Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · Humanness Is the United Form of Mind, Word and Deed
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Humanness Is the United Form of Mind, Word and Deed
2 May 1988
1
▾
Meaning
Keep
సంతోషము
తాత్కాలికమైనది,
ఆనందము
శాశ్వతమైనది
సమాజములో
ప్రధానముగా
వుండవలసినటువంటివి
మానవతావిలువలు.
The
proper
study
of
mankind
is
man.
ఏమిటి
ఈ
మానవత్వము?
మనస్సు,
వాక్కు,
క్రియ
ఈ
మూడింటి
సమ్మిళితస్వరూపమే
మానవత్వము.
దీనినే
ప్రస్తుతం
ప్రపంచములో
Education
in
Human
Values
అంటున్నారు.
EHVయొక్క
అంతరార్థాన్ని
గుర్తించటానికి
మనము
ప్రయత్నించాలి.
విద్యయొక్క
విశిష్టత
ఏమిటి?
కేవలం
విద్యాసంస్థలు
లేదా
యూనివర్సిటీలో
చదువుకోవటం
విద్యయా?
విశ్వమే
ఒక
విశ్వవిద్యాలయము.
మానవుడు
ఉదయం
లేచినమొదలు
రాత్రి
పరుండువరకు
ఆచరించినటువంటి
ప్రతీ
క్రియ
విద్యకు
సంబంధించినదే!
మానవజీవితమునకు
అవసరమైన
సర్వకర్మలు
ఆచరించటం
విద్యయే.
ఈ
విద్యను
మనము
ఏ
రీతిగా
అభ్యసించాలి?
మనస్సు,
వాక్కు,
క్రియలను
మూడింటిని
ఏకత్వము
చేసి
విద్యను
అభ్యసించాలి.
3H
అనగా
Heart,
Head,
Hand.
Thoughts,
Words,
Action
ఈ
మూడింటియొక్క
సమ్మిళితమైన
స్వరూపమే
Education.
ఈనాటి
విద్యలు
కేవలము
గ్రంథపరిచయము
మాత్రమే!
పుస్తకమునుండి
మస్తకము
తప్ప
ఆచరణలో
దీనిని
అనుభవించటానికి
ప్రయత్నించటంలేదు.
Head
వరకు
పోతున్నాది
కాని
Heart
వరకు
పోవడంలేదు.
Head
తాత్కాలికమైన
సంతోషాన్ని
మాత్రమే
యిస్తుంది.
Heart
నుండి
ఆనందము
ప్రాప్తిస్తుంది.
సంతోషానికి,
ఆనందమునకు
చాలా
వ్యత్యాసమున్నది.
సంతోషము
తాత్కాలికమైనది
కాని
ఆనందము
శాశ్వతమైనది.
నిత్యమైన,
పవిత్రమైన,
నిగూఢమైన,
నిరంతరమైన
సత్యాన్ని
‘త్రిగుణాతీతం
సత్యం’
అన్నారు.
దీనినే
వేదాంతమునందు
‘ఋతము’
అన్నారు.
కాని
ఈనాడు
లౌకికమైన
చర్యలందు
తాత్కాలికమైన
ఆనందము
కోసమని
ఈ
సత్యాన్ని
ఉపయోగపెడుతున్నాము.
‘నిర్గుణం,
నిరంజనం,
సనాతనం,
నికేతనం,
నిత్య,
శుద్ధ,
బుద్ధ,
ముక్త,
నిర్మల
స్వరూపిణం’
ఇది
నిజమైనటువంటి
ఆత్మతత్త్వము.
2
▾
Meaning
Keep
అపవిత్రమైనటువంటి,
అసత్యమైనటువంటి,
అనిత్యమైనటువంటి
గుణములు
త్యాగము
చేసినప్పుడే
నిత్యసత్యమైన
దివ్యత్వము
ప్రాప్తిస్తుంది.
కనుకనే
భగవద్గీత
మొట్టమొదటనే
చెప్పింది.
‘అనిత్యం
అసుఖం
లోకం
ఇమం
ప్రాప్య
భజస్వమామ్’.
ఇంద్రియములను
నియంత్రించడమే
నిజమైన
విద్య
జగత్తంతా
అనిత్యము,
జాగ్రతంతయు
అసత్యము,
స్వప్నమంతా
అసత్యము.
జాగ్రత్లోయున్నది
స్వప్నములోలేదు,
స్వప్నములోనున్నది
జాగ్రత్లోలేదు.
కాని
జాగ్రత్స్వప్నములు
రెండింటియందు
నీవు
వుంటున్నావు.
కనుక
నీవే
సత్యము.
మానవుడు
నా
ఇల్లు,
నా
కారు,
నా
భార్య,
నా
పుత్రుడు,
నా
మిత్రుడు,
నా
శత్రువు
అన్ని
నావి,
నాది
అంటున్నాడే
తప్ప
తానెవరు
అని
విచారణ
చేయడంలేదు.
తనను
తాను
గుర్తించినప్పుడు
సర్వము
గుర్తించినవాడవుతాడు.
A
man
with
dualistic
mind
is
half
blind.
మానవజీవితము
బేలెన్సుమీద
ఆధారపడియున్నది.
ఈనాటి
విద్య
తెలివితేటలను
పెంచుతున్నది.
వీటితోపాటు
గుణములనుకూడా
పెంచుకోవాలి.
అంతేకాదు,
యింద్రియములయొక్క
ఉద్రేకాన్నికూడా
అందిస్తున్నాది.
యింద్రియములను
నియంత్రించడమే
నిజమైన
విద్య.
కాబట్టి
గుణములు
లేకపోతే
తెలివితేటలు
ఎన్నివున్నా
ప్రయోజనములేదు.
ఈనాడు
మన
తెలివితేటలను
ఏ
రీతిగా
ఉపయోగపెడుతున్నాము?
తెలివితేటలను
సక్రమముగా
ఉపయోగపెట్టినప్పుడు
బేలెన్సుగా
వుంటాయి.
అప్పుడే
గుణములు
అభివృద్ధి
అవుతాయి.
కనుక
మన
knowledgeని
skill
చెయ్యాలి.
కాని,
మనము
kill
చేస్తున్నాము.
అనగా
మన
sensesను
misuse
చేస్తున్నాము.
అందువలన
బేలన్సు
తప్పిపోతున్నాము.
అప్పుడే
అంతర్దృష్టి
పోయి
బహిర్దృష్టి
ప్రారంభమైపోతున్నది.
కనుక
మానవత్వములో
దివ్యత్వముండికూడా
మనము
గుర్తించుకోలేకపోతున్నాము.
కంటికి
కనిపించినదంతా
జగత్తుగా
భావిస్తున్నాము.
కాదు
కాదు,
అంతా
బ్రహ్మమే!
‘విశ్వం
విష్ణుమయం
జగత్’.
‘జగత్’
అనే
అర్థాన్ని
గుర్తించండి.
‘జ’
అనగా
పుట్టడం.
‘గత్’
అనగా
పోవడం.
3
▾
Meaning
Keep
Also in his talks
(7)
11 October 1986
God belongs to all
23 March 1989
Do all actions only to please God
2 July 1989
The Ātma Principle Is Everywhere
29 August 1992
Life is fulfilled only when one born saying ‘Koham’ attains the experience of ‘Soham’
6 September 1996
Religion Is What Shows Forth the Oneness in Manyness
8 September 1996
The Unseen Divinity Is the Basis of the World Fashioned as the Seen
21 October 1996
In God's Creation Everything Is Pure!
అనగా
రావడం,
పోవడం.
కాని,
భగవంతుడు
శాశ్వతం.
రావడం
లేదు,
పోవడంలేదు.
జగత్
భావాన్ని
దూరంచేసి
బ్రహ్మభావాన్ని
అభివృద్ధి
చేసుకోవాలి.
ఆభరణములు
చూచినంతవరకు
బంగారము
కనిపించదు.
మానవునకు
మించినది
జగత్తులో
లేనేలేదు
మృత్పిండమేకం
బహుభాండ
రూపం
సువర్ణమేకం
బహు
భూషణాని
గోక్షీరమేకం
బహుధేనువర్తి
ఏకం
పరమాత్మ
బహుదేహవర్తి
ఉన్నది
ఒకే
భగవంతుడే,
‘ఏకం
యేవ
అద్వితీయం
బ్రహ్మ’.
ఇట్టి
సత్యాన్ని
గుర్తించే
నిమిత్తమై
మానవత్వము
ప్రాప్తించింది.
ఖురాన్
ఒక
విషయాన్ని
అందించింది.
ఎవడు
భగవంతుని
విశ్వసించడో
వాన్ని
చంపివేయమని
చెప్పింది.
అనగా
కేవలం
బాహ్యదృష్టితో
చూచినప్పుడు
విశ్వాసములేనటువంటివానిని
చంపివేయమని
ఒక
అర్థము.
విశ్వాసము
కలగకుండా
చేయడానికి
ఏది
కారణము?
మనస్సు,
బుద్ధి,
చిత్తము,
అహంకారము.
ఇవే
విశ్వాసాన్ని
పూర్తికాకుండా
చేస్తున్నవి.
అనగా
దీనిని
చంపమన్నాడు.
ఈ
నాలుగు
ప్రత్యేకమా
లేక
ఒక్కటా?
నాలుగు
స్థితులయందు
నాలుగు
రూపములు
ధరిస్తున్నది.
బిడ్డ
పుట్టినపుడు
శిశువు,
పది
సం॥లు
తరువాత
పిల్లవాడు,
30
సం॥లు
తరువాత
యువకుడు,
70
సం॥లు
తరువాత
వృద్ధుడు.
శిశువు,
పిల్లవాడు,
యువకుడు,
వృద్ధుడు
అందరూ
ఒక్కరే!
అదే
విధముగనే
‘సంకల్పవికల్పాత్మకం
మనః’
అనగా
సంకల్పవికల్పములతోకూడినప్పుడు
మనస్సు
అన్నారు.
విచారణాశక్తియందు
నిర్ణయపరచేటువంటి
దానిని
బుద్ధి
అన్నారు.
నిరంతరము
చింతించడంవలన
చిత్తము
అని
పేరు
వచ్చింది.
తన
వునికిని
మరచి
దేహమే
నేనని,
నేనే
దేహమని
భావించడం
అహంకారము
కనుక
మానవత్వమనగా
మనోవాక్కాయకర్మలయొక్క
ఏకత్వమే.
మానవుడు
ప్రజ్ఞావంతుడు.
మానవునకు
మించినటువంటిది
జగత్తులో
లేనేలేదు.
కారణం
జగత్తులో
సమస్త
పదార్థములకు
విలువకట్టేది
మానవుడే.
ఈనాడు
మానవుడు
వస్తువునకు
విలువయిస్తున్నాడు
కాని,
మానవత్వానికి
విలువ
యివ్వడంలేదు.
4
▾
Meaning
Keep
అందుకే
మానవత్వము
ఇంత
దిగజారిపోతున్నది.
దేహమునందు,
మనస్సునందు,
బుద్ధినందు,
అంతఃకరణమునందు
సర్వత్రా
వ్యాపించినటువంటిదే
ప్రజ్ఞ.
‘ప్రజ్ఞానం
బ్రహ్మ’
అన్నారు.
ఈ
ప్రజ్ఞానమే
దైవత్వం.
దీనిని
ఏ
విధముగా
గుర్తించగలము?
జగత్తునందు
ఒక
వస్తువు
ఉన్నది,
లేదు
అని
సంఘర్షణ
జరిగినపుడు
ఆ
వస్తువుగురించి
తెలుసుకోవాలి.
అప్పుడే
ఆ
వస్తువు
ఉన్నదా
లేదా
అని
చెప్పడానికి
వీలవుతుంది.
దేవుడెవరు
అని
గుర్తించినప్పుడే
అతను
ఉన్నాడా
లేడా
అని
చెప్పడానికి
వీలవుతుంది.
దేవుడెవరో
తెలియదు
కాని
‘లేడు,
లేడు’
అని
గుడ్డిగా
పలుకుతారు.
నీకు
తెలియనప్పుడు
లేడని
చెప్పే
అధికారములేదు.
కాబట్టి
ముందుగా
నీవు
దేవుడంటే
ఏమిటి
అని
తెలుసుకోవాలి.
You
are
not
one
person
but
you
are
three.
The
one
you
think
you
are;
the
one
others
think
you
are;
the
one
you
really
are.
ఈ
మూడింటి
తత్త్వాన్ని
మీరు
గుర్తించాలి.
‘నేను
కిశోర్’
అంటున్నావు;
ఏ
విధముగా
అంటున్నావు?
కృత్రిమమైన
దేహమును
పురస్కరించుకుని
‘నేను
కిశోర్’
అంటున్నావు.
రెండవది
నీవు
మంచి
చెడ్డ
అని
యితరులు
చెపుతున్నారు.
ఇది
మనస్సుయొక్క
క్రియలవలన
చెపుతున్నారు.
మూడవది
శాశ్వతమైన,
సత్యమైన
ఆత్మ.
మొట్టమొదట
మనస్సును
అరికట్టడానికి
ప్రయత్నించాలి
మానవునియొక్క
జీవితమునందు
ధర్మార్థకామమోక్షములను
పురుషార్థములు,
కారుకు
నాలుగు
టైర్లువలె
వుంటున్నాయి.
అందులో
నమ్మకము
అనే
గాలివలన
నడుస్తుంది.
ఈ
టైర్లు
తనంతటతాము
తిరగటంలేదు.
మనస్సు
అనే
స్టీరింగువలన
అవి
తిరుగుతున్నాయి.
పెట్రోల్
మాదిరి
పొట్టలో
నీరు,
ఆహారము
నిత్యము
నింపుతున్నాము.
హృదయమనే
సీటులో
ఓనరు
కూర్చున్నాడు.
బుద్ధి
స్టార్టింగ్
స్విచ్.
స్విచ్
ఆన్
చేస్తేనే
కారు
నడుస్తుంది.
కనుకనే
‘బుద్ధిః
కర్మానుసారిణీ’,
‘మనయేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః’
అన్నారు.
మొట్టమొదట
మనస్సును
అరికట్టడానికి
ప్రయత్నించాలి.
మనసునుండి
వచ్చినటువంటివాడే
మనిషి.
మనసేలేకుంటే
మనిషేకాడు.
మానవత్వమును
స్వార్థపరంగా
నీవు
అనుభవించటంవలన
సంకుచితమైన
మార్గములో
ప్రవేశిస్తున్నావు.
5
▾
Meaning
Keep
యవ్వనము
అనేది
మధ్యలో
వచ్చి
మధ్యలో
మాయమైపోయేది.
ఈ
సత్యాన్ని
గుర్తించుకోరు,
యువకులు.
దీనికి
చిన్న
ఉదాహరణము.
ఒకానొక
సమయములో
వినోబా
భావే
ట్రైనులో
ప్రయాణము
చేస్తున్నప్పుడు
ఒక
యువకుడు
ధూమపానము
చేస్తున్నాడు.
అది
చూసి
ఆయన
‘నాయనా!
నాకు
పొగ
పడదు
కాబట్టి
ఆప’మన్నాడు.
ఆ
యువకుడు
‘సిగరెట్టు
నాది,
అగ్గిపెట్టె
నాది,
శరీరం
నాది,
కాబట్టి
నా
యిష్టం’
అన్నాడు.
వినోబా
భావే
సామాన్యుడుకాడు,
చాలా
వివేకవంతుడు.
ఆ
యువకుని
ప్రశ్నకు
జవాబుగా
‘సిగరెట్టు
నీది,
అగ్గిపెట్టి
నీది,
శరీరం
నీది
అయినపుడు
పొగ
మాత్రం
ఎందుకు
బయటకు
వదులుతున్నావు?
అదికూడా
నీలోనే
వుంచుకో’
అన్నాడు.
తక్షణమే
తన
తప్పును
తెలుసుకున్నాడు,
యువకుడు.
అందుచేత,
‘అంతా
నాది
నాది
నాది’
అనే
మమత్వముచేత
మానవుడు
కట్టుబడుతున్నాడుకాని
సమాజము
ఒకటున్నాదని
విశ్వసించడం
లేదు.
సమాజములో
సమత్వమును
అభివృద్ధి
పరచుకోవాలి.
‘సుఖఃదుఃఖములయందు,
నిందనిష్టూరములయందు,
దూషణభూషణలయందు
సమత్వమును
పెంచుకోటమే
ఓర్పు’,
అన్నారు.
త్యాగరాజు
చెప్పాడు.
‘శాంతములేక
సౌఖ్యములేదు’.
శాంతమును
సాధించాలి.
భగవంతుడు
మన
హృదయములోనే
ఉన్నాడనే
విశ్వాసాన్ని
పెంచుకోవాలి
తుకారాం
పరమభక్తుడు.
అతను
సర్వకాల
సర్వావస్థలయందుకూడను
రామనామాన్నే
ఉచ్చరిస్తుండేవాడు.
తనకు
ఒక్క
ఎకరము
భూమియుండేది.
రామనామము
జపిస్తూ
తన
పంటభూమిని
సేద్యముచేస్తూ
వుండేవాడు.
ఎవరైనా
ఏదైనా
యాచిస్తే
తనకున్నదాంట్లో
యిచ్చేవాడు.
ఒకనాడు
తాను
చెఱకు
పంటను
ఇంటికి
తీసుకువస్తానని
భార్యకు
చెప్పటంతో
ఆమె
సంతోషించింది.
ఆ
చెఱకును
బండిలో
యింటికి
తీసుకువస్తున్న
సమయములో
దారిన
పోయేవారు
ఆ
చెఱకును
ఒక్కొక్కటి
తీసుకుని
తింటున్నారు.
తుకారాం
చూసి
‘ఓహో!
ఎవరికి
ఎంత
ప్రాప్తమో’
అని
విశాల
హృదయముతో
యోచించుకుంటా
పోయాడు.
ఆఖరికి
ఒక్క
చెఱకుగడ
మిగిలింది.
దానిని
తీసుకొని
ఇంటికి
వెళ్ళాడు.
భార్య
అది
చూసి
‘ఈ
విధముగా
నీవు
నీ
కర్తవ్యాన్ని
వదలి
భార్యాబిడ్డలు
గురించి
ఆలోచించకుండా
దానం
చేసుకుంటూ
పోతే
సంసారాన్ని
ఏ
విధముగా
పోషించగలవు?’,
6
▾
Meaning
Keep
His poems 164
Also in his talks
(1)
23 October 1996
Without the Body the Ātma Cannot Be Recognised, nor the Body without the Ātma
అని
కోప్పడి
చెఱకుగడతో
కొట్టింది.
మూడు
ముక్కలైంది.
అటువంటి
సమయములోకూడను
తుకారాం
శాంతము
వహించి
‘నీకు
మరియు
యిద్దరు
పిల్లలకు
ఒక్క
చెఱకును
ఏ
విధముగా
పంచాలి
అనుకున్న
సమయములో
నీవు
దానిని
మూడు
ముక్కలు
చేసి
చాలా
సహాయము
చేశావు’,
అని
భార్యను
మెచ్చుకున్నాడు.
భగవంతుడు
కామధేనువు,
కల్పవృక్షము.
అందరికి
యిచ్చేవాడుగాని
పుచ్చుకునేవాడు
కాదు.
అలాంటి
భగవంతుడు
మన
హృదయములోనే
వున్నాడు
అన్న
నమ్మకము
గలవాడు
తుకారాం.
అట్టి
విశ్వాసాన్ని
పెంచుకోవాలి
యీనాటి
యువకులు.
కామితార్థంబిచ్చు
కామధేనువు
రాగ
ధనమిచ్చి
యావును
కొనగనేల?
మించెడి
కాంతితో
మేరు
పర్వతముండ
వెండిబంగారుకై
వెతకనేల?
కామిత
ఫలమిచ్చు
కల్పవృక్షమెయుండ
పెరటి
వృక్షమునకై
ప్రీతి
ఏల?
భక్తిముక్తులనిచ్చు
భగవంతుడిందుండ
పాడు
సంసారము
కోరనేల?
‘నేనే
దైవము,
నేనే
దైవము’
అనేటువంటి
విశ్వాసాన్ని
మీరు
దృఢపరచుకోవాలి.
మానవత్వమనేది
దివ్యత్వముతోకూడినటువంటి
ఆత్మతత్త్వము.
ఎవరైనా
మనలను
బాధపెడితే
మనకు
ఎంత
కష్టమవుతుందో
ఆ
విధమైన
బాధను
మనము
ఇతరులకు
యివ్వకూడదు.
నిన్ను
ఎవరైనా
దూషిస్తే
ఎంత
బాధపడతావో
అదే
విధముగా
నీవు
ఇతరులను
దూషించకూడదనే
సత్యాన్ని,
సమత్వాన్ని
యీనాటి
యువకులు
గుర్తించాలి.
మనము
కంటితో
పరస్త్రీలను
చెడుగా
చూచినపుడు
మన
స్త్రీలను
పరులు
చెడుగానే
చూస్తారు.
కాబట్టి
దృష్టిని,
చెవులను,
నోటిని
కంట్రోలులో
పెట్టుకోవాలి.
దీనినే
జయదేవుడు
చెప్పాడు.
‘జిహ్వే
రసజ్ఞే
మధుర
ప్రియే
త్వం
సత్యం
హితం
త్వాం
పరమం
వదామి
ఆవర్ణ
యేథాం
మధురాక్షరాణి
గోవింద
దామోదర
మాధవేతి’.
‘ఓ
జిహ్వా!
నీకు
మంచి
చెడుల
విచక్షణా
జ్ఞానమున్నది.
7
▾
Meaning
Keep
మంచిదైతే
లోపలికి
పంపిస్తావు.
చెడ్డదైతే
బయటకు
పంపిస్తావు.
నీలో
త్యాగగుణమున్నది.
నీలో
సహనభావమున్నది.
నీ
చుట్టూ
సూదైన,
కఠినమైన
దంతములున్నప్పటికిని
వాటిమధ్యలో
జాగ్రత్తగా
మెలుగుచున్నావు’.
కావున
మన
మాటలు
చాలా
విలువైనవిగా
వుండాలి.
పవిత్రమైన
భావాలు
అభివృద్ధి
చేసుకుంటూ
పోవాలి.
అప్పుడే
మీరు
చదివిన
MBA
డిగ్రీలకు
విలువ
వుంటుంది.
అప్పుడే
మీతో
పనిచేసే
managers,
workers
తో
సహనంగా
వుండి
కార్యాన్ని
సాధించుకోగలరు.
ఇంద్రియ
నిగ్రహమే
నిజమైన
యోగము
సోక్రటీసుకూడా
అటువంటి
ఓర్పు,
సహనాన్నే
అలవాటు
చేసుకుంటూ
వచ్చాడు.
ఒకనాడు
డ్రాయింగ్రూమ్లో
కూర్చుని
యోచిస్తున్నాడు.
భార్య
భోజనం
వడ్డించి
అతనిని
పిలిచింది.
ఏదో
పెద్ద
యోచనలో
యుండడంవలన
అతను
వినిపించుకోలేదు.
ఎప్పుడు
చూచినా
అతను
మంచినే
యోచిస్తూయుండేవాడు.
భార్యకు
చాలా
కోపము.
అనేక
పర్యాయములు
పిలిచింది,
కాని
పలకలేదు.
ఒక
పాత్రతో
నీరు
తీసుకొని
తలపైన
పోసింది.
సోక్రటీసుకు
తెలివి
వచ్చింది
‘ప్రతీరోజు
వురుములు,
మేఘములు
వచ్చేవి
ఈనాడు
వర్షము
కురిసిందే’
అని
అనుకున్నాడు.
కాని
భార్య
చేసిన
పనికి
కోపము
రాలేదు.
అలాంటి
ఓర్పును
మనము
సాధించాలి.
ఏదో
విధముగా
ఎవరైనా
మనలను
దూషించినపుడు
మనకు
తక్షణమే
కోపము
రారాదు.
కనుక
ఈ
వయసునుండే
యింద్రియనిగ్రహాన్ని
ప్రయత్నించాలి.
అదే
నిజమైన
యోగము.
‘యోగః
చిత్తవృత్తి
నిరోధకః’.
మనము
మంచి
భావములతో
నున్నప్పుడు
ఏదో
విధముగా
మనకు
మంచి
లభిస్తుంది.
కనుక
మీరు
ఎల్లప్పుడు
‘నేను
మానవుడను’
అని
యోచన
చేస్తుండాలి.
నేను
మానవుడను
అనేది
అర్థసత్యము.
నేను
పశువునుకాను
అనేది
మిగిలిన
అర్థసత్యము.
అప్పుడే
మీరు
పశుమార్గములో
ప్రవేశించరు.
మానవతావిలువలను
అభివృద్ధిపరచుకోడానికి
ప్రయత్నించాలి.
మానవతావిలువలలో
రెండే
ప్రధానమైనటువంటివి.
అవే
సత్యము,
ప్రేమ.
ఈ
రెండూ
ఏకమైపోతే
మిగిలినవన్నియు
అందులో
చేరిపోతాయి.
ఒకనాడు
సోక్రటీసు
ఆలోచిస్తూ
నడచుకుంటూ
పోతున్నాడు.
వేరొక
ఆఫీసరుకూడను
తలదించుకొని
నడచుకుంటూ
వస్తున్నాడు.
8
▾
Meaning
Keep
ఒకరికొకరు
ఎదురుగా
వచ్చి
గుద్దుకున్నారు.
తక్షణమే
ఆ
ఆఫీసర్
Who
are
you?
అని
అడిగాడు.
Who
am
I?
అదే
నేను
ఆలోచిస్తూ
పోతున్నానన్నాడు,
సోక్రటీసు.
ఆ
సత్యాన్ని
మనము
తెలుసుకున్నప్పుడు
ప్రాకృతమైన
జీవితములో
సుఖశాంతులను
అనుభవించటానికి
వీలవుతుంది.
ఇంతకు
ముందు
మీకు
చెప్పినట్లుగా
సంతోషమువేరు,
ఆనందమువేరు.
సంతోషము
తాత్కాలికమైనది.
కాని
నీ
సహజ
స్వభావమైన
హృదయము
అదే
ఆత్మకు
సంబంధించినది,
శాశ్వతమైనది,
ఆనందము.
అర్జునుడు
యుద్ధసమయములో
కృష్ణున్ని
‘గుడాకేశా’
అని
సంబోధించినప్పుడు
కృష్ణుడు
అర్జునుని
‘హృషీకేశా’
అని
బదులిచ్చాడు.
‘గుడాకేశా’
అంటే
యింద్రియములకు
అధిపతి.
‘హృషీకేశా’
అంటే
యింద్రియములను
నిగ్రహించినవాడు.
యింద్రియములను
నిగ్రహించినపుడే
అధిపతికి
సన్నిహితులవుతాము.
‘అర్జున’
అనగా
నిర్మలత్వముతో
కూడినటువంటివాడు
అని
అర్థము.
కనుకనే
భగవంతుని
‘ఈశ్వరః’,
‘హిరణ్యగర్భుడు’,
‘విరాట్స్వరూపుడు’
అన్నారు.
ఈశ్వర
అనగా
సకలైశ్వర్య
స్వరూపుడు.
విరాట్స్వరూపుడు
అనగా
దృశ్యకల్పితమైన
జగత్తునందు
సకల
రూపములు,
నామములతోకూడినదంతయు
విరాటస్వరూపమే.
అంతా
తనయందే
పుడుతున్నవి,
నిలుస్తున్నవి,
లీనమైపోతున్నవి.
హిరణ్యగర్భుడు
అనగా
హృదయవాసి.
అందరియందు
వుండి
‘నేనున్నాను’,
‘నేనున్నాను’,
అని
దినమునకు
21,600
పర్యాయములు
‘సోహం’
అని
ఉత్తేజపరుస్తున్నాడు.
‘అహం
బ్రహ్మాస్మి’,
‘అహం
జీవాస్మి’
కాదు,
‘అహం
దేహాస్మి’
కాదు
అనే
సత్యాన్ని
తెలుసుకోవాలి.
Follow
the
master
Face
the
devil
Fight
to
the
end
Finish
the
game
Previous
←
Merging the Mind in the Ātma Is the Rāma Principle
Next
All Good Qualities Are Contained in Bhakti
→