Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1998 · Remembrance Alone Is the Way Across
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Remembrance Alone Is the Way Across
15 March 1998, Brindavan, Whitefield
1
▾
Meaning
Keep
భారతదేశమునందు
పుట్టి
భారతీయులనే
పేరు
పొంది
భారతీయ
తత్త్వాన్ని
గుర్తించుకోలేక
పోవడం
చాల
దురదృష్టకరం.
“భా”
అనగా
జ్యోతిర్మయము;
‘రత’
అనగా
అభిలషించడం.
కనుక
జ్యోతిర్మయుడైన
భగవంతుణ్ణి
అభిలషించడమే
భారతీయుల
ప్రధాన
లక్ష్యం.
కానీ
ఈనాడు
భారతీయులే
జ్యోతిర్మయుడైన
దైవాన్ని
విస్మరిస్తున్నారు.
పైగా
“మేము
సామాన్య
మానవులం,
సామాన్యమైన
జీవితాన్ని
గడుపుతున్నాము,
నిరంతరము
ఎన్నో
పనులలో
మునిగి
ఉంటాము.
కనుక
భగవంతుణ్ణి
స్మరించడానికి
మాకు
వ్యవధి
లేదు”
అంటారు.
ఇది
అర్థం
లేని
మాట.
టీవీలను
చూడడం
లేదా?
సినిమాలకు
పోవడం
లేదా?
ఇతరుల
గూర్చి
మాట్లాడుకోవడం
లేదా?
ఇన్ని
వ్యర్థమైన
పనులలో
ప్రవేశిస్తూ
సార్థకమైన
దైవచింతనకు
మాత్రం
వ్యవధి
లేదనడం
ఎంత
అజ్ఞానం!
అగ్నిలో
బొగ్గును
వేసి
విసనకర్రతో
విసిరితే
బొగ్గు
కూడా
అగ్నిగా
మారిపోతుంది.
ప్రజ్ఞానస్వరూపుడు,
జ్యోతిర్మయుడు
అయిన
దైవమే
అగ్ని;
అజ్ఞానాంధకారంతో
కూడిన
మానవుడే
బొగ్గు.
ఆ
అగ్నికి
ఈ
బొగ్గును
సమీపంగా
చేర్చి
సాధన
అనే
విసనకర్రతో
విసిరితే
ఈ
బొగ్గు
కూడా
అగ్నిగా
మారిపోతుంది.
కానీ
మానవుడీ
దివ్యమైన
రహస్యాన్ని
గుర్తించక
దైవాన్ని
స్మరించక
అహంకార
ఆడంబరములతో
కాలాన్ని
వ్యర్థం
గావిస్తున్నాడు.
హృదయపూర్వకంగా
మనం
దైవనామస్మరణ
చేస్తే
ఎట్టి
బాధలూ
మనకు
సంభవించవు.
ఒకవేళ
సంభవించినప్పటికీ
వాటిని
తట్టుకొని
నెట్టుకొని
ముందుకు
సాగే
శక్తిసామర్థ్యాలను
ఆ
నామమే
ప్రసాదిస్తుంది.
మీకందరికీ
తెలుసు:
మీరా
పరమ
భక్తురాలు.
ఆమె
లోకాభిమానాన్ని,
దేహాభిమానాన్ని
త్యజించి
ఆనందంతో
నిరంతరం
కృష్ణలీలలను
గానం
చేస్తూ
ఉండేది.
కానీ
దేహాభిమాని,
లోకాభిమానియైన
ఆమె
మరిదికి
ఇది
నచ్చలేదు.
మహారాణా
భార్య
నల్గురిలో
పాటలు
పాడుతూ
తిరగడం
రాజకుటుంబానికే
అవమానమని
భావించాడు.
దైవాన్ని
స్మరించడం
అవమానమనీ,
లోకాన్ని
వరించడమే
గౌరవమనీ
విశ్వసించాడు.
అందుచేత
ఒకనాడు
ఆమెకు
పాలలో
కఠోరమైన
విషమును
కలిపి
అందించాడు.
2
▾
Meaning
Keep
అయితే
మీరా
తాను
ఏది
తిన్నా,
ఏది
త్రాగినా
దానిని
ముందుగా
కృష్ణునికి
అర్పించేది.
“సర్వ
కర్మ
భగవత్ప్రీత్యర్థం”
అనే
భావనతో
ఆమె
నిత్యకృత్యములను
ఆచరిస్తూ
ఉండేది.
అందుచేత
తన
మరిది
అందించిన
పాలగిన్నెను
కృష్ణవిగ్రహము
ముందు
పెట్టి
హృదయపూర్వకంగా
‘కృష్ణార్పణం’
అన్నది.
ఆ
మాట
కేవలం
ఆమె
పెదవుల
నుండి
వచ్చినది
కాదు,
హృదయం
నుండి
ఆవిర్భవించినది.
ఆమె
ప్రార్థన
విన్న
తక్షణమే
కృష్ణుడు
విషమును
తాను
ఆరగించి,
ఆ
పాలను
దివ్యమైన
అమృతంగా
మార్చాడు.
ఆ
పాలను
కృష్ణుని
ప్రసాదంగా
భావించి
ఆమె
ఆనందంగా
త్రాగింది.
మీరా
మరణించిన
వార్త
ఏ
నిమిషంలో
వస్తుందో
అని
ఆమెమరిది
చాల
ఆసక్తితో,
ఆతురతో
ఎదురు
చూస్తున్నాడు.
కానీ
అనుకున్నది
ఒకటి,
జరిగింది
మరొకటి!
ఆ
పాలలో
కలిపిన
విషం
ఆమెపై
ఎట్టి
ప్రభావమూ
చూపలేదని
తెల్సుకొని
చాల
నిరాశ
చెందాడు.
ఆమె
త్రాగగా
మిగిలిన
కొద్దిపాటి
పాలను
తీసుకు
వెళ్ళి
పరీక్ష
చేయించాడు.
అందులో
విషము
లేనే
లేదని
తేలింది.
మరి
అతడు
స్వయంగా
కలిపిన
విషం
ఎక్కడికి
పోయినట్లు?
దానిని
భగవంతుడు
ఆరగించాడు.
ఎందుకంటే
దానిని
భగవత్ప్రీత్యర్థం
అని
అర్పితం
చేసింది
మీరా.
భగవత్ప్రీత్యర్థంగా
దేనిని
అర్పించినా
అందులోని
మాలిన్యాన్ని
తొలగించి
దానిని
పవిత్రం
గావిస్తాడు
భగవంతుడు.
కొంతకాలం
తరువాత
మహారాణాయొక్క
పరమవిరోధియైన
అక్బర్
చక్రవర్తి
మీరా
భక్తి
ప్రపత్తులను
గూర్చి
ఆనోట,
ఈనోట
విన్నాడు.
ఎట్లాగైనా
సరే
ఆమెదర్శనం
చేసుకోవాలని
అతనిలో
తీవ్రమైన
వాంఛ
కలిగింది.
ఈ
విషయాన్ని
బీర్బల్‌కు
చెప్పాడు.
అతడు
కూడా
వెంట
వస్తానన్నాడు.
ఒకనాడు
ఇరువురూ
మారువేషాలు
ధరించి
మీరాదర్సనార్థమై
బయలుదేరారు.
ఆ
సమయంలో
మీరా
కృష్ణమందిరంలో
భక్తిపారవశ్యంతో
తన్మయురాలై
గానం
చేస్తున్నది.
ఆమె
గానం
విని
అక్బర్
అలౌకికానందంలో
మునిగిపోయి
తనను
తాను
మరచిపోయాడు.
బీర్బల్
అతని
వీపుతట్టి
హెచ్చరించేంతవరకు
తానెవరో,
ఎక్కడున్నాడో,
ఏమి
చేస్తున్నాడో
అక్బర్‌కు
స్మృతికి
రాలేదు.
చిట్టచివరికి
వెళ్ళిపోయేముందు
అక్బర్
ఒక
హారాన్ని
పట్టుకొని
మీరావద్దకు
వెళ్ళి,
“అమ్మా!
ఈ
హారాన్ని
దయతో
స్వీకరించి
కృష్ణుని
మెడలో
వేయవలసింది”
అని
ప్రార్థించాడు.
అప్పుడు
మీరా
“పరుల
వస్తువులను
నేను
ముట్టను.
ఈ
హారాన్ని
కృష్ణుని
మెడలో
వేయాలనుకుంటే
మీరే
లోపలికి
వెళ్ళి
వేయండి”
అన్నది.
కానీ
కృష్ణుని
దగ్గరకు
పోవడానికి
అక్బర్‌కు
ధైర్యం
చాలలేదు.
3
▾
Meaning
Keep
“అమ్మా!
నన్ను
క్షమించండి
మీరే
ఈ
మాలను
తీసుకొని
కృష్ణుని
మెడలో
వేయండి”
అని
మరొక్కమారు
ప్రార్థించాడు.
అక్బర్
ప్రార్థనను
కాదనలేక
మీరా
అతని
చేతినుండి
ఆ
హారాన్ని
అందుకొని
కృష్ణుని
మెడలో
వేసింది.
ఈ
దృశ్యాన్ని
మహారాణా
తమ్ముడు
చూశాడు.
కుక్క
చెప్పులను
వెతుకుతుంది,
దుష్టుడు
తప్పులను
వెతుకుతాడు.
మహారాణా
తమ్ముడు
మీరాలో
ఎప్పుడు
ఏ
తప్పు
కనిపిస్తుందా
అని
నిరంతరము
వెతుకుతూ
వచ్చాడు.
ఎప్పుడైతే
మీరా
అక్బర్
చేతినుండి
ఆ
హారమును
అందుకోవడం
చూశాడో
తక్షణమే
మహారాణా
వద్దకు
వెళ్ళి
ఆమెపై
లేనిపోనివన్నీ
కల్పించి
చెప్పాడు.
“ఈ
మీరా
మన
వంశగౌరవాన్ని,
రాజ్యగౌరవాన్ని
మట్టిపాలు
చేస్తున్నది;
మన
కీర్తి
ప్రతిష్ఠలను
మంటగలుపుతున్నది.
ఇకపై
ఈమెను
మనదగ్గర
పెట్టుకోవడం
మంచిది
కాదు,
తక్షణమే
బయటికి
పంపించు”
అని
వత్తిడి
చేశాడు.
అక్బర్
పేరు
వింటూనే
మహారాణా
కూడా
కోపోద్రిక్తుడయ్యాడు.
తక్షణమే
కృష్ణమందిరానికి
వచ్చి,
“మీరా!
ఇక
నీవు
బయటికి
వెళ్ళు”
అని
ఆదేశించాడు.
అతడలా
ఎందుకు
అంటున్నాడో
ఆమెకు
అర్థం
కాలేదు.
“నేనున్నది
కృష్ణునికోసమే!
కృష్ణుణ్ణి
వదలి
నేనెక్కడికి
వెళ్ళగలను?”
అని
ఒక్క
క్షణం
యోచించింది.
అంతమాత్రము
ఆలస్యాన్ని
కూడా
భరించలేక
మహారాణా
ఆమెజుట్టు
పట్టి
బయటికి
ఈడ్చేశాడు.
అప్పుడు
మీరా
“నా
హృదయమే
నీ
మందిరము
కృష్ణా!
కాబట్టి
మనిరువురిని
ఎవ్వరూ
విడదీయలేరు”
అనుకొని
“చలోరే
మన్
గంగా
యమునా
తీర్”
అని
పాడుకొంటూ
బయలుదేరింది.
ఏది
గంగ?
ఏది
యమున?
మన
నాసికములో
కుడిప్రక్క
గాలిని
‘ఇడ’
అన్నారు,
ఎడమప్రక్క
గాలిని
‘పింగళ’
అన్నారు.
ఇవే
గంగాయమునలు.
ఈ
రెండింటి
చేరికయే
సుషుమ్ననాడి.
అదే
భ్రూమధ్యస్థానము.
అట్టి
గంగా
యమునా
తీరానికి
వెళ్ళవలసిందిగా
మనస్సుకు
బోధించింది.
మీరా
కుంభవృష్టిని,
పెనుగాలిని
సైతం
లెక్కచేయక
వీథివీథిలోను
భజన
చేసుకుంటూ
వెళుతుంటే
స్త్రీలు,
పురుషులు
అనేకమంది
ఆమెను
అనుసరించారు.
అలనాడు
వాల్మీకి
శిష్యులైన
లవకుశులు
కూడా
రుద్రాక్షలు
ధరించి
తంబుర
మీటుతూ
వీథివీథిలోను
గొంతెత్తి
రామభజన
చేస్తూవచ్చారు.
కానీ,
ఈనాడు
అనేకమంది
భజన
చేస్తూ
వచ్చారు.
కానీ,
ఈనాడు
అనేకమంది
భజన
చేయాలన్నా,
నగర
సంకీర్తనకు
పోవాలన్నా
బిడియమెందుకు?
4
▾
Meaning
Keep
దేహము
వచ్చినదే
దైవనామస్మరణ
కోసం.
కనుకనే
మీరా
“ఓ
కృష్ణా!
సంసారమనే
సముద్రంలో
ఎంతో
లోతుకు
వెళ్ళి
ఎంతో
కష్టపడి
అత్యంత
విలువైన
నామమనే
ముత్యాన్ని
సంపాదించాను.
ఇంత
కష్టపడి
నేను
సంపాదించుకున్న
ఈ
ముత్యం
తిరిగి
నా
చేతినుండి
జారిపోకుండా
చూడు.
ఇంక
నాకు
నీవు
తప్ప
మరొక
గతి
లేదు
ఓ
గిరిధారీ!”.
అని
ప్రార్థించింది.
ఎప్పుడైతే
మహారాణా
మీరాను
వెళ్ళగొట్టి
కృష్ణమందిరం
యొక్క
తలుపులను
మూసేసాడో
అదే
క్షణంలో
అక్కడ
ద్వారకలోను
కృష్ణమందిరం
యొక్క
తలుపులు
మూసుకుపోయాయి.
ఎవరెంతగా
ప్రార్థించినా,
ఎన్ని
విధాలుగా
ప్రయత్నించినా
అవి
తెరుచుకోలేదు.
మహారాణా
తాను
చేసిన
తప్పుకు
పశ్చాత్తాపపడి
మీరాకు
క్షమాపణ
చెప్పుకోవాలని
బయలుదేరాడు.
మీరా
ద్వారక
చేరుకొని
“గిరిధారీ,
గిరిధారీ....”
అని
స్మరిస్తూ
మందిరద్వారాలను
తన
తలతో
కొట్టింది.
ఆ
ద్వారాలు
తెరుచుకోవడం,
మీరా
ప్రాణాలు
వదలడం
రెండూ
ఒకేసారి
జరిగిపోయాయి.
కృష్ణుడు
ప్రత్యక్షమై
ఆమెను
తనలో
లీనం
చేసుకున్నాడు.
మీరా
కొద్ది
నిమిషాలలో
ప్రాణాలు
వదులుతుందనగా
మహారాణా
పరుగెత్తుకొని
వచ్చి
“మీరా!
తెలియక
నా
తమ్ముని
మాటలు
విని
నీకు
తీరని
ద్రోహం
చేశాను.
నన్ను
క్షమించు,
క్షమించు,
క్షమించు...”
అంటూ
పశ్చాత్తాపపడ్డాడు.
పాజిటివ్
-
నెగెటివ్
ఈనాటి
మానవుడు
భగవంతుడనే
పాజిటివ్
తత్త్వాన్ని
గుర్తించుకోలేక
దేహభ్రాంతితో
నెగెటివ్
జీవితాన్ని
గడుపుతున్నాడు.
ఏది
నెగెటివ్?
ఏది
పాజిటివ్?
అనిత్యమైన,
లౌకికమైన
వాంఛలపై
ప్రయాణం
చేసే
మనస్సు
స్వభావం
-
నెగెటివ్;
మార్పు
చెందని,
కూర్పు
చెందని
దివ్యత్వంపై
మనస్సును
మళ్ళించడం
-
పాజిటివ్.
“సత్యం
త్రికాలాబాధ్యం”,
త్రికాలములందును
మార్పు
చెందనటువంటిదే
సత్యం.
అట్టి
సత్య
స్వరూపుడైన
భగవంతుణ్ణి
చింతించడమే
పాజిటివ్.
ఈ
దేహాన్ని
అనిత్యమైన,
అశాశ్వతమైన,
లోకసంబంధమైన
వాంఛల
నిమిత్తమై
వినియోగించకూడదు.
దీనిని
భగవదర్పితం
గావించి
సార్థకం
చేసుకోవాలి.
ఇట్టి
సత్యనిత్యమైన
ఆదర్శాన్ని
అందించినది
మీరా.
5
▾
Meaning
Keep
సైంటిస్టు
-
నగరసంకీర్తన
భగవన్నామంలో
ఎంతో
గొప్ప
శక్తి
సామర్థ్యాలు
ఇమిడి
ఉన్నాయి.
అట్టి
భగవన్నామాన్ని
మనం
వరిస్తే
చాలు,
స్మరిస్తే
చాలు,
తరించిపోతాము.
ఒక
పర్యాయం
హైదరాబాద్‌లో
సాయిభక్తులందరూ
చేరి
సాయినామసప్తాహాన్ని
నిర్వహించారు.
చిక్కడపల్లి
వద్ద
నగరసంకీర్తన
ప్రారంభం
కావలసియుండినది.
ఆ
సమయంలో
భగవంతం
భారత
ప్రభుత్వానికి
సైంటిఫిక్
అడ్వైజర్‌గా
ఉండినాడు.
నేను
చెప్పాను
అతనికి:
“భగవంతం!
సైన్సు,
సైన్సు
అంటూ
24
గంటలు
ఊరికే
సైన్సు
జపం
చేసే
బదులు
నీవు
కూడా
వెళ్ళి
నగర
సంకీర్తనలో
పాల్గొను”
అని.
అతడు
“స్వామీ!
మా
సైన్సు
దీనికి
ఒప్పుకోదు”
అన్నాడు.
“సైన్సు
ఏకత్వాన్ని
అనేకత్వంగా
విభాగం
చేస్తుంది;
కానీ
ఆధ్యాత్మికం
అనేకత్వాన్ని
ఏకత్వం
గావిస్తుంది.
Science
is
split
of
Love,
Spirituality
is
spirit
of
Love.
ఇట్టి
ఆధ్యాత్మికానందాన్ని
నీవు
పొందాలనుకుంటే
వెళ్ళు
నగర
సంకీర్తనకు”
అని
మళ్ళీ
చెప్పాను.
అప్పుడతని
భార్య
కూడా
“ఏమిటండీ,
మీరీ
పాడు
సైన్సులో
మునిగిపోతున్నారు.
దీనివల్ల
ఒక్క
నిమిషమైనా
శాంతిని
పొందారా?
కనుక
స్వామి
చెప్పినట్లు
చేయండి”
అన్నది.
ఇది
కలియుగం.
ఎంతటి
సైంటిస్టు
అయినా,
ఎంతటి
మేధావి
అయినా
పెద్దవారు
చెప్పినది
వినరు.
కానీ
భార్య
చెప్పినది
మాత్రం
తక్షణమే
శిరసావహిస్తారు.
కనుకనే
త్యాగరాజు
“ఎంత
నేర్చినా
ఎంత
జూచినా
ఎంతవారలైన
కాంతదాసులే”
అని
ఆనాడే
చెప్పాడు.
సరే,
ఒక
టవల్
భుజం
మీద
వేసుకొని
భగవంతం
నగరసంకీర్తనకు
వచ్చాడు.
ఎంతదూరం
నడిచాడంటే
పదిమైళ్ళ
దూరం
నడిచాడు.
సాధారణంగా
అతనికి
పది
నిమిషాలు
నడిస్తే
ఆయాసం
వచ్చేది.
కానీ
ఆనాడు
పదిమైళ్ళు
నడిచినా
ఏమీ
ఆయాసమనిపించ
లేదు.
భక్తులు
ఉస్మానియా
యూనివర్సిటీ
హస్టల్
ముందు
నుండి
నగరసంకీర్తన
చేసుకుంటూ
వెళుతుంటే
అనేకమంది
హాస్టల్
విద్యార్థులు
కూడా
అందులో
ప్రవేశించారు.
అందరూ
కలసి
‘శివం’
వచ్చారు,
హారతి
ఇచ్చారు,
జేజేలు
పలికారు.
నేను
శివంపై
నిలిచి
దర్శనమిచ్చాను.
తరువాత
భగవంతంను
పిలిచి,
“భగవంతం!
ఎట్లా
ఉంది
నగరసంకీర్తన?”
అని
అడిగాను.
“స్వామీ!
దీనిని
మా
సైన్సు
ఒప్పుకోదు
కాని
నాకెంతో
ఆనందంగా
ఉన్నది.
చల్లని
గాలిలో
తీయని
నామాన్ని
స్మరిస్తూ
వెళ్ళడమనేది
హృదయానికెంతో
హాయినిచ్చింది.
నిత్యం
ఈవిధంగా
నేను
నగరసంకీర్తనలో
పాల్గొంటే
నా
ఆరోగ్యం
కూడా
బాగుపడుతుంది”
అన్నాడు.
అప్పుడు
నేను
“ఆరోగ్యం
గూర్చి
యోచించకు,
ఆనందం
గూర్చి
యోచించు,
ఆనందం
కోసం
పాటుపడు”
అన్నాను.
6
▾
Meaning
Keep
భగవన్నామము
అన్నము
లేకపోయినా
ఆనందాన్ని
చేకూర్చుతుంది.
అంతేగాక
రోగాలను
నివారణ
గావిస్తుంది,
సంసార
సాగరాన్ని
దాటిస్తుంది.
భగవన్నామ
స్మరణచేతనే
ఈ
సంసారమనే
సముద్రాన్ని
సులభంగా
దాటడానికి
వీలవుతుంది.
పడవ
నీళ్ళలో
ఎంతకాలం
ఉన్నా
ప్రమాదం
లేదు
కాని
పడవలోకి
నీళ్ళు
ప్రవేశిస్తే
పడవ
మునిగిపోతుంది.
అదేవిధంగా
మీరు
సంసారంలో
ఉండవచ్చును.
కానీ
సంసారం
మీలో
ప్రవేశిస్తే
ప్రమాదం.
పండితుడు
-
పడవవాడు
ఒకానొక
సమయంలో
ఒక
పండితుడు
అత్యవసరం
పనిమీద
గోదావరి
దాటి
వేరే
ఊరు
వెళ్ళవలసి
వచ్చింది.
ఒక
పడవవాణ్ణి
పిలిచి
అందులో
ఎక్కాడు.
ఈ
పండితునికి
ఎప్పుడూ
ఏదో
ఒకటి
మాట్లాడుతూ
ఉండడం
అలవాటు.
కొంతదూరం
పోయిన
తరువాత
ఊరికే
కూర్చోలేక
పడవవాణ్ణి
“ఏమయ్యా!
మీ
గ్రామంలో
రాజకీయాలెలా
ఉన్నాయి?
మొన్న
ఎలక్షన్లలో
ఎవరు
గెలిచారు?”
అని
అడిగాడు.
“స్వామీ!
నాకు
నోటు
సంగతి
తప్ప
ఓటు
సంగతి
తెలియదు.
నాకెవరో
పది
రూపాయలిచ్చారు,
వాళ్ళకు
నేను
ఓటు
వేశాను.
అంతే
తప్ప
ఎవరు
గెలిచారో,
ఎవరు
ఓడారో
నాకేమీ
తెలియదు”
అన్నాడు
అప్పుడా
పండితుడు
“ఒరేయ్
పిచ్చివాడా!
ఈ
కలియుగంలో
పుట్టి
రాజకీయాల
సంగతి
తెలుసుకోకపోతే
బ్రతికీ
ఏమి
ప్రయోజనం?
నీ
జీవితంలో
పావు
భాగం
గంగపాలు
అయినట్లే!”
అన్నాడు.
“పోతే
పోనీయండి
స్వామీ,
నాకేమీ
దిగులు
లేదు”
అని
వాడు
పడవ
నడపడంలో
నిమగ్నుడయ్యాడు.
మరికొంతసేపటికి
ఈ
పండితుడు
“ఓరేయ్!
పని
తొందరలో
నేను
గడియారం
పెట్టుకొని
రావడం
మరచిపోయాను.
ఇప్పుడు
గంట
ఎంతయింది?”
అని
అడిగాడు.
“స్వామీ!
నాకు
గంటలెట్లా
తెలుస్తాయి?!
తెల్లవారి
లేచినది
మొదలు
నా
పనులు
నేను
చేసుకొని
రాత్రయ్యే
సరికి
హాయిగా
నిద్రిస్తాను.
కనుక
నాకు
గడియారంతో
పనిలేదు,
గంట
చూడడం
కూడా
రాదు”
అన్నాడు.
“ఒరేయ్
పిచ్చివాడా!
కనీసం
ఆడని
గడియారమైనా
చేతికి
పెట్టుకోవడం
ఈ
కలియుగంలో
ఫ్యాషన్!
అందులోను
నీకసలు
గంట
చూడడమే
రాదంటున్నావు.
కనుక
నీ
జీవితంలో
అర్థభాగం
గంగపాలైనట్లే!”
అన్నాడు
పండితుడు.
7
▾
Meaning
Keep
Also in his talks
(1)
31 October 1989
Do Your Duty as an Offering to God
మరికొంత
దూరం
పోయిన
తరువాత
“పోనీ,
నీకు
ఎక్కాలేమైనా
వచ్చా?”
అని
అడిగాడు.
ఆ
పడవవాడు
“ఈ
ఎక్కాలు,
లెక్కలు
నాకెందుకు
స్వామీ?
ఎంత
దూరానికి
ఎంత
డబ్బు
తీసుకోవాలో
నాకు
తెలుసు.
అంతేచాలు”
అన్నాడు.
“అయితే
నీ
జీవితంలో
మూడు
భాగాలు
గంగపాలైనట్లే!”
అన్నాడు
పండితుడు.
ఈ
విధంగానే
మాట్లాడుతుండగానే
పెద్దగా
సుడిగాలి
వీచడం
ప్రారంభమై
అలల
తాకిడికి
పడవ
అటూ
ఇటూ
ఊగసాగింది.
మరికొంత
సేపటికి
కుంభవృష్టి
ప్రారంభమైంది.
“స్వామీ!
మీకు
ఈత
వచ్చా?”
అని
అడిగాడు
పడవవాడు.
“ఒరేయ్
నాకు
ఈత
రాదురా”
అన్నాడు
పండితుడు
ఆందోళనగా.
“అయితే
మీ
జీవితం
పూర్తిగా
గంగపాలైనట్లే”
అన్నాడు
పడవవాడు.
కొద్దిసేపటికి
ఆ
పడవ
పూర్తిగా
మునిగిపోయింది,
దానితోపాటు
పండితుడు
కూడా
మునిగిపోయాడు.
ఈత
తెలిసిన
ఆ
పడవవాడు
మాత్రం
గట్టుకు
చేరి
ప్రాణాలు
కాపాడుకోగల్గాడు.
సంసారసాగరంలో
గీతయే
ఈత
చూశారా!
నది
దాటడానికి
ఈత
ఎంత
ప్రధానమో
భవసాగరం
దాటడానికి
గీత
అంత
ఆధారం.
సంసారసాగరంలో
ప్రయాణం
చేస్తున్న
మనకు
గీత
కావాలిగాని
ఈ
ఎలక్షన్లు,
న్యూస్‌పేపర్లు
కాదు
ముఖ్యం.
సంసారసాగరంలో
ప్రయాణం
చేసే
ప్రతి
వ్యక్తి
గీతను
తెలుసుకోవాలి.
అది
తెలియకపోతే
ఎన్ని
తెలుసుకొన్నా
ప్రయోజనం
లేదు.
సంసారసాగరంలో
గీతయే
ఈత.
ఆ
గీత
యొక్క
తత్త్వమేమిటి?
“అనన్యాశ్చింతయంతోమాం
యేజనాః
పర్యుపాసతే
తేషాం
నిత్యాభియుక్తానాం
యోగక్షేమం
వహామ్యహం”
అన్య
చింతలను
వీడి
నిరంతరము
దైవాన్నే
స్మరిస్తే
మన
యోగక్షేమాలను
తానే
చూసుకుంటాడు.
సర్వకర్మలను
దైవభావంతో
ఆచరించినప్పుడు
అన్నీ
సఫలమవుతాయి.
జ్ఞానాగ్ని
ఆవిర్భవించాలంటే...
మన
చుట్టూ
డివైన్
వైబ్రేషన్‌ను
అభివృద్ధి
పర్చుకోవాలి.
ఇది
కేవలం
నామచింతన
వల్లనే
సాధ్యమవుతుంది.
మన
రెండు
చేతులకు
మధ్య
రాపిడి
జరిగితే
చల్లగా
ఉన్న
చేతులు
కూడా
వేడెక్కిపోతాయి.
8
▾
Meaning
Keep
రెండు
కొమ్మలు
ఒకదానితో
ఒకటి
రాచుకుంటే
అక్కడ
కూడా
అగ్ని
పుడుతుంది.
అదేవిధంగా
మనలో
జ్ఞానాగ్ని
ఆవిర్భవించాలంటే
నామానికి,
రూపానికి
మధ్య
రాపిడి
జరగాలి.
రాం,
రాం,
రాం,
రాం...
అని
నోటితో
పలకాలి,
రూపాన్ని
మనస్సులో
చింతించాలి.
ఈ
రెండూ
జరిగినప్పుడే
మనలో
జ్ఞానాగ్ని
ఆవిర్భవిస్తుంది.
ఈ
జ్ఞానాగ్ని
మనలో
ఆవిర్భవించిందంటే
సర్వ
పాపములను
భస్మం
చేస్తుంది,
దైవత్వానికి
సమీపంగా
తీసుకొనిపోతుంది.
ముందుకుపోని
పడవ
ఒకానొక
సమయంలో
రాధ,
కొంతమంది
గోపికలు
కలిసి
మధురకు
వెళ్ళి
కృష్ణుణ్ణి
చూడాలనుకున్నారు.
ఒకనాటి
రాత్రి
ఎవ్వరికీ
తెలియకుండా
యమునా
నదికి
వెళ్ళి
ఒక
పడవనెక్కి
కూర్చున్నారు.
రాత్రంతా
కృష్ణనామాన్ని
స్మరిస్తూ
తెడ్లు
వేశారు.
కానీ
తెల్లవారిన
తరువాత
చూస్తే
పడవ
క్రిందటి
రాత్రి
ఎక్కడ
ఉందో
అక్కడే
ఉంది,
ఒక్క
ఇంచైనా
ముందుకు
పోలేదు.
కారణమేమిటని
విచారిస్తే
అది
ఒక
గూటానికి
కట్టివేయబడి
ఉంది.
అదే
విధంగా
మన
జీవితమనే
పడవను
సంసారమనే
గూటానికి
కట్టివేసి,
“దేవుడా!
దేవుడా!”
అంటూ
కూర్చుంటే
దేవుణ్ణి
ఏవిధంగా
చేరగలము?
ముందు
సంసారం
నుండి
కట్టు
విప్పాలి,
సర్వేశ్వర
నామాన్ని
స్మరిస్తూ
ప్రయాణించాలి.
అప్పుడే
ఈ
‘పడవ’
అతి
శీఘ్రంగా
గమ్యం
చేరగలదు.
భక్తుని
వెనుకనే
ఉంటాడు
భగవంతుడు
భగవంతుడు
ఎట్టి
పరిస్థితులందైనను
తనను
హృదయపూర్వకంగా
చింతించే
భక్తుణ్ణి
ఎన్నటికీ
వదలిపెట్టడు.
ఒకానొక
సమయంలో
భగవంతుడు
ఒక
భక్తునికి
“నేనెప్పుడూ
నీ
వెంటనే
ఉన్నాను.
నీ
వెనుకనే
నడుస్తూ
వస్తున్నాను”
అని
హామీ
ఇచ్చాడట.
కానీ
నిజంగానే
నా
వెనుక
వస్తున్నాడా
అని
ఇతనికి
సందేహం
కలిగి
వెనుకకు
తిరిగి
చూస్తే
భగవంతుడు
కనిపించలేదు.
“ఓ
భగవంతుడా!
నాకెందుకు
అబద్ధం
చెప్పావు?”
అని
ప్రశ్నించాడు.
భగవంతుడు
చిరునవ్వు
నవ్వి
“పిచ్చివాడా!
నేనేమీ
అబద్ధం
చెప్పలేదు.
నీవే
నా
మాటలను
సరిగా
అర్థం
చేసుకోలేదు.
నేను
నీ
వెనుకనే
ఉంటానని
చెప్పాను
కదా!
కనుక
నీవు
వెనుకకు
తిరిగినప్పుడు
నేను
కూడా
నీతోపాటు
తిరిగాను.
అందుచేతనే
నీవు
నన్ను
చూడలేకపోయావు”
అన్నాడు.
9
▾
Meaning
Keep
చూశారా!
భగవంతుని
మాటలలో
ఎట్టి
దోషమూ
లేదు.
భక్తుడే
సరిగా
అర్థం
చేసుకోలేక
అనర్థాలకు
గురి
అవుతున్నాడు.
తెలివైన
విద్యార్థి
ఒక
గురువు
తన
శిష్యులను
పిలిచి,
“మీకొక
తీపి
పదార్థమును
ఇస్తున్నాను.
ఈగలు
వ్రాలకుండా,
చీమలు
పట్టకుండా,
ఎవ్వరూ
దొంగిలించకుండా
దీనిని
సంరక్షించుకోండి”
అన్నాడట.
కొందరు
దానిని
పెట్టెల్లో
పెట్టి
తాళం
వేశారు,
మరికొందరు
డబ్బాల్లో
పెట్టి
మూతపెట్టారు.
కానీ
ఒక
తెలివైన
విద్యార్థి
మాత్రం
దానిని
చక్కగా
తిని
కడుపులో
భద్రం
చేసుకొన్నాడు.
మరునాడు
గురువుగారు
తానిచ్చిన
తీపి
పదార్థమును
ఎవరెవరు
ఏఏ
విధంగా
భద్రం
చేసుకున్నారో
చెప్పమన్నాడు.
ఒకడు
దానిని
పెట్టెలో
పెట్టి
తాళం
వేశానన్నాడు.
మరొకడు
దానినొక
డబ్బాలో
పెట్టి
చీమలు
పట్టకుండా
నీళ్ళలో
పెట్టానన్నాడు.
ఈవిధంగా
ఒక్కొక్కరు
ఒక్కొక్క
రీతిగా
సమాధానం
చెప్పారు.
చివరిగా
ఆ
తెలివైన
విద్యార్థి
ముందుకు
వచ్చి,
“గురూజీ!
నాకిచ్చిన
తీపి
వేరొకరికి
చిక్కకుండా
నేనే
భుజించి
జీర్ణించుకొని
ఆనందిస్తున్నాను”
అన్నాడు.
అదేవిధంగా
భగవన్నామమనే
తీపిని
కూడా
చక్కగా
ఆరగించి
జీర్ణించుకోవాలి.
అనగా
హృదయఫలకంపై
లిఖించుకొని
భద్రం
చేసుకోవాలి.
సర్వదా
సర్వ
కాలేషు
సర్వత్ర
హరిచింతనం
చేయాలి.
ఈ
కలియుగంలో
నామస్మరణను
మించిన
తరుణోపాయం
లేదు.
Previous
←
The power of saṅkalpas
Next
The wise and the envious
→