Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1989 · Do Not Give Up the Name of God
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Do Not Give Up the Name of God
6 October 1989, Dasara, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
పూల
యందున
పరిమళ
మెట్లు
గలదొ
అటుల
దేవుండు
నీలోన
కలడు
జూడ
మెదడు
చెడిపోయి
కస్తూరి
మృగము
వోలె
ఏల
వెతికెదు
దేవుని
వెఱ్ఱి
వాడ.
కట్టెలందున
నిప్పులు
కల్గునటుల
తిలలయందున
తైలంబు
వెలయు
పగిది
ఎందు
చూచిన
దైవంబు
నిండి
యుండె
ఎచట
వెతుకెదు
దేవుని
వెఱ్ఱివాడ.
ప్రేమస్వరూపులారా!
ప్రపంచములో
ప్రతి
కణమునందును
ప్రతిష్ఠయై
వున్న
దివ్యత్వమును
మానవుడు
గుర్తించుకోలేక
పోతున్నాడు.
ప్రపంచమంతయు
కూడను
దివ్యమైనటువంటిది
ఈశ్వరస్సర్వభూతానాం.
ఇట్టి
సత్యాన్ని
ప్రతి
మానవుడు
చక్కగా
విచారణ
చేసిన
తనకు
యిట్టి
దివ్యత్వము
బోధపడుతుంది.
భౌతికమైన
యీ
జగత్తునందు
లౌకికమైన
పరిశీలనలోపల
సమస్తమును
అర్థము
గావించుకొని
కేవలం
తనయందున్న
దివ్యత్వమును
మటుకు
విస్మరించి
మానవుడు
జ్ఞానివలె
ప్రకటితం
చేస్తున్నాడు.
మానవుడు
యీ
జగత్తునందు
చేయు
ప్రతి
కర్మ
కూడా
ఒక
యజ్ఞముతో
సమానము.
బయట
చేయు
కర్మలన్ని
అంతర్ముఖమైన
కర్మలయొక్క
ప్రతిబింబములే.
బయట
కర్మయజ్ఞము.
లోపల
బ్రహ్మయజ్ఞము.
కాని
యజ్ఞతత్వము
చక్కగా
గుర్తించి
వర్తించటం
వ్యక్తులకు
అర్థం
కావటం
లేదు.
మానవత్వమునందెట్టి
దివ్యత్వము
యిమిడియున్నదో
అట్టి
దివ్యత్వమే
సర్వత్రా
వ్యాపించిన
పరతత్వమనే
సత్యాన్ని
వారు
గుర్తించుకోటానికి
ప్రయత్నించటం
లేదు.
దేహేంద్రియములే
ప్రధానమని
భావించి
వాటిని
తృప్తి
పరచుటకు
తగిన
భోగభాగ్యముల
నిమిత్తమై
మానవుడు
తన
కాయమును
కాలమును
కర్మను
కూడా
వ్యర్థము
గావించుకుంటున్నాడు.
భౌతిక
జీవితములో
యేర్పడిన
సుఖసంతోషములు
మానవునకు
తృప్తినిచ్చుచున్నవాయని
విచారణ
చేసిన
యేమాత్రం
తృప్తిని
కలిగించటంలేదు.
కేవలం
యిక్కడ
ఆధ్యాత్మిక
మార్గంలో
మనం
విచారణ
సలిపిన
ఒకటి
ఆనందము,
రెండవది
సంతోషము.
ఈ
సంతోషము
సుఖము
ద్వారా
యేర్పడినదేనని
భావిస్తున్నారు.
ప్రపంచములోగల
సమస్త
పదార్థములు
సుఖమును
మాత్రము
అందించగలవుగానీ
ఆనందమును
అందించలేవు.
ఆనందమన్నది
వస్తువులయందుగాని,
విషయములందుగాని,
వ్యక్తులయందుగాని
కానరాదు
ఆనందమన్నది
తననుండి
ఆవిర్భవించేటువంటి
ఆత్మతత్వమే
దప్ప
అన్యము
కాదు.
2
▾
Meaning
Keep
మార్పుచెందే
పదార్థములు
మార్పుచెందని
పరతత్వమునేరీతిగా
అందించగలవు.
కనుకనే
యిట్టి
నిత్యసత్యమును
గుర్తించుకునే
నిమిత్తమై
వేదములందు
అనేకరకములైన
మార్గములు
ప్రబోధిస్తూ
వచ్చాయి.
మానవునియందిట్టి
పశుత్వమైన
భావములు
గుణములు
అభివృద్ధి
కావటానికి
కారణమేమిటని
విచారించమని
మొట్టమొదటి
ప్రశ్న
వేసింది
వేదము.
పుట్టిన
తక్షణమే
మానవుడు
మానవునిగా
జన్మించటంలేదు.
ఈ
మానవత్వమునకు
పూర్వము
అనేక
జంతులక్షణములు
జంతు
జన్మములు
కూడా
ఎత్తి
కట్టకడపటికి
యీ
మానవ
జన్మములో
ప్రవేశిస్తున్నాడు.
కనుకనే
శేషించిన
యీ
పశులక్షణాలు
మనలో
వుండటము
చేత
యీ
విధమైన
దుర్గుణములు
ఆవిర్భవిస్తున్నాయి.
ఒకరు
చూచిన
నిరంతరము
చంచల
చిత్తులై
కేవలం
స్థిరత్వము
లేక
తాను
జీవిస్తూ
వుంటాడు.
ఆ
స్థిరత్వము
నిమిత్తమై
అనేక
ప్రయత్నములు
గావిస్తూ
వుంటాడు.
కాని
స్థిరత్వం
యేర్పడటం
లేదు.
దినదినమునకు
యీ
చంచలత్వమే
అభివృద్ధి
అవుతు
పోతుంది.
దీనికి
కారణమేమని
విచారించినప్పుడు
వేదమే
దీనికి
సరైన
జవాబు
నందిస్తూ
వచ్చింది.
పూర్వము
తను
కోతి
జన్మముగా
రూపొందటము
చేత
ఆ
కోతి
యొక్క
లక్షణములు
తనలో
వుండి
యీ
చంచలత్వానికి
మూలకారణమైందని
జవాబు
యిస్తుంది.
అదేవిధముగనే
మానవునియందు
మూర్ఖత్వము
లేక
పిరికితనముగాని
లేక
దొంగబుద్ధిగాని
యింకే
విధమైన
యీ
దుర్లక్షములంతా
కనుపించినాయంటే
దీనికి
మూలకారణము
పూర్వము
తాను
యీ
విధమైన
జంతు
జన్మములో
శేషించిన
శేషములే
యీ
ప్రవర్తనకు
మూలకారణమని
అర్థమవుతుంది.
ఇట్టి
దుష్ట
సంస్కారములను
మనము
భగవదర్పితము
గావించటమే
దీనికి
సరైన
పరిహారమని
నిర్ణయిస్తుంది.
దొంగతనమే
గుణము
మనిషిలో
అనేక
మందికి
ఆవిర్భవిస్తూ
వుంటాయి.
ఈ
దొంగతనమనేది
పిల్లి
యొక్క
లక్షణములు
చంచలత్వమనేది
కోతి
యొక్క
లక్షణములు.
మూర్ఖత్వము
గొఱ్ఱె
యొక్క
లక్షణము
మదము
అనే
గుణము
దున్నపోతు
లక్షణములు.
ఈ
విధముగా
పూర్వజన్మ
సంస్కారము
పురస్కరించుకొని
దాని
యొక్క
స్వభావములే
సంస్కారముగా
మారి
మానవుని
యందు
చిత్రింపబడుతూ
వుంటున్నాయి.
యజ్ఞములో
రెండు
విధములైన
యజ్ఞములు
కలవు.
ఒకటి
బాహ్య
సంబంధమైన
యజ్ఞము,
రెండవది
అంతర
సంబంధమైన
యజ్ఞము.
ఈ
బాహ్య
సంబంధమైన
యజ్ఞమునకు
కొన్ని
వేదికలు,
పురోహితులు,
సమిధలు,
దీనికి
తగిన
పదార్థములు
అత్యవసరం.
ఈ
మంత్రముల
చేత
స్వాహాకారముల
చేత
అర్పితము
గావిస్తూ
వుంటారు.
హోమం
చేస్తూ
వుంటారు.
ఇది
అంతర్ముఖమైన
యజ్ఞము
యొక్క
ప్రతిబింబమే.
ఐతే
అంతర్
యజ్ఞము
యొక్క
విషయము
వలనే
మాత్రం
కూడా
విచారించటం
లేదు.
3
▾
Meaning
Keep
తన
యందున్న
దైవత్వాన్ని
స్మరించి,
తన
మనసునే
యజ్ఞవేదికగా
నిర్మించి
దానియందు
శేషించిన
దుష్టగుణములను
బలిచేయటమే
యజ్ఞము
యొక్క
అంతర్భావము.
కనుకనే
దుష్టగుణములను,
దుష్టస్వభావమును,
దుష్టప్రవర్తనను
మనం
మార్చుకొని
దివ్యమైన
మానవత్వాన్ని
ప్రకటితంగావించుకునే
నిమిత్తమై
యేర్పడినవే
యీ
యజ్ఞములు.
చంచలత్వము
మానవుని
యొక్క
స్వభావము
కాదు.
క్రోధము
మానవుని
యొక్క
స్వభావము
కాదు.
దొంగతనము
కూడను
మానవుని
యొక్క
స్వభావము
కాదు.
మూర్ఖత్వమంతకంటే
మానవుని
స్వభావము
కాదు.
ఇవన్నీ
కూడా
మానవుని
యొక్క
స్వభావం
కాని
దుర్గుణములన్నింటిని
మానవుడు
అనుభవిస్తున్నాడంటే
దీనికి
మూలకారణము
పూర్వజన్మ
సంస్కార
ఫలములే.
కనుక
మనం
చేయవలసిన
త్యాగమేమంటే
మనలో
నిండి
వున్న,
మనలను
బాధించే,
మానవత్వాన్ని
మరపింపచేసే
యీ
దుర్గుణములను
మనం
త్యాగము
చేయాలి.
దీనికి
చక్కని
ఉదాహరణము.
మనలో
ఒకవిధమైన
ఆశ్రమము
వుంది.
ఈ
ఆశ్రమమనగా
యేమిటి?
శ్రమమును
పోగొట్టేది
ఆశ్రమము.
ఆశ్రితులను
రక్షించేది
ఆశ్రమము.
ఆశ్రితాన్ని
చేకూర్చేది
ఆశ్రమము.
మన
అభీష్టములు
నెరవేర్చేది
ఆశ్రమము.
ఐతే
యిది
సామాన్యమైన
ఆశ్రమము
కాదు.
నేను,
నేను
అనే
ప్రజ్ఞ
ఎక్కడనుండి
ఆవిర్భవించిందో
దానినే
ఆశ్రమము
అన్నారు.
సమస్త
అభీష్టములను
సిద్ధింపచేసే
యీ
ఆశ్రమమునే
సిద్ధాశ్రమము
అని
పిలుస్తూ
వచ్చారు.
ఈ
సిద్ధాశ్రమములో
విశ్వామిత్రుడు
వుండేవాడని
చరిత్ర.
ఈ
విశ్వామిత్రుడంటే
ఎవరు?
కేవలము
ఒక
వ్యక్తియా?
ఒక
మునియా?
లేక
ఒక
ఋషియా?
కాదు
కాదు.
అతనియందున్న
ప్రజ్ఞానశక్తిని
ప్రభువుపైన
మరల్చినప్పుడు
తానే
విశ్వామిత్రునిగా
మారతాడు.
అట్టి
తమ
దృష్టి
దివ్యత్వంపై
మరల్చే
యజ్ఞం
గావించాలని
తాను
ప్రయత్నం
చేస్తాడు.
ఈ
యజ్ఞసంరక్షణ
నిమిత్తమై
రామచంద్రుని
ప్రార్థిస్తాడు.
ఆ
రాముడెవరు?
కేవలం
ఒక
వ్యక్తి
స్వరూపుడు
కాదు.
ఆత్మనే
రమింపజేసే
గుణము
కలవాడు.
కనుక
అతనికి
ఆత్మారాముడని
బిరుదు.
ఈ
ఆత్మనాశ్రయించినప్పుడు
తన
యజ్ఞము
సఫలీకృతమవుతుందనే
విశ్వాసం
విశ్వామిత్రునికి.
కనుక
అట్టి
దృష్టిని
దివ్యత్వముపై
మరల్చటం
చేత
రాముడు
అక్కడ
ఆవిర్భవిస్తాడు.
అక్కడ
ఆవిర్భవించి
మారీచ,
తాటకిని
హతమారుస్తాడు.
ఈ
మారీచ
తాటకులెవరు.
ఇవే
రాగద్వేషములు.
ఈ
రాగద్వేషములనేనాడు
హతము
గావించునో
అప్పుడే
విశ్వామిత్రుని
యాగము
పరిపూర్ణమైంది.
కనుక
మానవుని
యందే
సర్వము
యిమిడి
వుంటున్నాయి.
మానవుని
యొక్క
వాక్కే
ఋగ్వేదము.
మనసే
యజుర్వేదము.
ప్రాణమే
సామవేదము.
మూడింటి
యొక్క
ఏకత్వమే
దివ్యమైన
ఆత్మతత్వము.
కనుక
ఋగ్వేద
యజుర్వేద
సామవేదములన్నీ
కేవలం
ఒక
స్వరూపము
ధరించిన
మానవత్వమే.
4
▾
Meaning
Keep
మానవుని
యందే
సర్వము
యిమిడి
వుంటుంది.
మానవుని
యందు
లేని
దివ్యత్వము
యింక
యెక్కడా
మనకు
కనుపించదు.
సమస్త
శక్తులకు
నిలయుడు
మానవుడు
సమస్త
దివ్యగుణములకు
నిలయము
మానవుడు.
అట్టి
మానవుని
మానవునిగా
గుర్తించక
దానవునిగా
ప్రవర్తించటం
యిది
సరియైనది
కాదు.
కావునే
యిట్టి
మానవుని
యందు
నిరంతరము
బ్రహ్మయజ్ఞం
జరుగుతూనే
వుంది.
ఇది
సర్వకాల
సర్వావస్థల
యందు
యీ
నామ
ఉచ్ఛారణ
జరుపుతూ
ఆహుతి
సల్పుతూనే
వుంటుంది.
స్వహాకారములు
సల్పుతూనే
వుంటుంది.
ఆ
స్వాహాకారమే
శ్వాసాకారము.
అదే
సోహం.
సోహం.
యీ
శ్వాసయందున్న
సో
నేనే
దైవము
నేనే
దైవము
అనే
దివ్యమైన
మంత్రం
చేతనే
ఆహుతి
చేస్తున్నది.
కనుక
వేదములనేవి
కేవలం
ఒక
గ్రంథరూపంలో
కాకుండా
మానవుని
యందు
భావరూపములో
యిమిడి
వుంటున్నాయి.
దీనికి
మరొక
ఉదాహరణము.
యజ్ఞములో
మాటిమాటికి
ఇంద్రుని
ఆహ్వానం
చేస్తూ
వుంటారు.
ఈ
ఇంద్రుడనగా
ఎవరు?
ఏదో
ప్రత్యేకమైన
దేవత
కాదు.
ఇంద్రియముల
కధిపతి.
మన
మనస్సే
యింద్రుడు.
ఈ
యింద్రునికి
మరొక
పేరు
కూడా
వుంది
పురుహూతుడు
అని.
పురు
అనగా
మాటిమాటికి
పిలవటం.
హూతుడు
అనగా
ఆహ్వానం
చేయటం,
అనేక
పర్యాయములు
ఆహ్వానం
చేయించుకునే
వాడు
కనుకనే
యితనికి
పురుహూతుడు
అని
మరొక
పేరు.
ఈ
ఇంద్రునికి
మరొక
పేరు
కూడా
వుంది.
రుద్రుడు.
ఇంద్రియములకధిపతిగా
వున్న
మనస్సు
ఇంద్రునిగాను
ఇంద్రియములను
స్వాధీనం
చేసుకున్న,
సర్వత్రా
వ్యాపించిన
తత్వమునకే
రుద్రుడు
అని
పేరు.
ఏతావాతా
మనస్సు,
ఇంద్రుడు,
రుద్రుడు
ఒక్కరే.
ఆయా
కర్మలాచరించే
సమయములో
ఆయా
పేర్లను
ధరిస్తుంటుంది.
ఒక
చిన్న
ఉదాహరణము.
లౌకిక
జగత్తునందు
చిన్న
ఆదర్శమును
తీసుకుందాము.
ఒక
బ్రాహ్మణుడు
వుంటాడు.
ఒక
దేవాలయములో
పూజ
చేస్తూ
వుంటాడు.
అతనిని
పూజారి
బ్రాహ్మణుడని
అంటారు.
ఇంకొక
చోట
పంచాంగము
చదువుతూ
వుంటాడు
అతనిని
పంచాంగం
బ్రాహ్మణుడంటారు.
మరొక
చోట
వంట
చేస్తుంటాడు
అతనిని
వంట
బ్రాహ్మణుడంటారు.
మరొక
చోట
విద్యనేర్పుతూ
వుంటాడు.
అక్కడ
అధ్యాపక
బ్రాహ్మణుడంటారు.
ఈ
పనులను
బట్టి
యీ
పేర్లు
వచ్చాయిగాని
అందరూ
బ్రాహ్మణులే.
అదేవిధముగనే
మనసు,
ఇంద్రుడు
రుద్రుడు
అనేవి
వారు
చేసే
కర్మలను
పురస్కరించుకొని
వారికీ
పేర్లు
వచ్చాయి.
కనుక
క్రియారూపంలో
ఆవిర్భవించే
దివ్యత్వాన్ని
బట్టియే
మనయొక్క
మంచిచెడ్డలు
కూడా
రూపొందుతూ
వుంటాయి.
కనుక
అన్నింటికిని
కర్మయే
ప్రధానము.
కనుక
వేదమునందు
కర్మకాండను
ప్రధానమైన
స్థానములో
పెట్టారు.
ఇట్టి
కర్మకాండయందే
దివ్యమైన
మానవాకారము
కూడను
నిరూపిస్తూ
వచ్చింది.
దశరథుని
యింటిలో
రామలక్ష్మణ
భరత
శతృఘ్నులనే
నల్గురు
బాలురు
నిరంతరము
సంచారం
సల్పుతుంటారు.
5
▾
Meaning
Keep
ఆడుతూ
వుంటారు.
పాడుతూ
వుంటారు.
ఆనందిస్తూ
వుంటారు.
ఎవరు
వీరు
అని
విచారణ
చేస్తే
వేదమే
వీరి
యొక్క
స్వరూపాన్ని
నిరూపణ
గావిస్తూ
వచ్చింది.
సాక్షాత్తు
ధర్మమునే
ఆకారముగా
ధరించినవాడు
రాముడు.
ఇతడే
యజుర్వేదము.
ఈ
యజుర్వేదమనే
రామనామమును
ఆశ్రయించి
తన
వాక్యమును
తన
కార్యమును
నిరంతరం
వల్లెవేసే
వాడు
లక్ష్మణుడు.
ఇతనే
ఋగ్వేదము.
రామనామమునే
ఒక
గానముగా
వుచ్చరించుకుంటూ,
యీ
గానములో
తన
జీవితమును
లీనము
గావించుకున్న
వ్యక్తి
భరతుడు.
అతడే
సామవేదము.
అంతర్
బహిర్
శక్తులను
అణగద్రొక్కి
యీ
ముగ్గురి
ఆజ్ఞలను
శిరసావహించి
శతృసంహారం
గావించిన
శతృఘ్నుడే
అధర్వణవేదము.
కనుక
ఋగ్వేద,
సామవేద,
యజుర్వేద,
అధర్వణవేదములన్నీ
కూడను
రామలక్ష్మణ
భరత
శతృఘ్నుల
స్వరూపములో
యీ
దశరథుని
యింటిలో
ఆడుకుంటున్నారు.
ఐతే
యీ
దశరథుడు
ఎవరు?
ఇతనొక
చక్రవర్తి
కాడు.
ఐదు
కర్మేంద్రియములు,
ఐదు
జ్ఞానేంద్రియములు
యీ
దశేంద్రియములు
చేరిన
రథమే
యీ
దేహము.
ఇదే
దశరథుడు.
దశేంద్రియ
రథమైన
యీ
దేహమునందు
ఋగ్వేద,
యజుర్వేద,
సామవేద,
అధర్వణవేదములనే
బాలురు
రామలక్ష్మణ
భరత
శతృఘ్నులుగా
ఆవిర్భవించారని
అర్థము.
వీరు
సూర్యవంశపు
వారని
పేరు.
ఇక్కడ
సూర్యుడనగా
బాహ్య
సంబంధమైన
రూపములో
మనం
విచారించినప్పుడు
సూర్యుడున్నాడు
చంద్రుడున్నాడు.
భూమి
వున్నది.
ఈ
భూమి
ఎక్కడనుండి
వచ్చినది?
సూర్యుని
నుండి
వచ్చినది.
ఈ
చంద్రుడెక్కడనుండి
వచ్చాడు?
భూమినుంచి
వచ్చాడు.
కనుక
చంద్రుడు,
భూమి
సూర్యుని
నుండి
ఆవిర్భవించినవే.
సూర్యుని
లోని
కొన్ని
భాగములే.
నిజముగా
విచారణ
చేస్తే
సూర్యుడే
లేకపోతే
యీ
జగత్తే
లేదు.
జనన
మరణములే
లేవు.
ఏ
విధమైన
ఆకారమే
లేదు.
కనుక
సూర్యుని
ప్రధానమైన
దేవతగా
ఆశ్రయిస్తూ
వచ్చారు.
సూర్యుడే
ప్రత్యక్షదైవంగా
విశ్వసిస్తూ
వచ్చారు.
ఈ
సూర్యుని
యొక్క
అంశములు
ప్రతి
మానవుని
యందు
వుంటున్నవి.
ప్రతి
మానవుడు
కూడను
సూర్యుని
యొక్క
కిరణముల
నుండి
ఆవిర్భవించినవాడే.
మనలో
వున్న
వెలుగే
సూర్యుని
యొక్క
కిరణము.
అతని
వెలుగు
మనలో
వుండటంచేత
అతని
అంశము
కూడను
మనలో
వుంటున్నది.
సూర్య
అంశమైన
ప్రతి
మానవుడు
కూడను
సూర్యవంశమునకు
చెందినవాడే.
రాముడు
ఎవరంటే
సూర్యవంశము
వాడన్నారు.
కనుక
ప్రతి
మానవునియందు
ఆత్మారామ
అనే
తత్వము
సూర్య
అంశముతో
కూడినది
కనుక
అది
సూర్యవంశముగా
రూపొందింది.
కనుక
రాముడనగా
కేవలము
దశరథ
మహారాజు
కుమారుడే
కాదు.
మీరందరూ
రామస్వరూపులే.
మీ
అందరి
యందు
యీ
సూర్యవంశము
నిలచి
వున్నది.
అట్టి
సూర్య
అంశమునే
సూర్యవంశముగా
విశ్వసించి
సూర్యవంశపు
రాజైన
రామచంద్రుడే
విధముగా
దుష్టసంహారం
గావించాడో,
శిష్టపరిపాలన
గావించాడో
అటులనే
మీయందున్న
దురాలోచనలు,
దుర్గుణములు,
దుర్బుద్ధులను
సంహరించి
సద్గుణములను,
సదాచారములను
పోషించటానికి
కృషి
చేయండి.
ఇదే
ప్రతి
మానవుడు
ప్రతిక్షణమందు
చేయవలసిన
యజ్ఞము.
6
▾
Meaning
Keep
కనుక
యజ్ఞమనగా
కొన్ని
వేదికలు
నిర్మించి,
ఋత్విక్కుల
నాహ్వానించి
తద్వారా
అనేక
ద్రవ్యములనంతా
ఆహుతి
చేసి
యీ
విధముగా
మంత్రములుచ్ఛరించటం
మాత్రమే
కాదు.
కేవలం
ఉపాధి
బేధముల
చేతనే
మనం
యిన్ని
విధములైన
అపమార్గములను
పడుతున్నాము.
ఉపాధి
బేధములను
మనం
త్యజించినప్పుడు
అందరియందు
దివ్యత్వమైన
చైతన్యము
ఒక్కటిగానే
వుంటుంది.
ఇక్కడ
సజాతి,
విజాతి,
స్వగత
బేధములున్నాయి.
సజాతి
అనగా
ఏమిటి?
మనం
ప్రాకృతంగా
చూచినప్పుడు
చెట్టు
చెట్టు
యీ
రెండు
స్వజాతి.
అదియే
చెట్టైనాకాని.
వేపచెట్టు
కావచ్చు.
మామిడి
చెట్టు
కావచ్చు.
రావి
చెట్టు
కావచ్చు.
చెట్టు
చెట్టే.
అది
స్వజాతి
బేధముగాని
పేర్లు
వేరువేరుగా
వుండవచ్చును.
ఇది
వృక్ష
జాతి.
ఇది
సజాతి.
జాతి
అనగా
యిక్కడ
వృక్షమునకు,
ఒక
శిలకు
సంబంధము
లేదు.
ఇది
విజాతి
బేధమన్నారు.
స్వగత
బేధమనగా
యేమిటి?
మనం
ఒక
విత్తనం
నాటేటప్పటికి
అది
అనేక
కొమ్మలతో
రెమ్మలతో
అభివృద్ధి
అవుతుంది.
అది
శాఖోపశాఖలుగా
రూపొందుతుంది.
ఇందులో
ఎన్నో
ఆకులు,
పూలు,
కాయలు
రూపొందింపచేస్తుంది.
ఐతే
ఎన్ని
కొమ్మలుండినా,
ఎన్ని
ఆకులు,
ఎన్ని
పూలు,
ఎన్ని
కాయలుండినప్పటికి
యివన్నీ
ఒక
విత్తనమునకు
సంబంధించినవేగాని
అన్యము
కాదు.
దీనినే
స్వగత
బేధమన్నారు.
ఈ
మూడింటి
యొక్క
అంతరార్థము
ఏమిటి?
రూపనామములు
తీసివేస్తే
అన్నింటి
యందు
వున్న
చైతన్యమొక్కటే.
ఇది
ఆకు
అన్నాము.
ఈ
ఆకు
ఎక్కడనుండి
వచ్చింది.
ఆ
విత్తనము
నుండే
వచ్చింది.
ఇది
పువ్వు
అన్నాము.
దాని
రూపనామములు
వేరుగా
వుండవచ్చును.
కాని
విత్తనం
ఒకటే.
ఏకత్వములో
అనేకత్వము
యిమిడి
వుంటున్నది
అనే
సత్యానికి
యిదే
ప్రమాణము.
ఇలాంటి
విషయములను
వేదము
అనేకంగా
నిరూపిస్తూ
వచ్చింది.
కాని
యీ
వేదమునందున్న
అంతరార్థములుగాని
మానవుడు
గుర్తించటానికి
తగిన
ప్రయత్నము
చేయటంలేదు.
కనుక
ప్రతి
దాని
యందు
కూడను
ఒకదానికొకటి
సన్నిహిత
సంబంధ
బాంధవ్యమేర్పడి
వుంటుంది.
సూర్యుడే
లేకపోతే
భూమియు
లేదు.
భూమి
లేకుంటే
చంద్రుడే
లేడు.
సూర్య
భూమి,
చంద్రులే
లేక
జగత్తే
లేదు.
ఈ
రూపనామములు
వేరువేరు
అయినప్పటికిని
దివ్యత్వము
ఒక్కటిగానే
వుంటుంది.
అట్టి
దివ్యత్వాన్ని
గుర్తింపచేసే
నిమిత్తము
పూర్వము
యీ
యజ్ఞయాగాదులు
ప్రారంభమయ్యాయి.
కాని
దీని
యొక్క
అంతరార్థమును
మానవులెవరు
విచారించక
కేవలము
బాహ్యమైన
కర్మలను
మాత్రం
దృష్టి
యందుంచుకొని
యిదంతా
కేవలము
ధనము
వ్యర్థం
చేస్తున్నారనే
భావములో
దీనిని
తిరస్కరిస్తున్నారు.
మానవత్వమునకు
మించిన
దివ్యత్వము
మరొకటి
లేదు.
మానవునికంటె
గొప్పవాడు
మరొకడు
యీ
జగత్తులో
లేడు.
మానవుని
కంటె
విలువైన
వస్తువు
యీ
జగత్తులో
మరొకటి
లేదు.
ఒక
వస్తువుకుగాని,
ఒక
వజ్రమునకుగాని
లేక
బంగారమునకుగాని
వెలకట్టే
వాడెవరు?
7
▾
Meaning
Keep
Also in his talks
(14)
30 July 1987
To nurture sacred feelings in the heart is education
28 May 1990
The Three Gunas
16 September 1990
Discipline is like our very life-breath
20 October 1990
The day that wrought the great change
14 January 1992
All learning that lacks humility and obedience is the learning of a rākṣasa!
22 September 1996
Though Forms and Names Differ, the Principle of Brahman Is One!
14 April 1998
God pervades all
23 April 1998
Human Life Is Most Precious
26 April 1998
All Beings Are Parts of God
11 October 1998
Human Life Is the Fruit of Our Resolves
9 October 2001
God in human form
20 November 2001
Spiritual education is essential alongside worldly education
1 March 2003
Lasting Ānanda is gained only through satsaṅga
2 May 2006
The body itself is the temple; you yourself are God
మానవుడే.
ప్రపంచములో
ఏ
విలువైన
పదార్థములున్నాయో,
వీనికి
విలువకట్టే
వాడు
మానవుడే.
అన్నింటికి
విలువకట్టే
మానవునకీనాడు
విలువ
లేకుండా
పోయింది.
కారణమేమనగా
తనయొక్క
స్వరూపాన్ని
తాను
మరచిపోవటమే.
స్వరూపాన్ని
మరచిపోవటం
కేవలము
ఒక
విధమైన
భావరూపాన్ని
మాత్రం
విశ్వసించి
తద్వారా
బాహ్యమైన
ఉపాధినే
ఆశ్రయిస్తూ
వస్తున్నారు.
ఈ
అనిత్యము,
అశాశ్వతముయైన
దేహమునందే
నిత్యసత్య
నిర్మలమైన
దివ్యత్వము
వున్నదనే
సత్యాన్ని
వారు
గుర్తించటం
లేదు.
దేహమునందే
దేహి
వున్నాడు.
శరీరమునందే
శరీరి
వున్నాడు.
ఈ
క్షేత్రమునందే
క్షేత్రజ్ఞుడు
వున్నాడు.
క్షేత్రజ్ఞుడే
లేకపోతే
క్షేత్రమునకేమి
విలువ
లేదు.
కాని
క్షేత్రమనే
బండికి
విలువ
యిస్తున్నారు.
కాని
క్షేత్రజ్ఞుడనే
గుఱ్ఱమును
పోషించటం
లేదు.
గుఱ్ఱమును
వెనుక
పెట్టి
బండి
ముందు
వేస్తే
ప్రయాణం
ఎలా
సాగుతుంది.
అదే
విధముగనే
యీనాడు
దివ్యత్వమైన
ఆత్మతత్వాన్ని
వెనుక
పెట్టి
కేవలం
బండివంటి
దేహమును
మాత్రమే
ముందు
పెట్టి
జీవితయాత్ర
సలుపుతున్నాడు.
తద్వారా
గమ్యమును
వీడు
చేరలేకపోతున్నాడు.
కనుక
మానవత్వంలో
వున్న
పవిత్రతను
యీ
వేదముద్వారా
మనం
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
వేదమనగా
విద్యస్వరూపము.
విద్యుత్
కరణము
విద్యాసారము.
వేదము,
వేదాంగము
వేదవిదుడు
మువ్వురూ
ఒక్కటే
అనే
ఏకత్వాన్ని
నిరూపిస్తూ
వచ్చింది.
ధ్యానము,
ధేయము,
ధ్యాస
యీ
ఏకత్వమే
విధముగా
మనకు
సంభవిస్తుందో
అదే
విధముగనే
దివ్యత్వము
పవిత్రము
ప్రకృతియొక్క
తత్వము
మూడింటి
యొక్క
యేకత్వం
మనకు
ప్రాప్తిస్తుంది.
కనుక
ప్రతి
మానవుడు
తనలో
ఆవిర్భవించే
భావములకు,
భావములకు
తగిన
పలుకులకు,
పలుకులుకు
తగిన
క్రియలకు
మూడింటికి
సంబంధమేర్పరచుకోవాలి.
దీనినే
The
proper
study
of
mankind
is
man.
అన్నారు.
మనిషి
అంటే
ఏమిటి?
తన
తలంపులు,
పలుకులు,
క్రియలు
మూడింటిని
ఏకం
గావించాలి.
అదియే
వేద
మంత్రమునందు
త్రిదళం
త్రిగుణాకారం
త్రినేత్రంచ
త్రియాయుధం
త్రిజన్మ
పాప
సంహారం
ఏకబిల్వం
శివార్పణం.
అన్నారు.
దీనిని
పురస్కరించుకొని
చెప్పారు.
పత్రం
-
మన
దేహము.
పుష్పం
-
మన
హృదయం
ఫలం
-
మన
మనస్సు.
తోయం
-
మన
ఆనందభాష్పములు.
వీటిని
భగవదర్పితము
గావించమని
కోరింది.
ఈనాడు
లోకములో
ధనవంతుడున్నాడు.
గుణవంతుడున్నాడు.
బలవంతుడున్నాడు.
విద్యావంతుడున్నాడు
కానీ
ఆత్మవంతుడు
కనుపించటంలేదు.
ఆత్మభావమును
మరచి
యీ
ధనము,
బలము
గుణము
ఎంతో
కాలం
నిన్ను
ఆశ్రయిస్తాయి
మన
దేహబలమనేది
కేవలం
తెల్లవారి
విచ్చిన
పువ్వు
సాయంకాలమునకు
వాడిపోయినట్లుగా
దేహం
వృద్ధాప్యం
పొందుతుంది.
మన
దేహము
యొక్క
బలము,
ఆస్తిపాస్తులు
ఎప్పుడు
పోతాయో
ఎప్పుడు
వస్తాయో
తెలీదు.
8
▾
Meaning
Keep
Also in his talks
(1)
26 May 1991
Prasnopanishad - Answers To The First Student
కనుక
యివన్ని
అశాశ్వతమైనవే.
ఇటువంటి
అశాశ్వతాన్ని
శాశ్వతంగా
విశ్వసించి,
శాశ్వతాన్ని
అశాశ్వతముగా
భావించి
మానవుడిన్ని
విధములైన
దుఃఖములకు
గురౌతున్నాడు.
ప్రేమస్వరూపులారా!
ఎద్ది
కలదనుచుంటిరో
అద్దిలేదు
ఎద్ది
లేదనుచుంటిరో
అద్ది
కలదు
వున్న
దొక్కటె
దైవంబు
ఎన్నటికిని
మరువబోకు
డిట్టి
మంచిమాట.
వున్నది
వున్నది
అనుకుంటున్నాం.
వున్నదంతా
కూడా
లేనిదే.
ఎంతవరకు
మనకు
సత్యంగా
వుంటుంది.
జాగ్రత్తలో
చూచినది
నిద్రలో
మరచిపోతున్నాము.
స్వప్నములో
కనుపించినది
జాగ్రత్తరాగానే
అలక్ష్యము
చేస్తున్నాము.
జాగ్రత్తది
స్వప్నంలో
లేదు.
స్వప్నముది
జాగ్రత్తలో
లేదు.
ఒక్క
దినములోనే
రెండు
అవస్థలు
ఒకదానికొకటి
విరుద్ధముగా
కలుగుతున్నాయి.
ఇట్టి
క్షణభంగురమైన
సత్యాన్ని
మనం
విశ్వసించి
శాశ్వతమైన
సత్యాన్ని
విస్మరించటం
మానవత్వానికి
తగిన
అర్థం
కాదు.
కనుకనే
వేదములన్నీ
యిట్టి
దివ్యత్వాన్ని
ప్రబోధించి
మానవుని
మానవుడుగా
జీవించమని
కోరుతూ
వచ్చింది.
ఈ
విధమైన
అంతరార్థములతో
కూడిన
వేదము
కేవలము
ఒక
మంత్రము
మాత్రమే
కాక
దీనికి
తగిన
ప్రబోధలు
కూడా
యిందులో
యిమిడి
వున్నాయి.
కర్మోపాసన,
జ్ఞాన
కాండలన్ని
కూడను
వేదములో
ప్రధానమైన
రాజమార్గములు.
సాటి
మానవుల
యొక్క
సహజత్వము,
సానుభూతి
చూపటమే
మానవుని
యొక్క
ప్రధాన
తత్వమన్నారు.
తోటి
మానవులు
బాధపడుతుండగా
వారిని
చూచి
సరియైన
ఆదర్శమును
అందించాలి.
సహకారమును,
సానుభూతిని
చూపాలి.
ఈ
విధమైన
భావములీనాడు
మానవుని
యందు
కనుపించటం
లేదు.
కేవలం
స్వార్థము,
స్వప్రయోజనము
పెరిగిపోయి
విశాల
భావములీనాడు
విస్మరించి
పోయినారు.
మానవుడు
విశాలమైన
తత్వాన్ని
అర్థం
చేసుకోవాలి.
వింటున్నాము
దినము
యెన్నో
మంచిమాటలు.
చూస్తున్నాము
ఎన్నియో
మంచికర్మలు.
కాని
ఒక్కటైనా
మనలో
నిలువకల్గుతోందా?
లేదు.
కేవలం
యీ
విధమైన
జీవితము
ఎన్ని
చూచినా
వినినా
ఎంత
కాలము
వుండినప్పటికిని
నిరుపయోగమైనవే.
ఏకించిత్తైనా
మనలో
జీర్ణింప
చేసుకునే
శక్తిని
మనం
సంపాదించాలి.
మానవత్వం
చాలా
పవిత్రమైనది.
దివ్యమైనది.
జీవించ
తగినది.
చాలా
విలువైనది.
ఇట్టి
విలువైన
జీవితాన్ని
మనం
వ్యర్థము
గావించుకోరాదు.
భౌతికమైన
సుఖసంతోషములే
ప్రధానముగా
ఎంచరాదు.
ఇవి
కదలిపోయే
మేఘముల
వంటివి.
చెదిరిపోయే
మేఘముల
వంటివి.
దీనిని
ఆధారముగా
తీసుకుని
మనము
జీవితం
సాగించటం
సరియైనది
కాదు.
ఐతే
యీ
లోకములో
మనం
వుండవలసిందే.
ఈ
లోకమును
వదలుటకు
వీలు
కాదు.
9
▾
Meaning
Keep
దీనిని
ఒక
ఆధారంగా
ఆదర్శంగా
తీసుకుని
జీవితమనే
సాగరం
దాటటానికి
ప్రయత్నించాలి.
నావను
ఆధారం
చేసుకుని
గట్టునకెలా
చేరుతున్నామో,
దేహమనే
నావను
ఆధారంగా
చేసుకొని
దివ్యత్వమనే
ఆత్మతత్వాన్ని
మనం
చేరాలి.
ఇదే
మన
ప్రయాణము
యొక్క
రహస్యము.
ఎక్కడ
నుండి
వచ్చాము?
ఎక్కడికి
పోతున్నాము?
ఏమి
చేస్తున్నాము?
ఇది
ఏమాత్రము
మనం
విచారించటం
లేదు.
చిన్న
విషయాలలో
మీరు
యెంతో
విచారించవచ్చు.
ఒకరికి
letter
వ్రాసి
దానిని
కవరులో
పెట్టి
అంటించి
దానిని
పోస్టు
బాక్సులో
వేస్తే
అది
ఎక్కడికి
పోతుంది.
జాబేమో
వ్రాసినావు.
విలువైన
కవరులోనే
పెట్టినావు.
పోస్టుచేశావు
కాని
అందులో
from
address
లేదు
to
address
లేదు.
from
address
వుంటే
తిరిగి
నీకైనా
చేరుతుంది.
లేక
to
address
వుంటే
వానికైనా
చేరిపోతుంది.
రెండు
లేని
letters
ఏమి
చేస్తారు.
dead
letter
office
లో
వేస్తారు.
కాల్చివేస్తారు.
కనుక
మీ
జీవితములంతా
యిదే
రీతిగా
వుంటున్నాయి.
మనము
ఎక్కడ
నుండి
వచ్చాము
మనం
తెలుసుకోటం
లేదు.
మన
ప్రవర్తన
ఆధారము
చేసుకొని
మనము
ఎక్కడ
పోగలమని
టు
ఎడ్రస్సును
తెలుసుకోటం
లేదు.
వున్న
చోటే
వున్నాము.
ఈ
విధముగా
వ్యర్థం
గావించుకుంటున్నాము.
ఇది
సరియైనది
కాదు.
విచారణ
చెయ్యాలి.
చిన్న
చిన్న
విషయాలు
సైన్సులో
పరిశోధన
చేస్తూ
వుంటారు.
ఈ
భౌతికమైన
పరిశోధనలో
వచ్చిన
ఫలితము
యేమిటుంది
మనకు.
మంచి
ఉత్తమ
డిగ్రీని
పొందవచ్చును.
ఉత్తమ
ఉద్యోగములు
చేయవచ్చును.
కావలసినంత
ధనము
సంపాదించవచ్చును.
ఆ
ధనముతో
భౌతికమైన
సుఖములు
పొందవచ్చును.
అంతేనా
దీని
యొక్క
లక్ష్యము.
ఇదేనా
జీవిత
అంతరార్థము.
కాదు
కాదు
కాదు.
మనము
వచ్చినటువంటి
తత్వము
చక్కగా
అర్థము
చేసుకోటానికి
ప్రయత్నించాలి.
ఎవరికి
వారంతా
what
is
the
purpose
of
life
ఈ
జీవితము
యొక్క
రహస్యము
ఏమిటి?
అంతరార్థము
ఏమిటి
అని
ప్రశ్నించుకోవాలి.
ఏ
ప్రశ్నలు
వేసుకోటం
లేదు.
ఏ
విషయమును
మనం
విచారించటము
లేదు.
తనకు
తగిన
విషయాన్ని
అనవసరమైన
విషయాలని
అంతకూడను
ప్రొద్దున్న
newspaper
వచ్చిందంటే
గంటసేపు
దానిని
కూర్చుని
చదువుతూ
వుంటావు.
ఏ
దేశములో
ఏ
రాష్ట్రములో
ఎవరివల్ల
యేమి
జరిగిందో
అన్ని
తెలుసుకుంటూ
వుంటాం.
తననుంచి
న్యూస్
వస్తున్నదా
న్యూసెన్సు
వస్తున్నదా
చూచుకోటం
లేదు.
తనదానిని
తాను
చూచుకోకుండా
జగత్తు
యొక్క
విషయాన్ని
తెలుసుకుంటే
వచ్చే
ఫలితమేమిటి?
కనుకనే
వేదాంతమునందు
తనను
తాను
తెలుసుకోమని
చెప్పింది.
తనను
తాను
తెలుసుకున్న
వాడే
సర్వము
తెలుసుకోగలడు.
ఈ
తెలుసుకునే
విధానం
తగిన
వారివద్ద
చేరి
వారి
సలహాను
తీసుకుని
తద్వారా
మీరు
సరియైన
అర్థాన్ని
గుర్తించటానికి
ప్రయత్నించాలి
లేక
యివన్ని
వ్యర్థమని
మీరు
భావించినప్పుడు
కేవలము
విశ్వాసమైనా
పెంచుకోవాలి.
ఏ
విశ్వాసాన్ని!
దైవవిశ్వాసము
లేకపోయినా
ఫరవాలేదు.
మిమ్మల్ని
మీరు
విశ్వసించే
విశ్వాసము
పెంచుకోవాలి.
10
▾
Meaning
Keep
From
Bhaja Govindam, verse 1
Also in his talks
(10)
22 May 1973
The Deluded Mind and the Liberated Mind
1 June 1989
Man is the son of immortality!
3 September 1990
Devotion and self-sacrifice
15 January 1996
Only one who masters the mind can reach Mādhava
16 June 1996
If the Body Is to Be Pure, Remember the Name of God
7 September 1996
Advaita Is the Principle of the One Ātma
28 May 1998
Not the Man in Form: the Man of Conduct Is Needed
10 September 1998
By Sacrifice Some Have Attained Immortality
15 April 2003
Ancient traditions are the steps to rising higher
25 December 2003
Give up the illusion of the body, and you yourself are God
తనను
తాను
నమ్మనివాడు
ఎవ్వరినీ
నమ్మలేడు.
తనను
తాను
విశ్వసించటమే
పెద్ద
నమ్మకము.
తద్వారా
యింక
దేనినైనా
విశ్వసించవచ్చు.
ఈనాడు
దైవమును
విశ్వసించని
వాడెవరంటే
తనను
తాను
విశ్వసించని
వాడే
దైవాన్ని
విశ్వసించడు.
కనుక
విశ్వాసమే
మన
శ్వాసముగా
భావించాలి.
విశ్వాసము
లేనివానికి
శ్వాసము
వుండదు.
అలాంటివాడు
living
death
జీవించి
మృతుడైనవాడు.
కనుక
ఆ
విధముగా
మనము
జీవించరాదు.
దివ్యమైన
భావాన్ని
మనం
అభివృద్ధి
గావించుకోవాలి.
కనుక
భజగోవిందం
భజగోవిందం
గోవిందం
భజ
మూఢమతే
సంప్రాప్తే
సన్నిహితే
కాలే
నహి
నహి
రక్షతి
డుకృఞ్కరణే.
అటులనే
యీ
విద్యలన్నీ
కూడను
అంత్యములో
మీరెంత
స్మరించినప్పటికిని
యివి
మిమ్ములను
రక్షించవు.
ఒక్క
దైవమే
సర్వరక్షకుడు.
రక్షించే
దైవాన్ని
మనము
స్మరించాలి.
కాని
బాధించే
వానిని
స్మరించటం
చేత
మరింత
బంధనలో
మునిగిపోతాము.
కనుక
యీ
భావమును
దాటే
మార్గానికి
ప్రయత్నించండి.
Previous
←
You Are the Embodiment of Ānanda
Next
All Human Life Is the Very Form of Yajña
→