Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1973 · The Person, the Karma, the Goal: The Oneness of These Three Is Itself Dhyāna
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Person, the Karma, the Goal: The Oneness of These Three Is Itself Dhyāna
13 June 1973, Summer Course, Brindavan
1
▾
Meaning
Keep
His poems 31
వెతుకుచున్నాను
నేను
వెతుకుచునే
ఉన్నాను
వెతుకుచుంటి
నాడు
నేడు
నిజమానవ
ధర్మపరుని
॥
వెతు
॥
కొదువలేదు
నరులకు
నన్నూరుకోట్లు
ఉన్నారు
నరుని
రూపము
జూచితి
నిజరూపము
గాంచనైతి
॥
వెతు
॥
బూరగకాయలు
చూచి
మామిడియని
భ్రమసినట్లు
వెఱ్ఱి
చెరకు
రూపుచూచి
చెరకని
తా
నమిలినట్లు
పటికరాయి
రూపు
జూచి
కలకండని
నమిలినట్లు
రూపుజూచి
మోసపోకు
గుణమే
నరుని
నిజ
రూపం
॥
వెతు
॥
దివ్యాత్మస్వరూపులైన
విద్యార్థులారా!
రాగ
ద్వేషములతో
దూషితము
కాని
చిత్తమును,
అసత్యముతో
దూషితము
కాని
వాక్కును,
హింసలకు
దూషితముగాని
దేహమును
ధరించిన
తత్త్వము
దివ్యత్వమైన
ఆత్మతత్త్వముగా
విశ్వసించటమే
మానవత్వము
యొక్క
ప్రధానమైన
గుర్తు.
నిజముగా
ఇట్టి
విషయములు
మనము
విచారించుటకు
ప్రజ్ఞాన
విజ్ఞాన
సుజ్ఞానములనే
తెలివితేటలు
అత్యవసరము.
ఇట్టి
జ్ఞానము
మనకు
లభించాలను
కున్నప్పుడు,
శ్రద్ద,
భగవద్విశ్వాసము,
త్యాగము,
నిర్మలత్వము
అభివృద్ధి
పరచుకోటానికి
పూనుకోవాలి.
ఈ
జ్ఞానమనే
సూర్యునకు
స్వార్థమనే
రాహువు
పట్టి
ఉంటాడు.
స్వార్థమనే
రాహువును
దూరము
చేసుకున్నప్పుడే
ఈ
జ్ఞానమనే
ప్రభలు
మనకు
వెలువడుతుంటాయి.
స్వార్థము
దూరము
చేసుకొననంతవరకు
మానవుడు
జ్ఞాన
భాస్కరుని
దర్శించలేడు.
కాని,
ఈ
స్వార్థము
ఏ
స్థానము
నుండి
ఉద్భవిస్తున్నదని,
ఈ
స్వార్థమునకు
కారణమేమని,
ఈ
స్వార్థమును
ఆశించే
వ్యక్తి
ఎవరని
ప్రప్రథమములో
మనము
విచారణ
సల్పాలి.
ఒక
బాటసారి
అలసి
ఒక
చెట్టు
నీడను
విశ్రమించే
నిమిత్తమై
చేరుతాడు.
2
▾
Meaning
Keep
ఆ
చెట్టునీడను
హాయిగా
అనుభవించి
తద్వారా
సుఖమును
పొంది
తాను
ఎంతో
సంతోషముతో
తిరిగి
ప్రయాణము
సల్పటానికి
పూనుకుంటాడు.
అయితే,
ఆ
చల్లని
నీడ
తనదనియు,
ఈ
చల్లని
నీడ
ఆశ్రయించటంచేత
ఈ
బాటసారి
సుఖసంతోషములు
పొందినాడనియు
ఆ
వృక్షము
యేమాత్రము
చింతించదు.
నా
వలన
ఇంతమంది
ప్రజలు
సుఖమును
అనుభవిస్తున్నారని
కూడను
తను
ఏమాత్రము
యోచించదు.
అటులనే
మానవుడు
తన
దేహమునకు
సంబంధించిన
ఆస్తిపాస్తులనుగాని,
ఆలుబిడ్డలను
గాని,
తల్లిదండ్రులనుగాని,
తనవారు
నావారు
అనే
భావముతో
తాను
ప్రతిబంధితుడు
కావటము,
కొంత
నిర్భంధమునకు
గురికావటము
జరుగుతుంటాది.
ఇది
నా
ఇల్లు,
ఈమె
నా
ఇల్లాలు,
ఈమె
నా
తల్లి,
ఇతను
కుమారుడు,
ఇతను
తండ్రి,
ఇది
నా
దేహము
అని
చెప్పే
వ్యక్తి
ఎవరు
అనేది
మొట్టమొదట
మనం
విచారించాలి.
అయితే,
ఇవన్నీ
దేహము
చెప్పుచున్నదా
లేక
దేహములోనున్న
తాను
చెప్పుచున్నాడా
అనే
విషయాన్ని
కూడను
మనము
విచారణ
సల్పాలి.
దేహమే
ఇవన్నియు
నావి
అని
చెప్పుచున్నప్పుడు
ఈ
దేహము
నాది
అని
చెప్పటము
లోపల
అర్థము
ఏమిటన్నది?
కనుక,
దేహము
తాను
కాదనియు,
ఈ
దేహము
జడమైనదనియు,
తాను
చైతన్యుడై
ఈ
దేహమునందు
నివసిస్తూ
తన
యొక్క
దేహభ్రాంతికి
సంబంధించిన
వారంతా
నావారనియు,
నాదనియు
భ్రమిస్తుంటాడు.
కనుక,
ఇట్టి
దాన్ని
ఎవరో
తెలుసుకోవటానికి
తగిన
ప్రయత్నము
చేయటమే
సాంఖ్యము
అని
చెప్పబడుతుంది.
అనగా
మనము
చక్కగా
విచారణ
చేసుకున్నప్పుడు
భూతములు,
భూతగుణములను
చక్కగా
విచారణ
చేసి
తానెవరో
తెలుసుకోవటమే
సాంఖ్యముయొక్క
అర్థమని
కూడను
మనకు
బోధపడుతుంది.
అయితే
ఈ
నేను
నేను
అనేదానిని
విచారణ
చేసినప్పుడు
సాంఖ్యముగా
మార
వచ్చును.
కాని,
ఈ
‘నేను’
అనే
శబ్దముగాని,
‘నేను’
అనే
తత్త్వముగాని
ఎక్కడ
నుండి
ఉద్భవిస్తుందో,
ఎక్కడ
నుండి
పుట్టుచున్నది
అనే
పుట్టుక
స్థానమును
మనము
విచారణ
చేసినప్పుడు
ఆ
స్థానమునకే
తారకమని
కూడను
ఒకపేరు.
కాని,
ఆ
తారక
స్థానమునందు
తాను
నివసిస్తూ
తనయొక్క
వృత్తులను
మరచిన
స్థితియందే
ఆ
యొక్క
పరిస్థితి
“అమనస్కము”
అని
కూడను
పిలువబడుతుంది.
ఆ
తారక
స్థానమునందు
తాను
నిల్చుకొని,
తనయొక్క
వృత్తులన్నియు
మరచి
తాను
ఒక
విదమైన
ఆత్మానందములో
మునిగిన
స్థితి
అమనస్కము
అనేపేరుతో
పిలువ
బడుతుంది.
3
▾
Meaning
Keep
ఇట్టి
పరిస్థితులను
మనము
చక్కగా
గుర్తించుకోవటానికి
కొన్ని
రకములైన
సాధనలు
మనము
సల్పాలి.
ఇట్టి
సాంఖ్యము,
తారకము,
అమనస్కము
మూడింటి
తత్త్వమును
గుర్తింపజేసే
తత్త్వము
మనయొక్క
హృదయస్థానమందే
ఉంటున్నది.
పాలలో
నెయ్యి
వున్నది
కాని
పాలనుంచి
భిన్నముగా
నెయ్యి
మనకు
కనిపించదు.
కాని,
ఆ
పాలను
పెరుగుగా
మార్చి,
పెరుగును
మజ్జిగగా
చిలికి
నప్పుడు
తరువాత
వెన్నగా
మారినప్పుడు
వెన్నను
కాచిన
తరువాత
నెయ్యిగా
తయారౌతున్నాది.
నెయ్యి
పాలలో
కలపటానికి
ప్రయత్నము
చేసినప్పుడు
పాలకంటే
భిన్నముగానే
వుంటుంది
గాని
పాలలో
లీనమై
ఉండటానికి
తాను
ఒప్పుకోదు.
అట్టిదే
మనయొక్క
జీవితము.
జీవితమునందే
తారకము,
సాంఖ్యము,
అమనస్కము
అనే
తత్త్వములు
వుండినప్పటికిని
అవి
దేహము
నుండి
భిన్నముగా
మనకు
కనిపించక,
సాధనచే
గుర్తించిన
తదుపరి
దేహమునకు
ఇంద్రియములకు,
మనస్సుకు,
బుద్ధికి
అన్నింటికి
అది
భిన్నమైన
ఆకారము
ధరించి
తిరిగి
మానవత్వములో
లీనమయ్యే
ఆశ
తనకు
యేమాత్రము
లేక
ఆత్మ
తత్త్వము
లోపలనే
లీనమయ్యేదానికి
పూనుకుంటాయి.
సకార
వాచకము
పరమాత్మకము,
అహంకార
వాచకము
అహం
అనేటువంటి
వాచకము,
జీవునిగను
విశ్వసించి,
స,
అహం
రెండూ
చేరినటువంటి
సోహం
అనే
స్వరూపమును
మనము
ఉచ్చారణ
చేసినప్పుడు
దీనినే
ధ్యానమునందుంచుకున్నప్పుడు
అట్టి
పరతత్త్వము
అనేది
మనకు
అర్థము
కావటానికి
అవకాశము
ఉంటుంది.
దీనినే
జీవ
బ్రహ్మైకానంద
సంధానమనే
పేరుతో
కూడను
సాధనలు
సల్పటం
కూడను,
సోహం
అనే
హంస
గాయత్రిగా
కూడను
జపించటము
కద్దు
మన
భారతదేశమునందు.
రూపనామ
రహితమై,
ఏకత్వమై,
తాను
నిర్మలత్వమై,
సాక్షి
భూతమైనటువంటి
యొక్క
పదము,
పరతత్త్వమునందు
తత్
అనే
వాచకంగా
వుంటుంటాది.
ఇట్టి
తత్
అనే
లక్ష్యమునందు
మానవుడు
కొంతవరకు
విచారణ
సల్పినప్పుడు
తదుపరి
దేహాతీతమైన
సాక్షీభూతుడుగా
వుండే
త్వం
అనే
పదం
బయలుదేరుతుంది.
అయితే,
ఈ
రెండింటికి
మధ్య
అసి
అనే
పదము
ఈ
రెండింటిని
కూర్చటానికి
తాను
సిద్ధంగా
వుంటుంటాది.
ఈ
మూడింటి
యొక్క
అర్ధమే
పరమ
పవిత్రములైన
మహావాక్యముల
తత్
త్వం
అసి
అని
చెప్పుతున్నారు.
4
▾
Meaning
Keep
కనుక,
యిట్టి
తత్త్వమసి
యొక్క
తత్త్వము
తత్
అంటే
ఏమి,
త్వం
అంటే
ఏమి
నిన్నటి
దినము
చెప్పాను.
తదేవత్వం
అనే
స్థానమునందు
గురువు,
త్వమేవతత్
అనే
స్థానమునందు
శిష్యుడు
వుండి
తత్
విచారాన్ని
తాను
కొంతవరకు
శిష్యుడు
ప్రశ్నించటము,
త్వం
విచారాన్ని
గురువు
శిష్యునకు
చెప్పటము
రెండింటి
యొక్క
ఏకత్వముచేత
గురువు
శిష్యుడు,
శిష్యుడు
గురువుగాను
ఒక్క
ఏకస్థానము
పొందటము
దీనినే
ఐక్యము
యొక్క
ఆనందము
అనికూడను
తెల్పాను.
కనుక,
ఇందులో
మన
బాహ్యమైన
వృత్తులను
దూరము
చేసుకొని,
ప్రవృత్థి
స్థానము
నందు
పరమాత్మ
లక్ష్యమును
ఉంచుకొని
మన
జీవిత
తత్త్వాన్ని
ఇందులో
ప్రవేశింపచేయటానికి
పూనుకోవాలి.
ఈ
వృత్తులనగా
మనయొక్క
స్థూల
రూపమును
ధరించినవే
వృత్తులు.
సూక్ష్మరూపము
ధరించినటువంటిదే
గుణము,
కారణ
రూపము
ధరించినటువంటిదే
చిత్తము.
శబ్ద
రూపమైన
అహం
అహంకార
తత్త్వముతో
కూడినప్పుడు
సత్త్వ
రజోతమోగుణముల
యొక్క
తత్త్వాన్ని
తాను
రూపమును
చెందుతుంది.
మూడు
గుణములతో
మూడు
రూపములందు
సంచరించుతూ
దీనినే
ఒకవిధమైన
బ్రహ్మ
విష్ణు
మహేశ్వరతత్వమనేటువంటి
వృత్తుల
యందు
జగత్తునందు
వ్యాపించుతూ
వుంటుంది.
ఈ
స్థూలమైన
జగత్తునందు
మనము
అనుభవించే
ప్రతి
విషయము
కూడను,
ప్రతి
యొక్క
తత్త్వము
కూడను,
ప్రతి
కార్యము
కూడను
ఒక
వృత్తి
క్రిందనే
లెక్క.
శ్రవణము
కూడా
ఒక
వృత్తియే
యని
నిర్ణయపరచినారు.
అయితే,
భగవన్నామశ్రవణము,
భగవన్నామస్మరణ
అనేది
వృత్తికాక,
ప్రవృత్తికి
నివృత్తికి
మధ్య
సద్వృత్తి
క్రింద
జేరి
తద్వారా
మహనీయులు
కొన్ని
కార్యములు
చేయటానికి
పూనుకుంటారు.
అయితే,
ఈ
వృత్తులను
మనము
నివృత్తి
మార్గములోనికి
మార్చుకోటానికి
కొన్ని
రకములైన
అభ్యాసములు
కూడా
అవసరము.
దీనినే
ధ్యానమని
కూడా
చెబుతున్నారు.
ఈ
ధ్యానము
ఏరీతిగా
చేయాలి?
ధ్యానము
యొక్క
అంతరార్థము
ఏమిటి?
ఈ
ధ్యానము
యొక్క
లక్ష్యముగాని,
మనము
ఆశించిన
గమ్యముగాని
మనము
పొందటానికి
అవకాశము
వుంటుంది.
కాని,
ఈనాడు
లోకములో
ఈ
ధ్యానమును
గురించి
అనేక
రకములుగా
అనేకమంది
అనేకమార్గములు
చెప్పటం
చేత
ఈ
ధ్యానము
ఆచరించే
సాధకులకు
కొన్ని
రకములుగా
మనస్సు
తబ్బిబై
పోతున్నది.
ఇక్కడ
ధ్యానము
అని
ఒక
పదము.
ధ్యానము
అనగా
మనము
చేసేటువంటి
సాధన
అని.
5
▾
Meaning
Keep
‘సాధన’
ఎవరు
చేస్తున్నారు
అని
మరొక
ప్రశ్న
వేసుకోవాలి.
సాధకుడు
చేస్తున్నాడు.
దేనిని
ధ్యానము
చేస్తున్నాడు
అని
మరొక
ప్రశ్న
వేసుకున్నప్పుడు
దైవాన్ని
ధ్యానం
చేస్తున్నాడు.
ఈ
మూడింటిని
మనము
కూర్చినప్పుడు
నేను
భగవంతుని
ధ్యానము
చేస్తున్నాను
అని
మూడు
పదములుగా
తేలిపోతున్నాది.
ఇక్కడ
ఈ
మూడు
పదములలో
ధ్యానము
ఏది,
ధ్యాస
ఎవరు,
ధ్యేయము
ఎవరు?
ధ్యేయము,
దైవము,
ధ్యాస
చేసేవాడు
ధ్యానము
మధ్యలో
నున్నటువంటి
కర్మ.
వ్యక్తి,
కర్మ,
లక్ష్యము
ఈ
మూడింటి
ఏకత్వమే
ధ్యానమునకు
సరైన
అర్థము.
అయితే
అనేకమంది
ధ్యానమంటే
concentration
అని
చెప్పటం,
ఏకాగ్రత
అని
చెప్పటం
అలవాటైన
పొరపాటు.
కాని
ఈ
ఏకాగ్రతకు
మనము
ఇంత
ప్రయత్నం
చేయనక్కరలేదు.
జీవితమంతా
ఏకాగ్రతతోనే
యిముడ్చుకుని
ఉంటున్నాము.
మన
జీవితములో
చిన్న
చిన్న
కార్యములు
కూడను
ఏకాగ్రత
లేకుండా
మనము
చేయటానికి
వీలు
కాదు.
మన
జీవితములో
త్రాగటము,
తినటము,
చదవటము,
వినటము
ప్రతి
ఒక్కటి
ఏకాగ్రతతోనే
చేరి
వుంటున్నాయి.
నిత్యానుభవములో
నిత్య
జీవితములో
ఒక
అంగముగానున్నటువంటి
ఈ
ఏకాగ్రతను
మనం
ఇంత
గాఢంగా,
ఇంత
ప్రయత్నపూర్వకంగా
మనము
దీనిని
సాధించనవసరములేదే.
ఈ
concentration
అనేది
senses
కి
లోబడి
వున్నటువంటిది,
ఈ
శబ్ద
స్పర్శ
రూప
రస
గంధాదులకు
లోబడినదే
ఈ
ఏకాగ్రత.
ఇప్పుడు
ఈ
కాగితము
నేను
చదువుతున్నాను.
చదివే
సమయములో
కన్నులు
చూడాలి,
చేయి
పట్టాలి,
బుద్ధితో
విచారణ
చేయాలి.
తదుపరి
మనస్సుతో
చింతించాలి.
నాలుగు
కూడినప్పుడే
ఇందులోనున్న
విషయాన్ని
చదవటానికి
వీలవుతుంది.
ఇంక
మనము
దారిలో
నడవాలనుకున్నప్పుడు,
దారిలో
బస్సు
వస్తుందా,
కారు
వస్తుందా,
మోటరు
సైకిలు
వస్తుందా
అని
ఎదురు
దృశ్యాన్ని
కూడను
మనము
పరికించాలి.
తదుపరి
రోడ్డు
హెచ్చు,
పల్లమా,
ముండ్లా,
పాములా,
తేళ్ళా
అనే
విషయాల్ని
మనము
చూచుకోవాలి.
ఇలాంటి
జాగ్రత్త
లోపల
మన
ఇంద్రియములతో
వశమైన
విషయములోపల
ఏకాగ్రతను
నిత్యాను
భవముతో
అనుభవిస్తూ
పోతున్నాము.
లేక
డ్రైవింగు
మనము
చేయటానికి
పూనుకున్నప్పుడు
ఎంతో
concentration
చేయాలి.
మీటరు
ఒకవైపున
ఉంటున్నాది,
గేరు
ఒక
వైపున
ఉంటున్నాది.
క్లచ్
ఒక
వైపున
వుంటున్నది,
స్టీరింగు
ఒకవైపున
వున్నది,
బ్రేకు
మరొకవైపున
ఉన్నది.
6
▾
Meaning
Keep
అన్నీ
కూడను
మనము
concentration
చేసే
డ్రైవ్
చేయటానికి
పూనుకున్నప్పుడే
మనకు
క్షేమం
కలుగుతున్నది.
కనుక,
ఇట్టి
ఏకాగ్రత
మన
నిత్య
జీవితములోపల
మనము
జరుపుతున్నప్పుడు
దీనిని
ధ్యానము
అని
చెప్పటానికి
ఏమాత్రము
వీలుకాదు.
ఇది
దివ్యత్వమైన
స్థానమును
మనము
లక్ష్యమునందుంచుకొని
ఈయొక్క
ఇంద్రియములకు
అతీతమైన
దృశ్యములోపల
మన
భావమును
ఇమడ్చటమే
ధ్యానము
యొక్క
లక్ష్యము.
కనుక
ఇంద్రియములకు
అతీతమైనది
మెడిటేషను,
ఇంద్రియములకు
లోబడినది
concentration.
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణము.
ఒక
చిన్న
గులాబి
మొక్క
ఉన్నది.
ఆ
గులాబి
మొక్కలో
అనేక
కొమ్మలు,
రెమ్మలు,
ఆకులు,
పూలు,
ముండ్లు
అన్నీ
చేరి
ఉంటున్నవి.
అట్టి
సమయమునందు,
ఏది
పుష్పము,
ఏవి
ముండ్లు,
ఏవి
కొమ్మలు,
ఏవి
ఆకులు
అని
విచారణ
చేయటమే
concentration.
ఇవన్నియు
చూచిన
తదుపరే
ఇది
పుష్పము
అని
మనకు
చక్కగా
స్పష్టమౌతున్నది.
ఎప్పుడు
ఇది
పుష్పము
అని
ఏకాగ్రత
వచ్చెనో
అప్పుడు
ఆ
పుష్పమును
ముండ్లు
తగలకుండా
కోయటానికి
ప్రయత్నం
చేస్తాము.
ఈ
పుష్పమును
వేరు
చేసిన
తరువాత
ఆ
మొక్క
ఆకులకు,
రెమ్మలకు,
ముండ్లకు
ఎట్టి
సంబంధము
లేదింక.
ఈ
చెట్టు
నుండి
పుష్పమును
వేరు
చేయటమే
contemplation
అంటారు.
ఈ
పుష్పమును
నీవు
చేతి
యందు
వుంచుకొందువా
లేదు,
ఈ
పుష్పమును
భగవంతునికి
అర్పితము
చేస్తావు.
ఇప్పుడు
ఈ
పుష్పమును
భగవంతునికి
అర్పితము
చేసిన
తరువాత
చెట్టు
లేదు,
నీ
హస్తము
లేదు,
పుష్పము
లేదు.
భగవంతునిలో
లీనమైపోయింది.
దీనిని
మెడిటేషన్
అంటారు.
నీ
జీవితమే
ఒక
గులాబి
వృక్షము.
ఇందులో
అనేక
రకములైన
సంబంధములే
యిందులో
కొమ్మలు.
మీ
యొక్క
గుణములే
ఇందులో
ఆకులు.
మనయొక్క
రోగములే
ఇందులో
ముండ్లు.
మనయొక్క
ప్రేమయే
ఇందులో
పుష్పము.
ఈ
యొక్క
గుణములకు,
రోగములకు
సంబంధములను
వీటినుండి
దూరముచేసి
ఈ
ప్రేమను
నీ
స్వాధీనమునందు
పెట్టుకోవటమే
నీకు
సరైన
ఈ
concentration
కు
meditation
కు
మధ్యలో
వచ్చిన
contemplation.
ఈ
ప్రేమను
నీ
స్వాధీనము
నందుంచుకొని
భగవంతునికి
అర్పితము
చేయటమే,
ఈ
మూడింటియొక్క
ఏకత్వము
అక్కడ
కూడిపోతుంది.
ఈ
ప్రేమ
శుద్ధమైన
ప్రేమగా
ఉంటుంది.
7
▾
Meaning
Keep
కారణము
ఏమనగా
ముండ్లు
ఇందులో
చేరలేదు.
కొమ్మలు,
ఆకులు
ఇందులో
చేరుకోలేదు.
కొమ్మలు
ఆకులు
ముండ్లు
దూరము
చేసుకున్నది
కనుక
ఇది
పరిశుద్ధమైనదిగా
ఉంటుంది.
విషయ
సంబంధమైన
భావములు
మనలో
వున్నంతవరకు
కూడను
ఇది
lust
అనే
చెప్పవచ్చును.
వాటి
నుండి
దూరము
చేసుకోవటము
వలన
love
అని
చెప్పవచ్చును.
ఈ
ప్రేమ
కూడను
విశాలమైన
ప్రేమగా
ఉంటుండాలి.
దీనినే
expansion
love.
తన
స్వార్ధమును
మాత్రమే
పురస్కరించుకొని
తన
అభీష్ట
నిమిత్తమై
ఈ
ప్రేమను
అనుభవించుకోటానికి
ప్రయత్నము
చేయటము
ఒక
విధమైన
స్వార్ధమైనటువంటి,
కల్పితమైనటువంటి
narrow
contraction
తక్కువైన
ప్రేమగా
ఉంటుంది.
ఇలాంటి
స్వార్ధమైన
దీనిని
పవిత్రమైన
పరార్ధప్రేమగా
విశాల
మొనరించుకోటానికి
తగినంత
ప్రయత్నము
చేయటానికి
ఉపనిషత్తులు,
పవిత్రమైన
పురాణములు,
ఇతిహాసములు
మనకు
ఎంతో
సహాయకారులుగా
ఉంటాయి.
ఈనాడు
యువకులైన
మీరు
ఇన్ని
రకములుగా
చేర్చుకున్న
ప్రేమచేత
అనేక
రకములైన
ఇక్కట్లకు
గురియై,
కేవలము
ఒక
స్థిరత్వాన్ని
మీరు
కోల్పోయి
ఒక
భ్రమను
మాత్రం
మీరు
పెంచుకొని,
భ్రమచేత
మీ
జీవితలక్ష్యమునే
మీరు
దూరం
చేసుకోవటానికి
పూనుకుంటున్నారు.
కనుక,
ఈ
ప్రేమను
పరిశుద్ధపరచుకునే
నిమిత్తము
సత్సంగమును
చేరి,
పవిత్రమైన
పెద్దలు
చెప్పిన
విషయములు
ఆలకించి
వాటిని
ఒకటి
రెండైనా
ఆచరణలో
పెట్టి
మీ
ఇంటి
యందు
తల్లిదండ్రులకు
తగిన
సేవను
ఆచరించి
వారిని
సంతృప్తిపరచి,
వారిని
ప్రసన్నులుగా
మీరుగావించి,
తదుపరి
మీ
జీవిత
లక్ష్యానికి
మున్ముందు
పోయి
దేశమునకు
తగిన
భద్రత
చేకూర్చటానికి
సిద్ధముగా
వుంటుండాలి.
ఇందుకు
బుద్ధిని
ఒక
అద్దముగా
తీర్చిదిద్దుకొని
పరిశుద్ధపరచుకో
టానికి
తగిన
సాధనలు
సల్పాలి.
నీ
యొక్క
మానవత్వమనే
స్వరూపమును,
చిత్తము,
బుద్ధి
అనే
అద్దము
నందు
మాత్రమే
చూడటానికి
వీలవుతుందిగాని,
అన్యత్రా
చూడటానికి
వీలుకాదు.
ఈ
బుద్ధి
శుద్ధముగా
నుండినప్పుడు
మనయొక్క
అభిమానము
కూడను
స్వార్ధ
రహితమైన
అభిమానముగా
రూపొందుతుంది.
జగత్తంతయు
నీ
భవనముగా
విశ్వసించి,
భవనమునందు
నివసించే
జీవులన్నీ
నీ
అంశములుగా
భావించినప్పుడే
నీవు
విశాలమైన
భావమును,
విశాలమైన
ప్రేమను
కొంతవరకు
అభివృద్ధి
పరచుకోటానికి
అవకాశము
వుంటుంది.
8
▾
Meaning
Keep
దీనికి
మూడు
రకములైన
సాధనలు
కలవు.
మర్కట
సాధన,
విహంగ
సాధన.
మార్జాల
సాధన
అని
-
పిపీలక
మార్గము,
మర్కటమార్గము,
విహంగమార్గము
అనే
దాంట్లో
మర్కటము
నకు,
పిపీలకమునకు,
విహంగమునకు
వున్న
మార్పులు
ఏమిటి
అన్న
విచారణ
చేసినప్పుడు
మర్కటము
ఒక
వృక్షము
నుండి
ఒక
పండును
మాత్రమే
పెరికి
తాను
భుజించక
మరొక
పండువైపున
దృష్టి
మరల్చి
ఆ
పండును
అందుకునే
నిమిత్తమై
ఈ
కొమ్మనుండి
ఆ
కొమ్మ
పైకి
ఎగరటానికి
పూనుకుంటుంది.
అప్పుడు
తన
హస్తము
నందున్న
ఫలమును
కూడను
క్రింద
విడుస్తుంది.
అనగా
మన
సాధనలయందు
దురాశ
అనగా
అతి
శీఘ్రముగా
దైవము
దర్శనము
పొందాలని
లేక
సాక్షాత్కార
ప్రాప్తిని
అనుభవించాలని
అనుగ్రహమును
అందుకోవాలని
కొంతవరకు
ఆత్రుత
పడి
చిక్కిన
దానిని
దక్కించుకొనక,
దానిని
భుజించక,
తిరిగి
ఇంకొక
దానిని
అందుకోవాలని
మన
సాధనలు
నిత్యము
ఒక్కొక్కటిగా
మార్చుచూ
మార్చుచూ
పోవటంచేత
దేనిలోను
స్థిరత్వాన్ని
సాధించుకోలేక
పోతున్నాము.
కనుక,
మన
సాధనలు
దినదినము
నకు
మార్చటానికి
పూనుకోకూడదు.
ఒకే
సాధనను,
ఒకే
కాలమందు,
ఒకే
స్థానమునందు
అభివృద్ధి
పరచుకోటానికి
తగిన
ప్రయత్నము
సల్పాలి.
ఇంక
విహంగ
సాధన.
ఒక
పండును
చూచినప్పుడు
తన
సూటైన
ముక్కుతో
ఆ
పండును
గట్టిగా
కొట్టటానికి
పూనుకుంటుంది.
ఆ
సమయములో
ఆ
చెట్టునుండి
ఆ
ఫలము
క్రింద
రాలిపోతుంది.
అనగా,
ఆనందమనే
ఫలమును
మనము
అనుభవించే
నిమిత్తమై
తీవ్రముగా
ఒకే
పర్యాయము
సాధనను
అభివృద్ధి
పరచుకోటానికి
అభిలషిస్తాము.
దీనికి
చిన్నపిల్లలు
exercise
చేసే
సమయములో
మీకు
అనుభవము
ఉండవచ్చును.
ఈనాడు
ఒక
20
పౌండ్లు
సులభంగా
ఎత్తినావనుకో.
వెంటనే
50
పౌండ్లు
ఎత్తటానికి
ప్రయత్నించకూడదు.
ఈ
20
పౌండ్లు
కూడను
ఒక
వారము
సులభంగా
ఎత్తి,
ఎత్తి
దానిని
అభ్యాసము
చేసుకొని
తదుపరి
25
పౌండ్లు,
30
పౌండ్లు,
35
పౌండ్లు
క్రమక్రమేణా
పెంచుకోవటానికి
పూనుకున్నప్పుడు
నీ
దేహములో
నున్న
అంగముల
భద్రత
కూడను
క్షేమాన్ని
అందిస్తాయి.
అదేవిధముగా
సాధన
కూడను
ఈనాడు
20
నిముషములు
ధ్యానములో
కూర్చున్నాము.
ఈ
20
నిముషములే
క్రమక్రమేణా
ప్రాక్టీసు
చేసుకుంటూ
వెళ్ళి
నప్పుడు
ఆ
ఇరువది
నిముషములలో
ఒకవిధమైన
స్థిరత్వము
ఏర్పడవచ్చును
అంతేగానీ
ఏనాడు
నామమునందించాడో,
ఏనాడు
జపమాలనందించాడో
ఆనాడే
రెండు
మూడు
గంటలు
కూర్చున్నావంటే
ఇది
సరైన
సాధన
కానేరదు.
9
▾
Meaning
Keep
ఈ
విహంగ
సాధన
అనేది
తీవ్రమైన
సాధన
అని
మనం
అర్థం
చేసుకోవాలి.
కనుక
ఈ
విహంగ
సాధన
అంత
తీవ్రానికి
గురి
కావటం
చేత
మనకు
దక్కవలసిన
ఫలాన్ని
మనం
దక్కించుకోలేకపోతున్నాము.
కనుక,
ఈ
సాధనలయందు
చాలా
నిదానముగా,
slow
and
steady
wins
the
race
అంటారు.
మన
జీవితములో
slow
and
steady
చాలా
అవసరము
ఈ
మార్గములో.
ఇంక
పిపీలక
మార్గము
చాలా
ఉత్తమమైన
మార్గము.
మీకు
చాలామందికి
తెలిసియే
ఉండవచ్చును.
ఎక్కడైనా
తాము
ఆరగించవలసిన
పదార్ధమే
వుంటున్నప్పుడు
ఆ
చీమలు
నెమ్మదిగా
ఆ
పదార్ధముల
చెంతకు
దారి
తప్పకుండా
ఒక
చీమ
ఏ
మార్గమును
అనుసరించిందో
దానినే
ఇవన్నీ
అనుసరించి
ఆ
పదార్ధము
దగ్గరకు
వెళ్లి
కేవలము
ఇక్కడ
పదార్ధము
చిక్కింది
కదాయని,
కుంభకర్ణుని
వలే
అక్కడ
భుజించక
తాను
ఎంత
భారము
మోయగలదో,
ఎంతభాగము
తినగలదో
అంత
దానిని
ముక్కలుగా
చెక్కలుగా
చేసుకొని
తన
స్వస్థానమునకు
తీసుకొని
వెళ్ళి
నిర్భయంగా
అక్కడ
ఆరగించటానికి
పూనుకుంటుంది.
అట్టి
సద్గుణము,
అట్టి
విచారణాశక్తి
చీమయందు
ఉన్నది
కనుకనే
చీమ
యొక్క
భారముకంటే
వేయి
రెట్ల
భారము
చీమ
మోయగలుగు
తున్నది.
అట్టి
ముక్కలు
చేసుకొని
స్వస్థానమునకు
వచ్చి
నిర్భయముగా
భుజించే
ప్రయత్నమునకు
పూనుకుంటుంది.
అదేవిధముగా
మనము
ఏ
యొక్క
లక్ష్యముపై
మన
దృష్టిని
ఉంచితిమో
ఆ
యొక్క
క్రమమును
మనము
తప్పకుండా,
ఆ
మార్గమును
మనము
వీడకుండా,
ఆ
యొక్క
లక్ష్యమును
మనము
యేమాత్రము
చలింపచేయకుండా
భ్రమించని
దృష్టిని,
చలించని
మనస్సును
అభివృద్ధి
పరచుకునే
శక్తి
ఈ
పిపీలక
మార్గమునందు
మనకు
అలవడుతుంది.
కనుక,
మనం
బ్రహ్మతత్త్వాన్ని
పొందాలనుకున్నప్పుడు
ఈ
మార్గమును
మనం
వీడకుండా
మన
క్రమశిక్షణకు
యేమాత్రం
అభ్యంతరాలు
కలుగకుండా
మన
మనస్తత్త్వమును
హద్దులో
ఉంచుకొని
తద్వారా
మనము
చేసే
ప్రతి
కర్మయందు
కూడను
తద్భావమును
మాత్రమే
మనము
ఊహించాలి.
హృదయాన్ని
ప్రేమతో
నింపుకో
విద్యార్థులారా!
ఈ
వయస్సునందు
మీరు
పవిత్రమైన
భావములు
హృదయమందు
నింపుకోండి.
ఎందుకనగా
చిన్న
ఉదాహరణము.
ఎందుకనగా
నా
దగ్గరకు
ఒక
వేదాంతి,
ఒక
అద్వైత
సిద్ధాంతి
యిద్దరూ
వచ్చారు.
10
▾
Meaning
Keep
ఇద్దరూ
వచ్చి
స్వామీ!
నా
అద్వైత
సిద్ధాంతము
గొప్పదా
లేక
నా
వేదాంతము
గొప్పదా
అని
ఇద్దరూ
వాదించుకొని,
తదుపరి
స్వామి
నిర్ణయము
చేయాలనే
ఉద్దేశ్యముతో
స్వామిని
ప్రార్థిస్తూ
వచ్చారు.
ఈ
అద్వైత
మార్గము
ఉత్తమమైనదో
లేక
వేదాంతము
లోపల
దిగి
తద్వారా
సాధనలుచేసి
ఈ
సర్వేశ్వరుని
అనుగ్రహానికి
పాత్రుడు
కావటము
సరియైన
సాధన
అని
చాలా
గొప్పది
అని
వారియొక్క
మూఢత్వములోపల
ఇలాంటి
ప్రశ్నలు
వేస్తూ
వచ్చారు.
నేను
అందులకు
సరియైన
జవాబు
చెప్పాను.
ఈ
అద్వైతమును
వాదించే
వ్యక్తితో
అయ్యా!
అద్వైతము
నీపై
ఆధారపడి
ఉండలేదు.
అయ్యా
వేదాంతము
నీపైన
ఆధారపడి
ఉండలేదు.
ఈ
వాదన
మీ
బుద్ధులపైన
ఆధారపడి
వుంటున్నాది
గాని,
వేదాంతము
అతనిపైన,
అద్వైతము
ఇతనిపైనా
ఆధారపడి
ఉంటుంటే
నీ
బుద్ధిని
పురస్కరించుకొని
నీ
బుద్ధియే
పెడమార్గము
పట్టినప్పుడు
వేదాంతము
క్షీణించినట్లేనా.
లేక
అతని
బుద్ధియే
ఏదైనా
పెడమార్గము
పట్టినప్పుడు
అద్వైతము
నశించినట్లేనా.
కనుక,
అద్వైతము,
వేదాంతము
ఒకరిపైన
ఆధారపడినటువంటివికావు.
అవి
సర్వ
స్వంతముగా
వుండినవి.
మన
బుద్ధులను
పురస్కరించుకొని
ఈ
మంచి
చెడ్డలనే
వాదనలకు
పూనుకుంటున్నాము.
ఈ
వాదనలు
కేవలము
పొట్ట
కూటి
నిమిత్తము
చేసే
వాదనలేగాని,
భగవంతుని
అనుగ్రహమునకు
పాత్రులయ్యేటు
వంటి
వాదనలు
కానేరవు,
ఈనాడు
జగత్తులో
మంచి
చెడ్డ
నిర్ణయాలు
మన
బుద్ధిని
పురస్కరించుకొని
వుంటున్నాయి
గాని,
మంచి
చెడ్డలనే
వ్యక్తులను
నిర్ణయము
చేసే
అధికారము
ఎవ్వరికీ
లేదు.
ఆ
యొక్క
వ్యక్తిపైన
కొన్ని
రకములైన
ద్వేషము,
అసూయ
వుండినప్పుడు
ఆ
వ్యక్తిని
నీవు
చెడ్డగా
భావించవచ్చు.
ఆ
వ్యక్తిపైన
నీకు
ప్రేమానురాగములు
పెరిగినప్పుడు
ఆ
వ్యక్తియే
నీవు
మంచి
చెప్పవచ్చు.
కాబట్టి
ఈ
మంచిచెడ్డలు
నీ
మనోభావములకు
సంబంధించినవే
గాని
ఆ
వ్యక్తికి
ఏమాత్రము
సంబందించినవి
కాదు.
కనుక,
మన
మంచిని
మనం
పెంచుకొని,
మన
చెడ్డను
మనం
త్రుంచుకునే,
ప్రయత్నానికి
పూనుకున్నప్పుడు
అందరూ
మంచిగానే
మనకి
కనిపిస్తారు.
ఈ
వేదాంతములతో
తలను
నింపుకునే
దానికంటే
ప్రేమతో
హృదయాన్ని
నింపుకున్నప్పుడు
ప్రపంచమునే
మనము
హస్తగతము
చేసుకోవచ్చు.
ఈ
వేదాంతముతో
మన
బుఱ్ఱను
నింపుకున్నప్పుడు
మనము
జీవితము
వాగ్వివాదముతోనే
అంత్యము
చేసుకోవచ్చు.
యువకులైన
మీరు
హృదయ
స్థానమందు
ప్రేమ,
సహనము,
త్యాగము
ఇలాంటి
పవిత్రమైన
గుణములు
నింపుకొని,
మీ
ఉద్రేకాలకు,
కొన్ని
విధములైన
అల్లకల్లోలములకు
మీరు
ఏమాత్రము
కాలిడక
తగిన
శాంతిని
అభివృద్ధి
పరచి
భారతదేశము
యొక్క
సంస్కృతిని
తిరిగి
మీరు
పవిత్రమైన
మార్గములో
ప్రచార
ప్రబోధలు
సల్పుతారని
కూడను
ఆశిస్తూ
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Dharma and Its Nature
Next
The Oneness of Jīva and Brahman: Life's Supreme Goal
→