Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1990 · The Three Gunas
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Three Gunas
28 May 1990, Summer Course 1990, Brindavan
1
▾
Meaning
Keep
భాస్కర
బింబే
దీప్తం
దైవమ్
లోచన
మధ్యే
సుప్తం
దైవమ్
శితకర
మండల
గుప్తం
దైవమ్
త్రిగుణిత
భవనం
వ్యాప్తం
దైవమ్
ప్రేమస్వరూపులైన
విద్యార్థులారా!
సర్వం
ఖల్విదమ్
బ్రహ్మ.
విశ్వం
విష్ణు
స్వరూపం.
భాస్కర
బింబే
దీప్తం
దైవమ్.
సూర్యుని
కిరణముల
యందు
ప్రకాశించేవాడు
ప్రకటించేవాడు
దైవమే.
లోచనమధ్యే
సుప్తం
దైవమ్.
ప్రతి
మానవుని
యొక్క
నేత్రముల
మధ్య
జగత్తును
చూపించి
ప్రకటింప
చేసి
వికసింప
జేసి
ప్రకాశింప
చేసే
వాడు
దైవము.
శితకర
మండల
గుప్తం
దైవమ్.
చంద్రుని
మధ్యనున్న
చల్లదనము,
లోక
శాంతిని
అందించే
దివ్యత్వము
దైవమే.
త్రిగుణిత
భవనం
వ్యాప్తం
దైవమ్
త్రికాలాత్మకమైన
యీ
జగత్తునందు
త్రిమూర్త్యాత్మకమైన
యీ
జగత్తునందు
త్రిగుణ
స్వరూపములో
ప్రకటించే
దివ్యత్వము
భగవంతుడే.
ప్రకృతి
యొక్క
చిత్రము
మహా
విచిత్రము.
ఎవ్వరును
దీనిని
గుర్తించలేరు.
ముంచినా
తేల్చినా,
అనుగ్రహించినా
ఆగ్రహించినా
ప్రకృతియే.
జీవకోటిపైన
అధిపత్యము
ప్రకృతిదే.
ఈ
ప్రకృతి
త్రిగుణాత్మకమైనది.
ఈ
త్రిగుణాత్మకమైన
ప్రపంచమే
త్రిమూర్తి
స్వరూపము
ఇవియే
సృష్టి
స్థితి
లయ
మనకు
మూల
కారణము.
త్రిగుణముల
యొక్క
స్వరూప
స్వభావములతో
విశేష
వికారములతో,
సరస
సల్లాపములతో
లోకాలను
ప్రకాసింప
చేసేది
ప్రకటింప
చేసేది
త్రిగుణములే.
మానవుడు
దీర్ఘ
జీవితము
కోసము
కాదు
ఆశించవలసినది.
దివ్యజీవితము
కోసము
ఆశించాలి.
దివ్యమైన
యీ
ప్రకృతి
యందు,
దివ్యమైన
మానవత్వము
దివ్యత్వమును
పొందుటమే
ప్రధాన
కర్తవ్యము.
సృష్టి
యొక్క
రహస్యము
సృష్టికర్తకు
తప్ప
అన్యులకు
అర్థము
కాదు.
సృష్టి
యొక్క
రహస్యము
గుర్తించుటానికి
ప్రయత్నించేవారే
యీ
సైంటిస్టులు.
ఈ
సృష్టి
యొక్క
రహస్యమును
పరిపూర్ణముగా
ఎవ్వరూ
కూడను
గుర్తించలేరు.
ఈ
వైజ్ఞానము
నందు
యీనాటి
పరిశోధన
రేపటికి
పాతదై
పోతుంది.
రేపటి
దినము
పరిశీలన
ఎల్లుండికి
పాతదై
పోతుంది.
కాని
యీ
వైజ్ఞానిక
వ్యక్తి
యందు
పాతదంతా
రోతదిగా
భావించుకుంటూ
పోతుంటాడు.
2
▾
Meaning
Keep
సృష్టి
అంతయు
కేవలము
క్షణక్షణమునకు
మార్పు
చెందునదే.
ఇది
నిత్యమైనది
సత్యమైనది
కాదు.
నిత్య
సత్య
నిర్మలమైన
తత్వము
సృష్టికర్తయే.
సృష్టికర్తను
పరిశీలన
చేసి
పరిశోధన
చేసి
సృష్టికర్తను
పొందేటువంటిదే
ఆధ్యాత్మిక
మార్గము.
ఈ
చరాచర
ప్రపంచమంతయు
కేవలము
త్రిగుణాత్మకమైనది.
కనుక
గుణాతీతమైన
తత్వమును
గుర్తించే
నిమిత్తమే
నిజమైన
మానవత్వము.
భగవంతుడు
ఆత్మస్వరూపుడు
సత్యం
జ్ఞానం
అనంతం
బ్రహ్మ
అని.
బ్రహ్మ
అన్నా
సత్యమన్నా,
అనంతమన్నా,
ఆత్మ
అన్నా,
భగవంతుడన్నా,
దేవుడన్నా
యివి
కేవలము
ఒక
పదము
యొక్క
పర్యాయ
పదములే.
మొట్టమొదట
ఆత్మనుండి
పంచభూతములు
ఆవిర్భవించాయి.
ఐతే
పంచభూతములందు
పంచతత్వముల
యొక్క
తత్వాన్ని
యిముడ్చుకొని
వుంటాయి.
ఈ
పంచభూతముల
నుండి
పంచీకృతము
ఆరంభమైంది.
ఈ
పంచీకృత
భావము
నుండి
ఆవిర్భవించినవే
యీ
త్రిగుణములు.
ఈ
త్రిగుణముల
యొక్క
ఆకారమే
ఈ
విశ్వము.
ఈ
విశ్వమునందు
సత్వరజోతమో
గుణములనే
త్రిగుణాత్మక
స్వరూపము
నిండి
వుంటున్నాది.
ఈ
సత్వ
సృష్టి
యొక్క
రహస్యాన్ని
మొట్టమొదట
గుర్తించాలి.
పంచభూతముల
యొక్క
సమిష్టి
సత్వాంశమే
యీ
అంతఃకరణ..
ఐతే
యీ
ఆకాశము
నుండి
కూడను
సత్వసృష్టియైన
యిది
వ్యష్టి
తత్వాన్ని
అనుభవిస్తూ
వచ్చింది.
ఈ
పంచభూతములలో
ఆకాశము
మొదటిది.
ఈ
ఆకాశము
నుండి
వ్యష్టి
తత్వము
నుండి
శుద్ధ
సత్వము
ఒకటి
బయలుదేరింది.
అదియే
మానవాకారములకు
ప్రథమస్థానము.
మానవత్వమునకు
యీ
విధమైన
అంశముల
యొక్క
ప్రభావము,
ప్రశక్తి
పరిపూర్ణతలను
ప్రారంభము
కావటము.
కనుక
ఆకాశము
యొక్క
వ్యష్టి
సత్వము
నుండి
చెవి
పుట్టింది.
ఇంక
పంచభూతములలో
రెండవ
భూతము
గాలి
నుండి
వ్యష్టిసత్వమైన
అంశమే
చర్మము.
మూడవదైన
అగ్ని.
ఈ
అగ్ని
యొక్క
వ్యష్టి
సత్వాంశమే
కన్ను.
నాల్గవది
నీరు.
దీని
వ్యష్టి
సత్వాంశమే
నాలుక.
ఐదవ
భూతము
ప్రకృతి.
ప్రకృతి
యొక్క
వ్యష్టిసత్వాంశమే
ముక్కు.
కనుక
శబ్ద,
స్పర్శ
రూప,
రసగంధములు
అనే
భూతములు
ప్రథమమునందు
సాత్వికమై
శుద్ధ
సత్వము
నుండి
ఆరంభమైనాయి.
ఐతే
ఒక్కొక్క
భూతమునకు
వ్యష్టి
భూతము
కనుక
ఆ
వ్యష్టినుండి
ఆవిర్భవించిన
యీ
అంగములు
ఒక్కొక్క
పనికి
మాత్రమే
వినియోగించుకోటానికి
వీలవుతుంది.
ఆకాశము
యొక్క
గుణము
శబ్దము.
శబ్దమునకు
చిహ్నము
చెవి.
చెవి
కేవలము
వినుట
మాత్రమే
తప్ప
అన్యము
ఎరుగదు.
అదే
విధముగనే
రెండవ
భూతమైన
గాలి.
ఇది
స్పర్శ.
చర్మము.
3
▾
Meaning
Keep
ఇది
స్పర్శ
తప్ప
శ్రవణము
చేయుటానికి
వీలుకాదు.
దీనికి
శ్రవణ
శక్తి
లేదు.
మూడవది
అగ్ని.
దీని
అంశము
కన్ను.
ఇది
చూడగలదే
గాని
స్పర్శించలేదు.
నాల్గవది
నీరు.
ఇది
జిహ్వ.
నాలుక.
రుచి
చూడగలదే
గాని
వ్యక్తిని
చూడలేదు.
ప్రకృతి
యొక్క
అంశము
ముక్కు.
ఇది
వాసన
చూడగలదే
గాని
రుచిని
చూడలేదు.
ఐతే
యీ
అంశముల
యొక్క
ప్రతిబింబములగుట
చేత
ఒక్కొక్క
గుణము
మాత్రమే
యిది
స్వీకరిస్తూ
వచ్చింది.
ఐతే
సమిష్టి
స్వరూపమైన
పంచభూతముల
యొక్క
స్వరూపమే
అంతఃకరణ.
అంతఃకరణకు
శబ్ద
స్పర్శ
రూప
రస
గంధములన్నీ
అనుభవించే
అధికారము
వుంటున్నాది.
కనుక
అంతఃకరణ
అనగా
కేవలము
శబ్ద
స్పర్శ
రూప
రసగంధాదులు
జ్ఞానేంద్రియములకు
మాత్రమే
సంబంధించినది.
ఐతే
యీ
జ్ఞానేంద్రియములు
దేహమునకు
వెలుపలా
లోపలా
అని
విచారిస్తే
యివి
అంతర్
బహిర్
స్వరూపాలు.
కర్మేంద్రియమైన
చెవి
మాత్రమే
వుంటుండి
జ్ఞానేంద్రియమనే
విను
శక్తి
లేకపోయినప్పుడు
చెవి
వుండి
ప్రయోజనము
లేదు.
జ్ఞానేంద్రియమనే
విను
శక్తి
వుండి
కర్మేంద్రియమనే
చెవి
లేకపోతే
యిది
కూడను
వినలేదు.
జ్ఞానేంద్రియ
కర్మేంద్రియ
సమ్మిళితమైన
స్వరూపమే
వ్యష్టి
యొక్క
తత్వము.
Loud
speakers
బయట
పెట్టారు.
Loud
speaker
వుంటుండి
యిక్కడ
mike
లేకపోతే
Loud
speaker
ప్రయోజనము
లేదు.
అక్కడ
speaker
వుండి
యిక్కడ
mike
లేకపోతే
ప్రయోజనము
లేదు.
కనుక
యిక్కడ
mike,
speaker
రెండింటి
సమ్మిళితమైన
స్వరూపమే
యిక్కడి
తత్వాన్ని
అక్కడికి
అక్కడి
తత్వాన్ని
యిక్కడికి
ప్రసరింప
చేస్తుంది.
కనుకనే
యీ
శుద్ధ
సత్వమైన
సత్వగుణ
సంపత్తియే
శబ్ద
స్పర్శ
రూప
రస
గంధాదులు.
ఇవి
సత్వగుణమునకు
మాత్రమే
సంబంధించినవి.
రజోగుణము
యొక్క
సమిష్టి
పంచభూతముల
యొక్క
స్వరూపమే
ప్రాణము.
సత్వగుణము
యొక్క
పంచభూత
స్వరూపమైనది
అంతఃకరణ
అయితే
రజోగుణము
యొక్క
పంచభూత
స్వరూపము
ప్రాణముగా
వచ్చింది.
ఇక్కడ
రజోగుణ
సృష్టి
యందు
యీ
పంచభూతములందు
వ్యష్టి
స్వరూపమైన
ఆకాశము
యొక్క
బిందువు
నోరు.
ఇంక
రెండవ
భూతమైన
వాయువు.
ఈ
వాయువు
యొక్క
వ్యష్టి
స్వరూపమైన
బిందువు
చేయి.
రజోగుణ
సృష్టియందు
మూడవ
భూతము
అగ్ని,
వ్యష్టి
స్వరూపమైన
అగ్ని
యొక్క
సృష్టి
కాలు.
నాలుగు,
ఐదు
అయిన
జలము,
ప్రకృతి
యొక్క
వ్యష్టి
యొక్క
సృష్టి
మలమూత్రములు
విసర్జించు
ప్రదేశములు.
ఇక్కడ
చక్కగా
గుర్తించవలసిన
విషయము.
సత్వగుణ
సృష్టి
యందు
వ్యష్టి
సృష్టిగా
వచ్చిన
ఆకాశము
యొక్క
మొదటి
సృష్టి
చెవి.
రజోగుణమునందు
ఆకాశము
యొక్క
వ్యష్టి
సృష్టియైనది
వాక్కు.
4
▾
Meaning
Keep
ఏతావాతా
ఆకాశమునకు
యిద్దరు
బిడ్డలు.
రజోగుణము
యొక్క
బిడ్డ
వాక్కు.
సత్వగుణము
యొక్క
బిడ్డ
చెవి.
ఆకాశము
మొదటి
బిడ్డ
చెవి.
రెండవ
బిడ్డ
వాక్.
మొదటి
బిడ్డయైన
చెవి
బయటి
విషయాన్ని
లోపలికి
స్వీకరిస్తుంది.
రెండవ
బిడ్డయైన
వాక్కు
స్వీకరించిన
దానిని
బయటకు
విడిచిపెడుతుంది.
సత్వగుణము
యొక్క
వాయువు
యొక్క
బిడ్డ
చర్మము.
రజోగుణము
యొక్క
వాయువు
యొక్క
బిడ్డ
చేయి.
ఎక్కడైనా
దేహముపైన
చీమ
పారాడుతూవుంటే
యీ
స్పర్శ
తెలుసుకుంటుంది
చర్మము
తెలుసుకున్న
తక్షణమే
చేయి
తోసి
పారవేస్తుంది.
ఏతావాతా
సత్వగుణము
యొక్క
అంశములు
స్వీకరించుటము
రజోగుణము
యొక్క
సంతతి
దానిని
విసర్జించుటము.
కనుక
యీనాడు
లోకములో
యే
రీతిగా
వున్నదంటే
రజోగుణము
స్వీకరిస్తుంది
సత్వగుణము
వదిలివేస్తూవుంది.
దీనిని
వుల్టాసిదా
అంటారు.
విరుద్ధముగా
నడుస్తూ
వస్తుంది.
సృష్టి
యొక్క
రహస్యము
నిజరూపము
సత్వగుణము
మాత్రమే
స్వీకరించాలి.
రజోగుణము
యొక్క
తత్వము
విసర్జించాలి.
కనుక
యీ
ప్రకృతికి
సత్వగుణమే
మొట్టమొదటి
పదము.
ఈ
ప్రకృతికి
స్త్రీ
అని
ఒక
పేరు.
స్త్రీ
అనగా
సకార
తకార
రకారములతో
కూడినటువంటిది.
అనగా
మొట్టమొదట
సాత్వికము
స్వీకరించాలి.
రెండవది
తకారమనే
తమోగుణము
అనగా
మర్యాదగా
వినయముగా
అణకువగా
వుండే
గుణములు
అభివృద్ధి
పరచుకోవాలి.
రకారమనేది
కట్టకడపటిది.
కొన్ని
కొన్ని
సమయములందు
కొన్ని
దీక్షలు,
కొన్ని
ప్రతిజ్ఞలు,
కొన్ని
కఠినమైన
చర్యలను
చేస్తుంది.
కనుక
రజోగుణమనేది
విధిలేని
పరిస్థితి
యందు
కట్టకడపటికి
స్వీకరించవలసినదే
గాని
మొదట
స్వీకరించవలసినది
కాదు.
ప్రకృతి
యొక్క
రహస్యమునందు
ప్రప్రథమములో
ప్రారంభమయ్యేది
సకారమే.
అదే
సాత్వికము.
కనుక
ప్రతి
మానవుడు
సత్వగుణ
అంశమునందు,
సత్వగుణ
ప్రక్రియ
యందు,
సత్వగుణ
తేజస్సునందు,
సత్వగుణ
మార్గమునందు,
సత్వగుణ
ప్రవర్తన
యందు
మానవత్వము
అభివృద్ధి
గావించుకోవాలి.
ఇంక
తమోగుణము
యొక్క
సృష్టి
యే
విధముగా
వున్నదంటే
పంచభూతముల
యొక్క
మిశ్రమమై
వుంటున్నాది.
ఇక్కడ
పంచభూతములు
పరిపూర్ణ
భూతములు.
మిశ్రమము
కాలేదు.
పంచీకృతములు
యిక్కడ
చేరిపోయాయి.
అనగా
యివి
చక్కగా
అందరికి
అర్థమయ్యే
విషయము
కాదు.
కాబట్టి
అర్థమయ్యే
నిమిత్తమై
నేను
ప్రాపంచిక
సంబంధమైన
విషయములో
ఒక
ఉపమానాన్ని
చెబుతాను.
ఇక్కడ
ఆకాశము,
వాయువు,
అగ్ని,
జలము,
పృథ్వి
యీ
ఐదు
వ్యష్టి
స్వరూపాలు.
ఈ
ఐదు
మంది
ఒక
చోట
కూడినారు.
ఒక్కొక్కరి
దగ్గర
ఒక్కొక్క
రూపాయి
వుంటున్నాది.
ఈ
ఆకాశమనేవాడు
తన
రూపాయిని
చిల్లరగా
మార్చాడు.
అర్ధ
రూపాయి
తన
దగ్గర
పెట్టుకొని
రెండు
రెండు
అణాలు
నలుగురికి
పంచుతూ
వచ్చాడు.
5
▾
Meaning
Keep
His poems 14
అదే
విధముగా
రెండవ
భూతమైన
వాయువు
కూడను
తన
రూపాయిని
చిల్లర
చేసి
అర్ధరూపాయి
తన
దగ్గర
పెట్టుకొని
తాను
కూడా
రెండు
రెండు
అణాలు
నలుగురికి
పంచుతూ
వచ్చాడు.
ఇదే
పద్ధతి
మూడవది
అగ్ని
అనుసరిస్తూ
వచ్చింది.
తిరిగి
జలము
కూడను
యిదే
పద్ధతి
అనుసరిస్తూ
వచ్చింది.
పృథ్వి
కూడను
అంతే.
యీ
పద్ధతినే
అనుసరిస్తూ
వచ్చింది.
ఈ
విధముగా
అనుసరిస్తూ
రావటం
చేత
కట్టకడపటికి
ఏమైపోయింది.
అందరి
దగ్గర
రూపాయి
రూపాయిగానే
మిగిలింది.
ఐతే
యీ
రూపాయలు
యే
విధముగా
ఒక్కొక్క
రూపాయిగా
మిగిలాయి.
పూర్వము
గట్టియైన
ఒకే
రూపాయి
వుండినాది.
ఇప్పుడు
చిల్లరతో
కూడిన
రూపాయిగా
మారిపోయింది.
అనగా
పూర్వము
వుండిన
పంచభూతములే
గట్టిరూపాయి
ఈ
చిల్లర
రూపాయలే
పంచీకృతమని.
ఈ
పంచీకృతముతో
కూడిన
మానవత్వము
చిల్లర
రూపాయలుగా
చలామణి
అవుతున్నాయి.
అనగా
భిన్న
భిన్న
భావములతో
కూడి
వస్తున్నాది.
ఏకత్వమును
అనేకత్వముగా
భావించింది.
పూర్వము
అనేకత్వమైన
ఏకత్వముగా
వుండేటువంటిది.
అదే
రూపాయకు
పదహారణాలు
అనేది
పూర్వము.
ఇక్కడ
మనిషికి
పదహారు
గుణాలు
అని.
ఆధ్యాత్మిక
తత్వమునందు
షోడశ
కళలు
అన్నారు.
ఈ
పదహారు
కళలు
ఏమిటి?
ఇక్కడ
ఐదు
జ్ఞానేంద్రియములు,
ఐదు
కర్మేంద్రియములు
యీ
ఉద్భవించిన
పంచభూతములు,
మనస్సు
ఒకటి
యివే
పదహారు
కళలు.
కేవలము
భగవంతుని
యందే
యీ
పదహారు
కళలు
వుంటున్నాయని
భావించుటము
చాలా
వెర్రితనము.
ప్రతి
వ్యక్తి
కూడను
పదహారు
కళలతో
వుంటున్నాడు.
కనుకనే
ఈశావాస్యమిదం
సర్వం.
ఈశావాస్య
ఉపనిషత్తునందు
ఈశ్వరుడు
సర్వత్రా
వుంటున్నాడు.
ఈశ్వర
సర్వభూతానాం.
ఈ
మానవుడు
ఏకత్వాన్ని
అనేకత్వముగా
మార్చటానికి
వచ్చిన
కారణము
యేమిటి?
దీనికి
అభీష్టములే
మూలకారణము.
ఈ
అభీష్టములు
క్రమక్రమేణా
మితిమీరి
పోతూ
వచ్చాయి.
ఈ
పంచభూతములకు
సంబంధించిన
వాంఛలు
అత్యవసరమే.
ఇవి
క్రమక్రమేణా
మితిమీరి
పోవటం
చేత
ప్రతి
ఒక్కటి
అప్పటికప్పుడే
అప్పటికప్పుడే
ఫలితము
లభించాలి
కాలము
కోసము
కూడను
కాచుకోరు.
త్రికాల
స్వరూపమైనదే
యీ
త్రిగుణములు.
ఈ
కాలము
వచ్చేదంటే
యిది
కూడను
ఎవ్వరు
ఆపటానికి
వీలుకాదు.
పోకన్నా
నదు
దేహము
యే
విధంబు
పోషించి
రక్షించినన్
రాకన్నానదు
హాని
వృద్ధులు
మహారణ్యమునన్
దాగినన్.
ఈ
సత్యాన్ని
గుర్తించి
కూడను
వ్యక్తులు
యేదో
ఆతృత
పడుతూ
వుంటారు.
అక్కడకు
పోతే
తప్పుతుందేమో
ప్రమాదము
అని.
ఇక్కడ
వుంటే
లాభిస్తుందేమో
అని
అనుకుంటారు.
6
▾
Meaning
Keep
ఎక్కడ
వుండినా
వచ్చేది
రాక
తప్పదు.
ఐతే
పురుష
ప్రయత్నము
అత్యవసరము.
వుండేది
తట్టలో
పొటాటో
చపాతీ
లభించింది
గాని
తట్టలో
వున్నది
పొట్టలోకి
చేరాలంటే
నోటికి
చేతికి
పని
పెట్టాలి.
ఇదే
పురుష
ప్రయత్నము.
కలియుగ
ప్రభావము
చేత
కోరికల
యొక్క
బలము
చేత
మానవత్వమును
విస్మరించి
అభీష్ట
జీవితమును
అభిలషించి
అత్యంత
ఉన్నత
స్థాయికి
అతిశీఘ్రముగా
పోవాలని
short
cut
కోసం
ప్రయత్నిస్తున్నాడు.
short
cut
త్వరగా
చేరవచ్చుననుకుంటారు.
చూడటానికి
చాలా
దగ్గరగా
కనుపిస్తుంది.
కాని
ఆ
short
cut
లోపల
అనేక
రాళ్లు
ముళ్లకంపలు
అనేక
రకములైన
బాధలతో
కూడి
వుంటుంది.
ఇవన్నీ
తప్పించుకొని
ఆ
గమ్యం
చేరటానికి
main
road
లో
దానికంటె
నాలుగింతలు
అధికమైనప్పటికి
సులభముగా
నడచి
అందులో
చేరటానికి
టైము
ఒక్కటే
అవుతుంది.
కాని
మానవుడు
త్వరగా
చేరే
మార్గాన్ని
వెతుకుతూ
వస్తున్నాడు.
ఇది
సరియైనది
కాదు.
దూరమైనప్పటికిని
మంచి
రాజమార్గములో
మనము
ప్రవేశించాలి.
ఇక్కడ
ఒక
చిన్న
ఉదాహరణము
వుంటున్నది.
స్వర్గమునకు
పోయే
రోడ్డు
చాలా
చిన్నదిగా
వుంటుందట.
నరకమునకు
పోయే
రోడ్డు
చాలా
పెద్దదిగా
కనుపిస్తుందట.
ఏమిటి
యింత
పెద్ద
main
road
గా
వుంటున్నాది.
దీనికి
యింత
పెద్ద
రోడ్డు
ఎందుకు.
భగవంతుని
దగ్గరకు
పోవటానికి
యింత
చిన్న
రోడ్డు
ఎందుకు.
అని
ప్రశ్నించవచ్చు
బుద్ధిననుసరించి.
భగవంతుని
సృష్టి
అనేక
రకములైన
విచారణలు
సల్పి
వివేక
భావముతో,
విజ్ఞాన
హృదయముతో,
విశాల
తత్వముతో
యేర్పరచినటువంటిది.
నరకమునకు
పోయేవారు
లక్షలు
లక్షల
మంది
వున్నారు.
వెళ్లటానికి
పెద్ద
రోడ్డు
కావాలి.
స్వర్గమునకు
పోయేవారు
ఒకరో
యిద్దరో
నూటికి
ఒక్కరో
కోటికి
ఒక్కరో.
వారికి
పెద్ద
రోడ్డు
అవసరం
లేదు.
చిన్నరోడ్డు
చాలు.
అదే
విధముగానే
భగవంతుడు
ప్రతి
ఒక్కటి
కూడను
తన
యొక్క
సంకల్పముతో
యోగక్షేమం
వహామ్యహమ్
అన్నింటి
యొక్క
క్షేమము
నిమిత్తమై
సృష్టిని
ఆచరిస్తూ
వుంటాడు.
ఒక
భక్తుడు
తాను
శ్రీమంతుడు
కావాలని
ఆశించి
లక్ష్మీదేవిని
ప్రార్థిస్తూ
వచ్చాడు.
భౌతిక
వాంఛలు
నెరవేర్చుకొనే
నిమిత్తమై
భక్తుడు
ఎంతటి
శ్రమలకైనా
ఓర్చుకుంటాడు.
ఎన్ని
కష్టములనైనా
సహిస్తాడు.
ఎన్ని
నిందలు
నిష్ఠూరములకైనా
గురౌతాడు.
కాని
పారమార్థిక
మార్గమునకు
ప్రయత్నించే
భక్తులు
ఏ
చిన్న
కష్టము
జరిగినా
తాను
భరించుకోలేడు.
దీనిని
బట్టి
భౌతిక
వాంఛలపైన
మానవులకు
అమితమైన
అభిమానము
వుంటున్నాది.
ఈ
భక్తుడు
లక్ష్మీకటాక్షము
కోసమని
చాలా
ఘోరమైన
తపస్సు
చేశాడు.
లక్ష్మీ
ప్రత్యక్షమైంది.
‘నాయనా!
నీకేమి
కావాలి?’
అంది.
‘నీవే
కావాలి
తల్లీ!’
అన్నాడు.
ఐతే
నేను
సర్వాలంకార
భూషితురాలనై
నీ
వెంటనే
వస్తాను.
7
▾
Meaning
Keep
నీవు
ముందు
నడు.
నీ
యింటికి
వచ్చి
యీ
నగలన్నీ
అక్కడ
విసర్జించి
వస్తాను
అంది.
కాని
ఒక
నియమాన్ని
పాటించాలని
కోరింది
ఆమె.
నీవు
ముందు
మాత్రమే
వెళ్లు
వెనుకకు
తిరిగి
చూడకు.
వెనుకకు
తిరిగి
చూస్తివా
నేను
అక్కడే
నిలచిపోతాను.
ఆమె
నిజమే
చెప్పింది.
ఆనంద
హృదయుడై
వుల్లాసముతో
వురుకుతూ
వున్నాడు
ఎప్పుడెప్పుడు
యింటికి
పోయి
చేరాలనా
అని.
కొంత
దూరము
పోయేటప్పటికి
చాలా
శబ్దములు
యిస్తుంది
యీమె.
ఏఏ
నగలు
ధరించిందో
యేమోనని
ఒక్కతూరి
వెనుకకు
చూచాడు.
ఇంటికి
పోయేంత
వరకు
ఓపిక
లేకపోయింది
యీయనకు.
వెనక్కు
తిరిగి
చూచేటప్పటికి
ఆమె
అక్కడే
నిలచిపోయింది
యింక
యింటికి
పోలేదు.
చూశారా!
ఆశ
యొక్క
ప్రభావము.
అనుగ్రహమును
పొంది
కూడను
అనుభవించలేకపోతున్నాడు.
కనుక
భగవదనుగ్రహము
నిండుగా
దండిగా
వుండినప్పటికి
అనుభవించే
శక్తిని
కూడా
మనము
సంపాయించాలి.
అది
అనుభవించే
శక్తిని
మనము
సంపాయించుకోవాలంటే
ఆజ్ఞను
పాలించాలి.
లక్ష్మీదేవి
యొక్క
ఆజ్ఞను
పాలించి
వుంటే
ఆలక్ష్మి
తనకు
వచ్చి
చేరి
వుండేది
కదా.
ఆజ్ఞను
మీరటం
చేతనే
లభించిన
లక్ష్మిని
కూడను
కోల్పోయాడు.
లోకము
యొక్క
స్థితి
యీ
రకముగా
వుంటున్నాది.
లోకమంతా
సత్వ
రజో
తమోగుణముల
యొక్క
ప్రభావమై
వుంటున్నాది.
ఈ
సత్వ
రజో
తమోగుణముల
యొక్క
సృష్టి
కూడను
మన
యొక్క
దృష్టియందు
చేరి
వుంటున్నాది.
మన
నేత్రములు
చూడండి
చక్కగా
పరిశీలన
చేసి.
మొట్టమొదట
కొసలో
Red
colour
యిదే
రజోగుణము.
అది
దాటుతానే
సాత్వికము.
ఆ
సాత్వికమునకు
మధ్యలోపలనే
తమోగుణము
వుంటున్నాది.
అదే
నలుపు.
తెలుపు,
ఎరుపు,
నలుపు
మూడు
గుణములు
మన
దృష్టియందు
కూడా
వుంటున్నాయి.
దైవము
ఎక్కడ
వున్నాడు,
ఎట్లా
వుంటాడు,
మనకు
ప్రత్యక్ష
స్వరూపకముగా
ప్రకృతియే
మనకు
answer
యిస్తున్నాది.
సూర్యోదయము,
సూర్యాస్తమయము
కలుగుతున్నాయి
ఈ
సూర్యోదయ
సూర్యాస్తమయముల
వల్ల
దినములు
వస్తున్నాయి.
ఈ
దినముల
వలన
నెలలు
నెలలు
వల్ల
సంవత్సరములు
వస్తున్నాయి.
ఇది
జరగటానికి
కారణం
యేమిటి?
భూమి
తన
చుట్టూ
తాను
వేయి
మైళ్ల
వేగముతో
తిరుగుతున్నాది.
తిరగటం
చేతనే
సూర్యోదయము
సూర్యాస్తమయము
జరుగుతున్నాయి.
కేవలము
సూర్యోదయము
సూర్యాస్తమయము
జరగటం
వలన
మనకు
లభించే
ప్రయోజనము
యేమిటి?
కాని
భగవత్సంకల్పము
చాలా
విశాలమైనది.
ఎవ్వరూ
దీనిని
అర్థము
చేసుకోలేరు.
అదే
భూమి
తిరిగి
సూర్యుని
చుట్టూ
66
వేల
మైళ్ల
వేగముతో
తిరుగుతున్నాది.
తన
చుట్టూ
తాను
వేయి
మైళ్లు
గంటకు
తిరుగుతూ
సూర్యుని
చుట్టూ
అరవై
ఆరు
వేల
మైళ్ళ
వేగముతో
తిరుగుతున్నది.
8
▾
Meaning
Keep
ఈ
సూర్యుని
చుట్టూ
తిరగటము
మూలముగా
ఋతువులు
యేర్పడుతున్నాయి.
ఈ
ఋతువుల
వలన
వర్షములు
కురుస్తున్నాయి.
పంటలు
పండుతున్నాయి.
వంటకు
యేమి
తక్కువ
లేకుండా
వుంది.
కనుక
మన
యొక్క
ఆహార
విహారములకు
యీ
భూమి
యెంత
వుపకారముగా
వుంటున్నది.
ఇదియే
ప్రత్యక్షదైవము.
నీవు
భగవంతుని
చూస్తూ
కూడను
చూడలేదు
అనుకుంటున్నావు.
చాలా
పొరపాటు.
ప్రకృతియే
పరమాత్మ
స్వరూపము.
ఈ
ప్రకృతి
వల్ల
మనము
గుర్తించవలసినది
యేమిటి?
క్రియాశీలత.
మన
కర్తవ్యమును
మనము
నిర్వర్తించాలి.
ప్రకృతి
తన
కర్తవ్యమును
తాను
పాటిస్తూ
వుండటం
చేతనే
యింత
పవిత్రమై
జగత్తుకు
ఉపకారము
చేయగలుగుతున్నది.
కనుకనే
సృష్టి
యొక్క
రహస్యము
కర్తవ్యాచరణయే.
ఏ
కర్మలో
నీవు
ప్రవేశిస్తున్నావు
ఆ
కర్మ
నీవు
శ్రద్ధాభక్తులతో
చేయి.
అంతే
గాని
మానవుడు
యేదో
సుఖించాలని
యీ
సుఖము
కోసమని
అనేక
పెడ
మార్గములు
పడుతున్నాడు.
ఈ
ఆధునిక
యుగమునందు
ఆంగ్లవిద్యా
ప్రభావమందు
విద్యార్థుల
యొక్క
తత్వములు
విద్యావంతుల
యొక్క
ప్రభావములు
వికార
మార్గమును
అనుసరిస్తున్నాయి.
మీ
అందరికి
తెలుసు
అనేకమంది
అధికారులు
ఆఫీసుకు
వెడుతున్నారు.
ధనవంతులు
తమ
తమ
ఆఫీసులకు
పోతుంటారు.
తమ
పనులు
తాము
చేస్తుంటారు.
ఏదో
పెద్ద
శ్రమపడి
వచ్చినట్లుగా
యింటికి
వస్తారు.
మాకు
సుఖము
లేదు
శాంతి
లేదు
అని
వాపోతుంటారు.
ఇంటికి
వచ్చి
happy
నిమిత్తమై
తమ
తమ
డ్రస్సులు
తాము
విసర్జించి
యింకొక
డ్రస్సును
స్వీకరించి
క్లబ్బులకు
వెడతారు.
దేనికోసం
వెడతారు
happy
కోసం,
సంతోషము
కోసము
పోతున్నారు.
Rest
కావాలి.
నిజముగా
అక్కడ
happy
వున్నదా?
నిజముగా
అక్కడ
శాంతి
వున్నదా?
నిజముగా
అక్కడ
సుఖము
వున్నదా?
ఆ
క్లబ్బులకు
పోవటము
cards
ఆడటము,
బాటిల్స్
తీసుకోటము
శాంతిగా
ప్రపంచమును
మరచి
కూర్చోటము.
ఇంకా
యింకా
మద్యమధుపానీయం
సమర్పయామి
యేవేమో
చేస్తుంటారు.
ఇవన్నీ
కేవలం
సుఖశాంతి
నిమిత్తమై
ఆచరించే
సత్కర్మలుగా
భావిస్తున్నారు.
ఇది
చాలా
దుర్మార్గమైన
మార్గము.
ఈ
సుఖము
సుఖమనే
అపేక్షలో
దుఃఖమును
వారు
కొంటున్నారు.
వారికి
వారు
చెడిపోటమే
కాకుండా
వారు
సమాజమును
కూడను
చెడగొడుతున్నారు.
ఈ
విధమైన
మార్గము
మొట్టమొదట
చాలా
సుఖంగా
కనుపించవచ్చు.
ఇది
పోతూ
పోతూ
క్రమక్రమేణా
ఎక్కడ
దిగుతుంది.
First
the
man
drinks
the
wine,
second
the
wine
drinks
the
wine,
third
wine
drinks
the
man.
9
▾
Meaning
Keep
ఇది
జరుగుతుంది.
కేవలము
తాను
తీసుకుంటున్నానని
భ్రమిస్తున్నాడు
కాదు.
కాదు.
అదే
తనను
తీసుకుంటున్నది.
ఈ
విధమైన
శాంతిగోరి
పెడమార్గమును
బట్టి
జీవితమును
భ్రష్టు
పట్టించుకుంటున్నారు.
నిజమైన
శాంతిసుఖములు
అనుభవించాలనుకుంటే
Public
service
చేయి.
సమాజములో
ప్రవేశించు.
దీనులను
దిక్కులేని
వారిని
పోషించు.
దానిలో
నీ
యొక్క
energy
కూడను
అభివృద్ధి
అవుతుంది.
మానసిక
శాంతి
కూడను
లభిస్తుంది.
నీవు
చేసిన
మంచి
పని
అని
నీ
conscious
తృప్తిపడుతుంది.
ఈ
రమ్యమైన
మార్గమునందు
ప్రవేశించటానికి
యీ
ధనవంతులకు
గాని
అధికారులకు
గాని
బుద్ధి
పుట్టదు.
విద్యార్థులారా!
విద్యార్థులు
మున్ముందు
దీనిని
లక్ష్యమునందుంచుకొని
తమ
శక్తిని
తమ
యొక్క
పవిత్రతను
తాము
అనుభవించుటే
కాకుండా
సమాజమునకు
కూడను
దానిని
వినియోగించాలి.
కారణమేమనగా
నీవు
కూడను
సమాజములో
ఒక
వ్యక్తివి.
నీవు
సమాజమునకు
దూరముగా
లేవు.
కనుక
నీ
క్షేమమంతా
సమాజము
క్షేమముపైనే
ఆధారపడి
వుంటుంది.
అప్పుడే
నీ
క్షేమము
కూడను
అభివృద్ధి
అవుతుంది.
ఇదే
నిజమైన
మానవుని
కర్తవ్యము.
ఈ
కర్తవ్యమును
విస్మరించి
దుర్భావములను
విశ్వసించి
దుర్మార్గములో
ప్రవేశించటం
చేతనే
శాంతిసుఖములకు
దూరమై
పోతున్నాము.
భగవంతుడు
నీవే.
నీ
యొక్క
తత్వమే
భగవత్
శక్తి.
దీనినే
energy
అన్నారు.
ఐతే
మనకు
తెలివితేటలు
అధికముగా
వుంటున్నాయి
ఈ
తెలివితేటలంతా
కూడను
దుర్వినియోగము
చేస్తున్నారు.
తెలివితేటలు
వుండి
కూడను
ఆ
తెలివితేటలు
సక్రమమైన
మార్గములో
ప్రవేశించకుండా
పోతే
ఆ
తెలివితేటలు
నిరుపయోగమై
పోతాయి.
తెలివితేటలు
లేకుండా
నీవు
కర్మలో
ప్రవేశిస్తే
కర్మము
నిష్ప్రయోజనమై
పోతుంది.
Knowledge
without
action
is
foolishness.
Action
without
knowledge
is
useless.
So
knowledge,
action
రెండింటిని
మనము
యేకము
చేయాలి.
ఇదే
దివ్యత్వము,
ప్రకృతి
తత్వము
రెండింటి
యేకత్వము.
కనుక
our
creation
ప్రత్యేకముగా
భగవంతునికి
వేరుగా
లేదు.
భగవంతునితోనే
కూడి
వుంటున్నది.
అందుకోసమనే
జీవ
ఈశ్వర
ప్రకృతి
అని
త్రిమూర్త్యాత్మక
స్వరూపము.
ఈ
మూడు
వేరు
కదా.
వేరు
వేరు
రూపనామములుగా
మనకు
గోచరిస్తుందే
గాని
వున్నది
ఒక్కటే.
ఇది
యేమిటి?
ఇది
వస్త్రము.
అంటే
యిది
వస్త్రము
ఎట్లా
అయింది.
దారములలో
వస్త్రమైంది.
ఈ
దారము
ఎట్లా
అయింది.
ప్రత్తిలో
దారములుగా
ఏర్పడినాయి.
ప్రత్తి
లేక
దారము
లేదు.
దారము
లేక
వస్త్రము
కాలేదు.
కనుక
ప్రత్తి,
దారము,
వస్త్రము
ఏకమే.
మన
వినియోగములు
దీనికి
రూపనామములు
వేరు
వేరుగా
వచ్చాయి.
10
▾
Meaning
Keep
Also in his talks
(14)
30 July 1987
To nurture sacred feelings in the heart is education
6 October 1989
Do Not Give Up the Name of God
16 September 1990
Discipline is like our very life-breath
20 October 1990
The day that wrought the great change
14 January 1992
All learning that lacks humility and obedience is the learning of a rākṣasa!
22 September 1996
Though Forms and Names Differ, the Principle of Brahman Is One!
14 April 1998
God pervades all
23 April 1998
Human Life Is Most Precious
26 April 1998
All Beings Are Parts of God
11 October 1998
Human Life Is the Fruit of Our Resolves
9 October 2001
God in human form
20 November 2001
Spiritual education is essential alongside worldly education
1 March 2003
Lasting Ānanda is gained only through satsaṅga
2 May 2006
The body itself is the temple; you yourself are God
కనుకనే
త్రిదళం
త్రిగుణాకారం
త్రినేత్రంచ
త్రియాయుధమ్
త్రిజన్మ
పాపసంహారం
ఏకబిల్వం
శివార్పణమ్.
అన్నారు.
ముఖ్యమైన
మన
త్రిగుణముల
యొక్క
తత్వము
ఏకత్వమైన
సత్య
తత్వముతో
కూడి
వుంటున్నాది.
విద్యార్థులారా!
ఏ
సాధనలు
మనము
చేయకపోయినప్పటికిని
భగవత్ప్రేమ
మనము
అమితముగా
పెంచుకోవాలి.
ఒక
నిర్మల
నిశ్చలమైన
ప్రేమను
మనము
పెంచుకుంటే
మనము
సర్వమూ
లభ్యమై
పోతుంది.
వాల్మీకి
ఏ
వంశమందలి
వాడు
నందుండు
ఏ
పల్లెయందు
పుట్టె
వసుధ
ధృవుండెంత
వయసు
కల్గియుండె
శబరి
ఎంతటి
శక్తి
కల్గియుండె
విదురునికెంతటి
వితరణమతియుండె
తిమ్మనికెంతటి
తెలివియుండె.
చంచలత్వమునకు
పుట్టినిల్లు
పెట్టినది
పేరు
హనుమంతునికి.
అతడు
రాములకు
ప్రియమైన
near
and
dear
అన్నింటికిని
తాను
ముఖ్యమైనవాడుగా
వున్నాడంటే
దీనికి
కారణం
ఏమిటి?
ఇక్కడ
ఒక
విషయాన్ని
తన
తెలివితేటల
తత్వాన్ని
మీరు
చక్కగా
గుర్తించవచ్చు.
పరమ
భక్తియే
పవిత్రమైన
శక్తిని
అందిస్తుంది.
ఇతను
రామాజ్ఞను
శిరసావహించి
ఎన్ని
కష్టములకైనా,
ఎన్ని
బాధలకైనా
కూడను
తాను
సహించి
రామాజ్ఞను
నేను
శిరసావహించుటమే
కర్తవ్యమని
విశ్వసించాడు.
ఆజ్ఞ
యిచ్చిన
భగవంతుడు
శక్తి
కూడా
తానే
యివ్వగలడు.
సీతాన్వేషణకై
నన్ను
పంపుతున్నాడు.
ఆ
అన్వేషణ
శక్తి
కూడా
తానే
యివ్వగలడు.
ఆ
శక్తియే
తాను
యివ్వకుండిన
ఆజ్ఞాపించటానికి
ఒప్పుకోడు.
కనుక
ఆ
విశ్వాసముతో
తాను
పూనుకున్నాడు
సీతాన్వేషణకు.
లంకలో
ప్రవేశించాడు.
విభీషణునితో
స్నేహము
చేసుకున్నాడు.
వారిద్దరి
మధ్య
సంభాషణ
జరుగుతున్నాది.
హనుమంతా!
నీవు
ఎంత
అదృష్టవంతుడవు
అంటున్నాడు
విభీషణుడు.
శ్రీరామదర్శనము
నీవు
చేసుకున్నావు.
శ్రీరామ
సేవను
నీవు
సలుపుతున్నావు
కాని
నేను
యెంతో
కాలమునుండి
రామ
చింతన
చేస్తూ
వున్నాను
గాని
నాకు
రామ
దర్శనం
కలగలేదు.
హనుమంతుడు
దీనికి
కారణమేమిటో
నీవు
గుర్తించుకున్నావా
విభీషణా
అన్నాడు.
11
▾
Meaning
Keep
ఇంతటి
కారణము
తెలుసుకొనే
వ్యక్తిని
నేనైతే
యింక
దర్శనము
కాలేదని
విచారము
నేను
చేసి
వుండి
వుండను.
అప్పుడు
హనుమంతుడు
చెప్పాడు.
నీవు
రామ
చింతన
చేస్తున్నావే
గాని
రామ
కార్యములో
పాల్గొంటున్నావా?
ఈనాడు
భగవచ్చింతన
చేస్తున్నాము
గాని
భగవత్కార్యములలో
యేమైనా
పాల్గొంటున్నామా.
నేను
రామ
చింతన
చేయటమే
కాకుండా
రామ
కార్యమునకు
జీవితమును
అంకితము
చేశాను.
ఇదే
రాములు
నన్ను
దగ్గర
చేర్చుకోటానికి
తగిన
అర్హత.
నేను
ఏ
వేదము
ఏ
శాస్త్రము
ఏ
ఉపనిషత్తు
దేనిని
పఠించలేదు
నేర్చుకోలేదు.
కనుక
ఆ
రామ
చింతనతో
బాటు
రామ
కార్యములో
నా
జీవితమును
అంకితము
చేశానన్నాడు.
తదుపరి
హనుమంతుడు
ప్రశ్నించాడు.
విభీషణా
తల్లి
సీతమ్మను
చూచావా
నీవు
అడిగాడు.
చూచాను
హనుమంతా!
మరి
ఆ
సీత
యొక్క
విముక్తి
నిమిత్తమై
ఏమైనా
ప్రయత్నము
చేశావా?
చేయలేదు.
రామభక్తి
రామభక్తి
అనుకుంటున్నావు.
రామపత్ని
సీత
ఎన్ని
కష్టములు
పడుతుంటే
రాముని
చెంత
చేర్చటానికి
నీవు
కృషి
చేయలేదు.
ఐతే
యిందులో
మనమిద్దరము
కూడను
ఒక
విధమైన
స్నేహముతో
ఒక
విధమైన
సమన్వయము
వున్నాము.
నీవు
అన్నను
చూచావు.
నేను
అప్పను
చూచాను.
కనుక
నీవు
నాకు
అన్నను
చూపించు.
నేను
నీకు
అప్పను
చూపిస్తానన్నాడు.
అప్పుడు
యిరువురు
కూడను
అప్ప
అన్న
చూచిన
వారమవుతాము.
ఈ
విధముగా
యిరువురు
నిర్ణయానికి
వచ్చారు.
మరొక
సందర్భములోపల
హనుమంతునితో
మాట్లాడుతూ
విభీషణుడు
అంటున్నాడు.
హనుమంతా
నేను
ఎక్కడ
వున్నానో
తెలియదా.
కేవలము
సూటియైన
అంబులపొదుల
వంటి
దంతముల
మధ్య
నాలుక
వుండినట్లుగా
యీ
క్రూర
రాక్షసుల
మధ్య
నేను
నిల్చివుంటున్నాను.
రామ
చింతన
చేయుటానికి
కూడను
సదవకాశము
లభించటము
లేదు.
హనుమంతుని
యొక్క
తెలివితేటలు
ఎంత
గొప్పవో
ఆ
రామానుగ్రహము
వలన
కలిగిన
యీ
తెలివితేటలు
ఎంత
గొప్పవో
విద్యార్థులు
చక్కగా
గుర్తించవచ్చు.
ఈ
మాట
విన్నంతనే
హనుమంతుడు
చెబుతున్నాడు.
‘విభీషణా!
పళ్లు
ముందు
రాలుతాయా?
నాలుక
ముందు
రాలుతుందా?
ముందు
పండ్లు
రాలుతాయి
నాలుక
ముందు
రాలదు.
కనుక
దంతములకు
మధ్య
వుండినట్లుగా
రామ
చింతన
చేస్తూ
వుంటావు
రాక్షసుల
మధ్య.
రాక్షసులు
ముందు
కూలిపోతారు.
నీవు
రక్షింపబడతావు.
దీనికై
నీవు
విచారించనక్కరలేదు’.
అన్నాడు.
హనుమంతుని
యొక్క
గుణము
ఎంత
సూక్ష్మముగా
వుంటున్నాది
యోచించండి.
కనుకనే
ఆ
విభీషణుడు
శాంతుడు,
గుణవంతుడు,
హనుమంతుడు
అని
వర్ణిస్తూ
వచ్చాడు.
ఈ
శాంత
గుణములు
బలము
అన్నీ
మనకు
ఒక్క
ప్రేమ
ద్వారానే
లభ్యమవుతాయి.
12
▾
Meaning
Keep
Also in his talks
(2)
14 January 1992
All learning that lacks humility and obedience is the learning of a rākṣasa!
22 November 1998
The Education of Bhārata Is What Develops the Divine Human Principle
భగవత్ప్రేమ
సంపూర్ణమైన
హృదయముతో
వుండెనా
సర్వము
మనకు
లభమై
పోతుంది.
కనుక
భగవత్ప్రేమను
మనము
అనుభవించినే
త్రిగుణముల
యొక్క
స్వాధీనము
మనకు
జరుగుతుంది.
త్రిగుణములను
సాధించిన
వ్యక్తి
త్రిలోకములను
సాధించగలడు.
వాటిని
సాధించక
యింక
ఎన్ని
సాధించి
యేమి
ప్రయోజనము.
చిన్న
విద్యార్థియైన
ప్రహ్లాదుడు
పెద్ద
హిరణ్యకశిపుడైన
తండ్రికి
బుద్ధి
చెబుతున్నాడు.
లోకములన్నియున్
ఘడియలోన
జయించినవాడ
వింద్రియా
నీకము
చిత్తమున్
గెలువ
నేరవు....
ఓ
తండ్రీ
ఎన్ని
లోకాలో
నీవు
సాధించావు.
ఎందరు
రాజులనో
నీవు
పరాభవము
గావించావు.
ఎన్ని
రాజ్యములనో
పొందావు.
కాని
నీ
యొక్క
యింద్రియాల్ని
నీవు
జయించలేకపోతున్నావు.
ఎన్ని
జయించి
యేమి
ప్రయోజనము.
కనుక
బయటి
రాజ్యములు
జయించినవాడు
రాజు
కావచ్చు
ఇంద్రియాల్ని
జయించినవాడు
రాజాధిరాజ
రాజ
మహారాజు.
అతను
చక్రవర్తి
కాగలడు.
హృదయ
సామ్రాజ్యమునకు
చక్రవర్తి
అవుతాడు.
కనుక
విద్యార్థులు
యింద్రియములను
అరికట్టి
పవిత్రమైన
మార్గములో
ప్రవేశ
పెట్టి
మీ
కర్తవ్యములను
నిర్వర్తించుటకు
కంకణము
కట్టుకోవాలి.
ఆదర్శవంతమైన
జీవితాన్ని
అందించాలి
విద్యార్థులు.
హృదయాన్ని
విశాలము
గావించుకోండి.
ఈనాడు
ప్రపంచములో
ఎక్కడ
చూచినా
వాతావరణము
మాలిన్యముగా
వుంది.
ఆహారము
మాలిన్యముగా
వుంటున్నాది.
తినే
పదార్థము
మాలిన్యముగా
వుంటున్నది.
సర్వము
మాలిన్యమయంగా
వుంటున్నాది.
దీనిని
మనము
ఏ
విధముగా
పరిశుద్ధము
చేయాలి.
ఒక్క
ప్రేమ
భావమును
మీరు
అభివృద్ధిపరచుకొని
సమాజములో
ప్రవేశించండి.
మీ
వెంటనే
యింటనే
జంటనే
కంటనే
వుంటుండి
సర్వవిధముల
మీరు
విజయమును
సాధించటానికి
తగిన
శక్తినందిస్తాడు
భగవంతుడు.
అట్టి
విశ్వాసమును
మీరు
మొట్టమొదట
బలపరచుకోవాలి.
స్వార్థమును
త్యాగము
చేయండి.
పరార్థమును
ప్రేమించండి.
దైవప్రీతి,
పాపభీతి
సంఘనీతి
యీ
మూడింటిని
మీరు
అభివృద్ధి
పరచాలి.
Previous
←
Egoism and Attachment
Next
The Ātma Principle
→