Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · The Oneness of Jīva and Brahman: Life's Supreme Goal
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Oneness of Jīva and Brahman: Life's Supreme Goal
14 June 1973, Summer Course, Brindavan
1
▾
Meaning
Keep
His poems 35
జన్మమున
నిజ
నరులై
జన్మించినవారెందరు
జన్మము
తరువాత
మరల
జన్మించినవారెందరు
జన్మమెత్తి
ధర్మ
కర్మ
శూన్యులైన
వారెందరు
జన్మమంత
తిరిగి
నర
జన్మము
కనుగొనగలేరు
దివ్యాత్మస్వరూపులారా!
మన
భారతీయ
సంస్కృతియందు
మానవత్వమును
ధన్యము
చేసుకొనే
నిమిత్తమై
జన్మసార్థకమనియు
లేక
జన్మము
యొక్క
విమోచనమనియు
మనము
భావించి
అందుకు
తగిన
అనేక
రకములైన
సాధనలు
మనము
సల్పటం,
మన
జన్మము
యొక్క
నివృత్తిని
కొంతవరకు
అర్థము
చేసుకోవటానికి
ప్రయత్నము
చేయటము
భారతీయ
సాంప్రదాయములోనున్న
విషయము
మీకందరికి
తెలిసి
నటువంటిదే.
సాధకుడైన
ప్రతి
భారతీయుడు
జన్మరాహిత్యమును
కోరటం,
ఇది
రాహిత్యము
అన్న
అర్థము
గుర్తించి
తాను
కోరుతున్నాడో
లేక
రాహిత్యము
అనే
దానికి
వేరే
అర్థమును
భావించి
తాను
కోరుతున్నాడో
నాకు
అర్థము
కావటం
లేదు.
అయితే
జన్మరాహిత్యములోనున్న
అర్థాన్ని
మనము
ఈనాడు
తెలుసుకోవలసిన
విషయము.
దైవాత్మచేత
మానవజన్మ
లబించుచున్నదని
సర్వులకు
విదితమే.
దైవ
కారణముచేతనే
జన్మములు
కలగటం
తద్వారా
ఈ
ప్రపంచమునందు
నిత్య
కృత్యములంతా
గడుపుకోవటం,
ఈవిధమైనవి
అన్ని
దైవాత్మ
సంకల్పము
వల్లనే,
దైవకారణం
వల్లనే
జరుగుతున్నవనే
సత్యము
కూడను
వ్యక్తమైన
విషయము.
పరమాత్మ
అంశమే
మానవాత్మగా
రూపొంది
తద్వారా
ఈ
ప్రపంచమందు
తమయొక్క
దివ్యత్వమును
తెలుసుకొనే
నిమిత్తమై
ఈ
మానవాత్మ
అనేక
రకములైన
సాధనలు
సల్పటం,
ఇది
మన
భారతీయులయొక్క
సంప్రదాయము.
దైవ
సంకల్పముచే
ఏర్పడిన
మానవజన్మను
మనము
ఒకవిధమైన
రాహిత్యమును
కోరటంలో
దైవసంకల్పమును
మనము
నిరాకరించినవారమే
అవుతున్నాము
గాని,
దైవసంకల్పమును
మనము
చక్కగా
అనుసరించిన
వారము
కావటం
లేదు.
దైవము
యొక్క
సృష్టిని
నిరాకరించి,
దైవము
యొక్క
సంకల్పమైన
ప్రకృతిని
దూరము
చేసుకొని
జన్మరాహిత్యము
కోరుకోవటంలో
అర్థమేమిటో
బోధపడటం
లేదు.
2
▾
Meaning
Keep
దైవసంకల్పమునే
నిరాకరించి
తాను
ఈ
జగత్తులో
చేసే
పనియేమిటో
అర్థం
కావటం
లేదు.
కనుక,
మనము
రాహిత్యమును
కోరుకోటంలో
సంకల్పమును
నిరాకరించిన
వారమైపోతున్నాము.
రాహిత్యమును
కోరుకోవటం
అర్థరహితమైన
విషయము.
మనము
ఐక్యతను
కోరటం
సత్యమైన
మార్గము.
సంసారో
భేద
దర్శనం,
జ్ఞానం
అద్వైతదర్శనం
అన్నారు.
ఈ
అద్వైత
దర్శనం,
భేదదర్శనం
ఈ
రెండింటిలోనున్నటువంటి
వ్యత్యాసమే
ఈ
పరమాత్మకు,
మానవాత్మకు
ఉన్న
వ్యత్యాసము.
అద్వైత
దర్శనమైన
జ్ఞానమునకు
మనము
అనేక
రకములైన
విచారములు
సల్పి,
అనేక
రకములైన
సాధనలు
సల్పి,
కొన్ని
రకములైన
వేద
శాస్త్ర
ప్రమాణములను
గుర్తించి
తద్వారా
ఈ
అద్వైత
దర్శనమును
మనం
పొందటానికి
వీలవుతుంది.
సామాన్యమైన
జ్ఞానమును
ఈ
లోకములో
అనుభవిస్తూ
వస్తున్నాం.
నానాత్వములో
ఏకత్వమును
దర్శించి
అందులోనున్న
దివ్యత్వమైన
తత్త్వాన్ని
మనం
గుర్తించి
భేదరహితమైన
ఆత్మయే
జ్ఞాన
స్వరూపునిగా
విశ్వసించి
అట్టి
భావములతో
జీవితమును
గడుపుకోవటము,
ఇది
సాత్వికమైన
జ్ఞానము
అని
చెప్పబడుతుంది.
అయితే,
రాజసికము
అనే
దానియందు
కేవలము
నీది,
నాది,
అతను,
ఇతను,
వృక్షము,
మట్టి,
జంతువు
ఇత్యాది
రూపభేదములను
కల్పించుకొని
సుఖము
దుఃఖము
అను
ద్వందములు
తన
మనస్సున
ఇమిడ్చి
ద్వందభావము
చేత
తన
జీవితమును
అర్థము
చేసుకోవటానికి
ప్రయత్నం
చేసుకోటం
రాజసిక
జ్ఞానమని
చెప్పవచ్చు.
రూపనామములందు
మాత్రమే
తనయొక్క
దృష్టిని
ఇమిడ్చి,
జ్ఞానమును
ఏకత్వమైన
భావమునందు
విశ్వసించక,
రూపనామములు
మారునట్లుగా
జ్ఞానము
కూడా
మారుతుందనే
అజ్ఞానస్థితిలోపల
తాను
ప్రవేశింప
చేసుకోవటం,
దీనిని
కూడా
రాజసికమని
చెప్పవచ్చు.
ఇంక,
తామసికమంటే,
ఇది
పూర్తి
విరుద్ధమైన
స్థితిలో
ఉంటుంది.
ఏకత్వమును
నమ్మక
నానాత్వమందే
తన
లక్ష్యమును
ఇమిడ్చి,
ఇమిడ్చటమే
కాకుండా
తాను
జ్ఞానశూన్యుడైపోయి,
కేవలము
తామసిక
భావముతో
ఏకత్వమును
ఏమాత్రము
విచారించని
పరిస్థితిలోపల
తన
జీవితమును
ప్రవేశింపజేసుకుంటాడు.
ఇది
పూర్తి
తామసికమనే
చెప్పవచ్చును.
కరచరణ
అవయవములయొక్క
విశిష్టతను
పురస్కరించుకొని
శిధిలమయ్యే
దేహమే
తానని
భావించుకొని
తద్వారా
తనయొక్క
జీవితము
ఈ
ప్రపంచమునందు
గడుపుటకు
ప్రయత్నించటము,
ఇది
సామాన్యమైన
మానవులయొక్క
లక్షణము.
నిజముగా
విచారించిన
దేహము
తాను
ఏనాటికి
కానేరడు.
తనది
కాని
ఈ
దేహమును
తానేయని
భ్రమించి,
తద్వారా
అనేక
రకములైన
సంబంధములు
కల్పించుకొని
ఆ
సంబంధముల
ద్వారా
కొన్ని
రకములైన
బంధములకు
తాను
గురియైపోతున్నాడు.
3
▾
Meaning
Keep
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణము.
20
సం॥ల
యువకుడు
60
సం॥ల
తల్లితో
అనేక
రకములుగా
తల్లిప్రేమను
అనుభవించి,
20
సం॥లు
ఆ
దేహమునే
తల్లి
తల్లి
అని
ప్రేమతో
గౌరవించుచూ
కాలము
గడుపుతూ
వచ్చాడు.
నిజముగా
ఈ
విషయాన్ని
మనము
చక్కగా
విచారణ
చేసినప్పుడు
ఈ
20సం॥ల
కల్గిన
కుమారుడు
60సం॥ల
తల్లికి
ఎట్టి
సంబంధమనగా
కేవలము
దేహసంబంధమేగానీ
ఇంకేవిధమైన
సంబంధము
అందులో
మనకు
కనిపించదు.
కాలకర్మణ
కారణవశాత్తు
తల్లిచనిపోయింది.
కాని,
ఆ
దేహమును
తాను
ముందు
ఉంచుకొని
20సం॥ల
కుమారుడు,
‘తల్లీ!
నన్ను
ఏకాకిగా
చేసి
వెడితివా!
నాకు
ఎవరు
దిక్కు
నన్ను
ఎవరు
చూచుకుంటారు’
అని
అనేక
రకములుగా
ఈ
పిల్లవాడు
బాధపడటం
సహజం.
‘నన్ను
వీడివెళ్లితివా?’
అని
ప్రశ్నించే
ప్రశ్నలో
మనము
చక్కగా
విచారణ
సల్పాలి.
అయితే,
ఈ
పిల్ల
వానిని
విడచి
దేహము
పోయినదా,
లేక
ప్రాణము
పోయినదా?
దేహము
ముందే
పెట్టుకున్నాడు.
దేహమే
తల్లి
అయితే
‘నన్ను
వదలిపోతివా’
అని
చెప్పటంలో
అర్థము
లేదు.
కనుక
వదలినది
ఎవరో
ఆ
యొక్క
పదార్థమే
నిజమైన
తల్లిగాని
ఉన్నటువంటి
పదార్ధము
కాదని
స్పష్టమవుతుంది.
ఏది
తనను
వదలిపోయినదో,
అది
వుండినంతవరకు
తాను
తల్లిగా
అనుభవిస్తూ
వచ్చాడు.
ఏది
వదలిపోయినదో
అది
ఈ
దేహమును
వదలిపోయిన
తరువాత
తల్లి
లేదు
అని
వీడు
అనుకుంటున్నాడు
కాని
వచ్చినటువంటిది,
పోయినటువంటిది
ఏది
అనగా
ప్రాణమే.
కనుక
ఆ
ప్రాణమనే
తల్లి
ఈ
దేహములో
వున్నంతవరకు
ఈ
దేహము
అనే
ఆకారమును
అతి
శ్రద్ధగా
భక్తిగా
గౌరవముగా
అనుభవిస్తూ
వచ్చాడు.
ఏ
నిజమైన
ప్రాణము
అది
ఈ
దేహమును
వదలిపోయెనో
అప్పుడు
ఈ
దేహమును
ఏమాత్రము
లక్ష్యము
చేయటం
లేదు.
లక్ష్యము
పెట్టినది
ఎవరిపైన,
ప్రాణము
పైననే
లక్ష్యము
పెట్టటం,
దేహము
పైన
కాదు.
ప్రాణముంటే
ఈ
దేహమునకు
లక్ష్యము,
ప్రాణము
లేకపోతే
ఇది
అలక్ష్యము.
లక్ష్యము,
అలక్ష్యమునకు
మూల
కారణము
ప్రాణమే
గాని
దేహము
కాదని
స్పష్టమవుతుంది.
కనుక,
ఈ
బాహ్యమైన
దేహముతో
సంబంధము
కల్పించుకొని
తద్వారా
అనేక
రకములైన
బంధనలకు
గురికావటమే
కాకుండా
దీనియొక్క
బంధములచేత
మన
జీవితమునే
అర్థము
చేసుకోలేని
రీతిగా
వ్యర్ధపరచుకుంటూ
వస్తున్నాము.
నిన్నటిదినము
చెప్పినట్లుగా
ఇది
నా
దేహము,
ఇది
నా
ఇల్లు,
ఇది
నా
ఇల్లాలు,
ఇది
నా
తల్లి
అని
చెప్పటమంతాకూడను
తాను
లోపలనుండి
చెబుతున్నాడేగాని
దేహము
ఇట్టి
సంబంధాన్ని
కల్పించుకొని
చెప్పటం
లేదు.
కనుక,
తానెవ్వడో
ప్రత్యేకించి,
ఈ
అన్నింటికి
దూరమై
తాను
విలక్షుణుడై
సాక్షి
భూతుడుగా
కనిపిస్తున్నాడు.
ఇట్టి
సత్య
స్వరూపాన్ని
మనము
గుర్తించటము
అత్యవసరము.
దానిని
గుర్తించుకున్న
తరువాత
ఈ
కాయముతో
ఈ
కాలమును
మనము
లోకమునందు
చేయవలసిన
కర్తవ్య
కర్మలను
ఆచరించినప్పటికిని
ఎట్టి
దోషములు
కూడను
మనయొక్క
ఆత్మకు
అంటుకోని
పరిస్థితిని
మనం
అందుకుంటాం.
4
▾
Meaning
Keep
అయితే
మన
వృత్తులన్నియు
కేవలము
స్థూలరూపమునకు
సంబంధించి
వుంటుంటాయి.
ఈ
స్థూలరూపము
చేత
అనేక
సత్కర్మలు
ఆచరించవలసియున్నది.
దీనినే
ఒక
విధమైన
జీవప్రజ్ఞ
అని
చెప్పవచ్చును.
ఇది
స్థూల
రూపమైన
వృత్తి.
ఇంక
సూక్ష్మరూపమైన
గుణముల
యొక్క
తత్త్వము,
దీనినే
ఈశ్వరప్రజ్ఞ
అని
కూడ
చెప్పవచ్చు.
అనగా
ఈ
గుణములలో
అనేకరకములైనవంతా
మనలో
చెలరేగి
మనయొక్క
హృదయ
స్థానమునుండి
ఉద్భవించి
కడకు
స్థూలమైన
దేహమును
బంధించటానికి
పూనుకుంటాయి
ఈ
గుణములు.
ఈ
గుణములను
పవిత్రమైన
గుణములుగా
మనము
తీర్చి
దిద్దుకున్నప్పుడు
మనము
బంధరహితులమై
స్వాతంత్రులమనే
ఆనందాన్ని
అందుకుంటాము.
ఈ
గుణములు
కొంత
వక్రమమైన
మార్గము
నడిపినప్పుడు
ఇవే
కొన్ని
రకములైన
బంధనలకు
కారణమై
మన
జీవితము
అయోమయస్థితిలోపల
అవస్థలపాలైపోతుంది.
మనకు
దుర్గుణములు
తాత్కాలికముగా
సుఖమును,
ఆనందమును
అందించినట్లుగా
తోస్తుంది
గాని
భవిష్యత్తులో
మహా
అపకారి,
మహా
ప్రమాదములను
కూడా
అందించటానికి
పూనుకుంటాయి.
అవి
మిత్రులుగా
వచ్చి
చేరి
శత్రువులుగా
తయారైపోతాయి.
అవే
మనకు
దొరలుగా
కనిపించి
దొంగలుగా
మారుతాయి.
కనుక
ఇట్టి
దుర్గుణములను
మన
హృదయస్థానమును
చేరకుండా
చూచుకోవటానికి
ఈ
వయస్సులోపల
తగినటువంటి
ప్రయత్నము
సలపాలి.
ఈ
సద్గుణములకు,
దుర్గుణములకు
సంగము
కూడా
కొంత
తోడ్పడుతుంది.
ఎట్టి
వారితో
చేరినప్పుడు
అట్టివారి
ప్రవర్తనలే
మనలో
అలవడుతుంటాయి.
ఒక
చిన్న
ఉదాహరణము.
ఏదైనా
ఒక
అడవిలో
ఒక
కఱ్ఱకు
నిప్పు
అంటుకున్నప్పుడు
ఆ
కఱ్ఱ
తాను
కాలిపోవటమే
కాకుండా
తన
చుట్టుముట్టు
వున్న
కఱ్ఱలనుగాని,
వృక్షములనుగాని
భస్మము
చేసే
వరకు
అది
మానుకోదు.
దుర్గుణము
నిప్పుతో
సమానము.
“కాననంబున
రేగిన
కారు
చిచ్చు,
వేములను
గాల్చి
మామిళ్ల
విడిచి
చనునా”
అన్నారు.
అదేవిధముగా
ఈ
దుర్మార్గులు
చెంతచేరినప్పుడు
తమకు
తాము
పాడైపోవటమే
కాకుండా
చుట్టూ
మూగినవారిని,
తన
బంధువులను,
తన
మిత్రులను
కొన్ని
రకములైన
అపకీర్తుల
పాలు,
కష్టములపాలు,
దుఃఖములపాలు
చేయటానికి
పూనుకుంటారు.
ఇంక
సత్సంగమనగా
తమకు
తాము
త్యాగము
చేయటమే
కాకుండా
సర్వులకు
పవిత్రమైన
వాటిని
అందించటానికి
పునుకుంటారు.
వారు
ఊదివత్తి
వంటివారు.
ఊది
వత్తి
తాను
కాలుతూ,
కాలుతూ
తాము
నాశనమైనప్పటికి,
చుట్టూ
చేరిన
వారికి,
దూరమునున్నవారికి
పవిత్రమైన
సుగంధమునందించి
హాయిని
కల్గిస్తుంది.
5
▾
Meaning
Keep
పరోపకార
తత్త్వమునందు,
పవిత్రమైన
భావములందు
ఇతరుల
యొక్క
ఆనందమును
గోరి
మనము
దేశముయొక్క
సౌభాగ్యమును,
లోక
కళ్యాణమును
ఆశించి
“సమస్త
లోకాః
సుఖినోభవంతు”
అనే
పవిత్రభావములో
సాధన
సల్పేవాడే
దిన
దినము
అభివృద్ది
నొందువాడు.
ఇట్టి
పవిత్రమైన
గుణములు
కల్గినవానిని
గోడకట్టువానితో
పొల్చవచ్చు.
అతను
దిన
దినమునకు
గోడను
కట్టుకొంటూ
పైకి
ఎక్కుతుంటాడు
గాని
క్రిందకు
దిగడు.
ఇతరుల
చెడ్డకోరువారు,
ఇతరుల
మంచిని
చూచి
ఓర్వలేనివారు
ఇతరులకు
కీడు
సల్పటానికి
ప్రయత్నము
సల్పువారు
బావిని
తవ్వేవారు.
ఈ
బావి
దినదినమునకు
లోపలకు
పోతుందిగాని
పైకిరాదు.
గోడ
కట్టేవాడు
దినదినమునకు
పైకి
పోతుంటాడు
గాని
క్రిందకు
రాడు.
కనుక
మనము
ఈనాడు
గోడను
కట్టేవాడుగా
తయారుకావాలిగాని
బావిని
త్రవ్వేవాడుగా
తయారుకాకూడదు.
ఇందులో
యావత్ప్రపంచమునకు
కళ్యాణము
నందించేటువంటి
ఏకాత్మ
స్వరూపమును
చక్కగా
గుర్తించి
అట్టి
ఆత్మయే
నీవు
నేను
అని
స్మరించిన
వ్యక్తి
మహాజ్ఞాని
కాగలడు.
ఇంక
ఇట్టి
జ్ఞాని
సతతం
అనగా
సర్వకాలములయందు
ఏకధారగా
దైవ
చింతనయే
తాను
సల్పుతుంటాడు
గాని
అన్య
చింత
తాను
సల్పటానికి
పూనుకోడు.
ఏ
కార్యము
చేసినా
లేక
ప్రపంచ
వృత్తులు
సల్పినప్పటికినీ
దైవకార్యముగానే
విశ్వసించి
ఆ
కార్యమునందు
కాలిడుతాడుగాని
అన్య
కార్యములుగా
తాను
భావించటానికి
పూనుకోడు.
దీనికి
రాధాభక్తి
సరియైన
ఆదర్శముగా
కనిపిస్తుంది.
అయితే
రాధాభక్తిని
అనేక
రకములైన
అపోహలతో
దీనిని
భారతీయులు
అనుభవించటానికి
ప్రయత్నం
సలిపారు.
కాని
ఇట్టి
అపోహలకుగాని,
ఇట్టి
అపకీర్తులకుగాని
రాధతత్త్వాన్ని
వినియోగించుకోవటంలో
యేమాత్రం
అర్ధం
లేదు.
రాధ
అనగా
ఒక
స్త్రీ
అనిగాని,
ఆమె
యొక్క
పవిత్రమైన
తత్త్వము
ఒక
ప్రేమ
మార్గమందు
ప్రవహించినదని
గాని
మనము
భావించుకోవటం
పొరపాటు.
భగవత్
దృష్టియందు
స్త్రీ
పురుష
భేదములకు
ఏమాత్రము
స్థానము
లేదు.
అందువలనే
నారదుడు
కూడను,
స్త్రీ
పురుషుడు
అనేటువంటిది
కాకుండా
కేవలము
జీవతత్త్వాన్ని
మాత్రమే
తాను
వర్ణిస్తూ
వచ్చాడు.
ఈ
భేదభావములు
దేహమునకు
మాత్రమే
సంబంధించినవి
గాని
ఈ
జీవతత్త్వమునందు,
ఆత్మ
ప్రజ్ఞయందు
ఇట్టి
భేదములకు
ఏమాత్రము
స్థానముండదు.
ఆత్మవరకు
గాని,
జీవమువరకు
గాని
మనం
పోనక్కరలేదు.
నిత్య
జీవితములోపల
ఆకలిదప్పులు,
కోపము,
దుఃఖము
ఇత్యాది
గుణములు
వారు
అనుభవిస్తున్నారు.
వీరూ
అనుభవిస్తున్నారు.
ఈ
విషయములందు
ఇరువురికి
ఎట్టి
వ్యత్యాసములు
కనిపించటం
లేదు.
అయితే
ఆడవారు
భరించుకొనలేక
తక్షణమే
కంటినీరు
కార్చవచ్చు.
కాని
మగవారు
భరించుకొని
లోలోపల
ఏడ్వవచ్చు
గాని
దుఃఖము
లేకుండా
పోలేదు.
6
▾
Meaning
Keep
మన
ప్రవర్తనలు
కొంత
ప్రదర్శనలు,
నిదర్శనలుగా
కనిపించవచ్చునే
గాని
ఉన్నటువంటి
తత్త్వములోపల
యదార్థము
ఇరువురి
లోపల
ఒక్కటిగానే
ఉంటున్నది.
అదేవిధముగా
ఈ
రాధా
భక్తియందు
ఒక
పవిత్రమైన
విశిష్టతను
గుర్తించటానికి
మనం
పూనుకోవాలిగాని
ఆమె
యొక్క
తత్త్వమును
అపార్థములో
వినియోగించుకొని
ఆమె
మార్గమును
మనము
దూషించటానికి
పూనుకోవటం
చాలా
పాపం.
ఇది
సర్వార్పితమైన
చిత్తముతో
కేవలము
కృష్ణునియొక్క
హృదయమునందు
హత్తుకొనిపోయి
ఉన్మత్తురాలుగా
అయిపోయి
తాను
పవిత్రమైన
జీవితమును
అందులో
అంకిత
పరచుకుంది.
ఇట్టి
అర్పితమైన
చిత్తములు
ఆడవారు
కావచ్చు,
మగవారు
కావచ్చు
ఎవరైనప్పటికి
రాధా
అన్న
పేరు
ధరకు
సంబంధించినదే
గాని
ఒక
వ్యక్తికి
సంబంధించినది
కాదు.
అందులో,
ధర్మార్థయొక్క
స్వరూపమే
రాధ
యొక్క
ఆకారము.
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణ.
మనం
తెలుగులో
చెప్పినా,
ఇంగ్లీషులో
చెప్పినా
ఏ
భాష
యందైనా
కొన్ని
శబ్దములు
కూడి
వస్తుంటాయి.
రాధ
అనే
పదమునకు
నాలుగు
అక్షరములు
మనం
తీసుకుందాం.
RADA
రాధ
అయింది.
R
నుండి
ప్రారంభమై
నప్పుడు
“రాధ”గా
అర్థమవుతుంది.
A
నుండి
ప్రారంభమైనప్పుడు
“ఆధార్”
అయిపోతుంది.
D
నుంచి
ప్రారంభమై
“ధర”
అవుతుంది.
ఇంకొక
A
నుండి
ప్రారంభమైన
“ఆరాధ్”
అయిపోతుంది.
కనుక
రాధకు
ఆధారము
ధార
ఆరాధనే.
ధార
ఆరాధనే
రాధ
యొక్క
ఆధారము
అన్నారు.
“సర్వదా
సర్వకాలేషు
సర్వత్ర
హరి
చింతనం”
సర్వ
ప్రదేశములందు,
సర్వకాలములందు
తాను
నిరంతరము
ఆరాధన
సల్పటమే
రాధ
యొక్క
లక్షణము
అని.
కనుక,
ఇట్టి
ప్రయత్నానికి
ఎవరు
పూనుకుంటారో
వారు
అందరు
రాధ
యొక్క
తత్త్వమునకు
చెందినవారే.
అయితే
అట్టి
పవిత్రమైన
స్థితిని
మనం
పొందటానికి
స్థూలమైన
దేహముతో,
సూక్ష్మమైన
మనస్సుతో,
కారణమైన
చిత్తముతో
మనము
అనేక
రకములైన
సత్కర్మలలో,
సత్ప్రవర్తనలో,
సదాలోచనలో,
సచ్చింతనలో,
సత్సంగములో
దీనిని
కలిపి
కూర్చి
తీర్చి
పవిత్రమొనర్చటానికి
తగిన
ప్రయత్నం
చేయాలి.
దీనిని
ఒక
చిన్న
ఉదాహరణ.
ఇప్పుడు
అక్కడ
ఒక
clock
ఉంది.
అందులో
మూడు
ముల్లులు
తిరుగుతున్నాయి.
అందులో
ఒకటి
సెకండు
అని,
రెండవది
నిముషము,
మూడవది
గంటలు
అని.
అయితే
సెకండ్ల
ముల్లు
వేగంగా
తిరుగుతుంది.
ఈ
సెకండ్ల
ముల్లు
ఎంత
వడిగా
తిరిగినప్పటికి
నిముషముల
ముల్లు
ఒక్కస్థానానికి
మాత్రమే
వెడుతుంది.
సెకండ్ల
ముండ్లు
60
ఇండ్లు
తిరిగివచ్చినపుడు
ఈ
నిముషముల
ముల్లు
ఒక
ఇల్లు
మాత్రమే
తిరుగుతుంది.
అయితే
నిముషముల
ముల్లు
60
ఇండ్లు
తిరిగినప్పుడు
గంటల
ముల్లు
ఒక్క
ఇల్లు
మాత్రమే
చేరుతుంది.
అయితే
సెకండ్ల
ముల్లు,
నిముషముల
ముల్లు
తిరగటం
కనిపిస్తున్నాది
గాని
ఈ
గంటల
ముల్లు
తిరగటం
మనకు
ఏమాత్రం
కనిపించటం
లేదు.
7
▾
Meaning
Keep
అయితే
ఏది
కనిపించటం
లేదో,
ఏది
కదిలినట్టుగా
మనకు
గోచరించటం
లేదో
దానిని
ఆధారము
చేసుకునే
ఈ
సెకండ్ల
ముండ్లు,
నిముషముల
ముల్లు
అవసరమైంది
గాని,
ఈ
గంటల
ముల్లే
లేకపోతే
నిముషముల
ముల్లు,
సెకండ్లముల్లు,
మనకు
అనవసరం.
అదేవిధముగా
మన
స్థూలదేహము
అనేక
కర్మలంతా
చేస్తున్నాది.
ఇది
సెకండ్ల
ముల్లు
వంటిది.
ఇది
అనేకరకములైన
పవిత్ర
కర్మలు
చేసినప్పుడే
ఈ
సూక్ష్మరూపమైన
మనస్సు
ఒక
పవిత్రతకు
చెందుతుంది.
ఈ
సూక్ష్మమైన
మనస్సు
అనేక
పవిత్ర
చింతనలు
చేసినప్పుడే
కారణదేహమనే
ఆత్మస్థితిని
పొందిపోతుంది.
స్థూలమైన
దేహము,
సూక్ష్మమైన
మనస్సు
కారణ
దేహ
నిమిత్తమై
ఏర్పడినటువంటివే
గాని,
కారణ
దేహమే
లేక
ఈ
స్థూల
సూక్ష్మము
మనకు
నిరుపయోగమే.
కనుక
మనము
ఈ
కారణమును
లక్ష్యము
నందుంచుకొని
స్థూల
సూక్ష్మములను
పవిత్రమైన
మార్గమునందు
ప్రవేశింపజేసినప్పుడు
మనము
కారణస్థానమైన
ఆత్మ
స్థానమును
సులభంగా
అందుకోవటానికి
అవకాశము
ఉంటుంది.
ఇది
తన
ప్రతి
బింబములో
లీనము
కావటము
అనేది
రాహిత్యము
అని
చెప్పటానికి
వీలు
కాదు.
ఎక్కడ
నుంచి
వచ్చినదో
అక్కడికి
పోయి
చేరటము,
అది
కేవలము
లీనము
అని
చెప్పవచ్చును
గాని
సార్ధకమనిగాని,
రాహిత్యమనిగాని
చెప్పటానికి
వీలుకాదు.
దీనికి
మరొక
చిన్న
ఉదాహరణము.
శాస్త్రజ్ఞానం
కంటే
అనుభవ
జ్ఞానం
అత్యవసరము
ఇప్పుడు
సముద్రము
చాలా
విశాలమైనదిగా
మనకు
తెలుసు.
అయితే
మరొకవైపున
చెరువులో
నీరు
నిండుగా
కనిపిస్తుంటుంది.
ఇంకొకవైపున
పెద్ద
ప్రవాహముగా
అయోమయస్తితిలో
కనిపిస్తుంది.
ఇంక
మన
ఇంటిలోపల
కొన్ని
ట్యాప్స్‌లో
నీరు
కనిపిస్తుంది.
బావిలో
నీరు
కనిపిస్తుంది.
ఈ
అన్ని
నీళ్లకి
ఆధారము
ఏమంటే
ఆ
సముద్రమే.
అయితే
సముద్రపు
నీరు
ఈ
ట్యాంకులకు,
ప్రవాహము
లకు
ఏ
రీతిగా
వస్తున్నాది
అని
విచారణ
చేసినప్పుడు
అదే
సరైన
ఆదర్శమును
నిరూపిస్తుంది.
ఈ
సముద్రముపైన
సూర్యరశ్మిపడి
తద్వారా
అవి
ఆవిరిగా
మార్చుకొని
మేఘములుగా
రూపొంది
తదుపరి
వర్షముగా
కురిసి,
వంకలుగా
బయలుదేరి,
ప్రవాహముగా
వచ్చి
చేరువులలో
చేరిపోతున్నాయి.
కనుక,
ఈ
ప్రవాహములు
చాలా
గొప్పగా
ప్రవహించి
తిరిగి
సముద్రములోనే
లీనమై
పోతున్నాయి.
దీనిని
పురస్కరించుకొని
ఈ
సాగరమే
అనుగ్రహము.
ఈ
అనుగ్రహమనే
సముద్రముపైన
మన
బుద్ధి
కిరణములనే
సూర్య
కిరణములు
చేర్చటంచే
అవి
ఒకవిధమైన
భావము
అనే
ఒక
రూపముతో
ఆవిరిగా
మారుతున్నాది.
8
▾
Meaning
Keep
ఆ
ఆవిరియే
సత్యము
అని
మేఘములుగా
తయారైపోతున్నాయి.
ఈ
సత్యమనే
మేఘములనుండి
ప్రేమ
అనే
బిందువులుగా
వర్షిస్తున్నాయి.
ఈ
ప్రేమ
బిందువులు
ఒకదానికొకటి
చేరి
ఆనందమనే
ప్రవాహముగా
ప్రవహిస్తున్నది.
ఈ
ఆనందమనే
ప్రవాహమునకు
ప్రేమ
బిందువులే
ఆధారము.
ఈ
ప్రేమ
బిందువులకు
ఆధారము
సత్యమనే
మేఘములే.
ఈ
సత్యము
అనే
మేఘములకు
మన
బుద్ది
యొక్క
ఆకర్షణ
అనే
భావమే
దీనికి
ఆవిరి.
ఈ
ఆవిరికి
ఆధారము
సముద్రమే;
అనుగ్రహమనే
సముద్రము
నుండి
ఈరకంగా
బయలుదేరి
ఆనంద
రూపంలొ
తిరిగి
సముద్రములో
లీనమై
పోతున్నాది.
అయితే,
సముద్రపు
నీరు
ఉప్పగా
ఉంటుంది.
నది
నీరు
తీయగా
ఉంటున్నది.
ఈ
భేదము
ఎక్కడ
వచ్చినది.
ఈ
సముద్రము
నీరు
మనము
తెచ్చుకుని
త్రాగినప్పుడు
ఉప్పగా
ఉంటుంది.
దీనినే
శాస్త్రజ్ఞానము
అన్నారు.
కాని,
నది
రూపముగా
వచ్చి
రూపమును,
రుచిని
మార్చుకొని
జీవులకు
ఆనందము
నందించే
స్థితినే
అనుభవజ్ఞానము
అన్నారు.
కనుక,
శాస్త్రజ్ఞానము
కంటె
అనుభవజ్ఞానము
అత్యవసరము.
ఈ
శాస్త్ర
జ్ఞానమును
మనము
అనుభవములోనికి
మార్చుకొని
మన
నిత్య
జీవితములో
కొంతవరకు
ఆచరించి
అనుష్టానపరచి
తద్వారా
మన
హృదయస్థానమునకు
చేర్చుకోవటం
చేత
ఆనందము
అనే
రీతిగా
మనకు
రూపొందుతుంది.
ఈ
bookish
knowledge
మనకు
allergyగా
మారిపోతుంది.
కాని
అనుభవ
జ్ఞానము
energyగా
మారిపోతుంది.
ఈనాడు
ఆచరణ
లేకపోవటంచేతనే
యువకులైన
మీలో
ఎక్కువ
allergy
యే
వుంటున్నాది
గాని
energy
లేదు.
నిజముగా
గుండును
కొడితే
గుండైనా
పగిలిపోవాలి
గాని
నీకు
దెబ్బ
తగలకూడదు.
అటువంటి
కఠినమైన
స్థితి
ఈ
వయస్సులో
వుండేది.
అలాంటి
స్థితికి,
మీరు
ఎంత
బలహీనులుగా
వుంటున్నారనేది
చెప్పటానికి
వీలు
కాదు.
ఈ
బలహీనతకు
కూడను
ఒక
ఆదర్శమునందిస్తున్నాను.
ఇంద్రియనిగ్రహం
లేని
బలం
పశుబలంతో
సమానం
మంచి
బలవంతుడుగా
కనిపిస్తుంటాడు
మనిషి.
కాని,
అతని
ముక్కుపైన
ఒక
చిన్న
దోమ
వాలెనా
ఒక్కతూరి
అట్లా
అంటాడు.
రెండవ
తూరి
తిరిగి
వచ్చి
వాలెనా
రెండవసారి
చాలా
గట్టిగా
అంటాడు.
మూడవతూరి
ఇంక
fight
చేస్తాడు.
ముక్కు
పైన
చిన్న
దోమ
వాలేటప్పటికి
సహించుకోలేని
బలహీనుడుగా
తయారై
పోతున్నాడు
ఈనాటి
యువకుడు.
ఇట్టి
మన
దేహబలములుగాని,
ఇట్టి
మన
ఇంద్రియ
బలములుగాని,
నిజ
బలములు
కానేరవు.
మనోబలమే
ప్రధానమైన
బలము.
మనోబలమును
పెంచుకోవటానికి
దైవబలము
అత్యవసరం.
9
▾
Meaning
Keep
మీకు
King
Kong
విషయం
తెలిసే
ఉంటుంది.
అతను
ఒక్క
చేతితో
స్పీడుగా
వస్తున్న
కారుని
నిలబెట్టే
శక్తి
గలవాడు.
కాని,
కట్టకడపటికి
ఆ
కింగ్‌కాంగ్
మరణము
ఎక్కడ
ఏర్పడినదంటే
car
కిందనే
పడి
చచ్చిపోయాడు.
Car
accident
లో
పోయాడు.
కాని,
కారును
నిలబెట్టుకోగలిగాడే
గాని,
కారు
క్రింద
పడి
ప్రాణము
నిలబెట్టు
కోలేకపోయాడు.
కింగ్కాంగ్దే
ఇంకొక
ఉదాహరణము.
అతను
నిత్యము
అనేకరకములైన
పదార్థములు
భుజించి
దినమునకు
20
నుండి
25
గ్రుడ్లు
తినేవాడట.
తెల్లవారి
తాను
రోడ్డు
లోపల
exercise
చేసుకోవటానికి
పరుగెత్తే
వాడు.
అతని
పేరు
ఎరుగని
భారతీయుడు
ఉండడు.
కింగ్‌కాంగ్
మహా
బలవంతుడని
అందరు
అనుకొన్నవారు.
ఒకనాడు
తాను
రోడ్డులో
పరుగెత్తుతూ
పోతున్నపుడు
ఆనాడే
పాలమ్మే
ఆమె
తన
తలపైన
పాలబుట్ట
పెట్టుకుని
ఒక
పల్లెకు
వెడుతున్నాది.
అప్పుడు
ఇతని
రూపము
కనిపించింది.
బనీను
వేసుకోలేదు
కనుక
దేహము
పేడ
ముద్దలు
వేసినట్లుగా
ముద్దలు
ముద్దలుగా
కనిపించింది.
ఈ
రూపమును
చూచి
నవ్వును
ఆపుకోలేక
గట్టిగా
నవ్వింది.
ఆమె
నవ్వేటప్పటికి
కింగ్కాంగ్కి
కోపం
వచ్చింది.
కోపం
వచ్చి
ఆమెను
అనేకరకములుగా
చీవాట్లు
పెడుతూ
వచ్చాడు.
అప్పుడు
ఆమె
చెప్పిందట
‘అయ్యో!
కింగ్‌కాంగ్
ఎంతో
బలవంతుడనుకున్నాను,
ఒక్క
ఆడదాని
నవ్వును
భరించుకోలేని
బలహీనుడై
పోయినావే
అనిందట.
కనుక,
మన
బలము
ఎక్కడ
కనిపిస్తుందంటే
ఇలాంటి
వాటిలో
కనిపిస్తుంటాది.
ఇంద్రియ
నిగ్రహము
లేని
బలములు
కేవలము
పశుబలములే
గాని
నిజ
బలములు
కావు.
కనుక,
ఈనాడు
దేహమును
పెంచుకోవటానికి
ప్రయత్నము
చేయకుండా
మనస్సు
యొక్క
ఏకత్వమును
పెంచుకునే
ప్రయత్నానికి
మనం
పూనుకోవాలి.
అది
ఈనాడు
అత్యవసరం.
ఏ
కించిత్
విషయాలకు
మనం
ఉద్రేక
పడటమో
లేక
కొన్ని
రకములుగా
అరాచక
పర్చటమో
ఇలాంటి
వాటికి
పూనుకో
కూడదు.
అలాంటి
విషయాలకు
పూనుకోవటం
మానవునికి
అవమానకరమైన
బలహీనతగా
గోచరిస్తుంది.
నిజముగా
విద్యనేర్చుటమనేది
గాని,
లేక
నిగ్రహము
చేసుకోవటము
అనే
దానిలో
గాని
చాలా
సూక్ష్మమైన
మార్గములో
మనం
పరీక్షించుకోవలసి
వస్తుంది.
మనయొక్క
నిగ్రహశక్తిగాని,
మన
భావము
యొక్క
శుద్ధిగాని
ఏ
రీతిగా
మనం
పరీక్షించుకోవాలి
అని
మనం
విచారణ
సల్పాలి.
ధర్మరాజు
కథ
ఇందులో
చిన్న
ఉదాహరణంగా
చెబుతున్నాను.
దృతరాష్ట్రుడు
ద్రోణాచార్యుని
దగ్గర
కౌరవులకు,
పాండవులకు
విద్యలు
గరిపే
నిమిత్తమై
అక్కడ
చేర్చాడు.
ఈ
గురువు
అనేక
రకములైన
విద్యలు
నేర్పుతూ
వచ్చాడు.
మిగిలిన
నలుగురు
పాండవులు,
కౌరవులు,
గురువు
ఉదయం
చెప్పినది
సాయంకాలమునకే
అప్పజెప్పుతూ
వచ్చారు.
ఒకనాడు
శాంతమును
గురించి
అనేకరకములుగా
ఉపమానములతో
బోధించుతూ
శాంతము
మానవునికి
చాలా
అవసరమని
చెబుతూ
వచ్చాడు.
10
▾
Meaning
Keep
అయితే
ఈ
ధర్మజుడు
మూడు
దినములు
నాలుగు
దినములై
నప్పటికి
గురువునకు
అప్పజెప్పలేదు.
ఒకనాడు
అక్కడ
ధృతరాష్ట్రుడు
నా
పిల్లలు
ఎట్లా
ఉన్నారని
విచారిస్తూ
వస్తున్నాడు.
అందరూ
బాగా
నేర్చుకుంటున్నారు.
ధర్మజుడు
మాత్రము
అంత
చురుకుగా
నేర్చుకోవటం
లేదని
గురువు
అతనికి
కంప్లైటు
చేశాడు.
అయితే
ధృతరాష్ట్రుడు
చెప్పాడు!
మున్ముందు
భాద్యతలు
వహించవలసినవాడు
పెద్దవాడైన
ధర్మజుడే
ఈ
విద్యయందు
వెనుకబడిన
చాలా
కష్టమైపోతుంది.
కనుక
అతనికి
ప్రత్యేక
శిక్షణ
ఇచ్చి
ప్రత్యేక
మార్గములో
తర్ఫీదు
చేయమని
చెప్పి
గట్టిగా
గురువుకు
చెప్పి
తాను
వెళ్లాడు.
అయితే
ఈ
ధృతరాష్ట్రుడు
చెప్పటం
చేత
గురువుకు
మరింత
ధైర్యం
కలిగి
ధర్మజుని
అనేక
రకములుగా
శిక్షించటానికి
పూనుకున్నాడు.
ఎంత
చెప్పినప్పటికి
పాఠం
అప్పజెప్పలేదు.
ఒకనాడు
చక్కగా
బెత్తము
తీసుకువచ్చి
ధర్మజుని
కొట్టినాడు.
అక్కడ
రక్తము
వచ్చింది.
రక్తముపైనే
మరల
కొట్టాడు.
‘అబ్బా’
అని
ఇంకా
నేను
నేర్చుకోలేదు’
అన్నాడు.
అనగా
ధర్మజుడు
నేర్చుకున్న
శాంతము
ఎలాంటిదంటే,
ఎన్ని
దెబ్బలుకొట్టినా
ఎన్ని
విధముల
శిక్షించినా,
చలించని
మనస్సు
శాంతమని
అనుకున్నాడు
గాని
చెప్పిన
పాఠము
అప్పజెప్పటము
శాంతముకాదన్నాడు.
కేవలము
అది
బాహ్యమైన
చదువుగాని,
తాను
అంతర్చదువును
అభివృద్ధి
పరచు
కుంటున్నానని
ధర్మజుడు
ప్రాక్టికల్‌గా
నిరూపించాడు.
మనము
విద్యలనగా
ఇట్టి
హృదయస్థానమునకు
చేర్చే
విద్యలు
అని
చెప్పవచ్చును
గాని,
ఈనాటి
పిల్లలంతా
పరీక్షలు
వస్తున్నాయంటే
పుస్తకములోని
విషయములంతా
తలకి
చేర్చుకొని
ఆ
తలలోనున్నదంతా
examination
హాలులో
గుమ్మరించి
empty
తలతో
ఇంటికి
వస్తున్నారు.
Exam
అయిన
తరువాత
ఒక్క
ప్రశ్నకు
సమాధానము
చెప్పేవాడున్నాడా?
ఎవ్వడూ
చెప్పలేడు.
ఇలాంటి
చదువులు
భవిష్యత్తులో
ఏ
కార్యములు
చేయగలవు?
ఏ
విషయమును
మనము
సాధించగలము?
సాధించటానికి
వీలు
లేదు.
చదువుకున్న
చదువు
పరీక్షలలో
మనము
గుమ్మరించి
వచ్చాము.
మనము
ఖాళీగా
కూర్చుంటున్నాము.
ఈ
ఖాళీ
తలతో
మనము
ఏ
ఘనకార్యాలు
చేయగలము?
మన
విద్యలు
తలకు
చేర్చుకోకూడదు,
హృదయానికి
చేర్చుకోవాలి.
హృదయమనే
దాన్ని
నెగిటివ్‌గా
తయారు
చేసుకోవాలి.
ఎన్ని
పర్యాయములు
మనం
ఫొటోలేసినా
నెగిటివ్
నెగిటివ్‌గానే
నిల్చిపోవాలి.
విద్యార్థులారా!
మిగిలిన
మీ
విద్యలయందు,
మీ
హృదయస్థానమును
నెగిటివ్‌గా
తయారు
చేసుకోకపోయినా,
అంత
తొందర
ఏమీ
లేదు.
ఈ
నెల
దినములు
మీరు
అందుకున్న
విషయాలను
హృదయస్థానానికి
చేర్చుకోండి.
11
▾
Meaning
Keep
Also in his talks
(1)
9 April 2005
Divinity is the very nature of man
మీరు
మున్ముందు
మన
భారతదేశమునకు
తగిన
భద్రతను
కల్పించటానికి
తగిన
శక్తి
సామర్థ్యములు
గలవారౌతారు.
ఇంక
ఈ
లోకపు
విద్యలు
గురించి
మనం
చెప్పుకోవటానికి
ఏమాత్రము
అవకాశము
లేదు.
హృదయానికి
చేర్చుకున్నా
ప్రయోజనం
లేదు.
తలకు
చేర్చుకున్న
ప్రయోజనం
లేదు.
Exam
హాలులో
text
books
పెట్టుకొని
చూచి
వ్రాస్తున్నారు.
ఇంక
ఈ
చదువులు
చదువులెందుకవుతాయి.
కనుక
ఇట్టి
చదువులలోపల
ఎంత
మాత్రము
నేను
జోక్యము
కల్పించుకోను.
చదవవలసిన
చదువు
హృదయ
చదువు.
చదువులన్నియు
చదివి
చావంగ
నేటికి
చావు
లేని
చదువు
చదువ
వలయు.
Previous
←
The Person, the Karma, the Goal: The Oneness of These Three Is Itself Dhyāna
Next
The Bond of Prakṛti and the Paramātma
→