Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1990 · The Ātma Principle
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Ātma Principle
29 May 1990, Summer Course 1990, Brindavan
1
▾
Meaning
Keep
మృదుహృదయానామ్
సౌమ్యం
దైవమ్
ప్రియరూపానామ్
రమ్యం
దైవమ్
తత్వజ్ఞానాం
విశ్వం
దైవమ్
గుణరిపురీనాం
శూన్యం
దైవమ్.
ప్రేమస్వరూపులారా!
అహమాత్మా
గుడాకేశ
సర్వభూతాశయస్థితః
అహమాదిశ్చ
మధ్యంచ
భూతానామన్త
ఏవచ.
అర్జునా!.
నేను
ఆత్మను.
సర్వభూతములయందు
వుండినవాడను
నేనే.
ఆది
మధ్య
అంతము
కూడను
నేనే.
ఈ
చరాచరప్రపంచమునందు
గోచరించునదంతయు
ఆత్మతత్వమే.
ఆధ్యాత్మిక
క్షేత్రమందు
అడుగడుగున
వినిపించునది
ఆత్మనే.
కనుపించునది
ఆత్మనే.
అనిపించునది
ఆత్మనే.
మైమరపించునది
ఆత్మనే.
లోకమునందు
ఆత్మకానిది
మరొకటి
లేదు.
ఈనాడు
మానవుడు
సాధించవలసినది
ఆత్మనిష్టయే.
స్వస్వరూపసంధానమే
ఆత్మనిష్ట.
తనను
తాను
గుర్తించుకోటమే
ఆత్మజ్ఞానము.
మానవత్వమునందు
ప్రప్రథమములో
మనము
సాధించవలసినది
ఆత్మానందమే.
మనము
నిరంతరము
జ్ఞప్తియందుంచుకొనవలసినది
ఆత్మతత్వమే.
ఆత్మనే
ఎరుక
అని
పిలవబడుతుంది.
ఈ
ఎరుకనే
సర్వభూతముల
యందు
నేను
నేను
అనే
స్ఫురణ
కలిగిస్తుంది.
ఈ
స్ఫురణ
శక్తియే
అహం.
ఈ
అహం
దేహముతో
తాదాత్మ్యము
పొందినప్పుడు
ఇది
అహంకారముగా
రూపొందుతుంది.
ఇదే
మిథ్యా
నేను.
ఇది
సత్యమైన
నేను
కాదు.
ఐతే
యీ
ఆత్మకు
అనవరతము
అడ్డుతగులుతుంది
మనస్సు.
సూర్యుని
నుండి
తన
వేడివల్ల
ఆవిర్భవించిన
మేఘములు
సూర్యుని
ఏవిధముగా
మరుగు
చేయుచున్నదో
అదేవిధముగనే
ఆత్మనుండి
పుట్టిన
మనస్సు
మనోసంఘాతమైన
మేఘములు
అడ్డుతగులుతున్నాయి.
మనస్సు
వుండినంతవరకు
మానవుడు
ఆత్మతత్వాన్నిగాని
ఆత్మజ్ఞానమునుగాని,
ఆత్మవిషయాన్నిగాని
అర్థము
చేసుకోలేడు.
సర్వకాల
సర్వావస్థలయందు
ఆత్మను
గుర్తించే
స్థితి
కలిగిన
వానికే
సాక్షాత్కారమని
చెప్పబడుతుంది.
2
▾
Meaning
Keep
Also in his talks
(3)
8 January 1988
The Dharma of the Ātma is svadharma
7 July 1988
Divinity forgotten: that is the state of the jīva
24 November 1990
Share in Bhagavan's love
ఈ
ఆత్మనుండి
మొట్టమొదట
వినిపించే
శబ్దము
నేను.
ఈ
నేను
అనే
శబ్దము
పుట్టిన
తరువాతనే
సృష్టి
అంతయు
ప్రారంభమైంది.
నేను
లేకుండిన
సృష్టియే
లేదు.
ఈ
నేను
అనునది,
బ్రహ్మ
అనునది,
ఆత్మ
అనునది
యివన్నీ
కూడను
పర్యాయ
పదములు.
మనోరహితమైన
నేను
స్వస్వరూపమైన
ఆత్మ.
మనోసహితమైన
నేను
మిథ్యాత్మ.
ఉన్నది
ఒకే
ఆత్మ.
అదే
నేను.
కాని
ఆత్మతో
కూడిన
దివ్యత్వాన్ని
అనుభవించే
నిమిత్తమై
మానవుడు
అనేక
సాధనలు
చేస్తున్నారు.
నిజమంగా
ఆత్మాన్వేషణ
నిమిత్తమై
సల్పే
సాధనలన్నియూ
అజ్ఞానదశలో
ఆచరించే
కర్మలే.
ఈ
సాధనలన్ని
జ్ఞానియందు
కానరావు.
జ్ఞానికి
సాధన
సాధ్యము
అనే
వ్యత్యాసమే
వుండదు.
వున్నది
ఒక్కటే.
ఏకం
సత్.
ఇట్టి
ఏకత్వమును
పొందే
నిమిత్తమై
మానవుడు
సాధనలు
చేస్తున్నాడంటే
యిది
కేవలము
మానసిక
సంతృప్తి
నిమిత్తము
చేసే
ప్రక్రియలే.
మనసునే
నిర్మూలము
గావించుకొనవలెనని
వేదాంతము
బోధించుచుండగా
మనసు
సంతృప్తి
పరచే
నిమిత్తమై
చేసే
సాధనలు
కేవలము
బలహీన
పరిచినట్లవుతుంది.
నీవేమైనా
సాధనలు
చెయ్యాలని
సంకల్పించుకుంటే
అనాత్మభావమును
దూరము
గావించుకో.
నీవు
ఆత్మానందమును
అందుకోగోరినప్పుడు
నీ
దృష్టిని
ఆత్మవేపు
మరల్చు.
ఇంతేగాని
మోక్షప్రాప్తి
నిమిత్తమైగాని,
ఆత్మజ్ఞాన
నిమిత్తమైగాని,
ఆత్మానంద
నిమిత్తమైగాని
సాధనలు
చేయటము
ఒక
విధమైన
భ్రాంతియే.
ఇవి
కేవలము
మనోభ్రాంతియొక్క
చర్యలు.
ముక్తి
కోరి
నరుడు
ముక్కోటి
దేవతల
వేడుకొనుచు
నుండి
వెతలు
బోవు
తనదులోని
యహము
దా
జంపుకొన్నచో
ముక్తియిల
లోనె
ముక్తికాడె.
ముక్కోటి
దేవతలను
ఆరాధిస్తున్నాడు
ముక్తి
కోరి
మానవుడు.
ఉన్నది
ఒక్కటే
అని
వేదముగాని
శాస్త్రముగాని,
బైబిలుగాని,
ఖురాన్గాని
ఏ
గ్రంథముగాని
సమాధానపరచి
సత్యాన్ని
బోధించుచుండగా
ముక్కోటి
అనే
సంఖ్యకు
విలువ
యెక్కడ
వుంటున్నది.
కనుక
యివన్నీ
మనోభ్రాంతుల
యొక్క
వికారములే.
మనస్సు
వుండినంత
వరకు
కోరికలు
తప్పవు.
కోరికలు
వుండినంతవరకు
అభిమాన
మమకారములు
వదలవు.
అభిమాన
మమకారములు
వుండినంత
వరకు
అహంకారము
పోదు.
అహంకారము
పోయెంత
వరకు
కూడను
ఆత్మజ్ఞానము
కలుగదు.
కనుక
ఆత్మజ్ఞానముగాని
ఆత్మానందముగాని
ఆత్మ
ధర్మముగాని
మనోనాశనము
చేతనే
సంభవిస్తుందిగాని
అన్యమార్గములో
మనకు
లభ్యము
కాదు.
3
▾
Meaning
Keep
మనసు
బుద్ధి
చిత్తమది
అహంకారంబు
ఎందు
పుట్టి
పెరిగి
యెందడంగు?
అదియె
బ్రహ్మ
అదియె
ఆత్మ..
కనుక
నీ
యొక్క
పుట్టుక
స్థానము
నీవు
గుర్తించే
నిమిత్తమై
నీ
స్వస్వరూపాన్ని
నీవు
గుర్తించే
నిమిత్తమై
అన్యమార్గములందు
నీవు
అన్వేషణ
సల్పిన
యిది
యేరీతిగా
నీవు
పొందగలవు.
ఇది
ఎట్లా
వుందంటే
దొంగ
పోలీసు
వేషము
వేసుకొని
తన్ను
పట్టటానికి
ప్రయత్నించినట్లుగా
వుంది.
నిన్ను
నీవు
గుర్తించుకోటానికి
అన్యసాధన
యెందుకు.
దీనికి
ఒక
చిన్న
కథ
వుండేది.
పది
మంది
మూర్ఖులు
చేరి
నదిని
దాటటానికి
పోయారు.
తిరిగి
నదిని
దాటిన
తరువాత
పదిమంది
వచ్చినామా
లేదా
అనేది
వారి
సందేహము.
ఒకడు
లెక్కపెట్టుటము
ప్రారంభించాడు.
1,
2,
3,
4,
5,
6,
7,
8,
9
అయ్యో
యింకొకడు
లేడే
నదిలో
కొట్టుకుపోయాడని
ఒకరికొకరు
భ్రాంతి
చేత
విచారము
చెందుతూ
వచ్చారు.
నీవు
చెప్పింది
సరికాదు.
నేను
చూస్తానని
వాడు
కూడా
1,
2,
3,
4,
5,
6,
7,
8,
9
అని
నీవు
చెప్పింది
నిజమే
యింకొకడు
లేడే
అని
వాడు
కూడా
ఏడుస్తూ
కూర్చున్నాడు.
అదే
మార్గమునందు
ప్రయాణము
చేస్తున్న
ఒక
బాటసారి
అతను
వివేకవంతుడు.
వారి
యొక్క
బాధను
చూచి
‘నాయనా!
మీరు
దుఃఖించటానికి
కారణము
ఏమిటి’
అని
ప్రశ్నించాడు.
‘మేము
పదిమంది
వచ్చాము
కాని
తొమ్మిదిమందే
వున్నాము
ఇంకొకడు
యీ
నదిలో
కొట్టుకుపోయాడు’
అని
ఏడ్చారు.
వారి
అజ్ఞానమును
గుర్తించి
ఆ
బాటసారి
1,
2,
3,
4...
అని
పదిమందిని
ఎంచి
నాయనా!
మీరు
పదిమంది
వుంటున్నారు
కాని
ఎవరు
ఎంచుచున్నారో
వారు
తనను
తాను
మరచిపోయి
ఎంచుతున్నారు.
కనుకనే
ఒకరు
పోయినట్లుగా
విచారిస్తున్నారు.
తనను
తాను
మరచిన
వ్యక్తి
సరియైన
సత్యాన్ని
గుర్తించలేడు.
నీవే
ఆత్మయై
వుండి
నీవు
ఆత్మ
నిమిత్తమై
మరొకదానిని
ప్రార్థనగాని
సాధనగాని
చేస్తే
నీ
యొక్క
తత్వము
యేరీతిగా
గుర్తించగలవు.
ఏకోహం
బహుస్యాం
ఒక్కటే
అనేకముగా
మారిపోవటం
చేత
భిన్నత్వములో
నీవు
అభిరుచిని
అభివృద్ధి
పరచుకొని
ఏకత్వమును
విస్మరిస్తున్నావు.
ఇవన్నియు
కూడను
అద్దములో
కనుపించే
ప్రతిబింబములవలె
నీ
యొక్క
ప్రతిబింబములే.
బింబమును
వదలి
ప్రతిబింబమును
విశ్వసిస్తున్నావు.
కనుక
నీవు
భ్రమలో
కట్టబడుతూ
వుంటున్నావు.
భ్రమతో
కట్టబడిన
వానికి
బ్రహ్మ
చిక్కడు
కనుక
ఆత్మభావము
మనము
అనుభవించాలనుకుంటే
మనము
చేసే
సాధనలన్ని
కూడను
నిరుపయోగమైనవి.
4
▾
Meaning
Keep
ఐతే
యీ
సాధనలన్ని
కూడను
మనసును
చల్లబరుస్తాయి.
మనసును
చల్లబరచి
ప్రయోజనము
ఏమిటి?
మనసే
లేకుండా
చేసుకోవాలిగాని
మనసు
చల్లబరిస్తే
తిరిగి
వేడెక్కవచ్చు.
కనుక
మనోనాశన
నిమిత్తమై
ఆచరించే
సాధనలే
ఆత్మాన్వేషణకు
సరియైన
సాధన.
ఇక్కడ
మనిషియందు
యీ
దేహాత్మ
భావన
చేరిపోవటంచేతనే
అహం
అనేది
యిన్నిరకములైన
మార్గములందు
త్రిప్పుతున్నది.
నేను
చేస్తున్నాను,
నేను
అనుభవిస్తున్నాను
నేను
దీనిని
జయించాను
అనే
కర్తృత్వ
భావము
మానవుని
యందు
దినదినాభివృద్ధి
చెందుతున్నది.
విద్యార్థులారా!
జయాపజయములు
మీ
కర్మల
వలనగాని,
మీ
సాధనల
వలనగాని,
మీ
ప్రయత్నముల
వలనగాని
కలిగేవి
కాదు.
కేవలము
నీవు
భ్రాంతిలో
మునిగి
నీ
ప్రయత్నము
చేత
యీ
కార్యములు
సాధించినట్లుగా
నీవు
అహంకారమును
మరింత
పెంచుకుంటున్నావు.
ఎన్ని
ప్రయత్నములు
చేసినప్పటికిని
విజయమును
సాధించలేని
కార్యములు
ఎన్ని
మనకు
కనుపించటంలేదు.
ఏమి
చేయకపోయినప్పటికిని
విజయము
పొందే
కార్యములు
ఎన్ని
మనకు
కనుపించటంలేదు.
నీవు
ప్రయత్నము
చేసి
తద్వారా
అపజయము
పొంది
విచారమునకు
గురి
అయ్యేదానికంటె
దైవమును
విశ్వసించి
దైవకార్యముగా
నీ
తత్వాన్ని
నీవు
గుర్తించినప్పుడే
సర్వము
విజయమును
సాధిస్తుంది.
మన
ప్రయత్నములో
జరిగేది
యేమి
లేదనేదాన్ని
మనము
చక్కగా
గుర్తించాలి.
మన
దేహమునందే
యీ
విధమైన
సాక్ష్యము
మనకు
సాక్షాత్కరిస్తుంది.
నీ
దేహములో
వున్న
గుండె
కొట్టుకోటానికి
నీవు
యే
ప్రయత్నము
చేస్తున్నావు.
నీవు
క్షణక్షణమునకు
ఉచ్ఛ్వాస
నిశ్వాసములు
తీసుకుంటున్నావు.
నీవు
దీనికి
యేమి
ప్రయత్నము
చేస్తున్నావు.
నీవు
భుజించిన
ఆహారము
జీర్ణమవుతున్నది.
దానికి
నీవు
యేమి
ప్రయత్నము
చేస్తున్నావు.
ఇవన్నీ
ప్రయత్నములో
లభ్యమవుతున్నాయా.
కాదు
కాదు.
నేను
బ్రతకాలి.
బ్రతకాలి
అనుకుంటే
నీవు
బ్రతకగలుగుతున్నావా?
నేను
చావాలి
చావాలి
అనుకుంటే
నీవు
చస్తున్నావా?
నీవు
పుట్టుటకు
నీవే
కారకుడవా?
కాదు.
కాదు.
కనుక
యీ
విషయమును
చక్కగా
విచారణ
చేస్తే
కేవలము
నీ
కర్తృత్వ
భోక్తృత్వము
తన
అహంకార
మమకారములను
మరింత
అభివృద్ధి
గావించుతున్నాయి.
ఈనాడు
జగత్తులో
మనము
ఆచరించే
సమస్త
కార్యములు
కూడను
మనోతృప్తి
నిమిత్తమై
చేసే
కర్మలే.
ఈ
మనోతృప్తి
ఎంత
కాలము
చేసినప్పటికిని
మనసునకు
తృప్తి
వుండదు.
ఈ
మనస్సంటే
యేమిటి?
మనసే
మాయ.
మనస్సే
కోరిక.
మనసే
అవిద్య,
మనసే
ప్రకృతి.
5
▾
Meaning
Keep
మనసే
భ్రాంతి.
కనుక
యీ
భ్రాంతిలో
నీవు
మునిగి,
భ్రాంతిని
పోగొట్టుకొనక
బ్రహ్మను
పొందాలనుకుంటే
యిది
సాధ్యమవుతుందా.
కేవలము
నీ
నీడను
చూచి
నీవే
భయపడుతున్నావు.
నీ
భావములు
చూచి
నీవే
భయపడుతున్నావు.
ఇదే
ఏకం
సత్.
అదే
ఆత్మ.
భగవంతుడు
సత్
చిత్
ఆనంద
స్వరూపుడని
అనేక
మంది
పండితులు
వర్ణిస్తారు.
ఇది
సరియైన
జవాబు
కాదు.
సత్
తానే,
చిత్
తానే,
ఆనందము
తానే
భగవంతునికి
యీ
మూడు
గుణములుగా
వుంటున్నాయిగాని
భగవంతునికంటె
వేరైనది
కాదు.
ఏదో
నాకు
తెలియని
మహత్తరమైన
శక్తి
నాకంటె
ఒకటి
వేరుగా
వుంది
అని
కొంతమంది
విశ్వసించి
ధ్యానము
చేస్తారు.
గోప్యముగా
రహస్యముగా
ఏదో
ఒకటి
దివ్యమైన
శక్తి
నాకు
వేరుగా
వున్నది
నేను
పొందాలి
అనే
విషయములో
అనేక
రకములైన
దీక్షలు
పూనుతారు.
ఇది
కేవలము
అజ్ఞానము
యొక్క
చర్య.
నీకంటె
వేరైనది
ఒకటి
వున్నది
అనుకున్నంత
వరకు
నీవు
పూర్తి
అజ్ఞానములో
మునిగినవాడవే.
నీకంటె
మించినది
మరొకటి
లేనే
లేదు.
ఐతే
వున్నదని
నీవు
నిరూపించటము
నీ
మనోభ్రాంతి.
ఇది
ఎట్లా
వున్నదనగా
స్వప్నములో
అనేక
దృశ్యములు,
అనేక
అనుభవములు
అనుభవిస్తాము.
ఇది
ఎంత
వరకు
నిజము.
స్వప్నములో
వుండినంత
వరకే.
స్వప్నము
తీరెనా
యిది
నిజము
కాదు.
నీవు
మనోభ్రాంతిలో
వుండినంతవరకు
కూడను
కష్టము,
నష్టము
విచారము
దుఃఖము
యివన్నీ
సత్యమే.
మనోభ్రాంతి
వీడితివా
యిదంతా
అసత్యము.
కనుక
యివన్నీ
మనోభ్రాంతిలో
కట్టబడిన
మిథ్యము.
ఈ
మిథ్యానేనును
ఆధారము
చేసుకొని
నేనును
విసర్జిస్తున్నాము.
దేహమే
నేను
అనే
యీ
తాదాత్మ్య
భావము
లోపల
యీ
అహంకారమును
పెంచుకుంటున్నాము.
ఒక్క
చిన్న
విషయము
మనము
అర్థము
చేసుకుంటే
ఎంతైనా
విశాల
భావము
మనము
పొందవచ్చు.
తనకంటె
వేరైనది
ఒక్కటి
జగత్తునందు
లేదు.
ఉన్నదంతా
వున్నదాని
యొక్క
ప్రతిబింబములే.
లోకసంబంధమైన
విషయాలకు
కర్త,
కర్మ
క్రియ
యీ
మూడు
వుంటున్నాయి.
కాని
ఆత్మ
సంబంధమైన
విషయమునకు
ఆధ్యాత్మిక
సంబంధమైన
విషయమునందు
కర్త
తప్ప
క్రియ,
కర్మ
యేమాత్రము
వుంటుండదు.
చేసేవాడూ
తానే,
చేయించేవాడూ
తానే,
చేయింపబడునదీ
తానే.
ఈ
మూడింటి
ఏకత్వముతో
కూడిన
ఆత్మతత్వమే
సర్వత్రా
నిండిన
చైతన్యము.
ఈ
చైతన్య
తత్వము
ఒక్కదగ్గర
వుండి
మరొకరి
దగ్గర
వుండటానికి
వీలులేదు.
ఈ
చైతన్యమునే
మూడు
భాగములుగా
విభజించి
సామాన్యమైన
లోకానికి,
సామాన్యమైన
మార్గమునందు
సంతృప్తిపడే
నిమిత్తమై
సత్
చిత్
ఆనందము
అని
పేరుపెడుతూ
వచ్చారు.
దాని
యొక్క
ప్రతిబింబము
యిది.
దీని
యొక్క
ప్రతిబింబము
యిది
అని
చూపుతూ
వచ్చారు
వేదాంతులు.
6
▾
Meaning
Keep
దీనినే
వేదాంతమునందు
అస్తి,
భాతి,
ప్రియం
అన్నారు.
ఈ
మూడు
కూడను
ఒక్కటే.
ఈ
టంబ్లరు
యిక్కడ
వున్నది.
ఇది
అస్తి.
సత్.
చిత్
అంటే
యేమిటి
అది
మనము
చూస్తున్నాము.
చూడటమే
కాకుండా
యిది
టంబ్లరని
తెలుసుకున్నాము.
ఇంక
ఆనందమంటే
దీనిని
మనము
అనుభవిస్తున్నాము.
ఈ
సత్
చిత్
ఆనందము
మూడైందా
యిది.
లేదే
ఒక్కటే.
ఈ
సత్
వున్నది
ఒక్కటే
ప్రకాశించేది
ఒక్కటే
ఆనందింపచేయునది
ఒక్కటే.
కనుక
ఒకేదానియందు
మనము
అనేక
రకములైన
భ్రాంతుల
చేత
అనేకత్వముగా
అనుభవించి
అనేక
రూపనామములు
కల్పిస్తూ
వున్నాము.
కనుక
ఆత్మతత్వము
అనగా
ఏకత్వముతో
కూడిన
దివ్యత్వమనే
సత్యమును
గుర్తించాలి.
ఈ
ఆత్మ
అనగా
రూపము
లేనిది.
ఇది
కేవలము
అనేక
రూపములను
ధరించేది.
గాలి
వుంది.
దీనికి
యేమి
రూపము
లేదు.
రూపము
లేనంత
మాత్రమున
గాలి
లేదని
చెప్పటానికి
వీలుందా.
ఐతే
యీ
గాలి
ఏ
ఆకారమును
ఆశ్రయిస్తుందో
ఆ
ఆకారము
యొక్క
స్వరూపాన్ని
పొందుతుంది.
ఒక
బెలూన్లో
చేరితే
బెలూన్
రూపం
పొందుతుంది.
ఒక
foot
ballలో
చేరితే
foot
ball
రూపము
పొందుతుంది.
తలక్రింద
పెట్టుకొనే
pillowలో
చేరితే
pillowగా
కనుపిస్తుంది.
దీనికి
ఒక
రూపము
లేదు.
కాని
గుణము
వుంటున్నది.
ఇదే
చైతన్య
గుణము.
ఈ
చైతన్య
తత్వాన్ని
అర్థము
చేసుకోవాలంటే
చాలా
కష్టము.
ఈ
చైతన్యమనేదే
consciousness
అన్నారు.
ఈ
consciousnessను
గుర్తించాలనుకున్నా
అర్థము
చేసుకోవాలనుకున్నా
దాని
నుంచి
చిన్న
భాగమైనదానిని
తీసుకొని
conscience
అనే
రూపంగా
తయారు
చేసుకుంటూ
వచ్చాము.
అనగా
witness
అని.
దీనినే
awareness
అని.
దీనినే
సాక్ష్యము
అని.
ఐతే
సాక్ష్యము
వుంది.
ఈ
సాక్ష్యమునకు
ఏదైనా
ఆధారము
వుండాలి
కదా.
conscious
వచ్చేసింది.
consciousness,
conscience
conscious
యీ
మూడింటి
యొక్క
తత్వము
మూడు
గుణములుగా
మారిపోతూ
వచ్చాయి.
conscience
అనేది
sensesతో
కూడినది.
conscious
అనేది
మనసుతో
కూడినది
consciousness
అనేది
ఆత్మతో
కూడినది.
ఈ
మూడింటి
యొక్క
ధర్మములనే
లోకాచార
నిమిత్తమై,
లోకజ్ఞాన
నిమిత్తమై
యీ
రకముగా
విభజించుకుంటూ
వచ్చాము.
ఇది
ఎట్లా
అంటే
ఒక
చిన్న
ఉదాహరణము.
ఒక
doctors
conference
జరుగుతుంది.
హాలంతా
doctors
వుంటారు.
డాక్టర్సు
ఒక్కటే
పేరు.
కాని
ENT
doctor
కావచ్చు
Bones
doctor
కావచ్చు.
ఇంకొకరు
Kidney
specialise
చదివిన
doctor
కావచ్చు.
ఇంకా
అనేక
రకములైన
దేహమును
భాగములు
చేసి
విచారణ
చేసిన
వ్యక్తులుగా
రూపొందవచ్చు.
7
▾
Meaning
Keep
ఒకడు
heart
specialise
చేసి
వుండవచ్చు.
దేహములో
వున్న
దానిని
విభాగము
చేసి
జీవనోపాధి
నిమిత్తమై
ఒక్కొక్కరు
ఒక్కొక్క
దానిని
పరిశోధన
చేసి
డాక్టరనే
పేరు
పొందారు.
కాబట్టి
అందరూ
డాక్టర్సే.
అదేవిధముగనే
అందరు
ఆత్మస్వరూపులే.
జీవనోపాధి
నిమిత్తమై
ఒకరు
ఉద్యోగము
చేయవచ్చును.
ఇంకొకడు
కూలి
పని
చేయవచ్చును.
ఇంకొకరు
వ్యాపారము
చేయవచ్చు.
ఇంకొకడు
వ్యవసాయము
చేయవచ్చును.
ఈ
జీవనోపాధి
నిమిత్తమై
నిర్ణించుకున్న
వృత్తులవల్ల
యీ
పేర్లు
మనము
అభివృద్ధి
గావించుకుంటూ
వచ్చాము.
ఈ
పేర్లు
వృత్తులలో
వచ్చినవేగాని
శాశ్వతముగా
వచ్చినవిగావు.
అదేవిధముగనే
ఆత్మ
సర్వులయందు
ఒక్కటిగానే
వుండినప్పటికిని
ఆయా
శరీరము
యొక్క
అభిమానము
పురస్కరించుకొని
ఆ
సుఖదుఃఖములు
అందుకొంటున్నారు.
ఒక
చిన్న
ఉదాహరణము.
ఒక
plane
ఎక్కడో
accident
ఐనది.
ఆ
planeలోనే
మనవారు
వున్నారంటే
చెప్పనక్కరలేదు.
అనేక
రకములైన
విచారములకు
ప్రయత్నిస్తాము.
నిజానికి
ఆ
planeలో
మనవారే
లేకుండా
పోతే
ఎట్లా
జరిగిందటు,
ఏమి
జరిగిందటు,
ఎంతమంది
పోయినారు
ఆ
information
సేకరించటానికి
ప్రయత్నిస్తాము.
కనుక
యిది
నాది
అనే
భావము
లేకపోవటం
చేత
మనమంతా
information
లోపల
పోతున్నాము.
అందరియందు
వున్న
తత్వము
ఒక్కటే
అనుకున్నప్పుడు
నీవు
యింక
informationలో
దిగవు
transformationలోకి
వస్తావు.
కనుక
ఆత్మభావము
అనేది
ఏకంగా
మనము
భావించాలి.
వున్నది
ఒక్కటే
అన్యము
లేదు.
ఐతే
యీ
మనస్సు,
దేహము
యివన్నీ
వుండినంత
వరకు
యేకత్వము
పొందటము
చాలా
కష్టము.
కష్టము
కష్టమని
నిరంతరము
దీనినే
అనుభవించటము
యిది
కూడను
సహజము
కాదు.
కష్టమైనప్పటికి
మనసత్యాన్ని
మనము
గుర్తించుకొనుటకు
తగిన
ప్రయత్నం
చేయాలి.
మనము
రథము
అనే
దేహము
గురించి
గుర్తించాము.
గుఱ్ఱములనే
యింద్రియములను
గురించి
గుర్తించాము.
పగ్గములనే
మనస్సును
కూడను
అర్థము
చేసుకున్నాము.
సారథి
అనే
బుద్ధిని
కూడను
కొంత
విచారించాము.
ఐతే
యీ
రథము,
యీ
గుఱ్ఱములు
యీ
పగ్గములు,
యీ
సారథి
దేని
నిమిత్తమై
యేర్పడినాయి.
యజమాని.
ఆ
యజమాని
అనేవాడు
దీనిలో
ఆత్మస్వరూపుడై
వుంటున్నాడు.
కనుకనే
ఏకోవసి
సర్వభూతాంతరాత్మా
ఒక్కడే
సర్వభూతముల
యందు
నివసిస్తున్నాడు.
ఐతే
భూతము
అనుకున్నప్పుడు
ప్రాణముతో
కూడినదా
అని
విచారణ
చేయవచ్చును.
8
▾
Meaning
Keep
భూతమనగా
ఏమిటి?
శబ్దస్పర్శరూపరసగంధాదులు
యీ
విధమైన
యింద్రియముల
యొక్క
చేరిక.
ఇవన్నీ
జడములే
యీ
జడములనే
భూతములని
పేరుపెడుతూ
వచ్చారు.
ఈ
భూతము
అంటే
యింకొక
అర్థము
వుంటున్నది
పిశాచమని.
ఇది
పెనుభూతముగా
వుంటున్నదన్నారు.
అనగా
ఏమిటి
ఇది
ఏదేని
దయ్యముగా
వుంటున్నదని.
ఈ
భూతములన్నీ
మనకు
పిశాచములే.
ఇవే
మానవుని
అనేక
రకములుగా
పీడిస్తున్నాయి.
కనుక
వీటి
యొక్క
సత్యస్వరూపాన్ని
గుర్తించే
వ్యక్తులు
మనకత్యవసరము.
కాన
మనము
దేహభావమును,
దేహతత్వాన్ని,
దేహకర్తవ్యమును
చక్కగా
గుర్తించి
లక్ష్యమును
ఆత్మయందుంచుకోవాలి.
కనుక
నేను
చేస్తున్నాననే
కర్తగా
నీవు
మారవద్దు.
దీని
ఫలితము
నాకే
అందాలని
కర్తృత్వములో
నీవు
దిగవద్దు.
ఈ
కర్తృత్వ
భోక్తృత్వమును
మనము
దూరము
గావించి
కర్తవ్యమును
ఆచరించాలి.
ఈ
కర్తవ్యమే
యోగము.
ఈ
యోగమును
నీవు
అనుభవించినావంటే
దివ్యమైన
ఆత్మభోగమును
నీవు
అనుభవించవచ్చు.
కాని
యీ
యోగము
లేకపోవటంచేత
మనము
రోగులుగా
మారుతున్నాము.
మానసిక
సంబంధమైన
వృత్తులను
చక్కగా,
జాగ్రత్తగా
మనము
విచారించాలి.
ఇది
ఎక్కడనుండి
పుడుతున్నది?
ఇది
చేసే
పని
యేమిటి
దీనిని
మనము
ఎందుకనుసరించాలి
దీనివల్ల
కలిగే
ఫలితమేమిటి
ఇది
మనలను
బంధనలకు
తీసుకుపోతున్నదా
లేక
విశాలమైన
మోక్షమునకు
గొనిపోతున్నదా
అనే
విచారణ
చేస్తే
యిది
క్రమక్రమేణా
బంధనకే
తీసుకొనిపోతున్నది.
కనుక
ఆత్మతత్వమనేది
కేవలము
అన్యవిధములుగా
విచారము
చేయుటానికి
వీలుకాదు.
ఈనాటి
లోకములో
భిన్న
భావములు,
భిన్న
చర్యలు,
అసూయలు
అహంకారములు
ద్వేషములు
అశాంతులు
అభివృద్ధి
కావటానికి
కారణము
ఏకత్వమును
కోల్పోవటమే.
కనుక
మనము
సమత్వమైన
ప్రేమ
తత్వాన్ని
పెంచుకోవాలి.
ఈనాడు
మనము
చదివే
చదువుల
యొక్క
జ్ఞానము
ఏమిటి?
ఇది
నిజమైన
జ్ఞానమా?
కాదు
కాదు.
ఇది
అజ్ఞానములోని
అజ్ఞాన
జ్ఞానము.
మనము
అజ్ఞానములో
చదువుతూ
వున్న
అజ్ఞానమునే
అభివృద్ధి
పరచుకుంటున్నాము.
ఇక్కడ
ఆత్మ
ఎక్కడ
వున్నదనుకుంటే
చైతన్యమునకు
మరొక
చైతన్యమునకు
మధ్యనున్న
ఆ
చైతన్యము
అనే
ఆత్మస్వరూపకముగా
వుంటున్నది.
ఇది
ఎప్పుడు
మనకు
అర్థమవుతుంది.
అందరికి
అర్థము
కాదు.
జాగ్రతకు
నిద్రకు
మధ్యస్థితివలె
వుంటుంది.
9
▾
Meaning
Keep
ఐతే
జాగ్రత
నిద్రకు
మధ్యస్థితి
ఎట్లా
వుంటుందంటే
ఎవరికి
తెలియదు.
జాగ్రత్తగా
వుండినట్లే
వుంటాము.
తిరిగి
కన్నుమూత
పడిపోతుంది.
కాని
యోగులు
మాత్రమే
దీనిని
చక్కగా
సాధిస్తూ
వచ్చారు.
ఈ
జాగ్రత్తకు
యీ
నిద్రకు
వున్న
తత్వము
అదే
నిజమైన
ఆత్మతత్వము.
జాగ్రత్త
రజోగుణము.
నిద్ర
తమోగుణము.
రెండింటికి
మధ్యనున్నది
సాత్వికము.
అదే
ఆత్మస్వరూపము.
కనుక
యీ
ఆత్మతత్వమును
చక్కగా
గుర్తించాలంటే
ఆత్మజ్ఞానమును
మొట్టమొదట
విచారణ
చెయ్యాలి.
కనుక
ఆత్మజ్ఞానమనేది
రేపటి
దినము
తెలుసుకుందాము.
ఇప్పుడు
భీమ్సేన్
జోషి
మధురమైన
కంఠముతో
మధురానందము
నందించి
అందరిని
మైమరపిస్తాడు.
Previous
←
The Three Gunas
Next
Self-knowledge
→