Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1998 · The power of saṅkalpas
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The power of saṅkalpas
26 February 1998, Mahāśivarātri, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
Also in his talks
(28)
14 January 1988
Strive to recognise the oneness within the many!
20 May 1990
The Glory of Indian Culture
6 October 1992
Only one who knows himself can know God
2 July 1996
Satya Alone Is God
1 January 1998
Happiness and sorrow cannot be parted
11 May 1998
Recognise the Oneness in Samaṣṭi and in Vyaṣṭi
25 September 1998
Man's True Kin
12 October 1998
The True Place of God's Pādukās Is the Heart Itself
26 September 2000
Education and Educare
23 November 2001
Self-confidence is the very stairway to Ānanda
14 October 2002
Satya itself is life
22 November 2002
Give Up Selfishness and Strive for the Good of Society
2 April 2003
Leave the delusion of the body; think of God
13 April 2003
Make Your Parents Happy: That Is My Happiness
5 October 2003
I am not the body; I am the embodiment of Prema
9 April 2005
Divinity is the very nature of man
7 April 2006
Our Ātma itself is Rāma
11 August 2006
Divinity is attained only through Prema for God
28 September 2006
No worry troubles those who think of God without ceasing
16 February 2007
Follow Sai, walk the path of Satya!
7 June 2007
Along with ‘Education’, ‘Educare’ is most essential
28 July 2007
Every human being is God
22 August 2007
Foster faith in God and love of country!
4 September 2007
The word and the way of the Avatāras are most auspicious
22 November 2007
Only one who recognises that all are one is truly educated
18 July 2008
God alone is the true Guru
6 August 2008
‘Education’ finds its fulfilment only when it is joined with ‘Educare’
9 October 2008
That great Viṣṇu Himself is this Viṣṇu on earth
సత్యమే
భగవంతుని
స్వరూపము
సత్యంబునందుండి
సర్వంబు
సృష్టించె
సత్యంబునందణగె
సర్వసృష్టి
సత్యమహిమలేని
స్థలమేది
కనుగొన్న
శుద్ధ
సత్వమిదియే
చూడరయ్య.
సత్యము
త్రికాలబాధ్యము.
ఈ
సత్యమే
ప్రాణమును
రక్షిస్తూ
ఉన్నది.
కేవలము
రక్షించటమే
కాదు.
సృష్టించటం
జరుగుతున్నది.
సత్యములోనున్న
అంతరార్థమును
మనం
గుర్తించినప్పుడు
సత్+ఇ+య=సత్యం.
సత్
అనగా
ప్రాణము.
ఇ
అనగా
అన్నము.
యమ్
అనగా
సూర్యుడు.
సూర్యుని
ద్వారా
అన్నము
కలుగుతున్నది.
అన్నము
ద్వారా
ప్రాణులు
జీవిస్తున్నవి.
ప్రాణరక్షణకు
అన్నమే
ప్రధానము.
“భిక్షాన్నం
దేహరక్షార్థం”.
దేహమును
రక్షించుకునే
నిమిత్తమై
అన్నమును
అందిస్తున్నాడు
సూర్యుడు.
ఇట్టి
సత్యస్వరూపమును
ఏనాడు
మారుస్తామో
ఆనాడే
మనకు
ఆహారము
కొదవైపోతుంది.
అట్టి
అన్నము
తక్కువైనప్పుడే
ప్రాణములు
క్షీణిస్తుంటాయి.
కనుక
లోకసంరక్షణ
అంతా
సూర్యునిపై
ఆధారపడి
ఉంటున్నది.
దీనిని
మరొక
విధంగా
విచారణ
చేసినప్పుడు
స,త,య
సత్య.
వెనుకవైపునుండి
చదివినప్పుడు
య,త,స.
యమ
నియమాదులతో
తపస్సు
ఆచరించినప్పుడే
సత్యము
అనే
సత్యస్వరూపుడు
సాక్షాత్కరిస్తాడు.
ఇంద్రియనిగ్రహముచేత
మనము
తపస్సు
చేయాలి.
తపస్సనగా
ఏమిటి?
త్రిగుణములయొక్క
ఏకత్వమే
తపస్సు.
ఈ
త్రిగుణముల
ఏకత్వము
లేనిది
తమస్సు
అవుతుంది.
హృదయము
యొక్క
భావము,
మాట
యొక్క
పలుకు,
చేతలయొక్క
చేష్టలు
ఏకత్వము
గావాలి.
సత్యము
అనే
పదమునకు
ఎన్నియో
అంతరార్థములు,
పవిత్రమైన
బలములు
కలిగి
ఉంటున్నది.
భావము
అనేది
సంకల్పములచేత
కూడి
ఉంటుంది.
భావములు
పవిత్రమైనప్పుడే
కర్మలు
కూడా
పవిత్రమవుతుంటాయి.
2
▾
Meaning
Keep
సంకల్పములు
సత్యమైనప్పుడే
ఫలితము
కూడా
సత్యస్వరూపము
పొందుతుంది.
చిన్న
ఉదాహరణము.
ఒకానొక
సమయంలో
నామదేవుని
వద్దకుపోయి
స్వామీ!
నేను
చేసిన
పిడకలు
ఎవరో
దొంగిలిస్తున్నారు
అన్నది
సక్కుబాయి.
అప్పుడు
నామదేవుడు
అడిగాడు.
‘సక్కుబాయి!
నీ
పిడకలు
అని
నీవు
గుర్తించటానికి
ఎట్లా
వీలవుతుంది?’.
“నేను
నిరంతరము
నామము
స్మరిస్తూ
సర్వకర్మలు
ఆచరిస్తుంటాను.
నేను
స్మరించే
నామ
ప్రభావమే
పిడకల
రక్షణము”
అని
చెప్పి,
పరుగెత్తి
యింటికి
పోయి
ఒక
పిడకను
తెచ్చింది
సక్కుబాయి.
నామదేవుని
చెవిదగ్గర
పెట్టింది.
భగవన్నామము
స్మరిస్తున్నది
ఆ
పిడక.
‘రంగా
రంగా
పాండురంగా’
అని
వినిపించింది
నామదేవునికి.
చూచాడు.
ఇది
నిజంగా
సత్యము.
ఆనాటి
పెద్దలకు
కూడా
యిలాంటి
సందేహము
కలిగేది.
తిరిగి
ఒక
పిడకను
చేయమని
చెప్పాడు.
ఆమె
పేడను
తెచ్చి
రంగా
రంగా
పాండురంగా
అనుకుంటూ
చేసింది.
ఆ
పిడక
తెచ్చి
నామదేవుని
చెవిదగ్గర
పెట్టుకున్నాడు.
అక్కడ
కూడా
రంగా
రంగా
పాండురంగా
అని
వినిపించింది.
నామమునందున్న
మహత్యము,
సంకల్పమునందున్న
దివ్యశక్తి
యిట్టిదని
చెప్పటానికి
వీలుకాదు.
మానవుడు
మరణించినా
సంకల్పములు
మరణించవు.
చిరంజీవిగా
ఉంటాయి.
అందుకు
పూర్వము
నామదేవుడు
వామదేవుడు
అనే
పేరుతో
పిలవబడుతూ
ఉండేవాడు.
అప్పటినుండి
నామాన్ని
స్మరిస్తూ
వచ్చాడు.
జ్ఞానదేవుని
తమ్ముడే
నామదేవుడు.
నామదేవునకు
అనేక
ఆనందములు
ప్రాప్తిస్తూ
వచ్చాయి.
భగవన్నామ
సంకల్పముచేత
ఎంతటి
ఘనకార్యమునైనా
దివ్యంగా
సులభంగా
సాధించుటకు
సాధ్యమవుతుంది.
సంకల్పములందు
యద్భావం
తద్భవతి.
మనము
ఎట్టి
భావమును
కల్పించుకుంటామో
అట్టి
ఫలితమే
లభిస్తుంది.
మనము
నిరంతరము
మన
సంకల్పములను
పవిత్రమైనవిగను,
సత్యమైనవిగను,
సార్థకమయ్యేవిగాను
ఉండే
సంకల్పములను
అభివృద్ధిపరచు
కోవాలి.
మానవత్వము
సంకల్పములయొక్క
ప్రభావమే.
మానవునకు
ఏది
ప్రధానమైనదని
విచారణ
చేస్తే
అనేకమంది
ప్రాణము
దీనికి
ప్రధానమని
అంటారు.
కొంతమంది
ధనమే
ఆధారము
అంటారు.
కానీ
సక్కుబాయి
ఆవిధంగా
చెప్పలేదు.
మానవునికి
ప్రధాన
ప్రాణము
నామమే.
ఆ
నామ
మహత్తు
చేతనే
మానవత్వము
అనే
కీర్తిని
వ్యాపింప
చేస్తుంది.
ఈ
నామమునకు
సంకల్పములే
మూలాధారము.
కనుక
సంకల్పములు
విద్యుత్
తరంగముల
వలె
సర్వత్రా
వ్యాపిస్తుంటాయి.
3
▾
Meaning
Keep
ఈ
విద్యుత్
తరంగములు
ఎక్కడ
చూచినా
ఉండినట్లు
సంకల్పములు
సర్వత్రా
వ్యాపించి
ఉంటాయి.
ఢిల్లీలో
ఎవరో
రేడియోలో
పాడుతుంటే,
ప్రశాంతినిలయంలో
రేడియోలో
అదే
శబ్దము
వినిపిస్తుంది.
ఢిల్లీ
నుండి
ఈ
తరంగములు
ఎట్లా
వచ్చినాయి.
వాయువునందు
చేరి
యీ
తరంగములయొక్క
స్వరూపము
ధరించి
రేడియోలో
ప్రవేశిస్తున్నాయి.
కనుక
సంకల్పములు
చాలా
ఉత్తమమైనవి,
పటుత్వమైనవి,
పవిత్రమైనవి.
కనుక
సంకల్పములను
ఉత్తమమైన
సంకల్పములుగా
మార్చుకొనుటకు
ప్రయత్నించాలి.
ఎట్టి
చెడ్డభావములు
సంకల్పమునందు
ప్రవేశించకూడదు.
చెడ్డ
సంకల్పములు
ఆవిర్భవించినప్పుడు
చెడ్డపనులే
చేస్తుంటారు.
క్రూరమైన
సంకల్పములు
మీలో
ప్రవేశించినప్పుడు
క్రూరమృగములవలె
ప్రవర్తిస్తారు.
అదే
సార్థకమైన
ప్రేమతో
కూడిన
సంకల్పములు
చేరినప్పుడు
దివ్యమైన
దైవత్వముగా
రూపొందుతుంది.
ప్రతి
మానవుని
హృదయము
ప్రేమతో,
దయతో,
కరుణతో
నిండి
ఉండాలి.
సంకల్పములు
ఎట్టివో,
కార్యముల
యొక్క
ఫలితము
కూడా
అట్టిదే.
చెడ్డ
సంకల్పములు
మనస్సునందుంచుకొని
అనేక
మంచి
కార్యములు
చేస్తుంటారు
కొంతమంది.
కానీ
ఆ
కార్యములన్నీ
చెడుగా
మారిపోతుంటాయి.
బాహ్యదృష్టితో
చూచినప్పుడు
తాను
చేసే
కర్మలు
మంచివిగా
కనిపిస్తాయి.
కానీ
అంతర్భావములతో
చూచినప్పుడు
దుస్సంకల్పములచేత
ఈ
కార్యములు
చెడిపోతుంటాయి.
ఈ
చెడిపోవటానికి,
ఫలించటానికి
లోపల
సంకల్పములే
మూలాధారములు.
నిన్న
చెప్పినట్టుగా
దేహమనే
భవనమునకు
సంకల్పములనే
మనస్సు
పునాది
వంటిది.
పైన
భవనము
ఎంత
అందచందములుగా
కనిపించి
నప్పటికిని
దీనియొక్క
భద్రత
పునాదిపైననే
ఆధారపడి
ఉంటున్నాది.
కనుక
మనో
సంకల్పములు
చాలా
ప్రధానమైనవి.
సంకల్పములనే
పునాదులు
భద్రముగా
ఉండినప్పుడే
పై
అంతస్థులు
ఎన్నైనా
నిర్మించటానికి
వీలవుతుంది.
ఈనాడు
కలి
ప్రభావముచే
ప్రతి
మానవుని
మనస్సు
కూడా
చాలా
వికల్పముల
చేత
చెడు
మార్గములో
ప్రవేశిస్తున్నది.
కనుక
మానవుని
సంకల్పములు
పవిత్రమైనవిగా
మార్చుకొనుటకు
ప్రయత్నించాలి.
ఈ
పవిత్రమునకు
మించినది
మరొకటి
లేదు,
అదే
నామము.
నామస్మరణచేత
మన
సంకల్పములు
ఎంతటి
సముద్రమునైనా
నావవలే
దాటిస్తుంది.
4
▾
Meaning
Keep
His poems 362
Also in his talks
(28)
14 January 1988
Strive to recognise the oneness within the many!
20 May 1990
The Glory of Indian Culture
6 October 1992
Only one who knows himself can know God
2 July 1996
Satya Alone Is God
1 January 1998
Happiness and sorrow cannot be parted
11 May 1998
Recognise the Oneness in Samaṣṭi and in Vyaṣṭi
25 September 1998
Man's True Kin
12 October 1998
The True Place of God's Pādukās Is the Heart Itself
26 September 2000
Education and Educare
23 November 2001
Self-confidence is the very stairway to Ānanda
14 October 2002
Satya itself is life
22 November 2002
Give Up Selfishness and Strive for the Good of Society
2 April 2003
Leave the delusion of the body; think of God
13 April 2003
Make Your Parents Happy: That Is My Happiness
5 October 2003
I am not the body; I am the embodiment of Prema
9 April 2005
Divinity is the very nature of man
7 April 2006
Our Ātma itself is Rāma
11 August 2006
Divinity is attained only through Prema for God
28 September 2006
No worry troubles those who think of God without ceasing
16 February 2007
Follow Sai, walk the path of Satya!
7 June 2007
Along with ‘Education’, ‘Educare’ is most essential
28 July 2007
Every human being is God
22 August 2007
Foster faith in God and love of country!
4 September 2007
The word and the way of the Avatāras are most auspicious
22 November 2007
Only one who recognises that all are one is truly educated
18 July 2008
God alone is the true Guru
6 August 2008
‘Education’ finds its fulfilment only when it is joined with ‘Educare’
9 October 2008
That great Viṣṇu Himself is this Viṣṇu on earth
మన
సంసార
సాగరమునకు
నామమే
నావ.
కనుక
సత్,
యమ్
లతో
కూడినది
సత్యము.
ప్రాణము,
సూర్యుడు
సత్య
స్వరూపులు.
సత్
ప్రాణము.
యమ్
సూర్యుడు.
ప్రాణమును
కాపాడే
బాధ్యత
యమ్
అనే
సూర్యునిపై
ఆధారపడి
ఉంటున్నాది.
ఈ
సూర్యుడు
ఎవరు?
నిత్యము
ఉదయించే
సూర్యుడా!
కాదు.
దీనినే
వేదమందు
‘చంద్రమా
మనసో
జాతః
చక్షో
సూర్యో
అజాయత’
అన్నారు.
మన
దృష్టియే
సూర్యుడు.
మన
దృష్టి
పవిత్రమైనదిగా
ఉండినప్పుడు
ఈ
సూర్యప్రకాశము
కూడా
పవిత్రమైనదిగా
కనుపిస్తుంది.
సృష్టిలో
ఏ
మాత్రము
దోషము
లేదు.
మానవుని
దృష్టియందే
దోషముంటున్నది.
దృష్టి
సక్రమముగా
ఉంటున్నప్పుడు
సృష్టి
సమ్మతంగా
ఉంటుంది.
కనుక
మన
దృష్టిని
పవిత్రమైనదిగా
మార్చుకోవాలి.
ఈ
దృష్టివల్లనే
మన
ఉదరము
నిండుతున్నది.
సూర్యుడు
సస్యశ్యామలముగావించి
అనేక
పంటలు
పండిస్తాడు.
ఆహారము
యొక్క
బాధ్యతే
మన
ప్రాణము.
మన
దృష్టి
మంచిదైనప్పుడే
మన
ఆహారము
మంచిదౌతుంది.
ఆహారము
పవిత్రమైనప్పుడు
ప్రాణము
చిరంజీవిగా
నిలుస్తుంది.
కనుక
అధిక
కాలము
మనం
జీవించవలెనంటే
మన
food
చాలా
ప్రధానమైనది.
కనుక
నేను
అప్పుడప్పుడు
పిల్లలకు
చెబుతుంటాను.
Food,
head,
God.
ఈ
మూడింటి
ఏకత్వము
చక్కగా
గుర్తించాలి.
God
-
సూర్యుడు.
Head
-
తెలివి.
Food
-
ఉదరము.
మూడింటి
సమ్మితమైన
తత్వమే
మానవత్వముతో
కూడినది.
కనుక
సత్యము
అనే
పదము
చాలా
విశేషమైన
అర్థమును
ప్రబోధిస్తుంది.
సత్యము
మార్పులేనిది.
కనుక
truth
is
God
అన్నారు.
సత్యమే
దైవస్వరూపము.
ఈ
సత్యము
ఎక్కడ
నుంచి
వచ్చింది?
బృహత్
తత్వమనే
బ్రహ్మనుండి
వచ్చినది.
బ్రహ్మ
అనగా
సత్యమే.
ఈ
సత్యమే
దైవస్వరూపము.
సత్యములేని
స్థానము
ఎక్కడా
లేదు.
సత్యంబునందుండి
సర్వంబు
సృష్టించె
సత్యంబునందణగె
సర్వసృష్టి
సత్యమహిమలేని
స్థలమేది
కనుగొన్న
శుద్ధ
సత్వమిదియే
చూడరయ్య
సత్యము
అనేది
శుద్ధ
సత్వము.
సాత్వికమైన
సత్యము.
రాజసిక
తామసికములైన
సత్యము
కాదు.
5
▾
Meaning
Keep
అట్టి
పరిశుద్ధమైన
సత్యమును
యీనాడు
విస్మరించారు.
అసత్యముతో
జీవిస్తున్నారు.
అందుకే
ఆకలితో
బాధపడుతున్నారు.
ఈ
విధమైన
బాధలకు
సత్యమా
కారణము?
కాదు
కాదు.
నీ
సంకల్పములే
మూలకారణము.
నీ
సంకల్పములు
సత్యస్వరూపము
ధరించినప్పుడు
సర్వము
సత్యస్వరూపముగానే
ఉంటుంది.
ఆనాటి
భక్తులు
నిరంతరము
భగవన్నామ
స్మరణ
చేస్తూ
అన్ని
కార్యములందు
తమ
కాలము
సార్థకముగావించుకునేవారు.
“సర్వదా
సర్వకాలేషు
సర్వత్ర
హరి
చింతనం”.
ఆ
సక్కుబాయి
పిడకలు
చేస్తూ
నామము
స్మరించటం
చేత
పిడకల
యందు
కూడా
నామం
ప్రవేశించింది.
కనుక
ప్రతి
మానవుడు
చేసే
సర్వకర్మల
యందు
దైవనామం
స్మరిస్తూ
ఉండాలి.
దైవము
తప్ప
మరొకటి
యీ
జగత్తులో
కనిపించదు.
సర్వమూ
దైవస్వరూపమే.
ఏది
చూచినా,
ఏది
పలికినా,
ఏది
విన్నా
అంతా
దైవస్వరూపమే.
అయితే
మనకు
కనిపించదు.
మన
పట్టుకు
చిక్కదు.
చిక్కకుండా
ఉండినంతమాత్రమున,
కనిపించకుండా
ఉండినంతమాత్రమున
లేదు
అని
తలంచకూడదు.
ఒక
చిన్న
ఉదాహరణ.
పంచభూతములలో
గాలి
ఒక
భూతము.
మన
చుట్టూ
ఉన్నది.
కానీ
మనకు
కనిపిస్తుందా?
కనిపించటం
లేదు.
పట్టుకుందామంటే
చిక్కుతుందా,
చిక్కటం
లేదు.
చిక్కక,
కనిపించకుండా
ఉండటంవలన
గాలిలేదని
చెప్పటానికి
వీలవుతుందా?
గాలి
లేక
నీవు
ఏవిధంగా
జీవిస్తున్నావు?
ఉండిన
పంచభూతములలో
ఒక్క
గాలి
మాత్రమే
యింత
శక్తి
స్వరూపము
ధరించినప్పుడు
యింక
పంచభూతములతత్వము
ఏ
రీతిగా
ఉంటుందో
యోచించుకోవచ్చు.
ప్రపంచమంతా
పంచభూతముల
స్వరూపమే.
ప్రపంచము.
ప్ర
అనగా
వికసించటం.
పంచము
పంచభూతములు.
ప్రపంచమనగా
ఈ
కనిపించే
దృశ్యములు
కాదు.
పంచభూతముల
స్వరూపమే
ప్రపంచము.
ఇట్టి
పంచభూతములతోకూడిన
యీ
ప్రపంచములో
ఇవేవీ
లేదని
నీవు
వాదించుట
అర్థరహితమైనది.
కనుక
దేవుడు
లేడని
చెప్పటానికి
సాధ్యమే
లేదు.
ఎట్టి
మూర్ఖుడైనా
దేవుడు
లేడని
పలకటానికి
సాధ్యము
కాదు.
ఏవిధంగా
లేడని
చెప్పటానికి
వీలవుతుంది?
పంచభూతములు
పరమాత్మ
స్వరూపము
కాదా!
ఇవి
లేవని
నీవు
చెప్పగలవా?
చెప్పలేవు.
కాబట్టి
దేవుడంటే
ఒక్క
రూపాన్ని
మాత్రమే
ఆధారము
చేసుకోటం
కాదు.
అనేక
రూపములలో
ఉంటున్నాడు.
‘సహస్ర
శీర్షా
పురుషః
సహస్రాక్ష
సహస్రపాత్’
అనగా
అన్ని
రూపములు
భగవంతుని
స్వరూపములే.
6
▾
Meaning
Keep
సత్చిత్
ఆనందము.
సత్
శాశ్వతమైనది.
చిత్
ప్రకాశవంతమైనది.
ఈ
రెండింటి
ఏకత్వమే
మానవత్వమనే
ఆనందము.
ఇది
సత్యము
ఎట్లా?
సత్
సత్యమైనది.
చక్కెర
ఒక
చేతిలో
పట్టుకున్నావు.
దీని
రుచి
ఏమిటి?
తీపి.
ఎందులోనైనా
దీనిని
వేయి,
కానీ
రుచి
మారదు.
ఒక
చేతిలో
నీరు
ఉన్నాది.
ఇది
నీరు.
యిది
చక్కెర.
చక్కెర
నీరు
రెండింటిని
ఏకత్వము
చేయి.
చక్కెర
కాదు
నీరు
కాదు.
పానకంగా
రూపొందుతుంది.
ఈ
సత్
అనే
శాశ్వతమైన
పదార్థము,
చిత్
అనే
ప్రకాశములో
లీనమైనప్పుడు
చిత్
కాదు,
సత్
కాదు,
ఆనందమనే
రూపాన్ని
ధరిస్తుంది.
కనుక
సత్
చిత్
ఆనందమనేది
మానవునియందు
అమితమైన
స్వరూపాన్ని
ధరించి
ఉంటున్నది.
మానవుని
చుట్టూ,
మానవునియందు
ఆనందమే.
“అంతర్బహిశ్చ
తత్
సర్వవ్యాప్య
నారాయణ
స్థితః”.
బహిర్ముఖంగా,
అంతర్ముఖంగా
కూడను
ఉన్నటువంటిది
ఒకటే
ఆనందము.
కానీ
ఆనందమునకై
అనేకమంది,
అనేక
రకములైన
ప్రయత్నములు
చేస్తున్నారు.
ఈ
ప్రయత్నములు
కేవలము
అజ్ఞానముతో
చేసే
ప్రయత్నములే.
తనకంటే
ఆనందము
ప్రత్యేకమైనది
లేదు.
తానే
ఆనందస్వరూపుడు.
తన
ఆనంద
స్వరూపాన్ని
తాను
విస్మరించి
దేనియందో
మనకు
ఆనందము
లభిస్తుందని
ప్రాకులాడటం
చాలా
అజ్ఞానమే.
అది
నీకు
ఆనందంగా
లభించినప్పుడు
అది
నీ
భ్రమయే.
నీ
భ్రమ
యిన్ని
విధములైన
ఆటలనాడిస్తున్నది.
భ్రమ
ఉండినంతవరకు
బ్రహ్మ
నీకు
కనిపించడు.
భ్రమను
నీవు
దూరము
చేయి
బ్రహ్మ
నీకు
సాక్షాత్కరిస్తాడు.
నీ
భ్రమకు
ఏది
మూలకారణము?
నీ
దేహమే
మూలకారణము.
కనుక
ఈ
దేహాభిమానంతో
భ్రమను
నింపుకోటం
చేత
బ్రహ్మ
దూరమైపోతున్నాడు.
కనుక
ప్రతి
మానవుడు
తనలో
ఉండిన
భ్రమను
కొంతవరకు
దూరం
చేసుకోవాలి.
దేహాభిమానం
క్రమక్రమేణా
తగ్గించుకోవాలి.
ఇవన్నీ
మధ్యలో
వచ్చి
కలిసినవే
గానీ
తనతో
వచ్చినది
కాదు.
ఇవి
మధ్య
వచ్చిన
passing
clouds.
నీవు
పుట్టావు,
నీవు
పెరిగావు,
నీవు
చదివావు,
వివాహమాడావు,
వివాహ
మాడిన
తరువాత
wife
life
గా
కనిపిస్తుంది.
కానీ
ఆమె
నీకు
life
ఎప్పుడైంది?
వివాహము
జరిగిన
తరువాతనే
ఆమె
నీకు
life
గా
కనిపిస్తున్నాది.
ఇంతకు
పూర్వం
ఆమె
ఎవరు?
నీవు
ఎవరు?
ఎవరికెవరికి
సంబంధము
లేదు.
మధ్యలో
passing
clouds
వలే
అన్నీ
కలుస్తున్నాయి,
విడిపోతున్నాయి.
7
▾
Meaning
Keep
ఇవన్నీ
శాశ్వతమైన
ఆనందము
నందించేవి
కాదు.
నీవు
పుట్టక
పూర్వము
ఉంది.
నీ
పుట్టుకలోను
ఉంది.
మరణించిన
తరువాత
ఉన్నాది.
అది
త్రికాలబాధ్యం
Omni
present
truth.
అదే
ఆత్మతత్వము,
దైవతత్వము.
దైవము
నీవు
పుట్టక
పూర్వమే
ఉన్నాడు.
నీలోనా
ఉన్నాడు.
నీ
తదనంతరము
ఉంటాడు.
కనుక
భగవంతుని
omni
present
అన్నారు.
అట్టి
మారనట్టి
సత్యాన్ని
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
అట్టి
సత్యము
గుర్తించిన
సక్కుబాయి
అనేక
విధములైన
బాధలకు
గురైపోయి,
కట్టకడపటికి
కృష్ణుడే
తన
స్వరూపము
మార్చుకొని,
తానే
సక్కుబాయి
రూపము
ధరించి
సక్కుబాయిని
పండరీపురం
పంపించాడు.
చూశారా!
భగవంతుని
ప్రేమతత్వము
ఎంత
ఘనమైనది.
ఎంత
సులువైనది.
భక్తుని
రూపము
ధరించి,
భక్తుని
యింట్లో
అనేక
పనులుచేస్తూ
భక్తుని
తన
స్వస్థానమునకు
పంపించాడు.
భక్తునికి
ఎట్టి
అపకీర్తి
రాకుండా
చూచుకుంటాడు.
భక్తుడు
అనేవాడు
యీవిధమైన
కార్యము
చేశాడా
అని
వేలు
చూపటానికి
వీలు
లేకుండా
చూచుకుంటాడు.
ఆ
సక్కుబాయిని
పండరీపురం
పంపిస్తే,
సంసారము
చేస్తున్న
సక్కుబాయిని
పండరిపురం
పంపించాడే
అని
పదిమంది
అనవచ్చు.
కానీ
సక్కుబాయి
వేషముతో
కృష్ణుడే
అత్తగారింటిలో
పనిచేస్తున్నాడు.
సక్కుబాయి
పండరిపురం
పోయింది.
పాండురంగనిలో
లీనమైపోయింది.
కానీ
విశ్వాసము
చాలా
గొప్పది.
ఆ
గాఢమైన
విశ్వాసము
చేత
ఎంతటి
ఘనకార్యమునైనా
సాధించవచ్చు.
లౌకికమైన,
భౌతికమైన,
ప్రాకృతమైన
పనులందు
మాత్రము
యీ
నిజమైన
తత్వము
అర్థము
కాదు.
దేనియందైనా
గాఢమైన
విశ్వాసము
వుంచినప్పుడు
అందులో
తప్పక
ఫలితం
లభిస్తుంది.
కనుక
నామస్మరణ
ఎంతో
పవిత్రమైనది,
ఎంతో
విలువైనది.
దీనివల్ల
మనసులో
ఉండిన
మాలిన్యము
పరిశుద్ధమవుతుంది.
నీ
సంకల్పములు
సత్యసంకల్పములు,
సంతోషమైనవి
కలుగుతాయి.
సంకల్పములు
సత్య
స్వరూపమును
ధరించినవి.
మనిషి
మరణించిన
తరువాత
కూడా
సంకల్పాలు
నిలచేఉంటాయి.
అట్టి
సత్య
సంకల్పాలు
మీరు
యీనాడు
అనుభవించాలి.
అవే
positive
thoughts
అన్నారు.
మీ
హృదయమును
ప్రేమ,
సత్యముతో
నింపుకున్నప్పుడు
అంతా
positive
thoughts
వస్తాయి.
ఇవన్నీ
సత్యమార్గమునే
ప్రబోధిస్తూ
ఉంటాయి.
కానీ
మీలోని
భ్రమలు
అసత్యమైనవిగాను,
అశుద్ధమైనవిగాను
ఉండినప్పుడు
అవన్నీ
అశుద్ధమైనవిగానే
రూపొందుతాయి.
దానిని
పురస్కరించుకునే
వేదము
“యద్భావం
తద్భవతి”
అనగా
ఎట్టి
భావమో
అట్టి
ఫలితము
లభిస్తుందని
చెప్పింది.
8
▾
Meaning
Keep
ఫలితమునకు
నీవు
వగచి
ప్రయోజనము
లేదు.
ఫలితానికి
నీవు
ఆనందించి
ప్రయోజనం
లేదు.
ఈ
ఫలితములంతా
నీ
సంకల్పముల
యొక్క
ఫలితమే.
దీని
reaction,
resound,
and
reflection.
కనుక
సంకల్పములను
పవిత్రమైనవిగా
రూపొందింప
చేసుకోవాలి.
ఏదో
సంవత్సరమునకు
ఒకసారి
రామ
రామ
అనుకుంటే
ప్రయోజనం
లేదు.
నీవు
సంవత్సరమునకు
ఒకసారి
భుజిస్తున్నావా?
లేదే.
దినమునకు
ఎన్ని
పర్యాయములు
భుజిస్తున్నావు?
ఇట్టి
అనిత్యమైన,
అశాశ్వతమైన
దేహానికే
యిన్ని
విధములైన
ఆహారము
నీవందిస్తుంటే
మనస్సునకు
ఆహారమును
అందించ
నక్కరలేదా?
కనుక
భగవచ్చింతనే
మనస్సుకు
తగిన
ఆహారము.
దేహానికి
అందించి,
మనస్సుకు
అందించకుండా
పోయినప్పుడు
యిది
చాలా
బలహీనమై
పోతుంది.
బండికి
పెయింటు
వేసి
చక్కని
అలంకారము
చేస్తున్నావు.
కానీ
గుఱ్ఱమునకు
మేత
పెట్టటం
లేదు.
బండిని
ఈడ్చేది
గుఱ్ఱమా?
బండా?
బండిని
ఈడ్చే
గుఱ్ఱానికి
కూడా
ఆహారము
నందించాలి.
దేహమనే
cart
నడపటానికి
మనస్సనే
horse
కు
ఆహారము
చక్కగా
అందించాలి.
కనుక
భిక్షాన్నం
దేహరక్షార్థం,
వస్త్రం
శీత
నివారణం.
యివన్నీ
దేహానికే.
ఈనాడు
మనం
చేసే
కర్మలన్నీ
దేహనిమిత్తమై
చేసే
కర్మలే.
కానీ
ఎవరికీ
తెలియకుండా
చేసే
నామస్మరణే
మనస్సుకు
పటుత్వమునిచ్చే
ఆహారము.
ఎవ్వరికి
కనిపించదు.
ఎవరు
చూట్టానికి
వీలుకాదు.
ఏ
దొంగలు
దీన్ని
అపహరించలేరు.
ఏరాజు
దీనిని
స్వాధీనము
చేసుకోలేడు.
అలాంటి
దివ్యమైనశక్తి
మానవుని
యందున్నది.
ఇంత
పవిత్రమైన
శక్తి
మానవుని
యందుండి
కూడా
తాను
తెలుసుకోలేకుండా
వ్యర్థ
జీవితము
గడుపుతున్నాడు.
ధననిమిత్తమై
ఎంత
ప్రాకులాడుతున్నావో
దైవనిమిత్తమై
నీవు
అంత
ప్రాకులాడుతున్నావా?
లేదు.
రాత్రింబవలు
అన్నపానీయములు
వదలి
నీవు
ధన
నిమిత్తమై
అనేక
పాట్లు
పడుతున్నావు.
‘కోటీశ్వరుడైన
లవణమన్నమే
గానీ,
మెరుగు
బంగారము
మ్రింగబోడు’.
తాను
కోటీశ్వరుడైనా
పెరుగు
అన్నం,
ఉప్పు
తింటాడు
గానీ
బంగారము
తినగలడా?
కానీ
ఎటువంటివానికైనా
ఆహారము
ఆహారమే.
ఈ
ధనము
చేత
ఏమాత్రము
శాంతి
మనకు
లభించదు.
ఏదో
ధనము
ఉండవలసిందే.
భౌతిక
జీవితానికి
కొంత
ఆధారమే.
కానీ
యిది
నిత్యసత్యమైన
ఆనందము
కాదు.
9
▾
Meaning
Keep
Money
comes
and
goes,
morality
comes
and
grows.
మీరు
అనిత్యమైన
దానికి
కర్మమును,
కాలమును
కాయమును
సర్వము
త్యాగము
చేసి
అంకితము
చేస్తున్నారు.
కానీ
ఒక్క
కాలమునైనా
భగవంతునికి
అంకితము
చేయకూడదా?
ఒక్క
కర్మనైనా
భగవంతునికి
అంకితము
చేయకూడదా?
కాలమునుగానీ,
కాయమునుగానీ
భగవంతునికి
ఏమాత్రము
ఉపయోగించటం
లేదు.
ఏదైనా
మార్గములో
పోతుంటే
దేవాలయం
కనిపించిందంటే
రెండు
చేతులు
యిట్లా
అంటాడు.
భగవంతునికి
నమస్కారం.
ఈ
నమస్కారము
లేకపోతే
భగవంతునికి
ఏమి
తక్కువ.
హృదయపూర్వకంగా
నమస్కారము
చేయి.
నిలచి
శాంతముగా
స్మరించి
నమస్కారము
చేసుకో.
కానీ
యీనాటి
సాధనలన్నీ
నిర్బంధమైన
సాధనలుగా
కనిపిస్తున్నాయి.
Artificial
సాధనలుగా
కనిపిస్తున్నాయి.
Heartful
గా
లేవు.
యిలాంటి
heartful
గా
లేని
సాధనలు
చేసి
ప్రయోజనం
ఏమిటి?
ఒక్కసారి
రామా
అని
హృదయపూర్వకంగా
పిల్చినా
చాలు.
కానీ
24
గంటలు
రాం
రాం
రాం
అని
జపము
చేస్తున్నారు.
యిది
artificial
గా
జరిగిపోతున్నాది.
జపమాల
చేతిలో
లేకపోయినా,
తాను
నిద్రపోతున్నా
ఆ
వేళ్లు
తిరుగుతూనే
ఉంటాయి.
ప్రాక్టీసు.
ఈ
ప్రాక్టీసు
వల్ల
జరిగే
పనులే
యివన్నీ.
ఇవి
హృదయపూర్వకంగా
జరిగేవి
కాదు.
హృదయపూర్వకంగా
ఒక్కసారి
భగవంతుని
స్మరించి,
ప్రేమించి
పనులలో
ప్రవేశించు.
సక్కుబాయి
జగత్తుకు
యింత
ఆదర్శము
నిరూపిస్తూ
వచ్చింది.
దీనివల్ల
నామదేవుడు
కూడా
సక్కుబాయికి
శిష్యుడుగా
మారిపోయాడు.
తాను
నిరంతరము
నామస్మరణ
చేస్తూ
వచ్చాడు.
స్మరణే
తరుణోపాయమనే
సత్యాన్ని
బోధిస్తూ
వచ్చాడు.
నామదేవుడు,
జ్ఞానదేవుడు
ఒకానొక
సమయంలో
అరణ్యములో
ప్రయాణం
చేస్తున్నారు.
జ్ఞానదేవునికి
సర్వము
జ్ఞానమయం.
జ్ఞానముచేత
ఏమైనా
పొందవచ్చు.
కొంతదూరము
పోయేటప్పటికి
దాహం
వేసింది.
యిద్దరికి
ఒక
పాడు
బావి
కనిపించింది.
ఆ
పాడుబావిలో
ఎక్కడో
అడుగున
కొంతనీరు
కనిపించింది.
జ్ఞానదేవుడు
పక్షి
రూపాన్ని
ధరించి
ఆ
బావిలో
దిగి
నీరు
త్రాగివచ్చాడు.
జ్ఞానదేవుడు
ఏ
రూపాన్నైనా
ధరించవచ్చు.
నామదేవుడు
చెప్పాడు
నేను
యిట్టి
రూపాన్ని
ధరించ
నక్కరలేదు.
నా
భగవంతుడు
నాయందే
ఉన్నాడు.
భగవంతుని
నేను
రప్పించుకోవాలి
గానీ
నేను
భగవంతుని
దగ్గరకు
పోనక్కరలేదు.
కూర్చున్నాడు
చెట్టుక్రింద.
10
▾
Meaning
Keep
నామాన్ని
స్మరిస్తూ
ఉన్నాడు.
బావిలో
నీరు
పొంగి
ప్రవహించి
నామదేవుని
దాహము
తీర్చబడింది.
నిజమైన
భక్తుడు
భగవంతుని
తన
దగ్గరకు
రప్పించుకోవాలిగానీ,
భక్తుడు
భగవంతుని
దగ్గరకు
పోనక్కరలేదు.
గొప్ప
ప్రేమతో
కూడిన
వానిని
ఆ
ప్రేమయే
ఆకర్షిస్తుంది.
ప్రపంచమంతయు
మేగ్నెట్
పవరే.
అంతా
magnet
power.
ఒక
పుష్పము
కనిపిస్తుంది.
దానిని
కావాలని
ఆశిస్తావు.
అదికూడా
magnet
power.
భార్యకు
భర్త
మేగ్నెట్
పవరే.
భర్తకు
భార్య
మేగ్నెట్
పవరే.
బిడ్డకు
తల్లి
మేగ్నెట్
పవరే.
తల్లి
బిడ్డకు
మేగ్నెట్
పవరే.
ఒక
పుష్పములో
తుమ్మెద
ప్రవేశిస్తున్నాది.
ఆ
తుమ్మెద
అందులో
ప్రవేశించటానికి
పువ్వులోని
తేనె
మేగ్నెట్.
ప్రతిదానియందు
ఒకవిధమైన
మేగ్నెటిక్
పవర్
ఉంటున్నాది.
ఈ
magnet
మనలనందరిని
ఆకర్షిస్తున్నాది.
ఈ
ఆకర్షించే
పవరులో
దైవమే
ఒక
పెద్ద
మేగ్నెట్.
ఈ
పవరుకంటె
మించిన
పవరు
మరొకటి
లేదు.
కనుక
ఆనాటి
గోపికలు
యీవిధంగానే
ప్రార్థిస్తూ
వచ్చారు.
కృష్ణా!
నీవు
ఏ
రూపాన్నైనా
ధరించవచ్చును.
కానీ
నీ
సంకల్పానికి
మేము
అడ్డు
చెప్పము.
పుష్పంబులై
నీవు
పొలుపొందుచుండిన
తుమ్మెదనై
నేను
తిరుగుచుండు
వర
సముద్రుడే
నీవైన
వాహిని
యగుచు
నేను
నీలోన
ఐక్యమగుదు
మేరు
పర్వతమే
నీవైన
పరచుకొని
పారెద
నేను
సెలయేరునై
ఓ
కృష్ణా!
నీవు
పుష్పముగా
పుడితే
నేను
తుమ్మెదగా
పుట్టి
నీలో
వచ్చి
ప్రవేశించాలి.
నీవు
సముద్రముగా
పుడితే
నేను
రివర్
మాదిరి
వచ్చి
నీలో
ఐక్యమై
పోవాలి.
ఇదియే
భక్తునికి
భగవంతునికి
ఉన్న
అయస్కాంత
ఆకర్షణ.
భగవంతునిలో
ఐక్యము
కావటానికి
ఎన్ని
రకముల
రూపాలనైనా
ధరించవచ్చు.
భగవంతుడు
అనేక
రూపాల్ని
ధరిస్తుంటాడు.
సమయ
సందర్భములో
అన్ని
రూపాలలో
ప్రవేశిస్తుంటాడు.
ఇక్కడ
ఉన్నాడు
అక్కడ
లేడు
అని
చెప్పటానికి
వీలు
లేదు.
సర్వ
రూపములు
తనవే.
సర్వనామములు
తనవే.
ఎవరిని
కాదనటానికి,
ఎవరిని
ఔను
అనటానికి
వీలు
కాదు.
అన్ని
రూపములందు
తాను
ఉన్నాడు.
11
▾
Meaning
Keep
Also in his talks
(3)
5 September 1987
Today satsaṅga is what man needs most urgently
29 June 1989
Everything Is God's Gracious Gift
7 September 1996
Advaita Is the Principle of the One Ātma
అన్ని
నామములు
తనయందే
ఉంటున్నాయి.
కనుక
భగవంతుని
ఏ
నామముతో
స్మరించినా
భగవంతుని
సాక్షాత్కారము
ఒక్కటే.
కొంతమంది
ఈశ్వరుని
విభూతిధారుడు
అంటారు.
అనగా
విభూతిని
ధరించినవాడు.
ఆ
విభూతిని
ధరించిన
ఈశ్వరునిపై
విభూతి
కనిపించదే.
విభూతి
అంటే
ఏమిటి?
ఈ
విభూతి
అర్థము
గుర్తించుకొనలేని
వారు
కేవలం
భౌతిక
విభూతిని
మాత్రమే
చూస్తున్నారు.
సర్వసంపత్తులు
విభూతే.
అనేక
విలువైన
సంపత్తి
అంతా
విభూతియే.
సర్వశక్తులు
భగవంతుని
విభూతులే.
సకలైశ్వర్య
సంపన్నుడే
ఈశ్వరుడు.
అలాంటి
వానికి
ఒకటి
ఉంది,
ఒకటి
లేదని
ఎట్లా
చెప్పగలవు?
ప్రేమస్వరూపులారా!
భగవంతునికి
యిది
కలదు,
అది
లేదని
ఎవ్వరు
చెప్పలేరు.
సర్వ
స్వరూపుడు
భగవంతుడే.
అట్టి
భగవత్స్వరూపుని
ఒక్క
ప్రేమచేత
మాత్రమే
సులభంగా
పొందటానికి
వీలవుతుంది.
ప్రేమ
లేక
దేనిని
మనం
సాధించలేము.
తల్లికి
బిడ్డపైన
ప్రేమ
లేకపోతే
బిడ్డ
గతి
ఏమవుతుంది?
బిడ్డకు
తల్లిపైన
ప్రేమ
లేకపోతే
తల్లి
గతి
ఏమవుతుంది?
కనుక
తల్లికి
బిడ్డపై
ప్రేమ
ఉండినట్లుగా
భక్తునిపై
భగవంతునికి
ప్రేమ
ఉంటుంది.
భగవంతునికి
భక్తునిపై
అమిత
ప్రేమ
ఉంటుంది.
దానిని
ఎడబాయుటకు
వీలు
కాదు.
రెండూ
ఏకత్వముతో
కూడినవి.
ఈ
సంకల్పములు
సర్వత్రా
సంచరిస్తుంటాయి.
సత్సంకల్పములుగా
అభివృద్ధి
పరచుకోవాలి.
సంకల్పములు
మంచివైనప్పుడు
ఫలితము
మంచిగానే
రూపొందుతుంది.
ఈనాడు
మనం
నేర్చుకోవలసింది
సత్యసంకల్పాలు.
దైవ
సంకల్పాలు
మనలో
చేర్చుకోవాలి.
మనమే
దైవస్వరూపములని
విశ్వసించాలి.
సచ్చిదానందము
మనయొక్క
స్వరూపమే.
ఆవిధంగా
నీవు
స్మరిస్తూ
పో.
నేను
దైవము,
నేనే
దైవము
అని
స్మరిస్తూ
పోతే
నీవు
ఖచ్చితముగా
దైవమైపోతావు.
Become
God.
నీవే
దైవముగా
రూపొందుతావు.
నీకు
ఫలించినా
ఫలించక
పోయినా
నిరంతరము
దైవ
చింతన
చేయి.
ఈ
అభ్యాసముచేత
ఒకానొక
సమయంలో
ఆ
రూపాన్ని
ధరింపచేస్తాడు.
సత్సంకల్పము
చేత
ఎలాంటి
సాధనలైనా
మనం
సాధించి
సత్యస్వరూపాన్ని
పొందటానికి
వీలవుతుంది.
శ్రేయోహిజ్ఞానమభ్యాసాత్
జ్ఞానాధ్యానం
విశిష్యతే
ధ్యానాత్కర్మ
ఫలత్యాగం
త్యాగశ్శాంతిరనన్తరం.
12
▾
Meaning
Keep
Also in his talks
(21)
15 June 1973
The Bond of Prakṛti and the Paramātma
24 August 1989
Those Who Recognised the Paramātma Are the Gopīs
25 December 1989
Yearn for the Grace of God
4 April 1992
Neither swelling with joy nor sinking in sorrow: winning equanimity is the aim of Ugādi
15 January 1996
Only one who masters the mind can reach Mādhava
2 July 1996
Satya Alone Is God
29 August 1996
To Go Back to Where It Was Born Is the Nature of Every Living Being
8 September 1996
The Unseen Divinity Is the Basis of the World Fashioned as the Seen
22 September 1997
God delights in the feeling, not in outward show
18 April 1998
The universe is the form of Viṣṇu
4 September 1998
Remembering the Name of God Removes All Sorrow
26 September 1998
God Is the Very Foundation of the World
28 September 1998
The Five Elements Are the Very Forms of the Paramātma
23 November 2001
Self-confidence is the very stairway to Ānanda
13 March 2002
The divine power of attraction
10 September 2002
The Inner Meaning of Vināyaka Worship
25 October 2004
When You Give Up Delusion, You Yourself Are Brahman
8 October 2005
Remembering the Name is the way across
5 December 2006
Teachers alone are the real leaders
11 February 2007
Prema for God is the divine medicine for every worry
28 June 2008
Thinking of Rāma removes every worry
శాంతి
కావాలి.
శాంతి
ఎక్కడనుండి
వస్తుంది
మనకు.
దైవతత్వాన్ని
మనం
చింతిస్తుంటే
అదియే
శాంతి
స్వరూపాన్ని
పొందుతుంది.
ఈనాడు
ప్రపంచములో
ఎక్కడికి
పోయినా
శాంతి
కనిపించటం
లేదు.
ఎవరినైనా
ప్రశ్నించు.
I
want
peace,
I
want
peace.
ఎక్కడ
ఉంది
ఈ
peace.
ప్రపంచములో
ఉందా,
లేదు.
ప్రపంచములో
pieces
ఉంది.
peace
కి
నిలయమైనవాడు
భగవంతుడొక్కడే.
అన్నీ
సృష్టించాడు.
అన్ని
విధములైన
అనుకూలములు
సృష్టించాడు.
నీ
యిష్టము
వచ్చినట్లు
వినియోగించుకోమని
చెప్పాడు.
అయితే
ఒక్క
కండిషన్
పెట్టాడు.
ఏవిధంగా
సంకల్పించుకుంటారో
ఆవిధంగా
అనుభవించక
తప్పదు
అన్నాడు.
ఆనందము,
శాంతి
తన
దగ్గర
ఉంచుకున్నాడు.
ఎన్ని
విధములుగా
అనుభవించినా
ఆనందము
తనకు
కావాలి.
ఎన్ని
సుఖములు
అనుభవించినా
శాంతి
మానవుని
దగ్గర
లేదు.
కనుక
భగవంతుని
ఎందుకోసం
పూజించాలి
అని
ప్రశ్న
వేసుకున్నప్పుడు,
అది
కావాలి,
ఇది
కావాలి.
ఆ
కోరికల
నిమిత్తమై
కాదు
పూజించవలసింది.
“ఓ
భగవంతుడా!
నా
దగ్గర
లేనిది,
నీ
దగ్గర
ఉన్నది
నేను
కోరుతున్నాను.
ఎవరు
దీనిని
యిచ్చేవారు
కాదు.
నా
దగ్గర
శాంతి
లేదు.
నీవేమో
శాంతికి
నిలయము.
యింకొక్కరి
దగ్గర
ఈ
శాంతి
లేదు.
కాబట్టి
శాంతి
నిమిత్తమై
నేను
ప్రార్థిస్తున్నాను.
నాలో
ఆనందము
లేదు.
నిరంతరము
దుఃఖమే.
మానవుడు
చింతలతో
మునిగి
ఉన్నాడు.
పుట్టుట
ఒక
చింత
భూమి
నుండుట
చింత
సంసారమొక
చింత
చావు
చింత
బాల్యమంతయు
చింత
వార్ధక్యమొక
చింత
జీవించుటొక
చింత
చెడుపు
చింత
కర్మలన్నియు
చింత
కష్టముల్
ఒక
చింత
సంతసమొక
చింత
వింత
చింత.
పన్నెండు
చింతలనే
చింతచెట్టు
క్రింద
కూర్చుని
సంతోషము
అనుభవించాలంటే
ఎలా
ప్రాప్తిస్తుంది.
నీకు
సంతోషము
కావాలంటే
భగవంతుని
ఆశ్రయించు.
నీకు
ఆనందము,
శాంతి
భగవంతునినుండి
తప్ప
యింకెక్కడనుండి
లభ్యము
కాదు.
నీవు
భగవంతుని
ప్రార్థించేది
దేని
నిమిత్తమై?
13
▾
Meaning
Keep
శాంతి,
ఆనంద
నిమిత్తమై
భగవంతుని
ప్రార్థించాలి.
ఇది
కావాలి,
అది
కావాలి
అంటే
ప్రపంచములో
నీకున్నాయి.
ధనము
ప్రపంచములో
ఉంటున్నది
కావలసినంత.
బంగారం
ప్రపంచములో
ఉంటున్నది
కావలసినంత.
డైమండ్సు
ప్రపంచములో
ఉన్నాయి
కావలసినన్ని.
ఇవన్నీ
నీవు
కోరనక్కరలేదు.
ప్రపంచములో
అన్నీ
కనిపిస్తున్నాయి.
కానీ
కనిపించనిది,
వినిపించనిది
రెండు
మాత్రము
ఉంటున్నాయి
భగవంతుని
దగ్గర.
అవే
శాంతి,
ఆనందము.
భగవంతుని
శాంతి,
ఆనందము
కావాలని
కోరుకోండి.
అన్నీ
తానే
అందిస్తాడు.
నీకు
రక్షణ
కలిగిస్తాడు.
భుక్తి
కలిగిస్తాడు.
రక్తి
కలిగిస్తాడు,
విరక్తి
కలిగిస్తాడు.
అనురక్తిని
యిస్తాడు,
ముక్తిని
యిస్తాడు.
ఏది
కావాలన్నా
తాను
యిస్తాడు.
కానీ
కోరవలసింది
భగవంతుని
ఒక్కటే.
ఓ
భగవంతుడా!
నీవు
నాకు
కావాలి.
నీవు
ఒక్కడు
ఉంటే
సర్వము
నా
వెంట
ఉండినట్లే.
ఈ
కోరికను
యీనాడు
మీరు
బలపరచుకోవాలి.
కానీ
తుచ్ఛమైన
కోరికలచేత
మీరు
అప్పటికప్పుడు
తృప్తి
పడుతున్నారు.
తిరిగి
మరునిముషంలోనే
దుఃఖాన్ని
అనుభవిస్తున్నారు.
శాశ్వతమైన
ఆనందము
కలిగేది
ఒక్క
దైవము
ద్వారానే.
ఎంతమంది
లోకములో
ధనవంతులు
లేరు.
ఎంతమంది
లోకములో
ఐశ్వర్యవంతులు
లేరు.
ఎంతమంది
లోకములో
అధికారులు
లేరు.
కానీ
వీరందరు
శాంతిని
అనుభవిస్తున్నారా?
లేదు.
శాంతి
భగవంతుని
ప్రసాదమే.
కనుక
భగవంతుని
వరప్రసాదములైన
శాంతి
ఆనందముల
నిమిత్తమై
భగవంతుని
ప్రార్థించాలి.
అది
ఒక్క
ప్రేమ
ద్వారానే
లభ్యమవుతుంది.
Previous
←
Man is the embodiment of Saccidānanda
Next
Remembrance Alone Is the Way Across
→