Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1992 · What man must seek is real, eternal happiness
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
What man must seek is real, eternal happiness
5 October 1992, Dasara, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 393
మానవత్వమున్న
మానవులందున
త్రికరణశుద్ధి
తెలియుచుండు,
మానవతయే
లేని
మానవజాతిలో
దానవత్వముండు
తథ్యముగను
ప్రేమస్వరూపులారా!
‘సుఖమాప్యంతి
యత్తద్బుద్ధి
గ్రాహ్యం,’
సుఖమన్నది
కేవలము
ఇంద్రియములద్వారా
లభించునది
కాదు.
ఇంద్రియములద్వారా
అనుభవించే
సుఖము
అనిత్యమైనది,
అసత్యమైనది.
నిజమైన
సుఖము
నిత్యమైనది,
సత్యమైనది,
శాశ్వతమైనది.
ఇది
కేవలము
బుద్ధినుండి
మాత్రమే
మానవుడు
పొందగలడు.
ఈ
బుద్ధి
అన్నది
కేవలము
శ్రద్ధచేతను,
నిశ్చలమైనట్టి
పటుత్వముచేతను
నిండినటువంటిది.
నిత్యజీవితంలో
మానవుడనుభవించే
సుఖములన్నియుకూడను
విషయములచేత
కలుగునవి
మాత్రమే!
విషయసుఖము
విషసుఖమేకాని,
అమృత
సుఖము
కాదు.
విషయము
నిరంతరము
మానవుని
బంధించుటకై
ప్రయత్నించునుకాని,
మానవత్వాన్ని
సార్థకము
గావించే
నిమిత్తము
అది
ప్రోత్సహించదు.
కనుక,
మానవుడు
అనుభవించేటట్టి
సుఖములన్నియుకూడను
ఇంద్రియ
సంబంధమైనట్టివేకాని,
బుద్ధికి
సంబంధించినట్టివి
కావు.
మానవత్వము
కోరవలసినది
సత్య
సుఖము,
నిత్య
సుఖము.
ఇది
కేవలము
బుద్ధిద్వారానే
మనకు
సాధ్యమవుతుంది.
మానవత్వంలో
మనమీనాడు
ఆశించేటువంటి
సుఖములన్నీకూడను
క్షణభంగురమైనట్టివి.
ఎండమావులవంటివి.
ఇత్యాది
సుఖములు
ఎంతకాలము
అనుభవించినప్పటికిని
ఇవి
తృప్తిని
కలిగించునట్టివి
కావు.
నిత్య
తృప్తిని
మనము
అనుభవించవలెనన్న
బుద్ధితో
విచారణ
సల్పాలి.
తైత్తిరీయ
ఉపనిషత్తు
ఈ
బుద్ధిని
అనేక
విధములుగా
వర్ణించి,
వివరించి,
విషయములు
ప్రబోధిస్తూ
వచ్చింది.
2
▾
Meaning
Keep
మానవుడు
ఏ
చిన్న
కార్యమును
సాధించవలెనన్నను
శ్రద్ధ
లేకుండా
సాధించలేడు
ఉపనిషత్తు
బుద్ధిని
ఒక
పక్షిగా
వర్ణించింది.
ఈ
బుద్ధి
అనే
పక్షికి
శ్రద్ధయే
శిరస్సుగా
ఏర్పరిచింది.
దక్షిణ
పక్షము
ఋతమనియు,
ఉత్తర
పక్షము
సత్యమనియు
నిర్ణయించింది.
ఈ
పక్షియొక్క
తోకలే
యోగములుగా
నిర్ణయించింది.
తనయొక్క
దేహము
మనస్తత్వము
అని
బోధించింది.
శ్రద్ధ,
ఋతము,
సత్యము,
యోగము,
మహత్తరమైన
శక్తి
ఇవన్నీకూడను
బుద్ధియొక్క
అంశములే!
బుద్ధియొక్క
అంశమైనట్టి
శ్రద్ధ
మొట్టమొదటిది.
మానవుడు
ఏ
చిన్న
కార్యమును
సాధించవలెనన్నను,
శ్రద్ధ
లేకుండా
సాధించలేడు.
జీవితములో
మనమే
పనిని
చేయవలెనన్నను
శ్రద్ధ
ఉండాలి.
తినడము,
త్రాగడము,
నడవడము,
చదవడము
యివన్నీకూడ
శ్రద్ధయొక్క
ప్రోత్సాహములే!
‘శ్రద్ధావాన్
లభతే
జ్ఞానం.’
జ్ఞానముకూడను
మనకు
శ్రద్ధవలనే
లభ్యమవుతుండాది.
ఇంతే
కాదు,
‘శ్రద్ధ
నా
స్వరూపమ’ని
భగవద్గీతకూడ
ప్రబోధించింది.
బుద్ధి
తన
స్వరూపమనికూడ
భగవద్గీత
వర్ణించింది.
కనుక,
బుద్ధి
అనునంటిది
కేవలము
సామాన్య
రీతిగా
మనము
భావించరాదు.
శ్రద్ధతో
కూడినది
ఋతముతో
చేరినది,
సత్యముతో
సంబంధమైనది,
యోగముతో
జీవించునది,
మహత్తరముతో
నిలుచునది.
ఇట్టి
పంచశక్తుల
ప్రమాణములతో
నిల్చినటువంటి
బుద్ధిని
మనము
సామాన్య
రీతిగా
భావిస్తున్నాము.
ఈనాడు
మనము
‘బుద్ధి’
అని
ఉపయోగించేటంటిదంతాకూడను
కేవలము
ప్రాకృతమైనట్టి
బుద్ధి.
నిజానికి,
దీనికి
‘బుద్ధి’
అనే
పేరు
సార్థకమైనది
కాదు.
ఇది
కేవలము
తెలివితేటలు
అని
చెప్పవచ్చును.
మానవత్వములో
సత్యమై,
నిత్యమై
ప్రకాశించే
దైవత్వమే
బుద్ధి
‘బుద్ధి
గొప్పదా?
లేక
మేధాశక్తి
గొప్పదా?’
అని
కొంత
విచారణ
సలిపినప్పుడు
బుద్ధియొక్క
తత్వము
మనకు
చక్కగా
స్పష్టమవుతున్నది.
ఈ
రెండింటియొక్క
విషయములు
విచారించి
సత్యమును
గుర్తించవలెనని,
దీనిని
పరిశీలన
సలిపే
నిమిత్తమై
ఒకప్పుడు
ఒక
మహాసభను
ఏర్పరచాడు,
విక్రమాదిత్యుడు.
ఈ
విక్రమాదిత్యుని
మహాసభలోపల
అనేకమంది
గొప్ప
గొప్ప
పండితులంతాకూడను
చేరారు.
ఈ
మహాపండితులంతా
మేధస్సే
గొప్పదని
నిర్ణయించారు.
3
▾
Meaning
Keep
కాని
అది
విక్రమాదిత్యునకు
సంతృప్తి
కలిగించలేదు.
మేధాశక్తి
గొప్పదని
భావించడంలో
నున్నట్టి
అంతరార్థమేమిటని
ప్రశ్నించాడు.
‘అస్త
స్వాస్థ
యథా
నస్వాస్థా
మేధయా
కిం
ప్రయోజనః’
అస్త
అనగా
ఆసక్తి,
స్వాస్థ
అనేటంటిది
స్థిరత్వము.
ఆసక్తి,
స్థిరత్వము
రెండింటియొక్క
ఏకత్వమే
శ్రద్ధ.
ఈ
శ్రద్ధయొక్క
ప్రభావమే
ఋతము.
ఋతమనగా
ఏమిటి?
త్రికరణశుద్ధియే
ఋతము.
ఋజువర్తనయే
ఋతము.
ఈ
ఋతమును
గుర్తించి
వాక్కుద్వారా
అందించినట్టిదే
సత్యము.
‘యోగః
చిత్తవృత్తి
నిరోధకః’
సర్వేంద్రియములనుకూడను
నిగ్రహించినట్టిది,
ఈ
బుద్ధియొక్క
నాల్గవ
లక్షణము.
ఇక
ఐదవది
మహత్తర
తత్వము.
దీనిని
మించినటువంటిది
మరొకటి
లేదు.
ఇదే
దివ్యస్వరూపము.
కాబట్టి
శ్రద్ధతో,
పటుత్వముతో,
ఋతముతో,
సత్యముతో,
యోగముతో,
మహత్తరముతో
కూడినటువంటి
బుద్ధి
లేకుండిన
యీ
మేధాశక్తియంతయు
కూడను
రసములేని
ఫలమే!
ఫలములేని
వృక్షమే!
దీపములేని
గుడియే!
చెల్లని
కానీయే!
ఇటువంటి
బుద్ధియొక్క
తత్వమును
గుర్తించుకొనలేక
మేధాశక్తిని
మాత్రమే
విశ్వసించి,
ఈనాటి
మేధావులందరుకూడను
తమయొక్క
దివ్యత్వాన్ని
వ్యర్థము
చేసుకుంటున్నారు.
కనుకనే
మానవత్వములో
సత్యత్వమై,
నిత్యత్వమై
ప్రకాశించేటువంటి
దైవత్వమే
బుద్ధి.
‘బుద్ధి
గ్రాహ్య
మతీంద్రియం’
ఈ
బుద్ధి
యింద్రియముల
కతీతమైనట్టిది.
అదియే
దైవత్వము.
స్వార్థ,
స్వప్రయోజన
రహితమైనదే
తారకము,
స్వార్థ,
స్వప్రయోజనములతో
కూడినదే
మారకము
ఈనాడు
మనముపయోగపెట్టే
బుద్ధి
ఇది
కాదు.
దివ్యత్వముతో
కూడినట్టి
బుద్ధే
బుద్ధి.
ఈనాటి
బుద్ధి
కేవలము
ఒక
పరిమితమైనట్టి
బుద్ధి.
ఈ
డిస్క్రిమినేషన్కూడను
స్వార్థ
సంబంధమైనట్టి
డిస్క్రిమినేషన్గా
ఉంటాది.
కనుకనే
బుద్ధి
అనే
పేరుతో
ఈనాటి
మానవుడు
స్వార్థ
జీవితమును,
స్వప్రయోజన
జీవితమును
అందుకోగలుగుతున్నాడు.
ఈ
స్వార్థము
అనేటువంటి
పదమునందే
దీనియొక్క
అంతరార్థము
గూఢముగా
ఇమిడి
యున్నది.
స్వ-తన,
అర్థము
అనగా
వినియోగము.
స్వ-అర్థ
మనగానేమి?
తన
వినియోగ
నిమిత్తమై
ఉపయోగించేవంటివే
అనగా
individual,
వ్యక్తిగతమైనట్టి
తమ
వినియోగమే.
4
▾
Meaning
Keep
His songs 51
స్వ-ప్రయోజనము.
స్వప్రయోజనమనగా
ఏమిటి?
వ్యక్తిగతమైన
దీనికి
ఉపయోగపెట్టుకోవటమే!
కనుక
ఈనాడు
మానవుడు
చేసే
పనులన్నియుకూడను
స్వార్థపరమైనవేకాని,
పరార్థమునకు
సంబంధించినట్టివి
కావు.
మానవత్వములోనుండే
బుద్ధి
స్వార్థ,
స్వప్రయోజనములతో
కూడినట్టిది.
స్వార్థ,
స్వప్రయోజన
రహితమైనట్టిదే
తారకము.
స్వార్థ,
స్వప్రయోజనములతో
కూడినటువంటిదే
మారకము.
ఈ
తారకము,
మారకముల
మధ్యగల
భేదమును
మనము
చక్కగా
అర్థము
చేసుకోవాలి.
ఆత్మ
భావముతో
చేసినట్టి
సర్వ
కర్మలుకూడను
తారక
సంబంధమైనట్టివే!
భౌతికమైన,
లౌకికమైన,
ప్రాప్తానుసారమైన
కర్మలన్నీకూడను
మారకములే!
తారకమంటే
ఏమిటి?
ఎరుక
మరపనకుండ
నిరతము
జాగ్రత్స్వప్నసుషుప్తిలో
అరమరలు
లేకుండ
ఎప్పుడు
తరచుగ
జీవాత్మ
జదివెడి
తారకము
సూటెరుగవలెనన్నా
సద్గురుని
కృపచే
తారతమ్యము
తరచి
గనుమన్నా!
తారకమనగా
జాగ్రత,
స్వప్న,
సుషుప్తులకు
అతీతమైనట్టిది.
కనుకనే
దీనికి
‘తురీయము’
అన్నారు.
అదియే
నిజమైన
తారకము.
ఆ
తారక
తత్వాన్ని
పొందినటువంటిదే
నిజమైన
బుద్ధి.
మనోవాక్కాయముల
స్వరూపమే
నిజమైన
బుద్ధితత్వము
పూర్వకాలమునందు
ఆచారవంతులైనట్టి
బ్రాహ్మణులు
కొందరు
తాము
భుజించే
సమయములో
‘అన్నం
బ్రహ్మ,
రసః
విష్ణుః
భోక్తా
దేవో
మహేశ్వరః’
అనే
మంత్రమును
పఠించి
తరువాత
దీనిని
ప్రారంభించి
భుజించేవారు.
అనగా
ఏమిటి?
‘నేను
తిన్నటువంటి
ఆహారము
శరీరమంతా
రసస్వరూపమై
ప్రసరించి
నాకు
శక్తినందించు
గాక!
ఈ
శక్తిని
సద్వినియోగపరచుకునే
నిమిత్తమై
చక్కని
మనస్సు
నాకు
ప్రసాదించు
గాక!
నా
వాక్కును
శుద్ధిపరచు
గాక!’
అని
ఈ
మంత్రమునకు
అర్థము.
బ్రహ్మ,
విష్ణు,
మహేశ్వర
స్వరూపమే
యీ
అన్నము,
రసము
ఇవన్నీకూడను.
కనుక
మనము
తిన్నటువంటి
ఆహారము
స్థూలమైనటువంటి
దేహానికి
శక్తినందిస్తుండాది.
సూక్ష్మమైనటువంటి
మనస్సుగా
మారుతుండాది.
5
▾
Meaning
Keep
అత్యంత
సూక్ష్మమైనటువంటి
వాక్కు
రూపాన్ని
ధరిస్తుండాది.
కనుక
ఈ
మనస్తత్వమనేటంటిది
ఎంతవరకు
వ్యాపిస్తున్నదంటే
మనోవాక్కాయములయొక్క
స్వరూపమే
నిజమైన
బుద్ధి
తత్వము.
వీటినే
‘బ్రహ్మ,
విష్ణు,
మహేశ్వర’
అన్నారు.
ప్రాణము
బ్రహ్మ
తత్త్వము,
మనసు
విష్ణు
తత్త్వము,
వాక్
శివ
తత్త్వము.
ఈ
మూడింటిని
మనము
వ్యర్థము
చేయరాదు.
వీటిని
సరియైన
మార్గములో
ప్రవేశింపచేయాలి.
వాక్కును
సత్యవాక్కుగా
రూపొందింపజేసుకోవాలి.
మనస్సును
పవిత్రమార్గములో
ప్రవేశపెట్టాలి.
‘శరీర
మాద్యం
ఖలు
ధర్మ
సాధనం’
శరీరమును
ధర్మాచరణలో
ప్రవేశపెట్టాలి.
ఈవిధంగా
బ్రహ్మవిష్ణుమహేశ్వర
స్వరూపమే
మనోవాక్కాయకర్మలు.
ఈనాడు
మనము
కర్మలను
వ్యర్థ
కర్మలుగా
ఆచరిస్తున్నాము.
అనగా
ఈశ్వర
తత్త్వమును
వ్యర్థము
చేస్తున్నాము.
అనవసరమైన
మాటలతో
వాక్కును
వ్యర్థము
చేస్తున్నాము.
అనగా
విష్ణు
తత్త్వాన్ని
మనము
అపవిత్రము
గావిస్తున్నాము.
ఈనాడు
మన
దేహ
తత్వమును
అపవిత్రం
చేయడమే
కాకుండా,
వాక్కును
అసహ్యమైన
ప్రయోగములో
ప్రవేశపెట్టటమే
కాకుండా,
మనస్సును
దుశ్చింతనలో
ప్రవేశపెట్టుతున్నాము.
కనుక,
మనము
ఏ
కర్మ
లాచరించడానికి
ప్రారంభించాలనుకున్నప్పటికిని
దానికి
పూర్వము
‘తస్మై
నమః
కర్మణే’
అని
కర్మకు
నమస్కరించుమని
చెప్పడం
జరిగింది.
అనగా
‘నేను
చేయబోవు
కర్మలన్నీకూడను
పవిత్రమైన
కర్మలుగా
ఉండాలి.
నేను
ఆడబోయే
మాటలన్నీకూడను
పరోపకార
సంబంధమైనట్టివిగాను,
పరులకు
బాధ
కలిగించనట్టివిగాను
ఉండాలి.
నేను
తలచే
తలంపులన్నీకూడను
పవిత్రమైనవిగా,
దివ్యమైనట్టివిగా,
సార్థకమైనట్టివిగా
ఉండాలి’
అని
ప్రార్థించడమన్నమాట!
ఆనాటి
ప్రభువులు,
ప్రజలు
ఈ
విధమైన
ప్రార్థనలచేత
మనోవాక్కాయకర్మలను
ఏకత్వము
గావించి,
త్రికరణశుద్ధి
నిమిత్తమై
తమ
జీవితాన్ని
అర్పితము
గావించినారు.
మానవుడు
అహంకారమనే
పొగను,
మమకారమనే
ధూళిని
ఏనాడు
తొలగించుకొనునో
ఆనాడే
తనయందున్న
దివ్యజ్యోతి
స్వచ్ఛముగా
ప్రకాశిస్తుంది
మానవుడు
ప్రధానముగా
సంపాదించవలసినవి
ఋత,
సత్యములు
రెండు.
6
▾
Meaning
Keep
ఋతమనగా
చెప్పాను.
మనస్సు,
వాక్కు,
కర్మలు
ఈ
మూడు
ఏకత్వంగా
ఉండాలి.
తలచినది
చెప్పడము,
చెప్పినది
చేయడము.
ఈనాడు
చెప్పడము,
చేయడము
కొంతవరకు
ఏకమవుతున్నాయిగాని,
తలంపు
ఏకం
కావడంలేదు.
కొంతమందికి
తలంపు
వేరు,
చెప్పడము
వేరు,
చేయడము
మరొకటిగా
ఉంటుండాది.
ఒక్కొక్కటి
ఒక్కొక్క
భిన్నమైన
మార్గములో
నడుస్తూ
వస్తున్నాయి.
కనుకనే
మానవత్వంలో
ఋతము
పూర్తిగా
క్షీణించింది.
అయితే
దీనికి
కారణము
ఒకటుండాది.
బుద్ధి
చాలా
పవిత్రమైనదే
అయినప్పటికిని
దీనిలో
కొంతవరకు
మాలిన్యము
చేర్చుకుంటున్నాము.
ఈ
బుద్ధి
ఎలాంటిదంటే,
దీపముపైన
పెట్టినటువంటి
చిమ్ని,
ఒక
జార్
వంటిది!
ఈ
చిమ్ని
చాల
పరిశుభ్రంగానే
ఉంటుండాది.
లోపల
వెలిగే
జ్యోతి
ప్రకాశవంతంగా
వెలుగుతుండాది.
కాని,
కొంత
కాలమునకు
చిమ్మ
చీకట్లు
క్రమ్ముతున్నాయి.
ఈ
చీకటికి
కారణమేమిటి?
చిమ్నిలో
చేరినట్టి
పొగ
కొంతవరకు
దానిని
మలినపరుస్తుండాది.
అంతేకాకుండా
చిమ్ని
బయటకూడా
దానిపైన
కొంత
దుమ్ము,
ధూళి
చేరి
ఈ
వెలుతురుకు
అడ్డు
వస్తున్నాది.
లోపల
మసిని,
బయట
దుమ్ముధూళిని
తీసివేసిన
ప్రకాశము,
ప్రకాశముగానే
ఉంటుండాది.
జ్యోతి
ఏనాటికికూడను
తన
ప్రకాశాన్ని
తగ్గించుకోవడంలేదు.
దివ్యమైన
ప్రకాశంగా
వెలుగుతుండాది.
కాని
దీనిపైన
పెట్టిన
చిమ్నిలోపల
వచ్చినట్టి
దోషములే
ఇవన్నీ!
అహంకారమనే
పొగ,
మమకారమనేటి
డస్ట్.
మమకారమనే
డస్ట్
బయట
తట్టున,
అహంకారమనే
పొగ
చిమ్నీకి
లోతట్టున
చేరడంచేత
ఆ
జ్యోతి
ప్రకాశము
తగ్గిస్తుండాది.
మానవుడు
అహంకారమనే
పొగను,
మమకారమనేటి
డస్ట్‌ను
ఏనాడు
పరిశుద్ధము
గావించునో,
ఆనాడు
దివ్యమైనట్టి
జ్యోతి,
దివ్యమైనట్టి
బుద్ధి
తత్వము
ప్రకటిస్తుంది,
ప్రకాశిస్తుంది.
మానవుడు
ఈ
ప్రకాశవంతమైనట్టి
బుద్ధియొక్క
వెలుగు
అనుభవించుకోలేకపోవడానికి
ఈ
రెండే
మూలకారణము.
అహంకారము
మితిమీరిపోతున్నది.
అభిమానంకూడను
మితిమీరిపోతున్నది.
ఈ
రెండుకూడను
స్వార్థముతో
కూడినవి.
ఈ
స్వార్థమువలన
అహంకార,
మమకారముల్లో
మునిగి
మానవుడు
తనలోనున్న
ఆత్మజ్యోతిని
తాను
దర్శించలేకపోతున్నాడు.
7
▾
Meaning
Keep
దివ్యత్వమును
అనుభవించాలంటే
ప్రతి
మానవుడు
తన
బుద్ధియొక్క
దోషములను
తొలగించి
పరిశుద్ధుడు
కావాలి
ఒకానొక
సమయములో
శంకరులవారు
దిగ్విజయయాత్ర
ప్రారంభించారు.
ఆ
దిగ్విజయ
యాత్రలో
మండనమిశ్రుని
కలిసాడు.
ఈ
మండనమిశ్రుడు
మహా
పండితుడు.
గొప్ప
స్కాలర్.
ఇతనితో
వాదోపవాదములు
చేసి,
ఇతనిని
ఓడించాలని
ప్రయత్నం
చేశాడు.
మండనమిశ్రుడు,
శంకరులు
యిరువురుకూడను
వాదోపవాదములు
జరుపుతున్న
సమయంలో
దీనికి
ఎవరైనా
ఒకరు
న్యాయనిర్ణేతగా
ఉండాలి.
ఎవరికి
విజయము,
ఎవరిది
అపజయము
అని
వారు
నిర్ణయించి
చెప్పాలి.
ఈ
జయాపజయములు
నిర్ణయం
చేయాలంటే
మహాశక్తివంతమైనట్టి
ఋతము,
సత్యము
సాధించినటువంటి
వ్యక్తిగా
ఉండాలి.
సామాన్యమైనట్టివారు
ఈ
నిర్ణయం
చేయలేరు.
కారణమేమనగా,
ఒకప్రక్క
చూస్తే
ఆదిశంకరులు.
వేరొక
ప్రక్కన
కేవలము
విద్యనే
స్వరూపముగా
ధరించినట్టి
మండనమిశ్రుడు.
ఇలాంటి
ఇద్దరు
వ్యక్తులు
జరిపే
వాదోపవాదములలో
జయాపజయాలను
నిర్ణయించగలిగే
వారెవరు?
ఈ
విషయాన్ని
బాగా
యోచించి,
యోచించి
శంకరులు
వారు
చెప్పారు.
‘మండనమిశ్రా!
మన
ఇరువురి
వాదనలకు
నీ
ధర్మపత్ని
అయిన
ఉభయభారతే
జడ్జి’
అన్నాడు.
చూశారా!
భర్త
శంకరులవంటి
తపస్వులు,
యోగులతో
వాదించడము,
భార్యను
జడ్జిగా
పెట్టడంలో
ఎంత
అంతరార్థముంటుండాది!
చెప్పాడు
శంకరులు.
‘ఋతమెరిగినట్టి
సాధ్వి,
సత్యమార్గమున
నడిచేవంటి
సాధ్వీమణి
అయిన
ఉభయభారతిని
మించిన
జడ్జిగా
మరొకరు
ఉండడానికి
అవకాశము
లేదు.
మన
ఇరువురి
వాదనలలో
జయాపజయాలను
నిర్ణయించగలిగే
శక్తి
సామర్థ్యములు
గలిగినట్టిది
ఉభయభారతి’
అన్నాడు.
వీరి
వాదోపవాదములు
జరిగినాయి.
‘ఈ
వాదనలో
ఎవరు
ఓడిపోదురో,
వారు
సన్యాసాన్ని
స్వీకరించి,
గృహస్థాశ్రమాన్ని
విసర్జించి,
అరణ్యవాసం
చేయాలి’
అనేది
నియమం
ఇక్కడ.
శంకరులవారికి
ఏ
ఫ్యామిలీ
లేదు,
ఉన్నదంతాకూడను
మండనమిశ్రునికే!
సరే,
ఉభయభారతి
కూర్చుంది.
వాదోపవాదములు
జరుగుతున్నాయి.
రాత్రింబవళ్ళు
ఆహారనిద్రలుకూడ
మాని
వాదోపవాదములు
చేస్తున్నారు.
సాధారణంగా
వాదన
చేసేవారి
మధ్య
వైరము
పెరిగి
పోతుంటాది.
కనుకనే
లోక
సంబంధమైన
విషయములలో
వాదన
చేయకూడదు.
వాదన
చేసేవంటివారు
వైరాన్ని
పెంచుకుంటారు.
అయితే
ఇది
పండిత
వాదన
కనుక
ఇక్కడ
ద్వేషం
ఉండదు.
ఇరువురుకూడను
మహా
గొప్ప
పండితులు,
దివ్యజ్యోతులు.
8
▾
Meaning
Keep
వీరి
మధ్య
వైరము
రావడానికి
వీలు
కాదు.
ఇరువురి
మధ్యలో
ఉభయభారతి
కూర్చుంది.
నవ్వుతూ
కన్నులు
మూసుకుని
అన్నీకూడను
పరిశీలన
చేస్తుండాది.
కట్టకడపటికి
కన్నులు
తెరచి,
ఉభయభారతి
‘నా
పతియైనట్టి
మండనమిశ్రుడే
ఓడిపోయాడు
అనగా
అపజయము
పొందాడు.
శంకరుడే
విజయాన్ని
పొందాడు’
అని
ప్రకటించింది.
ఈ
మాట
చెప్పేసరికి
శంకరుని
హృదయము
ఉప్పొంగిపోయింది.
‘సత్యము
నేర్చినట్టి
ఈమె
ఋతమును
తెలిసినట్టిది.
అనగా
మనోవాక్కాయముల
ఏకత్వం
గావించినట్టిది.
ఏకత్వంలోని
సత్యత్వాన్ని
నిరూపించినట్టిది
ఉభయభారతి.
కనుక,
ఋత,
సత్యముల
నెరిగిన
ఈ
సాధ్వీమణి
చెప్పినట్టిది
చక్కని
జడ్జిమెంట్’
అనుకున్నాడు.
ఉభయభారతి
నిర్ణయం
వినేటప్పటికి
మండనమిశ్రుడు
సన్యాసాన్ని
స్వీకరించాడు.
గృహాన్ని
వదిలాడు.
అరణ్యాలకు
పోయాడు.
ఈ
దృశ్యాన్ని
చూచినట్టి
ఉభయభారతి
‘నేను
అర్ధాంగిని,
ధర్మపత్నిని,
గృహలక్ష్మిని,
ఇల్లాలిని.
అర్ధాంగి
అనగా
అతను,
నేను
ఇరువురు
చేరినప్పుడే
ఒక
రూపము
భార్యభర్తలలో
ఏ
ఒక్కరైనా
అర్ధస్వరూపమే!
నా
అర్ధ
ఆకారము
చేరినప్పుడే
అతను
పూర్ణుడవుతాడు.
శంకరా!
నా
భర్తను
జయించావు;
అయితే
నన్నుకూడను
జయించినపుడే
నా
భర్త
సన్యాసాశ్రమము
తీసుకోవడానికి
అధికారుడవుతాడ’న్నది.
చూశారా!
గొప్ప
పండితుడైనట్టి
మండనమిశ్రునైనా
శంకరుడు
వాదనలో
ఓడించాడుగాని,
ఉభయభారతిని
ఓడించడానికి
వీలుకాకపోయింది.
అప్పుడు
తానొక
రిక్వెస్ట్
చేసుకున్నాడు,
ఉభయభారతిని.
‘అమ్మా!
నన్ను
క్షమించు,
నీతో
వాదన
చేయడానికి
నాకొక్క
మాసము
కాలము
కావాల’న్నాడు.
చూశారా!
ఆనాటి
స్త్రీలు
ఎంత
గొప్ప
విద్యావంతులో?
ఎంతటి
శక్తివంతులో?
ఎంతటి
మేధావులో?
ఎంతటి
బుద్ధిమంతులో?
ఈ
విధముగా
ఆమెనుకూడా
ఓడించడం
జరిగినప్పుడు
ఉభయభారతికూడను
సన్యాసత్వం
స్వీకరించింది.
తానొక
ఆశ్రమము
నిర్మించుకుంది.
అందులో
చేరినట్టి
స్త్రీలకు
ఆత్మతత్త్వాన్ని
చక్కగా
బోధిస్తూ
వచ్చింది.
వారికి
బోధిస్తూ,
స్త్రీలలో
ఉండినట్టి
బలహీనతను
కొంత
నిర్మూలము
గావిస్తూ,
వారిని
దివ్యమైనట్టి
శక్తివంతులుగా
తీర్చిదిద్దుతూ
దినదినానికి
వారియొక్క
శక్తి
సామర్థ్యములను
అభివృద్ధి
గావిస్తూ
వచ్చింది.
9
▾
Meaning
Keep
ఒకనాడు
తన
శిష్యురాండ్రతో
కలసి
గంగానదికి
స్నానమునకు
వెళ్ళుతుండాది,
ఉభయభారతి.
మధ్య
మార్గములో
ఒక
ఇసుకతిన్నెపైన
ఒక
సన్యాసి
(అతని
పేరు
సర్వసంగ
పరిత్యాగి)
తాను
నీరు
త్రాగే
ఒక
ముంతను
తలక్రింద
పెట్టుకుని
తాను
కన్నులు
మూసుకుని
ధ్యానము
చేస్తున్నాడు.
చూచింది
ఉభయభారతి.
తనయొక్క
శిష్యురాండ్రతో
చెప్తుండాది
అతను
వినేటట్లుగా,
‘అతని
పేరు
సర్వసంగ
పరిత్యాగి.
ఆ
నీరు
త్రాగే
ముంత
ప్రక్కన
పెడితే
ఎవరైనా
తీసుకుపోతారనే
భయంతో
దానిని
తన
తలక్రింద
పెట్టుకున్నాడు.
అల్పమైన
ఈ
ముంతపైన
ఇంత
అభిమానం
ఉండేటట్టివాళ్ళు
సర్వసంగ
పరిత్యాగులు
ఎట్లా
కాగలరు?’
ఆ
మాట
విన్నాడు,
సన్యాసి.
కన్నులు
తెరచి
చూచాడు.
అందరు
నవ్వుకుంటూ
గంగానదికి
వెళ్ళారు.
స్నానము
చేసి
తిరిగి
వస్తున్నారు.
ఈ
సమయాన్ని
పురస్కరించుకుని
ఈ
సన్యాసి
ఆ
ముంతను
వారొచ్చే
సమయము
చూచి
బిగ్గరగా
వారి
పాదాలచెంతకు
విసిరి
పారేశాడు.
తాను
త్యాగినని
నిరూపించుకునే
నిమిత్తమై
ఈ
విధంగా
ప్రవర్తించాడు.
దీనిని
చూచిన
ఉభయభారతి
‘అయ్యో!
ఈయనలో
నేనేదో
ఒక
దోషమే
ఉందనుకున్నాను.
రెండు
దోషములున్నవే
ఇతనియందు!
అభిమానంతో
ముంతను
తలక్రింద
పెట్టుకున్నాడు.
మన
మీ
విధముగా
మాట్లాడినామని
అహంకారముచేత
ఈ
ముంతను
పారవేశాడు.
ఈ
సర్వసంగ
పరిత్యాగియందు
అహంకార,
అభిమానాలు
రెండూ
ఉంటున్నాయి.
ఇతను
సర్వసంగ
పరిత్యాగి
కాద’న్నది.
అప్పుడీ
సత్యాన్ని
గుర్తించినట్టి
ఆ
స్వామి
పరిగెత్తి
వచ్చి
ఉభయభారతి
పాదములపైన
బడి
‘తల్లీ!
మీరే
నాకు
గురువు.
నేను
మనస్సుతో
దివ్యత్వాన్ని
స్మరిస్తున్నాను.
మాటతో
సత్యాన్ని
వల్లిస్తున్నాను.
కాని
క్రియలో
నేను
దీనిని
ఆచరించలేకపోతున్నాను.
ఈనాటినుండికూడను
మనోవాక్కాయములచేత,
నా
సర్వకర్మలను
నేను
సమృద్ధిగావిస్తాను.
సంతృప్తిగావిస్తాను.
ఇదియే
నా
త్రికరణశుద్ధి’
అని
ఋతములో
ప్రవేశించాడు.
ఎప్పుడు
ఈ
ఋతములో
తాను
ప్రవేశించాడో,
సత్యత్వము
సహజంగా
ఆవిర్భవించింది.
ఈ
సత్యత్వం
ఎప్పుడు
ఆవిర్భవించిందో
బుద్ధి
వికసించింది.
అతనిలో
యోగతత్వం
ప్రవేశించి,
యింద్రియ
నిగ్రహం
గావించింది.
ఈ
నాలుగును
చేరేటప్పటికి
మహత్తరమైన
సిద్ధిని
పొందాడా
మహర్షి.
10
▾
Meaning
Keep
కనుక,
ప్రతి
మానవుడుకూడను
దివ్యత్వాన్ని
అనుభవించాలన్న
బుద్ధియొక్క
దోషములను
తొలగించి
బుద్ధిని
పరిశుద్ధము
చేయాలి.
ఏమిటి
మనం
శుద్ధి
చేయవలసినట్టివి?
మనలో
ఉన్న
అహంకార,
అభిమానములను
తొలగించి
మనం
శుద్ధి
గావించుకోవాలి.
ఈ
అహంకారమనేది
మనలోనుంచి
వేరయినప్పుడు,
అభిమానమనేది
సహజంగా
తగ్గిపోతుంది.
ఈ
అహంకారము
ప్రతి
మానవునికి
అత్యంత
ప్రీతికరమైన
గుణం.
తనలో
మంచి
గుణాలు
ఏదీ
లేకపోయినా
బయటకు
పోయేటప్పుడు
కొంచెము
జంబంగా
పోవాలి.
చాలమంది
డాక్టర్స్
ఉంటుంటారు.
సరిగా
ప్రాక్టీసుకూడ
వారికి
జరుగదు,
పాపం!
ఇంటిలోపలకూడను
సాఫీగా
జరుగదు.
కానీ,
బయటకు
వచ్చినప్పుడు
కారులోన
పోవాలి.
ఇదే
విధంగానే
ప్రతి
వృత్తిలో
ఉన్నట్టివారుకూడను
అవుట్‌సైడ్
అనగా
బయట
ప్రపంచమునందు
కొంత
ఆడంబరమును
ప్రకటించాల్సివస్తుంది.
మానవత్వములోనున్న
దైవత్వమే
మానవత్వాన్ని
పోషించాలి
భాగవతంలో
మధుకైటభుడు
అనే
రాక్షసుడున్నాడు.
మధువు
అనగా
ఏమిటి?
ఈ
రాక్షసుడెక్కడ
ఉంటున్నాడు?
ఇతన్ని
మనమే
రీతిగా
గుర్తించాలి.
ఎక్కడ
సంచరిస్తున్నాడితడు?
ప్రతి
మానవుని
హృదయమందు
ఉంటున్నాడు
వాడు.
అనగా
ఏమిటి?
ప్రతి
మానవునికి
అతి
మధురమైనటువంటిది
అహంకారము.
ఈ
అహంకార
స్వరూపమే
మధుకైటభుడు.
ఆ
మధుకైటభుని
సంహరించాడు,
కృష్ణుడు.
అదియే
రాక్షస
సంహారము.
అదే
విధముగ
ఈ
పది
దినములుకూడను
దేవి
రాక్షస
సంహారము
చేసింది.
రాక్షసత్వం
అనగా
ఏమిటి?
మానవునియందు
ఆవిర్భవించినట్టి
వికార
దృశ్యములు,
వికార
చర్యలు,
వికార
భావములు.
మానవునియందు
మానవత్వంతో
కూడినట్టి
భావములు
లేవు.
దానవత్వంతో
కూడినట్టి
భావములుండుటచేతనే,
ఈ
దానవత్వం
అనే
భావమును
నిర్మూలము
చేసి,
దైవత్వమనే
భావమును
అభివృద్ధి
గావిస్తూ
వచ్చింది.
అయితే,
ఈ
మానవునియందున్నట్టి
దానవత్వాన్ని
సంహరించడానికి
ఎక్కడనుండి
దేవతలు
రావాలి?
ఈ
మానవత్వంలో
సంచరించే
దైవత్వమే
మానవత్వాన్ని
పోషించాలి.
అదే
నిజమైనట్టి
అంతరార్థము.
11
▾
Meaning
Keep
Also in his talks
(3)
29 April 1988
One Who Cannot Understand Man Cannot Know Mādhava
23 June 1989
The Essence of the Vedas Is the Sound of the Flute
10 September 2002
The Inner Meaning of Vināyaka Worship
భారతయుద్ధమునందు
కృష్ణుడు
సారథిగా
ఉంటున్నాడు.
అర్జునుడు
వెనక్కు
కూర్చున్నాడు.
అర్జునునికి
అనేక
బోధలు
చేస్తున్నాడు.
అర్జునుడు
ఎదురుగా
కౌరవపక్షమున
పోరాడే
తన
బంధువులను
చూచి
వారలను
తాను
చంపవలసి
వస్తుందనే
అభిమాన,
మమకారములచేత
తాను
కృంగిపోతున్నాడు.
ఆ
దృశ్యము
చూచాడు,
కృష్ణుడు.
యుద్ధము
నాలుగు
దినములు
జరిగింది.
తర్వాత
ఇంకొక
నాలుగు
దినములు
జరిగినది.
తొమ్మిదవ
రోజున
మరింతగా
కృంగిపోతున్నాడు,
అర్జునుడు.
కౌరవుల
తరపున
పోరాడుతున్న
భీష్ముడు
వేస్తున్నట్టి
అస్త్రములన్నీకూడను
అతనిపైన
పడకుండా
కృష్ణుడు
కాపాడుతున్నాడు.
కృష్ణునియొక్క
దేహమంతాకూడను
రక్తపుముద్దగా
మారిపోయింది.
ఈ
దృశ్యాన్ని
చూచాడు
అర్జునుడు.
‘కృష్ణా!
నా
నిమిత్తమై
నీకిన్ని
విధములైన
బాధలా!
నాకీ
యుద్ధమే
అక్కరలేదు’
అని
తన
అస్త్రములను
క్రిందవేసి
తాను
కూలబడ్డాడు.
ఈ
సమయములో
అర్జునుడు
బలహీనుడైనాడంటే
ఇది
చాల
అపజయమునకు
దారితీస్తుంది.
‘ఈ
పిరికితనము
నీకు
మంచిది
కాదు.
నీవు
యుద్ధమును
విరమించుకున్నా
నేను
విరమించన’ని
గట్టిగా
లేచాడు,
కృష్ణుడు.
ఏమని
చెబుతున్నాడర్జునునితో?
కుప్పించి
ఎగసిన
కుండలంబుల
కాంతి
గగనభాగంబెల్ల
గప్పికొనగ
నురికిన
నోర్వక
యుదరంబులోనున్న
జగముల
వ్రేగున
జగతి
గదల
చక్రంబు
చేబట్టి
చనుదెంచు
రయమున
పైనున్న
పచ్చని
పటము
జార
నమ్మితి
నా
లావు
నగుబాటు
సేయక
మన్నింపుమని
క్రీడి
మరల
దిగువ
కరికి
లంఘించు
సింహంబు
కరణి
మెరసి
ఆ
విధముగా
వస్తున్న
కృష్ణుని
భీష్ముడు
చూచాడు.
12
▾
Meaning
Keep
నేడు
భీష్ముని
చంపుదు
నిన్ను
గాతు
విడువుమర్జున
యనుచు
మద్విశిఖవృష్టి
దెరలి
చనుదెంచు
దేవుండు
దిక్కు
నాకు.
‘నేను
నిన్ను
కాపాడుతాను,
భీష్ముని
చంపుతానని
ఏ
కృష్ణుడు
వస్తున్నాడో,
ఆ
కృష్ణుడే
నన్ను
కాపాడాలి,’
అనుకున్నాడు.
ఈనాటి
భక్తులేవిధంగా
ఉంటున్నారంటే,
‘అయ్యో!
రాముడు
నన్ను
చంపడానికి
వస్తున్నాడు.
ఓ
కృష్ణా!
నన్ను
రక్షించు.
ఓ
ఈశ్వరా!
నన్ను
రక్షించు’
అంటారు.
కృష్ణుడే
చంపడానికి
వస్తే
‘ఓ
రామా!
నన్ను
రక్షించు.
ఓ
సాయి!
నన్ను
రక్షించు’
అని
మరొక
దేవత
పేరు
చెప్పుకుంటారు.
కాని
భీష్ముడా
రీతిగా
పలకలేదు.
‘ఏ
కృష్ణుడు
నన్ను
చంపడానికి
వస్తున్నాడో,
ఆ
కృష్ణుడే
నన్ను
రక్షించాలి.
ఉన్నదొకడే
దైవము.
మరొకరు
ఎవరున్నారు?
ఎన్ని
రూపములైనా,
ఎన్ని
నామములైనా
ఉన్నదొకే
దైవము.
‘ఏక్
ప్రభుకా
అనేక్
నామ్’
అని
భీష్ముడు
కృష్ణుని
చక్కగా
వర్ణించాడు.
అదే
విధముగనే
ఆ
ప్రకృతియందున్నటువంటి
మానవత్వంలో
చెలరేగినట్టి
రాక్షసత్వాన్ని
సంహరించాలంటే
ప్రకృతి
శక్తే
సంహరించాలి.
రక్షించేది
ప్రకృతియే,
శిక్షించేది
ప్రకృతియే.
కాబట్టి,
ఆ
ప్రకృతి
శక్తియే
దుర్గామాత.
ఆ
దుర్గయొక్క
రక్షణయే
లక్ష్మి
స్వరూపిణి.
మానవత్వాన్ని
పోషించి,
దానవత్వాన్ని
భస్మము
గావించేదే
ఈ
దుర్గాదేవి.
ఈ
దుర్గ
అనేటటువంటిశక్తి
దానవత్వాన్ని
దూరము
చేసిన
తర్వాత
దైవముయొక్క
వాక్కు
వినిపించనారంభిస్తుంది.
ఆ
వాక్కు
స్వరూపిణియే
సరస్వతి.
కనుక,
మనస్సులో
ఉన్నటువంటి
మాలిన్యాన్ని
నిర్మూలము
గావించి,
దివ్యభావమును
ఆవిర్భవింపచేసి,
వాక్కును
సార్థకము
గావించుకోవడముకోసమనే
దుర్గ,
లక్ష్మి,
సరస్వతి
యీ
మూడింటియొక్క
ఆకారములు
ఆరాధన
చేస్తూ
వచ్చారు.
ప్రకృతి
రూపములో
పరమాత్ముని
చూస్తూకూడా
వేరే
భగవంతుని
చూడాలని
ఆశించటము
మూర్ఖత్వము
మనస్సున
ఉన్నటువంటి
మాలిన్యమును
నిర్మూలము
చేసేటువంటిది
దుర్గ.
అది
నిర్మూలమైన
తర్వాత
మంచి
లక్షణాన్ని
అభివృద్ధి
పరచేటువంటిదే
లక్ష్మి.
అనగా
దైవభావము
నావిర్భవింపచేసేటువంటిదే
లక్ష్మి.
13
▾
Meaning
Keep
Also in his talks
(27)
5 September 1987
Today satsaṅga is what man needs most urgently
23 November 1997
The God who fills everything is ‘I’
5 April 1998
Who can recognise the principle of Śrī Rāma
14 April 1998
God pervades all
26 September 1998
God Is the Very Foundation of the World
28 September 1998
The Five Elements Are the Very Forms of the Paramātma
11 October 1998
Human Life Is the Fruit of Our Resolves
21 November 1999
No sādhana greater than service
26 March 2001
The principle that is the root and base
23 November 2001
Self-confidence is the very stairway to Ānanda
25 December 2001
Though faiths differ, Mādhava is one
16 March 2003
The principle of Prema: the divine power of attraction
21 March 2004
I am you, you are I
11 April 2004
Truth itself is the form of God
15 April 2004
The principle of Prema is Divinity itself
17 October 2004
Develop the Feeling of the One Ātma
22 November 2004
Only When Oneness Is Experienced Does Human Birth Find Its Fulfilment
25 December 2004
Pray for the Sake of God's Prema
8 March 2005
Śivatva is the very consciousness in all beings
23 November 2005
All Are Embodiments of God
26 February 2006
All is full of Brahman
30 March 2006
See only good, do only good, be good
14 April 2006
Fix your mind on Divinity; place your trust in Oneness
2 May 2006
The body itself is the temple; you yourself are God
11 August 2006
Divinity is attained only through Prema for God
13 April 2008
The Name of Rāma is best; the thought of Rāma is enough
24 May 2008
Remembering the Name is the way across
ఈ
మంచి
భావములు
ఆవిర్భవించిన
తర్వాత,
ఆ
భావముయొక్క
వాక్శుద్ధిని
గావించేటువంటిది
సరస్వతి.
కనుక,
త్రికరణ
శుద్ధిని
గావించి,
త్రికరణములను
సద్వినియోగపరచే
నిమిత్తమై
ఈ
దుర్గ,
లక్ష్మి,
సరస్వతి
ఆవిర్భవించారు.
వారిని
ఆరాధించి
తద్వారా
మానవత్వం
సార్థకం
గావించుకుని
ప్రకృతి
శక్తిని
మనము
ఆరాధిస్తూ
వస్తున్నాము.
ప్రకృతికి
అతీతమైనట్టిది
మరొకటి
లేదు.
అతీతమైనట్టి
శక్తి
కూడను
ప్రకృతియందే
సూక్ష్మ
రూపాన్ని
ధరించింది.
అనగా
కాల
స్వరూపాన్ని
ధరించింది.
కాబట్టి
‘కాల
కాల
ప్రపన్నానాం
కాలః
కిం
కరిష్యతే’
అన్నారు.
కాలము
దేహాన్ని
మ్రింగుతున్నది.
కాని,
కాలాన్ని
మ్రింగుతున్నాడు
భగవంతుడు.
‘కాల
కాల
ప్రపన్నానాం
కాలః
కిం
కరిష్యతే.’
ఇలాంటి
తత్వములో
దైవము
కాల
స్వరూపుడుగా
ఉంటున్నాడు.
ఆత్మ
స్వరూపుడై
ఉంటున్నాడు.
కనుక
ఇతనినే
‘అంతరాత్మ’
అని
పిలుస్తూ
వచ్చారు.
చూచారా?
సర్వమునకు
ధీ
శక్తిని,
ధర్మ
శక్తిని
సమర్పిస్తూ
దైవత్వానికికూడను
అందింప
చేస్తున్నారు.
ప్రకృతియే
దైవస్వరూపిణి
భగవంతునికి
పెట్టిన
పేర్లు
అన్నికూడను
ప్రకృతినుంచి
వచ్చినవే!
కనుక,
ప్రకృతియే
దైవ
స్వరూపిణి.
ఈనాడు
ప్రకృతిని
మనము
చూస్తున్నాము.
ప్రకృతిలో
మనము
అనుభవిస్తున్నాము.
కాని,
ప్రకృతిని
చూడలేదే
అని
విస్మయము
పొందుతున్నాము.
ఇదే
మానవునియందు
గల
బలహీనత.
దైవ
సాక్షాత్కారము
కావాలని
ఆశిస్తున్నాము.
దైవాన్ని
చూస్తున్నాము.
తిరిగి
మనకు
సాక్షాత్కారము
కావాలంటున్నాము.
ఇదియే
మూర్ఖత్వమన్నారు.
‘పశ్యన్నపిచ
నపశ్యతి
మూఢో!’
నీవు
చూస్తున్నావు
పరమాత్ముని,
ప్రకృతి
రూపములో.
ఇదియే
విష్ణుస్వరూపము.
ఇదియే
విరాటస్వరూపము.
ఈ
విరాట
స్వరూపము
నీవు
చూస్తూకూడను
తిరిగి
భగవంతుని
చూడాలని
ఆశిస్తున్నావు
ఇంతకంటే
మూర్ఖత్వముంటుండాదా?
పరమాత్ముడంటే
ఎట్టుంటాడు?
ఏదైనా
ప్రత్యేకమైన
రూపముందా?
ప్రత్యేకమైన
స్థానముందా?
లేదు.
సర్వతః
పాణిపాదం
తత్సర్వతోక్షి
శిరోముఖమ్
సర్వతః
శృతిమల్లోకే
సర్వమావృత్య
తిష్ఠతి.
14
▾
Meaning
Keep
ఎక్కడ
చూచినా
ఉన్నాడు.
నీవే
తాను.
తానే
నీవు.
ఈ
సత్యాన్ని
నీవు
ఏనాడు
గుర్తింతువో,
ఆనాడు
నీవు
దైవత్వాన్ని
కూడను
గుర్తించిన
వాడవవుతావు.
జపధ్యానములు,
భజన,
యోగము
ఇవన్నీ
అంతఃకరణ
పరిశుద్ధ
నిమిత్తమే!
ప్రేమస్వరూపులారా!
ఈ
నవరాత్రి
మహోత్సవములంతాకూడను
కేవలము
ప్రకృతియందున్నట్టి
పరతత్త్వాన్ని
మనము
అర్థము
కావించుకునే
నిమిత్తమై
చేసే
ఆరాధనలే!
ఆ
దివ్యత్వము
తనయందే
ఉంటున్నది.
తనయందున్నట్టి
దివ్యత్వాన్ని
తాను
చూడలేకపోతున్నాడు.
చరాచర
ప్రపంచాన్నంతా
కూడను
చూస్తున్నాయి,
నీ
కన్నులు.
ఇన్ని
లక్షల
జనాలనంతా
చూస్తున్నాయి.
కానీ,
నీ
కన్నులు
నీవు
చూడాలనుకుంటే
ఒక
అద్దమును
తెచ్చి
ఎదురుగా
పెట్టుకుంటున్నావు.
ఆ
అద్దము
ఆధారముతోనే
నీ
కన్నులు
నీవు
చూడాలనుకుంటే
బుద్ధి
అనే
అద్దాన్ని
ఆధారం
చేసుకోవాలి.
ఆ
బుద్ధి
నాశ్రయించి,
బుద్ధిద్వారా
నీ
స్వస్వరూపాన్ని
సందర్శించు.
అంతే
కాని,
ఎక్కడో
పోయి
మనము
చూడ్డానికి
ప్రయత్నించటము
వెఱ్ఱితనము.
తానే
దైవమై
ఉండగా
దైవాన్ని
చూడాలని
అరణ్యాలకు
పోయి
తపస్సు
చేస్తున్నారు,
మూర్ఖులు.
నిజంగా
సత్యాన్ని
గుర్తించనివారే
ఆ
పని
చేసేది.
దేవుని
చూడాలంటే
అంత
దూరము
పోవలెనా?
తల్లికంటెనుకూడ
దైవంబె
దగ్గర.
తల్లికంటె
అతి
సమీపమైనటువంటివాడు
దైవము.
అలాంటి
సమీపమైనట్టి
దైవత్వాన్ని
చూడడానికి
ఎక్కడోమనము
పోనక్కరలేదు.
కనుక,
దివ్యమైనట్టి
భావముతో,
ప్రేమతత్త్వాన్ని
పెంచుకుని,
మనయొక్క
బుద్ధిని
శుద్ధము
గావించుకుంటే,
అందులోనే
దివ్యత్వమనే
దైవత్వమును
మనము
చూడగలము.
ప్రకృతియొక్క
మహత్తరమైన
శక్తులు
ఇంకా
ఎన్నెన్నో
ఉంటున్నాయి.
ప్రాచీన
కాలమునుండి
మనము
ఈ
గ్రంథములద్వారా,
వినేటంటి
విషయాలు,
చేసేవంటి
పనులు,
సాధనలు
ఇవన్నీకూడను
బాహ్యమైనట్టివి.
ఏదో
దీనికి
అతీతమైనట్టిది
ఒకటున్నదని
భ్రమించడంచేతనే
ఇంత
మూర్ఖత్వంగా
పడిపోయినాము.
మనకు
మించినటువంటిది
మరొకటి
లేదు,
ఈ
లోకంలో!
నీయొక్క
అంతరింద్రియములను
చక్కగా
నిగ్రహించుకుంటే
అన్నీ
చూడగలవు.
అయితే
అంతఃకరణ
పరిశుద్ధ
నిమిత్తమై
ఇన్ని
సాధనలు
చేయాలి.
జపము,
ధ్యానము,
భజన,
యోగము
ఇవన్నీకూడను
అంతఃకరణ
పరిశుద్ధ
నిమిత్తమే!
15
▾
Meaning
Keep
ఇవన్నీకూడను
ఏ
విధముగా
చేయాలి?
ప్రేమద్వారానే!
ప్రేమ
లేకపోతే
ప్రపంచములో
దేనినీ
మనము
చూడలేము.
పరమాత్మయే
ప్రేమస్వరూపుడు.
ఆ
ప్రేమతత్త్వాన్ని
మనము
నిర్మలమైన
రీతిగా
పరిశుద్ధము
గావించుకోవాలి.
Previous
←
Oṃkāra is the combined form of Ātma, Manas and body
Next
How Devotees Are Tested and Found Wanting
→