Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1980 · The gift of education
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The gift of education
October 1980, Bal Vikas gurus (teachers)
1
▾
Meaning
Keep
His poems 79
Also in his talks
(3)
18 July 1981
Youth must learn
29 May 1989
Victory is only where Kṛṣṇa is
14 January 1995
Prema is like a compass
సత్ప్రవర్తన,
సద్బుద్ధి,
సత్యనిరతి
భక్తి,
క్రమశిక్ష
కర్తవ్యపాలనములు
నేర్పునదె
గురువు
విద్యార్థి
నేర్వవలయు
॥
విద్యాబోధకులారా,
ఏ
దేశములో
కాని,
ఏ
కాలములో
కాని
విద్యావిధానమునకు
రెండే
పరమావధులు.
ఒకటి
ఐహికము
రెండవది
ఆముష్మికము.
మొదటి
దానిని
జీవిత-జీవనోపాధి
అంటారు.
రెండవ
దానిని
జీవన
పరమావధి
అంటారు.
ఈ
ఐహికము
అనేటువంటి
దానిని
మనము
నిత్యజీవితములో
అనుభవిస్తూనే
వుంటున్నాము.
ఈ
ప్రపంచములో,
ఈ
సమాజములో
మానవుడు
బ్రతికి
వున్నంత
కాలము
కూటి
గుడ్డలకు
కొరత
లేక
జీవింప
చేయునదే
ఈ
ఐహికవిద్య.
ఇక
ఆముష్మికమనగా
దానికి
భిన్నమయినటువంటిది.
అతీతమయిన
ఆత్మస్థాయిలో
విహరించేటటువంటిది
ఆముష్మికవిద్య.
జ్ఞానము
అనగా
తెలివి
అని
అర్థము.
అయితే,
ఈ
తెలివికి
వ్యాపక
లక్షణమే
విద్య.
‘సా
విద్యా
యా
విముక్తయే:’
అనగా
ఏది
మనలను
దుఃఖమునుండి
దూరము
చేయునో,
మృత్యువును
తప్పించునో
అదియే
సరిఅయిన
విద్య.
కనుక
మానవుని
దుఃఖమునుండి
దూరము
చేయునది
ఆముష్మిక
విద్యగా
మనము
విశ్వసించాలి.
ప్రతి
మానవుడు
తన
జీవితములో
కోరేటువంటి
కోరికలు
రెండే,
దుఃఖనివృత్తి,
ఆనందప్రాప్తి
జీవితమంతయు
ఈ
రెండింటియందె
ఇమిడియున్నది.
కనుక
దుఃఖనివృత్తి,
ఆనందప్రాప్తి
నిమిత్తమయి
అభ్యసించేటటువంటిదే
ఈ
ఆముష్మిక
విద్య
అనే
సత్యాన్ని
మనము
పిల్లల
హృదయమునకు
హత్తుకునే
విధముగా
బోధించాలి.
ఇది
జ్ఞానం,
జ్ఞేయం,
జ్ఞానలక్ష్యం
—
ఈ
మూడింటియొక్క
ఏకత్వంతో
కూడినటువంటిది.
ఈ
మూడింటికినీ
జ్ఞాన
భాస్కరుడయిన
మాధవుడే
కర్త.
అయితే
దీనికి
శ్రద్ధ
అత్యవసరము.
‘శ్రద్ధావాన్
లభతే
జ్ఞానం’.
శ్రద్ధ
వున్నవారికే
ఇట్టి
జ్ఞానము
లభిస్తుంది.
ఈ
శ్రద్ధ
ఏవిధంగా
లభిస్తుంది?
దశేంద్రియములను
అదుపులో
వుంచిన
వారికి
మాత్రమే
ఆత్మవిశ్వాసముద్వారా
ఈ
విద్య
లభించే
అవకాశం
వుంది.
కనుకనే
ఈ
దశేంద్రియములను
అదుపులో
వుంచే
విధానాన్ని
మనము
మొదట
ఈ
లేతప్రాయమునందే
పిల్లలకు
బోధించటానికి
పూనుకోవాలి.
ఈ
జ్ఞానము
అనగానేమి?
మానవుడు
మాధవుడుగా
మారటమే
జ్ఞానముయొక్క
గమ్యము.
కనుక
జ్ఞానగమ్యము
మాధవత్వమే.
మాధవుడు
—
దీని
అంతరార్థాన్ని
మనము
చక్కగా
గుర్తించాలి.
మా
—
అనగా
ప్రకృతి.
ప్రకృతిని
వశమునందుంచుకునేవాడు
అనగా,
దానిని
నియమించే
భర్తనే
‘ధవుడు’.
ప్రకృతిని
అదుపులో
వుంచుకుని,
దానిని
తన
ఇష్టానుసారముగా
ప్రవర్తింపచేసే
శక్తిసామర్థ్యములు
కలవాడు
మాధవుడు.
పుట్టి,
మెట్టి,
గిట్టుటకు
కారణము
మాధవుడు.
కనుక
యావత్
జీవులయొక్క
సృష్టి,
స్థితి,
లయములు
ఒక్క
మాధవత్వమునందే
వెలువడుతున్నవి;
దైవత్వమనగా
సృష్టి,
స్థితి,
లయములకు
మూలాధారమయినటువంటిది
అని
చెప్పాలి.
2
▾
Meaning
Keep
His poems 257
Also in his talks
(1)
12 October 1998
The True Place of God's Pādukās Is the Heart Itself
నీటియందె
పుట్టి
నీటియందె
నిలచి
నీటియందడగు
నీటి
బుడగ
నరుడు
బుద్బుదము,
నారాయణుడు
నీరు
।
కనుక
ప్రతి
జీవియును
నారాయణుడను
జలమునందే
ఆవిర్భవించినది,
జన్మము,
ధన్యము,
గమ్యము
అన్నీకూడను
ఒక్క
లక్ష్యమునుండే
వెలువడినటువంటివి.
కనుక
సర్వాధారుడైన
సర్వేశ్వరుని
గుర్తింపజేయునదే
ఆముష్మికవిద్య,
కాని
నేటి
ఆధునిక
యుగమునందు
అనేకమంది
పెద్దలు
రాజకీయవేత్తలు,
ఆధ్యాత్మిక
ప్రబోధకులు
అనేక
విధములుగా
లోకములో
ప్రచార
ప్రబోధలను
సలుపుతూ
వస్తున్నారు.
కట్టుటకు
బట్ట,
తినుటకు
తిండి,
నివసించుటకు
ఇల్లు,
రోగమొస్తే
నివారణకు
మందు,
పొట్టను
పోషించుటకు
అంతో
ఇంతో
విద్య
వుంటే,
మానవుడు
సుఖశాంతులు
అనుభవిస్తాడు
అనేటటువంటి
బలహీనతావిశ్వాసము
మానవునియందు
అభివృద్ధి
అవుతోంది,
కాని
భౌతిక
సౌఖ్యములు
మానవునికి
సుఖశాంతులను
అందించలేవని
గుర్తించటము
లేదు.
సుఖశాంతులు
ఆత్మస్థాయినుండి
లభించేటటువంటివే
కాని
అన్యవస్తువులనుండి
లభించేటటువంటివి
కావు;
భౌతిక
సదుపాయములు
కలవారు
చాలామంది
వున్నారు.
కాని
వారు
నిజముగా
సుఖశాంతులు
అనుభవిస్తున్నారా?
లేదు.
భౌతిక
సౌఖ్యములు
కేవలము
ఐహిక
సుఖములను
చేకూర్చునవే
కాని
ఆముష్మికమైన
ఆనందాన్ని
అందించలేవు.
అయితే
మానవుడు
అనగా
ఎవరు?
కేవలము
రక్తమాంసములు,
ఎముకలు,
చర్మముతో
కూడినటువంటివాడా?
అట్లే
అయిన,
కేవలము
భౌతిక
సదుపాయములతోనే
సంతృప్తిని,
శాంతిని
పొంది
వుండేటటువంటివాడు,
కాని
మానవుడు
కేవలం
రక్తమాంసములతో
కూడినటువంటి
వాడే
కాదు,
ఇది
కేవలం
భౌతిక
స్వరూపం.
ఇది
స్థూలమయిన
రూపం.
దీనికి
సూక్ష్మమయిన
మనస్సు,
దానికి
అతీతమయిన
కారణమను
ఆత్మ
వున్నాయి.
మానవుడు
స్థూల,
సూక్ష్మ
కారణ
శరీరములు
కలవాడు.
భౌతిక
సుఖములతో
జీవించేది
స్థూల
శరీరమేకాని,
సూక్ష్మ,
కారణ
శరీరములు
కావు.
మనము
ఎక్కువ
భాగమయిన
సూక్ష్మ,
కారణ
శరీరాన్ని
మరచిపోతున్నాము.
కనుక
సుఖ
శాంతులను
సమకూర్చేటటువంటివి
సూక్ష్మ,
కారణ
శరీరంచే
అన్న
సత్యాన్ని
పిల్లలకు
చక్కగా
బోధించాలి.
అందుకనే
వేదాంత
పరిభాషయందు
‘మనయేవ
మనుష్యాణాం
కారణం
బంధ
మోక్షయోః’
అని
అన్నారు.
బంధములకు,
మోక్షమునకు
మనస్సే
కారణము
కాని
దేహము
కాదు.
ప్రతి
మానవుడు
కూడను
మానసిక
శాంతికై
తపిస్తున్నాడు.
మానవుడు
సుఖ
శాంతుల
నిమిత్తమయి
ఈ
దేహముతో,
పవిత్ర
భావములతో
కొన్ని
సత్కర్మలను
ఆచరించటానికి
పూనుకోవాలి.
మానవుడు
సుఖాభిలాషి,
ఆనందపిపాసి.
ఈ
రెండుఅయిన
మానవుడు
తన
సుఖము,
ఆనందము
ఎక్కడనుండి
లభిస్తుంది
అనే
విచారణ
సలుపకుండా
కేవలం
భౌతిక
లౌకిక
సుఖములనే
మార్గములో
ప్రవేశించటముచేత,
తన
నిజ
సుఖాన్ని
కోల్పోతున్నాడు.
నిజముగా
ఆనందం
ఎక్కడనుండి
వస్తుంది?
బయటనుండి
వస్తుందా?
కాదు,
ఆనందము
మనకు
సహజము.
అది
మన
స్వభావము.
చక్కెరకు
తీపి
ఎలా
సహజమో,
పుష్పమునకు
సువాసన
ఎలా
సహజమో,
మానవునకు
ఆనందము
అలా
సహజము.
కనుకనే
మనము
ఏదైనా
ఒక
బజారునందు
పోవునపుడు
మార్గమునందు
ఒక
వ్యక్తి
గోడుగోడున
ఏడ్చుచుండగా
‘అయ్యా
మీరు
ఎందుకు
అట్లా
ఏడ్చుచున్నారు’
అని
అడుగుతాము.
ఈ
విధముగా
ప్రశ్నించటములో
అంతరార్థమేమి?
ఆనందించవలసిన
మానవుడు
ఏడుస్తున్నాడు.
ఈ
ఏడుపుకు
కారణమేమి?
ఏడుపు
అసహజము.
అదే
ఎవరైనా
ఆనందముగా
వున్నప్పుడు
వారిని
‘మీరు
ఎందుకు
విచారముగా
లేరు’
అని
అడగము.
3
▾
Meaning
Keep
కారణము,
ఆనందము
సహజ
లక్షణము.
ఈ
కాలములో
మన
సహజమయిన
ఆనందాన్ని
మరచేటటువంటి
విద్య
మనము
అభివృద్ధిపరచుకుంటున్నాము.
ఆనందమయిన
ఆత్మతత్వాన్ని
అంతర్ముఖంగా
విచారణ
సలిపేటటువంటి
శక్తిని
మనము
అలవరచుకోవటము
లేదు.
మన
దృష్టిని
మనం
అంతర్ముఖం
చేసుకుని,
విచారణశక్తికి
తగిన
అవకాశం
అందించాలి.
ఈ
నాటి
విద్యలన్నీ
ఏ
రకంగా
వున్నవనగా,
ఉన్న
సమయమంతా
గ్రంథములు
చదవటానికే
వినియోగిస్తున్నాము.
ఇవి
చదివి,
చదివి
confusion
అయిపోతోంది.
నిజముగా
విద్యను
శ్రవణము
ద్వారానే
నేర్పాలి.
గ్రంథము
ద్వారా
విద్య
నేర్పకూడదు.
గ్రంథంద్వారా
విద్య
నేర్చుకునే
విద్యార్థులకు
ఏకాగ్రత
తక్కువ
అయిపోతుంది.
ఇంటికి
పోయి
text
book
చూసుకోవచ్చు
కదా
అని
విద్యార్థులు
teacher
చెప్పే
విషయాన్ని
కొంత
అలక్ష్యముగా
వింటారు.
Texts,
notes
వుండటం
చేత
students
వారి
ఏకాగ్రతను
దుర్వినియోగం
చేస్తున్నారు.
ప్రాచీన
కాలమందు
ఈ
Printed
books,
notes
వుండేటటువంటివి
కావు.
గురు
శిష్యులు
ముఖాముఖిగా
కూర్చుని
విద్యనభ్యసించేవారు.
ఆ
శిష్యులు
కూడను
5
లేక
6గురు
మాత్రమే
వుండేవారు.
శిష్యులు
ఏకాగ్రతతో
గురువు
చెప్పే
విషయాన్ని
హృదయానికి
హత్తుకునే
విధంగా
అందుకునే
వారు.
శిష్యులు
తక్కువగా
వుండటం
చేత,
గురువు
ఏ
శిష్యుడు
వింటున్నాడో
ఎవరు
వినటం
లేదో
గ్రహించటానికి
అవకాశం
వుండేది,
గ్రంథముచేత
విద్య
నేర్చుకునేవారు
ఏ
ఒక్కరో
ఇద్దరో
వుండేవారు.
ఎక్కువమంది
శ్రవణంద్వారానే
నేర్చుకునేవారు.
కనుకనే
నవవిధ
భక్తి
మార్గములలో
శ్రవణమునకు
మొదటి
స్థానం
ఇచ్చారు.
ఈ
విధమయిన
విద్యా
బోధనలో
గురువుకు
కూడా
తాను
చెప్పబోయే
విషయం
కంఠస్థముగా
వచ్చి
వుండాలి.
ఇది
హృదయమునుండి
హృదయమునకు
అందించే
విద్య.
భగవంతుడు
అవ్యక్తంగా
మనలో
వుంటుంటాడు.
ఈ
అవ్యక్తమయిన
దానిని
వ్యక్తం
చేయటానికి
సాధన
అవసరం.
అగ్గిపుల్ల
పెట్టిలో
వున్నంతకాలం
దానిలోని
అగ్ని
అవ్యక్తంగా
వుంటుంది.
దానిని
బయటకు
తీసి
గీచినపుడు
మంట
వస్తుంది.
అనగా
ఈ
గీయటం
అనే
చర్య
ద్వారా
పుల్లలో
అవ్యక్తంగా
వున్న
అగ్నిని
వ్యక్తం
కావించాము.
అదే
విధముగానే,
మనలో
జ్ఞానమనే
అగ్ని
అవ్యక్తంగా
వుంది.
దీనిని
వ్యక్తం
కావించటానికి
జపము,
ధ్యానము,
భజన,
మొదలయిన
సాధనల
ద్వారా
దానిని
వ్యక్తం
చేయటానికి
ప్రయత్నించాలి.
లోకములో
మనము
ఏ
పదార్థాన్ని
కోరినా
దానియందు
ఒక
ప్రేమ
వుంటుంది.
ప్రేమ
వుండినపుడే
దానిని
కోరుకుంటాము.
ఆ
ప్రేమ
మాత్రమే
కాక
దాని
విశిష్టతయందు
విశ్వాసం
కూడా
మనలో
వుండాలి.
ఈ
రెండు
వుండినంత
మాత్రమున
ఆ
వస్తువు
మనకు
చిక్కదు.
ఆ
వస్తువును
పొందేటటువంటి
కర్మను
ఆచరించాలి.
దానిని
పొందేటందుకు
ఆచరించే
విధి
విధానమే
కర్మమార్గము.
దానిని
ప్రేమించటమే
భక్తి
మార్గము.
దానిని
విశ్వసించటమే
జ్ఞాన
మార్గము.
కనుక
మనము
ఏదైనా
ఒక
దానిని
పొందాలనుకున్నప్పుడు
అందులో
కర్మ,
భక్తి,
జ్ఞాన
మార్గములు
సమ్మిళితములై
వుంటున్నాయి.
అనేకమంది
భక్తి
అంటే
గిట్టనివారు
వుంటుంటారు.
నిజముగా
భక్తి
అంటే
తెలియని
మూర్ఖులే
ఇటువంటివారు
అని
చెప్పవచ్చు.
భక్తి
అంటే
ఏమిటి?
ప్రేమ.
నాకు
అన్నము
కావాలి.
అన్నాన్ని
ప్రేమిస్తున్నాను.
అది
అన్నముపైన
భక్తి.
తింటేకాని
ఆకలి
తీరదు
అన్న
విశ్వాసము
జ్ఞానము.
4
▾
Meaning
Keep
దానిని
పొందటానికి
చేసే
ప్రయత్నము
కర్మమార్గము.
ఇది
అన్నము
నిమిత్తమయి
ఆచరించే
కర్మ.
భక్తి
జ్ఞాన
మార్గములు
అదే
విధముగానే
ఆత్మ
నిమిత్తమయి
ఆచరించే
కర్మ,
భక్తి,
జ్ఞాన
మార్గములు
కావాలి.
అన్నము
దేహనిమిత్తము.
ఆనందము
మనస్సు
నిమిత్తము.
జ్ఞానము
ఆత్మనిమిత్తము.
కనుకనే
ఈ
మూడు
ఆహారములను
పొందటానికి
కర్మ,
భక్తి,
జ్ఞాన
మార్గములను
అనుసరించాలి.
అందుకనే
నేను
అనేక
పర్యాయములు
చెప్తూంటాను.
You
are
not
one
Person
but
you
are
three
Persons.
The
one
you
think
you
are
-
that
is
body
–
అన్నగత
ప్రాణ
The
one
others
think
you
are
-
that
is
mind
–
మనోగత
ప్రాణ
The
one
you
really
are
-
that
is
Atma
–
ఆత్మగత
ప్రాణ.
ఈ
మూడు
ప్రాణములను
మనము
ముమ్మూర్తులుగా
భావించి
దానికి
తగినటువంటి
విద్యా
విధానాన్ని
అనుసరించాలి.
ధనముతోను,
విద్యతోను,
భౌతిక
సుఖములను
అనుభవించవచ్చును.
కాని
అవి
తాత్కాలికము,
శాశ్వతము
కాదు.
‘నాకు
ఇప్పుడు
ఆకలిగా
వుంది.
నేను
అన్నము
కోరుతున్నాను.
అన్నము
చిక్కింది
తృప్తి
అయింది,’
ఎంత
కాలము?
తిరిగి
ఒక
2
గం.
వరకు.
తిరిగి
ఆకలి,
అన్నం
కావాలి.
భౌతికమయిన
తృప్తి
అంతా
‘పునరపి
జననం,
పునరపి
మరణం’
వంటిది,
కాని
మానసిక
శాంతి
లభించెనా
అది
ఎప్పుడు
మనము
స్మరించినా
ఆ
సంతృప్తిని
అందిస్తుంది.
కనుక
మానసిక
శాంతిని
అందించగల
విద్యను
అభ్యసించాలి.
మానసిక
శాంతికి
మాధవత్వాన్ని
గుర్తించాలి.
ఏకాత్మభావాన్ని
గుర్తించడానికి
ప్రయత్నించాలి.
ఏకాత్మభావం
ఒకటిగా
వుంటుంది.
దేహాత్మ
భావం
అనేకంగా
వుంటుంది.
ఉపనిషత్లలో
తత్,
త్వంలకు
సమన్వయము
వివరించబడింది.
తత్
ఏది?
త్వం
ఏది?
ఈ
రెండింటినీ
కలిపేది
ఏది?
Answer
చెప్పేది
‘తత్’
Question
వేసేది
‘త్వం’.
ఈ
రెంటినీ
కలిపేది
‘అసి’.
కనుక
తత్త్వమసి.
ఇది
ఉపనిషత్తు.
ఉప
అనగా
‘దగ్గిర’,
‘ని’
అనగా
‘క్రింద’,
‘షత్’
అనగా
‘కూర్చో’.
అనగా
శిష్యుడు
గురువునకు
దగ్గరగా
క్రింద
కూర్చొని
విద్యనభ్యసించాలి.
క్రిందనుండి
శిష్యుడు
ప్రశ్నిస్తాడు.
పైనుండి
గురువు
జవాబు
చెప్తాడు.
Answer
చెప్పిన
తరువాత
గురు
శిష్యులు
ఏకమయిపోతారు.
ఉపనిషత్తులు
జీవాత్మ,
పరమాత్మల
సంబంధాన్ని
తెలుపుతుంది.
శిష్యుడు
లేక
జీవుడు
తత్త్వమసి
అనే
స్థాయినుండి
‘అహం
బ్రహ్మాస్మి’
అనే
స్థాయికి
చేరతాడు.
Who
is
Brahma?
బ్రహ్మ
ఎవరు
అనే
ప్రశ్నకు
‘ప్రజ్ఞానం
బ్రహ్మ’
అనే
answer
లభిస్తుంది.
దీనినే
‘అయం
ఆత్మ
బ్రహ్మ’
అని
చెప్పవచ్చు.
అనగా
‘అయం
ఆత్మా
అయం
బ్రహ్మ’
(I
am
Atma,
I
am
Brahma).
కనుక
పిల్లలకు
నేర్పేటప్పుడు
ముందుగా
వారు
క్రింద
కూర్చుని
నేర్చుకునే
విధంగా
నేర్పాలి.
పిల్లలను
ప్రేమించవలసినదే,
కాని
వారిని
వారి
స్థాయిలో
వుంచాలి,
కాని
మన
స్థాయిలో
వుంచరాదు.
గురుశిష్య
సంబంధము
వున్నప్పుడే
విద్యాబోధన
సాధ్యం.
ఉద్దాలకుడు
మహాజ్ఞాని.
తన
కుమారుడయిన
శ్వేతకేతును
విశ్వామిత్రుని
వద్దకు
విద్య
నేర్చుకునేటందుకు
పంపించాడు.
కారణం
ఏమిటి?
తనకు
విద్య
లేదా?
ఎంత
నేర్పినప్పటికినీ,
తనకు,
తన
కుమారునికి
మధ్య
తండ్రి
కుమారుల
భావమే
వస్తుంది,
కాని
గురు
శిష్య
భావము
రాదు.
గురుభావము
వుంటేనే
శిష్యునికి
విద్య
ప్రాప్తిస్తుంది.
కనుక
పిల్లలను
ప్రేమించి
లాలించాలి,
కాని
కొన్ని
సమయములలో
శిక్షించ
వలసి
వచ్చినప్పుడు
శిక్షించాలి.
5
▾
Meaning
Keep
శిక్ష
లేకపోతే
రక్షణ
లేదు.
ఈ
కాలంలో
ఇటువంటి
శిక్ష
లేదు
కాబట్టి
విద్యార్థుల
విద్య
వ్యర్థం
అయిపోతుంది.
అయితే
శిక్షకూడా
క్రమంగా
వుండాలి.
అప్పుడే
క్రమశిక్షణ
అవుతుంది.
గురువు
కదా
అని
శిక్ష
మరీ
కఠినముగా
వుండకూడదు.
విద్యాబోధకులు
ఈ
విషయములు
మనసునందు
వుంచుకుంటే,
మన
భావిభారత
విద్యార్థులు
మన
దేశానికే
కాక,
ఇతర
దేశములకు
కూడా
ఉపయోగకరముగా
వుంటారు.
ముఖ్యంగా
పిల్లలకు
భారతీయ
సంస్కృతి
గురించి
వివరించాలి.
ఎంతోమంది
ఋషులు,
ప్రభువులు,
పతివ్రతలు,
త్యాగంచేసి
మన
భారతీయ
సంస్కృతిని
నిలబెట్టారు.
కనుకనే
ఈనాటి
పరిస్థితులలో
కూడను
నిజాయితీతో
జీవించటానికి
వీలవుతోంది.
పిల్లలకు
ముఖ్యంగా
నైతిక,
ధార్మిక,
ఆధ్యాత్మిక
విషయాలను
నేర్పాలి.
వీటితోబాటు
అన్ని
మతములపట్ల
సమభావము,
గౌరవభావము
పెంపొందించాలి.
అన్ని
మతములు
బోధించేది
ఒక
సత్యమే.
అన్ని
మతములు
ఒకే
ధర్మాన్ని
ఒకే
గమ్యాన్ని
బోధిస్తున్నాయి.
కనుక
బాలవికాస్
పిల్లలు
ఏ
మతముపట్ల
కూడ
వ్యతిరేక
భావములు
కలిగి
వుండరాదు.
మొదట,
నీతి
వాక్యములు,
నీతి
మార్గములు,
పవిత్రధర్మములు
బోధించే
రామాయణ,
భారత,
ఖురాను,
బైబిలు
మొదలగు
పవిత్ర
గ్రంథములలోని
సూక్తులను
పిల్లలకు
బోధించాలి.
ఇంక
మనము
కూడా
మంచి
నడవడికను
కలిగి
వుండాలి.
వారికి
బోధించి
మనము
ఆచరించకుండా
వుండరాదు.
మనము
ఇక్కడ
ఎంత
బోధించినప్పటికీ,
ఇంటిలోని
వాతావరణము
సరిగ
లేని
యెడల
మన
బోధన
అంతా
వ్యర్థమయిపోతుంది.
కనుక
పిల్లల
తల్లిదండ్రులను
కూడా
కలసి,
వారు
ఇంట్లో
పిల్లలకు
ఎటువంటి
training
యివ్వాలి
అనికూడా
మనము
వారికి
చక్కగా
బోధించాలి.
అసలు
తల్లితండ్రుల
వలననే
పిల్లలు
కొంతవరకూ
చెడిపోతున్నారు.
అతి
గారాబముచేత
పిల్లలు
పాడయిపోతారు
మన
ప్రేమను
మనము
అదుపులో
వుంచుకోవాలి
వారికి.
అవసరమయినదానికన్న
ఎక్కువ
డబ్బు
ఇవ్వరాదు.
పిల్లలు
ఆదర్శవంతముగా
తయారవాలంటే
ఒక
ప్రక్క
తల్లిదండ్రులు,
ఒక
ప్రక్క
teachers
బాధ్యులు.
భారతదేశపు
భవిష్యత్తు
అంతా
బాలవికాస్
పిల్లలపైన
ఆధారపడివుంది.
ఈనాటి
బాలవికాస్
విద్యార్థులు
రేపు
మా
College
విద్యార్థులు.
ఇది
ప్రాథమిక
విద్య.
ఇది
foundation.
వారి
భవిష్యత్తు
దీనిమీద
ఆధారపడి
వుంది.
ఇక్కడ
అలక్ష్యం
జరిగితే
మొత్తం
భవనం
కూలిపోతుంది.
వారి
జీవిత
భవనానికి
ఇది
foundation.
కనుక
మీరు
మంచివారుగా
వుండాలి.
మీరు
చేసే
సేవ
దేశసేవ
సంఘసేవ,
దైవసేవ
విశ్వసేవగా
భావించుకోవాలి.
సర్వసేవలు
కూడనూ
ఈ
ఉపాధ్యాయ
స్థానములో
వున్నాయి.
ఉపాధ్యాయునిది
చాలా
గొప్ప
స్థానం.
విద్యాదానం
అన్ని
దానాలలో
గొప్పది.
మీరు
దేశాన్ని
తీర్చి
దిద్దే
శిల్పులు
విద్యార్థులనే
శిలలను
తీర్చి
దిద్దవలసిన
బాధ్యత
మీపై
వున్నది.
మీరు
కొంచెం
శ్రమపడితే
దేశానికే
సేవ
చేసినవారవుతారు.
మన
ఈ
లక్ష్యాన్ని
స్వార్థరహితంగా
సేవచేసి
సాధించాలి.
వారిని
మీ
బిడ్డలుగా
భావించి,
పిల్లలను
చక్కగా
తీర్చి
దిద్దుతారని
నేను
ఆశిస్తున్నాను.
మీకున్న
సమస్యలుకాని,
ప్రశ్నలు
కాని,
సందేహాలు
కాని
నాకు
చెప్తే,
వాటికి
సమాధానాలు
చెప్తాను.
కనుక
మీరు
కాలమును
వృధా
చేయకుండా
మీ
బాధ్యతను
సక్రమంగా
నిర్వర్తిస్తూ,
ఇంకా
ఇతర
ఉపాధ్యాయులకందరికినీ
ఈ
విషయాలనందించి,
అవసరమయిన
సలహాలు,
ప్రోత్సాహాలు
ఉత్సాహాలు
అందిస్తారని
ఆశిస్తూ,
ఆశీర్వదిస్తూ,
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
The worthwhile life
Next
Grow in love
→