Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · The Culture of Bhārata and Moral Values
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Culture of Bhārata and Moral Values
4 June 1973, Summer Course, Brindavan
1
▾
Meaning
Keep
దివ్యాత్మస్వరూపులారా!
పన్నెండు
దినములనుండి
మనము
భగవత్పాదులైన
శంకరాచార్యుల
వారి
భజగోవింద
స్తోత్రములను
శ్రవణము
చేస్తూ
అందలి
పవిత్రమైన
మకరందమును
ఆరగించుచు
మన
జీవితమున
దివ్యమైన
మార్గమునకు
మరల్పించి
తద్వారా
జన్మసార్ధకము
గావించుకునే
ప్రయత్నానికి
పూనుకున్నాము.
లోకమున
అద్దములవంటి
చిత్తమునకు
కోరికలను
కల్మషమును
చేర్చుకోవటము
చేత
మన
పవిత్రత
మనకే
అర్థము
కానటువంటి
స్థితిలో
మనము
అవస్థల
పాలౌతున్నాము.
అయితే
ఈ
చిత్తమునకు
పవిత్రమైన
జ్యోతిని
అందించినట్టుగా
ఒక్కొక్క
భజగోవింద
శ్లోకము
కూడను
ఒక
దివ్యమార్గమునకు
ఒక
జ్యోతివలె
మనకు
సహాయకారిగా
నిలుస్తుంటున్నాయి.
లోకములోగల
సమస్త
పదార్ధము
లందును,
కామునకున్నట్టి
శక్తి
మరొకరికి
లేదనే
చెప్పవచ్చును.
కాముడు
మహా
వీరుడు.
అట్టి
వీరుడైన
కాముడు
లోకమున
చేరరాని
ప్రదేశమే
కనిపించదు.
సర్వత్రా
కూడను
స్వేచ్ఛావిహారము
సల్పే
వీరుడు.
అయితే,
ఒక్క
ఆత్మ
సామ్రాజ్యమును
మాత్రమే
తాను
ప్రవేశించటానికి
తగిన
అర్హుడు
కాదు.
మిగిలిన
ప్రదేశములందు
స్వేచ్ఛా
విహారము
సల్పేటటువంటివాడు.
అయితే,
ఈ
కామము
నకు
మిత్రుడు
కలడు,
వాడే
క్రోధుడు.
వీరిరువురు
ఎపుడూ
కలిసేవుంటారు.
ఈ
కామక్రోధములు
మనవెంట
జంటలుగా
సంచారము
సల్పుతుంటాయి.
కాముడు
మహాశని,
క్రోధుడు
మహాపాపి.
ఈ
రెండూ
చేరిన
వ్యక్తిని
శవస్వరూపుడు
అని
చెప్పటానికి
కూడను
సందేహము
లేదు.
ఇట్టి
శవ
స్వరూపులనే
లోకములో
భోగశక్తులు
అని
కూడను
లోకములో
పిలుస్తూ
వస్తున్నారు.
భోగశక్తులైన
ఈ
శవస్వరూపులకు
ఆత్మసామ్రాజ్యము
నందు
ప్రవేశము
ఏమాత్రము
చిక్కదు.
శివశక్తులైన
త్యాగరాజులకే
ఈ
ఆత్మ
సామ్రాజ్యమునందు
ప్రవేశించటానికి
అధికారము
వుంటుంది
గాని
శవశక్తులైన
భోగరాజులకు
యిందులో
ప్రవేశము
చిక్కదు.
దీనిని
పురస్కరించుకొనియే
శంకరుల
శిష్యులలో
ఒకడు
రాగములనరికట్టలేని
యోగియైన
పతనమొందును
అని
చెప్పెను.
2
▾
Meaning
Keep
దానిని
నిగ్రహించుకోలేని
యోగి
కూడను
పతనమైపోతాడుట.
కనుక
యింద్రియ
నిగ్రహము
అత్యవసరమని
ఈ
శ్లోకములో
చక్కగా
వర్ణించారు.
కనుక,
మనము
ఈ
యింద్రియములను
అరికట్టుకొనే
నిమిత్తమై
రాగములను
అదుపులో
పెట్టుకోవాలి.
రాగమనగా
విషయ
సంబంధమైన
వాటిపై
ప్రసరింపజేసే
వాంఛనే
రాగమని
పేరు.
కనుక,
యిట్టి
వాంఛలను
విశ్వేశ్వరుని
వైపు
మరల్చటానికి
తగిన
ప్రయత్నము
ఈ
వయస్సునందు
చేయవలసినటువంటి
అవసరము.
ఈనాటి
యువకులు
ఆత్మ
సంయమనము
అంటే
ఏమిటో
అర్ధము
కాని
స్థితిలో
ఉంటున్నారు.
చిన్న
వయస్సునుండి
స్వేచ్ఛా
విహారము
సల్పుతూ
కేవలము
విషయ
వాంఛలందు
వారి
మనస్సు
యిమిడి
తద్వారా
వారికి
ఏది
మంచి,
ఏది
చెడ్డ
అనేది
తెలిపే
నాయకులు
గృహమునందు
లేకపోవటంచేత
వీరియొక్క
జీవితము
కేవలం
విలాసముతో
గడపటానికి
ప్రయత్నాలు
సల్పుతూ
వస్తున్నారు.
దుస్సంగముల
ద్వారాను,
దురాచారములకు
సంబంధించిన
సినిమాల
వల్లను
ఈ
యువకుల
మనస్సును
మరింత
కామాంధునిగా
మార్చి
గర్వము,
పొగరుబోతు
తనము
అతివినయము
అనేటువంటి
దుర్గుణములు
వారిలో
ప్రవేశించి
దేశమునకే
కాక
తమయొక్క
జీవితమునకు
కూడను
కొంతవరకు
పతనమునకు
రాజబాట
వేసుకుంటూ
వస్తున్నారు.
ఈ
వయస్సునందు
యింద్రియములను
నిగ్రహించుటకు
ప్రయత్నము
చేసినవాడే
సార్ధకత
పొందుతాడు
లేకున్న
వాని
జీవితమే
నిరర్థకమైపోతుంది.
ఈనాడు
లోకములో
అనేక
కల్లోలములతో
నిండిన
భారతదేశమునకు
మీరు
తగినటువంటి
మార్గమును
బోధించి,
ఆచరించి
తద్వారా
ఈ
జగత్తునకు
తగినటువంటి
ఉత్తమ
జీవితము
మీరు
అభివృద్ధి
గావించుకొంటారని
కూడను
ఆశిస్తున్నాను.
అధమ
ప్రేమ
-
మధ్యమ
ప్రేమ
-
ఉత్తమ
ప్రేమ
సత్యమునకై
మీ
జీవితమును
అంకితము
చేసి
లోక
కళ్యాణమునకై
మీ
యొక్క
కర్మలు
అర్పితముచేసి,
మీ
తల్లిండ్రులకు
కీర్తినార్జించి
తద్వారా
మీ
జన్మను
మీరు
సార్ధకము
చేసుకోవటానికి
ప్రయత్నం
సల్పాలి.
ఇట్టి
యింద్రియములను
నిగ్రహించుకొనుటకు
సులభమైన
మార్గము
ఒక్క
ప్రేమ
మాత్రమే.
ఈ
ప్రేమ
స్వార్ధరహితమైనది
కనుక
అది
మనయొక్క
ప్రయోగములో
దానియొక్క
రూపములు
మార్పు
చెందుతున్నాయి.
ప్రేమ
మూడు
విధములు.
3
▾
Meaning
Keep
ఒకటి
అధమ
ప్రేమ.
రెండవది
మధ్యమ
ప్రేమ,
మూడవది
ఉత్తమ
ప్రేమ.
లోకమునకు
ఏ
గతిపట్టినా
తాను
యేమాత్రము
విచారించడు.
లోకము
ఏవిధమైన
అవస్థలు
పాలైనప్పటికి
తాను
విచారించడు.
తాను,
తనవారు
క్షేమంగా
వుండిన,
తాను
తన
వస్తువులు
భద్రముగా
వుండిన
అంతే
చాలని
మహా
స్వార్థమునకు
గురియైపోవటంచేత
వాడు
ప్రేమను
అధమ
స్థితియందు
ప్రవేశ
పెడుతున్నాడు.
ఈ
ప్రేమ
మానవుని
ఉత్తమస్థితికి
ఏమాత్రము
కొనిపోదు.
లోకములో
ఎట్టి
సంబంధమును
తాను
అనుభవించక
కట్టకడపటికి
తాను
పరుల
ప్రీతికి
గురికాక
తాను
ఏకాకిగా
చావవలసివస్తుంది.
ఇది
అధమ
ప్రేమ.
వీరు
స్వార్థమైన
వాంఛలందు
మాత్రమే
తన
జీవితమును
అంకితము
చేస్తూ
ఉంటారు.
ఇంక
మధ్యమ
ప్రేమ
అనగా
కొంతధనమును,
బలమును
లేక
పదవిని
ఏదో
కొన్ని
రకములైన
ఈ
లౌకికమైన
ఘనతను
చూచి
వారిని
ప్రేమించి,
వారిద్వారా
ఏవో
కొన్ని
కార్యములను
నెరవేర్చుకోవాలి
అనే
ఉద్దేశ్యముతో
వారిని
ప్రేమించి
నట్లుగా
నటించి
వారి
దగ్గర
చేరటము,
వారిని
దగ్గర
చేర్చుకోవటము
జరుగుతూ
వుంటుంటాది.
యిది
మానవునికి
అంత
ఉత్తమమైన
ప్రేమకాదు,
పదవులు
స్థిరముకాదు.
తనయొక్క
గౌరవ
మర్యాదలు
స్థిరమైనవి
కాదు,
కనుక
ఇట్టి
వాటిపై
మన
మనస్సును
ఉంచి
ఇవియే
ప్రధానమని
విశ్వసించి
తద్వారా
మనము
ఫలితమునందుకోవచ్చునని
వాంఛతో
మనము
వారిని
ప్రేమించటము
మధ్యమైన
రీతిగా
ఉండటంచేత,
ఈ
మధ్యమ
ప్రేమలోనే
లోకముపై
ఎక్కువ
భాగము
అనుభవిస్తూ
వస్తున్నారు.
అయితే
ఉత్తమమైన
ప్రేమ,
అట్టివాటికి
ఎట్టి
సంబంధము
కల్పించక
వ్యక్తి
వ్యత్యాసముగా
కనిపించినప్పటికిని,
వారియొక్క
పదవులు
గాని,
వారియొక్క
హోదాలుగాని
వారియొక్క
ధనమునుగాని,
బలమును
గాని
కొంచెము
కూడను
విచారించక
సర్వులయందు
ఆత్మస్వరూపుడైన
భగవంతుడు
ఒక్కడేయన్న
సత్యమును
గుర్తించి
సర్వులను
కూడను
ప్రేమించటానికి
పూనుకోవటం
ఉత్తమమైన
ప్రేమగా
ప్రకటించటం
జరిగింది.
జాతి
మత
కుల
భేదములు
ఏమాత్రమూ
పాటించక,
కాలదేశ
పాత్రలను
యేమాత్రము
చూడక
కేవలము
ఆత్మయందే
దృష్టి
ఉంచి
ఆత్మ
సమత్వాన్ని
మాత్రమే
భావించుకొని
లోకమును
ఏకత్వంగా
అనుభవించటానికి
పూనుకోవటము
ఉత్తమ
ప్రేమగా
కనిపిస్తుంది.
ఒకరు
విశ్వసించినను,
విశ్వసించకపోయినను
దైవము
సర్వ
భూతాంతరాత్మ
అనే
సత్యమును
ఎప్పుడును
చర్చించటానికిగాను,
పూనుకోవటములో
ప్రయోజనము
ఉండదు.
4
▾
Meaning
Keep
అందులోనున్న
ప్రేమయే
మానవుని
ఆకర్షించుకుంటూ
వస్తున్నది.
యిప్పుడు
అగ్నిలోఉష్ణము
లేకపోతే
అది
అగ్ని
కానేరదు.
గాలిలో
తేలిక
లేకపోతే
అది
గాలికాదు.
నీటిలో
చల్లదనము
లేక
అది
నీరు
కాదు.
ఆకులో
పచ్చదనములేకపోతే
అది
ఆకు
కానేరదు.
అయితే
ఈ
గుణములన్నియు
కూడను
ఆత్మస్వరూపములో
నిల్చి
ఉంటుంటాయి.
ప్రతి
ఒక్కటి
అందులో
ఆత్మ
స్వరూపుడనే
ప్రేమ
భాస్కరుడుగా
విలసిల్లటం
చేతనే
అతనిని
మనము
ఆకర్షించుకుంటూ
ప్రేమించుకుంటూ
పోషించుకుంటూ
మనము
జీవితాన్ని
గడుపుతూ
వస్తున్నాము.
ఒక
చిన్న
ఉదాహరణము.
మనము
ఒక
పండ్ల
మొక్కను
తెచ్చి
అతిప్రీతితో
మన
యింటి
ముందు
పెంచుకోటానికి
ప్రయత్నం
చేశాము.
దానిని
ఎంతో
ప్రేమతో
చక్కగా
పాదుచేసి,
కాలకాలమునకు
నీరు,
ఎరువులు
వేసి
ఎట్టి
అపాయములకు
గురికాకుండా
దానికి
అనేక
భద్రతలు
కల్పించి
దానిని
మనము
పోషించుకుంటూ
వస్తున్నాము.
ఏదో
కొన్ని
కారణముల
చేత
ఆ
మొక్క
దినదినమునకు
ఎండిపోతూ
వస్తుంది.
కానీ,
ఎంతో
ప్రేమతో
తాను
పోషించుకుంటున్న
మొక్క.
కొంతకాలమునకు
అది
ఎండిపోయిన
తక్షణమే
నిర్ధాక్షిణ్యముగా
తన
హస్తములతోనే
పెరికి
పారవేస్తున్నాడు.
ఆనాడు
అంతగా
ప్రేమించటము,
ఈనాడు
యింత
నిర్దయగా
పారవేయటంలోనున్న
అర్థము
ఏమిటి?
అందులో
దైవత్వమనే
జీవత్వము
వుండినంతవరకు
దానిని
ఆకర్షించింది.
ఆ
దైవత్వమనే
జీవత్వం
లేకపోయిన
తక్షణమే
వానిని
నిర్దయగా
దూరము
వేసేస్తున్నాము.
మనము
ఎంతో
ప్రీతితో
కొన్ని
ఫలములు
కొని
తెచ్చుకుంటాం.
అవి
ఏమైనా
కుళ్లిపోతే
తక్షణమే
వానిని
నిరాశగా
పారవేస్తున్నాం.
అంతేకాదు.
ఒక
వ్యక్తిని
మనము
ఎంతగానో
ప్రేమిస్తాము.
ఆ
వ్యక్తియందు
జీవత్వము
ఉన్నంతవరకు
మనయొక్క
ప్రేమ
ప్రాణ
సమానముగా
ఉంటుంది.
ఆ
వ్యక్తియందు
జీవత్వమైన
శివత్వము
దూరమైన
తక్షణమే
మనము
దాని
చెంత
ఉండటానికి
భయపడిపోతున్నాము.
దానికి
అనేకరకములైన
ప్రేమ
లేనటువంటి
స్థితిలోపల
దానిని
భస్మముగా
చేయటానికి
పూనుకుంటున్నాము.
వీటినన్నింటిని
పురస్కరించుకొని
విచారణ
సల్పినప్పుడు
దేనిని
మనము
ప్రేమిస్తున్నాము,
దేహమునా
లేక
వారి
ఆస్తిపాస్తులనా
లేక
కులమతములనా
లేక
అధికారమునా
అనేది
చక్కగా
విచారణ
చేస్తే
దేనినీ
కాదు.
జీవతత్త్వమును
మాత్రమే
మనము
ప్రేమిస్తూ
వస్తున్నాము.
5
▾
Meaning
Keep
కనుక,
ఇక్కడ
దేహములనుగానీ,
లేక
సంబంధములను
గానీ
మనము
ప్రధానమైన
లక్ష్యమునందు
చూడక
శివతత్త్వము
మాత్రమే
దైవత్వముగా
విశ్వసించి
మనము
సర్వభూతాంతరాత్మ
అయిన
పరమాత్ముని
ప్రేమించినట్టుగా
మనము
విశ్వసించటం
చేత
మనకు
ఎంతైనా
కూడను
ఆత్మ
తత్వమును
అర్ధము
చేసుకొనటమే
కాకుండా
మనము
భారతదేశముయొక్క
విశిష్టతను
కూడను
కొంత
అనుభవించి
ప్రచురింప
చేయటానికి
తగినటువంటి
వ్యక్తులుగా
తయారుకాగలము.
భగవంతుడే
సర్వ
శక్తులకు
ఆధారం
పవిత్రమైన
మన
భారతీయ
చరిత్రలన్నియు
కూడను
అనుభవరూపములో
మీకు
అందించినటువంటివేగాని
ఏదో
కొంత
అపోహలతో
అందుకోటానికి
బలవత్తరంగా
తలకి
కట్టినట్టుగా
భావించు
కోవటంలో
యేమాత్రము
కూడను
అర్ధము
లేదు.
అట్టి
మహనీయులను
మనము
కొంతవరకు
అనుసరించి
వారి
ఆజ్ఞలను
శిరసావహించి
వారి
అడుగు
జాడలలో
మనము
నడచి
అట్టి
పవిత్రమైన
దివ్యత్వాన్ని
మన
భారతదేశములో
పునరుద్ధరించటానికి
మనం
కంకణం
కట్టుకోవాలి.
కష్టములందుగాని,
సుఖములందుగాని,
నిందలయందుగాని,
నిష్ఠూరములయందుగాని
పాండవులు
పరమాత్ముడైన
కృష్ణునిపైన
ఎట్టి
విశ్వాసముంచి
కట్టకడపటి
వరకు
ఆ
కృష్ణుని
యొక్క
అడుగుజాడలే
ఆజ్ఞలుగా
పెట్టుకొని
వారు
ఆచరించిన
పవిత్రమైన
ఆచరణ
ప్రతి
మానవునకు
అత్యవసరమైనది.
దేవతలు
అడ్డువచ్చినప్పటికిని
లెక్క
చేయక
ఖాండవవనమును
దహనము
చేసిన
అర్జునుడు,
యింకా
మహావీరుడై
శూరుడై
ఘోరమైన
యుద్ధమునందు
కూడను
సాహసముతో
దిగ్విజయమును
సాధించిన
అర్జునుడు
ద్వారకనుండి
స్త్రీలను
తీసుకొని
హస్తినాపురము
తీసుకొని
వస్తున్న
సమయములోపల
వెఱ్ఱిగొల్లలతో
చిక్కి
నిస్సహాయుడై
నిల్చిపోవటములో
వుండిన
అంతరార్థమును
అర్జునుడు
చక్కగా
గుర్తించుకున్నాడు.
కారణము
ఏమిటి?
ఇంతకాలము
కృష్ణుడు
సాకారంగా,
నిరాకారంగా
మా
వెంట
జంట
ఉండటంచేత
నాయొక్క
శక్తిసామర్థ్యములు
అంత
పవిత్రమైనవిగా
ఉండినాయి.
ఈనాడు
సాకారముగా
మాకు
దూరమగుట
చేత
నాయొక్క
శక్తి
అంతా
కృష్ణునితో
బాటే
పోయినాయి.
కృష్ణుడు
అనేవాడు
సర్వజీవులయందును
ఆత్మవాసిగా
ఉండటంచేత
మన
ధైర్య
సాహసములు
ఈ
జగత్తులో
మనము
అనుభవించు
కోటానికి
వీలవుతుంది.
కృష్ణుడే
లేకుండిన
కేవలము
మనము
తోలుతిత్తి
వంటి
వారమేగాని
యిందులో
యేమాత్రము
శక్తివంతమైనది
లేదని
అర్జునుడు
గ్రహించుకొని
తక్షణమే
తానుకూడనూ
ఈ
లోకమును
వదలిపోవాలని
ఆశించాడు.
6
▾
Meaning
Keep
అట్టి
అనుభవరూపమైన
దీనిలో
పాండవులు
అనేక
రకములైన
ఆదర్శములు
అందిస్తూ
వచ్చారు.
ఈ
కారణముచేత
చిరస్థాయిగా
చక్కటి
కీర్తిని
వారు
సంపాయించారు.
ఈ
పంచ
పాండవులు
పంచ
ప్రాణములుగా
లోకమునకు
ఆధారభూతులుగా
నిల్చారు.
ఇట్టి
పాండవుల
చరిత్రయే
మహా
భారతమనికూడను,
ఈ
భారతము
పంచమవేదమని
కూడను
వర్ణిస్తూ
వచ్చారు.
ఇట్టి
ఆచరణ
రూపమైన
పాండవులను
ఏదో
ఆర్టిఫిషియల్గా
మనము
ఉపయోగించుకోవచ్చుననే
ఉద్దేశ్యముతో
ఒకానొక
సమయములో
ఢిల్లీ
తానీషా
విజయనగర
పండితులను
అష్టదిగ్గజములను
పిలిపించాడు.
వీరిని
పిలిపించి
మహాభారతము
యొక్క
విశిష్టతను
వర్ణించమని
చెప్పాడు.
ఈ
అష్టదిగ్గజములు
మహాపండితులు
మహా
భారతమును
కంటెదుటగా
నిల్చినట్లుగా
వర్ణిస్తూ
వచ్చారు.
అంతా
విన్న
తరువాత
తానీషాలో
ఒకవిధమైన
వాంఛ
అతనిలో
బయలుదేరింది.
ఆ
పండితులనందరిని
చేర్చి
‘నేను
ధర్మజుడుగను,
నాకు
యిష్టమైన
మంత్రులందరిని
నలుగురు
అన్నదమ్ములుగను
వర్ణించి
విరోధి
రాజులందరును
కౌరవులుగా
వర్ణించి,
తానీషా
భారతము
వ్రాయమని
ఆజ్ఞచేశాడు.
కాని,
ఈ
కవులు
ఈ
భారతము
వ్రాయటానికి
ఎలా
వీలవుతుందని
వారు
వెనుకంజ
వేస్తూ
వచ్చారు.
కాని,
అందులో
తెనాలిరామకృష్ణుడు
వీరుడై
నిల్చాడు.
తానీషాకు
తగినటువంటి
గుణపాఠం
చెప్పాలని
సంకల్పించి,
‘తానీషాగారు!
నేను
ఈ
భారతము
నేను
వ్రాస్తాను’
అని
చెప్పాడు.
అయితే
వారములోనే
భారతమును
తయారు
చేసుకొని
తీసుకురావాలి.
గొప్ప
బహుమానము
యిస్తాను’
అని
తానీషా
చెప్పాడు.
సరే!
ఒకవారమైన
ఈ
రామకృష్ణుడు
కాగితము
పెన్ను
తీసుకోలేదు.
భారతము
వ్రాయటానికి
పూనుకోలేదు.
మిగిలిన
పండితులందరు,
అయ్యో
ఒక
వారమైపోతున్నాది,
వాగ్దానము
చేశాడు.
ఈ
వాగ్దానము
చెల్లించకున్న
తానీషా
శిక్షిస్తాడోయేమో’
అని
లోలోపల
గుసగుసలు
బయలుదేరాయి.
సరే!
ఒప్పుకున్న
కాలమునకు
రెండు
కాగితములు
చంకలో
పెట్టుకున్నాడు.
తానీషా
దగ్గరకు
బయలుదేరాడు
రామకృష్ణుడు.
ఆనాడు
మహాభారతము
తన
మిత్రులకు
కూడను
వినిపించవచ్చునని,
యిష్టమైన
మిత్రులను
పాండవులలో
సోదరులుగా
నిర్మించినారని,
యింకా
యిష్టులైనవారిని
సభలో
కూర్చోబెట్టుకున్నాడు.
7
▾
Meaning
Keep
రామకృష్ణుడు
సభలోకి
వచ్చాడు.
వచ్చిన
తక్షణమే
‘ఏమి
రామకృష్ణా!
పూర్తి
అయినదా
భారతము’
అని
ప్రశ్నించాడు
తానీషా.
అంతా
అయినది.
రెండు
మూడు
సందేహాలు
ఉంటున్నాయి.
తమర్ని
విచారించి
ఆ
సందేహాలు
పూర్తి
చేయవచ్చు
అంతేగానీ
భారతమంతా
పూర్తి
అయింది
అన్నాడు.
అయితే
ఏమిటా
సందేహములు
అడగ’మని
చెప్పాడు
తానీషా.
అయితే!
ఈ
సమావేశములోపల
అడగటానికి
కొంచెం
జంకు
వుంటున్నాది.
మీరు
ఒంటరిగా
వచ్చినప్పుడు
ప్రశ్నిస్తాను’
అన్నాడు.
సరే!
ఆ
సందేహములు
అడిగి
నివారించుకోమని
యిద్దరు
ఒక
గదిలోకి
వెళ్లారు.
రామకృష్ణుడు
భారతమును
గురించి
చెబుతున్నాడు.
పాండవులలో
ధర్మజుడు
తమరు.
తమకు
యిష్టులైన
మంత్రులు
ఫలానివారు
భీమ
అర్జున
నకుల
సహదేవులు.
అయిపోయింది.
మీ
విరోధులను
యిందులో
కౌరవులుగా
పోల్చుకున్నాను.
యిందులో
ఏమాత్రము
సందేహము
లేదు.
అయితే
పంచపాండవులకు
ద్రౌపతి
ఒక్కతే
ఉంటున్నాది.
మీ
భార్యను
ద్రౌపతిగా
వేయాలనుకుంటున్నాను.
అది
మీకు
యిష్టమేనా
అడిగాడు.
ఒరే!
ఒరే
నా
భార్య
యీ
మంత్రులందరికి
భార్య
అవుతుందనుకొని
నీ
భారతము
వద్దు
ఏమీ
వద్దు
నీవు
వెళ్లిపో’
అని
దండిగా
డబ్బు
యిచ్చి
పంపించాడు.
అనగా
త్యాగము
లేక
వారి
సత్కీర్తిని
తాను
అనుభవించాలంటే
యిది
సాధ్యమయ్యేటువంటిదా.
పాండవులు
పవిత్రమైన
ఆత్మచేత
పవిత్రమైన
భావముచేత
ఈ
పాంచాలిని
హృదయ
పూర్వకంగా
చేపట్టారు.
వారియొక్క
త్యాగము,
వారియొక్క
భావము,
వారి
యొక్క
పవిత్రత
యీ
తానీషాకు
రావాలంటే
వస్తుందా?
కనుక,
వారి
పేరు
ప్రతిష్ఠలు
మాత్రమే
నాకు
రావాలి
అనుకొని,
వారి
ప్రవర్తనలు
మాత్రము
నేను
చేయను
అనుకుంటే
artificial
life
గానే
అవుతుంది
గాని
సత్యమైన
జీవితముకాదు.
కనుక
మనము
ఈనాడు
పవిత్రమైన
భారతీయ
సంస్కృతిని,
పవిత్రమైన
భారతీయ
రక్తాన్ని,
పవిత్రమైన
భారతదేశమును
కూడను
నిలబెట్టుకుని
సార్ధకమైన
కీర్తిని
సంపాయించుకోవాలనుకుంటే
భారతదేశముయొక్క
నీతి
నిజాయితీలను
మనము
ఆచరణలో
పెట్టినప్పుడే
మనము
భరతమాత
పుత్రులమని
చెప్పుకోవటానికి
వీలవుతుందిగాని
లేకపోతే
వారు
యిట్లా
చేశారు,
వీరు
యిట్లా
చేశారు
అని
మనం
పేర్లు
మాత్రం
పెట్టుకోటంచేత
కృత్రిమ
జీవితముగా
బయలుదేరుతుంది.
ఒక
తానీషావంటి
కృత్రిమ
జీవితులం
మనం
కాకూడదు.
8
▾
Meaning
Keep
మనము
పాండవులవంటి
పంచప్రాణములతో
సత్కీర్తినార్జించే
వ్యక్తులుగా
కావాలి
యువకులు.
నాలుక
ప్రధానమైనది
-
జాగ్రత్తగా
ఉపయోగించాలి
నీ
పవిత్రమైన
భావముతో
సమాజసేవ
సల్పి
సర్వేశ్వరుని
అనుగ్రహానికి
పాత్రులగుటకు
ఈ
ఇంద్రియ
నిగ్రహమనేది
అత్యవసరము.
ఈ
ఇంద్రియముల
లోపల
జిహ్వేంద్రియము
చాలా
ప్రధానమైనదని
నిన్నటి
దినము
చెప్పాను.
జిహ్వేంద్రియముతో
మనము
అధికభాష
ఉపయోగపెట్టక,
అనవసరమైన
మాటలలో
మనము
చేర్చుకొనక
కొంతవరకు
పవిత్రమైన
ప్రబోధలయందు
మాత్రమే
ఆ
పవిత్రమైన
జిహ్వకు
పని
యివ్వటానికి
పూనుకోవాలి.
మీకు
అనేక
పర్యాయములు
చెప్పి
ఉండవచ్చును.
నాలుకకు
వున్న
ఓపిక
మరొక్కదానికి
లేదు.
నాలుకకు
ఉన్న
సహనము
మరొక
ఇంద్రియమునకు
లేదు.
నాలుకకు
ఉన్న
గౌరవము
మరొక్కదానికి
లేదు.
నాలుకకు
ఉన్న
త్యాగము
మరొక
ఇంద్రియము
నకు
లేదు.
అట్టి
పవిత్రమైన
నాలుకను
మనము
అపవిత్రపర్చుకోవటము
లోపల
జీవితాన్నే
మనము
అపవిత్రపరచుకున్న
వారమైపోతున్నాము.
అతి
జాగ్రత్తతో
సహనముతో
ఎంత
చురుకుగా
మాట్లాడుతున్నాడో
మన
నాలుక
మనము
ఒక్కతూరి
యోచించుకోవచ్చును.
ఏ
కొంతదారి
తప్పినా
కూడను
తనకు
ప్రమాదము
జరుగుతుంది.
ప్రమాదమును
కల్పించే
శత్రువులు
చుట్టూ
ఉండినప్పటికిని
ఎంతనో
సహనముగా
జాగ్రత్తగా
తాను
సంచరిస్తూ
వస్తున్నాది.
అదేవిధముగా
శత్రువులు
మనచుట్టూ
ఉండినప్పటికిని
మనము
సహనముతో,
ధైర్యముతో
తప్పించుకునేటువంటి
యుక్తి
శక్తులతో
మన
జీవితాన్ని
ప్రవేశపెట్టాలి.
ఇంక,
నాలుక
చేసే
త్యాగము.
ఏదైనా
చక్కని
రుచికరమైన
పదార్ధము
చిక్కెనా
యిది
రుచిగా
ఉన్నది
యిది
నాకు
అక్కర్లేదు.
జఠరాగ్నికి
పంపిస్తాను
అని
జఠరము
నకు
పంపిస్తుంది.
రుచియే
చెడుగా
వుండెనా
అది
అక్కరలేదని
భూదేవికి
అందిస్తున్నాది.
ఇంక,
గౌరవమునందు
తన
గృహమునందే
తాను
గౌరవముగా
సంచరిస్తున్నాది
గాని
యింటింటికి
కుక్కలవలే
తిరిగేటువంటి
గుణము
ఆ
నాలుకకు
లేదు.
అట్టి
గౌరవమున్న
నాలుక
మంచి
మధురమైన
మాటలతో
నాలుకవల్ల
ఆ
జీవునకు
కూడను
పశుపతివంటివాడు
అనే
సార్ధకనామాన్ని
తెప్పిస్తుంది.
ఇంక
ఆ
నాలుకతో
యితరులను
బాధించే
పలుకులు
పలికితిమా,
ఇతరులను
నొప్పించే
పలుకులు
పలికితిమా
దానివల్ల
యితను
పశువు
వంటివాడు
అని
ఆ
జీవునకు
పేరు
తెప్పిస్తుంది.
కనుక,
మంచిపేరుగాని,
చెడ్డపేరుగాని
మనకు
వచ్చుటకు
మూలకారణము
జిహ్వయే.
9
▾
Meaning
Keep
కాకివచ్చి
మన
యింటిపైన
కూర్చున్నప్పుడు
దానిని
రాయి
తీసుకుని
విసురుతాము.
కాని
కోయిలవచ్చి
మన
యింటిపైన
కూస్తున్నప్పుడు
ఆనందముగా
ఆ
శబ్దమును
అనుభవిస్తాము.
కోయిల
అంటే
యిష్టము,
కాకి
అంటే
అయిష్టము
రావటానికి
కాకి
తన
సొత్తు
కాజెయ్యలేదు,
కోకిల
కిరీటము
పెట్టలేదు.
నోరు
మంచిదైతే
పేరు
మంచిదౌతుంది.
కనుక,
మనయొక్క
మానవత్వమునకు
అందించిన
పవిత్రమైన
జిహ్వతో
మనము
మృదు
మధురమైన
పలుకులతో
సమాజసేవలో
జేరి
వారిని
కూడను
యిట్టి
పవిత్రమైన
మార్గములో
ప్రవేశింప
చేసుకొని
మనయొక్క
జీవితమును,
యువకత్వమును
అపవిత్రము
చేసుకొనక
తగినరీతిగా
సార్ధకము
గావించుకుంటారని
నేను
ఆశిస్తున్నాను.
కొన్ని
నిముషములకు
పూర్వము
మన
జనరల్
కరియప్ప
కూడా
చెప్పాడు.
మన
హృదయమునకు
సంబంధించిన
దానిక్రింద
మనం
తీసుకోవాలిగాని
ఒక
వస్తువుల
కిందగాని,
కంపెనీల
కిందగాని
నేషనలైజ్
చేయటానికి
వీలుకాదు.
హృదయములో
ఏకత్వమనే
దీనిలోపల
ఐకమత్యానికి
పూనుకోవటము
మనము
ప్రధానమైన
కర్తవ్యముగా
భావించాలి.
ఆ
హార్ట్,
ఆత్మస్థానము
కనుక
ఈ
ఆత్మ
భావముతో,
ఐకమత్యముతో
ఈ
జగత్తుకు
తగిన
గుణపాఠము
నేర్పటానికి
సంసిద్ధులు
కావాలని
ఆశిస్తూ
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Youth and the Tapas of Speech
Next
Name and Form Belong to the Body, Not to the Ātma
→