Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sandeha Nivāriṇī · Prabodha 12
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
12
భక్తుడు:
స్వామి, తమరు వెంకటగిరి ఆధ్యాత్మిక సభలయందు కొన్ని విషయములు తెలిపితిరి. అవి కొన్ని కొన్ని సరిగా అర్థమగుట లేదు. అడుగవచ్చునా?
2
▾
Meaning
Keep
స్వామి:
అర్థము
కానిది
అడుగుటయే
నాకునూ
ఆనందము.
తప్పక
అడుగవచ్చును.
3
▾
Meaning
Keep
భక్తుడు:
స్థూలరూపము,
సూక్ష్మరూపము
అని
అంటిరి
కదా?
ఒక్క
మనసుకు
మాత్రము
అట్టి
రూపములుండునా!
ప్రతియొక్క
విషయమునకు
ఉన్నవా?
4
▾
Meaning
Keep
స్వామి:
ఏ
విషయమునందునూ
స్థూల
సూక్ష్మములు
ఉన్నవి.
అసలు
స్థూలమున
ఏయే
రూపములు,
నామములు
చూస్తూ,
వింటూ
ఉన్నారో
అవన్నియు
సూక్షమునందు
కూడ
రూపనామములతో
ఉన్నవి.
లోనున్న
సూక్ష్మమును
ఎరిగించుట
కొరకే
స్థూల
రూపనామములు
ఏర్పడినవి.
5
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
స్వామి,
స్థూల
ఆకాశము
కనిపించుచున్నదే,
దానికి
సూక్ష్మ
ఆకాశమేమైనా
ఉన్నదా?
6
▾
Meaning
Keep
స్వామి:
పిచ్చివాడా!
ఆ
సూక్ష్మ
ఆకాశమే
ఇన్నింటిని
కప్పుకొనియున్నది.
స్థూలమునందు
ఎంత
సున్నితముగాను
విశాలముగాను
ఆకాశము
ఉన్నదో,
సూక్ష్మమునందు
కూడా
అంత
సున్నితముగాను
ఉన్నది.
లేకేమి?
7
▾
Meaning
Keep
భక్తుడు:
దానికి
పేరేమి
స్వామి?
8
▾
Meaning
Keep
స్వామి:
దానినే
సూక్ష్మ
హృదయాకాశ
మంటారు.
9
▾
Meaning
Keep
భక్తుడు:
దానికి
విశాలత్వమెక్కడిది
స్వామి?
10
▾
Meaning
Keep
స్వామి:
దానికున్నంత
విశాలత్వము
మరి
దేనికి
కూడనూ
లేదు.
ఎన్ని
దృశ్యములను
ఎన్ని
అనుభవములను,
ఎన్ని
చింతలను,
ఎన్ని
ఊహలను
ఇమిడ్చికొన్నదో
చూడు?
11
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే,
ఆకాశము
ఉన్నట్లే
సూర్యుడు
కూడ
ఉన్నాడా?
12
▾
Meaning
Keep
స్వామి:
లేకేమి?
ఆ
సూర్యుడు
లేకున్న
ఇంత
కుశలత,
ప్రకాశము
ఎక్కడిది?
13
▾
Meaning
Keep
భక్తుడు:
అతడు
ఏ
పేరు
నందుండును?
14
▾
Meaning
Keep
స్వామి:
హృదయము
ఆకాశమయినపుడు,
ఆ
ఆకాశమున
సంచరించు
సూర్యుడు
బుద్ధియే;
సూర్యకిరణములెంత
ప్రకాశవంతముగా
ఉండునో,
బుద్ధిప్రభలు
గూడ
అంత
ప్రకాశవంతముగా
ఉండును.
కాన
సూక్ష్మ
సూర్యుడు
బుద్ధియే.
15
▾
Meaning
Keep
భక్తుడు:
అదే
విధముగా
చంద్రుడు
కూడను
ఉండవచ్చును
కదా,
స్వామి?
16
▾
Meaning
Keep
స్వామి:
చంద్రుడేమి,
సూర్యుడేమి,
ఆకాశమేమి,
మొదటే
చెప్పితినిగదా,
సర్వ
స్థూలరూపములకు
సూక్ష్మరూపము
వేరే
ఉన్నదని,
ఆ
స్థూలచంద్రుడే
సూక్ష్మరూపమున
ప్రేమ
అను
చల్లదనముతో
ప్రకాశించుచున్నాడు,
మానవప్రేమయే
సూక్ష్మచంద్రుడు.
17
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే,
పాండవులు
కౌరవులు
యుద్ధము
చేసిరే
అందులో
సూక్ష్మపాండవులూ,
కౌరవులూ,
వారి
సూక్ష్మయుద్ధము
ప్రపంచమున
ఏ
రీతిగా
తెలియుచున్నది!
18
▾
Meaning
Keep
స్వామి:
చేసిరే
అనుట
యెందుకు!
నేటికిగూడను
చేయుచునే
ఉన్నారు,
సూక్ష్మరూపులై.
ఇందులో
దుర్గుణములే
కౌరవులు,
సద్గుణములయిన
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమ,
అహింసలను
ఐదుగుణములే
పంచపాండవులు.
దుర్గుణములను
కౌరవులు
లెక్కలేనంతమంది
యున్నారు.
యుద్ధము
వారికి
వారికి
ప్రతి
ఒకరి
హృదయాకాశము
క్రిందే
చిత్త
భూమియందే
జరుగుచున్నది.
19
▾
Meaning
Keep
భక్తుడు:
ఇందులో
పాండురాజు
కొడుకులు
పాండవులు;
ధృతరాష్ట్రుని
కొడుకులు
కౌరవులు
అన్నారే
-
మీరు
చెప్పేటటువంటి
సూక్ష్మమార్గమున
పాండురాజు
ఎవరు?
ధృతరాష్ట్రుడు
ఎవరు?
20
▾
Meaning
Keep
స్వామి:
ఒక్క
హృదయ
రాజ్యాధిపతులే
వారు
అజ్ఞాని,
సుజ్ఞాని
అను
పేర్లతో
అందరియందూ
ఉన్నారు.
అజ్ఞాని
అయిన
గ్రుడ్డివాడే
ధృతరాష్ట్రుడు.
సుజ్ఞాని
అయిన
పాండురాజే
సద్గుణముల
తండ్రి
తెలిసినదా!
21
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
స్వామి
క్షమించండి!
ఆ
యుద్ధమున
ఇంకను
అనేకములైన
రథములూ,
సైన్యము,
ప్రజలు
ఉండిరే!
వారంతా
ఎవరు,
మరి!
22
▾
Meaning
Keep
స్వామి:
తప్పక
అవన్నియు
కూడా
మానవునియందే
ఉన్నవి.
వివిధమైన
అనేక
భావములే
ప్రజలు,
దశేంద్రియములే
సైన్యము,
పంచేంద్రియములే
రథాలు.
అట్టి
సైన్యముతో,
ప్రజలలో
ప్రతి
ఒక్కరి
హృదయమందు
నిత్యమూ
పాండవులు
కౌరవులను
సద్గుణ
దుర్గుణములు
యుద్ధము
చేయుచునేయున్నవి.
తెలిసినదా?
23
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే,
ఈ
రెండింటికి
మధ్యవర్తి
అయిన
కృష్ణపరమాత్మ
ఈ
సూక్ష్మరూపమున
ఏ
పేరుతో
ఉన్నాడు.
24
▾
Meaning
Keep
స్వామి:
అంత
మాత్రము
తెలియదా?
అతనే
ఆత్మ
అను
పేరుతో
సాక్షిభూతుడై
యున్నాడు.
జీవిత
రథసారథే
అతడు.
25
▾
Meaning
Keep
భక్తుడు:
వీరందరికి
ముఖ్యపట్టణము
హస్తినాపురము
కదా!
ఆ
హస్తినాపురము
ఇప్పుడు
సూక్ష్మమున,
ఏది?
26
▾
Meaning
Keep
స్వామి:
ఈ
సూక్షరూపమున
సంచరించు
సర్వ
సైన్య,
రథ,
కౌరవ
పాండవులకు
నిలయమైనది
అస్తిపంజరమే.
కాన,
అస్తిపంజరమే
హస్తినాపురము.
ఎట్లన
ఆ
స్థూల
హస్తినాపురమునకూ
నవద్వారములు,
దీనికి
నవద్వారములు,
కౌరవపాండవులు
పుట్టినది,
పెరిగినది,
ఆడినది,
పాడినది,
విద్యలు
నేర్చినది,
కడకు
యుద్ధము
చేసినది
ఒకేస్థలమందు.
ఇక్కడగూడ
దుర్గుణ
సద్గుణములు
పుట్టినది,
ఆడినది,
పాడినది,
సర్వమూ
నేర్చినది,
కడకు
రెండింటికి
వైరము
వచ్చినది
ఒకే
అస్తిపంజరమైన
దేహమందే,
కాన,
దేహమే
హస్తినాపురము.
ఇందులోని
రాజులే
ఆజ్ఞాని,
సుజ్ఞాని,
తెలిసినదా?
27
▾
Meaning
Keep
భక్తుడు:
భారతయుద్ధమునకు,
మనిషియొక్క
గుణ
ప్రవర్తనలకు
చాలా
సంబంధమున్నది.
ఎంత
చక్కని
పోలిక
స్వామి!
నిజమే.
తాము
చెప్పిన
ప్రతి
విషయమునందూ
సంబంధము,
సందేహము
లేకున్నది.
తమరు
తెలిపినట్లు
ఇట్టి
యుద్ధము
ప్రతి
ఒక్కరియందు
నేటికిగూడ
జరుగుచునేయున్నదన్నమాట.
ఈ
యుద్ధమింక
నిల్చుట
ఎప్పుడు!
28
▾
Meaning
Keep
స్వామి:
ఈ
యుద్ధము
నిల్చుటయా?
ఎప్పుడు
దుర్గుణ
సద్గుణములు
ఒక్కటయి
గుణరహితులు
కాగలరో
అప్పుడే
శాంతి
ఏర్పడును.
29
▾
Meaning
Keep
భక్తుడు:
అప్పుడు
ఈ
యుద్ధరంగమైన
అస్తిపంజరము
ఉండదన్నమాట?
30
▾
Meaning
Keep
స్వామి:
యుద్ధమున్నకదా
యుద్ధరంగము?
యుద్ధమే
లేకున్న
యింక
రంగమెక్కడిది?
31
▾
Meaning
Keep
భక్తుడు:
ఈ
యుద్ధము
లేకుండా
చేసికొన
వీలులేదా?
32
▾
Meaning
Keep
స్వామి:
ఎందుకులేదు?
వ్యామోహములనే
ప్రజలున్నకదా
యుద్ధమును
జరిపింతురు.
అట్టి
ప్రజలే
లేకున్న
ఏ
యుద్ధమూ
లేదు.
కాన
మొదట
వ్యామోహములు,
మమకార
అహంకారములూ
లేకుండా
చేసికొన్న
శాంతిగా
ఉండవచ్చును.
అట్టి
శాంతికి
ప్రయత్నించు
నాయనా!
వెళ్ళిరా
ఊరికే
సందేహములు
పెట్టుకొనుటకూడ
ఒక
వ్యామోహమే.
దీనిని
గూడ
లేకుండా
చేసికొనుటకు
ప్రయత్నించు.
Previous
←
Prabodha 11
Next
Prabodha 13
→