదు
నాయనా!
అన్నింటికీ
ప్రధానము
అనురక్తి
అను
పువ్వు.
అది
భక్తి
అను
కాయగా
తయారయిన
వెనుక
జ్ఞాన
వైరాగ్యములను
పక్వఫలములు
తమంతట
తామే
స్వరూపములు
పొందును.
అంతవరకు
ఆ
భక్తి
అను
కాయను
కాపాడుకొను
విధానమే
పైన
చెప్పిన
ప్రార్థనా
సాధనలు.
అయితే
అంతా
ఒక్కటే.
వేరు
లేదను
భావమును
మాత్రము
దృష్టిలో
పెట్టుకొనవలెను.
వేరేలేదని
మెలంగవలెను.
60
▾
Meaning
Keep
భక్తుడు:
లౌకికమర్యాదల
ననుసరించియైన,
ఇది
నాది
అని
అనవలసి
వస్తుంది
కదా,
అపుడేమి
చేయవలెను?
61
▾
Meaning
Keep
స్వామి:
అవును.
అనవలసివస్తుంది.
అన్నంతమాత్రాన
అన్నీ
“నేను”
అనుకొని
భేదము
పడవలసిన
అవసరము
లేదే?
బండిలో
పోతూ
బండి
నేను
అని
అనుకొంటామా?
సూర్యుడు
చూడు,
నీటితో
నిండిన
చిన్నకుండలోనా,
పెద్ద
నదిలోనా,
అద్దములోనా,
పాత్రలపైనా
అన్నిటిలోనా
ప్రతిబింబిస్తాడు.
అంతమాత్రాన
అన్నీ
తాననుకొంటాడా?
అవి
భిన్నమయినపుడు
చింతిస్తాడా?
ఇదీ
అంతే,
నేను
శరీరమును
అని
అనుకుంటే
అన్నీ
చింతలే.
నేను
కాదని
అనుకొంటే
సూర్యునివలె
తనంతట
తాను
ప్రకాశిస్తాడు.
అంతేకాక
సర్వత్రా
నిండియుంటాడు.
62
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే,
మొదట
ఎవరికి
వారు
తానెవరో
అనునది
కనుగొనవలెనన్న
మాట?
63
▾
Meaning
Keep
స్వామి:
అక్షరాలా,
దానిని
మొదట
వెతుకవలెను.
కాని,
అనధికారులకు
ఈ
విషయము
బోధపడదు.
నీవే
బ్రహ్మవు
అనియు,
మోక్షమే
నీవు
పొందియున్నావు,
అని
తెలిపిన,
దాని
అధికారమును
గుర్తెరుగని
మూర్ఖులు
సాధనే
చేయక,
విచ్చలవిడిగా
సంచరించి,
మంచి
చెడ్డలనక
మెలగుదురని,
పెద్దలు,
ఋషులు
స్వానుభవము
వల్లనో,
గురుముఖాంతరము
వల్లనో
లేక
భగవత్
ఆజ్ఞ
వల్లనో
దానిని
సేవా
విధాన
మార్గమున
తెలిసికొనవలెనని,
అనుభవజ్ఞులు
అనధికారులకు
తెలియపరచరాదు,
అని
తెలిపిరి.
కాని,
దానిని
తెలిసికొనవలెనను
ఇచ్ఛ,
శ్రద్ధ
ఉన్నవారు
ఆనందముగా
అడుగవచ్చును.
అయితే
దానిని
ఆచరించవలెను.
కాని
ఆలకించి,
అంతా
ఒక్కటే
అన్న
ప్రయోజనం
లేదు.
వానికి
అర్థము
కాదు.
64
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
శంకరులు
ఆనాడు
సెలవిచ్చియుండిరి
కదా?
“విశ్వందర్పణ
దృశ్యమాననగరీతుల్యం
నిజాంతర్గతం”
అను
శ్లోకములో,
జగత్తు
మిథ్య,
మాయ
అనే
దృష్టి
సాధారణ
జనులకేనా,
జ్ఞానులకు
కూడా
అన్వయించునా?
65
▾
Meaning
Keep
స్వామి:
జ్ఞాని
దృష్టికి
అంతా
బ్రహ్మమయంగానే
తోస్తుంది.
అజ్ఞానికా,
ఏం
చెప్పినా
తెలియదు.
కాన
శాస్త్రములన్నియూ
మధ్యములకే
కాని
జ్ఞానులకు
అన్వయింపవు.
66
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
అన్ని
సాధనలు
విచారణ
మార్గమున
అణగినవేనన్నమాట.
67
▾
Meaning
Keep
స్వామి:
అవును.
నేనెవడు
అను
విచారణయే
వేదాంతబోధ,
అన్నిటికి
మొదలు,
చివరను
సాధనచతుష్టయ
సంపత్తి
గలవాడే
వేదాంత
విచారణకు
అధికారి.
ఆ
నాల్గింటిలో
ఆత్మానాత్మ
వివేకం,
“ఆత్మ
నిత్యం
జగత్తు
మిథ్య”
అని
తెలిసికోవడమే
దాని
తాత్పర్యము.
68
▾
Meaning
Keep
భక్తుడు:
అది
యెట్లు
తెలిసికొన
వీలగును
స్వామి?
69
▾
Meaning
Keep
స్వామి:
ఆత్మస్వరూపమేమి,
అని
విచారించడమే,
దానికి
మునుపు
ఎన్నెన్నో
సాధనలు
చేసి,
కడపట
దానిని
అనుసరింతురు.
అబ్చ్ద్లు
చిన్నప్పుడే
నేర్పినారు
కదా?
యం.ఎ.,
బి.ఎ.
లైనా
ఆ
అబ్చ్ద్లలోనే
ఇమిడినవి
కదా?
ఆ
పెద్ద
చదువు
లెందుకంటే
నచ్చుతుందా?
అంతా
చదివి
విమర్శిస్తేకదా
అన్ని
చదువులూ
అబ్చ్ద్లలోనే
ఇమిడియున్నవని
తెలియును;
అన్ని
వేదశాస్త్రములు
అకారాది
అక్షరాలలో
అణగలేదా?
అట్లావుందని
శాస్త్రములంతా
అనుభవించిన
తరువాతకదా
తెలిసినది?
అన్ని
మార్గములు
విచారణ
మార్గమునందే
అణగియుండును.
70
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
కొంతమంది
సమాధులని
పొందుదురే
వారికిట్టి
విచారణ
సమాధిలో
కూడా
ఉండునా?
71
▾
Meaning
Keep
స్వామి:
పిచ్చివాడా!
సమాధిలో
ఉన్నప్పుడు
విచారణ
ఎట్లుండును?
నీవు
గాఢముగా
నిద్రించుచున్నప్పుడు
ప్రకృతి
సంబంధమైన
విచారణ
తలంతువా?
అట్లే
అదియును.
72
▾
Meaning
Keep
భక్తుడు:
సమాధిలో
మనస్సు
ఉండునా,
ఉండదా?
73
▾
Meaning
Keep
స్వామి:
నిద్రలో
ఏ
మనసుండునో
అప్పుడూ
అదే
మనసు
ఉండును.
74
▾
Meaning
Keep
భక్తుడు:
సమాధిలోనే
తురీయస్థితి
అంటారే
ఏమది?
75
▾
Meaning
Keep
స్వామి:
అట్టి
సమాధిలో
ఉన్నవారు
కన్నులు
తెరచుకొని
యుండియూ
జాగ్రత్స్వప్న
సుషుప్తులు
మూడునూ
లేకుండినటువంటి
స్థితినే
తురీయమని
అందురు.
76
▾
Meaning
Keep
భక్తుడు:
వారి
కెందుకు
అవి
ఉండవు?
వాటి
గుణము
లేమి?
77
▾
Meaning
Keep
స్వామి:
అవి
అహంకార
లక్షణములు,
అహంకారమే
మనస్సు,
అదే
అన్ని
కార్యములు
నిర్వహించును.
అది
వారివద్దనుండదు.
అట్టి
అహంకారము
వారివద్దనుండి
ఏనాడో
తొలగిపోయి
ఉండును.
అట్టివారు
కన్నులు
తెరచినా
మూసినా
ఒక్కటిగానే
ఉండును.
78
▾
Meaning
Keep
భక్తుడు:
కాని,
స్వామి!
ఆ
అహమే
లేకుంటే
వారెట్లు
మాట్లాడగలరు?
79
▾
Meaning
Keep
స్వామి:
మునుపు
అహంగా
తోచిందే,
యథార్థం
తెలిసికొన్న
తరువాత
స్వరూపంగా
పరిణమిస్తుంది.
దానినే
మనోనాశనమని
అంటారు
కూడా.
80
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
ఆ
నిర్వికల్పేత్యాది
సమాధులు
అన్నియు
నాశనమేనా?
81
▾
Meaning
Keep
స్వామి:
పిచ్చివాడా!
సమాధులనినయు
లయమే
కాని
నాశనం
కాదు.
అణగటం
లేవటం
ఉన్నంతవరకు
సాధక
స్థితే.
82
▾
Meaning
Keep
భక్తుడు:
చాలా
బాగున్నది
స్వామి
ఈ
విషయము.
83
▾
Meaning
Keep
స్వామి:
కేవలము
బాగున్నదని
అంతటితో
ఊరకుండుట
కాదు.
దానిని
అనుష్టించుచూ
జీవితము
గడుపు.
పోయిరా.
84
▾
Meaning
Keep
భక్తుడు:
మంచిది
స్వామి.
అట్టి
ఆచరణకునూ
అనుగ్రహము
చూపండి
వెళ్ళి
వస్తా.
Previous
←
Prabodha 9
Next
Prabodha 11
→