Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1979 · Humanness
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Humanness
9 December 1979
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
ప్రపంచమున
ఏ
పదార్థమునకైనా
కర్త
లేకుండా
నిర్మాణము
జరుగదు.
ఇది
ఒక
వాచీ;
ఈ
వాచిని
నిర్మాణము
చేసిన
వ్యక్తి
ఏ
జపానునందో,
ఏ
జర్మనియందో,
ఏ
స్విట్జర్లాండ్నందో,
అమెరికాయందో
ఉండియే
తీరవలెను.
ఆ
వ్యక్తి
వాచీయొక్క
తత్త్వము
పూర్ణంగా
గుర్తించినవాడై
ఉండవలెను.
అదేవిధముగనే
లోకారాధకులైన,
లోకపాలకులైన
సూర్యుడు,
చంద్రుడు,
అనంతనక్షత్రములు,
కాలమునూ,
ఇవన్నియును
సృష్టించుటలో,
ఆ
నాయకత్వము,
కర్తృత్వము,
పవిత్రమైన
ఒక
నిర్మాణము
తెలిసినవాడు
ఒకడు
ఉండవలెను.
ఈ
కర్త
సర్వజ్ఞుడై,
సర్వవ్యాపకుడై,
సర్వమహిమాన్వితుడై
ఉండినప్పుడే,
సూర్యచంద్రాదులను,
నక్షత్రములనూ
కాలమును,
సృష్టించుటకు
అధికారికాగలడు.
అట్టి
కర్తనే
శాస్త్రజ్ఞులు
అనేకవిధములైన
పేర్లతో
ఆరాధిస్తూ,
స్మరిస్తూ,
తరించుతూ
వచ్చారు,
ఈ
కర్తకు
అప్రమేయుడు
అని
ఒక
పేరు.
అప్రమేయుడనగా,
ఎట్టి
ప్రమాణములచేతనూ
గుర్తించుటకు
సాధ్యము
కాని
వాడని
అర్థము.
ఇతడు
వేదములకు
మాత్రమే
వేద్యుడు
కనుక
వేదవేద్యుడని
కూడనూ
ఒక
పేరు.
ఇట్టి
సర్వజ్ఞుడైన
కర్తను
గుర్తించుటకు
తగిన
ప్రయత్నంచేయడం
మానవుని
కర్తవ్యం.
ఈ
కర్తకు
రెండు
లక్షణములు
కలవు,
(1)
తటస్థలక్షణం.
(2)
స్వరూపలక్షణం.
తటస్థలక్షణమనగా
తాత్కాలికంగా
కొన్ని
గుర్తులను
నిరూపించి
ఆ
దివ్యత్వమైన
ఆత్మతత్త్వాన్ని
బోధించుట.
ఆ
పక్షి
కూర్చున్న
ఇల్లు
ఫలానావారి
ఇల్లు,
అని
చూపడం
తటస్థలక్షణం.
అనగా
ఆ
పక్షి
ఆ
యింటిపైన
తాత్కాలికంగా
ఆ
క్షణమున
కూర్చున్నదేకానీ,
అది
ఆయింటిపైన
శాశ్వతంగా
ఉండేది
కాదు.
అదేవిధముగా
కొన్ని
సద్గుణములు,
సత్ప్రవర్తనలు,
సదాలోచనలు,
సదాచారములు,
సచ్చింతలు,
కలిగిన
సమయమునందు
ఇదిదైవత్వము
దివ్యత్వము
అని
నిరూపించడం
తటస్థలక్షణం.
స్వరూపలక్షణమనగా
సత్,
చిత్,
ఆనందము.
సత్యం,
జ్ఞానం,
అనంతం
బ్రహ్మ
(అనగా
సత్యమే
బ్రహ్మస్వరూపం,
జ్ఞానమే
బ్రహ్మస్వరూపం
అనంతమే
బ్రహ్మస్వరూపం)
అని
నిరూపించడం.
వీటిని
అస్తి,
భాతి,
ప్రియ
రూప,
నామములనికూడా
చెప్పవచ్చును.
ప్రతి
పదార్థమునందు
అస్తి,
భాతి,
ప్రియరూపనామములు
మిశ్రమమై
ఉంటున్నవి.
అస్తి
అనగా
ఒక
పదార్థము
‘ఉన్నది’
అని
తెలుపడం.
ఆ
వస్తువును
ప్రకాశింపచేసి,
ఆ
ప్రకాశముద్వారా
ఈ
వస్తువును
నిరూపించడము
భాతి.
మన
అవసరము
బట్టి
దానిని
ప్రీతి
చేయడము,
ప్రియము.
ఇవి
మూడుకూడనూ
దివ్యమైన
దైవగుణములు.
ఇవి
ఆధారములైనవి.
ఇక
రూపనామములు
ఆధేయమైనవి.
ఇట్టి
అస్తి,
భాతి,
ప్రియరూపనామములను
నిరూపించుటకు
మూడు
విధములైన
ప్రమాణములుంటున్నవి.
మొదటిది,
ప్రత్యక్షప్రమాణము;
రెండవది,
అనుమాన
ప్రమాణము;
మూడవది
శబ్దప్రమాణము.
ప్రత్యక్షప్రమాణమనగా!
ఒక
చిన్న
ఉదాహరణము;
ఈ
నాటి
రాత్రి
పాలుగా
ఉండి,
దానికి
తోడంటువేసినప్పుడు
అది
రేపటి
దినమునకు
పెరుగుగా
మారుచున్నది.
2
▾
Meaning
Keep
ఇది
ప్రత్యక్షప్రమాణము.
మానవుని
సాధనలచేత,
ప్రయత్నములచేత,
సంకల్పములచేత
మరుక్షణమునందు
మరొకరూపంగా
తీర్చిదిద్దుకోవడం
ఇది
ప్రత్యక్షప్రమాణం.
ఇది
అనుభవప్రమాణమనికూడా
చెప్పవచ్చును.
అనుమాన
ప్రమాణమనగా
దూరమునందున్న
పర్వతములో
పొగను
చూచి
అక్కడ
నిప్పుఉన్నది
అని
నిరూపించుటకు
ప్రయత్నించడం.
అగ్ని
మనకు
కనిపించకపోయినప్పటికినీ,
పొగను
చూచి
అనుమానంచేత
అక్కడ
అగ్ని
ఉండవచ్చును.
అని
చెప్పడం,
ఇది
అనుమాన
ప్రమాణం.
ఇక
శబ్దప్రమాణము.
కాశీని
చూచివచ్చిన
వ్యక్తి
కాశీక్షేత్రముయొక్క
వర్ణనను
వాక్కు
ద్వారా
కాశీచూడని
వ్యక్తికి
నిరూపించడము.
అయితే
ఈ
శబ్దప్రమాణమునందు
మరి
రెండు
రకములైన
ప్రమాణములు
కూడా
కూడియున్నవి.
1.
లౌకికప్రమాణము.
2.
వైదికప్రమాణము.
లౌకికప్రమాణము
దైవత్వాన్ని
తాను
నిరూపించుటకు
పూనుకొనదు.
ఇంక
వైదికప్రమాణము
ప్రత్యక్షస్వరూపమైన
దివ్యత్వాన్ని
నిరూపించే
పవిత్రతకలిగి
ఉంటుంది.
కనుక
ఈ
వైదికప్రమాణాన్ని
పురస్కరించుకుని
ప్రతిమానవుడు
కూడనూ
కర్తయైన
భగవంతుని
కొంతవరకు
గుర్తించడానికి
ప్రయత్నించడం
అత్యవసరం.
ఇక్కడ
దివ్యత్వమైన
మానవత్వం
ధరించి,
పవిత్రమైన
ఆత్మను
మనము
స్వీకరించి
తద్వారా
దైవత్వమనే
దారిని
ప్రయత్నపూర్వకముగా
సాధించినప్పుడే,
మానవత్వంలో
ఉన్న
దివ్యత్వముకూడనూ
ప్రకటించిన
వారమవుతాము.
మానవత్వములో
ఉన్న
దివ్యత్వము
ప్రకటించడానికి,
అనుభవించడానికి,
ఆచరించడానికి
అనేక
విధములైన
సులభోపాయములు
లేకపోలేదు.
నిజముగా
మానవునికి
అనేక
విధములైన
అపేక్షలలో
ప్రధానమైన
అపేక్ష
ఒకటి
కలదు,
ఆ
యపేక్ష
అకుంఠితమైన
ఆనందము
కావలెనని
ఆశ.
కానీ,
ఇట్టి
ఆనందమునకు
రాత్రింబవళ్ళు
అనేక
విధములైన
శ్రమలుపడి
తద్వారా
నిరాశకు
గురి
అవుతున్నాడు.
నిర్విరామ
కృషిచే,
నిరంతరతాపత్రయములతో,
అంతులేని
ఆశలతో,
అర్థముకాని
ఆవేదనలతో,
అప్రాప్తరూపప్రాప్తికై
ప్రాకులాడే
మానవుడు
అశాంతికి
గురియై
కొంతవరకు
నిస్పృహతో
నిలిచిపోతున్నాడు.
కారణమేమిటి?
తాను
ఆశించిన
ఆనందము
దేహేంద్రియములయందు
లభించునని
భ్రమించి
దేహేంద్రియములవెంట
పరుగిడుతున్నాడు.
కానీ,
ఆనందస్వరూపుడననే
సత్యాన్ని
గుర్తించుకోలేకపోతున్నాడు.
సహజముగా
పిండికి
తియ్యదనమనేది
ఉండుటకు
వీలుకాదు.
ఏ
పిండిఅయినప్పటికినీ,
బెల్లము
చేరినప్పుడే
మాధుర్యము
చేకూరుతున్నది.
ఈ
ప్రపంచమంతయూ
పిండివంటిది.
ఈ
జగత్తనే
పిండియందు
దైవత్వమనే
మాధుర్యము,
(బెల్లము)కూడినప్పుడే
పిండి
సర్వత్రా
మాధుర్యాన్ని
చూపిస్తుంది.
నిజముగా
ఈ
జగత్తునందు
సర్వవ్యాపకమైన
దివ్యత్వము
సర్వత్రాకూడిఉండటంచేతనే
జగత్తును
ఈ
నాడు
మనం
ఆకర్షింపగలుగుతున్నాము.
ఆకర్షణ,
సౌందర్యము,
పవిత్రమైన
ప్రేమ
ఎక్కడ
కలదో
అక్కడంతయూ
దైవత్వమే
తాండవమాడుతున్నది.
కేవలము
దేహేంద్రియముల
భ్రాంతికి
గురియై
మానవుడు
తనయందున్న
దివ్యానందమును,
భవ్యానందమును
గుర్తించుకోలేకపోతున్నాడు.
జగమునందున్న
ప్రతి
చరమునకు
ఒక
స్థిరమైనది
ఉంటున్నది
ఆధారమై.
ఇది
ఒక
మాల.
3
▾
Meaning
Keep
His poems 66
మనకు
కనిపించునవి
పుష్పములు.
కానీ,
ఈ
పుష్పములు
తమంతతాము
నిలుచుకుని
ఉండుటకు
వీలుకాదు.
ఈ
పుష్పములను
బంధించిన
దారము
ఇందులో
ఉన్నది.
పుష్పములు
అనేకములు.
పుష్పములను
బంధించిన
దారము
ఏకము.
అనిత్యమైన,
అనేకమైన
పుష్పములను
పరిశీలించినప్పుడే,
ఆధారమైన
దారమును
గుర్తించడానికి
వీలవుతుంది.
ఈ
వైపున
ఉన్నపూలు
అటువైపున,
అటువైపున
ఉన్న
పూలు
ఇటువైపున
నెట్టి
వేసినప్పుడే
మధ్యనున్న
దారము
మనకు
కనిపించుతుంది.
అదేవిధముగనే
అనిత్యమై,
అశాశ్వతమై,
అసత్యమై
ఉన్న
రూపనామములను
రెండువైపులా
నెట్టినప్పుడే
అందులో
ఉన్న
ఆధారమైన
ఆత్మతత్త్వము
మనకు
అర్థమవుతుంది.
కేవలము
రూపనామములయందే
మన
జీవితమును
అంకితం
గావించుకుని,
ఇదియే
సత్యము
ఇదియే
నిత్యమని
విశ్వసించి
తద్వారా
అంధకారబద్ధులమై
పోతున్నాము.
కదలే
ప్రతిపదార్థమునకూ
కదలని
స్థిరమైన
తత్వము
ఒకటి
ఉన్నది.
మనము
రోడ్డుపైన
కారులో
కదలి
పోతున్నాము.
కారు
కదలుచున్నదే
కానీ
రోడ్డు
కదలడం
లేదు.
అదేవిధముగనే
నిత్యము
అనుభూతిలో
ఉండే
సినిమాలు!
అనేక
బొమ్మలు
వస్తున్నాయి
పోతున్నాయి.
కానీ,
దాని
తెరమాత్రము
కదలడం
లేదు.
74000
నాళములచేత
కదలిపోతున్న
ఈ
దేహమునందు
కదలని
ఆత్మతత్త్వము
ఒకటి
ఉన్నది.
అదే
విధముగనే
జగత్తునందున్న
ప్రతి
పదార్థముకూడనూ
చలనమైనదేకానీ
స్థిరమైనదికాదు.
మానవత్వములో
స్థిరమైన,
పవిత్రమైన
ఆత్మతత్త్వాన్ని
పరిశీలన
చేయాలి.
భారతీయసంస్కృతి,
విజ్ఞానమహాసముద్రము.
అనాదికాలమునుండి
భారతీయసంస్కృతిపైన
అనేక
విధములైన
అవాంతరములు
వ్రాలి
దానిని
క్షీణింపచేయడానికి
ప్రయత్నాలు
సలుపుతూ
వచ్చాయి,
బుద్ధమతము,
జైనమతము,
ముస్లిమ్మతము,
క్రిష్టియన్
మతము,
ఇంకా
అనేకమతములు
భారతీయమతమును
ఛిన్నాభిన్నము
చేయుటకై
పూనుకొన్నాయి.
కానీ
సర్వమతసమ్మిళితమైన
మతిస్వరూపమే
ఈ
మతమనే
సత్యాన్ని
గుర్తించుకోలేకపోయారు.
అన్ని
మతములుకూడను
ఒక్క
దివ్యత్వాన్ని
బోధించే
సత్యసూక్తులు
అని
గుర్తించుకోలేకపోయారు.
మతము
లన్ని
చేరి—మంచినే
బోధించె
తెలిసి
మెలగ
వలెను—తెలివితోడ
మతులు
మంచివైన—మతమేమి
చెడ్డది?
వినుము
భారతీయ—వీరసుతుడ!
ఈ
నాడు
మతసంబంధమైన
భేదములచేత
మానవత్వాన్నే
మరచి
కేవలము
దానవత్వంగా
విజృంభించి
పోతున్నారు.
కొంతమంది
స్వార్థపరులు
కులతత్త్వాలతో
కుస్తీలు
చేస్తున్నారు.
మతతత్త్వాలతో
మారణహోమం
సృష్టిస్తున్నారు.
భారతీయసంస్కృతిని
ఎవ్వరు
ఎన్నివిధముల
తూలనాడినప్పటికినీ,
దానిని
చెడుటకు
ఎన్ని
విధముల
ప్రయత్నము
చేసినప్పటికినీ
ఇది
అసాధ్యమయ్యేవిషయం.
సముద్రమునకు
ఎన్ని
‘పంప్‌సెట్’లు
వేసికొట్టినప్పటికినీ
సముద్రము
ఖాళీ
చేయడానికి
వీలవుతుందా?
సముద్రములోనికి
ప్రవహించు
నదులు
ఎండిపోయిననూ
లేక
అధికంగా
ప్రవహించిననూ
సముద్రము
పెరగటంకానీ
తరగటంకానీ
ఉండదు.
అదేవిధముగా
భారతీయసంస్కృతిని
ఎందరు
ఎన్నివిధములుగా
పరాభవింప
చేయడానికి
ప్రయత్నము
చేసినప్పటికినీ
ఇది
ఏనాటికీ
చెక్కుచెదరక,
కట్టుకదలక
నిత్యమై
సత్యమై
ఉంటుందే
దివ్యత్వాన్ని
ధరించినటువంటిది.
Previous
←
Satya
Next
The way of Jesus
→