Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1998 · God fills every place
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
God fills every place
29 March 1998, Ugādi, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
దైవము
లేని
స్థానము
కానీ,
దైవము
కాని
పేరు
కానీ
యీ
జగత్తునందు
కానరాదు.
పర్వతములంతా
విహరించేది
దైవమే.
సముద్రమునందు
సంచరించేది
దైవమే.
పల్లెలలో
జీవించేది
దైవమే.
పట్టణాలలో
నివసించేది
దైవమే.
సర్వత్రా
దైవమే.
ఈ
శక్తి
బండారమును
ఎవరు
గుర్తింతురో,
ఎవరు
అర్ధము
చేసుకుందురో
అట్టి
వారే
ధన్యులు.
అట్టి
వారి
క్రియలే
పురుషార్థమైన
క్రియలు.
దైవము
యొక్క
శక్తి
సామర్థ్యములకు
పరిమితే
లేదు.
ఈ
జగత్తునందు
జీవించే
ప్రాణులకు
కొంత
పరిమితము
ఉంటున్నది.
పశు
పక్షి
మృగాదులకు,
క్రిమికీటకాదులకు
పరిమితమైన
సిరిసంపదలు
పోషించి,
కాలమును
నియమించి
ఆకలిని
సృష్టించి,
దాహము
పెంచి
తద్వారా
వాటి
తాపములు
చల్లారుస్తూ
వస్తున్నారు.
కానీ
ఈ
ప్రాణులలో
మానవుని
జీవితము
చాలా
ఉత్కృష్టమైనది,
సౌజన్యమైనది,
సౌశీల్యమైనది.
ఇట్టి
మానవునకు
శరీరము
యొక్క
శక్తిని
మాత్రమే
పరిమితముగావించి,
మానసిక
శక్తి
అపరిమితముగా
అందించాడు
భగవంతుడు.
మానవుని
మానసిక
శక్తికి
ఒక
పరిమితమే
లేదు.
సాధించాలని
సంకల్పించుకుంటే
దేనినైనా
సాధించగలడు.
దైవమునే
సాధించగలడు.
అట్టి
దివ్యమైన
శక్తి
ఒక్క
మానవునియందు
మాత్రమే
ఉన్నది.
కానీ
అట్టి
శక్తివంతుడైన
మానవుడు
తన
శక్తిని
తాను
గుర్తించుకొనలేక,
మానవత్వముగా
జీవితమును
భూమిపై
జీవించలేక
అనేకవిధములైన
కలతలచేత,
కల్లోలములచేత
బాధలకు
గురౌతున్నాడు.
ఈనాటి
మానవుడు
ఆకాశములో
పక్షివలే
సంచరిస్తున్నాడు.
ఈనాటి
మానవుడు
జలములో
మీనము
వలె
జీవిస్తున్నాడు.
చంద్రమండలము
కూడా
చేరుతున్నాడు
కానీ
యింతటి
శక్తి
గల్గిన
మానవుడు
భూమిపై
మానవునివలె
బ్రతకలేకపోవటము
ఎంత
అవమానకరము.
దేనిని
సాధించ
వలెనన్న
భగవంతుని
శరణుజొచ్చిన
సర్వము
ఫలింపచేసుకుంటాడు.
భగవంతుని
చేతిలో
తన
జీవితమును
అందించినప్పుడు
తాను
సాధించలేని
ఎట్టి
ఘనకార్యము
ఉండదు.
2
▾
Meaning
Keep
Also in his talks
(3)
8 July 1996
Through Good Company Man Can Attain Divinity
19 July 1997
Guard your character as dearly as life
28 May 1998
Not the Man in Form: the Man of Conduct Is Needed
కుచేలుడు
భగవంతుని
ఆశ్రయించి,
భగవంతుని
ప్రేమించి
పాత
స్నేహముతో
అతని
దగ్గర
చేరాడు.
కానీ
అతనికి
ఎట్టి
భాగ్యమునందించాడు
భగవంతుడు.
చరిత్రనే
మనకు
నిరూపిస్తుంది.
భగవంతుని
స్నేహితుడుగా
భావించుకొని,
మిత్రునిగా
విశ్వసించి,
సర్వము
తానే
అని
ఆనందించి
చెంతచేరిన
సుగ్రీవుడు
ఏ
ఫలితము
పొందాడు?
పోగొట్టుకున్న
రాజ్యము
తిరిగి
సంపాదించుకోగలిగాడు.
విభీషణుడు
పడరాని
బాధలచేత
లంకలో
నామస్మరణ
చేస్తూ
కాలము
గడుపుతుంటే
ఏ
గతి
పట్టింది?
తన
బాధలను
నివారణ
చేసి
లంకకే
రాజ్యాధిపతిని
చేశాడు.
ఒక్కసారి
ఏ
కించిత్తైనా
భగవంతునికి
అర్పితము
చేస్తే
ఎంతటి
అల్పమైనా
అధికముగా
రూపొందుతుంది.
కఱ్ఱముక్క
చిన్నది,
ఎట్టి
విలువ
లేదు.
ఆ
కఱ్ఱయే
అగ్నితో
స్నేహము
చేసినప్పుడు
ప్రకాశమును
పొంది
తన
రూపమునే
నిర్మూలము
గావించుకొని
అగ్ని
స్వరూపము
పొందుతుంది.
ఒక
చిన్న
నీటి
బిందువు
కొన్ని
నిముషములు
చేతిలో
పట్టుకున్నప్పుడు
ఆవిరిగా
మారిపోతుంది.
అట్టి
నీటి
బిందువు
సముద్రములో
కలిసినప్పుడు
సముద్రాకారము
పొందుతుంది.
కనుక
మానవుడు
తన
జీవితాన్ని
సార్థకము
చేసుకొనవలెనన్న,
మానవత్వాన్ని
గుర్తించవలెనన్న,
దివ్యత్వాన్ని
పొంద
వలెనన్న
భగవంతునికి
సమీపంగా
వెళ్లాలి.
భగవంతునిలో
ఐక్యమైపోవాలి.
అప్పుడే
తన
తత్వము
నిరూపించటానికి
వీలవుతుంది.
కనుక
భగవంతుని
దివ్యత్వాన్ని
గుర్తించుకోలేక
అనేక
మంత్రములచేత,
తంత్రములచేత,
జపముల
చేత,
తపముల
చేత,
సాధనలచేత
కాలము
వ్యర్థము
చేస్తున్నాడు
మానవుడు.
కానీ
ఈ
కర్మకాండకు
భగవంతుడు
ఏనాటికి
చిక్కడు,
దక్కడు.
భగవంతుని
ప్రేమించి
అతన్ని
సమీపించినప్పుడే
నీకు
సర్వస్వము
సాధ్యమౌతుంది.
ఈ
సాధనలు
చేయకూడదని
చెప్పటం
లేదు.
సాధనలన్నీ
కాలమును
సార్థకము
గావించుకునే
సత్కర్మలు
మాత్రమే.
పూజలు
చేయవచ్చు,
భజనలు
చేయవచ్చు,
సాధనలు
సల్పవచ్చు.
తపములు
ఆచరించవచ్చును.
కానీ
దైవసేవయందు
ఈ
మనస్సు
లగ్నము
కాకుండిన
యివన్నీ
నిరుపయోగమైనవి.
న
తపాంసి
న
తీర్థానాం
నా
శాస్త్రాణి
జపానహి
సంసార
సాగరోద్ధారే
సజ్జనం
సేవనం
వినా
3
▾
Meaning
Keep
తపస్సు
ఎవరికోసం
చేస్తున్నావు,
దేనికోసం
చేస్తున్నావు.
తపస్సు
నీ
అభీష్టముల
కోసం
చేస్తున్నావు.
భగవంతుని
అభీష్టము
గుర్తించినప్పుడే
తపస్సు
సార్థకము.
దైవతత్వమును
గుర్తించి
మెలగాలి.
భక్తుని
అనుగ్రహించుటకు
భగవంతుడు
అప్పుడప్పుడు
ఏదో
కోరినట్లు
నటిస్తాడు.
భగవంతుడు
కుచేలుని
అడిగాడు.
శబరి
దగ్గరకు
పోయి
ఆకలి,
ఏమైనా
పెట్టమని
ఆశించాడు.
ఆమె
వజ్రాలు
యిచ్చిందా,
ధనము
యిచ్చిందా,
యింకేమైనా
యిచ్చింది?
రెండు
రేగుపండ్లు
రామునకు
అందించింది.
గోపికల
దగ్గరకు
వెళ్లాడు
కృష్ణుడు.
ఆకలి
ఆకలి
అన్నాడు.
అయ్యో!
ఏమి
లేదే
యింట్లో,
ఏమి
యిచ్చేది
అన్నది.
ఆ
నీటి
మజ్జిగ
యియ్యమన్నాడు.
అది
గ్లాసులో
వేసి
యిచ్చింది.
త్రాగి
ఆనందించాడు.
అడవిలో
అన్ని
కష్టములు
పడి
బాధలు
సహించుకొనలేక
ఆకులలములు
మేసి
బ్రతుకుతున్న
ద్రౌపది
దగ్గరకు
వెళ్లి
ఆకలి,
ఆకలి
అన్నాడు
కృష్ణుడు.
“కృష్ణా!
నేను
హస్తినాపురములో
ఉన్నాననుకున్నావా,
అరణ్యములో
ఉంటున్నాను.
నీ
ఆకలికి
ఏమి
తెచ్చియిచ్చేది?”
అన్నది
ద్రౌపది.
“ఏదైనా
ఉండనీ,
నీవు
తినేదే
నాకు
అందించు.
ఆ
వండిన
పాత్రలో
ఏమైనా
ఒక
మెతుకు
అంటుకుందేమో
చూడు”
అన్నాడు
కృష్ణుడు.
ఒక
ఆకు
పాత్రకు
అంటుకుని
ఉంది.
ఆకు
తెచ్చి
భగవదర్పితం
అని
చెప్పింది
ద్రౌపది.
ఆ
అల్పమైన
పదార్థముచేత
అనంత
స్వరూపమైన
భగవంతుని
ఆకలి
తీరింది.
బ్రహ్మాండమంతయు
బొజ్జలో
నున్నట్టి
నీకు
భక్ష
భోజ్యము
పెట్టదగునా
సర్వజలముల
యందు
సంచరించెడి
నీకు
స్నానంబు
చేయించ
సాధ్యమగునా
ఏవిధంగా
భగవంతుని
తృప్తిపరచేందుకౌతుంది.
సర్వత్రా
ఉండిన
భగవంతుడు
ఏమి
ఆశిస్తున్నాడు.
నీ
జీవితాన్ని
సార్థకము
చేసుకోమని
ఆశిస్తున్నాడే
గానీ
తనకు
అభీష్టములు
ఏమాత్రము
లేవు.
భగవంతునికి
నిరంతరము
యిచ్చే
స్వభావమే
గానీ
పుచ్చుకునే
స్వభావము
లేదు.
అలాంటి
భగవంతుని
చేతిలో
జీవితాన్ని
పెట్టినప్పుడు
భగవంతుడే
అన్ని
విధముల
ఆడిస్తుంటాడు.
చిన్నపిల్లలు
గాలి
పటములు
ఆటలాడుతుంటారు.
గాలిపటము
ఆకాశములో
ఎగురుతుంటుంది.
కానీ
త్రాడు
తన
చేతిలో
పట్టుకొని
ఉంటాడు.
అదే
విధముగా
మన
జీవితమును
ఈ
ప్రపంచమందు
విహరింపచేయటానికి
ఇచ్చినప్పటికిని
ప్రాణశక్తిని
మాత్రము
భగవంతుని
చేతిలో
పెట్టాలి.
4
▾
Meaning
Keep
ఎక్కడికి
వెళ్లినా
ఆ
భగవంతుడే
రక్షిస్తుంటాడు.
యిలాంటి
దైవమును
పొందే
సులభమార్గము
ఒక్కటే
ఒక్కటి.
దైవమునకు
సమీపంగా
వెళ్లు,
అతనికి
అర్పితం
చేయి.
అతని
ప్రేమలో
కరగిపో.
నీ
జీవితము
కరిగిపోనీ,
ఆయుః
ప్రమాణము
కరగిపోనీ.
ఏమాత్రము
చింతించనక్కర
లేదు.
కానీ
ఈనాటి
మానవుడు
తుచ్ఛమైన
వాంఛలచేత
అమితమైన
ఆశలచేత
అప్రాప్త
ప్రాప్తికై
పాటుపడి
అనేక
విధములుగా
అలసిపోతున్నాడే
గానీ
దైవము
యొక్క
శక్తి
సామర్థ్యములు
గుర్తించుటకు
ఏమాత్రము
ప్రయత్నించటం
లేదు.
ఈవిధంగా
ప్రేమించే
తత్వమునే
మనము
మొట్టమొదట
గుర్తించాలి.
ఇంతకు
ముందు
మాట్లాడిన
సంజయ్సహానీ,
రుచిర్
ఈ
ప్రేమతత్వాన్ని
గురించి
చక్కగా
బోధించారు.
ఈ
ప్రేమ
భగవత్స్వరూపము
భక్తియే.
ఈ
ప్రేమలో
ఏమాత్రము
స్వార్థము
లేదు.
ప్రాపంచిక
సంబంధమైన
ప్రేమలయందు
ఏకించిత్తైనా
స్వార్థము
ఉండవచ్చును.
కానీ
భగవంతుడు
అందించే
ప్రేమలో
ఏకించిత్తు
స్వార్థముండదు.
కానీ
ప్రజలు
దాన్నికూడా
తనవలె
స్వార్థముగా
ఉంటుందని
తనకు
తాను
గుర్తించుకోటానికి
ప్రయత్నిస్తుంటారు.
కారణం
ఏమిటి?
ఈ
ప్రపంచము
ఒక
పెద్ద
అద్దము
వంటిది.
అద్దము
ముందు
ఏ
పదార్థము
పెట్టినా
అద్దములో
కనిపిస్తుంది.
వారి
యొక్క
స్వార్థము
ఈ
అద్దములో
కనిపిస్తుంది.
కానీ
భగవంతుడనే
ప్రేమతత్వము
ఈ
అద్దము
కాదు.
ప్రేమయే.
ప్రేమయే
కనిపిస్తుంది
కానీ
ప్రతిబింబము
కనుపించదు.
ప్రతిబింబములో
ద్వేషము
ఉంటుంది.
అది
సరైన
సత్యము
కాదు.
అద్దములో
నీ
కుడిచేయి
చూపించు.
అద్దములో
ఎడమ
చేయి
మాదిరి
కనిపిస్తుంది.
ఇది
సత్యమా?
కాదు
కాదు.
ప్రకృతి
అనే
అద్దమందు
సర్వము
విరుద్ధమైనవే.
స్వార్థరహితమైన
ప్రేమయందు
మాత్రమే
సత్యస్వరూపము
గుర్తించుటకు
వీలవుతుంది.
అదే
విధముగా
కోరికలు
లేని
భగవంతుడు
కూడా
కొన్ని
కోరికలు
కోరుతుంటాడు.
కారణం
ఆ
వ్యక్తిని
సార్థకము
గావించే
నిమిత్తమే.
ఆ
వ్యక్తి
కర్మలన్నీ
పవిత్రము
గావించే
నిమిత్తమై.
ఆ
వ్యక్తి
జీవితాన్ని
పరిపూర్ణము
గావించే
నిమిత్తమై.
ఆ
వ్యక్తి
యొక్క
పరిపూర్ణమైన
షోడశోపచారములు
సార్థకము
గావించే
నిమిత్తమే.
మీకు
చాలామందికి
తెలుసు.
ఇలాంటి
విషయములందు
ఆధ్యాత్మికమును
గుర్తించుటకు
ప్రయత్నించాలి.
5
▾
Meaning
Keep
పూర్వము
లైలా
అనే
ఆమె
ఉండేది.
ఆమె
చాలా
ధనవంతురాలు,
శ్రీమంతురాలు.
ఇలాంటి
ఆమె
ఒకానొక
సమయంలో
మజ్నూను
చూసి
అతనిని
ప్రేమించింది.
కానీ
తల్లిదండ్రులు
అంగీకరించలేదు.
ఈ
బీదవానిని
నీవు
పెండ్లి
చేసుకోటమా!
యిది
వీలు
కాదన్నారు.
తల్లిదండ్రులను
బాధపెట్టటము
తల్లిదండ్రులను
అసంతృప్తి
చేయటము
లైలాకు
యిష్టము
లేదు.
లైలా
చాలా
గుణవంతురాలు.
మేధావి.
ఆమె
భగవంతుని
ప్రార్థించింది.
అతనిపై
ప్రేమ
ఉంది.
నాపై
అతనికి
ప్రేమ
ఉందో
లేదో.
అతనిని
పరీక్ష
చేయాలని
ప్రయత్నం
చేసింది.
తన
దాసీలను
యిద్దరిని
పంపించింది.
లైలాకు
చాలా
ప్రమాదకరమైన
జబ్బు
చేసింది.
ఆమెని
రక్షించే
నిమిత్తము
నీ
రక్తము
కావాలి
అని
ఆశించింది.
తక్షణమే
కోసుకొని
గ్లాసు
నిండా
రక్తము
నింపి
పంపించాడు.
అంత
మాత్రమే
కాకుండా
లైలాకు
చెప్పండి.
ఆమెకు
అవసరమైతే
నాప్రాణము
యిచ్చివేసి
నా
దేహములోని
రక్తము
ధారపోస్తాను.
ఆమె
బ్రతికితే
చాలు
అన్నాడు.
దాసి
తీసుకొని
పోయి
లైలాకు
చెప్పేటప్పటికి
నిజమైన
ప్రేమ
అతనిలో,
యింత
ఉన్నదని
నేను
గుర్తించ
లేకపోయాను.
నా
ప్రేమనే
నేను
కొలతలు
వేసుకుంటూ
కూర్చున్నాను
అనుకొన్నది.
అదేవిధముగా
భగవంతుడు
కూడా
పరీక్ష
చేస్తుంటాడు.
నీకీ
శక్తి
ఉన్నదా?
లేదా?
ఈ
విధంగా
అర్పితము
చేస్తాడా
చేయడా?
యితనికి
పరిమితమైన
శక్తి
ఉన్నదా
లేక
అపరిమితమైన
శక్తి
ఉన్నదా?
అని
పరీక్ష
చేస్తుంటాడు.
శ్రీమంతుని
బీద
కన్య
పెండ్లి
చేసుకుంటే
శ్రీమంతుని
ధనములో
ఆ
అమ్మాయికి
భాగము
వస్తుంది.
అదే
విధముగా
భగవంతునికి
మనం
అర్పితమైపోతే
భగవంతుని
సమస్తములో
మనకు
ఒక
share
వస్తుంది.
భగవంతుని
శక్తి
అంతా
మనదే.
మనశక్తి
ప్రత్యేకంగా
లేదు.
భగవంతుడు
అనంత
శక్తి
గలవాడు.
అతని
విభూతులు
యిట్టివి
అట్టివి
అని
లెక్కించటానికి
వీలుకాదు.
ఇలాంటి
అతీతమైన
శక్తులు
కల
భగవంతుని
కేవలం
ఆశ్రయిస్తున్నామే
గానీ
ఆశించటం
లేదు.
ఆశ్రయించడమే
కాకుండా
ఆశించాలి.
ఆశించటమే
కాకుండా
ప్రేమించాలి.
ప్రేమించటమే
కాకుండా
పరితపించాలి.
పరితపించడమే
కాకుండా
అందులో
కరగిపోవాలి.
ఈ
తుచ్ఛమైన
దేహవాంఛలు
ఏమాత్రం
పెట్టుకోకూడదు.
ఇవన్నీ
నెగిటివ్.
ఈనాడు
ప్రతి
మానవుడు
ముక్తి
కావాలని
ఆశిస్తున్నాడు.
నిజమే,
ముక్తి
కావలసినదే.
దేనికి
ముక్తి.
6
▾
Meaning
Keep
శరీరానికి
ముక్తా?
మనస్సుకు
ముక్తా?
బుద్ధికి
ముక్తా
లేక
ఇంద్రియాలకు
ముక్తా?
ఎవరికి
ముక్తి
కావాలి
దాన్ని
వారు
కనుక్కోవటం
లేదు.
ముక్తి
కావాలి
ముక్తి
కావాలి.
ఈ
ప్రశ్నకు
ఏమీ
జవాబు
రాదు.
నా
ఉద్దేశ్యము
ఏమనగా
దేహానికి
ముక్తి
కావాలి.
అంతఃకరణకు
ముక్తి
కావాలి.
ముక్తి
అనగా
ఏమిటి?
దాని
బాధలు
విముక్తి
చేయటమే
ముక్తి.
ఆకలి
వేస్తున్నది.
దేహము
యొక్క
ఆకలిని
విముక్తి
చేయటానికి
భోజనం
చేస్తే
అదే
దేహమునకు
ముక్తి.
నీ
ఇంద్రియాలుంటున్నాయి.
ఇంద్రియాలు
యిష్టము
వచ్చినట్టు
సంచరిస్తున్నాయి.
వీటిని
సక్రమమైన
మార్గములో
పెట్టటము
ముక్తియే.
నీ
దేహానికి
కొన్ని
బాధలు,
రోగములు
ప్రాప్తించినాయి.
బాధ
నివారణ
చేసుకోటం
కూడా
ముక్తియే.
బాధల
నుండి
విముక్తియే
ముక్తి.
అయితే
జీవితానికి
ముక్తి
ఏవిధంగా
ఉండాలి.
ఈ
జీవితము
అనేక
వాంఛల
చేత,
అనేక
ఆశలచేత,
అనేక
భ్రమలచేత,
అనేక
కష్టములచేత
కృంగిపోతున్నది.
దీనికంతా
మూలకారణం
ఏమిటి?
శరీరము
ధరించటంచేత
ఈ
విధమైన
బాధలు
సంభవిస్తున్నాయి.
కనుక
జన్మించకుండా
పోతే
ఈ
బాధలే
మనకి
ఉండవు
కదా!
కనుక
నిజమైన
ముక్తి
కోరేవాడు
ఏమి
కోరుతున్నాడు.
‘స్వామీ
నాకింక
జన్మ
అక్కరలేదు.
ఈ
జన్మ
ఎత్తినప్పుడు
కదా
ఈ
బాధలంతా
ప్రాప్తిస్తాయి.
ఈ
జన్మలే
లేకపోతే
బాధలే
ఉండవు.
కనుక
నాకు
ఈ
జన్మయే
అక్కరలేదు.
జన్మ
నీవు
సార్థకము
గావించు’.
ఆ
సార్థకము
గావించినప్పుడు
అదే
ముక్తి.
దేహము
చేత
అనేక
విధములైన
భ్రమలు
కల్గుతున్నాయి.
అయితే
ఈ
దేహము
అనేక
రోగాలకు
మూలకారణ
మవుతున్నాది.
అయితే
ఈ
కలియుగమందు
రోగములకు
మూల
కారణము
ఏమని
ప్రశ్నించుకుంటే
ఎవరు
సరైన
జవాబు
చెప్పలేక
పోతున్నారు.
ఈ
దేహములో
సంభవించే
రోగముల
కంటె
మనస్సు
ద్వారా
సంభవించే
రోగములే
అధికముగా
ఉంటున్నాయి.
అన్నం
అధికంగా
తింటే
అజీర్ణ
రోగము
రావచ్చు.
అన్నం
తక్కువగా
తింటే
ఆకలి
పుట్టవచ్చు.
జారిపడితే
కాలు
విరగవచ్చు.
ఇవన్నీ
దేహానికి
సంబంధించినవి.
కానీ
యివి
కాదు
నిజమైన
రోగములు.
ఇవి
మన
భ్రమలచేత
కల్పించుకున్నవే.
మానసిక
యోచన
చేత
అనేక
రోగాలన్నీ
వస్తున్నాయి.
Heart
జబ్బు
అంటున్నారు.
అది
మానసిక
సంబంధమైన
రోగమే.
కిడ్నీ
రోగము
కూడా
మానసిక
సంబంధమైనదే.
పెద్ద
పెద్ద
జబ్బులన్నీ
మానసిక
సంబంధమైన
జబ్బులే.
నిరంతరము
యోచన
యోచన.
7
▾
Meaning
Keep
యోచన
చేసిచేసి
ఈ
కోరిక
కాలేదే,
ఆ
కోరిక
కాలేదే
అని
బాధపడుతున్నాడు.
ఈ
సుఖము
చిక్కలేదే
అనే
యోచన
చేత
మానవుడు
అనేక
రోగాలకు
గురౌతున్నాడు.
ఎందుకు
ఈ
యోచనలు
చేయాలి?
ఎందుకు
యీ
worry
పడాలి?
What
is
the
shape
of
worry?
It
is
mentally
created
fear.
దీనివలనే
అనేక
రోగములు
మానవునకు
ప్రాప్తిస్తున్నాయి.
కన్నులకు
రోగము
వస్తున్నాది.
చెవులకు
రోగము
వస్తున్నది.
నాలుకకు
రోగము
వస్తున్నది.
Cancer
అంతా
వస్తున్నది.
వీటికి
మూడు
భాగములు
మానసికమైన
భ్రమలే.
యిది
కూడా
భ్రమయే,
వేరుకాదు.
భ్రమ
పెరిగి
పెరిగి
రోగముగా
రూపొందుతున్నది.
ఎవరైనా
ఈ
సత్యాన్ని
మీరు
గుర్తించాలనుకుంటే
ఒకసారి
try
చేయండి.
నాకు
ఏ
జబ్బు
లేదు.
చాలా
పుష్టిగా
ఉన్నాను.
ఆరోగ్యముగా
ఉంటున్నాను.
నాకు
ఏరోగము
లేదు
అని
తలచుకుంటు
ధైర్యంగా
నీవు
జీవించు,
అన్ని
విధాలా
అభివృద్ధి
అవుతావు.
కానీ
ఒక్క
దినము
ఏమైనా
నా
pulse
weak
గా
ఉంటున్నాది,
నా
pulse
సక్రమంగా
లేదు
అని
అనుమాన
పడితే
3,
4
beats
miss
అవుతాయి.
ఇది
రోగమా?
మానసికరోగమే.
ఈవిధముగా
అనేక
మానసిక
రోగములు
పెంచుకుంటున్నారు.
కనుకనే
‘భగవంతుడా!
ఈ
మానసిక
రోగములకు
ఈ
దేహమే
మూలకారణము.
దేహము
మనస్సుకు
ఒక
కవచము.
ఈ
కవచమునకు
సరైన
సహాయము
లేకపోవటం
చేత
మనస్సు
భ్రమించి
పోతున్నాది.
కనుక
దేహమే
అక్కరలేదు.
‘పునర్జన్మ
న
విద్యతే.’
పునరపి
జననం,
పునరపి
మరణం
రావటం,
పోవటం
ఇదేనా
జీవితము.
నాకు
రావటం,
పోవటం
అక్కరలేదు.
ఒకసారి
పోతే
మరి
యింక
రానక్కర
లేదు.
అట్టి
శాంతి
నాకందించమని
కోరాలి.
ఏవిధంగా
కోరాలి.
తనను
ప్రేమించినప్పుడు
తానే
అందులో
ప్రవేశించి
అన్నీ
సంపూర్తిగా
విజయాన్ని
సాధింపచేస్తాడు.
కేవలం
స్వరబద్ధమైన
మంత్రములు
చెబితే
భగవదనుగ్రహము
రాదు.
వేదములు
ఉచ్చరించవచ్చు,
శాస్త్రములు
పఠించవచ్చు,
గానం
చేయవచ్చు,
నృత్యము
ఆడవచ్చు.
యివన్నీ
నెగిటివ్
తత్వాలు.
ఈ
నెగిటివ్
ఏమాత్రము
మనకు
ఉపయోగము
లేదు.
దైవప్రేమతో
కూడిన
ఒక
చిన్న
సంకల్పమైనా
అదే
పాజిటివ్
అయిపోతుంది.
గోపికలు
ఏతపస్సు
చేశారు.
ఏ
శాస్త్రములు
చదివారు.
ఏవేదము
పఠించారు.
ఏమీ
తెలియదు
వారికి.
భగవంతునికి
అర్పితమై
పోయారు.
కనుకనే
వారు
సంపూర్ణముగా
శాంతిని
పొందుతూ
వచ్చారు.
8
▾
Meaning
Keep
His poems 15
Also in his talks
(5)
1 June 1973
God's Grace Can Turn a Fool into a Jñāni
4 January 1987
The Bhagavad Gītā is a book to be practised
25 June 1989
Develop the Principle of Prema
14 January 1996
There is no wealth greater than Prema
29 April 1998
God Alone Is the Ground of Ānanda
ఏవిధమైన
విచారము
వారికి
లేదు.
అత్తలు
మొత్తుకున్న
మరి
భర్తలు
కత్తులు
నూరుచున్న
నోరెత్తరు
కోపగించరు
ఎటకేగరు
భీతిలబోరు
గోపికలు
ఏ
ఒక్కదానికి
వారికి
భయము
లేదు.
ఎందుకు
లేదు
భయము?
అభయ
స్వరూపుడైన
కృష్ణుడే
మావాడైనప్పుడు
భయము
మాకెందుకు.
అభయమును
పొందుటకు
ప్రయత్నించాలి
కానీ
మనము
ఈ
భయముతో
కృంగిపోకూడదు.
మనము
ఉగాది
పండుగ
జరుపుకుంటున్నాము.
ఎన్ని
ఉగాదులో
జరిగి
పోయినాయి.
ఉగాది
సుఖము
నిస్తుందనా
ఆశించటం.
ఈ
ఉగాది
ఏ
సౌఖ్యము
తెస్తుందో,
ఏ
ఆనందము
నిస్తుందో
అని
భ్రమిస్తున్నామా!
సుఖాలుగానీ,
భోగభాగ్యాలు
గానీ
సంవత్సరములు
మనకు
అందించటం
లేదు.
దినము
జరిగినట్టే
ఈనాడు
జరిగిపోతుంది.
సూర్యోదయము,
సూర్యాస్తమయము,
కొత్త
సంవత్సరము
ఏమైనా
మంచి
ఫలితాలు
యిస్తుందేమోనని
కొంతమంది
ఎదురు
చూస్తుంటారు.
అన్నీ
నెగిటివ్
భావాలు.
కొత్త
సంవత్సరము
మనకు
ఏమీ
తీసుకురాలేదు.
క్యాలండరు
దీన్నిబట్టి
యిది
కొత్త
సంవత్సరము
అని
అనుకుంటున్నాం.
కొత్త
మార్గము
మనం
కనిపెట్టాలి.
కొత్త
జీవితాన్ని
మనం
కనిపెట్టాలి.
కొత్త
ఆనందాన్ని
మనం
అనుభవించాలి.
కానీ
అది
మనం
యోచన
చేయటం
లేదు.
ఏమి
తెస్తుంది
కొత్త
సంవత్సరమని
ఎదురు
చూస్తున్నాము.
మనకు
మనమే
తెచ్చుకోవాలి
గానీ
సంవత్సరములు
మనకందించవు.
నీకు
నీవు
యోచన
చేసి
భగవంతున
కర్పితమై
పోయి
భగవంతుని
చింతలోపల
నీవు
ఉండు.
అప్పుడే
నీకు
సర్వము
నీకు
చేకూరుతుంది.
భగవంతుని
ఏవిధముగా
అర్పితము
కావాలనే
విషయమే
తెలుసుకోకుండా
పోతున్నాది.
లోకములో
అన్నీ
నీవే.
నావి
ఏమి
ఉన్నాయి.
నేనే
నీవాడను.
నాకు
ఏమీ
లేదు
అనే
సత్యాన్ని
మొట్టమొదట
గుర్తించాలి.
భగవంతుడు
ఏమి
అడుగుతున్నాడు.
వాంఛలు
వదలమన్నాడు.
తక్షణమే
వదలాలి.
నీవు
పిచ్చి
భ్రాంతులలో
మునగవద్దు
అంటున్నాడు.
మునుగుతున్నావు.
తాను
ఏమి
చేస్తాడు.
ప్రేమను
నీవు
పెంచుకో.
ప్రేమను
పదిమందికి
పంచు.
అదే
నీకు
సార్థకము.
అదే
నీ
పవిత్రమైన
మార్గము.
నీ
పురుషార్థమంతా
అదియే.
ధర్మ
అర్థ
కామ
మోక్షములనే
చతుర్విధ
పురుషార్థములు
అదియే.
పురుషార్థములంటే
మనము
ఏమాత్రము
అర్థము
చేసుకోటం
లేదు.
9
▾
Meaning
Keep
ధర్మము
అంటే
ఏమిటి?
మోక్షమంటే
చచ్చిన
తర్వాత
లభిస్తుందని
అనుకుంటున్నాడు.
క్షణక్షణములోనే
మనకు
మోక్షము
లభిస్తుంది.
చచ్చేంతవరకు
మనం
కాచుకోనక్కర
లేదు.
మోక్షము
అంటే
ఏమిటి?
మోహ
క్షయమే
మోక్షం.
మోహమును
త్యాగము
చేయి,
అదే
మోక్షము.
కానీ
యీనాడు
మోహములో
మునిగిపోతున్నాడు
మానవుడు.
బిడ్డలు,
భార్య,
కొడుకులు
కోడళ్లు
వీరంతా
మోహాలు
కదా!
వీరిని
చూచుకో.
యిది
ఒక
duty
కానీ
దీనిపై
భ్రాంతినంతా
యిమడ్చకూడదు.
ధర్మము
అంటే
ఏమిటి.
ఏది
ధర్మము?
ఇది
గృహస్థ
ధర్మము,
ఇది
వానప్రస్థ
ధర్మము,
సన్యాసధర్మము,
బ్రహ్మచర్య
ధర్మము
భాగాలుగా
పంచుకొని
అనేక
బాధలకు
గురౌతున్నారు.
అది
కాదు
ధర్మము.
The
proper
study
of
mankind
is
man
అదే
ధర్మము.
మన
thoughts,
మన
words,
మన
deeds
మూడు
ఏకత్వము
కావాలి.
ఈ
మూడింటి
ఏకత్వము
చేత
మనం
ఏపని
చేస్తున్నాం.
ఏ
పనీ
చేయటం
లేదు.
నా
ధర్మాన్ని
నేను
చేస్తున్నాను
అంటారు.
దానము
చేయటం
ధర్మమా?
ఇది
కాదు
ధర్మము.
నీలో
భావాన్ని
నీవు
charity
చేయి.
నీ
feeling
నీవు
sacrifice
చేయి.
నీ
words
నీవు
sacrifice
చేయి.
నీ
దేహాన్ని
నీవు
sacrifice
చేయి.
దేహము
దేనికోసం.
కర్మానుబంధీని
మనుష్యలోకే.
మనస్సు
యిచ్చి
దేహముతో
కర్మను
ఆచరించమన్నాడు.
కర్మకాండ
యీ
దేహము.
భక్తి
కాండ
ఈ
మనస్సు.
ఈ
రెండింటి
సమ్మిళిత
స్వరూపమే
జ్ఞానకాండ.
జ్ఞానమనగా
గ్రంథాలు
చదవటం
కాదు.
అద్వైత
దర్శనం
జ్ఞానం.
రెండవది
లేదని
తెలుసుకోటమే
జ్ఞానం.
భగవంతుడా
నేను
జ్ఞానము
సంపాయించాలి,
నేను
జ్ఞాని
కావాలి
అని
అడుగుతే
ఎప్పుడు
జ్ఞాని
అవుతాడు.
ఈ
జ్ఞానము
కోసం
ఎన్నో
గ్రంథాలు
చదువుతున్నాడు.
ఈ
గ్రంథములు
చదివేవాడు
అజ్ఞాని.
సరైన
జ్ఞాని
కాదు.
జ్ఞాని
తనలో
నున్న
గ్రంథాలు
చదవాలి
గానీ
బయట
గ్రంథాల్ని
చదవటమా.
ఇదంతా
bookish
knowledge,
superficial
knowledge.
Not
practical
knowledge.
Practical
knowledge
లోపల
నీ
హృదయ
గ్రంథాన్ని
విప్పి
చూడు.
అందులో
నీ
భావములు
ఏరీతిగా
ఉన్నాయో
కనిపెట్టు.
నేను
మంచి
భావాలతో
ఉన్నానా
చెడ్డ
భావాలతో
ఉన్నానా?
Master
the
mind.
Be
a
master
mind.
అలాంటిది
చేయకుండా
నా
మనస్సు,
నా
బుద్ధి
అనుకొని
దీనిలోనే
మునిగిపోయి
కట్టకడపటికి
నీ
తత్వాన్ని
మర్చిపోతున్నావు.
10
▾
Meaning
Keep
ప్రేమను
మించిన
వజ్రము
లేదు
ప్రేమస్వరూపులారా!
మానవుని
యందు
ప్రధాన
లక్షణము
ప్రేమయే.
గొప్ప
విలువైన
వజ్రము
ప్రేమయే.
అలాంటి
డైమండు
ఎక్కడా
దొరకదు.
ఎవరికోసమో
ప్రేమించేదే
ప్రేమ
కాదు.
దైవము
కోసం
ప్రేమించే
ప్రేమయే
నిజమైన
వజ్రము.
ఎవరైనా
ఏమైనా
అనుకోని
ఏవిధంగానైనా
భావించుకోనీ.
తలలు
వేరైనప్పుడు
తలంపులు
వేరుగానే
ఉంటాయి.
మనలో
ఎట్టి
దోషము
లేదు.
భగవంతుడు
నిస్వార్థపరుడు.
అలాంటి
నిస్వార్థపరుడైన
భగవంతుని
దగ్గర
స్వార్థము
ఎట్లా
ఉంటుంది?
ఏది
చేసినా
నిస్వార్థమే.
ఏది
చేసినా
పవిత్రమే.
ఏది
చేసినా
దివ్యత్వమే.
నేను
భ్రమతో
ఉన్నానా,
త్యాగముతో
ఉన్నానా,
యోగముతో
ఉన్నానా
లేక
రోగముతో
ఉన్నానా.
సంయోగముతో
ఉన్నానా,
వియోగముతో
ఉన్నానా
అన్ని
ప్రశ్నలు
వేసుకోవాలి.
ఆవిధంగా
వేసుకుంటే
అన్నింటికి
మార్కులు
జీరోలే.
ఏ
ఒక్కదానిలో
ఒక్క
మార్కు
సంపాయించుకోలేకపోతున్నాం.
దేహమే
ముఖ్యమైన
ఆధారముగా
తీసుకొని
తద్వారా
మనం
అన్ని
కర్మలలో
ప్రవేశిస్తున్నాము.
దీనికి
answer
ఎక్కడ
చిక్కుతుంది
మనకు.
ఈ
దేహము
ఒక
పనిముట్టు.
This
is
my
body,
my
mind,
my
hand,
my
leg,
my
head.
Who
are
you
దాన్ని
తెలుసుకో.
అన్నీ
నావి,
నావి
అంటున్నావు.
యివన్నీ
పనిముట్లు.
You
are
the
master,
be
a
master
mind.
అది
నీవు
చేయవలసిన
పని.
అలాంటిది
చేయకుండా
నా
మనస్సు,
నా
బుద్ధి
అని
దీనిలోనే
మునిగి
కట్టకడపటికి
నీ
తత్వాన్నే
నీవు
మరచిపోతున్నావు.
ప్రతిమానవుడు
మొట్టమొదట
తన
దేహతత్వము
తాను
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
ఎంత
పవిత్రమైన
దేహాన్ని
యిచ్చాడు
భగవంతుడు.
చిన్న
ఉదాహరణ
కన్ను
ఆధారంగా
తీసుకోండి.
లక్షలమైళ్లు
నున్న
అంతరిక్షమును
చూస్తున్నది
కన్ను.
కన్నులో
ఎంత
power
ఉంది.
ఈ
చిన్న
కన్నులోనే
యింత
పవరున్నది.
దేహమంతా
కణము
కణము
యిదే
పవరున్నాది.
అణువు
అణువు
యిదే
పవరున్నది.
ప్రతి
అణువునందు,
ప్రతి
కణమునందు
చేరినది
దైవమే.
యిన్ని
కణములనంతా
మనము
వ్యర్థము
చేసుకుంటున్నాము.
ఒక్క
కన్నునే
ఆధారముగా
తీసుకుంటే
యింత
తెలుస్తున్నాది.
ఎన్నో
ఆధారాలు
మనం
తీసుకోనక్కరలేదు.
మానవుని
చెవులు
ఎక్కడ
ఏమి
జరుగుతున్నా
నిశ్శబ్దంతో
వింటున్నాయి.
11
▾
Meaning
Keep
ఈ
చెవులకు
ఎవరిచ్చారు
యీ
శక్తి.
ఎవరు
యిచ్చినది
కాదు,
భగవంతుడిచ్చిన
వరప్రసాదమే
తెలివి.
ఒక
పదార్థమును
చూసి
discrimination
చేసి
కట్టకడపటికి
సత్యాన్ని
నిరూపిస్తుంది
యీ
తెలివి.
యింత
శక్తి
భండారమైన
దేహాన్ని
అర్థము
చేసుకోగల్గుతున్నామా?
దేహమంతా
కణములతో
నిండి
ఉంటున్నది.
రక్తకణములు
cells
అంటున్నాము.
ప్రతి
cell
ఒక
విధమైన
రూపమే.
దేహములో
కొన్ని
కోట్ల
cells
ఉన్నాయి.
యిన్ని
రూపాలు
యిందులో
ఉన్నాయి.
నీవు
విశ్వ
విరాట
స్వరూపుడవు.
ఈ
సత్యము
నీవు
గుర్తించుకో
లేకపోతున్నావు.
రక్త
కణములని
అనుకుంటున్నావు.
చాలా
పొరపాటు.
ఒక్క
కణము
కూడా
waste
కాకూడదు.
యిదే
మహాభారత
యుద్ధమందు
ధర్మజుడు
విరాటరాజు
వద్దకు
పోయి
జూదమాడుతున్న
సమయంలో
విరాటరాజు
ప్రతిసారి
ఓడిపోతూ
వచ్చాడు.
ధర్మజునికి
జూదమంటే
ప్రీతి.
ఆ
పాత
వాసనచేత
అందులో
ప్రవేశించాడు
కోపం
వచ్చింది
విరాటరాజుకు.
ఒక
పాచిక
తీసుకొని
కొట్టాడు
ధర్మరాజును.
రక్తం
కారింది.
క్రింద
పడుతున్నాది.
పరుగెత్తి
వెళ్ళింది
ద్రౌపది.
తన
పయిటచే
తుడిచింది.
విరాటరాజు
చూశాడు.
ఏమిటి?
ఈమె
యితని
రక్తాన్ని
తుడవటానికి
కారణం
ఏమిటి?
వీరు
పాండవులు,
ఆమె
ధర్మపత్ని
పాంచాలి
అని
వారికి
తెలియదు.
మారువేషాలతో
సంచరిస్తున్నారు.
అదే
అజ్ఞాత
వాసమన్నారు.
అజ్ఞాతమనగా
తెలియకుండా
జీవించటమే
అజ్ఞాతము.
అదే
విధముగా
అజ్ఞాతముగా
ఎన్నో
శక్తులున్నాయి.
ఆమెను
అడిగితే
క్షమించమని
కోరి
ఆమె
చెప్పింది,
‘ఇతను
ధర్మ
స్వరూపుడు.
ధర్మం
యొక్క
రక్తము
ఒక్క
బొట్టు
క్రిందపడినా
రాజ్యమంతా
నాశనమైపోతుంది.
నీ
రాజ్యములో
యిలాంటివి
జరగకూడదు.
ఎందుకంటే
ఈ
సంవత్సరమంతా
మమ్మల్ని
కాపాడుతూ
వచ్చావు.
ఎవరికి
గుర్తించటానికి
వీలు
లేకుండా
మారువేషాలతో
మేము
జీవిస్తున్నాము.
సంవత్సరము
దాటిపోతూ
వస్తున్నాది.
అప్పుడు
ఆమె
ఈ
గుర్తంతా
చెప్పింది.
అర్జునుడు
నీ
కుమార్తెకు
భరతనాట్యాన్ని
నేర్పిస్తున్నాడు.
నా
భర్త
అర్జునుడు
సామాన్యుడు
కాడు.
భీముడు
వంటహాలులో
కూర్చున్నాడు.
వంటలంతా
చేస్తున్నాడు.
అతనిది
భీమపాకము.
అతనూ
నా
భర్తయే.
నీ
పశువులనంతా
కాస్తున్నారు
నకుల
సహదేవులు,
వారు
నా
భర్తలే.
ధర్మస్వరూపుడైన
ధర్మరాజు
నా
భర్తయే.
నేను
పాంచాలిని’
అంది.
అతనికి
చాలా
ఆశ్చర్యము
వేసింది.
12
▾
Meaning
Keep
పాంచాలికి
ఐదు
భర్తలా!
కాదు,
కాదు
ఐదు
భూతములను
స్వాధీనము
చేసుకున్నది
యీమె.
అవియే
శబ్ద
స్పర్శ
రూప
రస
గంధాదులు.
అవే
పంచప్రాణములు.
ఈ
పంచప్రాణములకు
ఆమె
పత్ని.
ఈ
పంచప్రాణములు
ఆమెకు
పతిగా
మారిపోయినాయి.
చరిత్ర
యొక్క
విచిత్రములు
ఎవ్వరూ
సరిగా
అర్థము
చేసుకోలేరు.
చరిత్రయందు
ధర్మాన్ని
గురించి
బోధించేందుకు
ఎంతైనా
ఉన్నాది.
హృదయ
పూర్వకంగా
మనం
ఆచరించాలి.
హృదయ
పూర్వకంగా
అర్పితము
చేయాలి.
ఎవరైనా
వచ్చి
బిక్షమడిగితే
బిక్షగాడు
వచ్చినాడే
అని
యింత
వేస్తే
చాలదు.
అయ్యో
నాఆకలి
ఎట్లనో
వాని
ఆకలి
కూడా
అట్లానే
ఉంటుంది.
నేను
వండుకున్నాది
అతనికి
కూడా
కొంత
పెడదాం.
ప్రేమతో
వానికి
వడ్డించు.
ఎంతగానో
నీ
అభయహస్తము
పెరిగిపోతుంది.
ద్రౌపది
చిన్న
కరివేపాకు
కృష్ణునికి
పెట్టినప్పుడు
సర్వము
అక్షయంగా
మారిపోయింది.
దుర్వాసుడు
తీసుకువచ్చిన
వేల
శిష్యులకు
కడుపులు
నిండిపోయినాయి.
మానవుని
యందు
అనేక
శక్తులున్నాయి.
ఈ
శక్తులు
యిట్టివి
అట్టివి
అని
చెప్పటానికి
వీలు
కాదు.
ఒక
నిముషములో
నీవు
చేయి
చాస్తే
సర్వము
నీకు
ప్రాప్తిస్తుంది.
ఎట్లా
నీవు
చేయిచాచాలి.
భగవదర్పిత
భావముతో
నీవు
చేయి
చాచాలి.
నీ
భ్రాంతితో
నీవు
చేయి
చాచకూడదు.
భగవదర్పిత
భావముతో
నీవు
చేసినప్పుడు
తప్పక
నీకు
ప్రాప్తిస్తుంది.
తప్పక
ప్రయత్నం
చేయండి.
స్వార్థం
లోపల
పెట్టుకొని
పరార్థము
బోధిస్తూ
నిరుపయోగమైన
కోరికలు
కోరుతుంటే
ఏనాటికి
చెల్లవు.
లభించినవి
కూడా
శూన్యమైపోతాయి.
కనుక
ఈనాడు
మనం
గుర్తించవలసింది
ఏమిటి?
ప్రతి
దానియందు
భగవదర్పితం
కావాలి.
సర్వకర్మ
భగవత్ప్రీత్యర్థమని
వేదము
బోధించుటకు
కారణం
యిదే.
వాంఛలతో
జీవించవద్దు.
దేహము
కూడా
భగవంతుడిచ్చినదే.
ప్రాణము
భగవంతుడిచ్చినదే
కనుక
సర్వము
భగవదర్పితమే.
నీ
పనులు
నీవు
చేసుకో.
ఆఫీసుకు
పో.
నీ
ఆఫీసు
పనులు
చేయి.
వ్యాపారమునకు
పో,
వ్యాపారము
చేయి.
ఏదీ
నీవు
వదలనక్కరలేదు.
ఇవన్నీ
భగవంతుని
పనులే.
ఇది
నా
పని,
ఇది
నీ
పని
అని
అక్కడ
divide
చేయవద్దు.
ఈ
వ్యాపారములో
చేరటం
చేత
share
holders
అవుతున్నారు.
భగవంతుడు
ఎప్పుడు
share
holder
కానే
కాడు.
నీవు
shareholder.
నీభ్రాంతియే
నీకు
అట్లా
కనిపిస్తుంది.
భగవంతునికి
ఎవరి
share
అక్కరలేదు.
అందరు
తన
షేర్సే.
అన్నీ
తన
షేర్సే.
తన
దేహములో
ఏవిధముగా
రక్తకణములు
ఉంటున్నాయో
అట్లానే
అందరు
తన
యందు
రక్త
కణములుగా
ఉంటున్నారు.
13
▾
Meaning
Keep
Also in his talks
(10)
10 December 1986
Faith in the Ātma alone gives all strength
15 September 1988
God's descent is only to make Prema grow
17 June 1996
He Who Reaches God's Presence Is Honoured Everywhere
21 June 1996
Śraddhā and Faith Win God's Grace
10 July 1996
Follow the Religion of Love
23 November 1996
We Must Make Human Life a Life Full of Prema
12 November 2003
Grow Prema for God and pity for the helpless
21 July 2005
No power is greater than Bhakti for God
7 October 2005
Surrender to God
22 August 2007
Foster faith in God and love of country!
ప్రతి
మానవునియందు
ఉండినది
భగవత్స్వరూపమే.
అందుకోసమే
శైలేశైలే
విహరిత
దైవం.
కొండలు
కొండలు,
గుట్టలు
గుట్టలు
అంతా
ఎక్కడ
చూచినా
విహరిస్తున్నాడు.
‘గ్రామే
గ్రామే
త్యాగే
దైవం.’
గ్రామ
గ్రామములందు
త్యాగ
స్వరూపుడై
ఉంటున్నాడు.
నగరే
నగరే
విదితం.
నగరములో
కూడా
భగవంతుడు
సుక్షేమమైన
జీవితాన్ని
గడుపుతున్నాడు.
భగవంతుడు
ఎక్కడ
చూచినా
ఉంటున్నాడు.
కాలస్వరూపుడు
భగవంతుడు
అడవులయందున్న
ఆకసముననున్న
పట్టణముననున్న
పల్లెనున్న
గుట్ట
మీదనున్న
నట్టేట
బడియున్న
దిక్కులేని
వానికి
దేవుడే
దిక్కు
భగవంతుడు
లేని
స్థానమే
లేదు.
సర్వము
సత్యస్వరూపకంగా
ఉన్నాడు.
అదియే
బ్రహ్మస్వరూపం
శబ్దము.
నీవు
ఏవిధమైన
కార్యము
చేస్తున్నావో
దానికి
తగిన
ప్రతిఫలము
యిస్తున్నాడు.
నీకు
కోపం
వచ్చింది.
టేబుల్‌ను
గట్టిగా
కొట్టావు.
టేబులును
గట్టిగా
కొట్టానే
అని
అనుకుంటావు.
కాదు
కాదు
టేబులు
కూడా
నిన్ను
అంత
గట్టిగా
కొట్టింది.
ప్రతిదానికి
resound,
reaction,
reflection.
నేడు
కాకపోయినా
రేపైనా
కనిపిస్తుంది.
అప్పటికప్పుడు
కనిపించకుండా
పోయినంత
మాత్రమున
నాకు
ఏమీ
reaction
లేదే
అనుకోవచ్చు.
చేయి
తెగింది.
తెగిన
తక్షణమే
రక్తము
వచ్చింది.
తక్షణమే
reaction.
అన్నము
తిన్నాము.
తిన్న
తక్షణమే
జీర్ణము
కాదు.
రెండుగంటలు
టైము
తీసుకుంటుంది.
జారిపడ్డావు
కాలు
విరిగింది.
ఎముక
తక్షణమే
విరిగింది
కానీ
నయం
కావటానికి
కొన్ని
నెలలు
తీసుకుంటుంది.
అదే
విధముగా
ఏ
పనులు
నీవు
చేశావో
అది
కొన్ని
నెలలు
కొన్ని
సంవత్సరములు
కొన్ని
యుగాలు
కూడా
తీసుకుంటాయి.
యిప్పుడు
చేసిన
మోసముకు,
యిప్పుడు
చేసిన
దగాకు,
యిప్పుడు
చేసిన
అన్యాయానికి,
అక్రమానికి
నాకేమి
ఫలితము
రాలేదే
అని
భావించవచ్చు.
చాలా
పొరపాటు.
ఈ
reaction
ఎప్పటికైనా
తప్పునది
కాదు.
14
▾
Meaning
Keep
కొన్ని
నెలలకో,
కొన్ని
సంవత్సరాలకో
లేకపోతే
కొన్ని
యుగాలకో
సంభవిస్తుంది.
ఒక
విత్తనము
భూమిలో
నాటినావు.
తక్షణమే
మొక్క
వచ్చిందా,
రాలేదు.
మొక్క
రావటానికి
మూడు
దినములు
టైము
తీసుకుంటుంది.
చెట్టుకావటానికి
కొన్ని
సంవత్సరాలు
తీసుకుంటుంది.
కాయలు
కాయటానికి
కొన్నిసంవత్సరాలు
తీసుకుంటుంది.
కనుక
time
is
every
thing.
Don't
waste
time.
Time
waste
is
life
waste.
టైమును
దుర్వినియోగం
చేసుకోకుండా
చూసుకోండి.
టైమును
సద్వినియోగం
చేయాలి.
అదే
భగవంతుని
యొక్క
నియమము.
నీకు
నియమము
లేకపోవచ్చుగానీ
భగవంతుడు
అన్ని
పనులు
నియమంతో
చేస్తున్నాడు.
రుచిర్
దేశాయ్
చెప్పాడు.
వార్డెను
ఏం
చేశాడు?
Hostel
లో
పనిచేసేవాని
బిడ్డకు
పెండ్లికి
ఏమి
చెయ్యాలో
అని
చూస్తున్నాడు.
అతని
బిడ్డకు
పెండ్లి
అని
అతను
చెప్పకపోయినా
నాకు
తెలుసును.
నేను
అటువైపు
పోలేదు.
యిటువైపు
తిరిగి
లోపలికి
వెళ్లి
చీరలు
తెచ్చి
యిచ్చాను.
మా
warden
నరసింహమూర్తి
అన్నాడు.
ఐదు
వేల,
ఆరు
వేల
రూపాయలు
ఖరీదు
చీరలు
వారు
కట్టుకోగలరా
అన్నాడు.
అయ్యా
యిచ్చేవారు
లేక
కట్టేవారు
లేరు
కానీ
యిచ్చేవారుంటే
కట్టేవారు
దండిగా
ఉన్నారు.
యిచ్చేసేయి.
Life
లో
ఒక్కసారి
పెండ్లి.
ఆ
కానుకను
ఒప్పుకున్నారు
వారు.
యిది
మా
అదృష్టము.
యింత
పెద్ద
ఖరీదైన
చీర
స్వామి
యిచ్చారు
అని
ఎంతో
ఆనందించారు.
ప్రతి
చిన్న
చిన్న
విషయములో
నా
డిసిప్లిన్
అంతగా
ఉంటుంది.
నా
discipline
ఎవరు
అర్ధం
చేసుకోలేరు.
నా
మాటలోని
discipline
గానీ,
నా
నడకలోనున్న
discipline
గానీ,
నా
భజనలోనున్న
discipline
ఎవరికీ
యింతవరకు
అర్ధము
కాలేదు.
స్వామి
లోకరీతిగా
అన్నీ
చేస్తున్నాడని
అనుకుంటారు.
లోకరీతిగా
అన్నీ
ఆశిస్తున్నాడని
అనుకుంటారు.
లోకవాంఛలే
లేవు
నాకు.
నమ్మండి
నమ్మకపోండి.
కాలి
నుండి
తలవరకు
పాజిటివే.
no
నెగిటివ్.
కానీ
మీ
నిమిత్తమై
చేయటము
జరుగుతున్నాయి.
స్వామీ
poor
feeding
చేయాలని
వస్తారు.
ఏమిటి
poor
feeding.
Feeding
of
poor
అని
ఎందుకు
చెప్పకూడదు.
Poor
feeding
అంటే
తక్కువ
అన్నం
పెట్టడం
అన్నమాట.
కాదు
ఆ
పదాలలోనే
ఉన్నాది
నెగిటివ్.
నాకు
నెగిటివ్
పదములే
రావు.
ఉగాది
ఒక
దినము
భోజనం
పెడితే
మిగతా
దినాలు
వారు
ఏమి
తింటారు.
వచ్చేవారికి
ప్రతిదినము
పెట్టండి,
సంతోషమే.
నాది
అంత
పెద్ద
హృదయము.
నా
హృదయము
expansion
love.
15
▾
Meaning
Keep
నీ
హృదయము
contraction
love
అది
చాలా
చిన్నది.
సున్నితమైంది.
ఏ
కించిత్
దెబ్బ
తగిలినా
భరించలేదు.
విశాలమైన
దానికి
దెబ్బనే
తగలదు.
భయమే
లేదు.
కనుక
విశాలమైన
హృదయాన్ని
పెంచుకోండి.
మీరు
ఎన్ని
రకములైన
కార్యములైనా
చేయవచ్చును.
విమానము
వలె
ఆకాశములో
సంచరించవచ్చు.
తప్పక
చేయవచ్చు.
కానీ
తగిన
ప్రయత్నంచేయాలి.
ఆ
విశ్వాసము
పెంచుకోవాలి.
దైవానికి
అర్పితం
కావాలి.
ఏదైనా
సరే
జరిగిపోతుంది.
అర్పితం
చేయకుండా
జరగాలి,
జరగాలి
అంటే
ఎట్లా
జరుగుతుంది.
భగవంతునికి
అర్పితమయ్యే
మార్గానికి,
భగవంతునికి
సమీపమయ్యే
మార్గానికి
తగిన
కృషి
చేయండి.
దైవానికి
Near
అయినప్పుడు
dear
అయిపోతుంది.
అప్పుడే
దీని
ఫలితం
తప్పక
లభిస్తుంది.
ఈనాడు
కొత్త
సంవత్సరం
పేరు
బహుధాన్య.
లోకరీతిగా
ధాన్యము
ఎక్కువ
పండుతుంది
అన్నమాట.
దండిగా
పండుతున్నది
యిప్పుడేమీ
తక్కువ
లేదు.
కానీ
మనము
చక్కగా
భుజిస్తున్నామా.
పదిమంది
ఆకలిగొన్న
వారికి
ఏమైనా
పెడుతున్నామా,
లేదు.
ఒక్కొక్క
సంవత్సరమునకు
ఒక్కొక్క
మంచి
పేర్లు
పెడుతూ
వచ్చారు.
ఇవన్నీ
దైవము
యొక్క
నామాలే.
ప్రభవ,
విభవ....
యీ
విధంగా
పేర్లన్నీ
భగవంతుని
పేర్లే.
ఎంత
పవిత్రమైన
పేర్లు.
ఒక్కటి
చెడ్డ
లేనే
లేదు.
కొంతమంది
యీ
సంవత్సరము
చెడ్డగా
ఉంటుంది.
చెడ్డ
ఫలితము
లభిస్తుంది
అని
శాస్త్రజ్ఞులు
చెబుతారు.
ఎందుకోసం
తెలుసునట్లు
చెప్పేది.
శాంతికి,
డబ్బు
కోసం.
డబ్బు
యిస్తే
పాపాలంతా
పోతాయా!
పోవు,
ఈనాడు
అంత
పిచ్చివారమైపోతున్నారు.
డబ్బుతో
తీరతాయా
కష్టాలు.
హృదయముతో
తీరతాయి
కష్టాలు.
డబ్బుతో
తీరదు.
నీవు
ఎంత
చెడ్డ
చేసినా,
పశ్చాత్తాపముతో
మంచిగా
భగవంతుని
స్మరించు.
తిరిగి
ఆ
తప్పు
చేయకు.
పెద్ద
పాపపు
పర్వతాలు
కూడా
సూర్యరశ్మిలో
కరిగి
ముద్ద
అయిపోతాయి.
నీ
పాపములవంటి
కొండలలో
పుణ్యమనే
కిరణము
పుట్టిందంటే
సర్వము
నశించిపోతుంది.
పాపమనే
అనుకోకూడదు.
మంత్రములలో
పాపమనే
పదములు
వస్తుంటాయి.
“పాపోహం
పాపకర్మణాం”
అని
చెబుతున్నారు.
అది
నేను
చెప్పకూడదని
అంటుంటాను.
మా
పద్మనాభ
శాస్త్రి
అంటుండేవాడు.
పాపోహం,
నేను
పాపిని.
నేను
పాపకర్మలు
చేస్తున్నాను.
నేను
పాపాత్ముడను.
అన్నీ
పాపాలే.
ఎందుకు
పాపం
అనుకోవాలి.
“పుణ్యోహం
పుణ్య
కర్మాణాం
పుణ్యాత్మా
పుణ్యసంభవ”
అని
స్మరించు.
16
▾
Meaning
Keep
యీవిధంగా
పుణ్యం
చేసుకో.
పాపమనే
పదము
మనలో
రాకూడదు.
పాపము
మానవులు
చేసేది
కాదు.
ఒకరిని
భయపెట్టేది
కాదు.
నీవు
భయపడేవాడు
కాదు.
భయపెట్టేది
మృగము.
భయపడేది
పశువు.
నీవు
పశువు
కాదు,
మృగము
కాదు.
నీవు
భయపడకూడదు.
భయపెట్టకూడదు.
నీవు
మానవుడవు.
ఇట్టి
పవిత్రమైన
మానవజన్మ
వచ్చినందుకు
సార్థకము
గావించుకోవటానికి
ప్రేమతత్వాన్ని
భగవంతునికి
సమీపతత్వాన్ని
మనం
వెతుక్కుంటూ
పోవాలి.
ఎంత
అదృష్టవంతులకో
యిట్టి
ప్రాప్తి
చిక్కుతుంది.
కానీ
ప్రాప్తి
విలువ
మీరు
గుర్తించుకోలేకపోతున్నారు.
డైమండ్
విలువ
తెలియని
వారు
పేపరు
వెయిట్
మాదిరి
వాడుకుంటారు.
కానీ
అదే
విలువ
కలదని
తెలుస్తే
గాద్రేజ్
బీరువాలో
పెట్టి
lock
చేస్తారు.
ఈనాడు
మీరు
యీ
విలువను
తెలుసుకోలేకుండా
పోవటం
చేత
misuse
చేస్తున్నారు.
నిజంగా
భగవంతుని
ప్రేమతత్వం
ఎంత
గొప్ప
విశాలమైనదో
మీరు
గుర్తించుకోలేకపోతున్నారు.
అడిగితే
వచ్చేది
కాదు.
యివ్వమంటే
యిచ్చేది
కాదు.
తనకు
తానే
యిస్తుంటాడు.
యిలాంటి
అనుగ్రహమనే
దాన్ని
మీరు
ఎందుకు
దక్కించుకోకూడదు.
ఎందుకు
పొందకూడదు.
ఎందుకు
మీరు
నిలబెట్టుకోకూడదు.
ఎందుకు
మీరు
సార్థకం
చేసుకోకూడదు.
కొత్త
సంవత్సరములు
ఎన్ని
జరుగుతున్నా
మీరే
పాత
పద్ధతిలోనే
ఉన్నారు
యింకా.
మీలో
పవిత్రమైన
భావాలు
గానీ,
పవిత్రమైన
నడతలుగానీ,
పవిత్రమైన
చర్యలు
గానీ,
పవిత్రమైన
త్యాగము
కానీ,
పవిత్రమైన
మాటలు
గానీ
ఏనాటికి
రావటంలేదు.
అంతా
పాత
పాటలే.
పాత
మాటలే.
పాత
ఆటలే.
కొత్త
ఎక్కడ
వచ్చింది.
ఇప్పటినుండి
నూతన
భావాలు
రావాలి.
ఉత్తేజమైన
భావాలు
రావాలి.
ఉత్సాహమైన
భావాలు
రావాలి.
అప్పుడే
ఉత్తమమైన
బుద్ధిని
తెస్తుంది.
ఎప్పుడూ
ఏడ్చుకుంటూ
పాత
సంవత్సరము,
కొత్త
సంవత్సరము
అని
దుఃఖమునకు
ఏమాత్రం
అవకాశము
యివ్వకూడదు.
ఆనందముగా
ఉండాలి.
అదే
నిజమైన
దైవచిత్తము.
Happiness
is
union
with
God.
ఎప్పుడు
నవ్వుతూనే
ఉండాలి.
అప్పుడే
నీ
జీవితము
నవ్వు
జీవితముగానే
ఉంటుంది.
ఎప్పుడూ
నవ్వేవాడు
భగవంతుడే
తప్ప
యింక
ఎవ్వరు
కాదు.
నీవు
నవ్వుతుంటే
నీవు
భగవంతుడౌతావు.
చిరునవ్వు
చిందులు
తొక్కుతాడు
భగవంతుడు.
ఎప్పుడూ
ఆనందస్వరూపుడే
భగవంతుడు.
నిత్యానందం
పరమసుఖదం
అన్నాడు.
17
▾
Meaning
Keep
భగవంతుని
గుణములంతా
మానవునిలో
ఉన్నాయి.
కానీ
యీ
పాడు
మనిషి
మంచి
గుణాలంతా
అణగత్రొక్కుతున్నాడు.
చెడ్డ
గుణాలు
పైకి
తెప్పించుకుంటున్నాడు.
కరుణ
ఎంత
గొప్పది.
ప్రేమ
ఎంత
గొప్పది!
త్యాగము
ఎంత
గొప్పది.
ఇవన్నీ
మనలో
ఉన్నాయి.
వీటినన్ని
అణగత్రొక్కేస్తున్నారు.
క్రోధము,
ద్వేషము,
అసూయ
వీటన్నింటిని
తెచ్చుకుంటున్నారు.
కనుక
మీరు
దాని
స్వరూపాన్ని
పొందుతున్నారు.
‘బ్రహ్మవిత్
బ్రహ్మైవభవతి.’
దేనిని
మనం
తలుస్తామో
ఆ
రూపాన్ని
మనం
పొందుతాం.
నిరంతరము
నీవు
బ్రహ్మ
అనే
భావాన్ని
పెట్టుకో.
నీవు
బ్రహ్మగా
రూపొందుతావు.
ఎట్లనగా
ఒక
కీటకము
ఉంటున్నాది.
కాని
దాన్ని
ఒక
గూటిలో
పెట్టి
భ్రమరము
గుయ్
అని
తిరుగుతుంది.
కానీ
లోపలి
పురుగు
భ్రమరమై
పోతుంది.
అదేరీతిగా
నీ
హృదయములోపల
భగవన్నామాన్ని
పెట్టుకొని
ఆ
ప్రేమ
తత్వముతో
ఓంకారము
చేస్తూరా
తప్పక
నీవు
బ్రహ్మగా
మారిపోతావు.
హృదయమంతా
బ్రహ్మయే
ఉన్నాడు.
హృత్-దయ.
దయలేని
హృదయము
రాతిగుండె.
ఇది
విషమయమైన
గుండె.
కఠినమైన
గుండె,
కామమైన
గుండె,
ద్వేషమైన
గుండె.
యిలాంటి
గుండెను
పట్టుకొని
దయ
దయ
అంటే
ఎక్కడ
నుండి
వస్తుంది.
హృదయము
కానే
కాదు.
దయతో
ఉండినప్పుడు
హృదయమైపోతుంది.
ప్రతి
ఒక్కరు
హృదయమును
దయతో
పెంచుకోవాలి.
ఎవరితో
మాట్లాడినా
ఆనందముతో
మాట్లాడాలి.
వచ్చినవి
వస్తాయి.
పోయినవి
పోతాయి.
నీవు
తెచ్చుకున్నావా
పుట్టినప్పుడు.
ఏమీ
నీవు
తేలేదు.
యింత
బట్ట
కూడా
కట్టుకొని
రాలేదు.
అలాంటి
పరిస్థితిలో
నీవు
తెచ్చుకున్నది
ఏమిటి?
పోయేటప్పుడు
ఏమీ
తీసుకొని
పోవు.
ఏవిధంగా
పుట్టావో
ఆవిధంగా
పోతావు.
దీనికోసం
ఎందుకంత
ఆరాటము.
ఏమీ
ఆరాటపడకూడదు
వచ్చేటప్పుడు.
ఖాళీ
చేతులతో
వచ్చాను.
ఖాళీ
చేతులతోనే
పోతున్నాను.
యింత
త్యాగములో
మనం
మునగాలి.
ఆనందముతో
మనం
జీవించాలి.
మధ్యలో
యివన్నీ
వచ్చాయి.
Passing
clouds
వస్తున్నాయి,
పోతున్నాయి.
Permanent
clouds
కాదు.
Permanent
person
గానీ,
permanent
విషయం
గానీ
ఎక్కడా
లేదు.
అన్నీ
passing
clouds.
ఈ
సత్యాన్ని
మీరు
గుర్తించండి.
ఏమీ
విచారము
ఉండదు.
ఆనందముగా
ఉండవచ్చును.
అట్టి
ఆనందమైన
జీవితాన్ని
మీరు
అనుభవించండి.
ఈ
ఆహ్లాదమైన
జీవితాన్ని
నేను
అందిస్తాను.
ఎప్పుడు
కంటి
నీరు
కార్చుకుంటూ
జీవిస్తుంటే
ఎప్పుడు
ఆనందము
అనుభవిస్తారు.
18
▾
Meaning
Keep
ఇవ్వడానికి
నేను
రెడీ.
I
am
ready.
కానీ
మీరు
తీసుకోటానికి
సిద్దముగా
లేకుండా
ఉన్నారు.
ఏమి
చేయను.
నేను
యిచ్చినా
క్రింద
పడిపోతుంది.
కానీ
చేతిలో
పడేదే
కనుక
be
ready.
ఎప్పుడు
ready
గా
ఉండండి.
ఏమాత్రం
బాధపడకూడదు.
ఆవిధంగా
ఉండినప్పుడు
మీ
హృదయము
విశాలమవుతుంది.
దైవము
అర్పితమునకు
ఆనందిస్తుంటాడు.
ఏమైనా
యివ్వటానికి
నిరంతరము
చేతులు
చాస్తూనే
ఉంటాడు.
అడిగినది
యివ్వకుండా
పోతే
అది
వారికే
నష్టము
గానీ
భగవంతునికి
ఏ
నష్టము
లేదు.
నాకు
మూడడుగులు
దానమివ్వమని
అడిగాడు
బలి
చక్రవర్తిని.
గురువైన
శుక్రాచార్యుడు
యివ్వకూడదు
అని
చెప్పాడు.
నేను
గురువును.
గురువాజ్ఞ
మీరకూడదు.
అప్పుడు
సరైన
జవాబు
చెప్పాడు
బలిచక్రవర్తి.
అయ్యా
గురువు
కావచ్చు.
తల్లి,
తండ్రి,
గురువు,
దైవము
చాలా
ప్రధానమైనవారు.
కానీ
దైవము
అందరికంటే
గొప్పవాడు.
దైవమే
వచ్చి
నాకు
యివ్వమని
చేయి
చాస్తే
నేను
యివ్వటానికి
నా
చేయి
ఎంత
అదృష్టము
చేసినదో.
నా
చేయిపైన,
భగవంతుని
చేయి
క్రింద
ఉంటున్నది.
యింతకంటె
అదృష్టము
లేదు.
పలికి
బొంకుట
కంటె
పాపమున్నదా?
నేను
చెప్పినది
చేయకుండా
పోతే
యింతకంటే
పాపమున్నదా!
విశ్వస్వరూపుడైన
భగవంతుడే
వచ్చి
నా
దగ్గర
చేయి
చాపుతున్నాడు.
ఏమైనా
యిస్తాను
నీ
మాట
వినను
అన్నాడు.
అక్కడ
గురువాజ్ఞ
మీరినవాడు
బలిచక్రవర్తి.
తల్లి
ఆజ్ఞ
మీరిన
వాడు
భరతుడు.
తండ్రి
ఆజ్ఞ
మీరినవాడు
ప్రహ్లాదుడు.
చూచారా
తల్లి
తండ్రి
గురువు
వారి
ఆజ్ఞ
మీరిన
వారికి
వీరందరికి
మోక్షము
ఎట్లా
వచ్చింది?
ఎందుకంటే
దైవ
విషయములో
మీరారు.
రాముని
అరణ్యమునకు
పంపించి
నాకు
రాష్ట్రము
కట్టటము.
ఛీ!
నేను
ఒప్పుకొను
అన్నాడు
భరతుడు.
ఇంక
తండ్రి
హిరణ్యకశిపుడు.
ఎందుకోసం
కుమారుని
చంపటానికి
వచ్చాడు?
ఓం
నమోనారాయణాయ
అంటూ
నారాయణ
నామస్మరణ,
యీ
దుర్మార్గునికి
యిష్టము
లేదు.
ఏమైనా
చేయి,
నారాయణుడు
నాకు
కావాలన్నాడు
ప్రహ్లాదుడు.
అంతటి
గొప్ప
భక్తిగలవాడు
కనుక
అన్నింటిని
సాధిస్తూ
వచ్చాడు.
అలాంటి
ధైర్య
సాహసముతో
ఉండాలి.
ఎన్ని
హింసలో
పెట్టాడు
తండ్రి.
పర్వతముపైనుండి
నెట్టించాడు.
శూలాలతో
పొడిపించాడు.
ఏనుగులతో
తొక్కించాడు.
పాములచేత
కరిపించాడు.
అగ్నిలో
వేశాడు.
ఎన్ని
చేసినా
ఏమీ
కాలేదు.
19
▾
Meaning
Keep
చండామార్కులు
వచ్చి
మొత్తుకుంటున్నారు
పాపం.
తన్ను
నిశాచరులు
పొదవ
దైత్యకుమారుడు
మాటి
మాట.
ఎవరైనా
కొట్టినప్పుడు
అమ్మా
అబ్బా
అంటారు.
నారాయణ
నారాయణ
అన్నాడు
ప్రహ్లాదుడు.
అంతా
నారాయణుడే
అయిపోయినాడు.
పాములు
కూడా
నారాయణ
అయిపోయినప్పుడు
పర్వతములు
కూడా
నారాయణుడే.
మన
హృదయము
పవిత్రమైన
నామములో
ఉంటే
సర్వము
పవిత్రమే
అవుతుంది.
ప్రేమస్వరూపులారా!
ఈనాడు
నూతన
సంవత్సరమని
మీరు
భావిస్తున్నారు.
నూతన
భావాలు
మీరు
అభివృద్ధి
పరచుకోండి.
ఆదర్శవంతమైన
జీవితాన్ని
మీరు
అందుకొని
యావత్
భారతదేశానికి
ఆదర్శ
జీవితాన్ని
అందిస్తారని
నేను
ఆశిస్తూ
నూతన
సంవత్సరములో
భగవంతుని
శరణాగతి
అనే
తత్త్వాన్ని
చక్కగా
అర్ధము
చేసుకోమని
కోరుతున్నాను.
మీరు
భగవంతుని
సమీపమునకు
పోవటానికి
తగిన
ప్రయత్నం
చేయాలి.
దూరముగా
ఉండకూడదు.
మధ్యలో
ఏ
వెంట్రుక
పట్టకూడదు.
అంతటి
సమీపులుగా
రావాలి.
శరీర,
మానసిక,
ఆధ్యాత్మికంగా
కూడా
దైవానికి
దగ్గరవ్వాలి.
కేవలం
శారీరకంగా
దగ్గరుంటే
ఏమి
ప్రయోజనం.
కమలంపైన
కప్ప
ఉండినట్లుగా
ఉంటుంది.
అట్లా
కాదు,
ప్రేమతో
ఉండాలి.
ప్రేమతో
ప్రేమకు
సమీపంగా
ఉండాలి.
ఆ
ప్రేమతత్వముతో
ఎంతైనా
సాధించవచ్చు.
Previous
←
The Foolish Pāduṣā
Next
Who can recognise the principle of Śrī Rāma
→