Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · Never Forsake the Land of Your Birth or the Mother Who Bore You
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Never Forsake the Land of Your Birth or the Mother Who Bore You
18 April 1988
1
▾
Meaning
Keep
His poems 9
Also in his talks
(10)
23 May 1973
The Wheel of Birth and Death, and Vimukti
7 July 1988
Divinity forgotten: that is the state of the jīva
20 February 1992
Man, thinking he is the body, is drifting away from Ānanda
4 July 1996
Spiritual Sādhana in Everyday Life
22 November 2000
That Which Makes Oneness Known Is True Education
17 August 2005
Only what fosters unity is true education
7 October 2005
Surrender to God
22 October 2005
Sāttvic Food and Good Company Are Essential
23 November 2005
All Are Embodiments of God
15 August 2006
Karma itself is man's God
బాల్యంబునందున
పలువురితోకూడి
ఆటపాటలందు
ఐక్యుడగును
యవ్వనంబలరిన
అలరు
విల్తుని
పోల్కి
కామినీ
లోలుడై
క్రాలుచుండు
అర్ధవయస్సున
ఐహికంబున
మునిగి
ద్రవ్యమార్జించుట
దవిలియుండు
ముదిమివచ్చిన
యంత
మురహరి
తలవక
అది
యిది
లేదని
అలమటించు
వివిధ
దుర్వ్యసనంబులు
వీడలేక
భక్తి
మార్గంబు
వెతుకునాసక్తి
లేక
కర్మపంకిలమునబడి
క్రాలుచుండు
మట్టి
కలుపును
జన్మంబు
మానవుండు
ప్రేమస్వరూపులారా!
కనుక,
యీ
నాల్గు
అవస్థలయందుకూడను
మానవుడు
మార్పులు
చెందుతూ
కడపటికి
తన
జీవితమును
అంత్యము
చేసుకుంటున్నాడు.
మానవుని
జీవితము
మంచుగడ్డవలే
ఆయుష్షు
కరిగిపోతున్నది.
కాలము
ప్రచండ
మారుతమువలే
కదలిపోతున్నది.
మానవుడు
తన
కర్తవ్యాన్ని
గుర్తించక
మునుపే
కాయాన్ని
వదలుతున్నాడు.
కనుక,
అలాంటి
జీవితము
వ్యర్ధము
అన్నారు.
కర్తవ్యాన్ని
గుర్తించాలి.
అప్పుడే
తన
జీవితము
సార్ధకమవుతుంది.
తాను
ఎందుకోసం
వచ్చాడు
అనేటువంటి
సత్యాన్ని
గుర్తించాలి.
తనను
తాను
గుర్తించే
నిమిత్తమై
వచ్చాడు.
మిగిలినవన్నీ
ఉపాంగములు.
కనుక,
మొట్టమొదట
నీవెవరు
అనే
దానిని
తెలుసుకోవాలి.
పుట్టినప్పుడు
‘కోహం’,
‘కోహం’,
‘కోహం’
అని
ఏడుస్తారు.
2
▾
Meaning
Keep
చనిపోయినప్పుడుకూడా
నీవెవరని
తెలుసుకొనకపోతే
ఏమి
ప్రయోజనము?
పుట్టేటప్పుడు
‘కోహం’
అన్నప్పుడు,
చనిపోయినప్పుడు
‘సోహం’
అని
తెలుసుకోవాలి.
భారతీయ
సంస్కృతి
ఉన్నతాశయాలతో
ఏర్పడినటువంటిది
ప్రాపంచిక
ప్రేమ
ఏ
విధముగా
వుంటుందంటే,
దీనికి
ఒక
ఉదాహరణము:
క్రొత్తగా
పెళ్లి
చేసుకున్న
భార్య,
భర్తలు
ఒక
పార్కులో
తిరుగుతున్నప్పుడు
దారిలో
ఒక
ముల్లు
కనిపిస్తే
భర్త
ముల్లు
అని
భార్యను
ప్రక్కకు
నెట్టివేస్తాడు.
6
నెలల
తరువాత
మరల
పార్కులో
తిరుగుతున్నప్పుడు
ముల్లు
కనిపిస్తే
‘జాగ్రత్త!
అక్కడ
ముల్లు
వున్నది’,
అని
చెబుతాడు.
1
సం॥ము
తరువాత
అదే
పార్కులో
తిరుగుతున్నప్పుడు
ముల్లు
కనిపిస్తే
భర్త
‘ఏమి!
నీకు
కళ్లు
కనిపించడములేదా
అక్కడ
ముల్లు
వున్నది’,
అని
అరుస్తాడు.
లౌకిక
ప్రేమలు
యీ
విధముగా
వుంటుంటాయి.
పూర్వకాలములోపల
వినయ,
విధేయతలు
వున్నవారిని
పెళ్లి
చేసుకోవటంవలన
జీవితములు
ప్రశాంతముగా
గడిచిపోయేవి.
గుణములు
చూసి
పెళ్లిచేసుకునేవారు.
కాబట్టి,
సంసారములు
చాలా
గుట్టుగా
వుంటుండాయి,
శాంతముగా
జరుగుతుంటున్నాయి.
యీనాడు
బాహ్య
దృష్టితో
చూస్తున్నారు.
యీనాడు
డిగ్రీలు
చూస్తున్నారు.
దీనికి
ఒక
ఉదాహరణము.
తల్లితండ్రులకు
ఒకే
ఒక
కొడుకున్నాడు.
అతనిని
చక్కగా
పెద్ద
చదువులు
చదివించారు.
ఉద్యోగముకూడా
వచ్చింది,
పెళ్లి
చేయాలని
యోచించారు.
కొడుకు
‘డిగ్రీ
చదువుకున్న
అమ్మాయి
అయితే
పెళ్లి
చేసుకుంటాను,
లేకపోతే
నేను
చేసుకోన’ని
చెప్పాడు.
తల్లి
‘చదువుకున్న
అమ్మాయి
వద్దు,
మనము
సాంప్రదాయ
కుటుంబమునుండి
అమ్మాయి
తెచ్చుకుంటే
గౌరవముగా
వుంటుంద’ని
చెప్పింది.
కాలక్రమేణా
సమయము
గడుస్తూ
వచ్చింది.
తల్లి
తండ్రులు
తమ
కుమారుడు
ఎవరైనా
వేరే
అమ్మాయిని
ప్రేమిస్తాడేమో
అని
భయపడి
డిగ్రీ
చదువుకున్న
అమ్మాయికోసం
వెతికారు.
అబ్బాయి,
అమ్మాయిని
చూసాడు.
నా
జీవితము
ఆనందమైనదని
భావించి
మనసులో
తల్లితండ్రులకు
థేంక్స్
చెప్పాడు.
15
దినములలోపల
వివాహము
జరిగినది.
తల్లితండ్రులదగ్గరకు
వచ్చి
వేరే
యిల్లు
కావాలని
అన్నాడు.
అద్దెయింటిలో
కాపురము
ప్రారంభించారు.
ఒకరోజు
ఉదయాన్నే
భర్త
లేచి
‘మై
డియర్!
కాఫీ’
అన్నాడు.
‘నేను
డిగ్రీ
చదువుకున్నాను,
నీవు
డిగ్రీ
చదువుకున్నావు.
3
▾
Meaning
Keep
నేను
ఎందుకు
కాఫీ
అందించాలి’,
అనింది
భార్య.
అప్పుడు
అనుకున్నాడు.
‘మై
లైఫ్
యీజ్
ఎన్టైర్
డార్క్నెస్.
ఒక్క
నెలలోపలనే
హెపీనెస్,
డార్క్నెస్.
యీనాడు
అబ్బాయి,
అమ్మాయిలలో
చదువులవలన
తెలివితేటలు
ఎక్కువగా
వుంటున్నాయి.
కాని,
గుణములు
వుండటంలేదు.
ఆనాడు
కుటుంబ
గౌరవముగుర్తించి
అమ్మాయిలు
చాలా
అణుకువగా
వుంటుండేవారు.
భారతీయ
సంస్కృతి
చాలా
ఆశయాలతో
ఏర్పడినటువంటిది.
కాని,
పాశ్చాత్యదేశములలో
భార్యాభర్తలయొక్క
బంధములు
ఎటువంటివి
అంటే
రోజుకొక
షర్టు
మార్చుకునే
విధముగా
వుంటుండాయి.
‘ధర్మేచ,
అర్ధేచ,
కామేచ
నాతి
చరామి’.
ధర్మఅర్ధకామములలో
తోడుగా
వుంటానని
భర్త
ప్రమాణము
చేస్తాడు.
భగవంతుడు
మాత్రమే
తాను
జన్మించబోయే
తల్లిని
ఎంచుకోగలడు
తల్లితండ్రులను
సంతోషపెట్టాలి.
వారికోసం
ఎంతైనా
కష్టపడవచ్చు,
తప్పేమీ
లేదు.
కారణము
ఏమిటంటే
యీనాడు
మీరు
తల్లితండ్రులను
గౌరవిస్తే
రేపటిదినము
మీ
పిల్లలు
మిమ్మల్ని
సంతోషపెడతారు.
ఎందుకంటే,
తల్లితండ్రులు
పిల్లలయొక్క
భవిష్యత్తును
దృష్టిలో
పెట్టుకొని
ఆలోచిస్తారు.
మీరు
మాత్రము
అమ్మాయిని
చూస్తారు.
కాబట్టి
మోసపోతారు.
అందరిని
నమ్మరాదు.
భార్యను
సెలక్షన్
చేసుకుంటాము.
కాని
తల్లితండ్రులను
సెలక్షన్
చేసేవారు
ఎవరైనా
వున్నారా,
కేవలము
భగవంతుడు
మాత్రమే!
ఏ
జన్మలో
ఎవరి
గర్భములో
జన్మించాలని
భగవంతుడు
మాత్రమే
తల్లిని
ఎంచుకుంటాడు.
ఉదాహరణకు
సతీదేవి,
కౌసల్య,
దేవకి.
భార్యను
మీరు
సెలెక్ట్
చేసుకుంటారు.
అమ్మను
సెలెక్ట్
చేసుకోటానికి
వీలులేదు.
మీకు
రక్తముపంచి,
జన్మనిచ్చి,
పెంచి,
పోషించినటువంటి
తల్లిని
కష్టపెట్టకూడదు.
‘జననీ
జన్మభూమిశ్చ,
స్వర్గాదపి
గరీయసి’
అన్నారు.
జన్మభూమిని,
కన్నతల్లిని
మనము
ఎప్పుడూ
విడువకూడదు.
ఇది
నా
మాతృదేశము,
కాబట్టి
దేశాభిమానము
వుండాలి.
ఇండివిడ్యువల్
కేరెక్టరు
వుండాలి.
యీ
రెండు
లేకపోతే
లివింగ్
డెత్.
దేశములో
ఎటువంటి
ప్రమాదము
వచ్చినా
తనకు
వచ్చినట్టే
భావించాలి.
యీనాడు
రాజకీయ
నాయకులంతా
దేశాభిమానమని
చెబుతుంటారు,
వచ్చిన
డబ్బంతా
స్విట్జర్లేండ్లో
పోగుచేస్తుంటారు.
4
▾
Meaning
Keep
కడపటికి
ఈ
దేశముయొక్క
ఖజానా
అంతా
విదేశములకే
పోతుండాది.
బ్రిటిష్వాళ్లంతా
మన
డబ్బును
మనవాళ్లకొరకు
ఖర్చుపెడుతూ
వచ్చారు.
కాని,
యీనాడు
మన
నాయకులంతా
మన
డబ్బును
వాళ్లక్రింద
ఖర్చు
పెట్టుతున్నారు.
ఒకవేళ
వీడు
చనిపోతే
ఆ
డబ్బంతా
వారికే
చెందుతుంది.
ఆ
విధముగా
కొన్నికోట్లు
ధనము
పోయింది.
అందుగురించే
గాంధీజి
చెప్పాడు:
‘మన
దేశ
వస్తువులనే
వాడండి,
యితర
దేశములయొక్క
వస్తువులను
వాడకండి’
అని.
దేశాభిమానము
వుండాలి;
కాని,
వేరొక
దేశాన్ని
మనము
విమర్శించకూడదు.
మన
దేశము
మనకు
ఎంత
ప్రీతియో
వారి
దేశము
వారికి
అంతప్రీతి
ఏ
దేశముపైన
మనము
ద్వేషము
పెంచుకోకూడదు.
ఎవరి
దేశాన్ని
వారు
ప్రేమించుకుంటూవుంటే
ఎటువంటి
ద్వేషాలు
వుండవు.
మీరు
భారతదేశములో
పుట్టారు,
ఈ
దేశముయొక్క
నీరు
త్రాగుతున్నారు.
ఈ
దేశముయొక్క
ఆహారాన్ని
తింటున్నారు.
కాని,
పాశ్చాత్య
దేశాలను
ప్రేమిస్తున్నారు.
అటువంటివారు
దేశద్రోహులు.
మనము
ఇతర
దేశములను
చూడటంలేదు,
వాటియొక్క
పద్దతులను,
పరిస్థితులను
చూడటంలేదు,
వాటియొక్క
ఆశయాలను,
ఆదర్శములను
మనము
తెలుసుకొనటంలేదు,
కాని
ప్రేమిస్తున్నాము.
ఎవరైనా
వచ్చి
నీ
తల్లి
యిటువంటిది,
నీ
తండ్రి
యిటువంటివాడు
అని
అంటుంటే
ఎవరైనా
ఊరుకుంటారా!
అటువంటివారిపైన
మనము
తిరగబడతాము.
అదేవిధముగనే
మన
దేశాన్ని
విమర్శిస్తుంటే
మనము
తప్పకుండా
ఎదుర్కోవాలి.
దేశాభిమానము
వుండినప్పుడే
వ్యక్తిగత
కేరెక్టర్
అభివృద్ధి
అవుతుంది.
National
Character
and
Individual
Character
మానవునికి
తల
మరియు
పాదమువంటివి.
యీ
రెండును
యువకులకు
చాలా
అవసరము.
తన
తల్లి
కురూపిగా
వుండవచ్చును,
బీదరికముగా
వుండవచ్చును.
అందముగా
వున్న
వేరే
యువతి
తన
తల్లి
అవ్వదుకదా!
‘స్వర్ణమయమైన
లంక
నాకు
అవసరము
లేదు
లక్ష్మణా!
నా
జన్మభూమి
అయిన
అయోధ్య
నాకు
కావాలి’,
అన్నాడు
రాముడు.
అభిమానము
మంచిదే
కాని
దురభిమానము
వుండకూడదు.
యీ
దురభిమానము
వుండి
యింకొక
దేశాన్ని
విమర్శించకూడదు.
ఇది
చాలా
ముఖ్యము.
5
▾
Meaning
Keep
మన
దేశము
మనకు
ఎంత
ప్రీతియో,
వారి
దేశము
వారికి
అంత
ప్రీతి.
అటువంటి
సమభావాన్ని
మనము
పెంచుకోవాలి.
ఒక
దేశాన్నేకాదు,
ఒక
వ్యక్తినేకాదు
మనము
ఎవ్వరినీ
విమర్శించకూడదు.
యిష్టమున్నప్పుడు
ఫాలో
చేస్తాము,
యిష్టము
లేకపోతే
ఫాలో
చెయ్యము,
వూరుకుంటాము.
నీ
ఆలోచనలో
అది
వేరేగా
వుండవచ్చు.
వారి
ఆలోచనలో
మంచిగా
వుండవచ్చు.
దానియొక్క
అంతరార్థము
ఎట్లాగుంటాదో
ఎవరికి
తెలుసు?
దాని
గురించి
మనకు
తెలియనప్పుడు
మనము
విమర్శించటానికి
వీలుకాదు.
భగవద్గీతలో
‘అద్వేష్టా
సర్వభూతానాం’
అని
చెప్పబడింది.
అందరియందు
దైవత్వముంటుండాది.
ఆ
దైవత్వాన్ని
మనము
ఏ
విధముగా
విమర్శించటానికి
వీలవుతుంది?
ఒకవేళ
విమర్శించినట్లయితే
నిన్ను
నీవు
విమర్శించినట్లవుతుంది.
ఇతరులు
ఎటువంటివారని
మనము
విమర్శిస్తున్నాము,
కాని
నీవు
ఎటువంటివాడివో
మొట్టమొదట
తెలుసుకోకూడదా?
ఇతరులలో
చిన్న
తప్పును
మనము
పెద్దదిగా
భావించినప్పుడు,
మనయందున్న
చిన్న
తప్పును
పెద్దదిగా
భావించుకోటము
మంచిది.
కాని,
మన
పెద్ద
తప్పును
చిన్నదిగా
భావిస్తాము.
ఇతరుల
చిన్న
తప్పును
మనము
పెద్దదిగా
భావిస్తాము.
అది
మంచిది
కాదు.
ఎదుటి
వాళ్లలో
యున్న
మంచిని
చూసుకో.
యీ
విధముగా
మనము
ప్రపంచములో
మంచి
విషయములనే
చూడాలి.
చెడును
చిన్నదిగా
వుండినప్పుడే
త్రుంచి
వేయాలి
ద్వేషములు
పెంచుకొనటమువలన
ఎవరికోకాదు,
వారికే
ప్రమాదము.
కనుక
మనము
జాగ్రత్తగా
వుంటుండాలి.
ఒకవేళ
ఎవరైనా
తప్పుచేసినప్పుడు
చెప్పాలి.
అది
తప్పుకాదు.
అంతేకాని
విమర్శించకూడదు.
దీనికొక
ఉదాహరణము.
పాండవులు,
కౌరవులుండినారు.
కౌరవులు
ధర్మమూర్తులైన
పాండవులను
దూషిస్తూ
వచ్చారు.
ద్రౌపదినికూడా
పరాభవము
చేశారు.
ఇవన్నీ
చూస్తున్నారు,
భీష్ముడు,
కృపాచార్యుడు,
ద్రోణాచార్యుడు.
ఇది
తప్పని
తెలుసు
కాని
చెప్పలేకపోయారు.
చెప్పలేకపోవటంవలన
దానిని
ప్రోత్సహించినవారైనారు.
ఆ
దోషము
వారికికూడ
తగిలింది.
ఇవన్నీ
నేను
మీకు
చెబుతున్నానంటే
మిమ్మల్ని
విమర్శించటమా?
6
▾
Meaning
Keep
కాదు,
బోధించటము.
మీరు
బాగుపడటముకోసము
చెప్పేటటువంటిది.
ఇతరులను
బాధించేటువంటివి,
నొప్పి
కలిగించేటువంటివి,
హింసించేటువంటివి
చెప్పకూడదు.
ఇతరులను
మంచి
మార్గములో
నడిపించేటువంటివి,
పవిత్రమైన
మార్గములో
అభివృద్ధిపరచేటువంటివి
చెప్పటములో
తప్పులేదు.
అందుకే
ధృతరాష్ట్రునితో
విదురుడు
చెప్పాడు,
‘చెట్టును
గొడ్డలితో
నరికిన
తరువాత
కూలిపోతుంది,
తరువాత
ఆ
చెట్టు
చిగురిస్తుంది.
కాని
కఠినమైన
మాటలతో
హృదయాన్ని
దూషిస్తే
అది
నశించిపోతుంది.
ఎందుకంటే
కౌరవులు
కృష్ణుడిని
దూషించారు.
కృష్ణుడు
పాండవుల
పక్షపాతిగా
వుంటున్నాడు.
ఎందుకంటే
పాండవులు
ధర్మమూర్తులు.
కౌరవులు
అధర్మమూర్తులు
అయినప్పటికి
నీవు
నీ
కుమారులను
ప్రోత్సహిస్తున్నావు’,
అని.
విదురుడు
తన
అన్నను
ఎదురించాడు.
తండ్రి
తన
కుమారులయొక్క
తప్పులను
ప్రోత్సహిస్తూపోతే
వారు
నాశనము
అయిపోతారు.
పుత్రవాత్సల్యము
ముఖ్యముకాదు,
పవిత్రార్చన
ముఖ్యమన్నాడు.
కొడుకులు
పుట్టినందుకు
సత్కీర్తి
రావాలి.
అటువంటివారినే
కుమారులుగా
భావించాలి.
ధృతరాష్ట్రుడంటే
ఎవరు?
తనది
కానటువంటి
దానిని
తనదిగా
భావించేవాడు,
ధృతరాష్ట్రుడు.
తనది
కానటువంటి
రాజ్యాన్ని
తనదిగా
భావించుకుంటూపోయారు,
కౌరవులు.
‘నా
దేహమునుండి,
రక్తమునుండి
పుట్టినటువంటివారిని
నేను
ఎట్లా
దూరము
చేసుకుంటాను’,
అన్నాడు.
నీ
దేహములో
పుట్టినటువంటి
మలమూత్రములను
శుభ్రము
చేసుకోకుండా
వుండినావా?
నీ
దేహములో
పుట్టినటువంటి
పేలను,
నల్లులను
చంపినప్పుడు
నీవు
దయ
చూపటంలేదు.
అదే
విధముగా
చెడును
చిన్నదిగా
వుండినప్పుడే
త్రుంచివేయాలి,
లేదంటే
అది
మహావృక్షముగా
తయారైపోతుంది.
నిన్ను
అందరూ
గౌరవించాలంటే
నీవు
అందరిని
గౌరవించాలి
మీరా
తులసిదాసువద్దకు
పోయి
సలహా
అడిగినాది.
తులసిదాసు
యీ
విధముగా
జవాబు
యిచ్చాడు.
‘అమ్మా!
మనము
పుట్టినది
దైవముకోసం.
మధ్యలో
వచ్చినటువంటి
వాటిగురించి
మనము
ఆలోచించకూడదు.
వివాహము
కాక
పూర్వము
అబ్బాయి
వేరు,
అమ్మాయి
వేరు.
కాని
వివాహము
అయిన
తరువాత
భార్యభర్తలుగా
అయినారు.
7
▾
Meaning
Keep
పుట్టకమునుపు
ఆమె
ఎవరో
తెలియదు,
పుట్టిన
తరువాత
ఆమె
తల్లి
అయింది.
కాని,
దైవము
ఆ
విధముగా
కాదు.
మనము
పుట్టిన
తరువాత,
ముందు,
చనిపోయిన
తరువాత
కూడా
అతను
వుంటాడు.
అతనే
మన
గమ్యము.
కనుక,
నీవు
దానిని
లక్ష్యముగా
వుంచుకో
మిగిలినవి
కావు’,
అని
తులసిదాసు
చెప్పాడు.
అప్పుడు
ఆమెకు
ధైర్యము
వచ్చింది.
‘ఒకవేళ
నీవు
చేసినది
తప్పయితే
దైవము
ఖండిస్తాడు.
నా
అనుభవముతో
చెబుతున్నాను’,
అన్నాడు.
తులసిదాసు
భార్యను
ఎల్లప్పుడు
విడచిపెట్టియుండలేదు.
కాని,
ఒకరోజు
రాత్రి
అతని
భార్య
‘మలమూత్రదుర్గంధమైన
మాంసరక్తములతో
కూడిన
యీ
దేహముపైన
యుండిన
భ్రాంతిని
రామునిపైన
యుండిన
ఎంతో
బాగుపడేవాడివి’,
అని
దూషించినది.
ఆ
మాటలు
అతనికి
సూటిగా
నాటుకున్నాయి.
ఆ
క్షణమునుండి
అతను
వెనుతిరిగి
ప్రయాగకు
చేరుకున్నాడు.
ఆ
విధముగా
‘నా
భార్య
నాకు
గురువు’
అన్నాడు.
యీ
విధముగా
భార్య
గురించి
భర్తలు,
భర్తలు
గురించి
భార్యలు
దైవత్వము
చేరుకోటానికి
పాటుపడుతూ
వచ్చారు.
దైవత్వము
గురించి
విరుద్ధముగా
వచ్చినప్పుడు
మనము
ఎదురించటములో
తప్పులేదు.
దైవమును
వదలిపెట్టటానికి
వారికి
యిష్టముండదు.
వాళ్ల
కోరిక
ఎంతటి
గొప్పదో,
నీ
కోరిక
అంత
గొప్పది.
కాబట్టి
నీకు
గౌరవము
కావాలి
అంటే
నీవు
అందరిని
గౌరవించాలి.
నీవు
గౌరవించనప్పుడు
నిన్ను
ఎవరు
గౌరవిస్తారు?
ఇతరులను
నీవు
దూషించినప్పుడు
నిన్ను
అందరూ
దూషించుతారు.
Previous
←
Seek Ye First
Next
Brahmacarya Is Moving Everywhere with the Feeling of Brahman
→