Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1978 · Faith Is the Foundation of the Spiritual Path
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Faith Is the Foundation of the Spiritual Path
23 November 1978, Birthday - 53, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
తల్లి
వడిలో
నిర్విచారముగా
నిర్భయముగా
నున్న
పసిపాపలను
చూచిన
ఆ
ఆనంద
తాండవమాడుచున్న
ముఖారవిందముయొక్క
ప్రకాశము,
ప్రశాంతమును
చూచిన
ఎంత
శాంతి
ఎంత
సంతోషము!
మానవునియొక్క
శాంతి
ఆనందములను
హరించే
ఈర్ష్య
అసూయలు
కామ
క్రోధములు
రాగ
ద్వేషములు
అహంకారములు
ఆడంబరములు
పసిపాప
హృదయమున
చేరుటకు
అవకాశము
లేదు.
భవిష్యత్తును
గురించి
భయాందోళనములు
పసిపాపకు
లేవు.
మిన్ను
విరిగి
పైన
పడిననూ
దాని
శాంతికి
భంగము
కలిగించదు
తల్లి
ఒడిలో
ఆనందముగా
పండుకొని
యుండును.
2
▾
Meaning
Keep
ఇట్టి
శాంతి
ఆనందములు
పెద్దవారికి
లేవే?
కారణమేమిటి?
పెరిగి
పెద్దవారయ్యే
కొద్ది
ఇంద్రియములకు
లోబడి
జీవితమందు
అనేకత్వమును
అభివృద్ధి
చేసుకొని
అశాంతిని
అనుభవిస్తూ
నిర్మలత్వమును
కోల్పోయి
బలహీనతకు
బానిసలై
దుఃఖమే
అధికమగును.
పెద్దవారి
దృష్టి
దృశ్యకల్పితమైన
జగత్తుపైనే
వుండును.
క్షణమాత్రము
దొరకే
ఆనందనిమిత్తమై
నిరంతర
తాపత్రయములో
అంతులేని
ఆతురతతోపడి
ఇంద్రియములవెంట
పరిగెత్తి
జీవితమును
వ్యర్ధము
గావించుకొందురు.
తెలివితేటలు
పెరిగినంత
మాత్రమున
ఏకత్వమునందు
అనేకత్వమే
గోచరమగును.
“ముండే
ముండే
మతిర్భిన్నాః”
అన్నట్లు
భేదభావాలు
భిన్నాభిప్రాయాలు
ఊహాచిత్రాలు
అధికమై
పవిత్రత,
దివ్యత్వము,
ఏకత్వము,
మొదలగు
దివ్య
గుణములు
తగ్గును.
ఏక
స్వరూపముగా
వుండిన
దేహమును
ఉదరము,
హస్తము,
నేత్రము,
శ్రోత్రము
అని
వేరు
వేరు
జేసి
అనేకత్వ
దృష్టిచే
శుశ్రూషించిన,
లాభము
లేదు;
వీటియొక్క
సమ్మిళిత
సంబంధమును
గుర్తించి
వర్తించే
అవసరమున్నది.
దేహము,
వ్యక్తులు,
జీవులు
మూడింటియొక్క
సమ్మిళితమైన
స్వరూపమే,
ఆత్మ!
సంకుచిత
భావముతో
నూతన
పరిశోధనా
మార్గముల
నవలంబించి
చిక్కిన
అల్ప
ఫలితములకు
విజ్ఞాన
శాస్త్రజ్ఞులు
పెద్ద
జయమును
పొందినామని
భ్రమించుచున్నారు.
చిన్న
చిన్న
ఫలితములవలన,
వారి
బుద్ధి
యొక్క
చిన్న
చిన్నతనముకూడ
పెరుగుతూ
వుండును.
వైద్యులు
ఎముకలు,
చెవి,
ముక్కు,
గొంతు,
హృదయము,
కడుపు,
చర్మము
అని
దేహమును
ముక్కలుచేసి,
ప్రత్యేకముగా
వాటివాటికి
తగిన
పరిహారములను
విధింతురు.
భక్తులు
కూడ
ఇంతే.
వారిలో
ఎక్కువమంది
యుక్తులు
భుక్తులు!
ఒకరికన్న
మరొకరికి
అజ్ఞానమునందు
ప్రథమస్థానము
కావాలి,
అనే
పైపోటీలో
“నా
దేవుడు”
“నీ
దేవుడు”,
“గణపతి
పెద్ద”
“హనుమంతుడు
పెద్ద”
అని
భిన్నాభిప్రాయాలను
పెంచుకొని
కలహింతురు.
దీనికి
తోడు
నా
పరమాత్ముడు
కూడ
ఏకోహం
బహుస్యాం
అని
మానవునికి
దివ్యత్వమును
భిన్న
భిన్న
రూపములలో
చూపించును.
అనుభవజ్ఞులైన
పెద్దలు
మానవు
లందరిలోనూ
ప్రకాశించుచున్న
దివ్యత్వమును
గుర్తింతురు.
ఆధ్యాత్మిక
మార్గమునందు
నమ్మకము
చాలా
ప్రధానము.
జనన
మరణముల
మధ్య
పతనమైన
అనుభవముల
నందుకొని
మానవుడు
నమ్మరాని
వాటిని
నమ్ముతున్నాడు.
నమ్మతగిన
దాన్ని
నమ్మటములేదు.
వివేక
విచక్షణలను
కోల్పోయి
బాధపడుచున్నాడు.
అమ్మవడిలోని
పాప
అమ్మపై
ఉన్న
నమ్మకమువలన
అతడు
నా
తండ్రి,
ఇతడు
నా
తాత,
ఈమె
అక్కయని
అమ్మ
చూపించిన
వ్యక్తులను
ఆ
పేరుతోనే
పిలుచును.
“ఇతడు
నీ
తండ్రి”
అనే
మాటపై
నిర్మల
నిశ్చల
నిస్వార్ధ
బుద్ధితో
విశ్వసించును.
తల్లి
చెప్పకుండిన,
తండ్రి
యెవరని
వేరెవరు
చెప్పగలరు?
అట్లనే,
ప్రకృతి
మాతా
సృష్టికర్త
ఒకడున్నాడు.
అతడే
జగత్పతి
అని
చెపుతూవుంటే
ఆమెను
విశ్వసించక,
ఉన్నాడా
లేదా
అనే
వాదోపవాదములను
పెంచుకుంటు
పోతున్నారు.
అమ్మ
అనిన
ప్రకృతిని
విశ్వసించుచూ
అప్ప
అయిన
దేవుని
నమ్మక
“మాతల్లి
గొడ్డురాలు”
అని
లోకానికి
చాటుచున్నారు.
అన్నిటినీ
విశ్వాసముతోనే
చేయుచున్నాము.
ఒక
మంగలి
వాడి
దగ్గరకుపోయి,
ఆయనదగ్గర
పదునైన
కత్తి
ఉందని
తెలిసి
వెనుకకు
రాము!
ఆయన
అపకారము
చేయడు
అనే
విశ్వాసముతో
చేతికి
తలనందిస్తున్నాము.
ప్రతి
వాడూ
తాను
పరులయందు
విశ్వసించియే
ఆనందము
ననుభవించుచున్నాము.
3
▾
Meaning
Keep
చాకలి
మన
వస్త్రములను
శుభ్రపరచి
ఇస్త్రీ
చేసి
ఇస్తాడని
విశ్వసించి
కదా,
విలువైన
గుడ్డలను
ఇస్తున్నాము.
ఆ
విశ్వాసము
లేక,
గుడ్డలు
పరిశుద్ధము
కావు;
మన
మనస్సులుకూడ
పరిశుద్ధము
కావు
అట్లనే
దేహిని
విశ్వసించి
ఆనందమునందుకోవాలి.
దీనిలో
అనుకరణము
తప్పు.
పరుల
మాట
నమ్మకూడదు.
తామే
స్వయముగా
అనుభవించాలి,
అని
భ్రాంతి
పడుతున్నారు.
మాతృమూర్తిపై
విశ్వాసము
వలన
తండ్రి
అని
ఒకరిని
నమ్మినట్లు
ప్రకృతిలో
సర్వవ్యాపకమైయున్న
శక్తిని
దివ్యత్వమని
విశ్వసించాలి.
ఎక్కడో
జరిగిన
విషయమును
గురించి
పేపరులో
వార్త
వచ్చిన,
దానిని
చూడగనే
ప్రత్యక్షముగా
గుర్తించకనే,
ఆ
ఎడిటర్పైన
విశ్వాసముచే,
మంచి
విషయముంటే
ఉప్పొంగిపోతున్నాము;
లేకపోతే,
కృంగిపోవుచున్నాము!
కథల
రచయితలు
వ్రాసే
కథలలోని
ఉల్లాసముగాని,
లేక
నిరాశనిస్పృహగాని
చదువరులనూ
బాధించుచున్నవి.
రుచికరమైన
సినిమాలు
చూపించే
కల్పిత
దృశ్యాలను
సత్యముగా
భావించి
జాలి
విచారము
భయభ్రాంతులు
ఉద్రేకము
ఉల్లాసము
ఇట్టి
రకరకాల
భావాలు
మనలో
ఆవిర్భవించును.
సినిమా
డైరెక్టరుని,
ఎడిటర్ని,
కథలు
రాసే
వాళ్ళని
నమ్ముతారే
గాని
రక్షించి
శిక్షించి
పెంచి
పరిపాలించే
జగదీశ్వరుని
నమ్మకున్నారు.
మాటల
మ్యాజిక్కుకు
లొంగుదురే
కానీ,
మంత్రములను
నమ్మి
హృదయములోని
దివ్యత్వమును
కనుగొనుటకు
ప్రయత్నింపరు.
ఒకమాట
ఎన్నడూ
నిజము.
నమ్మి
చెడినవారు
ఏనాడు
లేరు.
భగవంతుని
విశ్వసించి
శాంతి
సంతోషముతో
జీవితమంతా
ఆనందముగా
గడపిన
కోటానుకోట్లు
భారతీయులు
గలరు.
నాస్తికత్వము
విప్లవకారి;
అయితే,
ఆస్తికత్వమును
అభివృద్ధి
చేయుటకే
నాస్తికము
వచ్చినదని
నమ్మండి.
చీకటి
లేకపోయిన,
వెల్తురుకు
విలువ
ఉండదు.
ఆకలి
లేకపోతే
అన్నము
నెవరాశింతురు?
మరణమె
లేకపోతే,
తల్లికూడ
తన
బిడ్డను
ప్రేమించదు.
స్వార్ధమే
దీనికి
మూలకారణము.
అసలు
దైవమును
విస్మరింతురు;
నెరవేరకుండిన
దైవముపై
ద్వేషభావము!
కనుక,
స్వార్ధ
రహితమైన
మార్గము
ననుసరించిన
దివ్యానుగ్రహము
తప్పక
కలుగును.
“అడుగకువే!
ఓ
మనసా!”
అని
హెచ్చరించినాడు.
అర్హతను
సంపాదించిన
చాలు
కోరనక్కరలేదు.
శబరి
దేన్ని
అడిగినది!
జగము
దేన్ని
కోరినది?
పవిత్రత,
యోగ్యత
రెండూ
ఉంటే,
తానే
నడిచి
వస్తాడు.
చిత్తశుద్ధి
ఇంద్రియ
నిగ్రహములుంటే
దైవానుగ్రహము
తప్పక
అబ్బును.
సుఖశాంతుల
నందుకోవచ్చును.
దీనికేమాత్రమూ
సందియము
లేదు.
నిజమైన
ఆనందము
బాహ్య
ప్రపంచమునందు
దొరకదని
తెలియక.
కాలమునూ,
కాయమునూ
వ్యర్ధము
చేయుచున్నారు
మానవులు.
కుటుంబ
పోషణలో
బంధుమిత్రుల
ఆదరణలో,
సుఖము
లేదు
తన
హృదయమందే
దాగియున్నది.
కుటుంబ
వ్యామోహమువలన
ఎంతోమంది
పెడమార్గము
పడి
జార
చోరులుగా
తయారగుచున్నారు.
దేహభ్రాంతి
ఉన్నంత
వరకూ
బలహీనత
తప్పినది
కాదు.
దేహి
స్వరూపమునే
అర్ధించాలి,
ఆరాధించాలి,
ఆనందించాలి,
యోగశక్తి
క్రియాశక్తి
ఆత్మశక్తి
ఇవి
మూడూ
సమ్మిళితమైనదే
అవతార
తత్వము.
అవతరణమనిన
పై
స్థానంనుంచి
క్రింది
స్థానానికి
రావటము
అని
కాదు,
అర్ధము.
గుణస్వరూపుడైన
మానవుని
ఉద్ధరించుటకు
గుణ
స్వరూపుడుగానే
రావలెను.
దీనివలన
భగవత్
తత్వమునకు
కించిత్వము
నేమాత్రమూ
ఆరోపించకూడదు.
4
▾
Meaning
Keep
Also in his talks
(20)
8 November 1986
Through the Name we can attain the Named!
30 September 1987
Understand the Sai principle well
5 March 1992
‘Adhyātmavidyā vidyānāṁ’
14 January 1995
Prema is like a compass
24 June 1996
A Life without Character Is a Lifeless Life
17 July 1997
The principle of the Ātma and divinity
21 April 1998
The body itself is foremost for the practice of Dharma
14 August 1998
Prema Alone Is the Path, Prema Alone the Goal
30 September 1998
God's Prema Is Eternal, Everlasting
19 November 1998
Women Alone Are the Root Cause of Bhārata's Greatness
2 April 2003
Leave the delusion of the body; think of God
18 May 2003
Prema is the very essence of the Paramātma
21 October 2003
I have come only to reveal your true nature
22 November 2004
Only When Oneness Is Experienced Does Human Birth Find Its Fulfilment
14 January 2005
When the heart is filled with Prema, life is filled with Ānanda
23 June 2005
Recognise the fundamental principle
14 April 2006
Fix your mind on Divinity; place your trust in Oneness
21 May 2006
Service to society is itself the right sādhana
11 August 2006
Divinity is attained only through Prema for God
28 July 2007
Every human being is God
చంటిబిడ్డ
ఏడ్చినపుడు
తల్లి
చేతిలోనికి
ఎగురుట
దానికి
సాధ్యము
కాదు.
నేను
పెద్దదాన్ని
అని
తల్లి
వంగును.
అంటే
ఎట్లా?
వంగిన
మాత్రమున
లొంగినట్లు
కాదు.
మానవుడు
పైకి
ఎగురుట
సాధ్యము
కానప్పుడు
సాయిమాత
వంగి
ఎత్తుకొని
సంతోషము
నందించును.
ఏరోప్లేను
ఎప్పుడూ
పైనే
ఎగురుటకు
ప్రయత్నించును
ఇతర
వాహనాదుల
వలె
నేలపై
సంచరించదు.
అయితే
సదా
సర్వత్రపైనే
సంచరించదు.
అక్కడక్కడ
దానిలో
ప్రయాణించుటకు
అర్హత
సంపాదించిన
వారిని
ఎక్కించుకొని
తిరిగి
పైకి
వెళ్ళును.
భగవంతుడు
గుణాతీతుడు,
ఎక్కడో
వున్నాడు
దొరకడు
అని
లేడు
అని
లేదు
భగవంతుని
పొందే
అర్హత
కలిగినవారికి
వారికి
ఆనందమునిచ్చే
తరువు
పక్వఫలము
వృక్షమునుండి
వేరయ్యేరీతి
జ్ఞానులందరూ
తరింతురు.
అయితే
సంచితానికి
వడ్డి
పెంచుకొని
దుష్కర్మలద్వారా
దుఃఖమును
పెంచకూడదు.
మీ
హృదయమునందు
మీరెప్పుడు
దివ్యమైన
ఆనందమునందుకొందురో,
అదే
సాయి
పుట్టిన
దినము.
ఇంకొక
సత్యము
మీకు
ఈనాడు
వెల్లడించాలి.
పుట్టపర్తిలో
పుట్టిన
పండుగ
చేస్తున్నారు
కాబట్టి
మేము
వస్తున్నాము
అని
భావించిన,
అది
సరికాదు.
మీరు
రావటముచేత
పుట్టిన
పండుగ
చేస్తున్నాము.
అంటే
పుట్టిననాడు
పండుగ
చేసుకోవాలి
అనే
ఆశలు
నాకేనాడూ
లేవు.
అనేక
దేశాలనుంచి
ఎన్నో
కష్టాలకు
నష్టాలకు
గురియై
మీరు
రావటముచేత,
మీకు
ఆనందమందించాలి
అనే
భావమే
తప్ప
నాలో
ఇట్టి
చిల్లర
భావాలు
ఏనాడూ
ఆవిర్భవించవు.
లోకాస్సమస్తా
స్సుఖినో
భవంతు
అనే
విశ్వస్వరూపాన్ని
గుర్తించి
అందరికీ
సంతోషము
సంతృప్తి
కలుగాలి
అనే
భావము
ఉత్సాహము
ఆవేదన
మీ
హృదయములో
ఏనాడు
పుట్టునో
ఆనాడు
ఆ
హృదయము
సాయిమందిరముగా
విరాజిల్లును.
ఆ
నాటినుంచి
మీరెక్కడో
నేనక్కడే!
ఈ
దినము
ఉదయమునుంచి
నా
దగ్గరకు
వచ్చిన
వారెందరో
Happy
Birthday
అన్నారు!
నా
Happy
Birthdayకి
రానక్కరలేదు
నేను
నిరంతరమూ
Happyలోనే
వున్నాను
నిత్యానందం
పరమ
సుఖదం
కేవలం
జ్ఞానమూర్తిం
ఏకం
నిత్యం
విమలం
అచలం
సర్వధీ
సాక్షిభూతం
భావాతీతం
త్రిగుణరహితం—
దానికెప్పుడూ
ఆనందమే
ఎప్పుడూ
Happyయే.
Previous
←
The Lotus and the Petals
Next
The four blemishes
→