Contents
Direct Inquiry
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sandeha Nivāriṇī · Prabodha 13
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
13
భక్తుడు:
స్వామి, దీనికి మునుపు చెప్పిన భారతయుద్ధము రీతిగా ప్రతి ఒక్కరి హృదయమందూ రామాయణముకూడా జరుగుచున్నదా?
2
▾
Meaning
Keep
స్వామి:
సందేహము
లేదు.
తప్పక
జరుగుచునే
యున్నది.
3
▾
Meaning
Keep
భక్తుడు:
ఇందులో
రాముడు
ఏ
రూపముగా
ఉన్నాడు?
4
▾
Meaning
Keep
స్వామి:
ఆత్మే
రాముడు.
తాను
జీవుని
వేషమును
ధరించి
దేహ
వస్త్రధారియై
వచ్చినవాడు.
5
▾
Meaning
Keep
భక్తుడు:
మరి,
తాను
సంకల్పసిద్ధుడై,
సర్వశక్తిమయుడై,
ఎందులకింత
కష్టపడెను?
6
▾
Meaning
Keep
స్వామి:
లీలావినోదమే
కాని,
తనకు
కష్టమెక్కడిది.
సుఖమెక్కడిది?
ఈ
రెండూ
లేని
ఆనందస్వరూపుడు,
తన
మాయా
సంకల్పముచే
సర్వమునూ
సృష్టించును,
సర్వమును
లయమొనర్చును.
ఈ
లోకనాటకరంగమందు
ఒక్కొక్క
గుణమునూ
ఒక్కొక్క
స్వరూపముగా
చూపించి,
తానూ
ఒక
స్వరూపమును
ధరించి
జీవితమను
రామాయణమును
జరిపించినాడు.
అట్టి
రామాయణము
నేటికి
కూడా
ప్రతి
హృదయమందూ
జరుగుచునే
యున్నది.
అన్నింటికి
ఆత్మారాముడు
సాక్షిభూతుడై
చూచుచునే
యున్నాడు.
7
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే,
జీవి
రూపుడైన
జడము
ఏ
రీతిగా
రామాయణముతో
ప్రవేశించినది?
8
▾
Meaning
Keep
స్వామి:
ఈ
జడము,
బ్రహ్మజ్ఞానమను
చైతన్యమును
వరించును.
ఆ
బ్రహ్మజ్ఞానచైతన్యమే
సీత
అను
పేరున
పుట్టినది.
అప్పుడు
ఈ
జడచైతన్యములు
ఒకటిగా
ఏకమగును.
వానినే
సీతారాములను
పేర్లతో
సంబోధించుచున్నారు.
ఈ
రెండూ
ఏకముగా
ఉన్నంతకాలమూ
ఏ
బాధలూ
ఉండవు.
ఈ
రెండింటియొక్క
ఎడబాటే
కష్ట
ప్రారంభము.
9
▾
Meaning
Keep
భక్తుడు:
అది
యెట్లు
స్వామి?
10
▾
Meaning
Keep
స్వామి:
బ్రహ్మజ్ఞానమను
సీత,
జీవిరూపమందున్న
ఆత్మను
వదలిన
అంధకారమను
జీవితపు
అడవిలో
పడక
తప్పదు.
జీవి,
బ్రహ్మజ్ఞానమను
సీతను
పోగొట్టుకొనుటవల్ల,
అంధకారమను
అడవిలో
సంచరించక
తప్పదను
అర్థమును
చూపుట
కొరకే
రాముడు
అట్లు
నటించినాడు.
11
▾
Meaning
Keep
భక్తుడు:
అట్లయిన
లక్ష్మణుడు
వెంటనే
యుండెనే,
అది
ఏమి
కారణము?
అతను
జీవితములో
ఏ
పేరునందున్నాడు?
12
▾
Meaning
Keep
స్వామి:
అట్టి
అంధకారమైన
జీవితపు
అడవిలో
ఒంటరిగా
వద్దు.
మనస్సు
అనే
లక్ష్మణుని
ఎడబాయక
ఉండుమని
తెలిపినాడు.
13
▾
Meaning
Keep
భక్తుడు:
వాలి
సుగ్రీవులు
వచ్చేరే,
వారు
ఎవరు?
14
▾
Meaning
Keep
స్వామి:
అట్టి
అంధకార
జీవితములో
సంచరించు
సమయమున
దీనత్వము,
వివేకము
అనేవి
రెండూ
వైరముతో
ఉండుననియూ,
అట్టి
సమయమున
దీనత్వమను
వాలిని
తెగటార్చవలెననియూ
చూపినాడు.
ఆ
దీనత్వవివేకములే
వాలి
సుగ్రీవులు.
దీనత్వమే
వాలి,
వివేకమే
సుగ్రీవుడు.
15
▾
Meaning
Keep
భక్తుడు:
వారిరువురి
మధ్య
చేరిన
హనుమంతుడెవరు?
16
▾
Meaning
Keep
స్వామి:
దీనత్వమును
తెగటార్చుటకు
తగిన
సహాయకారి.
అతనే
ధైర్యమను
రూపమున
ఉన్నాడు.
ఆ
ధైర్యమను
హనుమంతుని
విశ్వాసపాత్రునిగా
చేసికొనుటవల్లనే
మోహసాగర
మనో
సప్తసముద్రములనూ
జీవి
సులభముగా
దాటగలడను
నిశ్చయమును
చూపుతూ
లంకకు
హనుమంతునితో
సేతువు
కట్టించినట్లు
చూపినాడు.
17
▾
Meaning
Keep
భక్తుడు:
అవి
దాటిన
తరువాత
ఏమి
చేయవలెనని
ఉద్ధేశము?
18
▾
Meaning
Keep
స్వామి:
రాముడు
సేతువు
దాటి
ఏమి
చేసినది
నీకు
తెలియదా?
మోహమును
దాటిన
తక్షణము,
రజోగుణ,
తమో
గుణములను
రావణుని,
కుంభకర్ణుని
చంపివేసెను.
మిగిలిన
చిన్న
తమ్ముడైన
సత్త్వగుణము,
అనగా
విభీషణునకు
పట్టము
గట్టెను.
కాన,
మూడు
గుణములను
ముగ్గురు
అన్నదమ్ములవలె
చూపి,
వారినే
రావణ,
కుంభకర్ణ,
విభీషణులను
పేర్లతో
చూపించినాడు.
19
▾
Meaning
Keep
భక్తుడు:
తరువాత
ఏమి
సాధించినట్లు?
20
▾
Meaning
Keep
స్వామి:
ఏమి
సాధించుటా?
అనుభవజ్ఞానమైన
సీత
అను
చైతన్యమును
చేరుట!
ఎప్పుడు
తిరిగి
జడచైతన్యములు
కలియునో,
అదే
పట్టాభిషేకము.
అనగా
జీవన్ముక్తి,
కాన,
రామాయణములో
సారమేమన,
మానవునియందున్న
జీవి
మనసు,
జ్ఞానము,
దీనత్వము,
వివేకము,
మోహము,
ధైర్యము,
రజస్సు,
తమస్సు,
సత్త్వము
వీనిని
ఒక్కొక్క
దానిని
ఒక్కొక్క
రూపనామముగా
సృష్టించి,
ఏయే
రీతిగా
జయించవలెను,
సాధించవలెను,
అను
విధానమును
ఆత్మస్వరూపుడు,
రామస్వరూపమున
వచ్చి
నటించి,
నడిపించి,
చూపించి,
చేయించినాడు.
కాన,
ఆనాటితో
రామాయణము
ముగియలేదు.
ఎవరెవరు
జీవితమును
ఇన్ని
మార్గముల
సాధించి,
కడకు
అనుభవజ్ఞానమును
పొంది,
సత్త్వగుణమునకు
పట్టము
కట్టుదురో
అంతవరకు
వారివారి
హృదయభూమియందు
రామాయణము
జరుగుచునే
యుండును.
ఒకవైపున
భారత
యుద్ధము,
ఒకవైపున
రామాయణమూ
ఒకవైపున
భాగవతమూ
ఈ
రీతిగా
జీవితమునందు
నిత్యమూ
జరుగుచునేయున్నవి.
ఇవి
సూక్ష్మరామాయణ
భారత
భాగవతములు,
తెలిసినదా?
21
▾
Meaning
Keep
భక్తుడు:
అయిన,
జీవిత
రామాయణమున
ఆత్మే
రాముడనీ,
మనస్సే
లక్ష్మణుడనీ,
బ్రహ్మజ్ఞానమే
సీత
అనియూ;
ఆ
సీతను
రాముడు
వదలిన,
జీవితమను
అడవిలో
పడుదురనియు,
ఆ
జీవితమను
అడవిలో
దీనత్వ,
వివేకములను
వాలిసుగ్రీవులుందురనియూ,
అప్పుడు
మోహమను
సముద్రము
అడ్డువచ్చుననియూ,
దానిని
దాటుటకు
ధైర్యమను
హనుమంతునితో
మనము
చెలిమిచేసిన
వాని
సైన్యమైన
ఉత్సాహ
బలస్థైర్య
గాంభీర్యములను
జాంబవంత
అంగదాది
సైన్యములతో
మోహమును
దాటవచ్చుననియూ,
అది
దాటిన
తక్షణమే
రజోగుణ
తమోగుణములను
రావణ
కుంభకర్ణులను
హతమార్చవచ్చుననియు,
మిగిలిన
సత్త్వగుణమను
విభీషణునికి
పట్టాభిషేకము
కట్టవలెననియూ,
తరువాత
అనుభవజ్ఞానమైన
సీతను
చేరవచ్చుననియూ,
ఆ
జడచైతన్యమైన
సీతారాముల
చేరికే
ఆత్మానందమనియూ,
అదే
జీవన్ముక్తి
అనియూ
తెలిసినది.
అబ్బా!
ఎంత
చక్కని
రామాయణము!
దశరథకుమారుడై
జరిపిన
రామాయణమునే
అందరి
హృదయములందు,
పైన
చెప్పిన
గుణ
ఇంద్రియ
రూపములతో
సూక్ష్మ
రామాయణముగ
జరుపుచున్నాడన్నమాట!
22
▾
Meaning
Keep
స్వామి:
అన్నమాట
ఏమి.
జరుగుచునే
యున్నది.
23
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి!
ఒక్కొక్క
గుణము,
ఇంద్రియము
ఒక్కొక్క
రూపమును
ధరించినదని
తెలిపితిరి.
కాని,
ఆ
ఇంద్రియములు
కూడా
ఆ
రీతిగా
రూపములు
ధరించియున్నవన్న
కొంత
ఆశ్చర్యముగా
నున్నది.
అవి
అనగా
ఇంద్రియములు
ఈ
సూక్ష్మస్థూల
రామాయణములందు
ఏఏ
రూపములుగా
ఉన్నవో
సెలవిత్తురా!
24
▾
Meaning
Keep
స్వామి:
పిచ్చివాడా!
ఎట్టి
గుణములైనా
ఇంద్రియసంబంధము
లేక
చలించవే!
గుణములకు
పుట్టుక
స్థానమే
అది.
కర్మేంద్రియములు
ఐదు.
జ్ఞానేంద్రియములు
ఐదు.
ఈ
రెండూ
చేరియేకదా
మనస్సహాయమున
ఆత్మను
చేరుచున్నవి.
లేకున్న
లయమే
లేదు.
“మాయలోనే
పుట్టి,
మాయలోనే
పెరిగి,
మాయను
దాటుట
మనిషి
నీతి”
అన్నట్లు
వానిలోనే
పుట్టి
వానిలోనే
పెరిగి
వానిని
దాటుట
జడచైతన్యముల
లక్షణములు
కదా?
అందుకనే
రాముడు
జీవిరూపుడై
ఎక్కడ
జనించెనో
తెలియునా?
ఎవరి
కుమారుడు?
దశేంద్రియములను
రథమున
పుట్టినవాడు
కనుక
రాములతండ్రికి
దశరథుడను
నామము.
తెలిసినదా?
ఏ
రూపములు
ఏ
గుణము
దాల్చిననూ
అవి
దశేంద్రియ
సంబంధము
లేక
ఉండవు.
కాన,
ఇప్పుడు
అవి
కర్మేంద్రియ
జ్ఞానేంద్రియరూపమున
ఉన్నవి;
అనాడు
దశరథరూపమున
ఉండెను.
25
▾
Meaning
Keep
భక్తుడు:
దశరథునకు
నలుగురు
కుమారులు
పుట్టిరే.
వారు
ఏ
రూపము?
26
▾
Meaning
Keep
స్వామి:
దశేంద్రియములందు
నాలుగే
కాదు.
ఎన్ని
గుణరూపములైననూ
పుట్టవచ్చును.
అయితే
ముఖ్యముగా
పుట్టవలసిన
గుణ
రూపములు
నాలుగు
ముఖములనియూ,
పరమాత్ముడు
చతుర్ముఖుడు
కనుక,
తనకు
తాను
సంకల్పించుకొని
నాలుగు
భాగములుగా
విభజించి,
నాలుగు
ముఖములూ
నాలుగు
రూపములుగా
జన్మించెను.
వారే
రామ,
లక్ష్మణ,
భరత,
శత్రుఘ్నులు,
వారు
సూక్ష్మరూపమున
సత్య
ధర్మ
శాంతి
ప్రేమ
స్వరూపములై
యున్నారు.
పరమాత్ముని
యొక్క
చతుర్ముఖములు
ఇవియే.
27
▾
Meaning
Keep
భక్తుడు:
స్వామి,
ఇందులో
సత్యమెవరు?
ధర్మమెవరు?
శాంతమెవరు?
ప్రేమ
ఎవరు?
28
▾
Meaning
Keep
స్వామి
:
అంతమాత్రము
తెలియదా?
రాముడే
సత్యస్వరూపుడు.
ఎవరిస్థానము
వారిదే
కాని
నాకు
అర్హత
ఏదని
నిరూపించిన
భరతుడే
ధర్మస్వరూపుడనియూ,
ఆత్మపై
(అనగా
రామ
స్వరూపునిపై)
సంపూర్ణ
భారము
వేసిన
దానికంటే
మించిన
ఆనందము
వేరు
లేదని
సర్వకాల
సర్వావస్థయందును
ఎడబాయక
నిరూపించిన
లక్ష్మణుడే
ప్రేమస్వరూపుడనియు,
ఈ
మూడింటిని
అనుసరించి
అవి
ఏయే
మార్గమున
నడచునో
అంతవరకూ
తాను
ఏ
ఉద్ధేశములు
పడక
శాంతముగా
ఈ
మూడింటి
జాడలలో
నడచి
నిరూపించిన
శత్రుఘ్నుడే
శాంతస్వరూపుడు.
తెలిసెనా?
29
▾
Meaning
Keep
భక్తుడు:
అయితే
ఈ
నల్గురు
ముగ్గురు
తల్లులకు
పుట్టిరే,
ఆ
తల్లులెవరు?
30
▾
Meaning
Keep
స్వామి:
పైన
చెప్పినట్లు
మాయలోనే
పుట్టి
అందులోనే
పెరిగి
తిరిగి
దానినే
జయించవలెనన్నట్లు,
వీరు
గుణములందే
పుట్టి,
గుణములను
జయించి,
గుణాతీతులు
అయ్యే
అర్థమును
నిరూపించుటకే
ఈ
ముగ్గురు
తల్లులూ,
మూడు
గుణములుగా
ఉండిరి.
అందులో
కౌసల్య
సత్వగుణము.
కైక
రజోగుణము,
సుమిత్ర
తమోగుణముగా
నటించిరి.
దశరథుడు
దశేంద్రియరూపుడై
ఈ
గుణములను
కూడియుండుటవల్ల
వారు
ఇంద్రియ
గుణస్వరూపులను
పేరున
నిల్చియుందురు.
ఈ
ఇంద్రియ
గుణముల
మూలమున
మానవులు
సులభముగా
గ్రాహ్యము
చేసికొనలేరని
మానవ
బోధనార్థము
పరమాత్ముడు
ఇన్నిన్ని
రూపములతో
ఇంత
రామాయణమును
జరిపి
బోధించినాడు;
బోధించుచున్నాడు.
ఆనాటి
స్థూలరామాయణమును
ఈనాటి
మానవ
హృదయరంగమున
గుణరూపములతో
సూక్ష్మ
రామాయణముగ
జరుపుచున్నాడు.
Previous
←
Prabodha 12
Next
Prabodha 14
→