Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · Brahmacarya Is Moving Everywhere with the Feeling of Brahman
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Brahmacarya Is Moving Everywhere with the Feeling of Brahman
23 April 1988
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
ఈ
భవనమునకు
గ్రౌండ్
ఫ్లోర్
చాలా
ప్రధానమైనది.
మిగిలిన
మూడు
అంతస్తులన్నియుకూడను
క్రింద
అంతస్తుపైన
ఆధారపడియున్నవి.
అదియే
ఈనాటి
బ్రహ్మచర్యముయొక్క
అంతస్తు.
యవ్వనము,
బాల్య
జీవితముపై
ఆధారపడినటువంటిది.
బాల్యజీవితమును
పవిత్రమైనదిగాను,
ప్రశాంతమైనదిగాను,
దివ్యమైనదిగాను
తీర్చిదిద్దుకోవలెను.
బ్రహ్మచర్యమనగా
పవిత్రమైన
భావము,
చర్యలు,
ఊహలు
వీటితోకూడినటువంటి
జీవితమే!
కాని
దురదృష్టవశాత్తు,
బ్రహ్మచర్యమనగా
కేవలము
వివాహము
చేసుకొనకుండా
జీవితాన్ని
ఏదో
విధముగా
గడుపుకోటం
అనుకుంటుంటారు.
ఈ
పదమునందే
దీనియొక్క
పవిత్రత
ఇమిడియుంటుండాది.
బ్రహ్మచర్యము
జీవితములోని
నాలుగు
ఆశ్రమములందు
అంతర్భూతముగా
ఉంటుంది
బ్రహ్మచర్యము
అనగా
ఏ
చర్యను
మనము
అనుభవించినా,
ఏ
భావమును
మనము
సంకల్పించినా,
ఏ
కార్యములో
ప్రవేశించినా,
బ్రహ్మభావముతో
చూచుకొనటమే!
సర్వత్రా
బ్రహ్మభావముచేత
చరించటమే
బ్రహ్మచర్యము.
పవిత్రమైన
భావములతో
కూడినప్పుడే,
దివ్యమైన
చర్యలతో
కూడినప్పుడే,
నిస్వార్ధమైనటువంటి
సేవలతో
కూడినప్పుడే,
బ్రహ్మచర్యము
సఫలమవుతుంది.
బ్రహ్మచర్యము
కేవలము
బాల్యమునకు
మాత్రము
సంబంధించినదే
కాదు.
మీద
మూడు
అంతస్తుల
స్థానమందుకూడా
బ్రహ్మచర్యము
అంతర్భూతముగా
వుంటుండాది.
క్రింద
గ్రౌండ్
ఫ్లోర్
బ్రహ్మచర్యము.
రెండవది
గృహస్థము.
మూడవది
వానప్రస్తము.
నాల్గవది
సన్యాసము.
అనగా
బ్రహ్మచర్యమనేటువంటిది
మిగిలిన
మూడింటియందు
అంతర్వాహినిగా
వుంటుండాది.
బ్రహ్మచర్య
బ్రహ్మచర్యము,
గృహస్థ
బ్రహ్మచర్యము,
వానప్రస్త
బ్రహ్మచర్యము
మరియు
సన్యాస
బ్రహ్మచర్యము-ఇలా
అన్నింటియందుకూడను
బ్రహ్మచర్యమనేటువంటిది
అంతర్భూతమై
వుంటుండాది.
2
▾
Meaning
Keep
అన్నింటియందు
పవిత్రత
ఉండాలి.
ఈ
పవిత్రతను
ప్రవేశపెట్టినప్పుడే
బ్రహ్మచర్యమునకు
అర్థము
వుంటుండాది.
విద్యార్థిదశ
చాలా
పవిత్రమైనది
మానవుడనగా
పవిత్రమైనటువంటివాడు,
గుర్తింపబడినటువంటివాడు,
నమ్మకము
గలిగినటువంటి
వాడు.
‘మానవ’
అనగా
నమ్మకము
కలవాడు
అన్నారు.
ఇంతేకాకుండా,
పదములయొక్క
అర్థాన్ని
పురస్కరించుకున్నప్పుడు
‘మా’,
‘నవ’.
‘మా’
అనగా
ఎప్పటికి.
‘నవ’
అనగా
క్రొత్తగా.
ఇది
ఎప్పటికి
క్రొత్తయైనటువంటిదే!
ఎప్పటికప్పుడు
క్రొత్తగా
యుండినటువంటిదే!
ఈ
క్రొత్తదనానికే
పవిత్రత
అంటారు.
కనుక
ఇట్టి
పవిత్రమైనటువంటి
మానవత్వాన్ని
పవిత్రమైన
చర్యలతో,
పవిత్రమైన
భావములతో
గడపటమే
బ్రహ్మచర్యమన్నారు.
కనుక
బ్రహ్మచర్యమనగా
లోకసంబంధమైన
అర్థము
తీసుకొని
ఈ
విధమైనటువంటియొక్క
దేహముతో
ఆచరించేటువంటి
కర్మలు
మాత్రమే
కాకుండా
మానసికంగా
అంతర్భూతమైనటువంటియొక్క
దివ్యతత్త్వమును
అర్థము
చేసుకొని
వర్తించటమే
బ్రహ్మచర్యము.
గృహస్థమునకు,
వానప్రస్తమునకు,
సన్యాసమునకు
బ్రహ్మచర్యము
చాలా
ప్రధానమైనటువంటి
పునాది.
కనుకనే
విద్యార్థి
దశ
అనేటువంటిది
చాలా
పవిత్రమైనటువంటిది.
మిగిలిన
మూడు
దశలుకూడను
యీ
విద్యార్ధి
దశపైన
ఆధారపడియున్నవి.
విద్యార్థి
దశలో
ఏ
విధమైనటువంటి
ఫలితములు
అనుభవిస్తామో
దానిని
పురస్కరించుకొనియే
మిగిలినటువంటి
మూడు
ఆశ్రమములందుకూడను
ఈ
పవిత్రత
ప్రవేశిస్తుంది.
కనుక
ఈ
నాలుగు
అంతస్తుల
భవనమునకు
పునాది
చాలా
భద్రంగా
వుంటుండాలి.
గ్రౌండ్
ఫ్లోర్‌కు
పునాది
చాలా
గట్టిగా
వుండినప్పుడే
మిగిలిన
మూడు
ఫ్లోర్లుకూడను
భద్రంగా
వుంటాయి.
గ్రౌండ్
ఫ్లోర్
కూలిపోయినప్పుడు
మిగిలిన
మూడు
ఫ్లోర్లు
కూలిపోతాయి.
కనుక,
గృహస్థము,
వానప్రస్తము,
సన్యాసము
బ్రహ్మచర్యముపైన
ఆధారపడియున్నవి.
దేహ
పవిత్రత,
మనో
పవిత్రత,
చిత్త
పవిత్రత,
క్రియా
పవిత్రతలతో
కూడినదే
బ్రహ్మచర్యము
బ్రహ్మచర్యములోపల
మానవత్వాన్ని
పవిత్రము
గావించుకోవాలి.
3
▾
Meaning
Keep
బ్రహ్మచర్యమనేటువంటి
తత్త్వములో
క్రమమును
అనుసరించి,
దివ్యత్వాన్ని
పురస్కరించుకొని,
పవిత్రతను
మొదట
దేహములో
ప్రవేశపెట్టి
సరియైనటువంటిదిగా
అనుభవిస్తూ
పోవాలి.
దేహ
పవిత్రత,
మనః
పవిత్రత,
చిత్త
పవిత్రత,
క్రియా
పవిత్రత,
ఈ
నాలుగు
పవిత్రతలతో
కూడినటువంటిదే
బ్రహ్మచర్యము.
ఏది
చేసినాకూడను
బ్రహ్మ
భావముతో
దానిని
అర్పితము
చేయటము
నిజమైన
బ్రహ్మచర్యము.
జీవితములో
మనకు
కావలిసిన
వస్తువులలో
అతి
ముఖ్యమైనటువంటిది
అన్నం.
ఈ
అన్నమే
లేకపోతే
జీవితమే
వుండదు.
కనుకనే
జీవితము
అన్నమయము
అనేటువంటిదిగా
రూపొందింది.
అయితే
అన్నం
తిని
తృప్తిపడేటువంటి
స్వభావముకాదు,
మానవునిది.
కడుపునిండినంత
మాత్రమున
మనస్సు
నిండదు.
మనస్సు
నిండినంతమాత్రమున
జీవితము
సంతృప్తి
పొందదు.
కనుకనే
అన్నము
దేహమునకైనా,
ఆనందము
మనసునకు
అత్యవసరము.
ఆనందాన్నికూడిన
జీవితమే
మానవ
పూర్ణ
జీవితము.
కనుక
మానవుడు
తిని
వూరికే
కూర్చోటానికి
యిష్టపడడు.
తిరిగి,
తిరిగి
పనిచేయాలి.
తిరిగి
పని
చేసినలోపల
ఈ
పనిని
ఎందుకు
చేస్తున్నాము,
ఎలా
చేస్తున్నామో,
అని
ప్రశ్నలు
వేసుకోవాలి.
ఆ
విధంగా
వేసుకున్నప్పుడు
ఆ
క్రియ
ఒక
పవిత్రమైన
మార్గములో
ప్రవేశిస్తుంటాది.
యీ
పని
నేను
ఎందుకు
చేస్తున్నాను,
ఏ
విధముగా
చేస్తున్నాను,
దీనియొక్క
పవిత్రత
ఏమిటి,
యీ
మూడింటియొక్క
విచారణ
చేసినప్పుడే
ఆ
కార్యములో
విజయాన్ని
సాధించటానికి
వీలవుతుంది.
యీ
ఆలోచన
అనేటువంటిది
మానవునియొక్క
జీవితములో
ప్రధానమైనటువంటి
సూచనలనందిస్తుంది.
ఆలోచనలు
సరియైనటువంటివిగా
పోవాలి.
యీ
ఆలోచనయందుకూడను
మీరు
విచారణ
సల్పాలి.
యీ
ఆలోచనలు
కేవలం
నిరుపయోగమైనటువంటివా,
వుపయోగమైనటువంటివా,
అని.
అయితే,
మంచిగా
విశ్వసించినటువంటి
కార్యములను
అభివృద్ధిపరచుకోటానికి
ప్రయత్నించుకోవాలి.
ఈనాడు
అశాంతికి
మన
ఆలోచనలు,
ప్రవర్తనలే
మూలకారణము
ఉత్తమైనటువంటి
కార్యములలో
ప్రవేశించి,
ఉత్తమ
భావములు
పెంచుకొని,
ఉత్తమ
జీవితమును
గడపటానికి
ప్రప్రధమమైన
సోపానము,
బ్రహ్మచర్యము.
ఇలాంటి
సమయములో
దివ్యమైన
భావములు
పెంచుకోవాలి,
సుగంధములతో
కూడినటువంటి
ఆలోచనలు
అభివృద్ధిపరచుకోవాలి
ఏవిధమైనటువంటి
భావములనుకూడా
చలింప
చేయనటువంటి
మార్గములను
మనము
అనుసరించాలి.
4
▾
Meaning
Keep
అప్పుడే
అన్నమయముతో
ప్రారంభమైనటువంటి
మానవ
జీవితము
ఆనందమయముతో
అంత్యమవుతుంది.
యీనాడు
మానవుడు
ఇంటియందు
బిడ్డలు,
కంటినిండా
నిద్ర,
ఒంటినిండా
బట్టలు
వుండినంతమాత్రమున
జీవితము
సుఖమనుకోవటం
సరికాదు.
అధికారమువల్లకాని,
ధనమువల్లకాని,
ఇంకేవిధమైనటువంటి
విషయమువల్లకాని
శాంతిని
పొందుతాము
అనుకోటం
చాలా
వెఱ్ఱితనము.
శాంతి
అనేటువంటిది
మన
ప్రవర్తననుంచి
ప్రారంభమవుతుంది.
మన
ఆలోచనలనుండియే
ప్రారంభమవుతుంది.
మన
ఆలోచనలు
పవిత్రమైనప్పుడు,
పవిత్రమైనటువంటి
కర్మలలో
ప్రవేశిస్తాము.
కర్మలు
పవిత్రమైనప్పుడు
మన
జీవితము
పవిత్రముగా,
ప్రశాంతముగా
వుంటుంది.
ఈనాడు
అశాంతికి,
మనయొక్క
ఆలోచనలు,
ప్రవర్తనలే
మూలకారణము.
కనుక,
మొట్టమొదట
చక్కని
ఆలోచనలు
అభివృద్ధిపరచుకోటానికి
ప్రయత్నించాలి.
నీ
కర్తవ్యాన్ని
నిర్వర్తించటంలో
నీ
కాయాన్ని
అంకితం
చెయ్యి.
యజ్ఞమనగా
త్యాగభావము
ప్రాచీనకాలమునందు
వేదప్రమాణములను
పురస్కరించుకొని
శాసనాన్ని
అనుభవించి,
యీ
శాసనముచేతనే
మానవత్వము
భారతదేశమునందు
జీవితాన్ని
గడుపుతూ
వచ్చింది.
అయితే
ప్రాచీన
కాలమునకు
మరియు
వేదప్రమాణములకు
ఈనాడు
విరుద్ధముగా
ప్రవర్తించడం
జరుగుతోంది.
దీనికి
కారణము
ఏమిటి?
ఈనాడు
అన్నం
అత్యవసరము.
ఈ
అవసరమైనటువంటి
అన్నమునకు
కొరత
ఏర్పడింది.
ఈనాడు
అన్నమునకు
కొరత
ఏర్పడటానికి
కారణము
ఏమిటి?
మానవునియొక్క
సంకల్పములే
మూలకారణము.
కర్మవిహితమైనటువంటి,
కర్మమయమైనటువంటి,
కర్మజీవితమైనటువంటి
యజ్ఞ
యాగాది
క్రతువులు
మనము
విసర్జించుతూ
వచ్చాము.
యజ్ఞమనగా
కేవలము
ఒక
హోమకుండముముందు
కూర్చొని
మంత్రము
చెప్పి
హోమము
చేయటము
కాదు.
5
▾
Meaning
Keep
యజ్ఞమనగా
త్యాగభావము.
ఈ
త్యాగభావము
మనలో
పూర్తిగా
దూరమైపోయింది.
భోగభావము
అధికమయిపోయింది.
ఈ
భోగభావముచేతనే
బాహ్యమైనటువంటి
ఆకర్షణ
అధికమవుతుంది.
బాహ్య
ఆకర్షణ
అధికము
కావటముచేతనే
తనయొక్క
తత్త్వమును
తాను
మరచిపోతున్నాడు,
మానవుడు.
తన
తత్త్వాన్ని
తాను
మరచిపోవటమువల్లనే
అనేక
దుఃఖములకు
గురి
అవుతున్నాడు.
మానవునియందు
దివ్యత్వమనేటువంటిది
ఎప్పుడుకూడను
పవిత్రమైనటువంటిదిగా
వుంటుండాలి.
తన
బలమును
తాను
గుర్తించుకొనలేక
పోతున్నాడు.
నల్లతుమ్మెద,
మంచి
చేవపట్టిన
కఱ్ఱనైననూ
తన
ముక్కుతో
తొలిచి
రంధ్రమును
ఏర్పరుస్తుంది.
అంతేకాదు
మానవునియొక్క
దేహమునుకూడను
తొలచివేస్తుంది.
అదే
కర్ణునియొక్క
క్షాత్ర
ధర్మానికి
సరియైనటువంటి
గుర్తు.
తన
తొడపైన
గురువు
పరుండినప్పుడు
ఈ
తుమ్మెద
తన
తొడను
తొలిచికొని
పోయినప్పుడు,
తాను
సహించుకొని
యున్నాడు.
తుమ్మెదకు
ఇంతటి
బలము
వుంటున్నాది.
కాని
అదే
తుమ్మెద
కమలములో
ప్రవేశించి,
కమలము
మూసివేసినప్పుడు
సున్నితమైన
రేకులను
ఛేదించలేకపోతున్నాది.
ఇంత
బలమైన
తుమ్మెద,
అతి
సున్నితమైన
కమలముయొక్క
రేకులనుండి
బయటకు
రాలేకపోవటానికి
కారణము
ఏమిటి?
ఆ
పుష్పములో
యున్నటువంటి
మధురమైన
మకరందమును
గ్రోలుతూ
తనయొక్క
నిజతత్త్వాన్ని,
తన
బలమును
మరచిపోయినది.
అదే
విధముగనే
ఈనాటి
మానవుడు
తన
కంటిలో,
ఒంటిలో,
యింటిలో
సర్వత్రా
యున్నటువంటి
దైవత్వాన్ని
విస్మరించి,
తానే
ఒక
దివ్యత్వస్వరూపము
అనేటువంటి
దానిని
మరచి,
విశ్వాసాన్ని
కోల్పోయి,
కేవలము
భౌతికమైనటువంటి
విషయవాంఛలందు
మాత్రమే
తాను
మగ్నుడై,
దానినే
అనుభవిస్తూ
అందులో
మత్తుడై,
తన్మత్తుడై
తాదాత్మ్యము
పొంది
తన
శక్తిని
మరచిపోతున్నాడు.
ఇదియే
మూలకారణము.
తన
శక్తిని
మర్చటానికి
లోకములో
యున్నటువంటి
శక్తిని
తాను
అభివృద్ధిపరచుకుంటున్నాడు.
కనుకనే
మానవునియందు
దివ్యత్వమనే
శక్తి
వుండినప్పటికిని,
తాత్కాలికమైనటువంటి
బాహ్యశక్తులు
దీనిని
మరపింప
జేస్తున్నవి.
6
▾
Meaning
Keep
దైవమును
నమ్మినవారికి
ఎటువంటి
బాధలకు
అవకాశముండదు
ఈనాటి
యువకులు
తమ
శక్తిని,
ఆత్మవిశ్వాసాన్ని
బలపరచుకోటానికి
ప్రయత్నించాలి.
ఎలాంటి
కష్టములైనా,
ఎలాంటి
నష్టములైనా,
ఎలాంటి
విచారములైనా
కదలిపోయే
మేఘములే!
జగత్తులో
ఒక్కటైనా
శాశ్వతమైనటువంటిది
లేదు.
ఉన్నది
ఒక్కటే,
అదే
దైవత్వము.
ఆ
దైవత్వముయొక్క
శాశ్వతమైన
తత్త్వమును
మనసునందు
అభివృద్ధిపరచుకొని
జీవించాలి.
అది
ఒక్కటే
నిజమైన
శాంతి
నందించేది.
బంధువులుగాని,
మిత్రులుగాని,
శాస్త్రములుగాని
ఏవీకూడను
మనకు
అంతటి
ఆనందాన్ని
అందించలేవు.
దీనికి
ఒక
చిన్న
ఉదాహరణము.
ఇప్పుడు
జైను
మాట్లాడాడు.
నిజముగా
వారి
ఇంటి
పరిస్థితి
అయితే
ఆ
అబ్బాయికి
ఇమోషన్
వల్ల
ఎక్కువ
చెప్పుకోలేకపోయాడు.
ఒక్క
సంవత్సరములోపలనే
తల్లి,
తండ్రులను
కోల్పోయినాడు.
వారు
మొత్తము
ఎనిమిది
మంది
పిల్లలు.
అంతా
చిన్న
చిన్న
పిల్లలు.
అందరికంటే
పెద్దవాడు
వీడు.
మిగిలినవారు
అంతా
చిన్నవారు.
వారిని
ఏ
విధముగా
సమాధానము
చేయడానికి
వీలవుతుంది?
ఒక్క
దైవత్వముతోనే
వీలవుతుంది.
ఆ
రెండవ
దినమే
పిలచి
వారందరితో
నేను
మాట్లాడిన
తరువాత
వారి
ముఖములో
నవ్వు
మరియు
ఆనందము
కనబడింది.
నాటినుండి
నేటివరకు
అందరూకూడను
సాయి
మాత,
సాయి
పిత
అనేటువంటి
భావములో
మునిగిపోయినారు.
ఈ
విధముగా
ఏ
మిత్రుడుకూడా
చేయలేడు.
మిత్రులు,
స్నేహితులంతా
చేరి
శోకమును
అభివృద్ధి
పరుస్తారే
కాని,
చల్లార్చేవారు
కాదు.
సరియైనటువంటి
బోధనలచేతనే
వారి
హృదయాలు
పరిపక్వము
చెందుతాయి.
నాటిమొదలు
నేటివరకు
వారికి
ఎటువంటి
బాధలులేకుండా
హాయిగా
గడుపుతూ
వస్తున్నారు.
కనుక,
దైవత్వాన్ని
నమ్ముకున్నవారికి
ఏ
విధమైనటువంటి
బాధలకు
అవకాశము
వుండదు.
కష్టాలు,
బాధలు
పర్వతములవలే
వస్తాయి,
మంచువలే
మాయమవుతాయి.
యీయొక్క
విశ్వాసాన్ని
మనము
దృఢపరచుకోవాలి.
అంతేకాదు
భుజంగ్కూడా
చెప్పాడు.
‘నాకు
ఏమి
వద్దు,
నాకు
వ్యాపారము
వద్దు,
స్టాప్
చేసేస్తాను’
అన్నాడు.
నేను
చెప్పాను,
‘వద్దు.
సిన్సియారిటీతో
పని
చేయి’
అన్నాను.
స్టాప్
చేయటానికి
పనికిరాదు
అన్నాను.
అయితే
భుజంగ్
స్వామి
మాటపైన
విశ్వాసమును
అంత
దృఢముగా
పెట్టుకొనటంవలన
అన్నీ
చక్కగా
సర్దుకొని
పోయాయి.
నమ్మి
చెడినవాడు
ఈ
లోకాన
లేడు,
లేడు.
నమ్మక
చెడినవారు
వున్నారు.
అన్నింటికి
మూలము
నమ్మకము.
యీనాడు
చలన
చిత్రాలను
నమ్ముతున్నారు,
న్యూస్
పేపర్స్‌ను
నమ్ముతున్నారు,
నవల్సును
నమ్ముతున్నారు,
నాటకాలను
నమ్ముతున్నారు,
పంచాంగాన్ని
నమ్ముతున్నారు,
అన్నింటిని
నమ్ముతున్నారు.
7
▾
Meaning
Keep
కాని,
పవిత్రమైనటువంటి
భగవత్వాక్యాల్ని
‘తత్త్వమసి,
ప్రజ్ఞానం
బ్రహ్మ,
అయమాత్మ
బ్రహ్మ,
అహం
బ్రహ్మస్మి’
అనే
వేద
వాక్యాల్ని
నమ్మటంలేదు.
అనిత్యం,
అశాశ్వతం
అయినటువంటి
విషయాల్ని
నమ్మి
మోసపోతున్నారు.
ఈనాటి
మానవునియొక్క
పరిస్థితి
ఇంతగా
దిగజారిపోయింది.
కారణమేమిటంటే
దైవవిశ్వాసానికి
దూరమయిపోతున్నారు.
లోకవిశ్వాసానికి
అధికమైపోయారు.
ఈనాడు
మనము
చేయవలసినది,
దైవవిశ్వాసాన్ని
అభివృద్ధిపరచాలి.
ఈనాటి
యువకులు
అనేకవిధములైనటువంటి
ప్లానులు
వేసుకుంటూపోతారు.
ఈ
ప్లానులవలన
వారికి
శాంతి
ఏనాటికి
చిక్కదు.
దైవవిశ్వాసముతో
ఏ
ప్లానులైనా
వేసుకో,
అవి
ఫలిస్తాయి.
అయితే,
దైవమునకు
సంబంధించినటువంటి
ప్లానులే
వేయాలి.
కాని,
దైవవిశ్వాసముతో
అనేక
విధములైన
తప్పు
భావములలో
ప్రవేశించి
జీవితాన్ని
వ్యర్ధము
చేసుకుంటే
దానికి
భగవంతుడేమీ
చేయలేడు.
పవిత్రతను
అభివృద్ధిపరచుకొనేవారు
ఎవరైనా
బ్రహ్మచారులే!
పురుషార్ధము
అనే
విషయమునుగురించి
అనేకమంది,
స్త్రీలుకూడా,
అనేక
విధాలుగా
అనుకుంటారు.
ఇది
కేవలము
పురుషులకేనా,
స్త్రీలకు
లేదా
అని.
పురుషార్ధమనగా
కేవలము
‘పురుషుడు’
అని
అర్థము
కాదు.
‘ఇచ్ఛారామోభవతి,
తృప్తోభవతి,
ఆత్మారామోభవతి’,
అనే
తత్త్వములోపల
దేహములో
నఖశిఖపర్యంతము
సంచరించేటువంటి
చైతన్యశక్తికే
‘పురుషః’
అని
పేరు.
కేవలము
దేహాన్ని
పురస్కరించుకొని
పురుషుడు
కాదు.
ప్రతి
దేహమునందు
ఆ
చైతన్యము
వున్నది.
కనుక
స్త్రీ,
పురుషులు
సర్వులకుకూడను
ఈ
పురుషార్ధము
వర్తిస్తుంది.
కనుకనే
ఈ
పురుషార్ధమనేటువంటిదానిని
‘పరమ
పురుషార్ధము’
అని
పేరు
పెట్టారు.
ఈ
పరమ
పురుషార్ధముయొక్క
తత్త్వాన్ని
మనము
అర్థము
చేసుకోటానికి
ప్రయత్నించాలి.
ఇప్పుడు
చాలామంది
‘నీతి
కావాలి’
‘నీతి
కావాలి’
అంటుంటారు.
నీతి
అంటే
ఏమిటి?
దీనినే
కారెక్టరు
అంటారు.
అయితే
అది
తత్త్వమన్నారు.
ఇది
ఏవిధముగా
వచ్చిందంటే,
పవిత్రమైన
భావమును
పురస్కరించుకున్నటువంటిదే
నీతి.
8
▾
Meaning
Keep
దీనినే
పౌరుషము
అన్నారు.
దీనినే
పెర్సనాలిటీ
అన్నారు.
ఈ
పెర్సనాలిటీ
అనేటువంటిది
ఎక్కడనుంచి
వచ్చింది?
రోమన్
భాషలోపల
ఏనాడు
క్రైస్తు
అవతరించెనో
అప్పటినుంచికూడను
ఆ
పవిత్రమైనటువంటి
పదమునకు
పర్సోనా,
పర్సోనా
అని
పిలుస్తూ
వచ్చారు.
పర్సోనా
అనగా
పవిత్రము.
ఆ
పవిత్రమైనటువంటిది
అందరియందు
ఉన్నది
కనుకనే
దీనికి
పర్సెన్
అని
పేరు
వచ్చింది.
పర్సోనా
నుండి
పర్సెన్
వచ్చింది.
ఈ
పర్సెన్
నుండి
పెర్సనాలిటీ
వచ్చింది.
అనగా
ఏతావాతా
దీని
అంతరార్ధము
ఏమిటంటే
పవిత్రమే
మానవ
జీవితము.
బ్రహ్మచారియైనా,
గృహస్థుడైనా,
వానప్రస్తుడైనా,
సన్యాసియైనా,
ఇది
అందరియందు
అంతర్వాణిగా
వుంటున్నాది.
కనుక,
పవిత్రతను
అభివృద్ధిపరచుకొనేటువంటి
వారు
ఎవరైనా
బ్రహ్మచారులే!
హనుమంతుడికి
వివాహమైంది.
అతనికి
వివాహమైనప్పటికిని,
అతను
శుద్ధ
బ్రహ్మచారి.
అతని
భార్య
సువర్చల.
అతడు
నిరంతరము
బ్రహ్మచారియే
అన్నారు.
వివాహమువలన
అతని
బ్రహ్మచర్యతత్త్వము
పోలేదు.
అనగా
నిరంతరముకూడను
రామచింతనలోనే
వున్నాడు.
బ్రహ్మచర్యము,
అనగా
నిరంతరం
బ్రహ్మచింతనే
చేశాడు.
ఆత్మకు
చెడ్డభావములు
రావడానికి
వీలులేదు
ఒకానొక
సమయములోపల
ఇతని
బ్రహ్మతత్త్వాన్ని,
నిరంతరము
సర్వదా
సర్వకాలములోపల
రామచింతన
చేస్తున్నాడా
లేదా
అనే
దీనిని
పరిక్షింపకోరి,
పట్టాభిషేకము
సమయములోపల
రాముడు
అందరికి
అనేకరకములైనటువంటి
బహుమతులు
యిస్తూ
వచ్చాడు.
అప్పుడు
సీత
చాలా
దుఃఖపడింది.
“రామా!
సర్వకాల
సర్వావస్థలయందుకూడా
తమ
చింతనే
చేస్తున్న
హనుమంతునికి
ఒక్క
బహుమతికూడా
ఇవ్వలేదే!”
అని.
‘హనుమంతునికి
ఇవ్వవలసిన
బహుమతి
నా
దగ్గర
ఏమీలేదు’,
అన్నాడు
రాముడు.
అప్పుడు
‘నన్ను
నేనే
ఇచ్చుకుంటాను’
అని
అతనిని
కౌగలించుకున్నాడు.
‘హనుమంతా!
నన్ను
నన్నే
తీసుకో!’
అన్నాడు.
హనుమంతుడు
‘రామా!
ఏనాడో
నీవు
నాలో
చేరిపోయినావు.
క్రొత్తగా
నీవిచ్చే
బహుమతి
నాకు
అక్కరలేదు’
అన్నాడు,
సీతవైపు
చూచి.
అప్పుడు
సీత
‘కేవలము
భౌతికమైన
రీతిలో
సర్వులకు
బహుమతులు
అందిచ్చే
సమయములో
నీయొక్క
స్పర్శ
మాత్రమే
హనుమంతునికి
తగిలితే
ఇది
బహుమానమని
ఎవరు
తలచరు’
అన్నది.
9
▾
Meaning
Keep
జనక
మహారాజు
వివాహ
సమయములో
సీతకు
గొప్ప
విలువైన
ముత్యాల
హారము
ఇచ్చాడు.
ఆ
ముత్యాల
హారము
తీసి
హనుమంతునికి
ఇచ్చింది
సీత.
రఘుపతి
కార్యంబీడేర్చిన
కపిరాజ
శిఖామణి
నీవయ్యా
అఘములు
పురికొని
జగముల
వెలసిన
హనమత్గురుడు
నీవయ్యా
పరిపరి
లంకా
పురమున
జొచ్చిన
పురవర
శౌర్యుడు
నీవయ్యా
పరిపరి
విధముల
జానకి
వెతికిన
మహిత
పరాక్రముడవు
నీవయ్యా
రఘుపతి
కార్యము
నీడేర్చిన
కపిరాజశిఖామణి
నీవయ్యా
‘రామ
కార్యము
నేరవేర్చిన
కపిరాజ
శిఖామణి
నీవని,
నీవే
లేకపోతే
రామకార్యము
నేరవేరేదికాదని’
ఆ
మాల
అతనికి
అందించింది.
అందరూ
చూస్తున్నారు.
దానిని
త్రుంచేశాడు
హనుమంతుడు.
ఒక్కొక్క
ముత్యమును
కొరికి
పారవేస్తున్నాడు,
హనుమంతుడు.
దాని
అంతరార్ధము
సీతకు
తెలుసును.
కాని,
అక్కడ
వున్న
మిగిలినవారంతా
బాహ్యముగా
చూచేవారే!
‘యద్భావం
తద్భవతి’.
ఎవరి
భావాన్నిబట్టి
వారు
యోచించుకుంటూ
వచ్చారు.
‘ఇది
కోతిజాతి.
ఈ
కోతిజాతికి
ఎంతటి
విలువైనవి
యిచ్చినాకూడను
వాటి
విలువ
తెలియదు.
ఈ
విలువైనటువంటి
ముత్యములను
కొరికి
కొరికి
పారవేస్తున్నాడు,
ఈ
కోతిబుద్ధి
పోలేదా’,
అని
ఆలోచిస్తున్నారు
కొంతమంది.
వీరందరికి
సరియైనటువంటి
పాఠములు
నేర్పించేకోసం
సీత
అడిగింది,
‘హనుమంతా!
ఎందుకు
యింత
విలువైనటువంటి
ముత్యములను
కొరికి
పారవేస్తున్నావు.
కొరకటం
చెవిదగ్గర
పెట్టుకోటం,
పారవేయటం,
ఈ
విధముగా
చేస్తూ
వస్తున్నావు.
ఎందుకు
ఈ
విధముగా
చేస్తున్నావు?’
అని.
‘అమ్మా!
ఈ
ముత్యములో
నా
రామనామము
వుందా
లేదా
అని
పరిక్షిస్తున్నాను’,
అన్నాడు
హనుమంతుడు.
‘పిచ్చివాడా!
ముత్యములో
రామనామము
వుంటుందా’
అని
మళ్లీ
అడిగింది
సీత.
‘రామనామము
లేనటువంటి
ముత్యము
ఎంతటి
విలువైనదైనను
నాకు
పనికి
రాని
రాళ్లతో
సమానము.
రామనామములేని
ఎటువంటి
నవరత్నాలైననూ
నాకు
కేవలము
మట్టితో
సమానము’
అని
జవాబిచ్చాడు
హనుమంతుడు.
10
▾
Meaning
Keep
రాముడుకూడా
తనకు
దాని
అంతరార్ధము
తెలిసియున్నప్పటికి,
పదిమందికి
దానిని
బోధించే
నిమిత్తమై
హనుమంతునిచే
జవాబు
చెప్పించాడు.
అప్పుడు
హనుమంతుడు
‘ఈ
సర్వ
దేహములందు
సర్వత్రా
రామనామము
ఇమిడి
యుంటున్నది.
రామనామము
లేనటువంటి
అణువుకూడను
నా
దేహములో
లేదు.
అలాంటిదానిని
నేను
ప్రవేశపెట్టను.
క్షణమైనా
నా
దగ్గర
వుంచుకొనను’,
అని
చేతిపైన
ఒక
వెంట్రుకను
తీసాడు.
దానిని
రాముని
చెవి
దగ్గర
పెట్టాడు.
సీత
చెవి
దగ్గర
పెట్టాడు.
‘రామ్,
రామ్,
రామ్’
అంటున్నది
ఆ
వెంట్రుక.
ఆ
విధంగా
సర్వ
కాలములందుకూడను
రామచింతన
చేయటంవలన
అతను
బ్రహ్మచారియైనాడు.
తన
దేహమంతాకూడను
రామనామముతో
నిండియుంటున్నది.
ఏ
పని
చేసినా
రామనామమే!
సర్వత్రా
రామ
చింతనతోనే
యున్నాడు.
‘నీవు
రామచింతన
ఏ
రీతిగా
చేస్తున్నావు
హనుమా!’
అని
ప్రశ్నించాడు,
రాముడు
ఒకప్పుడు.
అందుకు
హనుమంతుడు
‘దేహభావముతో
నీవు
ప్రభువు,
నేను
సేవకుడను.
మనోభావముతో
నీవు
బింబము,
నేను
ప్రతిబింబము.
ఆత్మభావముతో
నీవే
నేను,
నేనే
నీవు
రామా!’,
అన్నాడు.
యీయొక్క
భావములు
ఏనాటికి
చెదరనటువంటివి
అన్నాడు.
యీ
మూడు
భావములతో
కూడినటువంటిదే
బ్రహ్మచర్యము.
బ్రహ్మచర్యమంటే
ఏదో
అర్థముకానిది
కాదు.
దేహము
భగవంతునియొక్క
సేవకుడు.
దేహమునకు
ఒక
మాష్టరు
ఉన్నాడు.
అతడే
జీవము.
ఆ
భావముతో
పోతున్నాడు.
పోనీ
జీవభావములో
ఆత్మయొక్క
ప్రతిబింబమే
జీవము.
కాబట్టి,
జీవభావములో
చెడ్డ
భావములు
రావటానికి
అవకాశములేదు.
ఇది
ఆత్మయొక్క
ప్రతిబింబమే!
ఆత్మకు
చెడ్డభావములు
రావటానికి
అవకాశములేదు.
ఆత్మతో
కూడచ్చు.
ఆత్మతో
చేరవచ్చు.
ఆత్మభావముతో
రెండు
ఒక్కటే.
పతివ్రతా
తత్త్వానికి
కూడా
చక్కని
అర్థాలు
చెప్పుతూ
వచ్చారు,
ఆనాడు:
పతి
మాటలకు
ఎదురు
చెప్పంగ
బోదు
అతని
సేవలు
చేయగ
తీరదనదు
తనకున్న
దానిచే
తృప్తి
గనుచునుండు
11
▾
Meaning
Keep
ఆలోచనలు,
కర్మలయొక్క
ఏకత్వమే
నిజమైన
మానవత్వము
ఈ
మూడు
గుణములే
పతివ్రతకు
నిజమైన
చిహ్నములు.
దేహముతో
దాసత్వమును,
జీవముతో
ప్రతిబింబ
తత్త్వమును,
ఆత్మతో
ఆత్మతత్త్వమును
అనుభవించటమే
బ్రహ్మచర్యమన్నారు.
ఈ
భావములు
పెట్టుకొని
ఏ
కార్యములోనైనా
ప్రవేశించు,
అది
బ్రహ్మచర్యమే
అవుతుంది.
అట్టి
భావములతో
వున్నప్పుడు
నీవు
సన్యసిస్తే,
ఆ
సన్యాసముకూడా
బ్రహ్మచర్యమే!
కాబట్టి
ఈ
నాలుగు
అంతస్థులయందుకూడను
ప్రధానమైనటువంటి
అంతర్వాహినిగా
వుండాలి.
ఆ
విధముగా
విద్యార్థులు
బ్రహ్మచర్యమునకు
పునాదులు
వేసుకోవాలి.
ఈ
వయసులోపల
పవిత్రమైనటువంటి
భావాలను
పెంచుకోవాలి.
అప్పుడే
పవిత్రమైనటువంటి
చర్యలు
చేస్తారు.
ఈ
పవిత్రమైన
భావములు,
చర్యలవల్ల
అభివృద్ధి
క్రమములో
అవుతుంది.
కనుక,
పవిత్రము
అభివృద్ధి
కావాలంటే,
పవిత్ర
కర్మలవల్లే
అభివృద్ధికావాలి.
ఈ
రెండింటిని
మనము
దృష్టిలో
వుంచుకోవాలి.
ఆలోచనలు,
కర్మలయొక్క
ఏకత్వమే
నిజమైన
మానవత్వము.
కనుక
విద్యార్థులైనటువంటివారు
ఎక్కడకు
పోయినా,
ఏ
పని
చేసినా,
ఏ
ఆశ్రమములో
ప్రవేశించినా,
గృహస్థము
కావచ్చును,
వానప్రస్తము
కావచ్చును,
సన్యాసము
కావచ్చును,
మీరు
బ్రహ్మచారులుగా
వుండవలసినదే!
అన్నింటియందును
మూడు
గుణములు
ప్రాణసమానముగా
భావించాలి.
అప్పుడే
మన
జీవితము
ఆదర్శవంతమైన
జీవితముగా
వుంటాది.
నదులే
నిజమైన
సన్యాసులు
దీనికి
చక్కని
ఉదాహరణము.
నేను
ఋషికేశ్
వెళ్ళాను.
శివానందకు
78
సం॥లు
అప్పుడు.
మేమందరము
వెళ్లినప్పుడు,
అక్కడ
శివానంద
మమ్మల్ని
అందరిని
ఆహ్వానించాడు.
డివైన్
లైఫ్
సొసైటీ
ఆరంభము
చేశాను
అన్నాడు.
దానికి
4
అణాలు
ఫీజు
కట్టాలి
అన్నాడు.
‘డివైన్
లైఫ్
స్టార్టు
చేసేదికాదు,
అది
ఎప్పుడు
వుండేది’
అన్నాను.
‘దీనికి
4
అణాలు
కాదు,
4
గుణాలు
కావాలి’
అన్నాను.
ఒకనాడు
అనేక
విషయములు
మాట్లాడుతూ,
మేమంతా
భజనకు
కూర్చొన్నాము.
అతనికి
వయసుచేత
వచ్చినటువంటి
అలసటవలన
నిద్ర
వచ్చినది.
అతని
శిష్యులు
విసురుతూ
వున్నారు.
ఒక
శిష్యుడు,
ఒక
చేతితో
విసురుతూ
ఇంకొక
చేతితో
భజన
చేస్తు,
చేస్తూ
గురువుగారి
తలమీద
చెయ్యి
వేశాడు.
12
▾
Meaning
Keep
కాబట్టి
భజనకు,
జపమునకు,
ధ్యానానికి
ఒక
క్రమశిక్షణ
వుండాలి.
ఇటువంటి
క్రమశిక్షణ
అక్కడ
లేదు.
రామ,
కృష్ణ,
గోవింద
నామములు
తలచుకుంటూ
భజన
జరుగుతూ
వస్తున్నది.
ఇంతలో
శివానంద
నిద్రనుండిలేచి
శిష్యుడిని
పిలిచి
‘ఇవాళ
ఏమి
ప్రసాదము’,
అని
అడిగాడు.
వుడికిన
కందమూలములు
అని
చెప్పాడు.
శివానంద
రామా,
కృష్ణ,
గోవింద
అని
భజన
ప్రారంభించాడు.
ఇంతలో
ఇంకో
శిష్యుడు
అరవంలో
భజన
చేస్తానంటూ,
వారుంగో,
వారుంగో,
జట్కాబండిలో
వారుంగో,
టిక్కటు
లేకుండా
వారుంగో
అని
ప్రారంభించాడు.
అప్పుడు
నేను
చెప్పాను,
ఈ
విధముగా
క్రమశిక్షణ,
ఏకాగ్రత
లేకుండా
భజనలు
చేయడం
ఏమిటని?
ఈ
లోపల
మన
వాళ్లందరు
విసిగి
అక్కడనుండి
వెళ్లిపోయారు.
ఆ
తరువాత
భజనకు
ఎవ్వరు
వెళ్లలేదు.
ఒకరోజు
నన్ను
పిలచి
బ్రహ్మచర్యము
గురించి
చెప్పమన్నారు.
నేను
ఆత్మదృష్టితో,
పవిత్రతతో
బ్రహ్మచర్యము
గురించి
చెప్పుకుంటూ
వచ్చాను.
నిజమైన
సన్యాసి
గంగానదివంటివాడు.
ఎందుకంటే
తన
పతి
అయిన
సముద్రముతో
కలుసుకోటానికి
నదులు
వురుకుతూ
పరుగెత్తుతాయి.
ఎటువంటి
అడ్డులు,
ఆటంకములు
వచ్చినా,
దానిని
ఎదురుకొని
తన
లక్ష్యము,
గమ్యము
అయిన
సముద్రములో
కలవటానికి
ప్రయత్నిస్తాయి.
కాబట్టి
నదులే
నిజమైన
సన్యాసులు,
అని
బోధించాను.
ఇంత
సూక్ష్మముగా
చెప్పినవాడు
ఎవరు
అని
అన్నాడు,
శివానంద.
ఒక
రుద్రాక్షమాలను
సృష్టించి
అతని
కంఠములో
వేసి
పుట్టినరోజు
గిప్ట్గా
ఇచ్చాను.
ఏకాగ్రతకు
దైవభావము
చాలా
అవసరము
భారతీయ
సంస్కృతియందు
ప్రతీ
పదమునకు
చాలా
గొప్ప
అర్థము
వుంటున్నాది.
ఎవ్వరునూ
దాని
గురించి
శోధించటంలేదు.
బ్రహ్మచర్యమనగా
ప్రధానమైనటువంటిది
పవిత్రత
అన్నారు,
ఈ
పవిత్రత
అనేటువంటిది
గృహస్థాశ్రమములో
వారికికూడా
ఉండవచ్చును.
కనుక
పవిత్రతను
పెంచుకోవడమే
బ్రహ్మచర్యము
అంటారు.
అన్ని
ఆశ్రమములలోకూడా
బ్రహ్మచర్యముంటున్నాది.
బ్రహ్మముతో
చరించటమే
బ్రహ్మచర్యమంటారు.
తెనాలి
రామకృష్ణుడు,
శ్రీ
కృష్ణ
దేవరాయలవారి
ఆస్థానములో
సర్వజ్ఞుడుగా
వుపదేశిస్తూ
వచ్చాడు.
13
▾
Meaning
Keep
అదే
సమయములో
ఆస్థానములో
వున్న
అష్టదిగ్గజములమధ్య
ద్వేషము
పెరుగుతూ
వచ్చింది.
అటువంటి
సమయములో
ఈ
పండితులమధ్య
వున్న
పాండిత్యమును
పరిక్షించటానికై
రాయలవారు
ఒక
ప్రశ్న
వేశాడు:
“పండితులారా!
ఈనాడు
నా
ప్రశ్నకు
ఎవరు
సమాధానము
చెబుతారో
వారికి
అష్టదిగ్గజములలో
అగ్రస్థానము
ఇస్తాను.
రేపటి
దినములోపల
ఆ
ప్రశ్నకు
సమాధానము
చెప్పాలి.
ఐదు
అక్షరములతోకూడినటువంటి
ఒక
పదమును
ఏర్పరచాలి.
ఒక్కొక్క
అక్షరము
ఒక్కొక్క
భాషలో
వుంటుండాలి.
ఐదు
అక్షరములకు
ఒకే
విధమైన
అర్థము
వుండాలి.
ఐదు
అక్షరములుకూడి
ఒక
పదము
కావాలి.
రేపటి
దినమున
దీనికి
సమాధానము
తెండి”
అని
ఆజ్ఞ
యిచ్చాడు.
అందరూ
ఈ
విషయమై
యోచించుకుంటూ
వుండినారు.
రాత్రి
నిద్రపట్టడం
లేదు.
తెనాలి
రామకృష్ణుడు
ఆ
రాత్రి
అతని
బావగారి
ఇంటి
ఆవులశాలలో
పడుకున్నాడు.
ఆవులశాలలో
దోమలుకుట్టినప్పటికిని
ఆలోచిస్తూ
పడుకున్నాడు.
తాదాత్మ్య
భావముతో
ఆలోచిస్తున్నాడు.
ఆ
రాత్రి
ఒక
ఆవు
ప్రసవించింది.
తలుపు
తట్టి
‘బావా!
ఆవు
యీనుతున్నది’,
అని
పిలిచాడు
తెనాలి
రామకృష్ణుడు.
అతని
బావగారు
లోపలినుంచి
‘ఏ
ఆవు
రా
బావా!’,
అని
అడిగాడు.
అదే
పదమును
మదిలో
పెట్టుకొని
మరునాడు
ఆస్థానములో
అడుగుపెట్టాడు,
తెనాలి
రామకృష్ణుడు.
కృష్ణదేవరాయలు
సభలో
‘పదము
కూర్చినారా?’
అని
అష్టదిగ్గజములను
అడిగాడు.
అందరూ
‘లేదు’,
అని
జవాబు
యిచ్చినారు.
కాని,
తెనాలి
రామకృష్ణుడు
‘రెడీ’
అన్నాడు.
ఏ
పదము
అని
అడుగగా,
‘ఏ
ఆవు
రా
బావా’
అన్నాడు.
‘ఏమి
దీని
అంతరార్ధము?’
అని
అడిగాడు,
రాయలు.
‘ఏ’
అంటే
మరాఠిలో
‘రా’
అని,
‘ఆవు’
అంటే
హిందీలో
‘రా’
అని,
‘రా’
అనగా
తెలుగులో
‘రా’
అని,
‘బా’
అనగా
కన్నడములో
‘రా’
అని,
‘వా’
అనగా
తమిళములో
‘రా’
అని
అర్థము.
కాబట్టి
ఐదు
అక్షరములుకూడి
ఒకే
పదము
వచ్చినది
మరియు
ఒకే
అర్థము
వచ్చినది.
ఇది
ఏ
విధముగా
కనిపెట్టినాడంటే,
ఎల్లప్పుడు
తాదాత్మ్య
భావముతో
ఆలోచించేవాడు.
అదే
ఏకాగ్రత.
ప్రతి
పదమునకు
ఏకాగ్రతతో
ఆలోచిస్తూ
వచ్చేవాడు.
ఆ
ఏకాగ్రత
దైవ
భావములతో
మాత్రమే
వస్తుంది.
ఏకాగ్రతకు
దైవత్వము
అవసరము.
దైవత్వమువలన
అన్నీ
సమకూరుతాయి.
దైవశక్తి
లేకుండా
మేధాశక్తి
ఏ
మాత్రము
పనిచేయదు.
అర్జునుడుకూడా
మేధాశక్తితో
చాలా
వాదిస్తూ
వచ్చాడు.
14
▾
Meaning
Keep
His poems 231
అంతా
అయిపోయింది,
ఆఖరికి
‘కరిష్యే
వచనం
తవ’
అన్నాడు.
‘ఇంక
మీ
ఆజ్ఞ
ప్రకారము
నేను
నడుచుకుంటాను’
అన్నాడు.
‘నా
ఆజ్ఞ
ప్రకారము
నడచుకో!
మిగిలిన
విషయములు
సర్వము
నేను
చూచుకుంటాను’
అని
వచనం
ఇచ్చాడు,
కృష్ణుడు.
వెక్కిరింపుకొరకు
మొక్కినవారెల్ల
భక్తిపాతమునకు
బద్ధులౌదురు
దద్దరిల్లిపోవు
పలికించినంతనే
వుద్భవించు
భక్తి
వుల్లమందు
ఎవరెవరు
నిన్ను
విమర్శిస్తున్నారో
వారందరు
భక్తులుగా
మారిపోతారు
Previous
←
Never Forsake the Land of Your Birth or the Mother Who Bore You
Next
The Land That Loves God Is Bhārata
→