Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1992 · Oṃkāra is the combined form of Ātma, Manas and body
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Oṃkāra is the combined form of Ātma, Manas and body
4 October 1992, Dasara, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
Also in his talks
(1)
23 November 1992
Service of the village becomes service of Rāma!
విశ్వమంతా
విష్ణు
వివిధరూపములే
సర్వభూతములందు
సర్వవేళల
ప్రభుని
దివ్యశక్తే
పాలించుచున్నది
జీవకోటులన్ని
దైవమయమే!
దివ్యాత్మ
స్వరూపులారా!
జీవ
జగత్తుకు
జీవనాధారము
పృధ్వియే!
పృధ్వికి
జీవనాధారము
జలము.
జలముయొక్క
సారమే
సస్యము.
ఈ
సస్యముయొక్క
స్వరూపమే
పురుషుడు.
పురుషునియొక్క
పరమార్థమే
వాక్కు.
వాక్కుయొక్క
పటుత్వమే
ఋతము.
అదియే
ఋక్కు.
ఋక్కుయొక్క
సౌందర్యమే
సామము.
సామముయొక్క
సారస్వరూపమే
‘ఓంకారము.’
ఇట్టి
మానవత్వము
దివ్యత్వమునుండి
ఆవిర్భవించి,
దివ్యత్వములోనే
జీవించి,
దివ్యత్వమునందే
అణగిపోతున్నది.
ఈ
ఓంకారమునకు
మూడు
విధములైనట్టి
స్థానములున్నవి.
‘అ’కారమని,
‘ఉ’కారమని,
‘మ’కారమని
మూడు
శబ్దములు.
అకారమే
ప్రాణతత్త్వము.
ఉకారమే
మానవత్వము.
మకారమే
శరీరము.
ఆత్మ,
మనస్సు,
శరీరముయొక్క
సమ్మిళితమైన
స్వరూపమే
ఓంకారము.
ఈ
‘అ’కారమునుండి
ఆవిర్భవించినట్టిదే
యీ
జగత్తు,
అదియే
ప్రాణము.
‘ఉ’కారమునుండి
ఆవిర్భవించినట్టిదే
మానసిక
తత్త్వము.
‘మ’కారమునుండి
ఉద్భవించినట్టిదే
యీ
శరీరము.
అకార,
ఉకార,
మకారములయొక్క
తత్త్వమైన
ఆత్మ,
మనస్సు,
శరీరములనేటంటి
మూడు
తత్త్వములుకూడను,
దివి,
భువి,
రవిలవరకుకూడను
వ్యాపించినట్టివి.
సమస్త
సృష్టికికూడను
ఓంకారమే
సారభూతము.
2
▾
Meaning
Keep
జగత్తంతయుకూడను
నాద,
బిందు,
కళలతో
కూడినది
ఈ
ఓంకార
తత్త్వము
మూడు
విధములైనట్టి
ఒక
సృష్టినుండి
ఏర్పడినది-నాద,
బిందు,
కళ
అని.
కనుక,
నాదబిందుకళా
స్వరూపమైనట్టిదీ
ఓంకారము.
నాదమనగా
ప్రాణవాయువుయొక్క
ఘోర
శబ్దమే!
అనగా
ప్రాణతత్త్వముతో
కూడినటువంటి
ఘీంకారమే
యీ
ఓంకారము.
ప్రాణ,
అపాన,
వ్యాన,
ఉదాన,
సమాన
అనేటువంటివి
ప్రాణతత్త్వములో
నున్నటువంటి
స్వరూపములు.
ఈ
ఐదుకూడను
ఐదు
భూతములుగా
ఏర్పడినవి.
ప్రాణవాయువుయొక్క
శబ్ద
స్వరూపమే
నాదము.
శరీర,
మనో,
ఆత్మలయొక్క
సమ్మిళిత
స్వరూపమే
దీనిలోనున్నటువంటి
ఒక
బిందు.
బుద్ధియందు
ప్రతిబింబించే
పరమాత్మునియొక్క
ప్రతిబింబమే
దీనికి
కళ.
నాద
బిందు
కళ
అనేటువంటి
స్వరూపము
జగత్తంతా
వ్యాపించియున్నది.
కాని,
దీనియొక్క
వినియోగమేమిటి?
నాద,
బిందు,
కళ
యీ
మూడుకూడను
మాయా
స్వరూపములే!
అకార,
ఉకార,
మకారములుకూడను
మాయా
స్వరూపములే!
ప్రాణము,
మనస్సు
మరియు
శరీర
తత్వములుకూడను
మాయా
బిందువులే!
కనుకనే
పూర్వ
ఋషులు
‘తస్మై
నమః’
అన్నారు.
అనగా
ఒక్క
రూపమునకు
సంబంధము
కాకుండా,
సమస్త
జగత్తునందు
కూడను
వ్యాపించి
యున్నది
దివ్యత్వము
ఒక్కటే!
తదుపరి
యోగులు
ప్రార్థించారు.
‘నాద
బిందు
కళాతీత
నమో
నమః.’
‘నాద
బిందు
కళాతీత,
ఈ
మూడింటికి
అతీతమైనట్టి
ఓ
పరమాత్మ!
నీకొక్క
నమస్కారము,’
అన్నారు.
కనుక
జగత్తంతయుకూడను
నాద,
బిందు,
కళలతో
కూడినటువంటిది.
అంతర్భూతమై,
సర్వవ్యాపకమై,
సర్వశక్తిమయమైన
సత్
అనే
చైతన్యమును
జీవితానికి
ఆధారము
చేసుకోవడమే
సత్సంగము
అయితే,
ఈ
నాద
బిందు
కళాతత్త్వములు
మానవుడు
ఏ
రీతిగా
గుర్తించడానికి
వీలవుతుంది?
దీనికి
‘సత్సంగము’
అత్యవసరమన్నారు.
ఈనాడు
ప్రాపంచిక
దృష్టిలో
సత్సంగమనగా
‘గుడ్
కంపెనీ’
అనుకుంటున్నాం.
ఇది
సరియైనట్టి
అర్థము
కాదు.
‘సత్’
అనగా
త్రికాలములయందుకూడను
శాశ్వతముగా
నిలువగలిగినట్టిదే!
ఇట్టి
సత్నందు
సంగము
ఏర్పరచుకోవడమే,
సత్సంగము
అన్నారు.
అనగా
సర్వ
భూతములందుకూడను
ఉండినట్టి
చైతన్యశక్తియే
సత్.
ఒక్క
వ్యక్తి
యందున్నట్టి
చైతన్యమునకు
‘సత్’
అని
చెప్పకూడదు.
3
▾
Meaning
Keep
సర్వజీవులయందు,
సమస్త
రూపాలను
ధరించినటువంటి
చైతన్యమునకే
‘సత్’
అని
పేరు.
చైతన్య
స్వరూపమైనట్టి
యీ
దివ్యశక్తితో
సంబంధ
బాంధవ్యము
కలిగించుకోవడమే
సత్సంగము.
ఏదో
కొంతమంది
వ్యక్తులతోకూడి
ఒక
భగవచ్చింతనగాని,
నామస్మరణగాని,
సత్కార్యమునందు
పాల్గొనడంగాని
చేయడము
సత్సంగమని
సాధారణముగా
భావిస్తున్నారు.
ఇది
సత్సంగము
కాదు.
అంతర్భూతమై,
సర్వవ్యాపకమై,
సర్వశక్తిమయమై,
ఉండిన
సత్
అనే
చైతన్యమును
జీవితానికి
ఆధారము
చేసుకోవడమే
సత్సంగము.
మోహముయొక్క
అంతరార్థమును
గుర్తించినప్పుడే
మానవునికి
మోహము
తొలగిపోతుంది
అయితే,
ఇట్టి
సత్సంగమునకు
‘మోహము’
అడ్డు
తగులుతుంది
ఏమిటీ
మోహమంటే?
ధనేషణ,
దారేషణ,
పుత్రేషణ
యిత్యాదిదా
మోహము?
కాదు.
మోహముయొక్క
అంతరార్థమును
గుర్తించినప్పుడే,
యీ
మోహముపైన
మానవునికి
మోహము
తొలగిపోతుంది.
మ+ఊహ=మోహ.
‘మ’
అనగా
పరిమితము,
‘ఊహ’
అనగా
లేనిదానిని
చింతించుకోవడము.
చూశారా?
మోహమనగా
ఏమి?
పరిమితమైన
భ్రాంతి
చింతనే
మోహము.
ఇది
దైవముతో
సంబంధము
లేనటువంటిది.
దివ్యత్వమున
కతీతమైనట్టి
ఒక
తత్త్వమును
ఊహిస్తున్నామని
మనం
భావిస్తున్నాము.
కాదు.
ఇది
ప్రాకృతమైనటువంటిది.
ఈ
మోహము
దేనివలన
చేరియుంటున్నది?
దీనినే
‘కామ’
అన్నారు.
అనగా
కోరిక.
‘కామ’
అనగా
ఏమిటి?
‘కా’
అనగా
సుఖము.
‘మ’
అనగా
పరిమితము.
పరిమితమైన
సుఖమే
కామము.
అదియే
కోరిక.
మానవుడు
ఏ
కోరికలు
కోరినప్పటికినీ,
పరిమితమైనటువంటివే!
అపరిమితమైనది
దివ్యమైన
భావము
ఒక్కటే!
అదియే
దైవ
భావము.
అది
సర్వత్రా
ఉండినట్టి
చైతన్యము.
ఈ
చైతన్యరూపములు
శాశ్వతము
కాదు.
ఈ
చైతన్యముకూడను
ప్రాకృతమైనట్టిదే.
ఈ
ప్రాకృతమైనట్టి
చైతన్యముకూడను
సత్,
చిత్,
ఆనందముద్వారా
ఏర్పడుతున్నది.
సత్
అనగా
నిరంతరము
ఉండేటంటిది.
శాశ్వతమైనటువంటిది.
చిత్
పరిపూర్ణమైనటువంటి
జ్ఞానము.
ఏదో
అంతో,
యింతో
తెలుసుకునేటువంటి
జ్ఞానము
కాదు.
సత్
తత్త్వాన్ని
పరిపూర్ణముగా
అర్థము
చేసుకున్నట్టిదే
చిత్.
కనుక
ఈ
రెండుకూడను
ప్రాకృతానికి
అతీతముగా
ఉంటాయి.
4
▾
Meaning
Keep
పంచభూతములయొక్క
వికాసమే
ప్రపంచము
దీనిని
ఏరీతిగా
వేరు
చేయాలి?
ఒక
పాత్రను
చూచేవాడు
పాత్రకంటే
తాను
వేరయి
ఉండాలి
కదా?
కుండను
చూచేవాడు
కుండకంటే
వేరైనట్టివానిగా
ఉండాలి.
మానవ
దేహము
ఒక
పాత్ర
వంటిది.
ఈ
పాత్రను
చూచేవాడు
పాత్రకంటే
వేరుగా
ఉండాలి.
అయితే
పాత్రను
చూచే
వ్యక్తి
తాను
వేరుగా
ఉండినప్పటికిని
పాత్రయందుకూడ
ఉంటున్నాడు.
పాత్రలో
సూర్యుడు
కనిపిస్తున్నాడు.
పాత్ర
కల్పితము.
సూర్యుడు
ఎక్కడనుంచో
వచ్చినవాడు
కాడు,
ఎక్కడికో
పోయేవాడు
కాడు.
అతను
శాశ్వతుడు.
దీని
అర్థము
శాశ్వతమైనట్టి
సూర్యుడు,
అశాశ్వతమైనట్టి
పాత్రలో
ఉన్నాడని
కాదు.
పాత్రలోను
ఉన్నాడు,
పాత్ర
వెలుపలా
ఉన్నాడు.
‘అంతర్బహిశ్చతత్సర్వమ్
వ్యాప్య
నారాయణస్థితః’
సర్వత్రా
ఉంటున్నాడు,
సూర్యుడు.
పాత్రలోకూడ
కనిపిస్తున్నాడు.
కనుకనే
దేహమనే
పాత్రయందు,
మనస్సనే
జలమునందు
ప్రాణమనే
ఆత్మ
కనిపిస్తుండాది.
అయితే
యీ
ప్రాణమనే
ఆత్మ
పాత్రకు
మాత్రమే
పరిమితమైనది
కాదు.
పాత్ర
మాత్రము
పరిమితము.
జలము
పరిమితము,
కాని
ప్రాణము
పరిమితము
కాదు.
అదియే
‘ఆత్మతత్త్వము.’
యీనాడు
మనమనుభవించే
సర్వవిధములైనట్టి
ఆనందములు
ప్రాకృతమైనట్టివేకాని,
అతీతమైనట్టివి
కావు.
ప్రతి
మానవుడుకూడను
ఈనాడు
ప్రార్థనకాని,
జపములుకాని,
ధ్యానములుకాని,
యోగములుకాని,
యజ్ఞములుకాని
ప్రాకృతమైన,
పరిమితమైన
విజయాన్ని
పొందే
నిమిత్తమై
చేస్తున్నాడు.
యీ
అశాశ్వతమైనటువంటి,
పరిమితమైనట్టి
సాధనలతో
విజయాన్ని
యెంతవరకు
మనము
సాధించగలము?
మానవుని
జీవితము
పరిమితము,
మనస్సు
పరిమితము;
అసలు
ప్రపంచమే
పరిమితము.
ప్రపంచము-‘ప్ర’
అనగా
వికాసము;
‘పంచము’
అనగా
శబ్ద,
స్పర్శ,
రూప,
రస,
గంధములు.
ఈ
పంచభూతములయొక్క
వికాసమే
ప్రపంచము.
ఈ
పంచభూతములతో
ఏర్పడినట్టి
ప్రపంచము
పరిమితము
కాక,
అపరిమితము
ఎట్లా
అవుతుంది?
కనుకనే
మన
జీవితమంతయుకూడను
పరిమితమైనట్టి
ఆనందమునే,
పరిమితమైన
సుఖమునే,
అనుభవిస్తున్నాము.
5
▾
Meaning
Keep
దీనిని
అపరిమితమైన
రీతిగా
మార్చుకోవడం
ఎట్లా?
పరిమితము,
అపరిమితము
రెండింటిని
వేరు
చేయకుండా
మనము
చూచుకోవాలి.
దీనినే
‘యూనిటీ
ఇన్
డైవర్సిటీ,’
అన్నారు.
అనేకత్వములో
నుండినటువంటి
ఏకత్వాన్ని
చూడాలి.
అనేకత్వంలో
నుండినటువంటి
ఏకత్వాన్ని
ఏరీతిగా
చూడగలము?
ఈ
దేహములన్నీ
అనేకముగా
కనిపిస్తున్నాయి.
శబ్దములు
వేరు
వేరుగా
వినిపిస్తున్నాయి.
అనుభూతులు
వేరు
వేరుగా
ఉంటున్నాయి.
కాని,
యిందులో
ఏకత్వము
ఒకటి
ఉన్నది.
అన్ని
దేహములయందుకూడను
శబ్ద,
స్పర్శ,
రూప,
రస,
గంధములు
ఐదును
సమానమే!
మానవుని
దేహమునందు
ప్రాకృతశక్తి
అధికంగా
ఉంటుండాది.
మానవ
దేహము
కేవలము
మృణ్మయ
స్వరూపము
కాదు.
దీనిలో
చిన్మయమైన
ప్రాణముకూడ
ఉంటుండాది.
వేదాంతులు
దీనిని
‘మట్టిబొమ్మ’
అని
పిలిచారు.
యీ
దేహమునందు
ప్రాకృతభావము
అధికముగా
ఉండడంచేత
ఇది
సులభంగా
ఉన్నతస్థాయికి
చేరుకోలేకపోతున్నది.
దీనిని
ఉన్నతస్థాయికి
గొనిపోవాలన్న
ఒక
మంత్రశక్తియో
లేక
యంత్రశక్తియో
అత్యవసరము.
పృథ్వీ
భావము
మన
దేహములో
అధికముగా
ఉంటుండాది.
ఆధ్యాత్మికంగా
మనము
పైకిపోయినా,
యీ
పృథ్వీభావము
క్రిందకు
లాగుతుంటాది.
కనుకనే
మానవుడు
ఉన్నతస్థాయికి
పోలేకపోతున్నాడు.
అనేకత్వములోని
ఏకత్వాన్ని
ప్రాతిపదికగా
తీసుకుంటే
నిత్యజీవితములో
మానవులందరూ
ఒక్కటే!
మానవునిలో
ఉండినటువంటి
దివ్యత్వాన్ని
ఏరీతిగా
మనము
గుర్తించడానికి
వీలవుతుంది?
సర్వ
జీవులయందు
ఉండినటువంటి
భూతములు
ఒక్కటే!
‘ఆత్మానాం
రథినం
విద్ధి,
శరీరం
రథమేవచ.’
ఈ
శరీరమనేది
రథము.
అది
అందరికీ
సమానమే!
దీనిలో
ఉండినట్టి
రథికుడు
ఒక్కడే.
జనన,
మరణాలు
సర్వులకు
ఒక్కటే!
ఆకలిదప్పులు
సర్వులకొక్కటే!
పేదవాడు
అంబలిగంజి
త్రాగి
ఆకలి
తీర్చుకోవచ్చు.
‘రిచ్మేన్’
పంచభక్ష్య
పరమాన్నములతో
సంతుష్టి
అయినట్టి
అన్నము
భుజించవచ్చు.
అన్నములవి
వేరు,
ఆకలి
ఒక్కటే!
కోటీశ్వరుడనేటంటివాడు
ఆకాశమునుండి
ఉట్టి
పడడు.
బీదవాడు
భూమినుంచి
పుట్టిరాడు.
ఇరువురును
తల్లి
గర్భమునుండే
పుడ్తున్నారు.
కనుక
ఇవన్నీ
సమానమే.
6
▾
Meaning
Keep
కనుకనే
యీ
‘యూనిటీ
ఇన్
డైవర్సిటీ’
అంటే
అనేకత్వములోనున్నటువంటి
ఏకత్వాన్ని
తీసుకుంటే,
నిత్య
జీవితములో
మనమందరమూ
ఒక్కటే!
మనయొక్క
జీవిత
ఉపాధికోసమని,
లేక
జీవిత
అవసరాలకోసమని
దీనిని
మనము
అనేకముగా
భావిస్తున్నాము.
ఇదికూడా
కేవలము
పరిమితమైనట్టి
సంతోషముకోసం!
బంగారంతో
ఒక
చైన్
చేయించుకోవచ్చు,
రింగు
చేయించుకోవచ్చు,
గాజులు
చేయించుకోవచ్చు;
కాని,
బంగారం
ఒక్కటే!
అలంకార
నిమిత్తమై
అనేక
ఆభరణాలు
మనము
కల్పించుకుంటున్నాము.
అనిత్యమైనట్టి
జీవిత
నిమిత్తమై
ఇన్ని
ఏర్పాట్లు
మనము
గావించుకుంటున్నామేకాని
సత్యముగా
ఉన్నది
ఒక్కటే!
అదే
నిత్యమైనట్టి
చైతన్యము.
మోహక్షయమే
మోక్షము
నవరాత్రి
మహోత్సవములనగా
ఏమిటి?
ప్రాకృతమైనట్టి
శక్తిని
స్వాధీనము
గావించుకుని
తద్వారా
మానసిక
తృప్తిని
పొందడము.
ఈ
మానసికశక్తి
సులభంగా
లభించేటువంటిదికాదు.
మనస్సు
కోరికల
పుట్ట!
ఒకటి
తీరిన
వెంటనే
మరొకటి
కావాలని
ఆశిస్తుంది.
యీ
ఆశలకు
అంతమే
లేదు.
కనుకనే
దీనికి
‘కోరిక’
లేక
‘కామము’
అని
పేరు
పెట్టారు.
మనము
కావాలనుకునేవన్నీ
కోరికలే!
మోక్షం
కావాలనేదికూడా
కోరికనే!
ఈ
కోరికలనేవి
ఉండినంతవరకు
మనకు
ప్రాకృతమైన
బంధము
తప్పదు.
మోక్షమంటే
ఏమిటి?
మొన్న
చెప్పాను,
‘మోహమనేది
పోతే
మోక్షము.’
‘మో’
అక్షరము,
మోహము;
‘క్ష’
అనే
దానికి
క్షయము.
‘ము’
అనే
దానికి
ముక్తి.
‘మోహక్షయమే
మోక్షము.’
అనగా
పరిమితమైనట్టి,
అనిత్యమైనట్టి
వాంఛలను
నిర్మూలము
గావించుకోవడమే
మోక్షము.
అయితే,
ఇక
దేనిని
మనము
ఆశించాలి?
నిత్యసత్యమైనట్టి
దివ్యత్వము
ఒకటున్నది.
అదియే
ప్రేమ.
ప్రేమ
అనేది
ప్రాకృతమైనట్టిది
కాదు.
ప్రేమను
ఈనాడు
మనము
ప్రాకృతమైనట్టి
దానిక్రింద
మార్చుకుని
ఒక
విధమైన
అనురాగముగా
అనుభవిస్తున్నాము.
తల్లి,
బిడ్డలమధ్య
ప్రేమ
అంటున్నాము.
అది
ప్రేమకాదు,
అనురాగమే!
భార్యా,
భర్తలమధ్య
ప్రేమ
అంటున్నాము.
అది
ప్రేమకాదు.
అదీ
అనురాగమే!
మనమీనాడు
లోకములో
ఏమేమి
అనుభవిస్తున్నామో,
ఇవన్నీకూడను
మోహముతోకూడిన
అనురాగములే!
ప్రాకృతమైనట్టి
వాంఛలన్నీకూడను
అనురాగములే!
ఈ
అనురాగమెప్పుడు
వస్తుంది?
7
▾
Meaning
Keep
మధ్యలో
వచ్చి
మధ్యలో
పొయ్యేటువంటిది.
‘నా
కుమారుడు’
అనుకుంటావు.
ఈ
కుమారుడు
నీతోబాటు
పుట్టాడా?
కాదు,
మధ్యలో
వచ్చాడు.
కాబట్టి
మధ్యలో
పోతున్నాడు.
భార్య,
భర్త
వీరు
ఒకేసారి
పుట్టిన
తక్షణమే
భార్యాభర్తలుగా
వచ్చారా?
కొంతకాలమునకీ
సంబంధమేర్పడిపోయింది.
కాబట్టి
మధ్యలో
వచ్చినవే
యివన్నీ!
ధనము
మనము
పుట్టినప్పుడు
తీసుకుని
వచ్చామా?
లేదు.
పుట్టినప్పుడు
వట్టి
చేతులతోనే
వచ్చాము.
పోయే
సమయములో
వట్టి
చేతులతోనే
పోతున్నాము.
ఇది
మధ్యలో
వచ్చింది.
కనుక,
మధ్యలో
పోతుంది.
కదలిపోయే
మేఘములే
ఇవన్నీ.
కదలిపోయే
మేఘములవంటి
యీ
మోహమునకు
అభిమానమనే
పేరే
కాని
ప్రేమ
అని
పేరు
సరికాదు.
నీవు
పుట్టక
పూర్వము
భగవంతుడున్నాడు.
నీ
జీవితములోనూ
భగవంతుడున్నాడు.
నీవు
మరణించిన
తర్వాతకూడా
భగవంతుడుంటాడు.
రాకపోకలు
లేనట్టిది,
దివ్యత్వము.
దానిపైన
ప్రేమయే
నిజమైన
ప్రేమ.
యీ
మధ్యలో
చేరేటువంటివంతా
శబ్దములయొక్క
మార్పులే!
ఒక
అమ్మాయిని
ఒక
అబ్బాయికిచ్చి
పెళ్లి
చేస్తున్నారు.
ఇది
‘మ్యారేజి’
అన్నారు.
జీవాత్ముడు
పరమాత్మతో
చేరిపోతున్నాడు.
దీనిని
‘మెర్జ్’
అన్నారు.
‘అది
మ్యారేజి,
ఇది
మెర్జ్.’
ప్రొనన్సియేషన్
డిఫరెన్స్‌గా
ఉందికాని
ఇది
ఏకమే!
‘మనస్సు
భగవంతునియందు
లగ్నము
కావడం
లేదు’
అంటాము.
ఈ
లగ్నమంటే
ఏమిటి?
చేరిపోవడమే!
లగ్న
పత్రిక
కొట్టిస్తున్నామంటారు.
లగ్నపత్రిక
అంటే
ఏమిటి?
అమ్మాయిని
అబ్బాయికిచ్చి
వివాహము
చేయడానికి
లగ్నపత్రిక
కొట్టిస్తున్నాము.
జీవాత్మ
పరమాత్మల
ఐక్యముతో
కూడినటువంటిదానికి
‘మెర్జ్’
అన్నారు.
కనుక,
ప్రాకృతమైన
మార్గమునందు
అనేక
విధమైనట్టి
సాధనలు
చేసి,
దీనికి
‘దుర్గ,
లక్ష్మి,
సరస్వతి’
అని
పేరు
పెట్టుకుని
ఈ
పది
దినములుకూడను
ప్రకృతిని
ఆరాధన
సలుపుతూ
వస్తున్నారు.
ఇది
ఎప్పుడు
ప్రారంభమైనాది?
సంకల్పము
మరియు
సాధన
పొగ,
నిప్పువంటివి
ద్వాపరయుగములో
పాండవులు
12
సంవత్సరములు
అరణ్యవాసము
పూర్తిచేసుకుని
13వ
సంవత్సరములో
అజ్ఞాతవాసం
చేసేటప్పుడు
వారి
ఆయుధము
లెక్కడ
దాచిపోవాలి,
అనే
ప్రశ్న
వచ్చినప్పుడు
కృష్ణుడు
దీనికి
చక్కని
ఒక
ఉపాయము
చెప్పాడు.
‘జమ్మిచెట్టుపైన
దాచిపోండి’
అన్నాడు.
ఈ
వృక్షములో
ఒక
విధమైనట్టి
శక్తిసామర్థ్యములుంటున్నాయి.
ఇది
లావుగా
ఉంటుంటాది.
8
▾
Meaning
Keep
ఈ
వృక్షములోపల
ఆయుధములు
దాచిపెట్టేటప్పుడు
అవి
ఎవరికంటా
సులభంగా
కనిపించేవి
కావు.
దీని
కొమ్మలంతా
అగ్నిమయంగా
ఉంటాయి.
యజ్ఞం
ఏదైనా
తలపెట్టినప్పుడు
ఈ
వృక్షముయొక్క
ఒక
కఱ్ఱపైన,
ఒక
కఱ్ఱ
క్రింద
పెట్టి
వాటిని
చిలుకుతారు.
ఈ
మథనమువలన
అగ్ని
ఆవిర్భవిస్తుంది.
అగ్నియందు
ఏ
పదార్థము
వేసినా
అగ్ని
దానిని
భస్మము
చేస్తుంది.
కాని,
అగ్నిని
మాత్రము
అగ్ని
కాపాడుతుంది.
ఈ
విధమైనట్టి
మార్గములో
కృష్ణుని
ఉపదేశము
పురస్కరించుకొని
ఆ
జమ్మి
వృక్షములో
పాండవులు
తమ
ఆయుధములన్నీ
దాచారు.
తిరిగి
వాటిని
ధరించే
సమయములో
వారు
అగ్నిని
ప్రార్థించి
దానిని
సాధించారు.
అగ్ని
ప్రభావితమైన
ఆ
ఆయుధములే
యుద్ధములో
వారికి
విజయాన్ని
సాధింప
చేశాయి.
ఈ
యుద్ధంలో
విజయాన్ని
సాధించిన
దినమే
విజయదశమి.
త్రేతాయుగమునందు
రాముడుకూడను
లంకకు
వెళ్ళి,
రావణమర్దన
జరిపి,
తిరిగి
అయోధ్యకు
వచ్చి
పట్టాభిషేకము
చేసుకున్న
దినముకూడా
విజయదశమే!
కనుకనే
ఆనాటినుండి
విజయదశమి
పర్వదినము
జరుపుకుంటున్నారు.
‘దుర్గ’
అనగా
ప్రాకృతమైనట్టి
శక్తి.
ఈ
ప్రాకృతమైనట్టి
శక్తియందు
అనంతమైనట్టి
శక్తి
ఉంటుండాది.
సంకల్పములకు
ఇట్టిది,
అట్టిది
అనే
నియమము
లేదు.
మనిషైనా
మరణించవచ్చును
కాని,
సంకల్పములు
మరణించవు.
సంకల్పములు
శాశ్వతమైనట్టివి.
ఇట్టి
శాశ్వతమైన
సంకల్పములను
మానవుడు
సత్యమార్గమునందే
సాధించాలి.
సంకల్పము
మరియు
సాధన
ఈ
రెండుకూడ
ఎలాంటివంటే
పొగ,
నిప్పు
వంటివి.
ఈ
పొగ
అధికమైనప్పుడు
నిప్పు
అణగిపోతుంది.
నిప్పు
అధికమైనప్పుడు
పొగ
అణగిపోతుంది.
అదే
విధముగనే
ప్రాకృతశక్తి,
పరాశక్తి
రెండింటియందు
పరాశక్తి
అధికమైనప్పుడు
ప్రాకృతశక్తి
అణగిపోతుంది.
అదేవిధంగా
పరాశక్తి
అణగిపోయినపుడు
ప్రాకృతశక్తి
పెరిగిపోతుంది.
కనుకనే
ప్రాకృత
పవర్‌ని
తగ్గించుకుని,
పరాశక్తి
తత్త్వాన్ని
అభివృద్ధిపరచుకునే
నిమిత్తమై
‘వైరాగ్యము’
అని
చెప్పారు.
ప్రాకృతమైన
శక్తిని
మనమెంతవరకు
తగ్గించుకుందుమో,
పరాశక్తి
తత్త్వము
అంత
అధికమవుతుంది.
9
▾
Meaning
Keep
ఇచ్ఛాశక్తి
మనలో
ఆవిర్భవించాలంటే
కోరికలను
క్రమేణా
తగ్గించుకుంటూ
రావాలి
సంకల్పమునుండే
ఇచ్ఛాశక్తి
ప్రారంభమవుతున్నది.
ఈ
ఇచ్ఛాశక్తి
వలననే
మేధాశక్తి,
విచక్షణాశక్తి,
వాక్శక్తి,
గ్రహణశక్తి,
నిర్ణయశక్తి,
యివన్నీకూడను
ఆవిర్భవిస్తున్నాయి.
దీనిని
మనము
అభివృద్ధిపరచుకోవాలంటే,
దేవీ
ప్రార్థనలు
జరపాలి.
ఇచ్ఛాశక్తిద్వారానే
సర్వశక్తులుకూడను
మనకు
సమకూరుతాయి.
ఈ
ఇచ్ఛాశక్తి
మనలో
ఆవిర్భవించాలంటే,
కోరికలను
క్రమక్రమేణా
తగ్గించుకుంటూ
రావాలి.
దీనికి
చక్కని
ఉదాహరణము.
మీకు
కాఫీ
త్రాగాలని
ఆశ.
టీ
త్రాగాలని
ఆశ,
సిగరెట్
త్రాగాలని
ఆశ,
బ్రాందీ
త్రాగాలని
ఆశ
ఇలాంటి
ఆశలు
ఎన్నో
ఉంటుంటాయి.
ఒక
ఇరవై
ఆశలుంటాయి
అనుకోండి.
అందులో
పది
ఆశలను
మీరు
తగ్గించుకోండి,
ఇచ్ఛాశక్తి
పెరిగిపోతుంది!
మీరు
కాఫీ
త్రాగడం
కొంచెము
మానేయండి.
రెండవరోజు
చూడండి.
మీ
ఇచ్ఛాశక్తి
అభివృద్ధి
అయిపోతుంది.
ఇంకేమైనా
కొన్ని
దురభ్యాసాలు
ఉంటున్నాయనుకోండి,
వాటిని
తగ్గించండి!
ఇచ్ఛాశక్తి
పెరిగిపోతుంది.
కనుక,
ఇచ్ఛాశక్తి
పెరగాలనుకుంటే
ప్రాకృత
శక్తులను,
అభీష్టాలను
తగ్గించుకుంటూ
రావాలి.
దీనినే
వేదాంతము
వైరాగ్యమని
చెప్పింది.
వైరాగ్యమనగా
ప్రాకృతమైనట్టి
వాంఛలను
అదుపులో
పెట్టుకోవడమే!
అన్నీ
వదలి
అడవిలోకి
పోవడం
కాదు,
వైరాగ్యము.
దైవభావాన్ని
పెంచుకోవాలి,
లోకభావాన్ని
త్రుంచుకోవాలి.
ఈ
విధమైనట్టి
‘బ్యాలన్స్’ను
కొంతవరకు
మీలో
‘ఫాలో’
చేసినప్పుడే
దివ్యమైనట్టి
ప్రాకృతశక్తి
మీలో
ఆవిర్భవిస్తుంది.
ఈ
ప్రాకృతశక్తులను
సాధించిన
తర్వాత,
శరీరమునందుండినటువంటి
సంకల్పశక్తులు
నిలచిపోతాయి.
ప్రాకృతశక్తియే
దుర్గ,
సంకల్పశక్తియే
లక్ష్మి,
వాక్శక్తియే
సరస్వతి.
యీ
మూడింటిని
సాధించే
నిమిత్తమై
యీ
నవరాత్రుల్లో
కొన్ని
జపములు,
ధ్యానములు
చేస్తారు.
కేవలము
ప్రార్థించినంత
మాత్రమున
చాలదు.
ప్రార్థనలు
పెదవులనుంచి
మాత్రమే
వస్తున్నాయి.
కాదు
కాదు,
హృదయమునుంచి
రావాలి.
ఈ
హృదయమే
క్షీరసాగరము.
ఆ
క్షీరసాగరముంటేనే
అందులో
లక్ష్మి
ఆవిర్భవిస్తుంది.
ఆ
లక్ష్మి
ఆవిర్భవించేటప్పటికి,
వాక్
శుద్ధి
లభ్యమౌతుంది.
మనము
ఏది
చెప్పినా
కూడను
అది
సత్యమై
పోతుంది.
సత్యము,
ఋతము
అని
ఇక్కడ
రెండు
భావములుంటున్నాయి.
ఋతమనగా
ఏమిటి?
మనస్సు,
వాక్కు,
క్రియల
ఏకత్వముతో
కూడినట్టిదే
ఋతము.
అనగా
త్రికరణశుద్ధియే
ఋతము.
ఈ
ఋతమును
విశ్వసించి,
ఋత
మార్గాన్ని
అనుసరించి,
వాక్కును
పాటించటమే
సత్యము.
10
▾
Meaning
Keep
చెప్పినదంతా
సత్యము
కాదు.
ఈ
మూడింటియొక్క
ఏకత్వముతో
చెప్పినది,
సత్యము.
మూడు
ఏకము
కాకుండా
చెప్పినది
సత్యము
కాదు.
అసత్యమే!
ఆ
యొక్క
సత్యాన్ని
అనుసరించడమే
ధర్మమని
చెప్పారు.
‘సత్యం
నాస్తి
పరోధర్మః,’
సత్యమనే
పునాదిపైనే
ధర్మమనే
భవనాన్ని
నిర్మించాలి.
యీ
పునాదియే
భద్రం
లేకపోతే,
ధర్మమనే
భవనం
నిలువ
లేదు.
నీటి
బుడగవంటి
యీ
భవనమునకు
నిలకడ
ఏరీతిగా
వస్తుంది?
ఈ
నీటి
బుడగమీద
నిర్మించుకున్నట్టి
జీవిత
భవనమే,
సంకల్పభవనము.
ఆ
సంకల్పభవనము
ఇచ్ఛా
భవనంగా
మారిపోవాలి.
ఆ
ఇచ్ఛాశక్తిని
క్రియాశక్తిగా
మార్చినప్పుడే
జ్ఞానశక్తి
మనకు
లభిస్తుంది.
ఇచ్ఛాశక్తి,
క్రియాశక్తి
రెండిటిని
చేర్చినప్పుడే
జ్ఞానశక్తి
మనకు
ఆవిర్భవిస్తుంది.
ఇచ్ఛాశక్తి
‘వాటర్.’
క్రియాశక్తి
‘షుగర్.’
ఈ
రెండింటినీ
‘మిక్స్’
చేసినప్పుడు
‘సిరప్’
అనే
జ్ఞానశక్తి
మనకు
లభిస్తుంది.
ఈ
జ్ఞానము
ఆవిర్భవించినప్పుడే
కైవల్యం
ప్రాప్తిస్తుంది.
‘జ్ఞానాదేవతు
కైవల్యం.’
నవరాత్రి
పూజలనేటంటివి
దుర్గ
ఉంది,
సరస్వతి
ఉంటుండాది.
లక్ష్మి
ఉంటుండాది;
ఆ
లక్ష్మి
విష్ణువు
భార్య,
దుర్గ
శంకరుని
భార్య,
సరస్వతి
బ్రహ్మయొక్క
భార్య
అని
ఈ
రకంగా
పెట్టుకుంటే
మన
ఆలోచనలన్నీ
ప్రాకృతంగానే
వస్తుంటాయి.
దీనిలోపల
సర్వ
శక్తులూ
ఉంటున్నాయి.
పంచభూతములు
సర్వులకును
సమానమే!
విశ్వమంతా
విష్ణువుయొక్క
వివిధరూపములే!
అన్నీ
విష్ణువుయొక్క
స్వరూపాలే!
ఈ
ఏకత్వాన్ని
మనము
విశ్వసించాలి.
ఆభరణాలు
ఎన్ని
ఉన్నప్పటికినీ
బంగారు
ఒక్కటే!
గోవులు
ఎన్ని
ఉన్నప్పటికినీ
పాలరంగు
ఒక్కటే!
ఎన్ని
దేశాలు
ఉన్నప్పటికినీ
భూమి
ఒక్కటే!
ఎన్ని
నక్షత్రాలున్నప్పటికినీ
ఆకాశమొక్కటే!
ఎంతమంది
ప్రజలంతా
యిక్కడకు
వచ్చినప్పటికినీ
వాళ్ళ
బ్రీతింగ్,
అనగా
బ్రెత్
ఒక్కటే.
Beings
are
many,
but
breath
is
one.
ఈ
ఏకత్వమును
మనం
గుర్తించాలి.
నాకొక
గాలి,
ఇతనికి
ఒక
గాలి,
నీకు
మరొక
గాలి
లేదు.
అందరికి
ఒకే
గాలి!
పంచభూతములు
సర్వులకును
సమానమే!
ఈ
పంచభూతములు
ప్రాకృతమైనట్టివే!
పరాతత్త్వమునందు
భూతములే
లేవు.
అవి
అవధూతలు.
అవధూత
తత్త్వానికి
పోవాలంటే
యమదూతలనుంచి
మనము
తప్పించుకోవాలి.
ఏరీతిగా
మనము
తప్పించుకోవడానికి
వీలు
అవుతుంది?
11
▾
Meaning
Keep
భగవత్ప్రేమను
పెంచుకున్నప్పుడే
ఇవన్నీ
సులభంగా
దూరమవుతాయి.
ఆకాశములో
మేఘములు
సంచరిస్తున్నాయి.
చూస్తూ
కూర్చో,
కొంతసేపు!
కొంత
సేపటికి
ఆ
మేఘములన్నీ
వీడిపోతున్నాయి.
మన
హృదయమే
ఆకాశము.
మన
థాట్స్
క్లౌడ్స్.
మన
బుద్ధే
సూర్యుడు.
మన
మైండే
చంద్రుడు.
ఈ
క్లౌడ్స్
దట్టమైనట్టివిగా
వచ్చినప్పుడు
కొంతసేపు
అంధకారము
కమ్ముతుంది.
కాని,
కొంతసేపు
శాంతముగా
ఉంటే
ఈ
అంధకారమంతా
తొలగిపోతుంది.
మన
థాట్సే
క్లౌడ్స్.
ఈ
థాట్స్‌ని
తగ్గించుకోవడమే
వైరాగ్యము.
థాట్స్
ఎప్పుడు
తగ్గిపోతాయో,
కోరికలు
ఆటోమేటిక్‌గా
తగ్గిపోతాయి.
కనుక
దైవతత్వాన్ని
మనం
పెంచుకోవాలి,
ప్రకృతి
తత్వాన్ని
త్రుంచుకోవాలి.
ఈ
నవరాత్రులలో
దేవీపూజ
అనే
సాధనద్వారా
దీనిని
అందరూ
అందుకోగలుగుతున్నారు.
మన
కోరికలంతాకూడను
కొన్ని
మంచి
చెడ్డలతో
కూడి
ఉంటాయి.
కొన్ని
చాల
కఠినమైనట్టివిగా
కూడ
ఉంటుంటాయి.
ఇదే
రాక్షసత్వమని
చెప్పబడుతుంది.
ఈనాడు
మానవునియందు
మూడు
విధములైన
స్థితులు
ఉంటున్నాయి.
ఒకటి
మానవత్వం,
రెండు
పశుత్వం,
మూడు
దానవత్వం.
మానవుల్లోని
మానవుడు,
మానవుల్లోని
దానవుడు,
మానవుల్లోని
పశువు
అని
మూడు
రకాలుగా
ఉంటున్నారు.
ఒక్క
మానవునియందే
ఈ
మూడుకూడ
ఉండి,
వాటిని
మించి
అతీతమైనట్టి
దివ్యత్వంకూడ
ఉంటుంటాది.
దేహాన్ని
అనుసరించేటట్టిది
పశుత్వము.
మనస్సును
మాత్రమే
అనుసరించేటట్టిది
దానవత్వము.
ఆత్మను
మాత్రమే
అనుసరించేటంటిది
దివ్యత్వము.
ఆత్మ,
మనో,
దేహములను
అనుసరించేటంటిది
మానవత్వము.
ఆత్మ,
మనస్సు,
దేహము,
ఈ
మూడింటిని
అనుసరించేటంటిది
మానవత్వము.
కేవలము
దేహాన్ని
మాత్రమే
అనుసరించేటంటిది
పశుత్వము.
నిత్యజీవితములో
మనం
చూస్తున్నాము.
దేహమునకు
ఆకలి
కావాలి,
దప్పిక
కావాలి.
తన
మనస్సు,
విచక్షణా
జ్ఞానం
ఇవన్నీ
దేహాన్ని
మాత్రమే
అనుసరిస్తాయి,
అది
పశుత్వము.
ఇంక
మనస్సును
మాత్రమే
అనుసరించేటువంటిది
దానవత్వం.
వాడు
ఏదైనా
చేయాలనుకుంటే,
విజ్ఞాన,
ప్రజ్ఞాన,
సుజ్ఞానమనేటిదానిని
ఏమాత్రము
విచారించడు.
మనస్సుననుసరించి
మూర్ఖత్వంలో
పడిపోతుంటాడు.
రావణుడు
ఎన్నో
విద్యలు
నేర్చినట్టివాడు.
ఎంతో
వివేక,
విచక్షణా
జ్ఞానము
కలిగినట్టివాడు.
12
▾
Meaning
Keep
సీతను
అపహరించాలి
అని
ఆశ
పడిపోయాడు.
కేవలము
మనస్సును
మాత్రమే
అనుసరించాడు.
కాబట్టి
రావణుడు
రాక్షసుడైనాడు.
ఈ
ఒక్క
గుణము
లేకపోతే,
రావణుడు
రాక్షసుడే
కాడు,
పరమ
భక్తుడు
అవుతాడు.
కనుక,
మనస్సులో
ఏమయినా
వాంఛ
ప్రారంభమయిందంటే
కొంత
సమయము
తీసుకో!
దానిని
నీవు
అనుసరించొద్దు.
అక్కడ
బుద్ధి
పని
చేయడానికి
అవకాశమియ్యి.
Is
it
good
or
bad?
Is
it
right
or
wrong?
అనే
విచక్షణా
జ్ఞానాన్ని
ఉపయోగ
పెట్టుకో!
అటువంటి
వాడు
ఆత్మతత్త్వములో
ప్రవేశిస్తాడు.
కనుకనే
దేహతత్త్వాన్ని
అనుసరించేటంటిది
పశుత్వము,
మనసును
మాత్రమే
అనుసరించేటంటిది
దానవత్వము.
ఈ
విధంగా
పశుత్వము,
దానవత్వము,
మానవత్వము,
దైవత్వము
అని
మానవుల్లో
నాలుగు
విధములైనట్టి
తెగలుంటున్నాయి.
నీవు
దేనిని
అనుసరించాలో
నిర్ణయము
చేసుకోవడంలో
నీకు
స్వాతంత్ర్యము
ఉంటుండాది.
ఇంద్రియాతీతమైనదే
సుషుప్తి
ఆత్మతత్త్వాన్ని
మనము
ప్రధానంగా
తీసుకోవాలి.
మన
హృదయానికి
తగినటువంటి
బలమును
చేకూర్చుకోవాలి.
ఈ
హృదయము
(హార్ట్)
అనేది
‘ఫిజికల్
హార్ట్’
కాదు.
ఫిజికల్
హార్ట్
కేవలము
ఒక
‘స్విచ్‌బోర్డ్’
వంటిది
మాత్రమే!
కరెంట్
లేకపోతే
ఆ
స్విచ్‌బోర్డ్
ఉండి
ఏమి
ప్రయోజనం?
దీనికి
నిజమైనట్టి
కరెంట్
ఎక్కడ
ఉంటుండాది?
‘నీలతోయద
మధ్యస్థా
ద్విద్యుల్లేఖేవ
భాస్వరా!
నీవార
శూకవత్తన్వీ....’
ముప్పయిమూడు
రింగులున్నటువంటి
స్పైనల్కార్డ్లోపల
9
మరియు
12
ఈ
రెండింటి
మధ్యలో
ఉంటుండాది,
ప్రాణము.
హార్ట్‌లో
లేదు
ప్రాణము.
నిజంగా
హార్ట్‌లోనే
ప్రాణం
ఉంటుంటే,
ఈనాడు
ఒక
హార్ట్
తీసి
ఇంకో
హార్ట్
పెడ్తున్నారు.
అది
తీసి
ఇక్కడ
పెట్టినప్పుడు
ఈ
ప్రాణము
ఎక్కడకు
పోయింది?
అందువలన
ఓన్లీ
స్విచ్‌బోర్డ్
మారుస్తున్నారు.
ప్రాణము
వేరే
ఉంటుండాది.
‘సుషుప్తి’
అనే
పదము
ఉన్నది.
సు-షుప్తి.
అనగా
మంచి
నిద్ర.
ఈ
మంచి
నిద్ర
అంటే
ఏమిటి?
ఇంద్రియములు,
మనస్సు,
బుద్ధి
ఈ
మూడింటికి
అతీతమైనదే
సుషుప్తి.
మంచి
నిద్ర
అని
చెప్పి
గురకలు
పెట్టి
నిద్రపోవడము
కాదు
సుషుప్తి.
ఇంద్రియాలను
అణగద్రొక్కి,
మనో
వేగాన్ని
అరికట్టి,
వాంఛలను
కొంతవరకు
అదుపులో
ఉంచుకుని,
జీవించడానినే
సుషుప్తి
అన్నారు.
ఊరకనే
కళ్ళు
మూసుకుని
నిద్రపోయేది
కాదు.
13
▾
Meaning
Keep
ఈనాడు
వేదాంతులంతా
సుషుప్తి
అనగా
గాఢనిద్ర
అంటున్నారు.
గాఢనిద్ర
అనగా
ఏమిటి?
ఇంద్రియాలతో
సంబంధము
లేకుండా
చూచుకోవడమే!
కన్నులున్నాయి,
చూస్తున్నావు.
కాని
ఆచరించే
దానిపైన
వాంఛ
లేదు.
చెవులున్నాయి,
వింటున్నావు.
కాని
ఆకర్షణ
లేదు.
నోరు
ఉంది,
మాట్లాడుతున్నావు;
కాని,
ఆ
మాటలకు
నీకు
సంబంధము
లేదు.
ఇదీ
సుషుప్తి.
ఇలాంటి
వేదాంత
పరిభాషయందు
ఒక్కొక్క
పదమునకుకూడను
ఎన్నో
పవిత్రమైనట్టి
అర్థములు
ఉంటున్నాయి.
‘కా...మ’
అనే
రెండక్షరముల
పదములో
‘కా’
అనగా
సుఖము,
‘మ’
అనగా
పరిమితము.
కావున
పరిమితమైనట్టి
సుఖమే
ఈ
యొక్క
కామమునకు
అర్థము.
మోహమనేదేమిటంటే,
అనిత్యమైనట్టి
వాంఛ.
ఆ
అనిత్యముకూడను
పరిమితమైనట్టిదే!
ఈ
వేదాంతము
చక్కగా
అర్థము
చేసుకోవాలంటే
చాల
శ్రమ
పడవలసివస్తుంది.
కనుక,
సరియైనట్టి
సులభమైనట్టి
మార్గమేమిటంటే
నిర్మలంగా,
నిశ్చలంగా
భగవంతుని
ప్రార్థించి,
ప్రేమించడమే!
తుకారాం
చెప్పాడు.
‘హే
రామా!
నాకు
జ్ఞానమేమిటో
తెలియదు.
భక్తి
అంటే
ఏమిటో
నాకు
తెలియదు.
యోగమంటే
ఏమిటో
నాకు
తెలియదు.
సత్సంగమంటే
ఏమిటో
నాకు
తెలియదు.
యజ్ఞయాగాదిక్రతువులు
నాకు
చేతకాదు.
నిన్ను
పట్టాలంటే
నా
దగ్గర
ఒక్కటి
మాత్రము
ఉంటుండాది.
ఎట్టి
శ్రమలు
లేకుండా,
ఎట్టి
నష్టము
లేకుండా,
ఎట్టి
ధనవ్యయము
లేకుండా,
ఎట్టి
విధమైన
శ్రమ
లేకుండా
నిర్మలముగా
నిన్ను
ప్రేమించడమే!
ఆ
ఒక్క
దానిని
నాకనుగ్రహించు
చాలు.
నా
కింకేమీ
నీవు
అనుగ్రహించనక్కర
లేదు.’
ఆ
విధమైనట్టి
నిశ్చలమైనట్టి
ఒక్క
ప్రేమతత్త్వముచేతనే
భగవంతుని
పొందగలిగాడు.
ఈ
రకమైన
వాంఛలన్నీకూడను
ప్రాప్తముతో
కూడినట్టివే!
దానికికూడను
ఒక
అంత్యముంటుండాది.
చూచేందుకు
పెద్ద
సముద్రముగా
కనిపిస్తుంది.
కాని
సముద్రానికికూడ
ఒక
పరిమితముంటుండాది.
దాని
లోతు
అగాధము
అనుకుంటున్నాము.
ఆకాశము
అనంతమైనదిగా,
చాలా
అగమ్యముగా
ఉంటుండాది.
కాని,
దానికికూడను
ఒక
పరిమితి
ఉంటుండాది.
చాలమంది
సైన్సు
పిల్లలకు
తెలుసును.
‘సన్’
ఉంటున్నాడు.
దీనినే
‘సోలార్
సిష్టమ్’
అంటారు.
14
▾
Meaning
Keep
అయితే
ఆ
సూర్యునియొక్క
ప్రకాశము
డైరెక్ట్‌గా
భూమిపైన
పడిందంటే,
జనముండలేరు.
అందువలన
ఓజోన్
పొర
అనేటువంటిది
మధ్య
ఉండి
సూర్యకిరణాలు
నేరుగా
భూమిపైన
పడకుండా
కాపాడుతుంది.
మానవులు
ఈనాడు
నిత్య
జీవితములో
అనేక
రకాలుగా
విడిచే
పొగ,
విషవాయువులు
ఇదంతా
పోయి
ఆ
ఓజోన్
పొరకు
హాని
కలుగుతున్నది.
ఇటీవల
ఈ
ఓజోన్
పొరకు
తూట్లు
పడిపోయే
ప్రమాదము
పొంచివున్నది.
ఫలితంగా
సూర్యునియొక్క
కిరణములు
డైరెక్ట్‌గా
భూమిపైన
పడి
కొంత
కాలమునకు
ప్రమాదము
ఏర్పడుతుంది.
ఈ
పరిస్థితిని
నివారించాలంటే
ఏమి
చేయాలి?
మనము
ఎక్కువగా
వృక్షాలను
పెంచాలి.
ఈ
వృక్షాలను
పెంచినప్పుడు,
ఇవి
కొంతవరకు
బొగ్గుపులుసు
వాయువును
స్వీకరించి
ప్రాణవాయువును
విడిచిపెడతాయి.
ఇప్పుడు
వృక్షములంతా
శిధిలమైపోయినాయి.
కనుక,
కాలుష్యమైన
ఈ
పొగంతా
పైకి
పోతుండాది.
తద్వారా
ఈ
ఓజోన్
పొర
దెబ్బ
తింటుండాది.
ఇది
ఇంకా
యీ
విధముగనే
జరుగుతూ
పోతే,
చాలా
ప్రమాదము
ఏర్పడుతుంది,
భూలోకమునకు.
కనుక,
మనము
ఇప్పుడు
చేయవలసినదేమిటంటే
ఉన్న
చెట్లు
కొట్టకుండా,
క్రొత్త
చెట్లు
నాటి
‘లోకా
స్సమస్తా
సుఖినో
భవంతు,’
అందరూ
సుఖపడాలి
అనేటువంటి
రీతిగా
అడవులు
పెంచాలి.
అనేకత్వములోనున్న
ఏకత్వమును
గుర్తించడానికి
విద్యార్థులు
కృషి
చేయాలి
ఈనాడు
మనం
పిచ్చి
పిచ్చి
కోరికలతో,
అజ్ఞానమనే
అడవిని
దట్టముగా
పెంచుకుంటున్నాము.
విశాల
భావమనే
వృక్షములను
పెంచటం
లేదు.
అదే
expansion
of
Love.
కాని
దీనికి
విరుద్ధంగా
ఈనాడంతా
contraction
of
Love
అవుతున్నాది.
మన
ప్రేమంతా
వ్యక్తిగతమైనట్టిదిగా,
స్వార్థపూరితమైనట్టిదిగా
ఉంటుండాది.
పిల్లలు
అనేకత్వములోనున్నట్టి
ఏకత్వాన్ని
గుర్తించడానికి
తగిన
కృషి
చేయాలి.
నీ
దగ్గర
ఏదయినా
ఒక
వస్తువు
లేనప్పుడు
కదా,
నీవు
ఇంకొకరి
దగ్గర
ఆ
వస్తువు
నాశిస్తావు.
నీ
దగ్గరే
ఆ
వస్తువుంటే
నీవింకొకరి
దగ్గర
ఆశించవు
కదా?
నీలోపల
పంచభూతములుంటున్నాయి.
ఇంకొకరి
దగ్గర
వీటిని
నీవు
ఎందుకు
ఆశించాలి?
నీలోను,
అక్కడా
పంచభూతములే!
అన్నీకూడ
నాలోనే
ఉంటున్నాయి.
ఇతరులనుండి
దానిని
ఆశించనక్కరలేదు,’
అనే
రీతిగా
నీవు
యోచన
చేస్తే,
డిజైర్స్
ఆటోమేటిక్‌గా
తగ్గిపోతాయి.
15
▾
Meaning
Keep
అంతా
కూడను
మానవునియందే
ఉంటుండాది.
‘సర్వజీవ
నమస్కారః
కేశవం
ప్రతిగచ్ఛతి’
అన్నారు.
ఎవరికి
నమస్కారము
చేసినా
అది
భగవంతునికే
నమస్కారము.
ఇంత
మాత్రముతోనే
మనము
తృప్తి
పడకూడదు.
‘సర్వభూత
తిరస్కారః
కేశవం
ప్రతిగచ్ఛతి’
ఎవరిని
మనము
కష్టపెట్టినా,
ఎవరిని
మనము
దూషించినా,
అది
తిరిగి
నీ
ఆరాధ్య
దైవాన్ని
దూషించినట్టయిపోతుంది.
కనుక
మనం
రెండింటినీ
ఆచరించాలి.
అదే
బ్యాలన్సింగ్.
ఈ
రెండింటిని
మనము
సమానముగా
చూచుకుని,
మన
సాధనలను
సలపాలి.
దీనినే
అష్టాదశ
పురాణముల
సారముగా
Help
ever,
hurt
never
అని
చెప్పారు.
ఈ
రెండింటిని
బ్యాలన్స్
చేసుకోవాలి.
ఈ
రెండుకూడను
ప్రాకృతమైనట్టివే!
పరాతత్త్వంలోపల
ఈ
రెండింటికి
భేదమే
లేదు.
అంతా
ఒక్కటే!
ఈ
నవరాత్రి
ఉత్సవాలంతా
ప్రకృతి
ఆరాధనకోసము
ఏర్పడినట్టివే!
వీటిని
పూర్వము
రాజులు,
రారాజులు,
ప్రారంభించారు.
ఎందుకంటే
ఇది
మంచి
సమయము.
ఎక్కువ
వర్షాలు
లేకుండా,
ఎక్కువ
ఎండలు
లేకుండా,
శీతోష్ణములు
సమముగా
ఉండేటట్టి
సమయము.
ఇది
యుద్ధానికి
మంచి
సమయము.
కనుకనే
ప్రాకృతమైన
శక్తులను
ఆరాధన
సల్పి,
విజయాన్ని
ఆశించి,
యుద్ధములో
ప్రవేశించేటట్టిదానికోసమని
రాజులు
ఈ
నవరాత్రులు
ప్రారంభిస్తూ
వచ్చారు.
ఈ
నవరాత్రులకు
మరొక
అర్థముకూడ
ఉంటుండాది.
నవగ్రహములపై
విజయాన్ని
సాధించడం.
దీనినే
త్యాగరాజుకూడ
‘రామా!
నీ
అనుగ్రహ
బలము
ఒక్కటుంటే
చాలు.
నవగ్రహములు
నా
హస్తగతము’
అన్నాడు.
ఆ
కాలములో
రాజులు
ఈ
నవరాత్రులను
ప్రారంభించారు.
అదే
ఈనాడు
ప్రాకృతమైన
రీతిలో
బాగా
వ్యాపించిపోయి,
సర్వులుకూడను
విజయాన్ని
ఆశిస్తున్నారు.
బ్రహ్మతత్త్వాన్ని
తెలుసుకున్నవాడు
బ్రహ్మయే
అయిపోతాడు.
భగవత్ప్రేమను
గుర్తించినవాడు,
భగవంతుడే
అయిపోతాడు.
దీనిని
పురస్కరించుకొనియే
ఏసుకూడ
చెప్పాడు.
జీసస్
మొట్టమొదట
తాను
వేరు,
భగవంతుడు
వేరుగా
భావించాడు.
He
is
Master.
I
am
His
messenger
అన్నాడు.
కొంతకాలానికి
తనయొక్క
హృదయాన్ని
విశాలమైన
హృదయంగా
అభివృద్ధి
పరచుకున్నాడు.
అప్పుడు
No,
No.
I
am
son
of
God.
ఆయన
కుమారుడనే
నేను
అన్నాడు.
చివరకు
I
and
my
father
are
one
అన్నాడు.
ప్రాచీనకాలమునందు
ఈ
వేదాంతము
ఇంత
సులభమైన
మార్గములో
మనకు
అందించారు.
16
▾
Meaning
Keep
ప్రకృతిని
మనము
సాధించినప్పుడే
పరతత్త్వాన్నికూడ
మనము
సాధించగలము.
ప్రకృతితత్త్వమనగా
ఏమిటి?
పంచభూతములు
సాధించడమే
ప్రకృతితత్త్వము.
విద్యార్థిదశనుండే
ఆధ్యాత్మికమును
అభివృద్ధిపరచుకోవాలి
ఈనాడు
సైంటిష్టులు
పంచభూతాల్ని
హస్తగతం
చేసుకుని
వాటితో
ఆడుకోవాలని
ఆశిస్తున్నారు.
కాని,
పంచభూతాల్ని
తాము
అనుసరించటం
లేదు.
ఈ
పంచభూతములు
చేతుల్లో
పెట్టుకుని
ప్రయోజనమేమిటి?
ఈనాడు
మానవునియొక్క
భావాలు
మితిమీరి
పోతున్నాయి.
హిరణ్యకశిపుడు
ఎంతో
గొప్ప
సైంటిష్టు.
అన్నిటినీ
సాధించాడు.
కాని,
తన
ఇంద్రియములను
గెలువలేకపోయినాడు.
అందుకోసమనే
చిన్నవాడైనట్టి
అతని
కుమారుడు
ప్రహ్లాదుడు
‘లోకములన్నియున్
ఘడియలోన
జయించినాడవు.
ఇంద్రియానీకము
చిత్తమున్
గెల్వ
నేరవు,’
అన్నాడు.
‘పంచభూతములంతా
చేతిలో
ఉంచుకున్నావు.
కానీ
నీయొక్క
ఇంద్రియాలను
మాత్రము
అణచుకోలేకపోతున్నావు.
ఛీ!
ఛీ!
నీవు
రాజే
కావ’న్నాడు.
కనుక,
ఇంద్రియాల
నణచుకున్నట్టివాడే
రాజు.
మొట్టమొదట
మనలో
వచ్చేటంటివి,
ఆవిర్భవించేటట్టివి
యీ
ఆవేశాలు,
ఉత్సాహాలు,
ఇవన్నీ
కూడను
కొంతవరకు
చల్లార్చుకుంటూ
రావాలి.
మనలో
వచ్చే
భావాలంతాకూడను
ఇష్టప్రకారము
వదలి
పెట్టకూడదు.
వీటికి
మధ్య
మధ్య
బ్రేక్స్
వేస్తూ
రావాలి.
ఈ
విషయములో
ప్రారంభమునుంచే
కొంత
స్లోగా
పోవాలి.
దీనినే
చెప్పారు.
Start
early,
drive
slowly,
reach
safely.
‘ఇప్పుడెందుకులే
వానికి
భక్తి
శ్రద్ధలంతా!
రిటైర్
అయిపోయిన
తర్వాత,
వృద్ధాప్యములో
అప్పుడు
కావలసి
వస్తే
సాధనలు
చేసుకుందామంటే,
అది
సరికాదు.
చాలా
లేటుగా
స్టార్ట్
చేసినట్లు
అయిపోతుంది.
లేటుగా
స్టార్ట్
చేయడంవల్ల
ఏమయిపోతుంది?
స్పీడ్‌గా
పోవాలని
మనము
ప్రారంభము
చేస్తాము.
ఎప్పుడు
స్పీడ్‌గా
పోతుందో,
అప్పుడు
ఏక్సిడెంట్
అయిపోతుంది!
కనుకనే
స్టార్ట్
ఎర్లీ,
డ్రైవ్
స్లోలీ,
అప్పుడే
సేఫ్‌గా
రీచ్
అవుతావు.
ఇది
చాల
మంచిది.
ఈ
వయస్సునందే
మనలో
యీ
ఆధ్యాత్మికాన్ని
అభివృద్ధిపరచాలి.
చవన్
చెప్పినట్లుగా
విద్యార్థులు
ఎంతో
మంచి
గుణాలతో,
ఎంతో
మంచి
అలవాట్లతో
ఉన్నారు.
17
▾
Meaning
Keep
ఇది
పాఠశాలలో,
ఈ
ఇన్స్టిట్యూట్లో
ఉన్నంత
మాత్రాన
సరిపోదు.
బాహ్య
ప్రపంచములోనికి
పోయిన
తరువాతకూడను
ఈ
సద్గుణాలను
మీరు
ఆచరణలో
ఉంచాలి.
ఎక్కడికి
పోయినప్పటికిని
అందరూ
కలసిమెలసి
ఉండాలి
ఇక్కడ
క్రిష్టియన్స్
ఉన్నారు,
ముస్లిమ్స్
ఉంటున్నారు,
హిందువులుంటున్నారు.
అనేక
మతములకు
చెందినవారు
ఉన్నారు.
ఇక్కడ
ఏ
విధముగా
అందరూ
యూనిటీగా
ఉంటున్నారో
అనగా
కలసిమెలసి
ఉంటున్నారో,
ఇక్కడ
అందరు
కూడను
ప్రతి
విషయములో
కూడను
ఏ
విధంగా
ఒకరితో
ఒకరు
కో-ఆపరేట్
చేస్తున్నారో
అదే
విధంగా
ఈ
కో-ఆపరేషన్
బయటికి
పోయినపుడుకూడ
ఉంటుండాలి.
‘ఇక్కడ
మాత్రము
కో-ఆపరేషన్,
బయటకు
పోయినపుడు
ఆపరేషన్’
అయిపోతే
ప్రయోజనము
లేదు.
ఎక్కడికి
పోయినప్పటికినికూడ
అందరు
కలసిమెలసి
ఉంటుండాలి.
ఈ
రకమైనట్టి
దివ్యత్వాన్ని
మనము
ఏనాడు
ప్రపంచానికి
చాటుతామో,
ఆనాడే
మనము
దేశాన్ని
ఉద్ధరించినవారమవుతాము.
ఈ
లోకములో
కలహములనేటంటివే
ఉండవు.
కనుక
అందరిలోను
ఉన్నటువంటి
ఏకత్వాన్ని
మీరు
గుర్తించండి.
అందరియందు
పంచభూతములు
సమానమే!
క్వాంటిటీ
డిఫరెన్స్‌గా
ఉండవచ్చును,
కాని
క్వాలిటీ
ఒక్కటే!
మనకు
కావలసినది
క్వాలిటీనే!
గంగ
కావలిసినంత
ప్రవహిస్తుంటాది.
మనకు
దప్పిక
అయినప్పుడు
గ్లాసు
నీరు
తెచ్చుకుంటే
చాలు,
మన
దప్పి
తీరుతుంది.
గంగనంతా
త్రాగాలంటే
నీ
చేతకాదు.
అదే
దురాశ!
ఆ
క్వాలిటీని
నువ్వు
తీసుకో;
క్వాంటిటీపైన
నీవు
యోచన
పెట్టుకోకు.
ఆ
రకమైనట్టి
విద్యను
మనము
నేర్చుకోవాలి.
అప్పుడే
సమత్వము
ఏర్పడుతుంది.
‘సమత్వం
యోగముచ్యతే.’
అదే
పెద్ద
యోగము.
ఆ
యోగము
ఎప్పుడు
పెంచుకుంటామో,
అప్పుడు
ఈ
ప్రపంచములో
ఏ
విధమైనట్టి
కలహములనే
రోగములుండవు.
భగవత్
నామముతో
గాలిని
పరిశుద్ధపరచి,
పొగనంతా
నిర్మూలము
గావించి,
ఓజోన్
పొరను
రక్షించి
ప్రాణవాయువుని
పలువురికి
అందించి
‘లోకాః
సమస్తా
స్సుఖినో
భవంతు,’
అని
అందరూ
సుఖంగా
ఉండాలని
ఆశించండి.
Previous
←
The Shirdi Sai Saga
Next
What man must seek is real, eternal happiness
→