Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · Karma Free of Desire for Its Fruit, and Its Practice
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Karma Free of Desire for Its Fruit, and Its Practice
11 June 1973, Summer Course, Brindavan
1
▾
Meaning
Keep
His poems 29
కనుల
కగుపడు
దృశ్యంబు
గాంచి
మీరు
సత్యమిదియని
ఎంచక
సంబరమున
తెరను
దాగిన
సత్యంబు
తెలిసికొనగ
విశ్రమింపక
నాతోడ
వెడలిరండు!
పవిత్రాత్మ
స్వరూపులైన
విద్యార్థులారా!
సర్వత్రా
వ్యాపించిన
పరమాత్మను,
సర్వత్రా
ప్రకాశించునటువంటి
పరమాత్మను
ఎక్కడని
మీరు
వెదుకుటకు
ప్రయత్నింతురు?
అనగా
తమందు,
తమచుట్టూ,
సర్వత్రా
ఉన్నటువంటి
పరమాత్మను
వెదకుట
ఎక్కడ?
కన్నులు
మూసుకొని
మనము
ఎంత
వెదికినప్పటికి
మనకు
ఏమి
చిక్కుతుంది?
ఏమాత్రము
మనము
ఆశించునటువంటి
వస్తువు
గాని
లేక
ప్రదేశముగాని
మనకు
చిక్కుటకు
వీలుకాదు.
జ్ఞాననేత్రమును
కప్పిన
“నేను,
నాది”
అనే
రెండు
రెప్పలను
తెరచి
చూచినప్పుడు
సర్వత్రా
భగవత్స్వరూపమే
నీకు
గోచరించును.
అయితే,
అట్టి
ప్రయత్నమునకు
పూనుకున్నటువంటి
వారు
ఎవరు,
అట్టి
తెగలు
ఎన్ని
ఉన్నవి
అని
కూడను
విచారణ
సలుపవలసి
వుంటుంది.
విషయ
సంబంధమైన
ఈ
జగత్తునందు
దుఃఖము
కలిగినప్పుడు
దుఃఖించటం,
ఆనందము
కలిగినప్పుడు
సంతోషించటం,
ఇట్టి
స్థితిని
అనుభవించే
వ్యక్తి
కేవలము
యినుముతో
సమానమైన
వ్యక్తి.
అనగా
నిప్పునందు
వేసినప్పుడు
ఎఱ్ఱబడి,
మెత్తబడి
తనయొక్క
రూపమును
మార్చుకుంటుంది
ఇనుము.
తిరిగి
నిప్పునుండి
వేరు
చేసినప్పుడు
గట్టిపడి
నల్లరూపము
ధరించి
తనయొక్క
ఆకారమును
అనుభవిస్తుంది.
ఇట్టి
ఇనుము
స్వభావము
కలిగిన
వ్యక్తి
అధముడని
చెప్పవచ్చు.
ఇంక
దుఃఖము
నందు
కూడను
ఆనందమునే
అనుభవించే
వాడు
ఒక
బంగారు
స్వభావము
కలిగినవాడని
చెప్పవచ్చు.
అనగా
ఈ
బంగారు
కరగించుటకు
నిప్పులో
వేసినప్పటికి,
తనలో
నున్నటువంటి
మాలిన్యమును
వేరుపరచుకుంటుంది
గాని
తాను
మాలిన్యము
చెందదు.
అందువలననే
మానవుడు
దుఃఖమునందు
కూడను
ఆనందమును
స్మరించటమే
ఒక
విధమైన
బంగారుతో
పోల్చబడింది.
2
▾
Meaning
Keep
His poems 184
Also in his talks
(2)
30 July 1987
To nurture sacred feelings in the heart is education
1 January 1992
Only when the differences of the upādhis are removed does the principle of the one Ātma become our own
ఇంక
దుఃఖమునందును,
సుఖమునందును
సమభావమును
అనుభవించేవాడు
ఒక
వజ్రము
యొక్క
స్వభావము
కలిగినవాడు.
అనగా
ఇట్టి
వ్యక్తికి
ఎట్టి
కష్టములు,
విచారములు,
దుఃఖములు
ప్రాప్తించినప్పటికిని
తనయొక్క
ఆనందమనే
దాన్ని,
సమత్వమనే
దాన్ని
నిత్య
అభివృద్ధి
చేసుకోటానికి
పూనుకోవటమే
తనయొక్క
కర్తవ్యముగా
భావిస్తుంటాడు.
వజ్రమును
మనము
ఎన్ని
విధములుగా
కోతలు
చేయటానికి
ప్రయత్నము
చేసినప్పటికిని
కోతలు
అధికమగు
కొలది
వజ్రము
యొక్క
విలువ
అధికమవుతుంటుంది
గాని
దాని
విలువ
తగ్గటానికి
వీలుకాదు.
ఇంక
నాల్గవ
తెగకు
సంబంధించిన
వాడు
సుఖదుఃఖములకు
అతీతుడై
గుణతత్త్వములనే
పూర్తి
మరచి
బ్రహ్మానందముతో
ఆత్మ
స్వరూపాన్ని
అనుభవిస్తుంటాడు.
కనుక
మానవుడు
ఇనుము
స్వభావము,
బంగారు
స్వభావము,
వజ్రస్వభావము,
ఆత్మస్వభావము.
వీటియందు
ఆత్మస్వభావమే
నిత్యసత్యమైనదిగాని,
మిగిలిన
మూడు
క్షుద్రసంబంధ
మైనవే,
లోకసంబంధమైన
మార్పులు
చెందునటువంటివే.
ఇట్టి
ఆత్మస్వభావమును
అనుభవించగోరు
వ్యక్తి
లోకభయమునకు
గాని,
లోకాభిమానమునకు
గాని
ఏ
మాత్రము
కట్టుబడకూడదు.
ఈ
లోకాభిమానము,
భయము
మానవుని
కర్తవ్యము
నుండి
దూరము
చేసి
మహా
భ్రష్టుని
గావిస్తున్నాయి.
ఈ
అభిమానము,
భయము.
కర్తవ్యమును
గుర్తించలేని
వ్యక్తి
ఇంక
దేనిని
కూడను
అనుభవించటంగాని,
అందుకోటంగాని
సాధ్యము
కాదు.
కాని,
ఇట్టి
కర్తవ్యమును
గుర్తించలేని
వ్యక్తి
సోమరియని
చెప్పటానికి
అవకాశము
వుంటుంటాది.
సోహం
తత్త్వమును
గుర్తించుకునే
వ్యక్తి
సోమరత్వములో
బయలుదేరినప్పుడు
తన
దివ్యత్వానికి
అతిదూరమై,
వ్యక్తిత్వాన్ని
కోల్పోవటం
జరుగుతుంది.
ఆత్మస్థానమునందు
అనేక
రకములైన
విషయ
సంబంధమైన
అవివేకమును
అభివృద్ధి
పరచేటు
వంటి,
దుఃఖమునకు
హేతువైనటువంటి
అవాంతరమైన
అడ్డములు
అనేకము
ఏర్పడు
తుంటాయి.
హృదయమనే
క్షేత్రమందు
కలదు
ఒక్క
కల్పతరువు
దానిచుట్టు
వనస్పతుల
కలప
కంప
పెరిగియుండు
కంప
తీసి
శుభ్రపరచ
కల్పతరువు
కానబడును.
దీనినే
ఆత్మ
అని
చెబుతున్నారు.
ఇట్టి
కల్పతరువు,
కల్పవృక్షము,
కామధేనువు
స్వరూపమైనది
ఆత్మతత్త్వమని
ప్రబోధిస్తూ
వస్తున్నారు.
3
▾
Meaning
Keep
ఇట్టి
పవిత్రమైన
ఆత్మ
తత్త్వాన్ని
అనుభవించటం
కోసమని
కొన్ని
రకములైన
కర్మలు
ధర్మాంగములుగా
నిలచి
తద్వారా
మనయొక్క
దివ్యత్వమును
అభివృద్ధి
పరచేవిగా
కూడను
మనం
సహాయం
చేసుకోవాలి.
అయితే,
కర్మలన్నియు
ధర్మాంగములని
కొంతమంది
చెప్పటం
కద్దు.
కాని,
అన్ని
కర్మలు
ధర్మాంగములు
కానేరవు.
మరికొంతమంది
సాత్వికమైన
కర్మలు,
నివృత్తికి
సంబంధించిన
కర్మలు,
ధర్మాంగములని
చెప్పటం
కూడను
కద్దు.
ఈవిధమైన
సాత్వికకర్మలు,
నివృత్తికి
సంబంధించిన
కర్మలు
ధర్మాంగములుగా
చెప్పబడటం
చేత
మనము
అనేక
రకములైన
కర్మలు
ఆచరిస్తుంటాము.
ఒక
వ్యక్తిని
దయతో
చూడటంగాని
లేక
యుద్ధమునందు
దేశమునకు
శత్రువులైన
వారిని
సంహరించటం
గాని
ఒక
కర్మల
క్రిందనే
వస్తుంది.
ఇవి
కూడను
ధర్మములనే
చెప్పవచ్చు
కదా!
ధర్మకర్మలకు
ఆధారమైన
దేహమును
రక్షించుకునే
నిమిత్తము,
పోషించుకునే
నిమిత్తము
ఆ
దేహ
సంబంధమైన
వాంఛలను
అనుభవించే
విషయవాంఛల
సంబంధము
ఇవి
కూడను
కర్మలే
కనుక
ఇవి
కూడను
ధర్మాంగములేయని
చెప్పటానికి
వీలవుతుందా?
కాని,
ఇవి
సత్యధర్మములను
గుర్తించలేని
భౌతిక
వాంఛలనే
ఆశించే
వ్యక్తులు,
సత్యమని
చెబుతే
చెప్పవచ్చుగాని
ఇవి
ధర్మఅంగములు
కానేరవు.
స్వార్థమును,
విషయ
వాసనను
మనసునుండి
వేరుచేసి
తాను
ఆచరించే
కర్మలు
ధర్మాంగములని
చెప్పటానికి
వీలవుతుంది.
ఇట్టి
వాసనలు,
స్వార్థమును
త్యాగము
చేసి
చేసే
కర్మలు
ధర్మాంగములని
చెప్పటమే
కాకుండా,
మానవుని
ఒకవిధమైన
ఉన్నతస్థాయికి
కొనిపోవటానికి
సంసిద్ధమై
వుంటున్నాది.
ఒక
చిన్న
ఉదాహరణము
తీసుకోవచ్చును.
దీపమునకు
దహించటము,
వెలుతురు
చూపించటము
గాలివస్తే
ఆరిపోవటము,
నీరు
తగులుతే
చిటపటమని
మ్రోగటము
పొగలు
వెదజల్లటము
ఆ
దీపమునకు
కొన్ని
లక్షణములు,
గుణములని
చెప్పవచ్చును.
అయితే,
ఆజ్యోతి
యొక్క
వెలుతురు
సర్వులను
సమానంగానే
అందిస్తూ
వుంటుంటాది.
వెలుతురు
యందు
మాత్రము
సమత్వముంటున్నాది.
దీపమునందు
మాత్రము
అనేక
గుణములు
ఉండవచ్చు.
అదేవిధముగా
ధర్మము
సర్వులకు
సర్వకాలములకు,
సర్వప్రదేశములకు
ఒకే
సమత్వమును
అందించినప్పటికిని
కొన్ని
దేశములకు
కొన్ని
కాలములకు,
కొన్ని
రకములైన
పాత్రలకు
కొన్ని
రకములైన
కర్మలుగా
విభజించటము
కూడను
జరుగుతుంటుంది.
అయితే,
ఈ
ధర్మములు
ప్రవృత్తికి
సంబంధించినవా,
నివృత్తికి
సంబంధించినవా
అనేటువంటి
విషయాన్ని
మనము
తెలుసుకోవాలి.
4
▾
Meaning
Keep
బుద్ధి
నివృత్తి
స్వభావము
కలిగినటువంటిది.
దేహము,
ప్రాణము,
ఇంద్రియములు
ఇవన్నీ
ప్రవృత్తికి
ఆటపట్టైనవి.
అయితే
బుద్ధి,
ప్రవృత్తి
లోపల
స్పృశించినప్పుడు
కొన్ని
రకములైన
దుఃఖములకు
కొన్ని
రకములైన
కష్టములకు
గురి
అవటంకూడను
కద్దు.
అయితే,
బుద్ధి
సాక్షిరూపుడై
దైవము
యొక్క
దూతగా
మారటం
అవసరము
కాని
ఈ
ప్రవృత్తితో
చేరుకొని
తనయొక్క
దుఃఖమునకు
తాను
గురికావటము
సహజలక్షణము
కాదు
బుద్ధికి.
బుద్ధి
నిర్లిప్తత
స్థితి
యందుండవలెను.
అట్టి
నిర్లిప్తత
స్థితియే
బుద్ధిగా
ఉండటంచేత
దానినే
నివృత్తి
అని
చెప్పటానికి
వీలవుతుంది.
ఇక్కడ
కర్మత్యాగము
నివృత్తి
కానేరదు.
కామత్యాగమే
నివృత్తి
అవుతుంది.
అయితే,
అనేకమంది
భగవద్గీతను
పురస్కరించు
కొని
అందులో
నున్న
యదార్థమును
గుర్తించుకొనలేక
కర్మఫల
త్యాగము
చేయమని
భగవద్గీత
ప్రబోధిస్తుంటే
అసలు
కర్మ
చేయటము
వలన
ఎట్టి
ఫలితమైనా
రావచ్చును
కదా,
కర్మనే
చేయకుండా
ఉందామనే
భావముతో
అనేక
మంది
కర్మ
త్యాగమునకు
పూనుకోవటానికి
సిద్ధులై
ఉంటారు.
అయితే,
వారి
భ్రమలయందు,
కర్మను
త్యాగము
చేస్తున్నామని
భ్రమించవచ్చునే
గాని
కర్మను
త్యాగము
చేసి
క్షణమైనా
నిలుచుటకు
వీలుకాదు
మానవుడు.
కాయము
కర్మ
నిమిత్తమై
ఏర్పడినది
కనుక
కర్మలు
ఆచరించే
తీరవలెను.
అనగా
నీకు
అట్టి
పవిత్రమైన
భావములు
నీ
చిత్తములో
ఉద్రేక
పరచినప్పుడు,
సత్కర్మలయందు,
పవిత్రమైన
ఫలత్యాగమైన
కర్మలయందు
నీయొక్క
దేహమును
ఇమిడ్చి
తద్వారా
నీ
జన్మ
సార్థకము
గావించుకునే
ప్రయత్నానికి
పూనుకోవచ్చు.
అయితే,
మరికొంత
మంది
బలహీనులైనవారు
దేహత్యాగమునకు
కూడా
సంసిద్ధులై
పోతారు
భక్తి
భావమునందు.
ఇలాంటి
త్యాగాత్యాగమునకు
సంసిద్ధులయ్యేది
కేవలము
క్షుద్ర
త్యాగమే
కాని
ఇది
నివృత్తికి
యేమాత్రము
సంబంధించదు.
బుద్ధి
యొక్క
నిర్లిప్తతను
మాత్రమే
నీవు
అభివృద్ధి
పరచుకోటానికి
ప్రయత్నించాలి.
దేహము
యొక్క
త్యాగమువల్ల
పునర్జన్మము
అనేది
రావచ్చును.
మానవునకు
జీవప్రజ్ఞ
తనను
తానే
బంధించటానికి
పూనుకుంటుంది.
ఈశ్వరప్రజ్ఞ
ఇతరులను
బంధించ
టానికి
పూనుకుంటుంది.
ఆత్మప్రజ్ఞ
బంధవిముక్తి
నందిస్తుంది.
కనుక,
ఆత్మ
ప్రజ్ఞను
అందుకోవటానికి
మనం
ప్రయత్నం
సల్పాలిగాని
ఈశ్వరప్రజ్ఞగాని,
లేక
జీవప్రజ్ఞగాని
మనకో,
ఇతరులకో
బంధకారణమే
గాని
మోక్షకారణము
కానేరదు.
5
▾
Meaning
Keep
అయితే,
ఈ
ఈశ్వరప్రజ్ఞకు,
ఆత్మప్రజ్ఞకు
ఉన్న
భేదము
ఏమిటి
అనేది
కూడా
మనం
కొంత
ఆలోచించాలి.
ఇక్కడ
నేను,
జ్ఞానము
వేరు
అనే
భావము
వ్యక్తులకు
వస్తుండటం
కద్దు.
నేను
వేరు,
జ్ఞానం
వేరు
అని
అనుకోవటం
వలన
రెండింటికి
మధ్య
సంబంధపరిచే
తత్వము
అక్కడ
చేరి
ఉంటుంది.
నేను
అన్నదానికి
జ్ఞానము
అన్నదానికి
మధ్య
ఒక
పదార్థమే
లేకపోతే
జ్ఞానము
వేరు,
నేను
వేరు
అనటానికి
వీలేకాదు.
ఈ
అగోచరమైన
శక్తినే
జ్ఞేయము
అని
చెబుతుంటారు.
ఈ
జ్ఞేయము
వెళ్లిన
తక్షణమే
ఏకాంత
వాసము
ఏర్పడుతుంది.
కనుక,
జ్ఞాత,
జ్ఞేయము,
జ్ఞానము
ఈ
మూడింటి
యొక్క
ఏకత్వానికి
జ్ఞేయమే
ఆధారమన్నారు.
ఈ
జ్ఞేయమనేదాన్ని
మనము
మరుగుపరచుకున్నప్పుడు
ఇంక
జ్ఞానము,
జ్ఞాత
రెండు
కూడను
ఏకమై
పోతాయి.
ఈ
జ్ఞేయము
అనేది
ఏమిటంటే
నేను
అనే
మానవత్వాన్ని
మరపించి
జ్ఞానము
అనే
దానిలో
లీనమొనరింపచేస్తుంది.
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణ.
ఒకడు
ప్రేమించేవాడు
ఉంటాడు.
ఒకడు
ప్రేమింపబడేవాడుంటాడు.
కాని,
ప్రేమించేవానికి,
ప్రేమింపబడేవానికి
మధ్య
ప్రేమ
ఎట్లా
ఏకమొనరిస్తున్నాదో
అదే
విధంగా
జ్ఞాత,
జ్ఞానము
కూడను
జ్ఞేయమనే
ఏకత్వాన్ని
ప్రాప్తింప
జేస్తుంటుంది.
కాన,
ఈ
జ్ఞేయమనే
దానిని
తీవ్రమైన
స్థితిలో
మనము
అభ్యాసము
సల్పినప్పుడు
ఈ
జ్ఞానమునకు
ఈ
జ్ఞాతకు
ఏకత్వానికి
తగిన
సంబంధాన్ని
ఏర్పరుస్తుంది.
ఇట్టి
ఏకత్వాన్ని
అభివృద్ధి
పరచే
ప్రయత్నము
ధర్మాంగములనే
కర్మలుగా
మనము
విశ్వసించటానికి
వీలవుతుంది.
దీనిని
అంతర
సంబంధమైన
ధర్మమని
స్థూల
సంబంధమైన
ధర్మమని,
సూక్ష్మ
సంబంధమైన
ధర్మమని
మూడు
పేర్లు.
ధర్మము
మూడు
స్వభావములతో
మూడు
మార్గములందు
ప్రయాణము
సలుపుతూ
వుంటుంది.
ఇది
సత్వ,
రజో,
తమో
గుణములను
పురస్కరించుకొని
భక్తి,
జ్ఞాన,
కర్మముల
తత్త్వాన్ని
తాను
అభివృద్ధి
పరచుకొని
అంతరసంబంధమైన
భావములు
కూడను
తాను
అర్థము
చేసుకొని
ఈ
మూడింటి
యందు
ఉన్న
దైవత్వముతో
సంబంధము
కల్పించుకోవటము
సనాతన
ధర్మము.
అనగా
సత్వ,
రజో,
తమో
గుణములయందు
కూడను
దైవత్వమనే
దానిని
ఆవిర్భవించుకోవటం,
తిరిగి
భూత
భవిష్యత్
కాలములందు
దైవత్వమును
విశ్వసించటము,
ఇంక
మన
జీవితములోపల
కొన్ని
రకములైన
స్థూల,
సూక్ష్మ
కారణ
తత్త్వములందు
కూడను
ఆత్మ
సంబంధమైన
దైవత్వమును
విశ్వసించుకోవటం
ఈ
మూడింటి
యందు
ఏకత్వమైన
విశ్వాసము
ఆత్మ
విశ్వాసముగా
ఉంటుండాలి.
6
▾
Meaning
Keep
అయితే
త్రికాల,
త్రిలోక,
త్రిగుణముల
యొక్క
ఏకత్వమును
నిరూపణ
చేసే
సత్యసూక్తిని
ఈ
సనాతన
ధర్మము
అనే
దానిని
అర్థం
చేసుకోవటం
చాలా
కష్టము.
కనుకనే
కొన్ని
ఈ
అవాంతర
ధర్మములు
ఏర్పడి
దేహసంబంధమైన
ధర్మము,
కుల
సంబంధమైన
ధర్మము,
వ్యక్తి
సంబంధమైన
ధర్మము,
మత
సంబంధమైన
ధర్మము,
సమాజ
సంబంధమైన
ధర్మములు
ఇలాంటి
కొన్ని
అవాంతర
ధర్మములు
కూడను
మనము
అనుసరించటం
చేత
ఈ
సనాతన
ధర్మము
అనే
దానికి
కొంత
అభివృద్ధి
కలిగించినవారము,
కొంత
ప్రోత్సాహము
కలిగించిన
వారము
అవుతాము.
ఇట్టి
దేహధర్మ,
సమాజధర్మ,
కులధర్మ,
మతధర్మములనే
మనము
సక్రమమైన
రీతిలో
అనుసరించకపోయిన,
సనాతన
ధర్మమనే
దానిలోపల
మనము
కొంత
చేరటానికి
అవకాశము
ఉండదు.
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణము.
దేహములో
అనేక
అంగములుంటున్నాయి.
ఈ
అన్నీ
అంగముల
యొక్క
క్షేమము
దేహక్షేమమని
చెప్పటానికి
వీలవుతుంది
గాని,
ఈ
దేహములో
ఏ
అంగమైనా
కొన్ని
రకములైన
బాధలకో
లేక
కష్టములకో
గురియైనప్పుడు
దేహము
అంత
సుక్షేమమని
చెప్పటానికి
వీలులేదు.
పై
చెప్పినట్టి
మతధర్మము,
కులధర్మము,
వ్యక్తిధర్మము,
సమాజధర్మము
ఈ
అన్ని
ధర్మముల
యొక్క
క్షేమము
సనాతన
ధర్మము
యొక్క
దానిని
కొంతవరకు
ప్రకాశింప
చేస్తుంటాయి.
దీనికి
ఒక
చిన్న
కథ
ఉంది.
ఐదు
ఆరుమంది
గుడ్డివారు
ఒక
ఏనుగు
దగ్గరికి
వెళ్లారు.
ఒకడు
వెళ్లి
ఏనుగుపొట్ట
తడుముతూ
చూస్తున్నాడు.
ఆ
పొట్టను
తాను
చక్కగా
తడిమి
చూచిన
తరువాత
ఒకరు
వచ్చి
ప్రశ్నించినప్పుడు
‘అయ్యా!
ఏనుగు
ఎట్లా
ఉంది’
అంటే
గోడవలె
వుంటున్నాదని
అతను
చెప్పాడు.
సరే
మరొక
గుడ్డివాడు
వచ్చి
ఆ
చెవులు
పట్టి
బాగా
తడిమి
చూచాడు.
ఏనుగు
ఎట్లా
వుందని
ఇంకొకరు
ప్రశ్నించినప్పుడు
ఏనుగు
ఒక
చేటవలె,
విసనికఱ్ఱ
వలే
వుంటున్నాదని
వర్ణించాడు.
మరొకడు
తన
కాలును
పట్టి
చక్కగా
తడిమి
చూచాడు.
సరే,
అతనిని
ప్రశ్నించినప్పుడు
ఏనుగు
పెద్ద
స్థంభమువలే
ఉంటున్నాది
అన్నాడు.
మరొకడు
పోయి
తోకపట్టి
చూచాడు.
ఏనుగు
ఎట్లా
ఉంది
అంటే
అది
ఒక
త్రాడువలే
వుంది
అన్నాడు.
అయితే
తాము
పట్టిన
అంగమును
వర్ణించటము,
వారు
చెప్పటం
సరియైనదే.
7
▾
Meaning
Keep
ఈ
అంగములు
అన్ని
చేరినదే
ఏనుగు
కాని
పట్టినటువంటి
అంగము
మాత్రమే
ఏనుగు
కాదు.
ఈనాడు
మన
భారతదేశమునందు
కూడను
ఈ
గుడ్డివారు
ఏనుగును
పట్టి
ఒక్కొక్క
అంగమును
వర్ణించినట్టుగానే
అనేకమంది
అనేక
రకములైన
విశ్వస్వరూపమైన
సనాతన
ధర్మమనే
ఏనుగును
పట్టుకొని
వారు
పట్టుకొన్న
అంగమునే
వర్ణిస్తూ
వెడుతున్నారు.
అనగా
వైదికమతము
వారు
ఒక
భాగము
పట్టుకొని
ఈ
ధర్మము
ఇట్టిది
అని
వారు
వర్ణిస్తున్నారు.
జైనమతము
వారు
ఒక
అంగమును
పట్టుకొని
ఈ
ధర్మము
ఇట్టిదని
వారు
వర్ణిస్తున్నారు.
బౌద్ధ
మతమువారు
ఒక
అంగమును
పట్టుకొని
దాని
ధర్మమును
పట్టుకొని
వారు
వర్ణిస్తున్నారు.
ఇస్లాము
మతమువారు
ఒక
అంగము
పట్టుకొని
దాని
ధర్మము
యిట్టిదని
వర్ణిస్తున్నారు.
క్రైస్తవులంతా
ఒక
అంగమును
పట్టుకొని
వారు
మరొక
ధర్మముగా
వర్ణిస్తుంటారు.
ఈ
క్రిష్టియన్లు
గాని,
ముస్లిములు
గాని,
బౌద్ధులు
గాని,
జైనులుగాని,
పారశీయులుగాని
ఒక్క
సనాతన
ధర్మమనే
స్వరూపమును
పట్టుకొని
ఒక్కొక్క
అంగములను
మాత్రమే
వర్ణిస్తున్నారు
గాని
ఈ
సర్వమతముల
వారు
సంపూర్ణమైన
ఏనుగు
స్వరూపాన్ని
ఎవరూ
చూడలేదు.
అయితే
వారు
చెప్పునది
అసత్యమా
అని
తర్కించనవసరము
లేదు.
వారు
పట్టుకున్న
అంగములు
చక్కగానే
వర్ణిస్తున్నారు
అందులో
ఏ
తప్పు
లేదు.
ధర్మములోని
ఒక్క
భాగమును
మాత్రమే
వారు
వర్ణిస్తున్నారు
గాని
పూర్ణధర్మ
స్వరూపాన్ని
వారు
వర్ణించటం
లేదు.
కనుక
ఇది
సంపూర్ణమైన
ధర్మ
స్వరూపాన్ని
నిరూపించాలనుకున్నప్పుడు
సర్వమతముల
యొక్క
సమన్వయాన్ని
కూడను
మనము
అభివృద్ధిపరచుకోవటానికి
ప్రయత్నం
చేయాలి.
అందరి
యొక్క
భావములను,
అందరి
యొక్క
తలంపులను
నీతి
నిజాయితీలను,
అందరి
యొక్క
నియమ
నిష్ఠలను
మనము
ఏకత్వము
యొక్క
మూటగా
కట్టినప్పుడు
పూర్ణ
ధర్మమనే
రీతిగా
సనాతనధర్మమని
చెప్పటానికి
వీలవుతుంది.
కనుక,
ఒకరి
మతము
ఒకరు
ద్వేషించటానికి
గాని,
తర్కించటానికి
గాని
ఎవ్వరికి
అధికారము
లేదు.
నీయొక్క
ధర్మమును,
నీయొక్క
అంగమును
ఈరీతిగా
తర్కించటానికి
ఏమి
అధికారం
ఉంది.
నీవు
ఒక్క
అంగములోనే
అనుభవము
వుంది
గాని
సర్వాంగముల
యొక్క
అనుభవము
నీకు
లేదు.
అనేకమంది
ఇలాంటి
తెలియనటువంటి
మార్గములో
ప్రవేశించి
ఈ
తర్కములచేత
ఎవరికివారు
జయించాలనే
స్వార్థమును
అలవర్చు
కొని
అహంకారములో
మునగటంచేత
ఈ
మతము
యొక్క
విశిష్టతను
మరుగు
పర్చటానికి
పూనుకుంటున్నారు.
8
▾
Meaning
Keep
ఈ
అన్ని
అంగముల
యొక్క
తత్వము
నీవు
గుర్తించిన
వాడవైనప్పుడు
నీవు
తర్కించటానికి
పూనుకోనే
పూనుకోవు.
అనగా
ఏరీతిగా
సంతృప్తి
పడతావంటే
తాను
పట్టిన
అంగమును
చక్కగా
వర్ణిస్తున్నాడు
అది
రైటే.
ఎవరు
చెప్పినా
కూడను
రైటురైటు
అని
చెప్పటానికి
పూనుకుంటావు
గాని
wrong
అని
చెప్పటానికి
నీవు
పూనుకోవు.
మనము
తర్కమునకు,
వాదమునకు
దిగటానికి
పూర్వము
మన
శక్తిని
మనయొక్క
దీనిని
కొంతవరకు
గుర్తించుకోవటానికి
ప్రయత్నం
చేయాలి.
అట్లు
విచారణ
చేయక
తర్కమునకు
దిగిన
నీవు
పరాభవమునకు
గురికావలసి
వస్తుంది.
నీకు
నిత్యము
తెలిసిన
అనుభూతి
లోపల
ఒక్కదానిని
అందిస్తున్నాను.
పెద్దపెద్ద
పట్టణాలయందు
కొన్ని
మెయిన్‌రోడ్లు
లోపల
పెద్దపెద్ద
సర్కిల్
పెట్టి
వుంటారు.
ఈ
ట్రాఫిక్‌కి
ఇటుపోయేందుకు
keep
left
అని
ఉంటుంది.
నాలుగు
రోడ్లు
చేరుతుంటాయి.
అయితే
నీవు
తూర్పునుండి
బయలుదేరి
వస్తున్నావు.
North,
south,
west
ఈ
మూడు
చూచుకుంటేనే
నీ
ప్రయాణము
సక్రమముగా
జరుగుతుంది
గాని,
తూర్పునుండి
వచ్చేటప్పుడు
ఉత్తరము,
దక్షిణము,
పశ్చిమము
ఈ
మార్గములలో
ఏమైనా
వస్తున్నాయా
అని
గమనించక
నీవు
బయలుదేరితే
accident
అవుతుంది.
కనుక,
ఈ
మూడు
మార్గములు
మనము
గుర్తించినప్పుడే
ఈ
నాల్గవ
మార్గములో
ప్రయాణము
చేసే
మనకు
కొంత
క్షేమము
కలగవచ్చునే
గాని
మిగిలిన
మూడు
మార్గములను
మనము
గుర్తించక
ఆ
మార్గములు
ఖాళీగా
వున్నవా
లేవా
అని
చూడక
కన్నులు
మూసుకొని
బయలుదేరినామంటే
మనకే
ప్రమాదము.
ఈ
ప్రకృతి
అనే
పెద్ద
సర్కిల్‌కు
వేదము,
శాస్త్రము,
ఇతిహాసములు,
పురాణములు
అనే
నాలుగురోడ్లు
ఉంటున్నాయి.
కానీ,
నీవు
పురాణమును
అనే
ఒక
రోడ్డులో
పోతూ
వేదము,
శాస్త్రము,
ఇతిహాసము
ఈ
మూడింటిలో
ఏమున్నదో
నీవు
గమనించకున్న
నీవు
తర్కమును
ఏరీతిగా
సాధించగలవు?
అనేకమందికి
వేదము
తెలుసుగాని
అర్థము
కాదు.
కొంతమందికి
శాస్త్రము
తెలుసుగాని
వేదము
యేమాత్రము
అర్థము
కాదు.
ఇదేవిధముగా
ఇతిహాసము
తెలిసినవారికి
ఇంకొకటి
తెలియకుండాపోవచ్చును.
కాని
అన్నింటికి
ఏకత్వమనే
భావము
భగవత్ప్రీతి
అనేటువంటి
దానికి
అభివృద్ధి
పరచుకున్నామా
ఈ
నాల్గింటి
యందున్న
దైవత్వము
మనకు
సర్వార్థములు
అందిస్తాడు.
అతనిని
మనం
గైడ్‌గా
తీసుకున్నప్పుడు
అతనినే
మన
జీవితమునకు
ఆదర్శప్రాయుడుగా
తీసుకున్నప్పుడు,
అతనినే
మన
జీవిత
రథమునకు
సారధిగా
నియమించుకున్నప్పుడు
మనకు
ఎట్టి
ప్రమాదములు
ఉండవు.
9
▾
Meaning
Keep
అయితే
మన
రక్షణకోరి
మనకు
సక్రమమైన
మార్గము
నందించేవాడు
భగవంతుడు
సర్కిల్
లోపల
పోలీసు
ఉంటుండి
stop,
go
అని
చెబుతుంటాడు
అలాగే,
భగవంతుడు
నాల్గింటికి
మధ్య
తానుండి
నీవు
నిల్చు,
నీవు
యిట్లా
తిరుగు
అని
జీవిత
రథమును
కదిలిస్తూ
వస్తుంటాడు.
అయితే
ఈనాటి
పోలీసులు
ఒకరిని
రమ్మనటము,
ఒకరిని
పొమ్మనటము
ఇద్దరికి
accidents
అవుతాయి.
రెండూ
ఒకే
పర్యాయము
చెబుతారు.
కాని
మన
యొక్క
రక్షకుడైన
భగవంతుడు
ఆరీతిగా
అపాయము
కలిగేటట్టు
గైడ్
చేయడు.
కనుక,
మనము
భగవంతునికి
శరణాగతులైనామంటే
మన
జీవితము
అంతా
కూడను,
చక్కగా
సుఖమయమైన
జీవితము,
ఇహపరము
లందు
కూడను
దివ్యమైన
ఆనందమును
అనుభవించటానికి
ఎట్టి
సందేహము
ఉండదు.
విద్యార్ధులారా!
ఈనాడు
ధర్మము
గురించి
మీకు
కొంతవరకు
అర్ధము
కాక
పోవచ్చును.
ఇంక
మున్ముందు
చిన్న
చిన్న
ఉపమానములతో
చిన్న
చిన్న
అర్ధమయ్యేటువంటి
పదములతో
ఈ
ధర్మము
యొక్క
స్వరూపాన్ని
నిరూపించ
టానికి
నేను
సంకల్పించుకున్నాను.
రేపటిదినము
కూడను
ధర్మము
యొక్క
తత్త్వమును,
ఎందుకనగా
ధర్మము
అనే
పదము
అనేకమందిని
అయోమయస్థితి
యందు
ముంచుతున్నది.
ఇది
భయంకరమైనదిగాదు,
లేక
యింకొకరికి
కొన్ని
రకములైన
కీడును
చేకూర్చేదికాదు.
సర్వులకు
సుఖమును,
ఆనందమును,
భద్రతను
అందించేటువంటి
ధర్మమును
ఇంత
అల్లకల్లోలపడటానికి
ఏమాత్రము
అవకాశము
లేదు.
Previous
←
Dharma Protects Those Who Protect It
Next
Dharma and Its Nature
→