Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1982 · Prema and Śānti
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Prema and Śānti
25 February 1982, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 277
Also in his talks
(5)
6 March 1989
God is the embodiment of Prema
28 July 1992
To love God for God's own sake: that alone is true Bhakti
2 September 1992
Teaching equal-mindedness is the chief aim of Divinity
23 November 1996
We Must Make Human Life a Life Full of Prema
17 July 1997
The principle of the Ātma and divinity
ప్రేమరూపంబు
బ్రహ్మంబు
ప్రేమమయము
ప్రేమప్రేమతో
సంధింప
నీమమగును
కాన
ప్రేమను
పూర్తిగా
కలిగియున్న
అద్వితీయ
భాగ్యంబు
అరయవచ్చు.
పవిత్రాత్మస్వరూపులారా!
మానవత్వము
అతి
దివ్యమైనది,
భవ్యమైనది.
ఈ
మానవత్వముతో
విద్యలనభ్యసించటము
మరింత
పవిత్రమైనది.
విజ్ఞానము
లేని
విద్య,
వినయము
లేని
జ్ఞానము,
నమ్రత
లేని
పాండిత్యము,
మాధుర్యము
లేని
గానము,
శీలము
లేని
జీవితము
చిల్లిగింజకు
కూడా
పనికిరావు.
నిజముగా
విద్యనభ్యసించుట
యనగా
వివేకవినయములు
అలవరచుకొనుటకే.
వినయము
నమ్రతతోకూడి
మాధుర్యము
కలిగి
వుంటుంది.
మాధుర్యము
శీలముతో
కూడాలి.
ఏతావాతా,
విద్యయొక్క
గమ్యము,
చివరి
నిష్కర్ష
గుణము.
ప్రేమయే
సర్వభూతముల
సారము.
సర్వభూతములయందు
నిరూపించే
ప్రేమతత్త్వమే
దైవారాధన.
సర్వసమయములందును
ఉత్తమమైన
రసము
కరుణారసము.
సర్వధర్మములయందును
మానవుని
కర్తవ్యము
చిత్తశుద్ధి.
సమస్త
సాధనలయొక్క
గమ్యము
శాంతిసాధనము.
ప్రేమస్వరూపులారా!
శాంతి!
శాంతి!
శాంతి!
శాంతిని
మనము
అనుభవించటము,
అభివృద్ధిగావించుకొనటము
చాలా
కష్టమైనటువంటిది.
ఎవరేమన్ననూ
శాంతముగా
వుండటము,
ఎవరెన్ని
బాధలు
పెట్టిననూ
శాంతిని
వహించటమూ,
ఎన్ని
ఇక్కట్లు
కలిగించినను
శాంతముతో
అందుకొనటము,
ప్రారంభములో
అతి
చేదుగా
వుంటుంది.
కాని,
భవిష్యత్తులో
ఈ
శాంతమే
అమృతాన్నందిస్తుంది.
‘ఏమి
చెప్పినా
కూడా
ఓపికగా
వుండినాడే,
వీడు
పిరికివాడు,
చేతకానివాడు,
రౌద్రములేనివాడు,
బలహీనుడు’
అని
ఎవరైనా
ఎన్నైనా
అనుకోనీ.
వారనుకున్నంత
మాత్రమున
మనకు
కలిగే
నష్టమేమీ
లేదు.
నిజముగా
‘వారు
అడ్డుకుంటున్నారే’
అని
ఆవేశాన్ని,
ఉద్రేకాన్ని
మనము
అభివృద్ధిపరచుకొన్నామా,
మన
జీవితానికే
ముప్పు
సంభవిస్తుంది.
నిజముగా
ఆధ్యాత్మిక
మార్గములో
సౌఖ్యము,
సంతోషము
లభించవలెనన్న
శాంతము
ఒక్కటే
మార్గము.
‘శాంతము
లేక
సౌఖ్యము
లేదు...
సారస
దళనయనా’
అని.
అంతేకాక
ఇది
ఒకరికి
మాత్రమే
కాదు,
‘దాంతునికైన...
వేదాంతునికైన...
శాంతములేక
సౌఖ్యము
లేదు’.
ఈనాటి
పాండిత్యములో
విషయాలతో
తల
నింపుకుంటున్నామేగానీ,
ప్రేమతో
హృదయమును
నింపుకోటం
లేదు.
ఈవిధమైన
విషయాలన్నీ
ఇన్ఫర్మేషన్తో
కూడినందున
కళాశాలలో
పరీక్షలుగా
జరిగిపోతుంటాయి.
ఎగ్జామినేషన్
జరుగుతూ
వుంటుంది.
విద్యార్థులకు
క్వెశ్చన్
పేపరు
ఇస్తారు.
ఈ
క్వెశ్చన్
పేపరుకు
నీవు
ఆన్సర్సు
వ్రాస్తున్నావు.
నీవు
చదివింది
జ్ఞాపకముందా
లేదా
అనేది
ఈ
ఎగ్జామినేషన్.
అయితే
ఇది
నిజమైన
ఎగ్జామినేషన్
కాదు.
నిజమైనదానిలో
జీవితపర్యంతం
కూడా
మనము
ఆచరించే
అనుష్టానమే
నిజమైన
టెస్టు.
దానికి
చిత్తశుద్ధిని
పవిత్రముగా
ఎంచుకోవాలి.
చిత్తశుద్ధి
నిమిత్తమై
పవిత్ర
కర్మలాచరించాలి.
అందుకే
‘చిత్తస్య
శుద్ధయే
కర్మః’
అన్నారు.
లోకంలో
వున్నదంతా
అనుభవించాలనీ,
భాగ్యాన్నంతా
పొందాలనీ,
సంతోషాన్నంతా
జుఱ్ఱుకుందామనీ
జీవితాన్ని
వ్యర్థంగావించుకోటం...
ఇది
మానవత్వం
కానేరదు.
సద్భావములు,
సదాలోచనలు,
సద్గుణములు
మానవునియందు
లేనప్పుడు
వాడు
నిజముగా
ఆకారానికి
మానవుడేగానీ
రాక్షస
సమానుడు.
బహిర్భూమిలో
దుర్గంధంతోకూడిన
జలముయొక్క
గుంటవలన
జాతికి
అపకారము
జరగదు.
అయితే
ఎవని
హృదయము
మలిన
భావములతో,
దురాలోచనలతో
కూడి
వుంటుందో
అట్టి
మానవుని
వలన
జాతికి
చాలా
అపకారము
జరుగుతుంది.
కనుక,
దుర్గుణములను
దూరము
చేసుకొనే
నిమిత్తము
మనము
విద్యనభ్యసించాలి.
‘విద్యా
అర్థయతే
ఇతి
విద్యార్ధి’.
‘విద్’
అనగా
వెలుగు.
‘య’
అనగా
ఏది?
ఏది
వెలుగును
అందించునో
అదే
విద్య.
దీనిని
ఎవరు
అభ్యసించాలి?
నరః.
ఇది
రెండక్షరములు.
‘రః’
అనగా
నాశనము
‘న’
అనగా
లేదు.
నాశనము
చేయనివాడు
నరుడు.
నాశనము
కావించనివాడు
నరుడు.
నాశనాన్ని
కోరనటువంటివాడు
నరుడు.
అలాంటి
నరుడని
పేరు
పెట్టుకొని
సర్వనాశనమునకు
తాను
మూలకారణంగా
వుంటున్నవాడు
నరుడెట్లా
అవుతాడు?
‘శర్యతే
ఇతి
శరీరః’.
శరీరము
జీర్ణించుకుపోవునటువంటిది.
ఇది
ఏనాటికైనా
కూలిపోయేదే.
కానీ,
తనయొక్క
హృదయము
ఎప్పుడూ
కూడను
పవిత్రంగా
వుంటుంది.
దానికి
చావుపుట్టుకలు
లేవు.
అది
నిజమైన
మానవత్వము.
ఆ
కాన్షన్స్ను
నీవు
ఫాలో
చెయ్యాలి.
follow
the
master,
face
the
devil,
fight
to
the
end,
finish
the
game.
లోపల
ఒకటి,
బయట
ఒకటీ
పెట్టుకొని,
ఇతరులననుసరించే
దుష్టులనెంతమాత్రం
నమ్మకూడదు.
2
▾
Meaning
Keep
అది
జీవితమునకే
ముప్పు.
అట్లాంటి
జీవితము
ఎన్నటికీ
శాంతిననుభవింపజాలదు.
ఈనాడు
ఎం.ఎస్.సి.,
పి.హెచ్.డి.,
ఇంకా
ఎంతో
ఉన్నతమైన
డిగ్రీలు
పొందవచ్చును.
ఈ
పట్టాలన్నీ
కేవలం
నీవు
చదివిన
చదువుకే
వచ్చినవిగాని
ఆచరణకు
వచ్చినవికావు.
పట్టాను
చేతితో
పట్టుకొని
కూర్చుంటే
నీ
పొట్ట
నిండుతుందా?
పట్టాలు
అందించిన
దానిని
ఆచరణలో
పెట్టి,
చెమటోడ్చి,
కష్టించి
జీవించినప్పుడే
నీ
పొట్ట
నిండుతుంది.
శాంతి
దొరుకుతుంది.
Previous
←
The Sādhana of Unity
Next
The triple purity
→