Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · Name and Form Belong to the Body, Not to the Ātma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Name and Form Belong to the Body, Not to the Ātma
5 June 1973, Summer Course, Brindavan
1
▾
Meaning
Keep
His songs 4
శత్రుడు
మిత్రుడు
పుత్రుడు
బంధువు
అనుచు
ఉపేక్షాపేక్షలు
మానుము
అందరిలోనూ
ఆత్మనె
చూడుము
భేదమనే
అజ్ఞానము
వీడుము.
లోకమునందు
వీరు
మిత్రులని,
వీరు
శత్రువులని,
వీరు
పుత్రులని,
వీరు
బంధువులని
కొన్ని
కొన్ని
దేహములకు
కొన్ని
కొన్ని
పేర్లు
పెట్టుకొని
మనము
పిలుస్తుంటాము.
మన
దేహమునందు
కలిగిన
యింద్రియములను
అనేకపేర్లతో
పిలుచుచూ
అనుభవించటానికి
ప్రయత్నము
సలుపుతున్నాము.
ఇది
కాలు,
ఇది
ముక్కు,
ఇది
నోరు,
ఇది
చెయ్యి
అనేటువంటిపేర్లతో
ఈ
దేహములోనున్నటువంటి
అంగములను
మనము
అనుభవిస్తూ
వస్తున్నాము.
రూపనామములు
దేహమునకే
గాని
ఆత్మ
ఎట్టిది
అనుభవించదని
ఇట్టి
రూపనామములకు
యేమాత్రము
సంబంధము
లేదని
యిందులో
మనకు
స్పష్టమవుతున్నది.
ఐతే,
ఒకదానిని
వేరొకటిగా
భావించి,
భిన్నముగా
విశ్వసించి
దానికి
విరోధమైన
అభిప్రాయములతో
అనుభవించుకోవటానికి
మనం
పూనుకోవటం
లేదు.
మన
దేహములోని
ఏదైనా
అంగమునకు
శస్త్రచికిత్స
చేయవలసిన
అవసరము
ఏర్పడినప్పుడు
మనము
ముందు
వెనుక
యోచించటానికి
పూనుకుంటాము.
అట్టి
స్థితిలో
మనము
ఒక
అంగమును
దూషించటంగాని
లేక
ఒక
అంగమును
ద్వేషించటంగాని
ఒక
అంగమును
ప్రేమించటంగాని
మనము
చేయము.
రెండింటి
యొక్క
క్షేమమును
మనము
ఆశిస్తూ,
సర్వాంగముల
యొక్క
క్షేమమును
మనము
ఆశిస్తూ
ఈ
దేహము
యొక్క
క్షేమము
మనము
కోరుతుంటాము.
అదే
విధముగా
అందరియందు
సమభావమును
పెంచుకోమని
బోధిస్తుంది
మన
వేదాంతము.
అయితే,
ఇట్టి
సమానత్వము
ఎందుకు
పెంచుకోవాలి
అని
యోచించ
వచ్చు.
అయితే,
మనము
అనాదికాలము
నుండి
అనుకూలమైన
వస్తువులను
ప్రేమించటము
మనకు
ప్రతికూలమైన
వస్తువులనుగాని
వ్యక్తులనుగాని
ద్వేషించటం
పరిపాటైన
పొరపాటు.
2
▾
Meaning
Keep
ఇట్టి
దీనిని
మనము
సరిదిద్దుకొనటానికి
ఒక
చక్కని
ఆదర్శమును
జీవితములో
మనము
అందుకోవటానికి
అవకాశము
ఉంది.
మన
పండ్లు
మన
నాలుకను
హఠాత్తుగా
కరుస్తాయి.
కరచిన
సమయమునందు
పండ్లను
దండించటమో
లేక
నాలుకను
బుజ్జగించటమో
మనము
చేయము.
కఠినమైన
దంతములారా
ఎందుకింత
మెత్తనాలుకను
హింసించితివని
పండ్లను
కొంచెము
దండించటమో
లేక
అజాగ్రత్తవల్ల
ఈ
బాధకు
గురైతివని
నాలుకకు
బుద్ధి
చెప్పటమో
మనము
చేయము.
కారణము
ఏమిటి?
ఇవి
రెండూ
మనయొక్క
స్వాధీనములో
ఉండటంచేత,
రెండూ
మనవని
విశ్వసించి
అభిమానించటంచేత
రెండింటియొక్క
క్షేమము
మనము
ఆశించి
కేవలం
నాయొక్క
అజాగ్రత్తయేయని
భావించుకోవటానికి
పూనుకుంటాడు
గాని
ఆ
అంగములను
ఏమాత్రము
దండించటానికిగాని
లేక
విమర్శించటానికిగాని
లేక
బుద్ధి
చెప్పుటకు
గాని
పూనుకోడు.
ఏదోపొరపాటుతో
జరిగిన
ఈ
కర్మను
మనము
మన్ముందు
అట్లు
జరుగకుండా
చూచుకోటానికి
ప్రయత్నిస్తామేగాని
ఈ
అంగములను
ఏమాత్రము
శిక్షించటానికి
పూనుకోము.
బ్రహ్మాండమైనట్టి
జగత్తులోనున్న
సర్వవ్యక్తులు
కూడను
ఆత్మలోని
అంగములుగా
మనము
విశ్వసించవలసిన
అవసరము
వుంది.
ఈ
ఆత్మలో
నున్న
అంగములు
ఒకదానితో
ఒకటి
ద్వేషించటానికిగాని
లేక
విమర్శించటానికి
గాని,
నేను
గొప్ప,
నీవు
గొప్ప
అని
విఱ్ఱవీగటానికిగాని
యేమాత్రము
అవకాశము
లేదు.
దేహములోని
ఒక
అంగము
మరొక
అంగమును
హింసించినప్పుడు
మనము
ఏరీతిగా
సహించుకుంటామో
అదేవిధముగా
దేశములోనున్న
వ్యక్తులు
ఒకరికి
ఒకరు
హింసించుకున్నప్పుడు
మనము
సహించుకోటానికి
కూడను
మనము
ప్రయత్నము
సలపాలి.
కేవలము
దేహములే
మనకు
బంధుత్వము,
దేహములే
మనకు
శత్రుత్వము,
దేహమే
మనకు
పుత్రత్వము
అనే
సంబంధము
కల్పిస్తున్నాదేగాని
ఆత్మకు,
ఆత్మకు
ఎట్టి
సంబంధము
లేదు,
విభేదము
లేదు.
దీనినే
మిత్రులెవ్వరు
శత్రులెవ్వరు
కవి
ఎవ్వడు
నటకుడెవ్వడు
దేవుడెవడు
దాసుడెవడు
తెలుసుకునే
తెలివి
ఉన్నదా?
తెలిసిన
సంశయమున్నదా?
తెలివిలేని
తలయున్నచో
వానరుడన
తప్పున్నదా!
3
▾
Meaning
Keep
అను
పద్యము
ద్వారా
తెలిపారు.
రూపనామములే
నటకుడు,
టీచరు,
గురువుగాని
ఆత్మ
ఎట్టి
దీనికి
సంబంధము
లేదు.
సాక్షిభూతుడై,
సర్వవ్యాపియై,
సర్వభూతాంతరాత్మయై
తాను
అన్ని
విధముల
అన్ని
రూపములందుకూడను
ఏకత్వాన్నే
తాను
ప్రకటిస్తూ
ప్రవర్తిస్తుంటాడు.
ఇందులో
మానవత్వమనేది
రెండు
పదార్ధముల
మిశ్రమ
స్వరూపము.
ఒకటి
ఆత్మ,
రెండవది
అనాత్మ.
ఒకటి
క్షేత్రము,
రెండవది
క్షేత్రజ్ఞుడు.
ఒకటి
స్థిరుడు,
ఒకటి
చరుడు.
ఒకటి
ప్రకృతి
ఒకటి
పరమాత్మ.
ఈవిధముగా
రెండు
బేడలతో
చేరిన
విత్తనము
వలె
మానవత్వము
రెండు
పదార్ధములయొక్క
మిశ్రమ
స్వరూపకముగా
మనకు
గోచరిస్తున్నది.
ఈవిధమైన
పదములయందు
మనము
చక్కగా
విభాగము
సల్పినప్పుడు
యిందులో
సత్యమైనటువంటి,
నిత్యమైనటువంటి
స్వరూపము
మనకు
స్పష్టమవుతుంది.
ఇందులో
క్షేత్రమే
లేకపోతే
క్షేత్రజ్ఞుడు
లేడని
కొంతమంది
వాదన.
క్షేత్రజ్ఞుడే
లేక
అది
క్షేత్రమే
కాదని
మరికొంతమంది
వాదన.
ఇందులో
క్షేత్రము
ప్రధానమా,
క్షేత్రజ్ఞుడు
ప్రధానమా
అనేటువంటిది
చక్కగా
మనము
విచారణ
చేసినప్పుడు
క్షేత్రజ్ఞుడు
ఉండటంవలనే
అది
క్షేత్రమయింది
గాని
క్షేత్రజ్ఞుడే
లేక
క్షేత్రము
కాదు.
పదము
యొక్క
అర్థమే
పదార్థమనే
సార్థకమైన
విషయాన్ని
మనము
అర్థము
చేసుకున్నప్పుడు
క్షేత్ర,
క్షేత్రజ్ఞ.
క్షేత్ర
రెండు
అక్షరములు.
క్షేత్రజ్ఞ
మూడు
అక్షరములు.
ఈ
రెండు
అక్షరములకు,
ఆ
మూడు
అక్షరములకు
ఏది
అధికంగా
వుందని
అనుకున్నప్పుడు
క్షేత్ర,
క్షేత్రజ్ఞ.
జ్ఞకారమనేది
క్షేత్రజ్ఞలో
అధికంగా
ఉంది.
ఈ
జ్ఞకారములేనిది
క్షేత్రముగా
ఉంటున్నాది.
జ్ఞకారము
జ్ఞాన
స్వరూపము.
జ్ఞానస్వరూపముతో
కూడినది
క్షేత్రజ్ఞుడు,
జ్ఞానము
లేనిది
క్షేత్రము
అని
మనకు
స్పష్టమవుతుంది.
అనగా,
జ్ఞానము
లేనిది
దేహము,
జ్ఞాన
స్వరూపుడైన
వాడు
జీవుడు.
జీవుడనే
దేవుడు
జ్ఞానహీనమైన
దేహములోపల
నివాసము
సల్పుతున్నాడు.
కనుక
దేహము
ఒక
మందిరము.
జీవుడు
దేవుడు.
దీనిని
పురస్కరించుకొనియే
మన
వేదాంతము
నందు
“
దేహోదేవాలయ
ప్రోక్తో
జీవో
దేవస్సనాతనః”
అన్నారు.
ఇంక
రెండవ
పదమునందు
స్థిరము,
చరము
అన్నారు.
స్థిరమైనది
ఒకటి.
కదిలేది
ఒకటి.
అనగా
ప్రకృతే
నిరంతరము
తిరుగుతూ
వుంటుంటాది.
పరమాత్ముడు
నిరంతరము
స్థిరుడై
ఉంటాడు.
అనగా
మార్పు
చెందునది
జగత్తు,
మార్పు
చెందనిది
జగదీశ్వరుడు.
దీనికి
మనయొక్క
భారతీయ
అనుభవమునందు
విసురుడు
రాయి
అని
ఉంది.
4
▾
Meaning
Keep
ఒకటి
క్రింద
ఉంటుంది,
ఒకటిపైన
ఉంటుంది.
మధ్యన
ధాన్యముపోసి
తిప్పుతుంటాము.
పైది
మాత్రమే
తిరుగుతుంది
గాని
క్రిందది
తిరుగదు.
తిరగకూడదు.
దీనిలో
ఇహమున
సుఖింప
హేమతారక
విద్య
అనేది
ధర్మవిద్య
అనే
ఒక
భాగమును
పట్టుకొని
ఈ
మానవుడు,
ఈ
జీవుడనేవాడు
ప్రపంచమును
త్రిప్పుతూ
తిరుగుతుంటాడు.
ఇందులో
మధ్య
భాగములో
ఒక
అచ్చుగా
ఉంటుంది.
అదే
లక్ష్యము.
ఆ
భాగములో
పడిన
ధాన్యము
ఆ
లక్ష్యమునకు
దూరమైనటువంటి
వన్నియుకూడను
పిండిగా
మారి
పోతున్నాయి.
లక్ష్యమునకు
సమీపములో
నున్నవి
భద్రముగా
నిల్చి
పోతుంటుంది.
అనగా
భగవంతుని
లక్ష్యమునందుంచుకున్న
వ్యక్తికి
నిరంతరము
క్షేమంగానే
ఉంటుంది.
భగవంతుని
లక్ష్యము
వదలి
దూరముపోయిన
వారికి
ఈ
ప్రకృతి
అనేది
పిండిగా
మార్చివేస్తున్నది.
కనుక,
మనము
దేహతత్త్వాన్ని
చక్కగా
విచారణ
చేసినప్పుడు
నిరంతరము
మార్పు
చెందునదేగాని
నిత్యసత్యమై
నిలిచేది
కాదని
మనకు
స్పష్టమవుతున్నది.
మానవుని
యొక్క
దేహముతో
మనము
సాధించే
ఉత్తమమైన
స్థితి
ఏమాత్రము
లేదు.
కేవలము
మనస్సును
ఒక
పనిముట్టుగా
పెట్టుకొని
బుద్ధి
చిత్తముల
ప్రవర్తనలవల్ల
దానిని
కొంత
వినియోగించుకోటానికి
పూనుకోవచ్చునే
తప్ప,
బుద్ధి
మనస్సుల
యొక్క
తత్త్వమే
లేకుండిన
మనము
ఏమాత్రము
జగత్తునందు
సంచరించటానికిగాని,
చలించటానికిగాని
వీలుకాదు.
నిరుపయోగమైన
దేహమునకే
మనము
ప్రాధాన్యతనందిస్తుండటంచేత
మనయొక్క
స్థితి,
మనయొక్క
గతి,
మనయొక్క
పవిత్రత
మనం
అర్ధం
చేసుకోలేక
పోతున్నాము.
గతించిన
మృగము
యొక్క
చర్మమైనా
ఉపయోగపడుతుందిగాని
గతించిన
మానవునియొక్క
దేహము
దేనికిని
ఉపయోగపడదు.
కనుక,
నిరుపయోగమైన
దేహములోపల
యింత
అభిమానము
చేర్చుకొని
ఏది
పవిత్రమో
ఏది
మన
జీవిత
లక్ష్యమో
దాన్ని
మనం
దూరం
చేసుకోవటానికి
పూనుకోవడం
అనునది
సరైన
మానవత్వానికి
కర్తవ్యం
కానేరదని
కూడను
యువకులు
గుర్తించుకోవలసిన
విషయం.
దేహమనే
వాహనాన్ని
సరైన
స్థితిలో
వుంచాలి
విద్యార్ధులారా!
అట్లని
నేను
దేహమును
పూర్తి
దూరము
చేసుకొనమని
గాని
దేహముయొక్క
మంచిచెడ్డలుగాని,
ఆరోగ్యశక్తులు
మీరు
ఏమాత్రము
లక్ష్యము
చేసుకోనక్కరలేదని
నేను
యేమాత్రము
చెప్పటం
లేదు.
5
▾
Meaning
Keep
మనకు
ఎన్నో
వాహనములు
ఉంటున్నాయి.
సైకిలు
ఉంది.
స్కూటరుంది.
మోటారుసైకిలుంది,
కారుంది,
బస్సుంది
యింకా
అనేకరకములైన
రధములు,
ఎడ్లబండ్లు
కూడా
ఉండవచ్చును.
కాని
వీటిని
నిరంతరము
శుభ్రపరచి
దానికి
తగినటువంటి
ఆయిలు,
పెట్రోలువేసి
దానిని
సరైన
కండిషన్
మనము
చూచుకోవటము
మన
నిత్య
కృత్యములలోపల
అది
కర్తవ్య
ధర్మముగా
ఉంటున్నది.
అదేవిధముగా
దేహము
ఒక
రథము.
ఏవిధముగా
మనము
సైకిలును,
కారును
తుడిచి
పెట్రోలు,
ఆయిలు
వేసి,
తుడిచి
దానిని
సరైన
కండిషన్లో
పెడుతుంటామో,
అదే
విధముగా
మనయొక్క
జీవితయాత్ర
నిమిత్తమై
ఏర్పడిన
యీ
దేహమనే
వాహనమునకు
కాలకాలమునకు
దానిని
పరిశుద్ధపరచి,
యివ్వవలసిన
ఆహారమునందించి
సరైన
స్థితిలో
పెట్టుకోవటమే
మనము
సరైన
స్థితిలో
చూడాలి
గాని
జీవితమునే
మరచి
దీనిని
అలంకారములు
చేసుకుంటూ
దీనికే
పెట్రోలు
వేసుకుంటూ
నిరంతరము
పాలిష్లంతా
వేసుకుంటే
రధము
ఉండి
ప్రయోజనము
ఏమిటి?
దీనిలో
యింకొక
విషయాన్ని
కూడను
మనం
యోచించవలసినది.
కారు
మనము
కూర్చొని
డ్రైవ్
చేస్తే
ఎక్కడకైనా
వెళ్లవచ్చునని
మనము
రోడ్లు
సరిలేని
దారిలో
కారులో
ప్రయాణము
చేయటము
వలన
కష్టాలకు
గురైపోతుంటాము.
రోడ్డులేని
ప్రదేశమునకు
లేక
కొండపైకి,
నదిలోపలకి
కారు
పోకూడని
ప్రదేశములకు
మనం
కారు
డ్రైవ్
చేసుకొని
వెళ్లినప్పుడు
మనము
చాలా
కష్ట
నష్టములకు
గురికావలసి
వస్తుంది.
అదేవిధముగా
మన
దేహమనే
ఈ
రధమును
పోకూడని
మార్గములోపల
పంపరాని
స్థలములకు
పంపటంచేత
మనం
కొన్ని
నింద
నిష్ఠూరములకే
కాక
కష్టనష్టములకు
గురికావలసి
వస్తుంది.
బురద
ప్రదేశములోపల
మన
కారును
యిరికించుకున్నప్పుడు
ఎన్ని
రకములైన
సహాయము
మనం
కోరవలసి
వస్తుందో
అదేవిధముగనే
సంసారమనే
బురద
లోపల
జీవిత
రథమును
ప్రవేశింపజేసి
యిందులో
మనము
చిక్కుకున్న
తరువాత
సత్సంగమని
పెద్దల
యొక్క
అనుగ్రహమనే
సహాయాన్ని
మనం
కోరవలసి
వస్తుంది.
కనుక
మనము
దేహ
ధారులం
కావటంచేత
దేహమనే
రథమునకు
అపాయం
కాకుండా
ప్రయాణమునకు
ఏవిధమైన
అవాంతరములు
కలుగకుండా
పవిత్రమైన
స్థానమును
చేరే
నిమిత్తమై
దేహమనే
కాయమునకు
కొంత
భద్రత
చూసుకోవలసినదేగాని
ఎక్కడ
చేరాలో
దీనియందు
మాత్రమే
దృష్టి
ఉంచుకొని
ఈ
జగత్తునందు
జీవన
ప్రయాణానికి
పూనుకోవటం
ఉత్తమము.
6
▾
Meaning
Keep
His poems 241
Also in his talks
(6)
23 May 1973
The Wheel of Birth and Death, and Vimukti
10 April 1986
The welfare of the world comes first
22 June 1987
Human birth finds its meaning only when the principle of the Ātma is recognised
17 July 1988
Only when man changes will the world change
3 November 1989
Ānanda Itself Is the Goal
7 November 1989
The Ātma in All Is One
ఈనాడు
ఈ
సక్రమమైన
మార్గంలో
ఈ
రధం
ప్రవేశించటం
లేదు.
ఏదో
వక్రమమైన
మార్గములో
దీనిని
నడుపుకుని
వెళ్లి
చిక్కులకు
గురైపోవటమే
కాకుండా
దానిలో
కారులోవున్న
భాగములు
మనం
చెడగొట్టుకుంటున్నాము.
ఇది
ఒక
80
భాగములు
ఈ
రధములను
పాడుచేసుకుంటున్నారు.
ఇంక
వున్న
20
భాగములలో
15
వంతుల
భాగము
షోరూమ్‌లో
పెట్టిన
కార్లవలె
చక్కగా
డెకరేషన్
చేసుకుని,
చక్కగా
భోజనము
చేసుకొని
తన
జీవితము
అంటే
ఏమిటో
తెలియక
అనాచారములో
మునిగి
కేవలము
పశువులకంటే
హీనమైన
సుఖాన్ని
అనుభవిస్తున్నారు.
కారుగా
పుట్టి
ప్రయాణీకులకు
తగిన
సహాయము
చేసేటువంటి
స్వరూపకంగా
నిర్ణయించుకొని
దానిని
ఎట్టి
కర్మలయందుగాని,
ఎట్టి
ఉపకారమైన
మార్గములందుగాని
దానిని
ఉపయోగించుకొనకుండిన
దానిని
ఒక
ఇనుపముద్దగానే
మనము
భావించుకోవచ్చు.
జగతిని
జీవించువాడు
మనుజుడు
కావలె
మొదట
పరుల
దుష్కృతులనెల్ల
పొగడుచుండెడువాడె
చవట
బ్రహ్మ
విద్యనేర్చి
యిచట
ఆధ్యాత్మమును
కనుగొనుట
రాజయోగమునకు
బాట
ఇదియె
శ్రుతులు
చెప్పుమాట
కనుక,
దేహమును
ఒక
రథముగా
విశ్వసించుకొని
ఆ
రధములోనున్న
భాగమునకు
ఎట్టి
యిబ్బందులు
కలుగకుండా
చూచుకోటము
మాత్రమే
మనము
లక్ష్యము
నందుంచుకోవాలిగాని
మిగిలినదంతా
కూడ
మనము
ఏ
బ్రహ్మతత్వము
నుండి
బయలుదేరినామో
ఆ
బ్రహ్మతత్వమును
చేరేటువంటి
దానిలో
మన
జీవిత
ప్రయాణమును
సాగిస్తూ
వెళ్లాలి.
అట్టి
భోగరాజులను
పురస్కరించుకొనియే
శంకరుని
శిష్యులు
యిట్టి
త్యాగమునకు
పవిత్రమైన
యోగమునకు,
పవిత్రమైన
దర్శనమునకు
అనుకూలమయ్యే
సద్బోధలు
వారు
చేస్తూ
వచ్చారు.
“దేహము
పాంచభౌతికము-
దేహము
కూలక
తప్పదెప్పుడున్”
కనుక,
అట్టి
దేహితత్వమునే
మనము
లక్ష్యమునందుంచుకొని,
దేహమును
ఒక
ఆధారముగా
తీసుకొని
మన
జీవితయాత్ర
సాగించటము
ఎంతో
అవసరమని
శంకరుల
శిష్యులు
మిత్రులెవరు
శత్రువులెవరు,
పుత్రులెవరు
బంధువులెవరు
అని
ఈవిధమైన
ప్రశ్నలు
వేసుకుంటూ
మానవుని
నిలబెట్టి
నిగ్గదీసి
సాధించటానికి
పూనుకున్న
మహా
పవిత్రులు
శంకరుల
యొక్క
శిష్యులు.
7
▾
Meaning
Keep
మానవునికి
ఆనందమే
ప్రధానమైన
గమ్యము.
అయితే,
ఆ
ఆనందము
ఎక్కడ
ఉన్నది?
ఆ
ఆనందమునకు
కొంతవరకు
అఱ్ఱులుచాచి
కాచవలసివస్తుంది.
సమత్వమునందే
మనకు
ఆనందము
ప్రాప్తిస్తుంది.
కనుక,
మనము
పెరుగుకొలది,
పెద్దవారగు
కొలది
కూడను
విషయ
సంబంధమైన
వికారవృత్తుల
యందే
మనము
ప్రవేశిస్తున్నాముగాని,
బాల్యత్వమునందు
దినమునకు
ఒక్క
క్షణమైనా
ప్రవేశించినప్పుడు
ఎంతటి
ఆనందాన్ని
పొందుతామో
చెప్పటానికి
సాధ్యము
కాదు.
క్రైస్తు
కూడను
ఒక
తూరి
చెప్పాడు
‘బోసినవ్వుల
పసిపాపల
పాలబుగ్గల
చుట్టు
కట్టకట్టుకొని
ఆడుచుండును
ఆనందం’
అన్నాడు.
చిన్నపిల్లల
ఆనందము
దేనితోనూ
పోల్చటానికి
వీలుకాదు.
వారి
ఆనందము
వారిదే
కాని
అన్యులది
కాదు.
వారి
ఆనందమును
చూచిన
ప్రతి
వ్యక్తికి
తిరిగి
ఆనందమే
కలుగుతుంటుంది.
ఒక
బిడ్డను
చంకన
పెట్టుకొని
అమ్మ
వెడుతున్నప్పుడు
వెనుక
భాగములో
మనము
ఏదో
కార్యములో
నడుస్తుంటే
మనలను
చూచి
ఆ
చంటిబిడ్డ
నవ్వుతుంది.
ఆ
నవ్విన
తక్షణమే
మనకు
కూడా
నవ్వు
వస్తుంది.
కనుక,
ఎంత
వారినైనా
నవ్వించి
ఆనందములో
ముంచెత్తే
స్వభావము
పసిపిల్లల
పాలబుగ్గలలో
ఉంటున్నాది.
కారణం
ఏమిటి?
ఆ
పిల్లలకు
దేహభ్రాంతి
ఏమాత్రము
లేదు.
మన
పెద్దవారైన
వారికి
పూర్తి
దేహములోనే
మునిగి
ఆ
దేహములోనే
తికమకలుపడే
వ్యక్తులకు
నవ్వు
వచ్చినా
నవ్వలేని
పరిస్థితిలోపల
ఒక
సినీమా
నవ్వు
మాదిరి
నవ్వటానికి
ప్రయత్నిస్తారు.
దానిని
పురస్కరించుకొనియే
భగవద్గీతయందు
“నవ్వేవాడు
నారాయణుడు,
ఏడ్చేవాడు
నరుడు”
అన్నాడు.
నరుడు
అనే
అర్జునుడు
విషాదముతో
ఏడుస్తుంటే
నవ్వే
నారాయణుడు
చక్కగా
ప్రబోధలు
చేసుకుంటూ
స్వేచ్ఛా
నవ్వులతో
విహరిస్తూ
వచ్చాడు
యుద్ధభూమిలో.
నవ్వు
ఎప్పుడు
వస్తుంది?
ఆనంద
సమయమునందే
నవ్వు
వస్తుంది.
ఆనంద
సమయములో
నవ్వేకాదు,
కొన్ని
కొన్ని
రకములైన
పాటలు
పాడటానికి
ప్రయత్నము
చేస్తారు.
కంఠము
చక్కగా
ఉన్నవారు
పదిమందిలో
కూడను
విచ్చలవిడిగా
పాడటానికి
పూనుకుంటారు.
8
▾
Meaning
Keep
కంఠము
సరిగాలేక
రాగతాళములు
లేనటువంటివారు
బాత్రూమ్లోనైనా
గుయ్గుయ్మంటారు.
కనుక,
కృష్ణునికి
కంఠము
స్పష్టమైనదే,
గానము
రాగతాళములతో
కూడినదే
యుద్ధభూమియందు,
భద్రభూమియందు
గీతను
పాడుకుంటూ
పోయాడు.
అందువలననే
దీనికి
భగవద్గీత
అని
సార్ధక
నామము.
గీత
అనగా
పాట.
నిజముగా
యుద్ధభూమిలో
పాట
పాడేవారు
ఎవరైనా
ఉంటారా,
ఒక్క
కృష్ణుడు
తప్ప.
భగవంతునికి
ఎక్కడైనా
ఆనందమే.
అతనే
ఆనందమయుడు.
అందువలన
అతని
ఆనందమును
మనము
అందుకోవటానికి,
ఈ
ఆనందమయునితో
మనము
అంకితమైపోవటానికి
ప్రయత్నము
చేయటము
పవిత్రమైన
మార్గమని
ఈ
శ్లోకము
ప్రబోధిస్తూ
వచ్చింది.
ప్రేమస్వరూపులైన
విద్యార్ధులారా!
మీరు
కాయమునకు
తగినంత
పుష్టిని
తగినంత
శక్తిసామర్ధ్యములను
అందించటములోపల
ఎట్టి
అలక్ష్యమును
చేయనక్కరలేదు
అయితే,
ఈ
కాయముతో
భారతదేశమునందు
ధర్మమును
జయించటానికై
వచ్చిన
దేహము
యిది
అనే
సత్యముతో
మీరు
ధర్మాచరణయందు
పెద్దలయొక్క
ఆజ్ఞను
శిరసావహించి
మన
భారతీయ
సంస్కృతిని
పురస్కరించుకొని
మున్ముందు
మీరు
ధర్మస్థాపనకై,
పవిత్రమైన
సంస్కృతిని
నిలబెట్టటానికి,
ఈ
కాయములను
శక్తి
సామర్ధ్యములతో
మనస్సును
కూడా
దానికి
తగినట్లుగా
పవిత్రమొనరించుకొని,
మీరు
ఈ
కార్యములోపల
పాల్గొంటారని
నేను
ఆశిస్తున్నాను.
Previous
←
The Culture of Bhārata and Moral Values
Next
This World and the Next
→