Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1988 · How Can One Not Blessed with a Mother's Prema Gain the Prema of God?
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
How Can One Not Blessed with a Mother's Prema Gain the Prema of God?
14 October 1988, Dasara, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
Also in his talks
(3)
25 September 1986
Our inner feelings must be right!
7 January 1988
Life is fulfilled only when every action is done to please God
22 April 1998
The Puṣṭi, Samiṣṭi and Pravāha Jīvas
దానధర్మము
లేక
దయయు
సత్యములేక
మానసమున
మంచి
నీతి
లేక
చెడుగుణంబులతోడ
చెరలాడుచున్నట్టి
నరుడు
యిలను
చెడును
పరము
చెడును.
తల్లి
సేవ
మదిని
తగిలిన
తనయుడు
వాని
పాపమెల్ల
వదలుచుండు
శివుడు
మెచ్చు
తనకు
చిరకీర్తినందించు
దుఃఖరాశినెల్ల
తొలగ
జేయు.
దివ్యాత్మస్వరూపులారా!
ఏ
దేశమునందైనా,
ఏ
కాలమునందైనా
మానవుడు
తల్లిని
మాతృదేవిగా
భావించి
ఆమెను
సేవించటము
ప్రధానకర్తవ్యమని
గుర్తించటమే
యీనాటి
విధి.
నవమాసములు
మోసి
కని,
పెంచి,
రక్షించిన
తల్లినే
గౌరవించక,
తల్లినే
సేవించకుండిన,
యింక
యెవరిని
మానవుడు
సేవించగలడు.
భగవంతుడు
బ్రహ్మాండమును
సృష్టించి
మోసి
రక్షించి
అనేక
విధముల
కాపాడుతున్న
యీ
భగవంతునిలో
కూడనదే
తల్లియొక్క
భావము.
ఆవ్యక్తి
భగవంతుని
తన
యిష్టదేవతా
స్వరూపముగా
ఆరాధనచేసి
తాను
భగవంతుని
సేవిస్తూ
వుంటాడు.
మరొకరు
కూడను
తన
యిష్టదేవతను
కొన్ని
ఆకారములుగా
నిర్మించుకొని,
దానిని
సేవించి
పూజించి
ఆనందిస్తూ
వుంటాడు.
నీ
యిష్టదేవతా
స్వరూపము
నీకెంత
ప్రధానమో
యితరుల
యొక్క
యిష్టదేవతా
స్వరూపము
వారికి
అంత
ప్రధానమైనదనే
సత్యాన్ని
గుర్తించాలి.
అట్లుకాక
యితరుల
యిష్టదేవతారాధనను
విమర్శించుచూ,
ఆక్షేపణ
పరుస్తున్నప్పుడు
యిది
మానవుడు
యెన్ని
విధముల
ఆరాధనలు
చేసినప్పటికి
యితను
పాపమునకు
గురికాక
తప్పదు.
తమ
తల్లిని
దేవతా
స్వరూపకముగా
ఆరాధించి
సేవించి
ఆమెను
ఆనందింప
చేసినట్టుగా
యితరులయొక్క
తల్లిని
కూడను
వారు
దేవతగా
భావించి
ఆరాధించి
సేవించటము
లోపల
యెంతైనా
కూడను
ఒకవిధమైన
సంతృప్తిని
పొందాలి.
అట్లుకాక
తన
తల్లిని
దేవతా
స్వరూపమని
భావించి
పరుల
తల్లిని
ఆక్షేపణ
చేయుటము
యిది
మహాపాపము.
ఇతరుల
తల్లులను
కూడను
తన
తల్లివలె
భావించి
గౌరవించి
ప్రేమించటము
అత్యవసరము.
తల్లిప్రేమకు
నోచుకోలేని
మానవుడు
దైవప్రేమను
కూడను
పొందలేడు.
తల్లి
యే
విధముగా
తనయొక్క
గర్భమునందు
ధరించి,
మోసి
ఆనందముతో
ఆ
బిడ్డయొక్క
క్షేమమును
కోరుచుండునో
ఆ
ప్రేమయొక్క
విలువను
మానవుడు
గుర్తించుకోటము
అత్యవసరము.
ఈనాడు
నిత్యజీవితములో
సత్యమైన
మాతృదేవిని
గుర్తించటానికి
అనేక
విధములైన
ఆధారములు
వుంటున్నది.
2
▾
Meaning
Keep
గోవు
తన
రక్తమును
క్షీరముగా
మార్చి
మనకందించుచున్నది.
మనకు
పుష్టికరమైన
దేహము
చేకూర్చుచున్నది.
కనుక
గోవు
మన
మొదటి
మాతృమూర్తి.
భగవంతుడు
తన
హృదయమునందు
మానవుని
నిలుపుకొని
రక్షించి
అనేక
విధములుగా
కాపాడుతున్నాడు.
అదే
విధముగనే
భూమి
కూడను
తన
హృదయమునందు
మానవుని
నిల్పుకొని
వానిని
సరైన
రీతిగా
సంరక్షిస్తూ
వుంటున్నది.
కనుక
భూమి
కూడను
మనకు
ప్రధానమైన
మాతృమూర్తి.
మన
దేహములో
సర్వాంగములయందు
కూడను
రసస్వరూపమై
దేవతారూపమున
యీ
దేహమును
సంరక్షిస్తూ
వుంటున్నది.
అట్టి
దేవతా
శక్తికే
రస
స్వరూపిణి
అని
ఒక
బిరుదు.
అట్టి
దేవునే
అంగీరసుడని
కూడను
పిలుస్తూ
వచ్చారు.
కనుక
మనదేహములో
సర్వాంగముల
యందు
రసస్వరూపమై
రక్షిస్తున్న
దేవతలు
కూడను
మనకు
మాతృమూర్తులు.
ఇంక
యీ
జగత్
సంబంధమైన
విషయములందు
యేది
చేయతగనిది,
యేది
చేయతగినది,
ఏది
విహితమైనది,
ఏది
నిషిద్ధమైనది,
ఏది
మానవునకు
ఉత్తమమైనది,
ఏది
సార్థకము
కానిది,
ఏది
ప్రేయోమార్గము,
ఏది
శ్రేయోమార్గము
అనేక
శోధనలు
చేసి
అనేక
పరిశీలనలు
సలిపి
అనేక
విధములుగా
ఆదర్శప్రాయమైన
శాస్త్రమును
అందించిన
మహర్షులు
కూడను
మాతృమూర్తులే.
ఇక
నిత్యజీవితములో
మానవుని
యొక్క
శక్తి
సామర్థ్యములను
జగత్
వ్యాప్తి
గావించే
నిమిత్తమై
యితనికి
సుజ్ఞానము,
ప్రజ్ఞానము,
విజ్ఞానము
ప్రబోధించిన
గురువు
కూడను
మనకు
పూజనీయుడే.
ఇక్కడ
గోవు,
భూమి,
దేవత,
ఋషులు,
గురువులు
యీ
ఐదుమందిని
దేవతాస్వరూపకముగా
మనము
ఆరాధించటము
గౌరవించటము
అత్యవసరము.
ఐతే
యివన్నియు
కూడను
వేరువేరు
రూప
నామములుగా
మనకు
గోచరించుచున్నప్పటికిని
యీ
ఐదు
కూడను
ఒక
మాతృమూర్తియందే
లీనమై
వుంటున్నది.
మనతల్లి
తన
రక్తమును
క్షీరముగా
మార్చి
బిడ్డకు
యిచ్చి
పోషించుచున్నది.
ఈ
గోవుతల్లియందే
వుంటున్నది.
ఈ
భూమి
తన
హృదయమునందు
నిల్పుకొని
మానవునియందు
యేవిధముగా
సంరక్షించుచున్నదో
అదేవిధముగనే
మన
తల్లి
తన
పొట్టలో
స్థానమునిచ్చి
తాను
మోసి
అనేక
విధములుగా
కూడను
యీమెయొక్క
బిడ్డకు
తగిన
వున్నతిని
చేకూర్చుచూ
వచ్చుచున్నది.
మన
మాతృమూర్తియొక్క
హృదయముగా
రూపొందింది.
ప్రతి
అంగములో
అంగీరస
స్వరూపమైన
దేవతలు
కూడను
మాతృమూర్తియందు
నిరంతరము
క్షణక్షణము
కూడను
మనకు
స్పృహను
తెప్పిస్తుంది.
తనకు
కలిగిన
బిడ్డను
అనేక
విధముల
క్షణక్షణము
కూడను
ఏ
నిమిషములో
యే
విధముగా
పిల్లను
పోషించాలి
అనే
జాగ్రత్తను
వహించి
తనయొక్క
బిడ్డను
కంటిరెప్పవలె
కాపాడుతూ
వుంటుంది.
కనుక
రసస్వరూపమైన
దేవతలు
కూడను
తల్లియందే
వుంటున్నవి.
ఋషులు
యేవిధముగా
శాసించి
ఏది
మంచి,
ఏది
చెడ్డ,
ఏది
చేయతగినది,
ఏది
చేయతగనిది
అని
నిర్ణయించినట్లుగా
మన
తల్లి
కూడను
నాయనా!
యిది
నీవు
చేయకూడదు,
నీవు
చేయతగినది,
నీవు
యిటువంటి
ప్రదేశములకు
పోకూడదు,
…టువంటి
ప్రదేశములకు
పోవచ్చు
అని
నిర్ణయము
చేసి
బిడ్డయొక్క
క్షేమాన్ని,
శ్రేయస్సును
కంటిరెప్పవలె
బోధిస్తూ
వుంటుంది.
3
▾
Meaning
Keep
కనుక
అట్టి
ఋషిత్వము
కూడను
మన
తల్లియందే
వుంటున్నది.
గురువు
ఏవిధముగా
విద్యలను
బోధించునో,
ఏది
సుకృతమని,
ఏది
వికృతమని
మనకు
తెలుపునో,
ఏది
శ్రేయస్సు,
ఏది
ప్రజ్ఞానము,
ఏది
విజ్ఞానము
అని
మానవునకు
నిత్యజీవితములో
జీవితాన్ని
గడపటానికై
యీ
ప్రాకృతమైన
విద్యలు
ఏరీతిగా
గరపుతున్నాడో
అదేవిధముగనే
తన
బిడ్డకు
యింట
బయట
యేవిధముగా
ప్రవర్తించాలి,
పెద్దలతో
యేవిధముగా
పలుకరించాలి,
సంభాషించాలి,
పెద్దలను
యేవిధముగా
గౌరవించాలి
అనే
విద్యలను
తల్లి
నేర్పుతూ
వుంటుంది.
కనుక
నిజమైన
గురుత్వము
మన
తల్లియొక్క
స్వరూపమే.
అట్టి
తల్లిని
గౌరవించలేని,
పూజించలేని
మానవునియొక్క
బ్రతుకు
నిరర్థకమనే
చెప్పవచ్చు.
కనుక
సర్వశక్తి
స్వరూపిణియైన
మాతృమూర్తిని
మనము
గౌరవించి
ప్రేమించటము
ప్రతి
మానవుని
యొక్క
విధి.
ఈ
పవిత్రమైన
దివ్యసూక్తులను
జగత్
వ్యాప్తి
గావించే
నిమిత్తమై
యీ
దేవీనవరాత్రులు
అనే
నెపముచేత
జగత్తుకు
అనేక
విధములైన
ఆదర్శములను
నిరూపిస్తూ
వచ్చింది.
దుర్గా
లక్ష్మి
సరస్వతి
అనే
మూడు
పేర్ల
లోపల
ప్రకటితమవుతూ
వస్తున్నాది.
దుర్గ
అనగా
శక్తి
స్వరూపిణి.
ఎట్టి
శక్తి
శారీర,
మానసిక,
ఆధ్యాత్మిక
శక్తి.
ఇట్టి
మూడు
శక్తులను
ప్రసాదించే
శక్తి
స్వరూపిణియే
దుర్గ
అన్నారు.
దీనినే
energy
అన్నారు.
ఇంక
లక్ష్మి.
ఈమె
జ్ఞానైశ్వర్యము,
గుణైశ్వర్యము
అనేకరకములైన
లోకములో
మనము
అనుభవించదగిన
ఐశ్వర్యమంతా
కూడను
తాను
అనుగ్రహించేటువంటిదని.
ఐశ్వర్యమనగా
కేవలము
కరెన్సీనోట్సు
మాత్రమే
కాదు.
జ్ఞానైశ్వర్యము.
మన
ఆరోగ్యము
కూడను
ఐశ్వర్యమే.
గుణైశ్వర్యము.
సర్వైశ్వర్య
స్వరూపిణియే
లక్ష్మి.
ఈ
లక్ష్మిని
సంపదస్వరూపిణి,
ఐశ్వర్య
స్వరూపిణి.
ఇంక
సరస్వతి.
ఈమె
మనకు
కలిగిన
తెలివితేటలను
విచారణా
శక్తిని,
బుద్ధిశక్తిని
ప్రసాదించేటువంటిది.
ఈ
దుర్గ
లక్ష్మి
సరస్వతుల
ప్రభావము
ప్రపంచమునకు
చాటే
నిమిత్తము,
అందించే
నిమిత్తమే
యీ
శరన్నవరాత్రులు
ప్రారంభమవుతూ
వచ్చాయి.
ఈ
మూడింటి
యొక్క
స్వరూపిణియే
మన
యొక్క
మాతృమూర్తి.
బిడ్డలకు
తగిన
శక్తులనంతా
తానే
ధారపోస్తున్నది.
బిడ్డయొక్క
అభివృద్ధి
నిమిత్తము,
తాను
ఐశ్వర్యవంతుడై
ఆరోగ్యవంతుడై,
ఆనందవంతుడై
లోకములోపల
కీర్తి
వహించాలని
ప్రేమిస్తూ
అతనియొక్క
అభివృద్ధికి
అనేక
వ్యూహములు
గావిస్తూ
వుంటుండాది.
తన
కుమారుడు
గొప్ప
విద్యావంతుడై,
తెలివితేటలు
కలవాడై
లోకములోపల
గొప్పకీర్తిని
సాధించాలని
తల్లి
ఆశిస్తూ
వుంటుంది.
ఇలాంటి
ముమ్మూర్తి
స్వరూపాన్ని
ధరించినదే
మాతృమూర్తి.
పాండవులు
కృష్ణుని
యొక్క
సేవలో,
కృష్ణుని
యొక్క
ఆజ్ఞలో
తమ
యొక్క
జీవితాన్ని
ధన్యము
గావించుకోటానికి
కేవలము
పాండవుల
యొక్క
శక్తి
సామర్థ్యములు
కాదు
కారణము.
వారి
తపశక్తులు
కాదు
కారణము.
కుంతీదేవి
యొక్క
ప్రేమతత్వమే
శ్రీకృష్ణుని
సన్నిధికి
చేరటానికి
కారణము.
కుంతి
పిల్లలను
ప్రాణసమానముగా
భావించి
అరణ్యములో
వుండిన
సమయములో
వారికి
యనేక
విధములైన
ప్రార్థనలు
సలుపుతూ
వచ్చింది.
4
▾
Meaning
Keep
తన
బిడ్డలు
లక్కగృహములో
వుండినప్పుడు
కూడను
వారితోబాటు
తాను
కూడను
ఆ
లక్కగృహములోనే
వుండి
వారియొక్క
క్షేమాన్ని
ఆశిస్తూ
ప్రార్థిస్తూ
వుండేటువంటిది.
లక్కగృహమును
తప్పించుకొనిపోయి
పూటుకూళ్ళయింటిలో
వుండినప్పటికిని
అక్కడ
కూడను
తన
బిడ్డలయొక్క
క్షేమమును
అభివృద్ధిని
అనేక
రకములుగా
ఆశించి
దైవాన్ని
ప్రార్థిస్తూ
వుండేది.
పాండవులు
కూడను
దీనికి
తగినట్లుగా
మాతృప్రేమను
క్షణక్షణము
అభివృద్ధి
గావించుకుంటూ
వుండేవారు.
ఇంక
పదునాలుగు
సంవత్సరములు
లక్ష్మణుడు
తన
అన్నతో
అరణ్యములోపల
ఆనందముగా
నిద్రాహారములు
మాని
తన
అన్నను
కాపాడుతూ
వుండటానికి
మూలకారణము
సుమిత్రయొక్క
ప్రేమయే.
లక్ష్మణుడు
అయోధ్యను
వదలే
సమయమునందు
కౌసల్య
కూడను
రాముడు
వెళ్లుతున్నాడని
బాధపడింది.
కాని
సుమిత్ర
బాధపడలేదు.
నాయనా
లక్ష్మణా!
రాములులేని
యీ
అయోధ్య
మాకు
అరణ్యము.
రాములు
వున్న
అరణ్యమే
నీకు
అయోధ్య.
రామసేవయే
నాసేవగా
భావించి,
నిద్రాహారములైననూ
మాని
రాముని
యొక్క
మనస్సునకు
అసంతృప్తి
కలుగకుండా
నీవు
సేవించి
రమ్మని
ఆశీర్వదించింది.
ఆ
తల్లియొక్క
ఆశీర్వాదఫలము
చేతనే
పదునాలుగు
సంవత్సరములు
నిద్రాహారములు
లేక
ఆనందముతో
రాములను
సేవిస్తూ
వచ్చాడు
లక్ష్మణుడు.
ఏతావాతా
సమస్త
పురాణములందు,
పవిత్రమైన
చరిత్రములందు
కూడను
తల్లియొక్క
ప్రేమ,
తల్లియొక్క
ఆశీర్వాదము,
తల్లియొక్క
అనుగ్రహమే
ప్రధానమైన
లక్ష్యమని
యీ
శరన్నవరాత్రులు
మనకు
చక్కగా
ప్రబోధిస్తూ
వస్తున్నాయి.
యుద్ధానంతరము
కుమారులను
కోల్పోయి
పరితపిస్తున్న
ధృతరాష్ట్ర
గాంధారులను
పలుకరించే
నిమిత్తమై
కృష్ణుడు
ధృతరాష్ట్ర
గాంధారుల
దగ్గరకు
వచ్చాడు.
కృష్ణుడు
వచ్చాడన్న
వార్త
వినిన
తక్షణమే
ఒకవైపున
పట్టలేని
దుఃఖము
మరొకవైపున
భరించలేని
క్రోధము
కూడను
గాంధారిలో
బయలుదేరింది.
తాను
కృష్ణుని
సమీపించి
అతని
చేతులు
గట్టిగా
పట్టుకొని
కృష్ణా
నీకెందుకింత
భేదము.
నీవు
భగవంతుడైవుండి
కూడను
ఒకరిని
ఒకకంటితో
మరొకరిని
మరొక
కంటితో
చూడటము
నీకు
న్యాయమా.
పాండవులు
నీకంత
ప్రియులు,
కౌరవులు
నీకంత
అప్రియులు
కావటానికి
కారణమేమిటి?
పంచపాండవులు
సుక్షేమముగా
వుంటున్నారు.
నా
నూర్గురు
పుత్రులలో
ఒకరినైనా
నిలబెట్టటానికి
నీకు
మనసొప్పలేదా.
అంత్యములోపల
తల్లితండ్రులకు
యింత
పిండమునైనా
వదలటానికి
ఒక్క
కుమారునైనా
బ్రతికించకూడదా.
ఇంత
కఠినమైన
హృదయము
నీకెట్లా
కలిగింది.
అని
అనేక
విధములుగా
కృష్ణుని
నిందిస్తూ
తన
శోకమును
భరించుకోలేక
కృష్ణునిపైన
యనేక
అపవాదులను
వేస్తూ
వచ్చింది.
ఎన్ని
అపవాదులు
వేస్తూ
వచ్చినప్పటికిని,
ఎంత
నిందించుతూ
వుండినప్పటికిని
కృష్ణుడు
చిరునవ్వులు
నవ్వుతూ
గాంధారీ!
యిది
నా
దోషము
కాదు.
ఇది
నీ
దోషమే.
నీకు
పుట్టిన
పుత్రులను
ఒక్క
క్షణమైనా
వారిని
కన్ను
తెరచి
చూచావా?
నీ
దృష్టికి
నోచుకున్న
పుత్రుడు
ఒక్కడన్నా
వున్నాడా.
తల్లిదృష్టికే
నోచుకోనివాడు
దైవదృష్టికి
యేవిధముగా
నోచుకుంటాడు.
నీ
స్వార్థముతో
నీ
పతికి
నేత్రములు
లేవని
నీవు
కూడను
కృత్రిమముగా
నేత్రములు
కట్టుకున్నావు.
5
▾
Meaning
Keep
ఎవడు
కుమారుడో
ఎవడుకాడో
అనేది
కూడా
నీకు
తెలియదు.
నూరుమంది
పుత్రులలోపల
ఒక
పుత్రుడైననూ
నీ
దృష్టికి
నోచుకున్నాడా!
అలాంటి
మాతృమూర్తి
దృష్టికే
నోచుకోలేని
పాపులు
నా
దృష్టికి
మాత్రము
నోచుకోగలరా.
పాండవులు
అట్లుకాదు.
జన్మించినది
మొదలు
తల్లి
తన
ఒడిలో
పెట్టుకొని
ప్రాణసమానముగా
క్షణక్షణము
వారిని
కాపాడుతూ
వచ్చింది.
ఆ
కుంతి
యొక్క
ప్రేమనే
యీ
పాండవులను
రక్షించింది.
ఆ
తల్లిపై
వున్న
పాండవుల
ప్రేమనే
పాండవులను
కాపాడింది.
ఇది
ప్రకృతి
యొక్క
సహజ
ధర్మము.
ఈ
ధర్మాన్ని
అనుసరించిన
ప్రతి
వ్యక్తి
కూడను
సుక్షేమాన్ని
పొందగలుగుతాడు.
కనుక
ఈ
దుర్గ
లక్ష్మి
సరస్వతులను
యీ
భౌతికమైన
ధనము
నిమిత్తమై,
భౌతికమైన
విద్యనిమిత్తమై
మనము
వీనిని
ప్రత్యేకించి
ఆరాధనలు
చేయనక్కరలేదు.
మన
కన్నతల్లిని
మాత్రమే
మనము
ప్రేమించి
ఆరాధించినప్పుడు
సర్వదేవతలను
ప్రేమించినవారమవుతాము.
తల్లికి
మించిన
స్వర్గము
లేదు.
దీనినే
ఒకానొక
సమయములో
రాములు
కూడను
జననీ
జన్మభూమిశ్చ
స్వర్గాదపి
గరీయసి
అన్నాడు.
నా
తల్లికంటె
స్వర్గము
నాకు
మరొకటి
లేదు.
కనుక
యీ
తల్లిప్రేమను
మనము
యీనాడు
హృదయములో
అభివృద్ధి
గావించుకోవాలి.
తల్లి
రక్షణే
మన
జీవితమునకు
శుభరక్ష.
తండ్రి
ధర్మస్వరూపుడైతే
తల్లి
స్వర్గాన్ని
మించిన
స్వరూపాన్ని
ధరిస్తుంది.
ఒకవేళ
తమ
యొక్క
తల్లితండ్రులు
తమ
పుత్రుని
చేష్టలను
గుర్తించి
కొంత
శిక్షనందించటానికి
పూనుకుంటారు.
కాని
తల్లి
శిక్షించినప్పటికిని
ఆ
శిక్షకు
దోషము
యెక్కడవున్నదనే
గుర్తించే
శక్తిని
మనము
సాధించుకోవాలి.
ఈత
తెలియనివాడు
నీటిలోపడి
ప్రాణము
విడుస్తే
యీ
తప్పు
నీటిదా
లేక
అతనిదా.
ఈత
నేర్చి
నీటిలోపడాలిగాని,
యీతనేర్చకుండా
నీటిలో
పడటం
నీ
తప్పుగాని
నీటి
తప్పుకాదు.
అగ్నిలో
చేయిపెట్టి
కాలిందని
నీవు
అగ్నిని
దూషిస్తే
యిది
అగ్ని
తప్పా
నీ
తప్పా.
అగ్నికి
కాల్చే
శక్తి
కలదని
గుర్తించుకోకుండా
పెట్టిన
నీ
తప్పేగాని
అగ్నితప్పుకాదు.
అదేవిధముగనే
తల్లికి
యిష్టమైన
పనులు
చేయకుండా,
తల్లికి
అయిష్టమైన
పనులు
చేసి
దాని
వలన
తల్లి
శిక్షించిందంటే
యిది
నీ
తప్పుగాని
తల్లితప్పుకాదు.
ఈ
మాతృమూర్తికి
హితమైన
కార్యములు
మనము
చేస్తూ
రావాలి.
యిష్టమైన
కార్యములు
మనము
చేస్తూ
రావాలి.
కనుక
మాతృమూర్తిని
ప్రేమించి,
మాతృశక్తిని
గుర్తించి
మాతృమార్గమును
అందించేదే
యీ
శరన్నవరాత్రి.
అట్లు
కాకుండా
దుర్గ
లక్ష్మి
సరస్వతి
అని
మనము
అనేక
విధములుగా
ధనము
ఖర్చుపెట్టి,
పువ్వులు
తెచ్చి,
కుంకుమతెచ్చి,
అనేక
విధములుగా
మనము
పూజించి,
ప్రార్థించి,
తల్లిమాటను
మీరినప్పుడు
యీ
పూజయొక్క
ఫలితము
యేమాత్రము
పొందలేము.
కనుక
తల్లియే
దుర్గ,
లక్ష్మి,
సరస్వతి
స్వరూపము.
తల్లిని
మాత్రం
యేనాడు
కంటిధారలు
కార్పించటానికి
ప్రయత్నించకూడదు.
మన
భారతదేశమందే
కాక
యితర
దేశములందు
కూడను
వుండవచ్చును.
కలకంఠి
కంట
కన్నీరొలికిన
సిరియింట
నొల్లదు
అన్నారు.
6
▾
Meaning
Keep
స్త్రీల
యొక్క
కంటినీరు
ఏ
గృహములో
పడుతుందో
ఆ
గృహములో
సిరి
నిలవదన్నారు.
కనుక
మాతృమూర్తులను
యేమాత్రము
హింసించకుండా
చూచే
ప్రయత్నములో
వుంటుండాలి.
సీతను
కంటిధారలు
కార్చనివ్వటం
చేతనే
రావణుని
వంశమంతా
నిర్మూలమైపోయింది.
పవిత్రమూర్తి
ద్రౌపతిని
పరాభవము
గావించి
ఆమె
దుఃఖమునకు
గురికావటం
చేతనే
కౌరవుల
వంశమంతా
నిర్మూలమైపోయింది.
ఇదే
విధముగనే
స్త్రీలను
యే
చిన్న
విషయమునందు
కూడను
బాధించటానికి
ప్రయత్నించకూడదు
పురుషులు.
ఆ
విధమైన
మార్గము
పురస్కరించుకొని
యీ
స్త్రీలయందు
కేవలము
మాతృ
స్వరూపిణియైన
శక్తి
వున్నదనే
సత్యాన్ని
గుర్తించి
వర్తించటము
అత్యవసరము.
ఈ
శరన్నవరాత్రి
లోపల
దేవీపూజలను
ఆచరిస్తూ
వుంటారు.
లలితా
సహస్రములు
చేస్తూ
వుంటారు.
అనగా
యీ
శరన్నవరాత్రులంతా
కూడను
కేవలము
శక్తి
స్వరూపిణి
ఆరాధనలగానే
వుంటుండాది.
స్త్రీలను
కేవలము
ఆటబొమ్మలుగా
వినియోగించుకోరాదు.
ఆరాధనా
స్వరూపులు
వారు.
సామాన్యమైన
రీతిగా
మనము
భావించి
సహజమైన
రీతిలోపల
మనము
అనుభవించటానికి
ప్రయత్నిస్తూ
వుంటాము.
ఇది
చాలా
తప్పు.
ఏ
క్షణములో
ఏ
ప్రదేశములో,
ఏ
కాలములో
ఎప్పుడు
వారి
హృదయములు
నొప్పించుతామో
గుర్తించుకోటానికి
వీలుకాదు.
స్త్రీలను
చూచినప్పుడు
చాలా
వినయ
విధేయతలతో
మొట్టమొదట
నమస్కరించి
అతిదూరముగా
వుండే
ప్రయత్నము
చేయాలి.
అంతేగాని
వారిని
ఏదో
ఆటవస్తువుగా
వుపయోగించుకొని
అనేక
విధములుగా
కూడను
వారిని
హాస్యాస్పదము
గావించటము
యిది
సరైన
ధర్మము
కాదు.
మొట్టమొదట
మాతృదేవోభవ,
పితృదేవోభవ,
ఆచార్యదేవోభవ,
అతిథిదేవోభవ
యీ
నాలుగు
స్థానములందు
కూడను
మాతృదేవికి
యిచ్చిన
స్థానము
మరొకరికి
యివ్వలేదు.
సామాన్యమైన
మాటలయందు
కూడను
తల్లి
తండ్రి
దైవము
అంటారు.
దైవాన్ని
వెనుకపెట్టారుగాని
తల్లిని
ముందుపెట్టారు.
పవిత్రమైన
భారతీయ
సంస్కృతియందు
యీ
పవిత్రమైన
ఆధారమైన
యీ
పదమునకు
మనము
ఎంతవరకు
గౌరవము
నందిస్తున్నాము.
కానీ
స్త్రీలను
అబలలుగా
భావించుకొని
వారిని
అశక్తులుగా
మనము
విశ్వసించి
యేదోవారు
వంటరూములో
వుండే
పనిమనిషిగా
మనము
అనుభవిస్తున్నాము.
భగవద్గీత
లోపలకూడను
స్త్రీల
లోపల
ఏడు
విధములైన
శక్తి
కలదనింది.
అటువంటి
శక్తి
స్వరూపిణియైన
స్త్రీలను
మనము
యేవిధముగా
గౌరవించాలి.
ఏ
విధముగా
ఆనందపెట్టాలి
యీ
విధానమును
యీ
శరన్నవరాత్రి
లోపల
చక్కగా
మనము
గుర్తించుకోటానికి
ప్రయత్నించాలి.
ఇట్టి
పరమనీతిని
పరమ
పవిత్రతను
ప్రబోధించే
దినములే
యీ
శరన్నవరాత్రి
దినములు.
ఈ
ఎనిమిది
దినములు
కూడను
యీ
మాతృమూర్తిని
ఆరాధన
చేసి
కడపటి
దినము
సరస్వతీ
పూజలో
ప్రవేశిస్తున్నాము.
అనగా
ఆయుధపూజగా
మనము
ఆరాధన
చేస్తున్నాము.
ఆనాడు
మనయొక్క
ఆయుధాలు,
కొన్ని
గ్రంథములను,
మన
ప్రధానమైన
వస్తువులు
ఆనాడు
పూజలో
పెట్టి
ఆరాధనలు
సలుపుతున్నాము.
7
▾
Meaning
Keep
His poems 248
సర్వదేవతా
స్వరూపిణియైన
కాళీశక్తి
యొక్క
తత్వము
ప్రబోధించేటువంటిది.
ఆనాడు
జడమైన
వస్తువులను
కూడను
జడముగా
భావించకుండా
దైవముగా
మనము
ఆరాధిస్తున్నాము.
భారతదేశములో
యిట్టి
ఆరాధనా
తత్వము
అందరికీ
తెలిసిన
విషయమే.
జడమైన
ఒక
పెద్దలారీని
కూడను
డ్రైవరు
డ్రైవ్
చేయటానికి
ముందుగా
స్టీరింగునకు
నమస్కారము
చేసి
తాను
డ్రైవింగు
ప్రారంభిస్తాడు.
ఇట్లే
సంగీతమునకు
తగిన
పనిముట్లు
కూడ.
వయొలిన్
వాయించాలంటే
ముందు
ఆ
వయొలిన్
కి
నమస్కారము
చేసి
దాన్ని
ప్రారంభిస్తాడు.
ఒక
నర్తకి
తన
గజ్జెలు
కాలికి
కట్టుకొనే
ముందుగా
ఆ
గజ్జెలను
నమస్కరించి
తదుపరియే
తన
కాలికి
చుడుతుంది.
ఇంక
తాపీ
చేసే
మేసన్
కూడ
తన
పని
ప్రారంభించే
ముందుగా
తాపీకి
నమస్కారము
చేసి
పని
ప్రారంభిస్తాడు.
ఈ
విధముగా
మనము
యోచన
చేస్తే
భగవంతుడు
లేని
వస్తువు
జగత్తులో
లేదు.
కనుక
సమస్తము
మనము
భగవత్
స్వరూపకముగా
భావించుకొని
ఆరాధన
చేయటమే
యీ
శరన్నవరాత్రి
యొక్క
విశిష్టత.
ఇదియే
విశ్వం
విష్ణు
స్వరూపమ్
అనే
పదమునకు
అర్థము.
ఇది
మిధ్యము
కాదు.
యిది
సత్యమే.
అయితే
యీ
సత్యమును
మనము
మిధ్యముగా
భావించుకోటం
చేత
మనము
మిధ్య
జీవితమునే
గడుపుతున్నాము.
యద్భావం
తద్భవతి
అని
మన
భావములను
పురస్కరించుకొనియే
యీ
జగత్తు
నడుస్తూ
వుంటాది.
పూలమొక్కలు
నాటిన
పూలు
పూయు
ముండ్ల
మొక్కలు
నాటిన
ముండ్లు
పొడువు
మంచి
చెడ్డలు
యివ్విధి
వుండె
యిలను.
ఏ
భావములో,
యే
తలంపులో
అలాంటి
ఫలితమునే
మనము
పొందుతూ
వుంటాము.
మంచి
తలంపులను
మనము
అభివృద్ధి
గావించుకొని,
మంచి
ఫలములు
పొందటానికి
ప్రయత్నించాలి.
నిరంతరము
చెడ్డ
తలంపులనే
మనము
అభివృద్ధి
గావించుకొని
చెడ్డ
జీవితమును
గడపటము
మానవునికి
ప్రధానమైన
కర్తవ్యము
కాదు.
ఇది
మానవత్వమునే
నిర్మూలము
గావించే
మార్గము.
కనుక
సర్వులను
మనము
గౌరవించాలి.
సర్వులను
మనము
ప్రేమించాలి.
ప్రేమ
చేతనే
మనము
జగత్తును
వ్యాపింపజేయాలి.
కనుక
ఆ
ప్రేమనే
ప్రధానమైన
స్థానములో
మనము
వుంచుకోవాలి.
దివ్యాత్మస్వరూపులారా!
విషయాలతో
తలను
నింపుకొనక
హృదయమును
నింపుకోటానికి
ప్రయత్నించండి.
మన
తలలో
సమస్త
విషయములతో
నింపుకోటానికి
మనము
ప్రయత్నిస్తున్నాము.
మన
తల
అందుకోసం
కాదు
అందిచ్చినది.
మన
తలంపులన్నియు
దైవతలంపులుగా
మారాలి.
చేసిన
పనులన్నియు
దైవసేవగా
రూపొందాలి.
పలికిన
పలుకులన్నియు
కూడను
పరమాత్ముని
మంత్రముగా
రూపొందాలి.
అలాంటిదే
మానవ
జీవితము.
అందువలననే
మానవ
జన్మము
వుత్కృష్టమైనదని
శృతి
బోధిస్తున్నది.
జంతూనాం
నరజన్మ
దుర్లభమ్.
8
▾
Meaning
Keep
పశుపక్షి
మృగాదులవలె
మనము
తిరిగి
తిరిగి
ఆనందించి
యేదో
కాలము
వ్యర్థము
గావించినామంటే
యింక
దుర్లభమైనది
ఎట్లా
అవుతుంది
యీ
మానవ
జన్మము.
మనము
పశుపక్షి
మృగాదులతో
సమానమే.
కాదుకాదు.
మానవునకు
అందించిన
సర్వాంగములు
కూడను
భగవత్
ప్రీత్యర్థమైన
కార్యములలో
మనము
వినియోగించుకోవాలి.
యజ్ఞము.
యజ్ఞమంటే
యేమిటి?
ఏ
పని
చేసినప్పటికిని
భగవత్
ప్రీత్యర్థముగా
గావించినదంతా
యజ్ఞములే.
ఆ
యజ్ఞమునకు
ప్రతీకనే
యీయొక్క
స్వరూపము.
కనుక
భగవత్
ప్రీత్యర్థముగా
మనము
ఏ
చిన్నపని
చేసినా
అది
యజ్ఞస్వరూపముగనే
మారిపోతుంది.
త్యాగమే
యజ్ఞము.
యజ్ఞమంటే
కేవలము
ఒక
పెద్ద
హోమగుండము
కట్టి
…
మంత్రముల
చేత
ఆవునెయ్యి
తెచ్చి
యీప్రకారము
మనము
ఆచరించటము
మాత్రమే
కాదు.
ఏ
చిన్నపని
చేసినప్పటికిని
దైవప్రీత్యర్థముగా
చేసినప్పుడు
అది
యజ్ఞముగా
మారిపోతుంది.
కనుకనే
ఉపనిషత్తులు
కూడను
ఏ
కర్మ
నీవు
ప్రారంభించినప్పటికి
ఆ
కర్మకు
నీవు
నమస్కారము
చేయుమన్నది.
తస్మై
నమః
కర్మణే.
నేను
ఆచరించే
కర్మకు
నేను
మొట్టమొదట
నమస్కరిస్తున్నాను.
నేను
పవిత్రమైన
కర్మలుగా
ఆచరించాలి
అనే
వుద్దేశ్యముతో
చేసే
ప్రక్రియనే
యిది.
ఈనాడు
మానవుడు
శరీరమును
ధరించటానికి
కారణము
యేమిటి?
కర్మానుబంధీని
మనుష్యలోకే.
మన
కర్మలననుసరించియే
దేహము
వచ్చింది.
కాబట్టి
దేహమునకు
కర్మయే
ఆధారము.
ఈ
కర్మకు
రాగమే
ఆధారము.
రాగమునకు
ద్వేషమే
ఆధారము.
ద్వేషమునకు
అహంకారమే
ఆధారము.
అహంకారమునకు
అవివేకమే
ఆధారము.
ఈ
అవివేకమునకు
అజ్ఞానమే
మూలకారణము.
కనుక
అజ్ఞానమును
మనము
నశింప
చేసుకుంటే
యీ
అవివేకము
క్షీణించిపోతుంది.
ఈ
అవివేకము
నశించిందంటే
అంధకారము
నిర్మూలమవుతుంది.
ఈ
అహంకారము
నిర్మూలమాయెనా
ద్వేషము
అధఃపతనమవుతుంది.
ఈ
ద్వేషము
పోయెనా
రాగము
క్షీణించిపోతుంది.
రాగము
క్షీణించినప్పుడు
కర్మలే
నశించిపోతాయి.
కర్మ
నశించిన
దేహమే
మనకు
వుండదు.
కనుక
యీ
దేహము
సార్థకము
కావాలనుకొన్నప్పుడు
మొట్టమొదట
అజ్ఞానము
నిర్మూలము
గావించాలి.
అజ్ఞానమంటే
యేమిటి?
నేను
దేహమని
అనుకోటమే
పెద్ద
అజ్ఞానము.
ఈ
దేహము
నేననే
అజ్ఞానము
మొట్టమొదట
నిర్మూలము
గావాలి.
అది
యే
విధముగా
నిర్మూలమవుతుంది.
దానిని
కూడను
దైవముగానే
మనము
భావించాలి.
సర్వము
భగవత్
స్వరూపమే.
సర్వము
భగవచ్ఛక్తియే
అనే
విశ్వాసము
మనము
అభివృద్ధి
గావించుకోవాలి.
నా
దేహము
నా
దేహము
అన్నావు.
ఈ
దేహమునకు
ముందున్న
యీ
నా
ఏమిటి?
ఇక్కడ
నాది
అనేదే
ఒక
మమకారము.
నేను
అనేదే
అహంకారము.
ఈ
నాది
నేను
అనేవి
ఎక్కడివి.
అంతా
భగవంతునివే.
మొన్న
నేను
హాస్టలుకి
వెళ్లినప్పుడు
పిల్లలకు
చెప్పాను.
అరణ్యవాసం
చేసుకొని
వచ్చిన
తరువాత
అనేకమంది
ఋషులు
అంతా
శ్రీరామచంద్రుని
రామో
విగ్రహవాన్
ధర్మః
నీవు
సాక్షాత్తు
ధర్మస్వరూపుడవే,
నీవు
సాక్షాత్తు
భగవత్
స్వరూపుడవే
అని
వర్ణిస్తూ
వుండినారు.
ఈ
సత్యాన్ని
గుర్తించిన
కైక
వంటరిగా
వున్న
సమయము
చూసి
రాముని
దగ్గరకు
వెళ్ళి
రామా!
9
▾
Meaning
Keep
నీ
శక్తి
సామర్థ్యములు
నేను
గుర్తించలేకపోయాను.
నేను
చేసిన
పాపమునకు
ఏదైనా
పరిహారము
బోధించమంది.
అమ్మా
నీవు
చేసింది
పాపమేమీ
కాదు.
ఈ
ప్రకృతియొక్క
న్యాయమే
కనుక
ప్రకృతి
ధర్మాన్ని
సర్వులూ
అనుసరించవలసినదే.
నీవు
చేసినది
చాలా
వుపకారమే.
నిమిత్తమును
ఒకవిత్తనముగా
తీసుకొని
సమస్త
కార్యములను
ఆచరిస్తూ
వస్తుంది.
కాని
నీవు
కోరుతున్నావు
కనుక
యింక
వుపదేశము
చేయటానికి
నేను
పూనుకొన్నాను.
రేపటి
దినము
తెల్లవారి
నీవు
సరయూ
నదికి
వెళ్లి
స్నానం
చేసి
రమ్మన్నాడు.
నీవు
వచ్చే
దారిలోపల
ఏ
విధములైన
శబ్దములు
నీవు
వింటావో
వాటిని
చక్కగా
గుర్తించుకొని
రమ్మన్నాడు.
ఆమె
స్నానము
నాచరించి
గట్టుకు
వచ్చేటప్పటికి
ఒకవైపున
మేకలు
ఒకవైపున
గొఱ్ఱెలు
గుంపులు
గుంపులుగా
మేస్తున్నాయి.
అవి
నిర్విరామముగా
మే
మే
అని
అరుస్తున్నాయి.
ఏదో
ఒక
శబ్దము
…
రమ్మన్నాడు
కదా
అని
తిరిగి
రాముని
దగ్గరకు
వెళ్లింది.
ఆనాడు
రాముడు
అమ్మా
నీవు
విన్న
శబ్దము
యేమిటి
అన్నాడు.
నాయనా
గొఱ్ఱెలు,
మేకలు
యెక్కడ
చూచినాగాని
మే
మే
అని
అరుస్తున్నాయి.
ఈ
శబ్దమును
మాత్రమే
నేను
విన్నాను
అంది.
మే
మే
అనగా
సంస్కృతములో
నాది
నాది
అని.
ఏది
నాది.
అంతా
నాది
అనుకుంటున్నాము.
అనుకున్నంత
కాలము
అది
నాదగ్గర
లేకుండా
వుంటున్నది.
ధశరథుని
నావాడు
అనుకున్నావు
నీవు.
ఏడీ
దశరథుడు.
ఇదంతా
నాది
అనుకున్నావు.
ఏది
నీది?
ఏదీ
నీది
కాదు.
అంతా
దైవానిది.
అదే
ఉపదేశము
అన్నాడు.
అంతా
దైవమునదే
నాది
ఏదీ
కాదనే
భావమునకు
మనము
యేనాడు
వస్తామో
అదే
నిజమైన
వేదాంతము.
అదే
నిజమైన
జ్ఞానము.
ఆ
జ్ఞానము
మనలో
ప్రారంభమయ్యేంతవరకు
మనము
యీ
అజ్ఞానములో
మునిగిపోవలసిందే.
సాధ్యమైనంత
వరకు
దేహభ్రాంతిని
వదులుకొని
దైవభ్రాంతిని
అభివృద్ధి
చేయటానికి
తగిన
కృషి
చేయటమే
మానవుని
ప్రధాన
కర్తవ్యము.
మొట్టమొదట
మాతృమూర్తిని
గౌరవించండి.
మాతృమూర్తిని
ప్రేమించండి.
మాతృమూర్తిని
సేవించండి.
ఈ
దేహమునకు
మూలకర్త
మాతృదేవి.
కనుక
ఎవ్వరూ
కూడను
తల్లిని
బాధించటానికి
ప్రయత్నించకూడదు.
ఈ
విధమైన
మార్గము
మనము
ప్రారంభించనంతవరకు
మనకు
దుఃఖము
తప్పదు.
మొదటి
దినము
మనము
నేర్చుకొనవలసిన
పాఠము
యిదియే.
ఈ
పాఠము
నేర్చుకొనక
మనము
పరీక్షలో
వుత్తీర్ణులము
కాలేము.
ప్రాథమిక
క్లాసులోపల
వుత్తీర్ణులు
కాకుండా
మనము
ఉన్నత
స్కూలుకు
వెళ్లటానికి
వీలుకాదు.
కనుక
మొట్టమొదట
మన
తల్లిని
మనము
సంతృప్తి
పరచటానికి
ప్రయత్నించాలి.
ఇది
…
యిల్లు
గెల్చి
రచ్చ
గెలవమన్నారు.
తల్లినే
సంతృప్తి
పరచలేని
నీవు
దైవాన్ని
యేరీతిగా
సంతృప్తి
పరచగలవు.
తల్లినే
గౌరవించలేని
శక్తిసామర్థ్యములు
దైవాన్ని
యేరీతిగా
గౌరవించగలవు.
కనుక
మొట్టమొదట
అన్నివిధముల
రక్తాన్ని,
తన
జీవితాన్ని,
తన
సర్వశక్తిని
ధారపోసిన
తల్లిని
గౌరవించటము
నేర్చుకోవాలని
నేను
ఆశిస్తూ
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Brahman Itself Is the Root Power of the World!
Next
All Things and All Beings in the World Are Forms of the Paramātma!
→