Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · You Are the Embodiment of Ānanda
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
You Are the Embodiment of Ānanda
5 October 1989, Dasara, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 292
పొట్ట
మలమూత్ర
దుర్గంధ
తొట్టిసుమ్మి
దేహమంతయు
దుర్గంధ
దిబ్బసుమ్మి
ఆత్మదేహమున
కిదియె
వింతకొంప
మరువబోకుడు
యిటువంటి
మంచిమాట
ప్రేమస్వరూపులారా!
ప్రతిమానవుడు
ఆనందమునే
ఆశించుచున్నాడు
కాని
దుఃఖమును
కోరుట
లేదు.
ఇట్టి
అకుంఠిత
ఆనందనిమిత్తమై
మానవుడు
అహోరాత్రములు
అనేక
ప్రయత్నములు
సలుపుతున్నాడు.
కాని
ఆశించిన
ఆనందమును
అందుకోలేకపోతున్నాడు.
కారణమేమిటి?
ఈ
దేహేంద్రియములే
తానని
బ్రమించి
ఆ
దేహేంద్రియములకు
సంబంధించిన
సుఖభోగ
భాగ్యవస్తువుల
నిమిత్తమై
ప్రాకులాడి
అట్టి
వస్తువాహనాదులు
లభించినప్పుడు
ఆనందము
ప్రాప్తించునని
చింతించి
వాటి
నిమిత్తమై
అహోరాత్రములు
కృషిసలుపుతున్నాడు.
మానవుడాశించిన
ఆనందము
బయట
ప్రపంచములో
లేదు.
మానవుడాశించిన
ఆనందం
వస్తువాహనాదులందు
లేదు.
మానవుడాశించిన
ఆనందము
విషయ
వ్యక్తులయందు
కూడా
కన్పించదు.
ఇట్టి
లేని
ఆనందమును
పొందే
నిమిత్తమై
మానవుడెన్ని
ప్రయత్నములు
చేసినా
యివన్నీ
వ్యర్థములే
అవుతాయి.
అట్టి
మానవుని
దృష్టి
యందుంచుకొనియే
ఓ
మానవుడా
నీవాశించిన
ఆనందము
బాహ్యసంబంధమైన
వస్తు
వాహనాదులందుగాని,
వ్యక్తులందుగాని
విషయములందుగాని
లేదు.
ఏ
ఆనందము
నిమిత్తమై
నీవు
పరితపిస్తున్నావో,
ఏ
ఆనందము
నిమిత్తమై
నీవు
అనేకవిధములైన
ప్రయత్నములు
సలుపుతున్నావో
యీ
ఆనందమే
నీ
రూపము.
నీవే
ఆనందస్వరూపుడవై
దానిని
మరచి
ప్రాకృత
రూపమైన
యీ
జగత్తునందు
ఆనందమును
వెతుకుట
అజ్ఞానమని
వేదము
ప్రబోధిస్తున్నది.
కేవలము
దేహేంద్రియ
సంబంధమైన
వస్తువాహనాదులు,
లోక
సంబంధమైన
విషయాలు,
శరీరసంబంధమైన
రూపములు
యివన్నీ
కూడ
క్షణభంగురము.
యీ
దృశ్యం
-
ఏది
దృశ్యకల్పితముగా
మనకు
గోచరిస్తున్నదో
యివన్నీ
కూడ
మార్పుచెందునవే.
మార్పుచెందే
వస్తువాహనాదులందు,
విషయాదులందు,
వ్యక్తులందు
మార్పుచెందని
ఆనందము
లభించటం
యిది
కేవలం
వెఱ్ఱితనము.
నిత్యసత్యమైన
ఆత్మ
తత్వమందే
యిట్టి
నిత్యానందము
మనకు
ప్రాప్తిస్తుందని
వేదము
హెచ్చరిస్తూ
వచ్చింది.
బాహ్యవిచారణ
సల్పటం
కేవలము
తాత్కాలిక
ఆనందము
నిమిత్తమేగాని
శాశ్వతానందం
మనకు
ప్రాప్తించదు.
అంతర
పరిశోధనలకు
మానవుడు
సంసిద్ధుడు
కావాలి.
అప్పుడే
ఆశించిన
ఆనందమును
తాను
అనుభవించగలడు.
శైశవస్థితియందు
బిడ్డ
తల్లి
ఒడినే
శాశ్వతంగా
భావించి
తల్లియె
తనకు
సర్వవిధాలా
భద్రత
అని
విశ్వసించి
ఆ
తల్లి
ఒడిలో
నిశ్చింతగా
నిద్రిస్తూ
వుంటాడు
బిడ్డ.
2
▾
Meaning
Keep
తల్లి
ఒడి
వదలి
క్షణమైనా
ముందుకు
కదలడు.
ఆనందము
తల్లియందే
తాననుభవిస్తున్నానని
విశ్వసిస్తాడు.
కాని
కాలము
గడచినకొలది
ఆట
బొమ్మలు,
పాట
బొమ్మల
నాకర్షించి
తల్లి
ఒడి
వదలి
ముందుకు
సాగుతాడు.
కొంతకాలములోపలనే
తల్లి
ఒడిని
మరచిపోతాడు.
ఆట
బొమ్మలు,
పాట
బొమ్మలే
అత్యంత
అభిరుచియైనవిగా,
ఆనందమయమైనవిగా
విశ్వసిస్తాడు.
కాలము
కదలిన
కొలది
మానవత్వము
కూడా
మారుతూ
వస్తుంది.
ఇక
విద్యాభ్యాసములో
ప్రవేశిస్తాడు.
ఈ
పాఠ్యగ్రంథములు
చూపిన
తక్షణమే
ఆటబొమ్మలను,
పాటబొమ్మలను
వదులుతాడు.
పాఠ్యగ్రంథములే
ప్రధానంగా
విశ్వసిస్తాడు.
తన
జీవితమును
ఆనందింపజేసేది
విద్యయె
యని
విశ్వసిస్తాడు.
ఇట్టి
భవిష్యత్తు
యొక్క
ఆనంద
నిమిత్తమై
యిట్టి
పాఠ్యగ్రంథాల
మధ్య
యిమిడి
పోతాడు.
అదే
తన
భవిష్యత్తుకు
ఆనంద
స్వరూపమని
విశ్వసిస్తాడు.
క్రమక్రమేణా
కాలము
కదిలేకొలది
వాంఛలు
అధికమై
పోతున్నాయి.
గ్రంథములు
త్యజిస్తాడు.
వివాహమునకై
అఱ్ఱులు
చాస్తాడు.
అర్థాంగి
లభించిన
తక్షణమే
సర్వం
మరచిపోయి
అర్థాంగియే
సర్వస్వంగా
విశ్వసిస్తాడు.
సంసారములో
ప్రవేశించిన
వ్యక్తిని
ఆర్థిక
యిబ్బందులనేకంగా
వెంటాడతాయి.
వాటి
నిమిత్తమై
యీ
ఆనందాన్ని
వదలి
ఉద్యోగము
నిమిత్తమై
రేయింబవలు
సంచరిస్తాడు.
కాని
యింటిలో
ప్రమోషన్
అధికమైపోతుంది.
ఒకరిద్దరు
బిడ్డలయ్యేటప్పటికి
ఆఫీసులో
ప్రమోషన్
రావటం
లేదు.
వచ్చే
ధనమునకు,
ఖర్చు
పెట్టే
ధనమునకు
యేమాత్రం
సంబంధము
లేకుండా
వుంటుంది.
అధిక
ఖర్చు,
తక్కువ
రాబడి.
తద్వారా
సంసారమును
సంతోషపెట్టే
నిమిత్తమై
అధికమైన
వర్కుతో
ఆఫీసులోనే
తనకాలమంతా
గడుపుతూ
వుంటాడు.
ఈ
విధముగా
కాలము
గడుపుతూ
వుండగా
ముంచుకుని
వస్తుంది
ముసలితనము.
ఈ
ముసలితనము
రాగానే
ఆలు
బిడ్డలు
కూడా
చెప్పిన
మాట
వినరు.
కట్టకడపటికి
కుమారులు
కూడా
అతని
ఆజ్ఞను
వుల్లంఘిస్తూ
వుంటారు.
తాను
పరాధీనుడైపోతాడు.
అప్పుడే
బాధలన్నీ
అతన్ని
ఆవరిస్తాయి.
భగవంతుడా!
ఏ
తల్లి
ఒడి
ఆనందమని
నేను
ఆశించానో
ఆ
తల్లి
ఒడిని
విసర్జించాను.
ఏ
ఆట
బొమ్మలు,
పాట
బొమ్మలు
నిత్యము
సత్యమని
భావించానో
అదికూడా
వదలిపెట్టాను.
క్రమక్రమేణా
నేను
యేది
ఆనందాన్ని
అందించేది
అని
భావించానో
అట్టి
ఆనందస్థానములన్నీ
విసర్జించాను.
ఆనందములని
భ్రమించినవన్నీ
కూడా
దుఃఖములుగా
మారుతున్నవి.
కనుక
నిత్యానందమెక్కడ
లభించునా
అని
అప్పుడే
దేవుడా
అని
దేవులాడుతాడు.
కనుక
మానవత్వమునకు
నిజమైన
ఆనందము
దివ్యత్వమునందే
ప్రాప్తిస్తుంది
కాని
ప్రాకృతమైన
విషయములందు
తాత్కాలిక
ఆనందము
లభ్యము
కావచ్చు.
కనుక
ప్రతి
మానవుడు
కూడ
ఆనందం
అభిలషించినప్పుడు
ఆధ్యాత్మిక
మార్గములో
ప్రవేశించినప్పుడే
యిట్టి
ఆనందము
మనకు
ప్రాప్తిస్తుందనే
సత్యాన్ని
గుర్తించాలి.
3
▾
Meaning
Keep
ఇట్టి
ఆనందము
నిమిత్తమే
వేదము
అనేక
విధములుగా
మానవుని
హెచ్చరిస్తూ
వస్తుంది.
భగవంతుడు
అప్రమేయుడు.
ఎట్టి
ప్రమాణములకు
చిక్కడు.
ఎట్టి
ప్రమాణముల
చేత
అతనిని
గుర్తించుటకు
వీలుకానివాడు.
అట్టి
భగవంతుని
గుర్తించుటకై
అనేక
ప్రమాణములు
మనము
వెతుకుతున్నాము.
వాక్కునకు
గాని,
మనస్సునకు
గాని
అతీతమై
వర్ణింప
సాధ్యముగాని
భగవంతుని
ఏ
ప్రమాణములతో
మనం
పట్టుకొనుటకు
సాధ్యమవుతుంది.
ప్రమాణములు
మూడు
విధములుగా
వుంటున్నవి.
ఒకటి
ప్రత్యక్ష
ప్రమాణము.
ఇదియే
యీనాడు
ప్రతి
మానవుడు
ఆశిస్తున్నాడు.
ప్రతిదానికి
ప్రత్యక్ష
అనుభూతి
నాకు
కావాలి
అని
భ్రమిస్తున్నాడు.
ప్రత్యక్ష
ప్రమాణము
నిమిత్తమే
తాను
అనేక
విధముల
ప్రయత్నము
సలుపుతున్నాడు.
ప్రత్యక్ష
ప్రమాణము
లేనిదానిని
విశ్వసించలేక
పోతున్నాడు.
ఇది
కేవలము
అజ్ఞానము
యొక్క
ప్రథమపాదము.
ప్రత్యక్ష
ప్రమాణము
అనేక
విధములైన
రోగములతో
కూడి
వుంటాయి.
ఒక
చిన్న
వుదాహరణము.
మన
కన్ను
ఆరోగ్యముగా
వున్నప్పుడు
నలుపు
నలుపుగా,
తెలుపు
తెలుపుగా,
ఎరుపు
ఎరుపుగా
పసుపు
పసుపుగా
గోచరిస్తుంది.
ఇదియే
ప్రత్యక్ష
ప్రమాణము.
నేను
చూచినాను
నలుపు
నలుపే.
అని
నీవు
వాదించటానికి
పూనుకున్నప్పుడు
కొంతకాలములో
యీ
కంటికి
జాండిస్
అనే
రోగము
ప్రవేశిస్తే
అంతా
పచ్చగానే
కనుపిస్తుంది
కాని
యింక
యే
రంగులు
కనుపించవు.
ఈ
ప్రమాణమెంత
సత్యమైనది?
కనుక
యింద్రియములతో
కూడిన
ప్రమాణములు
మార్పుచెందేటువంటివి.
అనేకమంది
శాస్త్రజ్ఞులిట్టి
ప్రత్యక్ష
ప్రమాణము
ఆశిస్తూ
వుంటారు.
ఎట్లనగా
రాత్రి
చూచినప్పుడు
పాలుగా
వుంటాయి.
రాత్రి
పాలలో
తోడంటు
వేసినప్పుడు
తెల్లవారితే
పెరుగవుతుంది.
పాలు
పెరుగుగా
మారింది.
ఇది
ప్రత్యక్ష
ప్రమాణము.
ఇది
భౌతికమైన,
ప్రాకృతమైన
ప్రమాణం.
ఇది
ఆధ్యాత్మికమునకేమాత్రం
అన్వయించదు.
ఎందుకంటే
యీ
ప్రత్యక్ష
ప్రమాణముననుభవించే
సర్వేంద్రియములు
కూడా
మార్పు
చెందునవే.
మార్పు
చెందే
యింద్రియములతో
మార్పు
చెందని
సత్యాన్ని
గుర్తించుటకు
వీలుకాదు.
రెండవది
అనుమాన
ప్రమాణము.
దూరంగా
వున్న
కొండను
మనం
చూచినప్పుడు
అక్కడ
పొగవస్తూ
వుంటుంది.
పొగ
అగ్నియొక్క
ప్రతిబింబము.
పొగను
చూచి
అగ్ని
అని
మనం
విశ్వసిస్తున్నాము
కాని
అగ్ని
మనకు
కనుపించదు.
అది
అగ్నియో
లేక
ఆవిరియా!
కాని
పొగమాత్రం
కనుపిస్తోంది.
కాని
అగ్నిని
చూడకుండా
పొగను
చూచి
అగ్ని
వుందని
భ్రమించటము
అనుమాన
ప్రమాణము.
ఒక
మనిషి
వస్తున్నట్లుగా
ప్రతిబింబము
మనకు
కనుపిస్తుంది.
అది
యెవరో
ఒక
మనిషి
వస్తున్నాడని
చెప్పటానికి
వీలుగాని
ఫలానా
మనిషి
వస్తున్నాడని
చెప్పుటకు
వీలుకాదు.
కాబట్టి
యీ
ప్రతిబింబ
ప్రమాణము
ప్రత్యక్షంగా
మనం
అనుభవించుటకు
వీలుకాదు.
4
▾
Meaning
Keep
ఈ
నీడను
చూచి
ఫలానవారని
ఎవరైనా
చెప్పగలరా?
కనుక
ఎవరో
ఒక
మనిషి
వస్తున్నాడని
చెప్పవచ్చుగాని
ఫలానివాడు
అని
చెప్పుటకు
వీలుకాదు.
ఇది
అనుమాన
ప్రమాణము.
ఇక
మూడవది
శబ్దప్రమాణము.
ఈ
శబ్దప్రమాణమే
మనగా
కొంతమంది
ప్రశాంతినిలయమునకొచ్చి,
ప్రశాంతినిలయము
యొక్క
భవనములను,
వాతావరణమును,
దృశ్యములను
తాననుభవించి
తిరిగి
రానివారి
వద్దకెళ్ళి,
ప్రశాంతినిలయమిలా
వుంది
అలా
వుంది
అని
చెప్పినప్పుడు
యిది
కేవలం
ఒక
శబ్దప్రమాణము.
తెలుసుకున్నవాడు,
తెలియనివానికి
తెలుసుకున్న
విషయం
చెప్పటమే
శబ్ద
ప్రమాణము.
అదియు
వేదము.
వేదము
శబ్దప్రమాణము.
కనుక
తెలియనటువంటి
ప్రతి
మానవుడు
కూడ
వేదము
చెప్పే
ప్రమాణములనే
ప్రత్యక్ష
ప్రమాణములుగా
గుర్తించి
వర్తించటం
అత్యవసరము.
దీనికి
ప్రత్యక్షమేమిటని
గుర్తించటానికి
ప్రయత్నిస్తే
విఫలుడౌతాడు.
జీవితములో
ప్రతి
విషయమునందు
యీ
ప్రత్యక్ష
ప్రమాణమనేదే
శాస్త్రముగా
విశ్వసిస్తూ
వచ్చారు.
ఈ
శబ్ద
ప్రమాణమనేది
నిస్సందేహము.
ఈ
ప్రమాణములలో
రెండు
విధములైన
ప్రమాణములుంటున్నాయి.
వైదిక
ప్రమాణము
లౌకిక
ప్రమాణము.
లౌకిక
ప్రమాణము
భగవంతుని
గూర్చి
చెప్పలేదు.
కేవలం
వైదిక
ప్రమాణము
మాత్రమే
భగవంతుని
గురించి
వివరించటానికి
పూనుకుంటుంది.
శాస్త్రమునకు
సంబంధించిన
ప్రమాణమే
లౌకిక
ప్రమాణము.
ఐతే
యీ
శాస్త్రమంటే
ఏమిటి?
విశ్రవణ
అయిన
విషయాన్ని
శ్రవణకు
తెప్పిస్తుంది.
మరచినటువంటి
దానిని
జ్ఞప్తికి
తెప్పిస్తుంది.
మరచినదానిని
జ్ఞప్తికి
తెప్పించేదే
శాస్త్రము.
ఇట్టి
శాస్త్ర
ప్రమాణమునే
అనేక
విధములుగా
ధర్మప్రమాణములుగా
తీసుకుంటూ
వచ్చారు.
ఈ
ధర్మములు
కూడా
అనేక
రకములుగా
వుంటున్నాయి.
జాతి
ధర్మము,
దేశధర్మము
కులధర్మము,
గుణధర్మము,
ఆపద్ధర్మము
అని.
ఐదు
విధములుగా
వుంటున్నవి.
ఈ
అన్ని
ధర్మములు
కూడా
కేవలం
భూతదయను
మాత్రమే
ప్రబోధిస్తూ
వచ్చాయి.
భూతదయనే
ప్రధానమైన
ధర్మంగా
విశ్వసిస్తూ
వచ్చింది.
భూతప్రీతియే
ప్రధానమైన
దైవప్రీతిగా
విశ్వసిస్తూ
వచ్చింది.
భూతప్రీతి
లేనివానికి
దైవప్రీతి
కూడా
సంభవించదు.
దైవప్రీతి
లేని
వానికి
పాపభీతి
కూడా
లభ్యము
కాదు.
ఈ
పాపభీతి,
దైవప్రీతి
లేనివానికి
సంఘనీతి
కూడా
వుండదు.
ధర్మమునకు
పర్యాయపదము
నీతి.
నీతి
అనగా
కేవలం
మంచి
నడత
మంచి
ప్రవర్తన
అని.
ఇది
కేవలం
దేశకాల
సంఘములకు
లోబడి
ప్రవర్తించే
సదాచారమే
నీతి
అన్నారు.
సంఘమునకు
కూడను
లోబడి
ప్రవర్తించాలి.
సంఘ
విరుద్ధమైన
కర్మలాచరించరాదని
వేదప్రమాణము.
మానవుడు
సంఘమునందే
పుట్టి,
సంఘమునందే
పెరిగి,
సంఘము
నందే
జీవించి,
సంఘమునందే
అంత్యమవుతున్నాడు.
కనుక
సంఘ
నియమములు
పాటించటము
అత్యవసరమని
ప్రబోధిస్తూ
వచ్చింది
వేదము.
కనుక
దేశకాల
సంఘమునకు
లోబడి
ప్రవర్తించటమే
నిజమైన
నీతిగా
భావించాలి.
5
▾
Meaning
Keep
ఇలాంటి
నీతులందు
కూడను
వ్యక్తిగతమైన
నీతి,
జాతీయతా
నీతి.
ఈ
నీతినే
శీలముగా
కూడ
భావిస్తూ
వచ్చారు.
కనుక
వ్యక్తిగతమైన
శీలము,
జాతీయశీలము
మానవుడభివృద్ధిగావించుకోవాలని
వేదము
శాసించింది.
ఈ
రెండింటియందు
కూడా
మానవత్వము
యే
విధంగా
సంచరించాలి
అనే
మార్గము
కూడా
ప్రబోధించింది.
నిత్య
జీవితములో
మానవుడు
సత్యమైన
మార్గాన్ని
వెదకటానికి
తగిన
కార్యకలాపములు
కూడా
ప్రబోధించింది
వేదము.
కాని
యిట్టి
విశాలమైన
వేదతత్వాన్ని
యీనాటి
మానవుడు
యేదో
సంకుచిత
భావములో
విశ్వసించి,
యిదియేదో
కొంతమంది
బ్రాహ్మణులకు,
కొన్ని
యజ్ఞయాగాది
క్రతువులకు
యిత్యాదివానికి
మాత్రమే
యిది
వుపయోగించుకుంటారని
అపోహలకు
గురౌతున్నారు.
మానవతా
శక్తిని
అభివృద్ధి
గావించటానికి
వేదము
ఎన్నిరకములైన
మార్గములో
ప్రబోధిస్తూ
వచ్చింది.
కనుక
మానవత్వము
యొక్క
తత్వాన్ని
మనం
అర్థం
చేసుకోటానికి
ప్రయత్నించాలి.
ఈ
శాస్త్రములన్నీ
యమనియమాది
మార్గములను
ప్రబోధించి
తద్వారా
మానవత్వాన్ని
కూడా
అభివృద్ధిగావించుకోమని
ప్రబోధిస్తూ
వచ్చాయి.
ఒక్క
యమమును
మనము
సాధించుకుంటే
చాలు.
యముని
సాధించిన
వారమవుతాము.
యమ
అనగా
యేమిటి?
అహింస,
సత్యము,
అస్తేయము,
బ్రహ్మచర్యము,
అపరిగ్రహము.
ఈ
ఐదింటిని
మనము
సాధిస్తే,
యీ
ఐదే
మన
పంచప్రాణములుగా
జీవించవచ్చును.
ఈ
ఐదే
మానవత్వానికి
సరైన
గుర్తులు.
ఈ
ఐదే
లేకపోతే
మానవుడు
మాత్రమే
వుంటున్నాడుగాని
మానవత్వంలేదు.
కనుక
మానవతా
గుణములలో
ప్రధానమైనవి
యీ
ఐదే.
అహింస
ప్రథమము.
అహింస
అనగా
ఏమిటి?
దేహముతో
మరొక
దేహమునుగాని
మరొక
జీవినిగాని
హింసించకూడదని.
కేవలం
దేహముతో
మాత్రమే
కాదు.
మాటలతో
కూడను
యితరులను
నొప్పించకూడదు.
మాటలతో
మాత్రమే
కాదు.
తలంపుతో
కూడను
యితరులను
బాధించకూడదు.
త్రికరణ
శుద్ధి
అయిన
అహింసయే
నిజమైన
అహింసగా
రూపొందింప
చేసింది
వేదము.
మాటయందుగాని,
మనసునందుగాని,
చేతలందుగాని
యితరులను
బాధించే
క్రియలాచరించ
కూడదని
ప్రబోధించింది
వేదము.
త్రికరణశుద్ధితో
కూడినదిగా
వుండాలిగాని
యేదో
కొన్ని
మార్గములలో
హింసించకుండా
వుండటం
యిది
అహింస
కానేరదు.
మనలో
యితరులను
బాధించి
నొప్పించే
భావములు
ఆవిర్భవించరాదు.
ఇతరులను
నొప్పించే
పలుకులు
కూడా
మనము
పలుకరాదు.
ఇతరులను
బాధించే
చర్యలు
కూడా
మనం
చేయరాదు.
ఇదియే
సరియైన
అర్థము.
ఇక
సత్యము.
సత్యమనగా
కేవలం
చూచినది
చూచినట్లుగా
విన్నది
విన్నట్లుగా,
తలచినది
తలచినట్లుగా
చేసినది
చేసినట్లుగా
చెప్పటం
మాత్రమే
సత్యముకాదు.
తాత్కాలికముగా
యిది
సత్యముగా
రూపొందుతూంది.
సత్యమనగా
త్రికాలబాధ్యం
సత్యం.
మూడు
కాలములందు
మార్పుచెందనిదే
సత్యము.
ఈ
సత్యము
కూడను
కొన్ని
నియమములను
పాటిస్తూ
రావాలి.
6
▾
Meaning
Keep
‘అనుద్వేగకరం
వాక్యం
సత్యం
ప్రియహితంచ’
మనము
సత్యము
చెప్పుచున్నామని
కఠినంగా
సత్యం
చెప్పకూడదు.
సత్యం
కదా
అని
అప్రీతికరమైన
సత్యాన్ని
కూడా
చెప్పకూడదు.
సత్యం
కదా
యని
అహితమైన
సత్యాన్ని
కూడా
చెప్పకూడదు.
మనం
సత్యం
కూడా
శాంతముగా
హితముగా,
ప్రీతిగా
వుండేటట్లు
చెప్పాలి.
చెప్పే
విధానము
కూడను
మనం
నేర్చుకోవాలి.
ఇది
కూడా
త్రికరణ
శుద్ధియైన
సత్యంగా
రూపొందాలి.
ఇంక
మూడవది
అస్తేయము.
ఎలాంటి
పరిస్థితులయందుగాని
యితరుల
వస్తువులుకాని,
విషయములుగాని
మనమేమాత్రము
అపహరించరాదు.
ఇది
అపహరించాలనే
భావం
కూడా
మనలో
రారాదు.
అపహరించమని
కూడా
మనం
నోటితో
చెప్పరాదు.
కనుక
త్రికరణ
శుద్ధితో
యితరుల
వస్తువుల
నపహరించుటకు
మనం
పూనుకోరాదు.
అదికూడను
మానవతావిలువ.
బ్రహ్మచర్యము.
కేవలము
వివాహమాడకుండినంత
మాత్రమున
బ్రహ్మచర్యమని
భావించరాదు.
బ్రహ్మచర్యమనగా
త్రికరణ
శుద్ధితో
ఎట్టి
కర్మలు
చేసినా
ఎట్టి
తలపులు
తలచినా,
ఎట్టి
మాటలు
చెప్పినా
యివి
బ్రహ్మచర్యములో
కూడినటువంటివిగా
వుండాలి.
సర్వకర్మలు
భగవత్ప్రీత్యర్థము
అనే
భావంతో
ఆచరించాలి.
మనసుయందు,
మాటయందు
క్రియలయందు
కూడను
కేవలం
బ్రహ్మభావములో
చేయటమే
బ్రహ్మచర్యమన్నారు.
ఏపని
చేసినా
బ్రహ్మార్పితమనుకొని
చేయి.
పనులు
మాత్రం
మాననక్కరలేదు.
కనుక
మనం
చేసే
పనులుగాని,
చెప్పే
పదములుగాని,
తలచే
తలపులుగాని
బ్రహ్మభావముతో
కూడినవిగా
వుండాలి.
బ్రహ్మభావంతో
చరించటమే
బ్రహ్మచర్యము
అన్నారు.
ఇంక
అపరిగ్రహము.
పరిగ్రహము
చాలా
చెడ్డది
అన్నది
వేదము.
ఎవరితో
కూడను
ఏవస్తువు
కూడను
మనం
బహుమానంగా
కాని
యింకే
విధమైన
రీతిగాకాని
మనం
అందుకోకూడదు.
ఐతే
కొన్ని
నియమములు
ఏర్పరచింది
వేదము.
తల్లిదగ్గర,
తండ్రి
దగ్గర,
గురువు
దగ్గర,
దైవము
దగ్గర
యేమైనాగాని
పుచ్చుకోవచ్చు.
ఇందులో
తప్పులేదు.
ఇది
కర్తవ్యము.
వారి
బాధ్యత.
అంతేగాని
యితరుల
దగ్గర
మాత్రం
యే
బహుమానం
క్రిందనో
మనం
ఒక
వస్తువును
పుచ్చుకుంటే
మనం
వారికి
ఋణపడిపోతాము.
ఆ
ఋణానుబంధము
తీర్చుకోటం
అసాధ్యం.
ఇది
కర్మశాసనమందు
ప్రధానమైన
శాసనం.
ప్రతికర్మకు
ఒక
ఫలం
వుంటుంది.
ఈ
కర్మ
అనేది
ఒక
అద్దంగా
తీసుకోండి.
ఈ
జగత్తులో
మనం
యేమి
చేసినా
అది
తిరిగి
మనకు
ప్రతిఫలంగా
లభిస్తూ
వుంటాయి.
అద్దము
ముందు
పోయి
నీవు
నమస్కరిస్తే
ఆ
అద్దములోని
ప్రతిబింబము
తిరిగి
ఆ
నమస్కారము
నీకే
యిస్తుంది.
అద్దం
ముందు
పోయి
ఆ
ప్రతిబింబాన్ని
నీవు
దండిస్తే,
ఆ
ప్రతిబింబము
కూడా
నిన్ను
దండిస్తుంది.
ఇదే
విధంగా
ప్రకృతి
అంతా
కేవలము
ఒక
అద్దము
వంటిది.
ఈ
అద్దము
వంటి
యీ
ప్రపంచములో
నీవేమి
చేసినా
ఆ
ప్రతిబింబములు
నీకే
లభిస్తూ
వుంటాయి.
కనుక
మనం
చేసే
కర్మలన్నీ
దోషరహితమైన
కర్మలుగా
వుండాలి.
7
▾
Meaning
Keep
మానవతా
సహితమైన
కర్మలుగా
వుండాలి.
కనుక
మనం
ఎవరి
దగ్గర
యే
వస్తువు
అందుకున్నా
వారికి
మనము
ఋణస్తులమైపోతాము.
ఆ
ఋణపడిన
వ్యక్తి
తిరిగి
వారింటిలోయే
కుక్కగానో,
పిల్లిగానో,
గాడిదగానో
పుట్టవలసి
వస్తుంది.
కనుక
మనము
యీవిధమైన
విచారణకు
చోటివ్వకుండా,
ఎవరైనా
యేదైనా
యిస్తే
నీరో
లేక
ఫలహారమో
అయితే
అవి
భుజించవచ్చు.
తప్పులేదు.
కనుక
మిగిలిన
విషయాలలో
మాత్రం
అంటే
ఎవరి
దగ్గర
డబ్బు
తీసుకోటంగాని,
దుస్తులు
తీసుకోటంగాని
మంచిదికాదు.
తల్లిదండ్రుల
దగ్గర
నీవేమైనా
తీసుకో.
దీనిలో
దోషం
లేదు.
భర్త
దగ్గర
భార్య,
భార్య
దగ్గర
భర్త
యేమి
తీసుకున్నా
దోషంలేదు.
ఆమె
అర్థాంగి
యిరువురికిని
సమానమైన
అధికారం
వుంది.
గురువు
అనుగ్రహముతో
యేమిచ్చినా
పుచ్చుకోవచ్చును.
ఇంక
దైవము
దగ్గర
no
limit.
లిమిట్
లేదు.
ఏమిచ్చినా
పుచ్చుకోవచ్చును.
తిట్లు
యిచ్చినా,
దెబ్బలు
యిచ్చినా
పుచ్చుకోవచ్చును.
అవన్నీ
కూడా
తన
మంచికోసమే.
దైవము
యేమి
చేసినా
యిది
నా
మంచికోసమనే
భావంతో
వుండినప్పుడు
అవన్నీ
ఉత్తమమైన
స్థితినే
అందిస్తాయి.
కనుక
మానవతా
గుణములనగా
యీ
ఐదే
ప్రధానమైన
గుణములు.
ఈ
ఐదు
పంచప్రాణములు
ఒక
దేహములో
చేరినట్లుగా,
యీ
ఐదు
పంచగుణములు
ఒక్క
యమము
అనే
దానిలో
యిమిడి
వున్నాయి.
యమ
అనగా
అహింస,
సత్యము,
అస్తేయము
బ్రహ్మచర్యము,
అపరిగ్రహము.
ఈ
ఐదే
మానవుని
ప్రధానమైన
విలువలు.
ఈ
ఐదింటిని
మనము
సాధించినప్పుడు
మన
జీవితం
పరిపూర్ణ
మానవునిగా
రూపొందుతుంది.
ఇట్టి
మానవత్వాన్ని
అభివృద్ధి
గావించే
నిమిత్తమై
వేదము
అనేక
మార్గములు
ప్రబోధిస్తూ
వచ్చాయి.
ఈ
మార్గములలో
మూడు
మార్గములు
ప్రధానమైనవిగా
నిరూపించింది.
అవియే
కర్మ,
ఉపాసన,
జ్ఞానము.
ఏ
మార్గములో
నీవు
ప్రయాణము
చేసినా
గమ్యమును
చేరగలవు.
అన్నింటికి
మూలాధారము
భగవన్నామము
అని
చెప్పింది.
భగవన్నామమును
చింతించుకుంటూ,
సమాజసేవలు
చేసుకుంటూ,
సర్వకర్మలు
భగవత్ప్రీత్యర్థము
గావించి
మానవత్వములో
వున్న
విశిష్టతను
నిలుపుకోటమే
ప్రధానమైన
సూత్రమని
బోధించింది
వేదము.
Previous
←
Grasp the Supreme Goal of Life
Next
Do Not Give Up the Name of God
→