Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1996 · Develop Attachment to the Ātma More than Attachment to the Body
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Develop Attachment to the Ātma More than Attachment to the Body
31 August 1996, Sai Kulwant Hall
1
▾
Meaning
Keep
His poems 150
Also in his talks
(6)
4 September 1986
Man's good and bad rest on his thoughts
3 September 1987
Man's good and bad rest on his own saṅkalpas
2 October 1987
We must feel that we have offered up our Ajñāna in the homa-pit
9 November 1988
To Slay the Demonic in Man Is the Inner Meaning of Narakāsura's Slaying
23 April 1998
Human Life Is Most Precious
12 April 2003
The Chief Qualities of the Young
వివిధ
శాస్త్రచయము
వేదవేదాంగముల్
జీవి
మనసుతెరను
చీల్చలేవు
జీవుడీవలనుండు,
దేవుడావల
నుండు
కార్య
మివల
నవల
కారణంబు.
ప్రేమస్వరూపులారా!
భగవంతుడు
పర్వతములను,
అడవులను,
నదులను,
కొండలను,
గుట్టలను
అన్నింటిని
సృష్టించాడు.
చీమలు
మొదలుకొని
ఏనుగులవరకు
వివిధరకములైన
జీవరాసులను
సృష్టించాడు.
జగత్తుకు
ఏది
అవసరమో
అన్ని
పదార్థములు
సృష్టించాడు.
కానీ,
భగవంతునికి
తృప్తి
కలగలేదు.
ఇవన్నీ
సృష్టించాడు
సరే!
దీనిని
నిత్యానిత్యవిషయపరిశీలన
జరిపి,
విచక్షణా
జ్ఞానముచేత,
వివేక
జ్ఞానముచేత
అనుభవించే
వారెవరు?
పర్వతములను
చూచి
ఆనందించేవారు,
ప్రవాహములు
చూచి
మురిసిపోయేవారు,
అడవులను
చూచి
ఉల్లాసపడేవారు
ఎవరిక్కడ?
అనుభవించి
ఆనందించేవారు
లేకుండిన
సృష్టి
అంతయు
వ్యర్థమే!
కనుక,
‘ఇకపై
వీటిని
అనుభవించి
ఆనందించి
అందరికి
అందించే
వ్యక్తి
స్వరూపాన్ని
సృష్టించాలి’
అని
సంకల్పించుకున్నాడు.
మానవత్వమే
లేకుండిన
సృష్టంతా
శూన్యము
మానవత్వమే
లేకుండిన
ఈ
సృష్టి
అంతయు
శూన్యము.
కనుక,
‘విచక్షణా
జ్ఞానము
కల్గి,
వివేక
ప్రవర్తనచేత,
విచక్షణచేత,
విజ్ఞానముచేత,
ప్రజ్ఞానముచేత,
సుజ్ఞానముచేత
దీనిని
అనుభవించే
ఒక
వ్యక్తిని
సృష్టించాలి’
అని
‘ఏకోహం
బహుస్యాం’
తననుండియే
తాను
సర్వమును
ఆవిర్భవింపచేసుకున్నాడు.
తరువాత
ఆ
మానవుడు
‘వేదాహమేతం
పురుషం
మహాన్తం
ఆదిత్యవర్ణం
తమసః
పరస్తాత్’
‘అన్నింటిని
కనుక్కున్నాను,
స్వామీ!’
అని
ఉచ్చరించాడు.
2
▾
Meaning
Keep
‘వేదాధ్యయనంచేత,
శాస్త్రపఠనంచేత,
వేదాంతపఠనంచేత
ఈ
దివ్యత్వమును
తెలుసుకోవచ్చును’,
అని
మానవుడు
ఒక
నిర్ణయమునకు
వచ్చాడు.
దానిని
తెలుసుకునే
నిమిత్తమై
తపస్సు
ఆచరించాడు.
జపములు
చేశాడు.
ధ్యానము
చేశాడు.
అర్చన
చేశాడు.
అన్ని
సాధనలు
చేస్తూ
వచ్చాడు.
కానీ
దివ్యత్వము
అతని
కంటికి
కనిపించలేదు.
మనస్సుకు
అనిపించలేదు.
చెవులకు
వినిపించలేదు.
హృదయాన్ని
కరిగించలేదు.
ఇవి
చేసి
ప్రయోజనం
ఏమిటి
అని
ఒక
విధమైన
విరక్తికి
గురయ్యాడు.
దేనివల్లను
ఈ
ఆనందము
అనుభవించలేకపోయాడు.
ఎంత
తపస్సు
చేసినా,
ఎన్ని
వేదములు
చదివినా,
ఎంత
శాస్త్రములు
తెలుసుకున్నా
దేహాభిమానము
అనే
పెద్ద
పెనుభూతము
అతనిని
పట్టి
పీడిస్తూ
వచ్చింది.
అప్పుడు
‘ఏమిటి
ఈ
దేహము?
దీనిపైన
ఇంత
అభిమానము
కల్గటానికి
ఏది
కారణము?’
అని
అనేక
పరిశోధనలు
చేశాడు.
కడపటికి
ఈ
దేహము
matter
మరియు
energy
ల
సమ్మిళిత
స్వరూపమేనని
గ్రహించాడు.
ఇది
కేవలము
ఒక
పనిముట్టు
మాత్రమే!
ఈ
పనిముట్టును
నడిపించి,
కదిలించి,
మెదిలించి,
మురిపించి,
మరిపించి,
మైమరపించే
శక్తి
ఒకటున్నది.
ఇది
ఏది?
ఎక్కడుంది?
ఎక్కడనుండి
వస్తుంది?
అనే
విషయమును
తిరిగి
పరిశీలన
చేస్తూవచ్చాడు.
ఎక్కడికి
పోయినా
ఇదే
చింత.
దీనికి
చిన్న
ఉదాహరణ.
ప్రాణములేని
మానవదేహమునకు
విలువలేదు
ఒకానొక
సమయములో
ఇంగ్లాండులో
అరిస్టాటిల్
సాయంకాలం
foot
path
పైన
నడచుకుంటూ
పోతున్నాడు.
నడచుకుంటూ
పోతుంటే
అదే
foot
path
పైన
ఒక
రిటైర్డు
ఆఫీసరు
ఎదురుగా
నడచుకుంటూవచ్చాడు.
ఒకరినొకరు
టక్కున
ఢీకొట్టారు.
అతను
యితన్ని
చూడలేదు,
ఇతను
అతన్ని
చూడలేదు.
తన
ధోరణిలో
తాను
అరిస్టాటిల్
పోతున్నాడు.
ఆ
రిటైర్డ్
ఆఫీసరు
యింటి
బాధ్యతలున్నాయేమో
యోచించుకుంటూ
వస్తున్నాడు.
తక్షణమే
రిటైర్డు
ఆఫీసరు
who
are
you
అన్నాడు,
కోపముతో.
అరిష్టాటిల్
చెప్పాడు,
చేతులు
జోడించుకొని:
‘అదే
నేను
యోచిస్తున్నాను
who
am
I
చెప్పండి’,
అని
ప్రార్థించాడు.
సద్బుద్ధి,
సద్భావము,
సదాలోచన
ఉన్నవారికి
యిట్టి
ఆలోచనలు
సంభవిస్తుంటాయి.
3
▾
Meaning
Keep
‘నేను
ఏ
గురువును
చూడలేదు.
ఏ
గురువు
దగ్గరకి
వెళ్లలేదు.
కానీ
ఈ
అధికారి
who
are
you
అని
question
వేశాడు.
చాలా
important
question.
Who
am
I’
అని
ప్రశ్నించుకున్నాడు.
ఆ
రిటైర్డు
ఆఫీసరు
ఇతను
పిచ్చివాడని
వెళ్లిపోయాడు.
జవాబు
చెప్పలేదు.
అదే
విధముగా
మానవుడు
ఈ
జడమైన
దేహాన్ని,
ఈ
కల్మషమైన
దేహాన్ని
మలమూత్రదుర్గంధమాంసరక్తములతో
కూడిన
ఈ
దేహాన్ని
యింత
భ్రమించటంలో
ఉండిన
విశేషము
ఏమిటి?
‘నిముషనిముషమునకు
నీచులూరునే
గాని
పునుగుజవ్వాదీలు
పుట్టబోవు’.
యిలాంటి
దేహముపై
యింత
అభిమానమెందుకు?
కానీ
యిందులో
ఏదో
శక్తి
ఉన్నది.
ఆ
శక్తి
ఉండటంచేత
యిలాంటి
నిరుపయోగమైన
తోలుతిత్తి
దేహాన్ని
మనము
యింత
భ్రమిస్తున్నాము.
యోచన
చేసుకుంటూ
బజార్లో
వెడుతున్నాడు,
ఒక
హంటరు.
ఒక
కుందేలును
అడవిలో
చంపి
చేతిలో
పెట్టుకొని
వస్తున్నాడు
రోడ్డులో.
మాంసాహారులు
దీనివెల
ఎంత
అని
అడుగుతున్నారు.
5
రూపాయలన్నాడు.
ఒక
వ్యక్తి
5
రూపాయలిచ్చి
ఆ
కుందేలును
కొనుక్కొని
వెళ్లిపోయాడు.
చూచాడు.
‘పనికి
మాలిన
ఈ
కుందేలుకు
5
రూపాయల
వెల
ఉంటున్నాది.
కానీ,
మానవుడు
మరణించిన
తరువాత
దీనికి
5
రూపాయలు
యిచ్చేవారు
ఎవరూ
లేరే!
ఇది
ఎంత
వెల
అని
అడిగేవారు
లేరే!
ఛీ
చూశారా!
మరణించిన
కుందేలుకి
విలువ
ఉందిగానీ
మరణించిన
మానవునికి
విలువలేదు.
ఎంతటి
రాజాధిరాజైనా,
ఎంతటి
చక్రవర్తి
అయినా,
ఎంతటి
పీఠాధిపతి
అయినా
మరణించిన
తరువాత
శ్మశానమునకు
తీసుకుపోతుంటే
మధ్యలో
ఏమైనా
వర్షం
వస్తే
‘సార్!
కొంతసేపు
ఈ
వరండాలో
పెట్టుకుంటామం’టే
అందరూకూడా
‘వద్దు,
తీసుకుపోండి’
అంటారు.
అతను
చక్రవర్తియా,
శ్రీమంతుడా,
పీఠాధిపతియా
యింకే
మహనీయుడా,
ఏదీ
చూడరు.
అదే
రోడ్డులో
ఒక
శ్రీమంతుడు
దేవాలయమునకు
వెడుతూ
‘యిక్కడా
అక్కడా
విడిచిపెడితే
ఏ
కుక్కలో
తీసుకుపోతాయి,
ఏ
మనుషులో
దొంగిలించుకుపోతారు,
నా
చెప్పులు
మీ
వరండాలో
పెట్టిపోతాము
సార్’
అంటే
చెప్పులకొట్టుయజమాని
‘పెట్టండి,
లోపల
పెడితే
యింకా
మంచిది,
బయటపెడితే
ఎవరైనా
తీసుకుపోతార’ని
లోపలదానికి
అవకాశము
యిస్తాడు.
చూశారా!
యితను
గొప్పశ్రీమంతుడు.
ఇతడు
బ్రతికినంతకాలము
యితని
చుట్టూ
అందరు
పరిచారకులు
తిరిగేవారు.
అతనిని
దర్శించాలంటే
చాలా
కట్టుబాట్లు
ఉండేవి.
అదేవిధంగా
ఒక
పీఠాధిపతిని
చూస్తామా
అనుకుంటే
ఎవరిని
ముట్టవద్దు
ముట్టవద్దని
లోనికి
పోయేవాడు
యీనాడు
చివరకు
వరండాలోకూడా
అతని
మృతదేహానికి
ఉండే
అవకాశమునందించలేదు.
4
▾
Meaning
Keep
జంతువుల
చర్మముతో
కుట్టిన
చెప్పులకు
అవకాశమిస్తున్నారు
గానీ
మనిషి
శవమునకు
అవకాశము
ఇవ్వటంలేదు.
దీనికి
కారణము
ఏమిటి?
పరిశోధనలో
యివన్నీ
వస్తున్నాయి
మధ్యమధ్య.
చెప్పులకు
విలువ
ఉంటున్నాది
గానీ
శరీరమునకు
విలువలేదు.
ఈ
విధంగా
విచారం
చేస్తూ
పోయి
‘దీనిలో
ఎవరో
ఉన్నారు.
దీనికి
కర్త
ఎవరో,
భోక్త
ఎవరో
గుర్తించాలి’,
అని
విచారణ
ప్రారంభము
చేశాడు.
ఈ
విధంగా
పోతూ
పోతూ
కట్టకడపటికి
యింటికి
వచ్చి
‘నాన్నా!
జీవితములో
ఏది
ప్రధానమైనది?
ఏది
అన్నింటిని
నడిపించేది.
అన్నింటిలోను
ఏకత్వంగా
ఉండేది
ఏమిటి?’
అని
అడిగాడు.
అప్పుడు
తండ్రి
చెప్పాడు
‘నాయనా!
ఇది
మాటలలో
తెలుసుకోటానికి
వీలుకానిది.
నీవే
స్వయంగా
విచారణ
చేసి
తెలుసుకోవాలి’
అన్నాడు.
ఇప్పటికే
కొన్ని
తెలుసుకున్నాడు
కదా!
చచ్చిన
కుందేలుకి
విలువ
యిచ్చారుగానీ
మనిషికి
విలువ
యివ్వలేదు.
చెప్పులకు
విలువ
యిచ్చారుగానీ
శవమునకు
విలువ
యివ్వలేదు.
సమస్త
సాధనలు
ఆనందము
నిమిత్తమే!
తెలియనిది,
మరుగుగా
ఉండేది
ఒకటుంది.
అది
ఈ
దేహములో
ఉండినంతవరకు
ఈ
దేహమునకు
విలువ
యిస్తున్నారు.
‘శివం’,
‘శివం’
అంటున్నారు.
ఆ
శక్తి
ఈ
దేహమునుండి
వదలిపోతే
‘శవం’,
‘శవం’
అంటున్నారు.
‘ఈ
శవమునకు
ఆ
శివమునకు
ఉండిన
వ్యత్యాసము
ఏమిటి?’
అని
ఆలోచించాడు.
‘కనుగో
నాయనా!
నీవు
సాధన
చేసి
తెలుసుకో’మన్నాడు
తండ్రి.
తిరిగి
తపస్సుకు
వెళ్లాడు.
చూచాడు.
ఈ
దేహానికి
మూలకారణమేమిటి?
‘ప్రాణం’
అని
తెలుసుకున్నాడు.
యింటికి
వచ్చాడు.
‘నాన్నా
తెలుసుకున్నాను.
ప్రాణం
బ్రహ్మ’
అన్నాడు.
‘ప్రాణం
ఉండి
ప్రయోజనం
ఏమిటి
నాయనా!
ప్రాణం
ఉంది,
మనస్సులో
తినాలనే
సంకల్పము
లేకపోతే
నీవు
అన్నం
భుజించగలవా!’
అన్నాడు
తండ్రి.
కాబట్టి,
ప్రాణము
ఉండినంతమాత్రమున
ప్రయోజనములేదు.
ఆపరేషను
చేసే
పూర్వము
డాక్టరు
మత్తుమందిచ్చి
పొట్టను
కోస్తున్నాడు.
ప్రాణముందిగానీ
ప్రయోజనం
ఏమిటి?
‘ఆపరేషను
జరుగుతున్నదా,
ఏమి
చేస్తున్నారు’,
ఏమీ
తెలియదు.
తిరిగి
అడవికి
వెళ్లాడు.
5
▾
Meaning
Keep
ప్రాణంకాదు,
బ్రహ్మ.
తపస్సు
చేశాడు.
‘మనస్సే
బ్రహ్మ’
అనుకొని
వచ్చాడు.
తిరిగి
తండ్రి
చెప్పాడు
‘ఇది
సరియైనదికాదు.
రైటుకాదు.
మనస్సు
ఉందికానీ
విచారణశక్తి
లేక
మనస్సుండి
ప్రయోజనం
ఏమిటి?
బేడలు
తినవచ్చు,
మట్టిని
తినవచ్చు.
విచక్షణా
జ్ఞానం
కావాలికదా?
పిచ్చివానికి
మనస్సుంది.
కానీ
ఎవరితో
ఏవిధంగా
మాట్లాడాలి,
ఎక్కడకి
వెళ్లవలెనో
ఏమీ
తెలియదు’
అని
బోధపరిచాడు.
నిజమే!
మనస్సు
బ్రహ్మకాదు.
మళ్ళీ
వెళ్లాడు.
తపస్సు
చేశాడు.
వచ్చాడు.
‘నాన్నా
ప్రజ్ఞానం
బ్రహ్మ’
అన్నాడు.
‘ప్రజ్ఞానం
బ్రహ్మ’
నిజమే!
అయితే
ప్రజ్ఞానము
ఉంటున్నాది
కానీ
దానివల్ల
మనకేవిధమైన
ఫలితము
రావటంలేదు.
గొప్పగొప్ప
శాస్త్రజ్ఞులుంటున్నారు.
ఎంతమంది
ప్రజ్ఞానులో
ఉంటున్నారు.
విజ్ఞానవంతులు,
సుజ్ఞానవంతులు,
ప్రజ్ఞానవంతులున్నారు.
కాని,
అందరికి
దాని
వెనుక
అజ్ఞానము
అనేది
వెంటాడుతూ
ఉంటుంది.
అదికూడ
పరిపూర్ణ
బ్రహ్మకాదు’
అన్నాడు
వరుణుడు.
తిరిగిపోయి
కూర్చున్నాడు
తపస్సులో.
లేవలేదు.
ఇంటికి
రాలేదు.
ఆ
ఆనందములో
మునిగి
తనలోతాను
ఎంతో
ఆనందిస్తున్నాడు.
మూడు
నాలుగు
దినములు,
నెలరోజులు
చూచారు
తండ్రి.
కుమారుడు
ఇంటికి
రాలేదు.
వెళ్లాడు
తండ్రి.
ఒకే
ఆనందముగా
ఉంటున్నాడు,
కుమారుడు.
‘నాయనా!
తెలుసుకున్నావా?’
అని
అడిగాడు
తండ్రి.
‘ఆనందంబ్రహ్మ’
అన్నాడు.
అన్నమయం,
ప్రాణమయము,
మనోమయము,
విజ్ఞానమయము,
ఆనందమయము,
యీ
పంచకోశములను
పరిశీలన
చేశాడు.
ఆనందము
వచ్చేటప్పటికి
యింక
నాకేది
అక్కరలేదు
అనుకున్నాడు.
సమస్త
సాధనలు
ఆనందము
నిమిత్తము
సల్పేవే!
కానీ
ఇప్పుడు
మనము
అనుభవించే
ఆనందములు
క్షణభంగురములు.
ఇవి
ఆనందములు
కాదు.
అది
నిత్యానందము,
యోగానందము,
పరమానందము,
అద్వైతానందము,
సచ్చిదానందము,
ఆత్మానందము.
అది
ఒక్క
దైవముతో
తప్ప
అన్యముతో
ఏమాత్రము
మనకు
లభ్యముకాదు.
మానవుని
సంకల్పము
అధోస్థాయికి
దిగజారిపోయింది
సృష్టికర్తయైన
భగవంతుడు,
‘మానవుడు
పంచకోశములను
పరిశీలన
చేసి,
కడపటి
కోశమైన
ఆనందములో
ప్రవేశిస్తాడు
అందు
నిమిత్తమై
ఈ
మానవుని
సృష్టించాలి’,
అని
సంకల్పించుకున్నాడు.
6
▾
Meaning
Keep
మానవుడు
ఈనాడు
అన్నమయ,
ప్రాణమయ,
మనోమయ,
విజ్ఞానమయ,
ఆనందమయ
కోశములు
ఐదింటిని
పరిశీలించి
ఒకదానికంటె
మరొకటి
అతి
సూక్ష్మమైనదని
గ్రహించాడు.
దేహముకంటే
ప్రాణము
light
తేలికైనది.
ఈ
ప్రాణముకంటే
మనస్సు
మరింత
తేలికైనది.
మనస్సుకంటే
విజ్ఞానము
మరింత
తేలికైనది.
ఇక
సర్వత్రా
వెలిగేది
ఆనందము.
దురదృష్టవశాత్తు
ఇట్టి
ఆనందమును
విస్మరించి
ఈనాటి
మానవుడు
ఆనందమునుండి
ప్రజ్ఞానమునకు
దిగుతున్నాడు.
‘నేను
సైంటిస్టును’
అని
అహంకారముతో
ఆనందము
మరచిపోయి
ప్రజ్ఞానములోనికి
వచ్చాడు.
ఆ
డ్రైవింగ్
అతనికి
తెలియటంలేదు.
రివర్సుగేరు
వేశాడు.
ప్రజ్ఞానమునుండి
మనోమయకోశమునకు
వచ్చాడు.
మనోమయకోశమునుండి
ప్రాణమయ
కోశమునకు
వచ్చాడు.
ప్రాణమయమునుండి
అన్నమయంలో
ఉండిపోయాడు.
అన్నింటికి
దేహమే
ముఖ్యము
అనే
స్థితికి
వచ్చింది,
ఈనాటి
మానవత్వము.
ఎంత
ఉన్నతస్థాయికి
పోవాలని
బ్రహ్మ
సృష్టించాడో
ఈ
మానవుని
సంకల్పము
అంత
అధోస్థాయికి
దిగిపోయింది.
శరీరమును
తెలుసుకోటానికి
మన
చదువులెందుకు?
చేతి
కంకణమును
చూడటానికి
అద్దమెందుకు
కావాలి?
అదే
విధంగా
దివ్యత్వమును
చూడటానికి
సాధనకావాలిగానీ
దేహమును
గుర్తించుకొనుటకు,
సాధనలక్కరలేదు.
ఈ
దేహము
కేవలము
పనిముట్టువంటిది.
దురదృష్టవశాత్తు
ఈనాడు
మనము
పనిముట్టుపై
concentration
చేస్తున్నాము.
ఈ
పనిముట్టునే
ప్రధానలక్ష్యముగా
తీసుకుంటున్నాము.
ఈ
శరీర
సుఖములన్నీ
ఎంతసేపు?
ఒక
చిన్న
ఉదాహరణ.
ఆకలవుతున్నది.
క్యాంటీనుకు
వెళ్లావు.
ఆరు
రూపాయలిచ్చి
మూడు
చపాతీలు
తిన్నావు.
బాగున్నాది.
చాలా
సంతోషించావు.
ఎంతసేపు,
ఈ
ఆనందము.
మూడుగంటలైన
తరువాత
తిరిగి
కావాలి.
దేహము
పనిచేయటంవలన
ఎంత
పెట్రోలు
తాగుతున్నాది?
ఎంత
ఆయిలు
తాగుతున్నాది?
దీనిని
కేవలము
ఒక
కఠినమైన
యింజనుమాదిరి
ఉపయోగించుకుంటున్నాము.
మిషిన్పై
ఎందుకింత
అభిమానం?
దీనికంటె
ఉన్నతమైన
స్థాయికి
పోవాలి.
ఆనందము
అనే
అతిసూక్ష్మస్థాయినుండి
బరువైన
సైన్సుస్థాయికి
దిగిపోయారు.
ఆపై
మరింత
భారమైన
మనస్సుదగ్గర
చేరిపోయారు.
ఆ
మనస్సును
అర్జునుడే
భరించుకోలేక
పోయాడట!
‘చంచలంహి
మనః
కృష్ణా
ప్రమాదీ
బలవద్దృఢం’
అనుకున్నాడు.
7
▾
Meaning
Keep
ఏమిటి
ఈ
మనస్సుయొక్క
ప్రభావము?
ఒక్క
క్షణమైనా
ఊరికే
ఉండదు.
కోతికైనా
స్థిరత్వముందిగానీ
మనస్సుకు
స్థిరత్వము
లేకుండా
పోతున్నాది.
బలమైనది,
ప్రమాదమైనది,
చాలా
దృఢమైనది,
భారమైనది
యీ
మనస్సు.
దానివలనే
మానవుడు
అనేక
కష్టములకు,
నష్టములకు,
దుఃఖములకు
చివాట్లకు
అశాంతులకు
గురై
అస్తవ్యస్తముగా
మారిపోయి
చివరకు
పిచ్చాసుపత్రి
పాలవుతున్నాడు.
ఎన్ని
గ్రంథాలో
చదువుతున్నాడు.
ఆ
చదివేదానిలో
ప్రధానలక్ష్యమును
పిల్లలు
గుర్తించుకోవాలి.
మతగ్రంథములన్నీ
ఆచరణ
నిమిత్తమేగాని
పారాయణ
నిమిత్తము
కాదనే
సత్యాన్ని
గుర్తించాలి
భగవద్గీత
ఎవరైనా
మీకిచ్చినారంటే
ఆ
భగవద్గీతకు
మొట్టమొదట
నమస్కారం
చేస్తారు.
తలపై
పెట్టుకుంటారు.
హృదయానికి
హత్తుకుంటున్నారు.
ఆ
తరువాత
తెరచి
చదవటం
ప్రారంభిస్తారు.
‘ధర్మక్షేత్రే
కురుక్షేత్రే.....’
ప్రతి
దినము
భగవద్గీత
పారాయణ
చేస్తున్నావు.
ఇక్కడే
ఈ
విద్యావంతులలో,
ఈ
ఆస్తికులలో,
ఈ
భక్తులలో
ఉండిన
పెద్ద
అజ్ఞానము.
చదివిన
తరువాత
ఆ
గ్రంథమును
పూజరూములో
పెడుతున్నారు.
రెండు
గులాబిపుష్పములు
పెడుతున్నారు.
అన్ని
మర్యాదలు
చేస్తున్నారు.
కానీ
ఏమి
ప్రయోజనము?
విషయమును
ఆచరణలో
పెట్టలేదే?
పుస్తకమునకు
గౌరవమిస్తున్నావు,
కాగితాలను
గౌరవమిస్తున్నావు,
కాగితాలను
పూజిస్తున్నావు,
కాగితములోని
అక్షరములను
పూజిస్తున్నావు.
కాని
అక్షరములలోని
ఆనందమును
గ్రోలటంలేదు,
ఈ
గ్రంథములన్నీ
బైబిలుగానీ,
ఖురానుగానీ,
ఉపనిషత్తులుగానీ,
వేదముగానీ,
ఇతిహాసముగానీ
అన్నీ
ఆచరణ
నిమిత్తమై
ఏర్పడినవేగానీ
పారాయణ
నిమిత్తము
కాదనే
సత్యము
ఈనాడందరు
గుర్తించాలి.
సాయి
సచ్చరిత్ర
ఎవరిచేతిలో
చూసినా
కనిపిస్తుంది.
‘దినము
పారాయణము
చేస్తున్నాము,
స్వామీ!’
అంటారు.
అంతకంటే
మూర్ఖత్వము
మరొకటిలేదు.
పారాయణకోసమా
ఈ
బుక్సు
ప్రింటు
చేయించింది?
ఆచరించే
నిమిత్తమై!
దానిలో
ఏమి
చెప్పాడో
దానిని
ఆచరించు.
ఒకానొక
వ్యక్తికి
cold,
cough
ఎక్కువైందట,
పాపం!
ఒక
నాటు
వైద్యుడు
వచ్చి
‘అయ్యా!
శొంఠి,
మిరియాలు,
సున్నము,
అల్లము
అన్నీ
వేసి
కాచి
తాగు’
అన్నాడట!
8
▾
Meaning
Keep
అప్పుడు
యింత
అల్లము,
శొంఠి,
వేసి
కాచి
తాగాలి.
అని
అనుకున్నాడు.
కాని
తాగలేదు.
రోగము
తగ్గాలంటే
దాన్ని
తాగి
అనుభవించాలి
కదా!
అదే
విధముగా
గ్రంథములలో
చెప్పినవి
చెప్పుతున్నావుగానీ
ఆచరించటంలేదే!
అది
చేసినప్పుడే
నీకు
ఫలితము
లభ్యమవుతుంది.
భగవంతుని
చేతిలో
పంచభూతము
లుంటున్నాయి.
ఎవ్వరూ
దానిని
సరిగా
గుర్తించటంలేదు.
సృష్టించినవాని
చేతిలోనే
ఉంటున్నాయి.
ఆ
సత్యాన్ని
మీరు
చక్కగా
గుర్తించుకుంటే
ఒక్క
క్షణములో
మీ
బాధలు
నివారణ
అవుతాయి.
భగవంతుని
చేతిలో
ఉంది
అంటూ
భగవంతుడా
అని
ప్రార్థిస్తారు.
కానీ,
భగవంతుని
చేతిలో
ఉందో
లేదో
తిరిగి
ఒక
అనుమానం.
బైబిలులో
ఒక్క
doubting
Thomas
మాత్రమే
ఉన్నాడు.
ఒక్క
గురుద్రోహి
మాత్రమే
ఉంటున్నాడు.
కానీ
ఇప్పుడు
ప్రతివ్యక్తి
ఒక
డౌటింగ్
థామస్సే!
కారణము
లేకుండా
కార్యము
జరుగదు
శిరిడిలో
ఒకానొక
సమయంలో,
1916లో
పెద్ద
తుఫాను
వచ్చింది.
లక్ష్మీబాయి
అల్లుడైన
బూటీ
మందిరం
కట్టాడు.
ఆ
మందిరం
దేనికోసం
కట్టాడు?
కృష్ణుని
ప్రతిష్ట
చేయాలని
కట్టాడు.
కాని
బాబా
దానిని
‘యిప్పుడు
కాదు,
ఇప్పుడు
కాద’ని
postpone
చేసుకుంటూ
వచ్చాడు.
ఒకనాడు
పెద్ద
తుఫాను
వచ్చింది.
భరించుకోలేకపోయారు,
ప్రజలు.
వడగళ్లు
రాళ్లవలె
కొట్టేస్తున్నాయి.
పనిచేసేవారు,
పల్లెప్రజలు
అందరు
పరుగెత్తి
వచ్చారు.
మఠములు,
సత్రములలో
దిగారు.
ద్వారకామాయి
చిన్నగా
ఉంటున్నాది.
ఎక్కడ
మనిషి
నిలవటానికి
స్థలం
చిక్కుతే
అక్కడంతా
ప్రవేశించారు.
అందరు
‘బాబా!
బాబా!
రక్షించండి’
అన్నారు.
ద్వాపరయుగములోపల
బ్రహ్మ
రాళ్లవర్షం
కురిపించినప్పుడు
గోవర్ధనగిరి
ఎత్తినట్టుగా,
ఆ
గోపికలు,
గోపాలురు
సర్వులు
వెళ్లి
ఓ
భగవంతుడా!
కాపాడు
కాపాడు
అని
ప్రార్థించినట్లుగా,
శిరిడీ
ప్రజలందరు
వచ్చి
బాబాను
ప్రార్థించారు.
అప్పుడు
బాబా
‘అచ్ఛా
ధేఖేగా!
ధేఖేగా!’
అని
ముందుకు
పోయాడు.
స్థంభమును
పట్టుకు
కొట్టాడు.
‘అయ్యా
చాలు,
ఇంక
నీ
రౌద్రము.
శాంతి
పొందు.
ఎక్కువ
క్రోధమును
ఉపయోగపెట్టావు.
క్రోధములో
అందరు
నీకు
భయపడిపోయారు.
నీ
ప్రతాపాన్ని
తెలుసుకున్నారు.
నీవు
అధికంగా
పోతున్నావు
చల్లబడు’
అన్నాడు.
క్షణములో
తుఫాను
ఆగిపోయింది.
చెప్పటముకోసంకాదు.
మీరందరు
ఒక్కతూరి
గుర్తుచేసుకోవాలి.
9
▾
Meaning
Keep
మర్చిపోయి
ఉంటారు.
రెండు
రోజులు
ముందుగా
నేను
ఉపన్యాసం
ప్రారంభించేముందు
ఒకే
గాలి,
వర్షం
వచ్చింది.
ఆ
గాలిలోపల
నేను
నిల్చుకొని
‘అందరు
లోపలకురండి’
అని
పిల్చాను.
బయట
ఉన్నవారంతా
లోపలకు
వచ్చి
కూర్చున్నారు.
నేను
ఉపన్యాసం
ప్రారంభించాను.
ఒక్క
చినుకులేదు.
అదే
షిరిడీలో
ధుని
ఉంటున్నాది.
ఆడవారికి
పిచ్చి
ఎక్కువ.
భక్తులు
వస్తుంటారు.
కట్టెలు
అమ్ముతారు.
కట్టె
కొనుక్కునేది,
ధునిలో
వేసేది.
ఈ
మంట
ఎంతవరకు
వస్తుందో,
కాలి
ఏమైపోతుందో
ఏమీ
యోచన
చేయరు.
మేము
అగ్నిహోత్రమునకు
ప్రసాదము
అందించామని
తృప్తి
పడటానికి
కట్టెలు
కొని
అందులో
వేస్తారు.
కొంతసేపయ్యేటప్పటికి
పెద్దమంట
ప్రారంభమైంది.
శ్యామా
వచ్చాడు.
‘దాదా!,
దాదా!’
అని
పిల్చాడు.
బాబా
అతనిని
‘దాదా’
అని
పిల్చేవాడు.
‘క్యా
శ్యాం!
క్యా
హంగామా?
దేఖో?’
అని
చెప్పాడు
బాబా.
అగ్నిహోత్రుడు
ప్రత్యక్షమయ్యాడు.
చూచేవారు
ఎవరున్నారు
అక్కడ?
ఎవరు
లేరక్కడ.
‘ఎవరు
లేనప్పుడు
నీ
ప్రతాపము
ఎందుకు
చూపుతావు?
నీకు
బుద్ధి
చెప్పేవారు
లేకపోతున్నారు.
అవసరమైన
దగ్గర
నీ
ప్రభావము
చూపించాలిగానీ
అవసరంలేని
దగ్గర
నీ
ప్రభావమెందుకు?’
అని
స్థంభమును
పట్టుకొని
రెండు
కొట్టాడు.
క్షణములో
అగ్ని
చల్లారిపోయింది.
అనగా
ఏమిటి?
కారణంలేకుండా
కార్యము
జరగదు.
దేహాభిమానమును
దైవాభిమానముగా
మార్చుకున్నవాడే
ధన్యుడు
గంగానది
ఒడ్డుకుపోయి
‘అయ్యా!
మీకు
నీరు
యిస్తాను,
రండి
ఎవరైనా’
అని
ఎంత
పిచ్చివారైనా
పలుకుతారా?
నీరెందుకివ్వటం?
గంగానది
ప్రవహిస్తూనే
ఉంది.
ఇంకా
చాలామంది
మరింత
పిచ్చివారుగా
తయారైపోయారు.
యీ
పండితులు.
గంగా
జలము
తీసుకుంటారు,
‘కేశవాయ
నమః,
మాధవాయ
నమః,
నారాయణాయ
నమః’
అంటూ
గంగలోనికి
విడిచి
పెడతారు.
ఎక్కడి
నీరు
ఎక్కడకిస్తున్నారు.
గంగజలము
గంగకే
వేస్తున్నారు.
ఈ
విధమైన
అమాయకత్వము
ఎక్కువ
కావటంచేత
దేశములో
నాస్తికత్వము
పెరిగిపోతున్నాది.
ప్రతి
దానికి
reason
చూపించాలి.
అన్నింటియందు
‘సై’
అనిపించుకోవాలి.
ఆధునికయుగములో
యింత
చిన్న
పిల్లవాడుకూడా
ప్రశ్నిస్తాడు.
చిన్న
చిన్న
పిల్లలు
‘ఏమిటండీ
సృష్టి?’
అని
అడుగుతారు.
వానికి
సృష్టి
అంటే
తెలియదు
గానీ
ప్రశ్నిస్తాడు.
10
▾
Meaning
Keep
‘నాయనా!
యీ
సృష్టి
అంటే
పుట్టటము’
అని
చెపుతాము.
అంతేనా
అని
వెళ్లిపోతాడు.
ఇంత
అమాయక
స్థితికి
దిగజారిపోయింది.
కారణము
ఏమిటి?
దేహాభిమానమే
దీనికి
మూలకారణము.
ఈ
దేహాభిమానమును
ఎవరు
దైవాభిమానంగా
మార్చుకుంటాడో
వాడే
ధన్యుడు.
అప్పుడే
తగిన
విలువ
వస్తుంది.
అది
లేకుండా
ఉన్నంతవరకు
ఈ
Rabbit
కు
వచ్చినంత
ఐదురూపాయలుకూడా
విలువ
యివ్వరు,
దీనికి.
చిన్న
ఉదాహరణము.
చిన్న
చిన్న
కథలలోపలనే
పెద్ద
అంతరార్థము
గుర్తించుకోటానికి
వీలవుతుంది.
ఒకానొక
సమయంలో
‘గోవింద
దామోదర
నారాయణ
గోవింద
దామోదర’
అని
నారదుడు
త్రికాలములందు
నారాయణ
చింత
చేసుకుంటూ
వెళ్లేవాడు.
వైకుంఠానికి
వెళ్లి
‘నారాయణా!
నమస్కారమ’న్నాడు.
‘మంచిది,
నారదా!
కూర్చో’
అన్నాడు
నారాయణుడు.
తరువాత
‘ఏమి
నారదా!
నా
సృష్టిలో
చెడ్డది
ఏదైనా
ఉంటున్నాదా?
త్రిలోక
సంచారివికదా,
చూస్తున్నావు
ఏమైన
చెడ్డ
ఉందా
చెప్పు’
అన్నాడు.
నారదుడు
‘క్షమించండి,
కావలసినంత
ఉంటున్నాది
చెడ్డ’
అని
చెప్పాడు.
‘ఛ!
ఏమిటి
చెబుతున్నావు?
బ్రహ్మ
మానసపుత్రుడైకూడను
యింత
విచక్షణా
జ్ఞానములేక
మాట్లాడుతున్నావు.
నా
సృష్టిలో
చెడ్డ
లేనేలేదు’
అన్నాడు
నారాయణుడు.
అప్పుడు
నారదుడు
‘స్వామీ!
ప్రతి
మానవుడు
తెల్లవారుతూనే
బయటకు
పోతున్నాడు.
మలమూత్రాలు
విసర్జిస్తాడు.
అది
ఎంత
చెడ్డది?
అన్నాడు.
విష్ణువు
చాలా
ఆశ్చర్యంగా
చూస్తున్నాడు.
‘ఏమిటి
అది
చెడ్డ
అనుకుంటున్నావు
నీవు?
చాలా
పొరపాటు.
నీవు
భ్రమలో
ఉంటున్నావు.
చెడ్డదికాదు,
మంచిది’
అని
తన్ను
తాను
సమర్ధించుకున్నాడు,
నారాయణుడు.
‘నారాయణుడే
యిట్లా
చెబుతే
నేనేమి
చెప్పాలి?
అది
మంచిదని
ఎట్లా
చెప్పేది
స్వామీ!’
అన్నాడు
నారదుడు.
‘నన్ను
అడగవద్దు,
దానినే
పోయి
అడుగు’
అని
మళ్లీ
నారాయణుడు
చెప్పాడు.
ఏంచేసేది?
నారాయణుని
ఆజ్ఞ
శిరసావహించి
వెళ్లాడు.
ఆ
మలము
యింకా
పదడుగుల
దూరములోనే
ఉంటున్నది.
నారదుడు
పోతున్నాడు
దగ్గరకు,
అడగటానికి.
మలం
చెప్పింది
‘నారదా
దూరం
దూరం’
అంది.
‘ఏమిటి
నేను
దూరంగా
ఉండవలసింది?
నన్ను
నీవు
దూరంగా
ఉండమంటున్నావు!
ఎందుకు
నన్ను
దూరముగా
ఉండమంటున్నావు’
అన్నాడు,
నారదుడు.
‘నారదా!
నిన్న
రాత్రి
పవిత్రమైన
పెరుగుగా
ఉండినాను.
పవిత్రమైన
పాలుగా
ఉంటున్నాను.
పవిత్రమైన
అన్నంగా
ఉన్నాను.
11
▾
Meaning
Keep
మధురమైన
పదార్థముగా
ఉంటున్నాను.
భగవంతునికి
నైవేద్యము
చేసే
అర్హత
కల్గి
ఉండేదాన్ని.
కానీ
ఒక్కతూరి
మనిషితో
సంయోగం
జరిగిందో
లేదో
నాకీగతి
పట్టిపోయింది.
రెండవతూరి
అయితే
నాకే
గతి
పట్టిపోతుందో
దూరంపోండి.
ఇదంతా
మనిషితో
జరిగిన
reaction,
reflection,
resound
గానీ
దైవముతో
కల్గినవికాదు’,
అన్నది
మలం.
దేహమును
భగవంతుని
దేవాలయముగా
గుర్తించుకోవాలి
Association
ఎలాంటిదో
అలాంటిదిగా
తయారౌతాం.
ఒక
ఆవకాయో,
గోంగూరో
జగ్గులో
వేస్తే
సంవత్సరమంతా
చెడిపోకుండా
ఉంటున్నాది.
అదే
ఆవకాయ
ఉదయమే
దేహములో
వేస్తే
సాయంకాలమునకు
చెడిపోతుంది.
అంతేకాదు,
మీరు
చూచి
ఉంటారు.
ఫ్లోరు
మిల్లు
ఉంది.
పైన
గోధుమలు
వేస్తే
గోధుమపిండి
వస్తుంది.
పైన
బియ్యంవేస్తే
బియ్యంపిండి
వస్తుంది.
పైన
బేడలు
వేస్తే
బేడలపిండి
వస్తుంది.
కాని,
ఈ
శరీరమనే
ఫ్లోరు
మిల్లులో
మధురమైన
లడ్డువేస్తే
మరునాటికి
మలంగా
మారిపోతుంది.
కాబట్టి
దేహముకంటె
ఫ్లోరుమిల్లు
better,
జగ్గు
better.
వాటికంటే
హీనమైనది
దేహము.
కానీ
ఈ
దేహానికి
ఎందుకు
మనమింత
గౌరవమిస్తున్నాము?
దాంట్లో
ఆత్మ
నఖశిఖపర్యంతము
సంచరిస్తున్నాది.
‘దేహోదేవాలయ...’
దేహమును
భగవంతుని
దేవాలయముగా
మనం
గుర్తించుకోవాలి.
దేహమే
ప్రధానమని
అనుకోకూడదు.
దేవుడులేని
దేవాలయం
మనకెందుకు?
దేవాలయములో
దేవుడున్నాడు.
దేవుని
నిమిత్తమే
నేను
అర్పితము
చేస్తున్నాను.
ఆ
పవిత్రమైన
భావము
మనము
ఏనాడు
అభివృద్ధి
పరచుకొందుమో
ఆనాడే
మన
దేహము,
మనస్సు,
బుద్ధి,
చిత్తము,
యింద్రియము,
అంతఃకరణ
సార్థకమైపోతాయి.
ఈ
దేహాభిమానమంతా
ఆత్మాభిమానముగా
మార్చుకోవాలి.
అదే
మనం
చేయవలసిన
సాధన.
భజన
అవీ
ఆ
స్టేజీకి
వచ్చేంతవరకు
ఉండవలసినదే!
మంచి
జాతి
మామిడి
చెట్టు
నాటాము.
కాయ
కాసింది.
కాయగా
ఉన్నంతవరకు
పుల్లగానే
ఉంటుంది.
ఫలము
అయిన
తరువాత
మాధుర్యము
వస్తుంది.
అదే
విధంగా
మీరుకూడా
ఆ
పరిపక్వస్థితికి
వచ్చేటప్పటికి
ఆ
ఆత్మభావము
వస్తుంది.
అంతవరకు
క్రమక్రమేణా
నిత్యజీవితములో
మీ
మీ
కర్తవ్యములు
నిర్వర్తించుకుంటూపోవాలి.
12
▾
Meaning
Keep
కానీ
లక్ష్యమును
మరువకూడదు.
దాన్ని
పొందాలి.
దేహాభిమానముకంటె
ఎక్కువగా
ఆత్మాభిమానం
పెంచుకోవాలి.
అప్పుడే
తగిన
ఆనందము
లభిస్తుంది.
ఆ
సత్యమార్గములో
మనం
ప్రవేశించాలి.
ఆ
జ్ఞానమార్గములో
మనం
ప్రవేశించాలి.
ఆ
ఆనందమార్గములో
మనం
మునిగిపోవాలి.
Previous
←
The Body Must Be Set on the Sacred Path!
Next
Human Life, Which Begins with Food, Must End in Ānanda
→