Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sandeha Nivāriṇī · Prabodha 11
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
11
భక్తుడు:
స్వామి! ఒక సందేహము. అడుగుదునా?
2
▾
Meaning
Keep
స్వామి:
తప్పక,
అడుగుదునా
అనుట
ఎందుకు?
3
▾
Meaning
Keep
భక్తుడు:
కొంతమంది
బ్రహ్మమును
అస్తి
భాతి
ప్రియమంటారే,
అట్లన్న
అర్థమేమి!
బ్రహ్మమునకూ
వీనికి
గల
సంబంధమేమి!
4
▾
Meaning
Keep
స్వామి:
అదియా!
అస్తి
అంటే
ఉన్నది.
భాతి
అంటే
ప్రకాశించేది.
ప్రియమంటే
తెలిసినదేకదా,
ప్రియమైనది.
ఏది
నీకు
ప్రియమో
అదంతయు
బ్రహ్మమే.
ఒక
కుక్క
నీకు
ప్రియమైనదైన
ఆ
కుక్క
బ్రహ్మమే.
ఆ
కుక్కకు
రూప
నామములు
ఉన్నవి.
నీవు
ఇప్పుడు
నీ
రూపనామములు,
దాని
రూపనామములు
వదలినావంటే
బ్రహ్మమే.
దానినే
భూత
ప్రతిబంధమనికూడా
అంటారు.
రూపనామముల
విసర్జనే
బ్రహ్మము.
అన్ని
నామరూపములందు
ఒకే
బ్రహ్మము
ఏకమై
యున్నది
కదా!
అదే
అస్తి.
ఇది
ఉన్నది
అని
చూచేటందుకు
ఒకడుండవలెను
కదా!
ఆచూచే
తెలివే
భాతి.
అది
కావాలె,
అది
చూడాలె
అన్నది
ఉంటే
కదా
చూచేదీ,
వినేది!
అదే
ప్రియము.
ఈ
మూడును
సహజ
స్వరూప
లక్షణములు
నాయనా!
5
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
సచ్చిదానంద
మంటారే,
అది
ఏది
మరి?
6
▾
Meaning
Keep
స్వామి:
పిచ్చివాడా!
అంతా
ఇదే,
దీనినే
సచ్చిదానందమని
కూడా
అంటారు.
7
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
ప్రియముకూడా
సహజమే.
అయితే
దేనిని
చూచినను
ప్రియమే
ఉండవలెను
కదా!
తేళ్ళను,
పాములను,
విషపురుగులను
కాని,
మరే
ఇతర
క్రూరమృగములను
కాని
చూచిన
ప్రీతి
రాదే!
8
▾
Meaning
Keep
స్వామి:
నీకు
ప్రీతి
లేకుండవచ్చును.
అయితే
ఏ
జాతికి
ఆ
జాతిపై
ప్రీతి
యుండును
కదా!
దొంగకు
దొంగను
చూస్తే
ప్రియము.
భక్తునకు
భక్తుని
చూస్తే
ప్రియము.
అట్లాగే
ఒక్కొక్కటికి
దానిపై
ప్రియముండియే
తీరును.
9
▾
Meaning
Keep
భక్తుడు:
ఇప్పుడీ
లోకమున
అస్తి,
భాతి,
ప్రియముల
తెలుపు
ఉదాహరణములు
ఏమైనా
ఉండిన
తెలుపండి
స్వామి!
పై
దంతమూ
అర్థమగుటలేదు.
10
▾
Meaning
Keep
స్వామి:
పిచ్చివాడా!
ఏవైనా
ఉంటే
తెలిపితివే
లేనిదేది?
అంతా
బ్రహ్మమే
కదా?
చూడు!
ఒక
చిత్రమునకు
పోదువు.
అయితే,
అక్కడ
చిత్రపటము
ఎప్పుడూ
ఉన్నది
కదా?
అదే
అస్తి.
చూచేవాడుండును
కదా?
వాడు
నీవే
అనుకో.
నీవే
భాతి,
ప్రియము.
నామ
రూపములతో
కూడిన
చిత్రాలు
వస్తుంటాయి,
పోతుంటాయి.
వానిని
భ్రమించక
తోసివేస్తేను
ఉండే
తెర
ఉండనే
ఉన్నదికదా?
అక్కడ
ఒక
జాగ్రతను
కనుగొనవలెను.
ఒక
రంధ్రమునుండి
వచ్చే
సన్నని
కాంతితో
తెరమీద
బొమ్మలను
చూస్తాము.
ఆ
ఆవరణరహితమైన
పెద్ద
లైటే
వస్తే
బొమ్మలు
కనపడునా?
అంతా
ఒకే
వెలుతురుగా
ఉండును.
అదే
రీతిగా
మనస్సనే
చిన్న
వెలుతురు
ద్వారానే
చూస్తే
నానావిధములైన
నానావ్యర్థములైన
ప్రపంచము
గోచరిస్తుంది.
ఆత్మజ్ఞానమను
పెద్ద
లైటుతో
చూస్తే
అంతా
ఒక్కటే
వెలుతురు.
అనగా
ఒకే
బ్రహ్మముగా
కనిపించును.
తెలిసినదా?
11
▾
Meaning
Keep
భక్తుడు:
చాలా
బాగ
అర్థమయినది
స్వామి!
భూత
ప్రతిబంధమేదని
తెలిసినది,
వర్తమాన
ప్రతిబంధాలంటారే
అవి
ఏవి?
12
▾
Meaning
Keep
స్వామి:
సరి
బాగున్నది.
తెలుపుదును
చూడు,
వర్తమాన
ప్రతిబంధములనగా
విషయాసక్తి
లక్షణమనీ,
కుతర్కమని,
ప్రజ్ఞామాంద్యమనీ,
విపర్యాసదురాగ్రహమనీ,
నాలుగు
విధములుగా
ఉన్నది.
అందులో
విషయాసక్తి
అంటే
విషయాల
మీద
గాఢమైన
ప్రీతి.
కుతర్కమనగా
గురువులు
బోధించిన
అర్థమునకు
విపరీత
అర్థమును
తీయుట,
ప్రజ్ఞామాంద్యమనగా
గురువులు
చెప్పిన
అర్థజ్ఞానములు
బుద్ధికి
ఎక్కకుండుట,
విపర్యాసదురాగ్రహం
అంటే
నేను
శాస్త్రి,
పండితుడు,
వర్తకుడు
అని
దేహేంద్రియాదులందు
ఆత్మతత్త్వ
బుద్ధి
కలగడము.
వీనిని
వర్తమాన
ప్రతిబంధకాలంటారు.
13
▾
Meaning
Keep
భక్తుడు:
ఇంకా
భావి
ప్రతిబంధమనగా
ఏమి
స్వామి!
14
▾
Meaning
Keep
స్వామి:
ఓహో!
అది
పాపకర్మలవలన
ఎప్పుడూ
వచ్చేదే,
తెలియకుండానే
వచ్చేది.
15
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే,
అది
తెలిసేది
ఎట్లు
స్వామి?
16
▾
Meaning
Keep
స్వామి:
అది
అందరికి
సాధ్యము
కాదు.
సన్నిహితమైన
పాపకర్మం
ముముక్షువులైనవారికి
కొంతవరకూ
రూఢమై
దయారూపమైన
ఆసక్తి
పుట్టించు
దానిని
భావిప్రతిబంధమని
తెలిసికోవాలె.
అది
కేవలము
ఒక
జన్మముతో
తెలిసికొనలేరు.
అనేక
జన్మలు
కావలెను.
17
▾
Meaning
Keep
భక్తుడు:
అట్లు
అనేక
జన్మలు
కల్గినవారూ,
దానిని
తెలిసికొన్నవారు
ఎవరైనా
ప్రమాణమునకు
ఉందురా?
18
▾
Meaning
Keep
స్వామి:
లేకేమి?
భరతుడు,
వాసుదేవుడు
ఇత్యాది
వారెందరో
కలరనియూ,
భరతుడు
రెండు
మూడు
జన్మలు
ఎత్తెననియు,
వాసుదేవునకు
తిరిగి
జన్మ
కలిగినదనియు,
శ్రుతిస్మృతి
పురాణాదులు
చెప్పుచునే
యున్నవి
కదా?
19
▾
Meaning
Keep
భక్తుడు:
కొన్ని
జన్మలు
ఎత్తక
ఈ
ప్రతిబంధత్రయములు
తెలియవన్నమాట.
ఎత్తకనే
తెలిసికొన
వీలులేదా?
20
▾
Meaning
Keep
స్వామి:
లేకేమి,
ముముక్షువైనవాడు
ఈ
చెప్పబడిన
ప్రతిబంధత్రయాన్ని
విచారించి,
అవి
తనను
అంటకుండా
ఉండేటట్లు
తొలగించుకోవాలె.
అట్లా
చేయకుంటే
నిజముగా
కొన్ని
జన్మలు
కలగడానికి
సందేహములేదు.
21
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి,
వర్తమాన
ప్రతిబంధాన్ని
గురించి
చెప్పితిరి.
భూత
ప్రతిబంధానికి
నివృత్తి
ఉండినట్లు.
దీనికి
నివృత్తియేది?
22
▾
Meaning
Keep
స్వామి:
దీనికి
మాత్రమెందుకు
లేదు?
ప్రతి
బంధమునకూ
కర్మ,
దానికి
తగిన
నివృత్తి
ఉండనే
ఉన్నది
కదా?
నివృత్తి
లేని
బంధమే
లేదు.
చూడు;
శమ,
దమ,
ఉమరతి,
తితిక్షల
వల్ల
విషయాసక్తియును
తిరిగితిరిగి
శ్రవణము
చేయుటవల్ల
ప్రజ్ఞామాంద్యమున్ను,
ఆ
విన్న
దానిని
మననము
చేయడమువల్ల
కుతర్కమున్నూ,
నిధిధ్యాసమువల్ల
విపర్యాస
దురాగ్రహమున్నూ
నివృత్తి
కాగలదు.
తెలిసినదా?
23
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
ఇన్ని
వివరములు
తెలిసికొనవలెనన్న
కేవలము
అందరికీ
సాధ్యము
కాదు
గదా?
అట్లు
అందరికీ
సాధ్యము
కావలెనన్న
ఏది
అవసరము.
24
▾
Meaning
Keep
స్వామి:
పిచ్చివాడా!
ఏది
తెలిసికొనవలెనన్ననూ
తెలియకున్ననూ
ఈ
రెండింటికి
విజ్ఞాన,
అజ్ఞానములే
కారణము.
విజ్ఞానమువల్ల
తెలియును.
అజ్ఞానమువల్ల
తెలియదు.
ఇంత
మాత్రము
నీకు
తెలియదా?
25
▾
Meaning
Keep
భక్తుడు:
మొదట
విజ్ఞాన
అజ్ఞానములంటే
ఏమో,
ఒక్కొక్కరు
ఒక్కొక్కరీతిగా
చెప్పుచుందురు.
అజ్ఞాన
విజ్ఞానములకు
మూలాధారము
లేవో
తమరు
సెలవీయండి.
26
▾
Meaning
Keep
స్వామి:
మొదటికే
వస్తివా?
సరి.
బహిర్ముఖమైన
మనోవృత్తిని
(అనగా
ప్రకృతి
సంబంధమైన
వాసనావృత్తిని)
అజ్ఞానమనియు,
అంతర్ముఖమైన
మనోవృత్తిని
(అనగా
ఆత్మ
సంబంధమైన
వాసనావృత్తిని)
విజ్ఞానమనియు
అంటారు.
అజ్ఞానమునకే
మనస్సు
అనీ,
చిత్తమని
పేరు.
ఆ
వృత్తియే
అంతర్ముఖమైనపుడు,
బుద్ధి
అని
అహంకారమనియు
అనవలసియుండును.
27
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
జ్ఞానికి
పరేచ్ఛాప్రారబ్ధము
తప్ప
మరేమీ
ఉండవని
కొందరు
పెద్దలందురే;
అది
నిజమా?
28
▾
Meaning
Keep
స్వామి:
జ్ఞానికి,
అజ్ఞానికి,
ఇచ్ఛా,
అనిచ్ఛా,
పరేచ్ఛా,
ప్రారాబ్ధాలు
సమంగానే
ఉండును.
అనుభవము
కూడా
అంతే.
అయితే
జ్ఞానికి
మనము
చేస్తున్నామనే
తలంపు
ఉండదు.
కాబట్టి
బంధము
ఉండదు.
అజ్ఞానికి
నేను
చేస్తున్నాననే
తలంపు
ఉండుటవల్ల
బంధము
ఏర్పడును.
ఇదే
వ్యత్యాసము
చెప్పియుంటిని
కదా
దీనికి
మొదలే,
“మన
ఏవ
మనుష్యాణాం
కారణం
బంధ
మోక్షయోః”
అన్నట్లు
అన్నింటికి
మనసే
కారణము.
29
▾
Meaning
Keep
భక్తుడు:
మనసు,
మనసు
అంటారే
మనసు
ఎట్లుంటుంది?
దాని
రూపమేమి?
30
▾
Meaning
Keep
స్వామి:
మనసుకు
తలంపులే
రూపము
బాబూ.
ఆ
తలంపులకు
మూలము
తెలిసికొంటే
బంధము
ఉండదు.
31
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
ఆ
మూలమేమి?
32
▾
Meaning
Keep
స్వామి:
ఆ
మూలమే
“తాను,
తాను”
అంటుంటారే,
ఆ
తానే
మూలము.
తన్ను
తా
నరసి
ఉన్నట్లు
ఉంటే,
ఎన్ని
తలంపులు
రానీ,
పోనీ,
తన్నేమి
చేయలేవు.
33
▾
Meaning
Keep
భక్తుడు:
సరి,
చక్కగ
ఉన్నది
స్వామి,
ఇవన్నియు
మా
బుఱ్ఱకు
అంటి
మమ్ముల
ధన్యులగునట్లు
చేయండి;
వెళ్ళి
వస్తా;
నమస్తే.
34
▾
Meaning
Keep
స్వామి:
తథాస్తు!
వెళ్లిరా
నాయనా
ఆనందముగా
ఆశీర్వాదములు
అందుకో!
Previous
←
Prabodha 10
Next
Prabodha 12
→