Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1992 · The Shirdi Sai Saga
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Shirdi Sai Saga
27 September 1992, Dasara, Prasanthi Nilayam
First talk
Second talk
1
▾
Meaning
Keep
దీనిని
పురస్కరించుకొనియే
మన
పర్వదినములంతా
‘పారమార్థిక
దృష్టితో
ప్రకృతిని
అనుభవించు’
అన్నారు.
ప్రతి
పనియందు
కూడను
పారమార్థిక
దృష్టితో
నీవు
ప్రవేశించు.
ఇట్టి
సత్యాన్ని
జగత్తునకు
బోధించే
నిమిత్తమై
మహనీయులు,
అవతారములు,
ఇంకా
సన్యాసులు,
ఇలాంటి
గొప్ప
గొప్పవారంతాకూడను
ఈ
జగత్తునకు
రాగలిగారు.
ఈనాడు
మరొక
విశేషం
కూడ
ఉంటుండాది.
శ్రీ
షిర్డిసాయిబాబా
దివ్యచరిత్ర
1838
సంవత్సరం
సెప్టెంబర్
27వ
తేదీ
తెల్లవారుఝామున
షిర్డిసాయిబాబా
జన్మించాడు.
2
▾
Meaning
Keep
Also in his talks
(4)
30 July 1988
Sacrifice itself is the true yoga
28 September 1990
Revelations about the Sai Avatar
15 June 1992
Strive to cultivate equal-mindedness!
23 August 1996
Only He Who Bows to God's Command Can Experience Divinity in Full
ఎక్కడ
పుట్టాడు?
పత్రి
గ్రామ
సముద్భూతం
ద్వారకామాయి
వాసినం
భక్తాభీష్ట
ప్రదం
దేవం
సాయినాథం
నమామ్యహమ్.
షిర్డిబాబా
జన్మించినది
పత్రి
గ్రామం.
ఈ
పత్రి
గ్రామం
అనేటువంటిది
ఎక్కడ
ఉంటుండాది?
ఔరంగాబాద్
జిల్లాలోపల
ఒక
చిన్న
గ్రామం.
ఈ
గ్రామమునందు
ఒక
బీద
బ్రాహ్మణ
కుటుంబంలో
జన్మించాడు.
కాని,
అనేక
కారణాలచేత
తల్లిదండ్రులు
ఈ
పిల్లవానికి
దూరమయ్యారు.
ఈ
పిల్లవాడు
ఒక
ఫకీరు
చేతిలో
పడ్డాడు.
ఆ
ఫకీరు
అతనిని
కొంతకాలం
పెంచాడు.
తరువాత
గోపాల్రావ్
దేశ్‌ముఖ్
అనేటువంటి
అతని
చేతిలో
పెట్టాడు.
అతనికి
‘వెంకుసా’
అని
మరొక
పేరుకూడా
ఉంటుండాది.
అతను
మహా
గొప్ప
పండితుడు.
మహా
జ్ఞాని.
అందువలన
అతనికి
ప్రజలందరు
ఒక
బిరుదిచ్చారు.
‘వెంకుసా’
అని.
అతని
పేరు
వెంకుసా
కాదు.
నిజమైన
పేరు
గోపాల్రావ్
దేశ్‌ముఖ్.
ఇతని
దగ్గరకూడను
బాబా
కొంతకాలం
పెరిగాడు.
కాని
ఒక్కచోట
స్థిరంగా
ఉండేటువంటి
స్వభావం
కాదు,
ఆయనది.
అక్కడనుంచి
1854లో
షిరిడి
గ్రామం
చేరాడు.
అక్కడే
మహల్సాపతి
అతనిని
చూచాడు.
ఆ
ఊరి
దేవాలయంలో
అతడు
ప్రవేశిస్తుంటే
‘ఇతనెవరో
ఫకీరులా
ఉంటున్నాడు.
ఇతను
మహమ్మదీయుడుగా
ఉంటున్నాడు.
ఇతను
హిందు
దేవాలయంలో
ప్రవేశించకూడదని
వెనుకకు
తరిమాడు
ఆ
బాలుని.
అప్పుడాతడు
ఊరి
బయట
ఒక
వేప
చెట్టుక్రింద
కూర్చున్నాడు.
అప్పటికి
అతని
వయస్సు
16
సంవత్సరములు.
ఈ
కుర్రవాడిది
ఏ
పేరో,
ఏ
ఊరో
ఎవ్వరికి
తెలియదు.
ఎవరైనా
అడిగినప్పటికిని
తాను
ఏ
జవాబు
చెప్పేవాడు
కాదు.
ఎవరైనా
‘ఏ
ఊరండి
మీది?’
అని
ప్రశ్నిస్తే
‘నా
ఊరుతో
నీకేం
పని’
అనేవాడు.
‘నీ
పేరేమిటి?’
అని
అడిగితే
‘పేరుతో
పనేమి?’
అనేవాడు.
ఈ
విధంగా
జవాబివ్వడంచేత
ఎవ్వరుకూడను
అతని
ఊరు,
పేరు
తెలుసుకోలేకపోయారు.
కొంతకాలం
అక్కడ
ఉండినాడు.
అక్కడి
గ్రామస్థులంతా
అతని
వద్దకు
వచ్చి
కడుపునొప్పులు,
ఇతర
శారీరక
బాధలు
తీర్చుకుని
పోతూ
వచ్చారు.
ఏదో
ఒక
ఆకు
తీసికోవడము,
బాగా
నలిపి
తినమని
వారికిచ్చేవాడు.
‘దీనిని
తిను,
నీ
నొప్పి
పోతుంది’
అనేవాడు.
ఈ
విధంగా
చేయటంవల్ల
అనేకమంది
తమ
రోగాలు
నివారణ
చేసుకుని
వెళ్ళేవారు.
3
▾
Meaning
Keep
ఈ
విషయం
తొందరలోనే
ఆ
చుట్టుప్రక్కల
పల్లెలలో
త్వరగా
ప్రాకిపోయింది.
చాలామంది
రావటము,
రోగాలకు
నివారణకోసం
మందులు
అడగటము,
ఆకుల
రసము
తీయటము,
ఆకులు
పిప్పి
ఇవ్వటము
ఈ
విధమైన
దానితో
రోగాలు
నివారణ
చేస్తూ
వచ్చాడు.
ఇలా
ఉండగా
వున్నట్టువుండి
ఒకరోజు
తెల్లవారుతూనే
అతడు
కనిపించలేదు.
సరే
ఎక్కడకు
పోయినాడో
ఏమోనని
పాపం
గ్రామస్థులు
అతనికోసం
వెతికి
వెతికి
నిరాశపడ్డారు.
తరువాత
1858లో
సుమారు
నాలుగు
సంవత్సరాల
తరువాత
తిరిగి
షిరిడీకి
వచ్చాడు.
ఈ
లోపల
ఏమైంది?
ఔరంగాబాద్‌కు
దగ్గరలో
ధూప్
అనేటువంటి
ఒక
పల్లె
ఉండేటువంటిది.
ఆ
ధూప్
గ్రామంలో
మధ్య
తరగతికి
చెందిన
ఒక
వ్యక్తి
ఉండేటువంటివాడు.
అతనే
చాంద్భాయి
పటేల్.
ఆనాడు
ప్రయాణ
సౌకర్యములు
సరిగా
వుండేటువంటివి
కావు.
ప్రతి
ఒక్కరు
ఒక
గుఱ్ఱాన్ని
వుంచుకునేటువంటివారు,
ఇతర
గ్రామాలకు
పోవటానికి.
ఒకనాడు
చాంద్‌భాయ్
పటేల్
ఒక
అర్జంటు
పనిమీద
తన
గుఱ్ఱాన్ని
ఎక్కి
ఔరంగాబాద్‌కు
వచ్చాడు.
తన
పని
చూచుకునేలోపల
తన
గుఱ్ఱము
తప్పించుకుని
పోయింది.
అందువలన
కాలినడకన
తన
గ్రామానికి
తిరిగి
వస్తున్నాడు.
మార్గమధ్యంలో
ఒక
దట్టమైన
అరణ్యము
ఉంటుండాది.
ఆనాడు
ప్రతి
పల్లెచుట్టూ
అరణ్యాలుండేటువంటివి.
ఆ
దట్టమైన
అడవిలోపల
ఒక
మామిడివృక్షంక్రింద
ఒక
ఫకీరు
కూర్చున్నాడు.
ఏదో
తన
ఆలోచనలో
తాను
నిమగ్నమై
ఉన్నాడు.
చాంద్‌భాయ్
పటేల్
తన
గుఱ్ఱంకొరకు
వెతికి,
వెతికి,
చాలా
అలసిపోయి
నిరాశతో
పోతున్నాడు.
దారిలో
ఈ
ఫకీరు
హుక్కాను
చక్కగా
పీల్చి
చాంద్‌భాయ్
పటేల్కుకూడా
ఇచ్చాడు,
పీల్చమని.
‘ఎందుకు
పటేల్
ఇంత
విచారంగా
ఉన్నావు?’
అని
ప్రశ్నించాడు.
‘నేను
పటేల్
అని
మీకు
ఎట్ల
తెలుసు?’
అన్నాడు
ఆ
పటేల్.
‘నాకన్నీ
తెలుసు.
నీవు
గుఱ్ఱాన్నిగురించి
చాలా
విచారిస్తున్నావు.
నీవు
కన్నులు
తలపైన
పెట్టుకుని
వెతుకుతున్నావేకానీ
నొసటిపైన
పెట్టుకుని
వెతకటం
లేదు.
తలపైన
పెట్టుకుంటే
పైవి
కనిపిస్తాయి.
కానీ,
క్రిందివెట్లా
కనిపిస్తాయి?
మూర్ఖుడా!
అదిగో
ఆ
చెట్టుక్రింద
నీ
గుఱ్ఱం
మేస్తుండాది.
చూచుకో
పొమ్మ’న్నాడు.
చాంద్‌భాయ్
పటేల్
అక్కడికి
పోయి
చూచేటప్పటికి
తన
గుఱ్ఱం
అక్కడ
ఉంటుండాది.
ఆశ్చర్యం
అదే
ప్రదేశంలో
ఎన్నో
దినములంతాకూడను
కూలీల్ని
పెట్టి
వెతికించాడు,
చాంద్‌భాయ్
పటేల్
తన
గుఱ్ఱంకొరకు.
4
▾
Meaning
Keep
కానీ
ఎక్కడా
చిక్కనటువంటి
ఈ
గుఱ్ఱము
ఇప్పుడు
తాను
కూర్చున్న
చెట్టు
వెనుకనే
ఉంటుండాది!
అది
చూచి
ఆశ్చర్యపోతుండగా
ఫకీరు
నేలపై
కఱ్ఱతో
కొట్టేటప్పటికి
జలము,
అగ్ని
వచ్చాయి!
ఈ
విధమైనటువంటి
మానవాతీత
శక్తులను
కొంతవరకు
ఫకీరువద్ద
చూచాడు.
అప్పుడు
పటేల్
‘స్వామి!
మీరు
నాకింత
ఉపకారం
చేశారు.
మీరు
నా
వెంట
వచ్చి
నా
ఆతిథ్యం
తీసుకోవాలి’
అని
ప్రార్థించాడు.
‘ఆ!
జావ్’
అన్నాడు
ఫకీరు.
ఇద్దరూ
కదిలి
వచ్చారు.
ఈ
లోపల
చాంద్‌భాయ్
పటేల్
మేనల్లునికి
పెండ్లి
కుదిరింది.
ఈ
పెండ్లి
ఎక్కడ?
పెండ్లి
కూతురు
షిరిడీ
పిల్ల.
కనుక
షిరిడీకి
పోవలసి
వచ్చింది,
వీరందరూ.
అప్పుడు
చాంద్‌భాయ్
పటేల్
ఇతనినికూడను
పిలిచాడు.
‘ఫకీర్!
మా
వెంట
మీరుకూడ
రండి’
అని.
ఆయన
పేరు
అక్కడ
ఎవ్వరికి
తెలిదే!
షిరిడీకి
బండ్లలో
వెళ్ళారు.
షిరిడీలో
దిగేటప్పటికి
మహల్సాపతి
ఫకీరుదగ్గరకు
వెళ్ళి
‘ఆయియే
బాబా!
సాయి!’
అని
స్వాగతం
పలికాడు.
అప్పటినుండి
ఫకీరుకు
ఆ
పేరే
స్థిరపడిపోయింది.
సాయి
అనేటువంటిది
మహల్సాపతి
పిలిచిన
పేరు.
‘ఆయియే
సాయి!’
అని
పిలిచాడతడు.
అంతవరకుకూడను
బాబాకు
ఎవరూ
పేరు
పెట్టలేదు.
మరొక
సందర్భంలో
మెజిస్ట్రేట్
ఒక
కేసు
విషయంలో
విచారణకు
బాబా
దగ్గరకు
వచ్చాడు.
బాబా
అందులో
సాక్ష్యం
చెప్పాలి.
అసలు
ఏమి
జరిగిందంటే,
కొంతమంది
దొంగలు
ఒక
శ్రీమంతుని
ఇంట్లో
దొంగతనం
గావించి
బంగారు
వస్తువులను
అపహరించి
తీసుకునిపోతున్నారు.
అప్పుడు
పోలీసులు
వారిని
పట్టుకున్నారు.
మీకు
‘ఇవి
ఎక్కడ
చిక్కాయి?’
అని
పోలీసులు
గట్టిగా
అడిగేటప్పటికి
వారు
భయపడిపోయి,
‘అదిగో
అక్కడ
ఒక
ఫకీరున్నాడు.
ఆయన
మాకిచ్చాడు’
అని
చెప్పారు.
‘ఎవరా
ఫకీరు?’
అని
పోలీసులు
వెతుకుతూ
వచ్చి
బాబాను
‘మీరిచ్చారా
వారికి?’
అని
అడిగారు.
‘ఆ
ఇచ్చాను’
అన్నాడు,
బాబా!
‘మీకు
ఇవి
ఎక్కడినుండి
వచ్చాయి’
అని
పోలీసులు
ప్రశ్నిస్తే
‘అన్నీ
ఎక్కడనుంచి
వచ్చాయో,
ఇవీ
అక్కడినుంచే
వచ్చాయి’
అని
బాబా
బదులు
చెప్పాడు.
ఈ
విధముగా
కొంచెం
అయోమయ
స్థితిలో
మాట్లాడుతూ
వచ్చాడు,
బాబా.
పోలీసులు
ఆయన
వాక్యములను
అర్థము
చేసుకోలేకపోయారు.
వాళ్ళు
ప్రాకృతమైనటువంటి
స్థితిలో
ఉంటున్నారు.
బాబాది
పారమార్థిక
స్థితి.
దానిని
అర్థము
చేసుకోవాలంటే
ప్రాకృత
భావములో
ఉన్నవారికి
ఏ
మాత్రము
సాధ్యపడదు.
5
▾
Meaning
Keep
‘సరే!
ఇతని
దగ్గర
మాటాడి
ప్రయోజనం
లేద’నుకుని
పోలీసులు
తిరిగిపోయారు.
మేజిస్ట్రేటుకి
ఒక
రిపోర్టు
వ్రాసారు.
అక్కడినుంచి
సమన్స్
వచ్చాయి.
చాంద్‌భాయ్
పటేల్‌కు
బాబాను
పంపటానికి
ఇష్టం
లేదు.
అందువలన
పై
అధికారులతో
మాట్లాడడం
జరిగింది.
అక్కడ
వారు
ఒక
కమీషన్‌ను
వేశారు,
ఈ
వ్యవహారం
పరిష్కరించడానికి.
ఆ
కమిషన్‌ముందు
బాబా
సాక్ష్యం
ఇవ్వాలి.
అప్పుడు
కమిషన్‌కు,
బాబాకు
మధ్య
జరిగిన
సంభాషణ
ఈ
విధంగా
కొనసాగింది:
మీ
పేరేమిటి?
-
బాబా.
మీ
తండ్రి
పేరేమిటి
-
బాబా.
మీ
మతం
ఏది?
-
దైవ
మతం.
ఎక్కడనుంచి
వచ్చారు?
-
ఆత్మనుంచి
వచ్చాను.
మీ
కులమేమిటి?
-
దైవకులం.
ఈ
విధంగా
సమాధానాలు
చెప్పుతూ
వచ్చాడు.
ఎవ్వరుకూడను
‘సాయిబాబా
ఎవరు,
ఎక్కడ,
ఎప్పుడు
పుట్టాడు?’
అనే
విషయాలేవీ
బాబానుండి
రాబట్టలేకపోయారు.
‘దైవత్వం
అంటే
ఇంత
అగమ్యగోచరంగా
ఉంటుందా’
అనుకుని
ఇంక
మిగతా
వివరాలను
అడక్కుండానే
కమిషన్
వారు
వెళ్ళిపోయారు.
మరొక
సందర్భంలో
ఒక
సంవత్సరం
మార్గశిర
శుద్ధ
పంచమినాడు
దత్తాత్రేయుని
జన్మదినం
వచ్చింది.
దానిని
పురస్కరించుకుని
చాలామంది
భక్తులక్కడికి
చేరారు.
అందులో
చాలా
మంచి
పాండిత్యం
కలిగినటువంటివాడు
అయిన
కైజాక్
అనేటువంటివాడు
వచ్చాడు.
బలవంత్
కైజాక్
అని
అతని
పూర్తి
పేరు.
అతను
వచ్చేటప్పటికే
కఱ్ఱ
తీసుకున్నాడు
బాబా!
అక్కడ
కూర్చున్న
వాళ్ళందరిని
‘జావ్!
జావ్!
సైతాన్’
అని
తరుముతూ
వచ్చాడు.
ఎందుకోసమో
ఎవ్వరికి
అర్థం
కాలేదు.
‘నాకు
ప్రసవవేదనగా
ఉంటుండాది.
అందరు
వెళ్ళిపోండి,
వెళ్ళిపోండి’
అని
గట్టిగా
అరిచాడు
బాబా.
చాలా
పెద్ద
కేకలు
వేసాడు.
అప్పుడు
కేవలం
కేకలు
వేయటం
కాదు,
వీలును
బట్టి
కఱ్ఱతో
కొట్టేయడముకూడా
ఉండేది.
అందరూ
పరుగెత్తి
పోతుంటే
వారిపై
కఱ్ఱను
విసిరి
వేయడంకూడా
జరిగేది.
6
▾
Meaning
Keep
కనుక,
ప్రతి
ఒక్కరు
భయపడిపోయేటువంటివారు.
ఆ
రోజుకూడా
అలాగే
అందరు
పరుగెత్తి
పోయారు.
కొంత
సేపయ్యేటప్పటికి
బాబా
వారందరిని
‘రండి,
రండి’
అని
పిలిచాడు.
వాళ్ళు
వెనుకకు
తిరిగి
వచ్చేటప్పటికి
బాబా
లోపలకు
వెళ్ళాడు.
బాబా
లోపలకి
వెళ్ళడం
బల్వంత్
కైజాక్
చూశాడు.
తానుకూడా
లోపలకు
వెళ్ళాడు.
కాని
అక్కడ
బాబా
కనబడ
లేదు.
బాబాకు
బదులుగా
మూడు
తలలు
కలిగినటువంటి
ఒక
బిడ్డ
వుంది,
అక్కడ.
ఇంతకుముందు
బాబా
‘నాకు
ప్రసవవేదనగా
ఉంటుండాది’
అని
చెప్పాడు
కదా!
అక్కడ
మూడు
తలలు
కలిగిన
ఒక
బిడ్డ
దత్తాత్రేయుని
మాదిరి
కనిపించాడు.
బలవంత్
ఈ
దత్తాత్రేయ
స్వరూపాన్ని
చూచాడు.
మిగిలిన
వారందరినీ
పిలిచాడు.
అందరు
లోపలకి
వెళ్ళారు,
చూచారు.
కన్నులు
మూసుకున్నారు.
తక్షణమే
బాబా
తిరిగి
అక్కడ
ప్రత్యక్షమయ్యాడు.
అప్పటినుండి
అందరూ
‘బాబా
భగవంతుడు,
దత్తాత్రేయ
అవతారము’
అని
అనుకున్నారు.
క్రమేణా
బాబా
‘బ్రాహ్మణుడా,
హిందువా
లేక
ముస్లిమా?’
అని
అనేక
విధములైనటువంటి
మీమాంసలు
ప్రారంభమైనాయి.
బాబా
ఒక
నిముషంలో
‘అల్లా
మాలిక్,
అల్లా
మాలిక్’
అనేటువంటివాడు.
మరొక
సమయంలో
‘రామ
మాలిక్,
కృష్ణ
మాలిక్,
దత్తాత్రేయ
మాలిక్’
అని
ఈ
విధంగా
అరిచేటువంటివాడు.
బాబా
ఎవరు?
హిందువా?
ముస్లిమా?
అనేటువంటిది
చాలామందికి
సందేహాలు
వచ్చాయి.
బాబా
‘అల్లా
మాలిక్’
అనేటప్పుడు
ముస్లిములంతా
ఆయన
చుట్టు
తిరిగేవారు.
బాబా
వేషము
చూస్తే
అంతా
ముస్లిము
మాదిరే
ఉంటున్నాడు.
కనుక
చాలామంది
ముస్లింలు
వచ్చి
అతనిని
ఆశ్రయించేటువంటివారు.
అలాగే
రామ,
కృష్ణ
నామములు
ఉచ్చరించినపుడు
హిందువులుకూడా
వచ్చి
ధూప
దీప
నైవేద్యాలంతా
పెట్టేవారు.
ఈ
విధంగా
జరుగుతుంటే
హిందువులయొక్క
సాంప్రదాయము
ముస్లింలకు
నచ్చక,
మహమ్మదీయుల
పద్ధతి
హిందువులకు
నచ్చక
వారిమధ్య
ద్వేషం
పెరిగిపోయింది.
ఒకనాడు
మహల్సాపతి
బాబా
దగ్గర
కూర్చుని
ఏదో
సేవ
చేస్తున్నాడు.
అతడు
షిర్డీ
గ్రామములో
ఉన్న
ఖండోబా
దేవాలయం
పురోహితుడు.
కనుక,
అతను
హిందువు.
అతడు
వచ్చి
బాబా
దగ్గర
కూర్చున్నాడని
ముస్లిములంతా
కఱ్ఱలు
పట్టుకుని
వచ్చి
మహల్సాపతిని
కొట్టారు.
7
▾
Meaning
Keep
మహల్సాపతి
ప్రతి
దెబ్బకు
కూడను
‘బాబా,
బాబా,
బాబా’
అని
అరుస్తూ
వచ్చాడు.
ఒక్కొక్కసారి
అతడు
బాబా
అన్నప్పుడంతా
ఈ
దెబ్బలన్నీ
బాబా
వీపుకి
తగిలాయి.
కొంత
సేపటికి
మహల్సాపతి
క్రింద
పడిపోయాడు.
బాబా
బయటకు
వచ్చాడు.
బాబా
అంటే
మహా
విశ్వాసం,
ముస్లిములందరికి
కూడను.
బాబా
వచ్చి
‘సైతాన్,
ఒక
వైపున
ప్రార్థించడం,
ఒక
వైపున
దెబ్బలు
కొట్టటం
ఇదా
మీ
భక్తి!’
అని
గర్జించాడు.
‘ఆరాధన
చేస్తున్నారు
ఒక
వైపున,
మరొక
వైపున
హింసలు
పెడుతున్నారు,’
అనేటప్పటికి
బాబా
శరీరమునుండి
రక్తం
అంతా
వస్తుండాది.
చూచారు
ముస్లిములు.
‘బాబా!
మిమ్మల్ని
ఎవరు
కొట్టారు?’
అని
కంగారుగా
పరుగెత్తి
వచ్చారు.
‘నీవు
కొట్టలేదా!
నీవు
కొట్టలేదా!’
అని
వారినే
చూపించాడు,
బాబా.
‘అసలు
మీ
దగ్గరికే
మేము
రాలేదే!
మేము
మహల్సాపతిని
మాత్రమే
కొట్టాము’
అన్నారు.
అప్పుడు
బాబా
‘మహల్సాపతిలో
ఎవడున్నాడు?
నేనే
ఉన్నాను.
వాడు
నాకు
శరణాగతి
అయినటువంటివాడు.
కనుక,
తన
బాధలన్నీ
నావే!’
అని
చెప్పాడు.
అప్పుడు
ఆ
ముస్లిములంతా
బాబా
పాదాలు
పట్టుకుని
క్షమించమని
ప్రార్థించారు.
తరువాత
బాబా
ముస్లిములను,
హిందువులను
ఇరువురిని
చేర్చి
‘నాయనా!
ఒక్క
తల్లిబిడ్డలు
మీరు,
అలాగే
ఉండండి’
అని
బోధించాడు.
ఇప్పుడు
చెప్పినట్లుగా
Brotherhood
of
man
and
fatherhood
of
God
అనే
బోధల్ని
తన
ఆచరణలో
నిరూపించాడు,
బాబా.
‘తుచ్ఛమైనటువంటి
కులమతభేదాలు
పెట్టుకోకూడదు’
అని
బాబా
ఈ
విధంగా
బోధించాడు.
“మానవత్వానికి
హృదయమే
ప్రధానము.
మతములో
వెతికినటువంటివానికి
మాధవుడు
కనిపించడు.
మతిలో
వెతుకు.
మతిలో
వెదికినప్పుడు
నీకు
మాధవుడు
కనిపిస్తాడు.
ఈ
కులమతములు
అంతాకూడను
దేహమునకు
సంబంధించినవే!
ఇవన్నీ
ప్రాకృతమైనటువంటివే!
కనుక,
పరతత్త్వమునకు
సంబంధించినటువంటి
మతిలో
నీవు
భగవంతునికొరకు
వెదుకు.”
ఈ
విధంగా
జరిగిపోయింది,
అప్పటినుంచి
బాబా
జీవితము.
రెండవ
పర్యాయము
చాంద్‌భాయ్
పటేల్
కుటుంబముతో
కలసి
వచ్చినటువంటి
బాబా
తిరిగి
1918
వరకు
అంటే
సమాధి
చెందేవరకు
షిరిడీని
వదలలేదు.
మొత్తం
80
సంవత్సరములు
బాబా
జీవించాడు.
ఒకనాడు
ఒక
పండితుడు
వచ్చి
‘బాబా
జీవిత
చరిత్రను
వ్రాయాలి’
అని
ఆశించాడు.
8
▾
Meaning
Keep
అతని
పేరు
హేమద్‌పంత్.
అతనే
సాయి
చరిత్ర
వ్రాసినటువంటివాడు.
అతను
ఎంతో
ప్రార్థించాడు.
‘మీరు
ఎక్కడ
పుట్టారు?
మీ
తల్లితండ్రులు
ఎవరు?
మీ
పేరేమిటి?’
అని
చాలా
ప్రశ్నిస్తూ
వచ్చాడు,
బాబాను.
ఈ
విషయాలు
బాబా
ఎవ్వరికీ
చెప్పలేదు.
కాని,
ఒక
సమయంలోపల
ఏకాంతంగా
సేవ
చేస్తున్న
సమయంలో
మహల్సాపతికి
మాత్రం
ఆ
పుట్టిన
తేదీ
చెప్పాడు.
నిజానికి
మహల్సాపతి
పండితుడు
కాదు,
పాపం!
ఏదో
కొన్ని
పూజలు
చెయ్యటానికి
మాత్రం
కొద్దిగా
మంత్రాలు
నేర్చుకున్నటువంటివాడు.
బాబా
చెప్పిన
విషయాన్ని
అతడు
ఒక
చిన్న
కాగితంలో
వ్రాసి
పెట్టుకున్నాడు.
అది
హేమద్‌పంత్‌కు
చిక్కింది.
దానిని
తీసుకుని
అతడు
క్రమక్రమేణా
బాబా
జీవిత
చరిత్ర
వ్రాస్తూ
వచ్చాడు.
ఇంతకు
మించి
బాబా
తత్త్వం
ఎవ్వరికి
ఎక్కువగా
తెలీదు.
బాబాను
గురించి
పదహారవ
సంవత్సరంనుంచి
మాత్రమే
ప్రపంచానికి
తెలిసినటువంటిది.
బాబా
సెప్టెంబర్
27వ
తేదీ
పుట్టి
విజయదశమి
రోజున
శరీరాన్ని
వదిలాడు.
అనగా
1838లో
పుట్టి
1918లో
దేహాన్ని
వదిలాడు.
కాని
ఈ
మధ్యలో
అనేక
విధములైన
పవిత్రమైన
బోధలు
చేసి
తనయొక్క
శక్తి,
సామర్థ్యములు
ప్రజలకు
నిరూపించి
దైవత్వంగా
అందరిచేత
ఆరాధింపబడుతూ
వచ్చాడు.
దాదా,
నానా,
దామై,
అబ్దుల్
బాబా,
చందోర్కర్,
మహల్సాపతి,
వీరందరుకూడా
ఎప్పుడుకూడను
బాబాచుట్టూ
వుండేటువంటివారు.
ఇటీవలి
కాలంవరకుకూడను
అబ్దుల్
బాబా
వుండేటువంటివాడు.
అతను
గొప్ప
భక్తుడు,
పాపం!
ఏ
మతమైతే
ఏమి?
భక్తికి
అందరు
సమానులే!
ఇక
కాకా
దీక్షిత్,
ఇతను
ఒక
జడ్డి.
ఆ
దీక్షిత్
కొడుకే
మన
బృందావనంలోపల
వచ్చి
20
సంవత్సరాలు
వుండినాడు.
ఆయన
భార్యకూడా
ఇప్పుడు
బృందావనంలోనే
ఉంటుండాది.
కనుక
అతను
వ్రాసుకున్నటువంటి
డైరీలోపల
అన్నీ
ఉంటున్నాయి.
బాబా
తిరిగి
ఫలాన
సంవత్సరం,
ఫలాన
చోట
పుడతాడనే
విషయంకూడా
కాకా
దీక్షిత్
వ్రాసుకున్నాడు.
దైవత్వానికి
ఇట్టిది,
అట్టిది
అని
సంబంధము
కలిగేటువంటిది
కాదు.
ఆత్మకు
ఆత్మయే
సంబంధము.
కాని
అనేకమంది
ఈ
కలియుగ
ప్రభావంచేత
దైవత్వమును
దేహ
సంబంధముగా
చూసుకుని
అనేక
విధములైన
అపోహలకు
గురి
అవుతుంటారు.
దీనికి
కారణమేమనగా
ప్రాకృత
భావములు
అభివృద్ధి
కావటమే!
ప్రాకృత
భావములనగా
ఏమిటి?
9
▾
Meaning
Keep
అనగా
శబ్ద,
స్పర్శ,
రూప,
రస,
గంధాదులతో
కూడినదే
ప్రాకృత
భావము.
భోగభాగ్యములతో
కూడినటువంటిది
ప్రకృతి,
త్యాగ
భావముతో
కూడినటువంటిది
ఆధ్యాత్మికం.
భోగభాగ్యములను
త్యాగము
చేసినప్పుడే
ఆధ్యాత్మికము
లభిస్తుంది.
కనుకనే
‘నకర్మణా
నప్రజయా
ధనేన
త్యాగేనైకే
అమృతత్వమానసుః’
అన్నారు.
అమృతత్వం
మనకు
ప్రాప్తించాలంటే
త్యాగం
కావాలి.
కానీ
ఈనాటి
మానవుడు
త్యాగమునకు
సిద్ధముగా
లేడు.
భౌతికమైన
భోగభాగ్యములు
ఆశించి,
ఆశించి
మితిమీరిన
కోరికలతో
మతి
చెడుపుకుంటున్నాడు.
ఈ
ఆశలకు
అంత్యమే
లేదు.
కనుకనే
మానవత్వము
క్రమక్రమేణా
నశించిపోతుండాది.
మనసంతా
మాలిన్యమే
పోతుండాది.
వాక్కులంతాకూడను
అసత్యంతో
నిండిపోతుండాయి.
మానవుడు
అడుగు
పెట్టిందంతాకూడను
అధర్మంగా
మారిపోతుండాది.
కోరిన
కోరికలకు
మితమే
లేకపోతుండాది.
దివ్యచైతన్యం
అడుగంటిపోతుండాది.
అభ్యుదయ
భావాలు
అంతరించి
పోతుండాయి.
ద్వేష,
అసూయలు
మితిమీరిపోతున్నాయి.
కామ
క్రోధాదులు
మానవుని
కట్టిపడవేస్తున్నాయి.
మానవత్వమే
లేకుండా
పోతుండాది.
మానవులుగా
జీవిస్తున్నారే
కానీ,
మానవత్వం
లేదు.
హృదయ
తత్త్వమును
అనుసరించటమే
human
quality
మానవత్వం
ఉన్నప్పుడే
వాడు
మానవుడు.
Human
quality
అంటే
ఏమిటి?
హృదయ
తత్త్వాన్ని
అనుసరించటమే
human
quality.
నీ
conscience
ని
నువ్వు
follow
చెయ్యి;
దేహాన్ని
follow
చెయ్యొద్దు?
మనసును
follow
చెయ్యొద్దు.
Mind
is
a
mad
monkey,
body
is
like
a
water
bubble.
Don’t
follow
the
body,
don’t
follow
the
mind,
follow
the
conscience.
ఇది
మనము
చెయ్యవలసినటువంటిది.
ఈ
conscience
అనేటువంటిది
ఎక్కడినుంచి
వచ్చింది?
సర్వత్రా
వ్యాపించినటువంటి
consciousness
నుంచి
వచ్చింది.
ఈ
consciousness
యే
చైతన్యము.
ఈ
చైతన్యము
నుంచి
వచ్చింది
witness.
అదే
conscience.
ఆ
conscience
యే
mind.
కనుక
ఈ
consciousness
యే
ఆత్మ.
Conscious
యే
body.
Conscious,
conscience,
consciousness.
Conscious-body,
senses
తో
కూడినది
body,
witness
తో
కూడింది
mind,
చైతన్యంతో
కూడినటువంటిది
ఆత్మ.
కనుకనే
The
one
you
think
you
are
-
that
is
conscious.
The
one
others
think
you
are
-
that
is
conscience.
10
▾
Meaning
Keep
The
one
you
really
are
-
that
is
consciousness.
దీనినే
ఇస్లాంమతంలో
I
am
in
the
light,
I
am
in
the
light
అన్నారు.
అనగా
నేను
పరాధీనుడిని.
నేను
లోపల
చిక్కుకున్నాను.
అనగా
వెలుగులో
వుంటున్నాను.
కొంత
కాలం
practice
చేసేసి
No-No.
The
light
is
in
me.
The
light
is
in
me
అన్నారు.
ఆఖరికి
I
am
the
light
అన్నారు.
I
am
in
the
light
-
conscious.
The
light
is
in
me
-
conscience.
I
am
the
light
-
consciousness.
ఇదే
భావము
క్రిస్టియన్
మతములో
కూడను
వచ్చింది.
జీసస్
మొట్టమొదట
I
am
the
messenger
of
God
అన్నాడు.
ఇదే
conscious.
Messenger
అనగా
ఏమిటి?
Master
వేరే
ఉన్నాడు,
messenger
వేరు
ఉన్నాడు.
Master
కు
messenger
కు
సంబంధమే
లేదు
కానీ
కొంతకాలం
సాధన
జరిపి,
I
am
the
son
of
God
అన్నాడు.
అనగా
master
తో
సంబంధం
ఏర్పడిపోయింది.
Father
and
son
సంబంధం
ఏర్పడిపోయింది.
ఇదే
The
one
others
think
you
are.
Next,
I
and
my
father
are
one
అన్నాడు.
ఇదే
consciousness.
చూశారా!
ఇవి
జరిగేటప్పటికి
Holy
ghost
స్థితి
వచ్చేసింది.
అదియే
మన
వేదాంతిక
పరిభాషలో
తురీయావస్థ
అన్నారు.
దీని
అంతరార్థాన్ని
ఎవరూ
గుర్తించుకొనలేక
హిందువులు,
మహమ్మదీయులు,
ఇంకా
క్రిష్టియన్లు,
బుద్ధిస్టులు,
జొరాష్ట్రియన్లు
ఇటువంటి
భేదభావములు
పెంచుకుని
ఒకరితో
ఒకరు
పోట్లాడుతూ
వుంటున్నారు.
మార్గములు
వేరు,
గమ్యము
ఒక్కటే!
ఏ
మతమునందుకూడను
భేదభావము
బోధింపబడలేదు.
అన్ని
మతములూ
మంచివే!
అన్నీ
ఒకే
సత్యాన్ని
బోధించేటువంటివే!
మార్గములు
వేరు
వేరు,
గమ్యము
ఒక్కటే!
ఈ
సత్యాన్ని
విశాల
హృదయము
కలిగినవారే
కొంతవరకు
అర్థము
చేసుకోగలరు.
సంకుచితమైన
భావములు
కలిగినటువంటివారు
ఒకరికొకరు
కలహించటానికి
పూనుకుంటున్నారు.
Previous
←
Worship Prakṛti and win the grace of the Paramātma
Next
Oṃkāra is the combined form of Ātma, Manas and body
→