Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1998 · Only What Nurtures Human Values Is True Education
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Only What Nurtures Human Values Is True Education
10 August 1998, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
ప్రేమ
స్వరూపులైన
విద్యార్థులారా!
విద్యాబోధకులారా!
విద్యాభిమానులారా!
ప్రపంచమంతయు
దైవాధీనమై
యున్నది.
దైవము
సత్యాధీనమై
యున్నాడు.
సత్యము
ఉత్తములయొక్క
ఆధీనములో
నున్నది.
అట్టి
ఉత్తములే
దైవస్వరూపులు.
వ్యక్తివిలువ
విద్యపై
ఆధారపడి
లేదు,
సంస్కారంపై
ఆధారపడి
ఉన్నది.
సంస్కారమనగా
ఏమిటి?
చెడును
దూరం
గావించుకొని
మంచిని
అలవర్చుకోవడమే
సంస్కారము.
ప్రపంచము
మానవుని
ప్రవర్తనపై
ఆధారపడి
యున్నది.
మానవుని
ప్రవర్తన
మనస్సు
పైనను,
మనస్సు
సంకల్పములపైనను
ఆధారపడి
యున్నవి.
కనుక
మానవుడు
తన
సంకల్పములను
సత్యసంకల్పములుగా
మార్చుకోవాలి.
ఈ
సత్యసంకల్పములే
మానవతా
విలువలు.
ఈనాడు
ప్రపంచము
ఉండవలసిన
రీతిగా
ఉండకపోవడానికి
కారణమేమిటి?
మానవుని
సంకల్పములు,
చర్యలు
ఉండవలసిన
రీతిగా
ఉండటం
లేదు.
ప్రతి
మానవుని
తల,
హృదయము
రెండూ
చాల
ప్రధానమైనవి.
తల
నుండి
వెలువడే
సంకల్పములన్నీ
భౌతికమైనవి.
చదవటం,
వ్రాయటం,
తినటం,
తిరగటం,
సంపాదించటం,
కూడబెట్టటం
-
ఇవన్నీ
తల
నుండి
ఆరంభమౌతాయి.
ఇవి
ప్రవృత్తి
లక్షణాలు.
దయ,
సహనము,
సానుభూతి,
సత్యము
ఇత్యాది
పవిత్ర
భావాలు
హృదయం
నుండి
వెలువడుతుంటాయి.
ఇవి
నివృత్తి
లక్షణాలు.
ఈ
ప్రపంచమంతయు
ప్రవృత్తీ
నివృత్తుల
స్వరూపమే.
ఇందులో
ఏ
ఒక్కటి
లేకపోయినా
మానవుడు
నిలువజాలడు.
మొక్క
వృక్షమై
ఫలపుష్పముల
నందించినట్లుగా
మానవుని
సంకల్పములు
కార్యరూపము
దాల్చి
మంచిచెడ్డలనే
ఫలితముల
నందిస్తున్నవి.
కనుక
సంకల్పములను
పవిత్రమైనవిగా
ఉంచుకోవాలి.
దేహము
చేయుటకు,
మనస్సు
తలంచుటకు
ఆత్మ
ఉండుటకు
సంబంధించినవి.
కనుక
చేయుట,
తలంచుట,
ఉండుట
-
ఈ
మూడింటి
చేరికయే
మానవత్వం.
2
▾
Meaning
Keep
His poems 367
Also in his talks
(1)
14 January 1996
There is no wealth greater than Prema
దేహం
మనస్సుతోను,
ఆత్మతోను
సంబంధం
లేకుండా
సంచరించడం
పశుత్వం.
మనస్సు
దేహంతోను,
ఆత్మతోను
సంబంధం
లేకుండా
ప్రవర్తించడం
రాక్షసత్వం.
ఇంక
ఆత్మ
దేహంతోను,
మనస్సుతోను
సంబంధం
లేకుండా
స్వేచ్ఛగా
ప్రవర్తించడం
దైవత్వం.
దేహము,
మనస్సు,
ఆత్మ
-
ఈ
మూడింటి
సమ్మిళిత
స్వరూపమే
మానవత్వం.
మంచితనము
కలవాడే
మానవుడు.
ఈ
మంచితనము
చదువుల
వల్ల
లభించేది
కాదు,
మానవతా
విలువలవల్లనే
లభిస్తుంది.
విలువలు
విద్యకోసం,
విద్య
జీవితంకోసం,
జీవితం
మనిషికోసం,
మనిషి
సమాజంకోసం,
సమాజం
సైన్సుకోసం,
సైన్సు
ఆధ్యాత్మికంకోసం,
ఆధ్యాత్మికం
దేశంకోసం,
దేశం
ప్రపంచంకోసం,
ప్రపంచం
శాంతికోసం!
శాంతి
సంతోషములకు
మానవతా
విలువలే
మూలాధారములు.
మానవతా
విలువలే
లేకుండిన
మానవుడు
శాంతిని
పొందలేడు.
ఈనాటి
మానవుడు
విషయపరిజ్ఞానమే
విద్యయొక్క
లక్ష్యంగా
భావిస్తున్నాడు.
కానీ
ఈ
పరిజ్ఞానము
(ఇన్ఫర్మేషన్)
మానవత్వాన్ని
పోషించలేదు.
ఇది
మానవుణ్ణి
కేవలం
ఒక
యంత్రంగా
మారుస్తున్నది.
ఇది
మానవుణ్ణి
ఒక
కంప్యూటర్‌గా
మారుస్తున్నది
గాని
కంపోజర్‌గా
మార్చటం
లేదు.
కంప్యూటర్
కావడం
గొప్పతనం
కాదు,
కంపోజర్
కావాలి.
ఈనాడు
ప్రభుత్వం
వారు
ప్రతి
పల్లెయందు,
ప్రతివాడయందు
విద్యాసంస్థలను
నెలకొల్పి
దేశంలో
విద్య
చాల
ప్రోగ్రెస్
(అభివృద్ధి)
చెందినదని
భావిస్తున్నారు.
‘కూడు
పెట్టినవానినే
కూలద్రోయు
విద్య
నేర్పినవానినే
వెక్కిరించు
మేలు
చేసినవానికే
కీడు
చేయు
ఇదియె
‘ప్రోగ్రెస్సు’
ఈనాటి
విద్యలందు’
‘నిత్యసత్య
ప్రకృతులన్ని
వికృతిరూపుపొందుచుండె
పవిత్ర
ప్రకృతి
ప్రతి
దినము
ప్రజల
వీడి
పోవుచుండె
ఆర్యవేద
విద్య
లణగె,
దుర్విద్యలు
పెరుగుచుండె!’
ఇదియా
ప్రోగ్రెస్సు?
కాదు,
కాదు.
దయాధర్మములతో
కూడిన
మానవత్వాన్ని
విద్యార్థి
ప్రకటించాలి.
సత్యనిత్యమైన
చదువులను
చదవాలి.
అసత్య
నిర్మూలనకు
కంకణం
కట్టుకోవాలి.
పల్లెపల్లెలో
ప్రవేశించి,
మానవతా
విలువలను
బోధించి,
ప్రజలను
సరియైన
మార్గంలో
తేవడానికి
తగిన
కృషి
చేయాలి.
3
▾
Meaning
Keep
పరమ
పావనమైనది
భారతావని
అనాది
కాలము
నుండి
భారతదేశం
అన్ని
దేశములకూ
ఆదర్శప్రాయంగా
నిలిచింది.
భారత
దేశం
యొక్క
గాలిలో
సత్యమున్నది,
ధూళిలో
ధర్మమున్నది,
మట్టిలో
ప్రేమ
ఉన్నది,
గంగలో
త్యాగమున్నది,
మనిషిలో
క్షమ
ఉన్నది.
కనుకనే
విదేశీయులు
కూడా
భారత
దేశంలో
జీవించాలని
అనేక
ప్రయత్నాలు
చేశారు.
ప్రాచీనకాలంలో
భారతీయులు
త్యాగానికి
కంకణం
కట్టారు,
ధర్మాన్ని
వరించారు,
సత్యానికి
స్వాగతం
పలికారు.
ఇతరులు
తమపై
దండెత్తినప్పుడు
వారిని
ఎదుర్కోవలసి
వచ్చింది
గాని
భారతీయులు
తమంతట
తాముగా
ఏ
దేశముపైనను
దండెత్తి
పోలేదు,
ఎవరి
సొత్తునూ
ఆశించలేదు.
భారతీయులు
స్వార్థత్యాగులు.
హరిశ్చంద్రుడు
సత్యం
కోసం
తన
సర్వస్వాన్ని
త్యాగం
చేశాడు.
చంద్రమతి
తన
సత్యమహిమచేత
దావాగ్నిని
సహితం
చల్లార్చింది.
శిబి
చక్రవర్తి
ఒక
పక్షిని
రక్షించే
నిమిత్తం
తన
కండరాలను
కూడా
కోసిచ్చాడు.
ఇలాంటి
మహాత్యాగులు,
వీరులు,
శూరులు,
గంభీరులైన
స్త్రీ,
పురుషులుద్భవించిన
పవిత్రభూమి
ఈ
భారతదేశం.
ఇట్టి
త్యాగభూమిని,
యోగభూమిని,
కర్మభూమిని
భోగభూమిగా
మార్చుకోవడానికి
ఈనాటి
విద్యార్థులు
ప్రయత్నిస్తున్నారు.
ఏకత్వం
నుండియే
అనేకత్వం
మట్టి
నుండి
పుట్టిన
కుండ
మట్టి
కాక
మరొకటవుతుందా?
బంగారు
నుండి
పుట్టిన
నగ
బంగారుగానే
ఉంటుంది
కదా!
అదేవిధంగా
బ్రహ్మ
నుండి
పుట్టిన
ఈ
ప్రకృతి
అంతయు
బ్రహ్మమయమే,
మానవులందరూ
దైవస్వరూపులే.
రూపనామములు
వేరు
వేరుగా
గోచరించినప్పటికీ
అన్నింటిలోను
ఫండమెంటల్
శక్తి
ఒకటిగానే
ఉన్నది.
ప్రత్తి
చేత
దారము
తయారవుతున్నది,
దారముల
చేరికచేత
వస్త్రము
ఏర్పడుతున్నది.
కనుక
ప్రత్తి,
దారము,
ప్రకృతి,
మానవత్వం
మూడూ
ఒక్కటే.
‘ఈశ్వర
స్సర్వ
భూతానం’,
‘సర్వం
ఖల్విదం
బ్రహ్మ’.
ఉన్నది
ఒక్కటే,
రెండవది
లేనే
లేదు.
నిన్న
ఒక
అమెరికన్
పిల్లవానిని
‘నీ
వయస్సెంత?’
అని
అడిగాను.
ఏడు
సంవత్సరాలని
చెప్పాడు.
‘నీ
కెట్లా
తెలుసు?’
అని
అడిగాను.
‘మా
అమ్మ,
నాన్న
చెప్పారు’
అన్నాడు.
అప్పుడు
నేను
చెప్పాను
-
‘ఏడు
ఒకట్లు
చేరినప్పుడే
ఏడు
ఏర్పడింది.
4
▾
Meaning
Keep
ఒకటి
లేక
ఏడు
లేదు.
అదేవిధంగా
అనేకత్వమంతా
ఏకత్వంలోనే
ఇమిడి
ఉన్నది.
అన్నింటి
యందు
ఏకత్వంగా
ఉన్న
దైవత్వం
ఒక్కటే.
కానీ
మానవులు
దీనిని
నమ్మలేకపోతున్నారు.
దేహము,
దేశము
బింబ
ప్రతిబింబములే
ఆత్మ
విశ్వాసం
లేనివానికి
ఆనందం
లభించదు.
తనను
తాను
నమ్మలేనివానికి
ఆనందం
ఎక్కడి
నుండి
లభిస్తుంది?
మొట్టమొదట
తనను
తాను
నమ్మాలి,
ఆత్మవిశ్వాసమే
శ్వాసగా
భావించుకోవాలి.
ఆత్మవిశ్వాసంతోపాటు
దేశవిశ్వాసమును
కూడా
పెంచుకోవాలి.
శ్రీరాముడు
చెప్పాడు:
‘జననీ
జన్మభూమిశ్చ
స్వర్గాదపి
గరీయసి’.
దేహము,
దేశము
బింబ
ప్రతిబింబములే.
కనుక
ఏది
చేసినా
దేశక్షేమమును,
దేశపవిత్రతను
దృష్టిలో
ఉంచుకోవాలి.
ప్రతి
మానవుడు
మొట్టమొదట
వ్యక్తిగత
శీలమును
పోషించుకోవాలి,
సంఘనియమాలను
పాటించాలి,
విశ్వము
యొక్క
తత్త్వాన్ని
గుర్తించాలి.
కనుకనే
వ్యక్తి
పరిణామము
-
ఈ
మూడింటినీ
చక్కగా
చేకూర్చుతున్నాడు.
సాయి
(SAI).
S
-
Spiritual
Transformation
(ఆధ్యాత్మిక
పరిణామము),
A
-
Association
Transformation
(సమాజ
పరిణామము),
I
-
Individual
Transformation
(వ్యక్తి
పరిణామము).
ఈ
మూడూ
ఈనాడు
అత్యవసరం.
దయ
లేనివాడు
మనిషే
కాడు
విద్యార్థులారా!
మీతోపాటు
మీ
సమాజమును,
మీ
గ్రామమును,
మీ
పట్టణమును
కూడా
తగినరీతిగా
అభివృద్ధి
పర్చడానికి
కృషి
చేయండి.
డిగ్రీలను
అందుకోవడంతో
మీ
చదువు
పూర్తియైనట్లుగా
భావించకూడదు,
మీ
చదువును
పూర్తియైనట్లుగా
భావించ
కూడదు,
మీ
చదువును
తోటి
వారికి
అందించుటకు
కృషి
చేయాలి.
మీరు
దయామయులుగా
ఉండాలి,
తోటివారిని
దయాస్వరూపులుగా
మార్చాలి.
దయలేనిది
హృదయమే
కాదు,
అది
ఉక్కు
గుండువంటిది,
బండరాయి
వంటిది.
ఆంగ్లభాషలో
మానవులను
Mankind
అన్నారు.
Kindness
(దయ)
లేనివాడు
Man
(మనిషి)
ఎట్లా
అవుతాడు?
కనుక
మీరు
దయను
పెంచుకోవాలి.
మీకు
విరోధి
అనేవాడే
ఉండకూడదు.
అయితే
కొన్ని
సందర్భాలలో
కొందరిని
సన్మార్గంలో
పెట్టే
నిమిత్తం
కొంత
కోపం
నటించవలసి
వస్తుంది.
దానిని
కూడా
సాధ్యమైనంత
వరకు
కంట్రోల్
చేసుకోవాలి.
5
▾
Meaning
Keep
దానమే
చేతికి
అలంకారం
విద్యార్థులారా!
మీరు
ప్రప్రథమంగా
విద్య
ఉద్యోగాలకోసమనే
చెత్తభావాన్ని
మీ
హృదయం
నుండి
దూరం
చేసుకోండి.
కుటుంబ
పోషణకు
ఉద్యోగాలు
అవసరమే.
కానీ
కేవలం
కుటుంబ
పోషణ
నిమిత్తమై
ఏర్పడినది
కాదు
విద్య.
ఏ
విద్యలూ
లేనివారు
కుటుంబాలను
పోషించుకోవడం
లేదా?
కనుక
మన
ప్రాచీన
భారతీయ
సంస్కృతి
తత్వాన్ని
చక్కగా
విచారణ
చేయండి.
‘హస్తస్య
భూషణం
దానం,
సత్యం
కంఠస్య
భూషణం’.
దానమే
చేతికి
అలంకారం.
దానముచేత
మీరు
దయామయులుగా
రూపొందాలి.
త్యాగమే
నిజమైన
భోగము,
అది
లేకపోవడమే
ఒక
రోగము.
అట్టి
రోగానికి
మీరు
బలి
కాకూడదు,
త్యాగానికి
దగ్గర
కావాలి.
అప్పుడే
మానవత్వాన్ని
చక్కగా
పోషించుకున్నవారవుతారు.
మనిషి
మరణించినా
విలువలు
శాశ్వతం
మనిషికున్న
విలువ
మరి
దేనికీ
లేదీ
లోకంలో.
బంగారానికి
విలువ
ఇచ్చేది
ఎవరు?
మనిషే.
భూమికి
విలువ
ఇచ్చేది
ఎవరు?
మనిషే.
అన్నింటికీ
విలువ
ఇచ్చే
మనిషి
తన
విలువను
మాత్రం
కోల్పోతున్నాడు.
కారణమేమిటి?
మానవతా
విలువలను
పోషించుకోవడం
లేదు.
విలువలే
శాశ్వతమైనవి.
మనిషి
మరణించినా
విలువలు
శాశ్వతంగా
నిలుస్తాయి.
ఇలాంటి
మానవత్వాన్ని
చిల్లర
మార్గంలో
ప్రవేశపెట్టడం
చాల
పొరపాటు.
మానవుడుగా
పుట్టడంలో
గొప్పతనం
లేదు,
మానవతా
విలువలను
పోషించుకోవాలి.
అనేకమంది
పుట్టిన
తేది
చాల
ప్రధానమైనదని
భావించి,
దాని
మంచిచెడ్డలను
గురించి
విచారణ
చేస్తుంటారు.
కానీ
మరణమే
పునర్జన్మమునకు
పునాది.
కనుక
మరణించే
ముందు
మంచిపేరు
తెచ్చుకోవాలి,
దైవకృపకు
పాత్రులు
కావాలి,
దైవ
ప్రేమను
పెంచుకోవాలి.
ప్రేమ
లేని
జీవితం
దీపం
లేని
ఇల్లువంటిది,
చెల్లని
కాసువంటిది.
‘వెల్కమ్’
లేదు,
‘సెన్డాఫ్’
లేదు
విద్యార్థులారా!
ఈనాడు
మనం
వైస్
చాన్స్‌లర్‌గా
వెంకట్రామన్
స్థానంలో
గిరిగారిని
తీసుకున్నాము.
అయితే
నేను
ఎవ్వరికీ
‘వెల్కమ్’
చెప్పడం
లేదు,
‘సెన్డాఫ్’
ఇవ్వడం
లేదు.
6
▾
Meaning
Keep
‘వెల్కమ్’
చెపితే
కదా
‘సెన్డాఫ్’
ఇచ్చేది!
కనుక
నేను
క్రొత్త
వైస్‌చాన్స్‌లర్‌కు
‘వెల్కమ్’
చెప్పడం
లేదు,
పాత
వైస్‌చాన్స్‌లర్‌కు
‘సెన్డాఫ్’
ఇవ్వడం
లేదు.
ఎందుకంటే
ఇద్దరూ
మనవారే.
ఇప్పుడే
వెంకట్రామన్
చెప్పాడు
కదా
స్వామి
తనకు
ఏ
సేవ
ఇచ్చినా
చేస్తానని.
కనుక
అతనిని
మేమెక్కడికీ
పంపడం
లేదు.
అతనిని
ఇక్కడే
ఉంచుకొని
ఇక్కడి
సూపర్
స్పెషాలిటీ
హాస్పిటల్‌కు
సంబంధించిన
ఒక
ప్రాజెక్టును
అప్పగిస్తున్నాము.
పదవులు
మారవచ్చుగాని
మనుష్యులు
ఎక్కడికీ
పోవడం
లేదు.
సేవాతత్పరులైన
వైస్
చాన్స్లర్లు
మొట్టమొదటి
వైస్
చాన్స్‌లర్
గోకాక్
గొప్ప
పండితుడు,
జ్ఞాని.
మహా
సాధకుడు,
గొప్ప
యోగివంటివాడు.
అతడిక్కడ
ఒక్క
నయాపైసా
ముట్టకుండా
ఫ్రీగా
సేవ
చేశాడు.
రాత్రింబవళ్ళు
కష్టపడి
మన
సంస్థను
తన
స్వంత
ఇల్లువలె
చూసుకున్నాడు.
గవర్నమెంటు
నిబంధనల
ప్రకారం
రిటైర్మెంటు
తరువాత
ఎవరైనా
మూడు
సంవత్సరములకు
మించి
వైస్
చాన్స్‌లర్‌గా
ఉండటానికి
వీల్లేదు.
కనుక
గోకాక్
తరువాత
సరాఫ్
వచ్చాడు.
అతను
కూడా
చాల
గొప్పవాడే.
అతడు
యు.జి.సి.లో
మెంబర్‌గా
పని
చేశాడు.
అతను
ఇక్కడకు
వచ్చి
మూడు
సంవత్సరములు
పని
చేసిన
తరువాత
సంపత్
వచ్చాడు.
అతను
కూడా
చాల
గొప్పవాడు,
కాన్పూర్
ఐ.ఐ.టి.
యొక్క
డైరెక్టర్‌గా
పనిచేశాడు.
కంప్యూటర్
సైన్సులో
చాల
ప్రసిద్ధి
పొందినవాడు.
అతను
కూడా
ఇక్కడ
చాల
శ్రద్ధగా
పని
చేశాడు.
తరువాత
హనుమంతప్ప
వచ్చాడు.
వీరెవ్వరూ
ఒక్క
నయాపైస
కూడా
ఆశించలేదు.
నేనిచ్చినా
పుచ్చుకోలేదు.
‘మీ
దయ
తప్ప
మాకు
ఏమీ
అక్కరలేదు’
అన్నారు.
తరువాత
ఈ
వెంకట్రామన్
వచ్చాడు.
ఇతను
కూడా
ఎంతో
శ్రద్ధాభక్తులతో
రాత్రింబవళ్ళు
పనిచేశాడు.
ఇతను
సర్
సి.వి.రామన్
శిష్యుడు,
‘పద్మశ్రీ’
బిరుదును
పొందినవాడు.
కానీ
మనిషి
చూడటానికి
చాల
సింపుల్‌గా
కనిపిస్తాడు.
ఎంతటి
గొప్పవారైనా
సరే,
ఈ
ప్రశాంతి
నిలయంలో
సింపుల్‌గానే
కనిపిస్తారు.
అదేవిధంగా
వెంకట్రామన్
కూడా
మన
ప్రశాంతి
నిలయంలో
చాల
సింపుల్‌గా
జీవిస్తూ
వచ్చాడు.
ఇతని
తరువాత
ఇప్పుడు
వైస్
చాన్స్‌లర్‌గా
గిరి
వచ్చాడు.
ఆయన
సెంట్రల్
విజిలెన్స్
కమీషనర్‌గా
పనిచేశాడు.
ఇంకా
ఆయనకు
ఐదు
సంవత్సరాల
సర్వీసు
ఉన్నది.
కానీ
ఆ
పనిని
వదిలి
పెట్టి
ఇక్కడికి
వచ్చాడు.
యథార్థం
చెప్పాలంటే
అతని
తోటివారు
పోవద్దన్నారు,
అతని
రాజీనామా
పత్రంపై
ప్రైమ్
మినిష్టర్
వాజ్‌పేయి
సంతకం
చేయడానికి
ముందు
ఇష్టపడలేదు.
7
▾
Meaning
Keep
కానీ
గిరి
గట్టిగా
పట్టు
పట్టాడు.
‘సార్!
నేను
పుట్టపర్తికి
పోవడానికి
నిశ్చయించుకున్నాను.
మీరేమైనా
చేసుకోండి,
నేనిక్కడ
ఉండను’
అన్నాడు.
వాజ్‌పేయి
కూడా
స్వామిభక్తుడు
కనుక
‘నీవు
ఇంకో
చోటకు
పోతానంటే
అడ్డు
పడేవాడను
గాని
ప్రశాంతి
నిలయానికి
పోదల్చుకున్నావు
కాబట్టి
నేను
అంగీకరించక
తప్పదు’
అని
రెండవ
దినమే
సంతకం
చేశాడు.
మూడవ
దినమే
గిరి
ఇక్కడకు
వచ్చేశాడు.
విద్యార్థులారా!
స్వామిపైనున్న
ప్రేమచేతనే,
మీపైనున్న
విశ్వాసముచేతనే
ఎవ్వరికీ
చిక్కని
ఇలాంటి
పవిత్ర
హృదయులైన
వైస్
చాన్స్లర్లు
మీకు
చిక్కుతున్నారు,
దక్కుతున్నారు.
తెల్లవారినది
మొదలు
రాత్రి
వరకు
ఎంతో
కష్టపడి
పని
చేస్తున్నారు.
ఏ
యూనివర్సిటీలోను
వైస్చాన్స్లర్లు
ఇంతగా
పనిచేయరు.
ఇలాంటి
వైస్చాన్స్లర్లను
సద్వినియోగపర్చుకోండి.
ఇలాంటి
అవకాశం
మీకు
చిక్కటం
దక్కడం
చాల
అదృష్టం.
అయితే
ఆ
వైస్
చాన్స్లర్లకు
కూడా
ఇలాంటి
మంచి
పిల్లలు
చిక్కటం
చాల
అదృష్టమే.
సద్బుద్ధి
కలిగిన
పిల్లలుండటం
చేతనే
సమాచార
సంపన్నులైన
వైస్
చాన్స్లర్లు
చిక్కుతున్నారు.
విద్యార్థుల
బాధ్యత
విద్యార్థులారా!
మీరు
యావద్భారత
దేశంలోనే
కాకుండా
అన్ని
దేశములలోను
ప్రవేశించి,
ఆదర్శమును
చాటి,
విద్య
నిజతత్వమును
బోధించి,
సరియైన
అభివృద్ధికి
తెప్పించాలి.
తప్పక
మీరు
తెప్పిస్తారు.
అలాంటి
జ్యోతులే
మీరు.
మిమ్మల్ని
మాత్రమే
మీరు
ఉద్ధరించు
కోవడానికి
ఇక్కడకు
రాకూడదు.
సమాజాన్ని,
దేశాన్ని
కూడా
ఉద్ధరించాలి.
అప్పుడే
మీరు
చదివిన
చదువు
సార్థకమవుతుంది.
భారత
దేశం
ప్రాచీన
సంస్కృతిని
పునరుద్ధరించాలని
గట్టిగా
పట్టుపట్టండి.
మేక్స్ముల్లర్
భారతదేశంలోనున్న
పవిత్రత
మరే
దేశములోను
లేదన్నాడు.
భారతదేశంలోనే
మరణించాలని
ఎంతో
ఆశించాడు.
కానీ
ఆశించిన
తక్షణమే
అన్నీ
నెరవేరుతాయా?
అతని
కోరిక
ఫలించలేదు.
ఇలాంటి
పవిత్ర
భారత
మాత
పుత్రులైన
మీరు
ఎంతో
అదృష్టవంతులు.
ఆ
తల్లి
కంటి
నీరు
పెట్టకుండా
చూడవలసిన
బాధ్యత
మీపై
నున్నది.
ఆమెను
సంతోషపెట్టడానికి
తగిన
త్యాగానికి
పూనుకోండి.
కేవలం
ఒక్క
భారతదేశం
మాత్రమే
కాదు,
యావత్ప్రపంచమూ
క్షేమంగా
ఉండాలని
కోరుకోండి.
8
▾
Meaning
Keep
ఈ
ప్రపంచమనే
పెద్ద
గృహంలో
ఒక్కొక్కదేశం
ఒక్కొక్క
రూము
వంటిది.
అన్ని
రూములలోను
ఉన్నది
మీ
బ్రదర్స్,
సిస్టర్సే!
కనుక
అందరి
క్షేమాన్ని
కోరుకోండి.
ప్రేమస్వరూపులారా!
ఈనాడు
నేనసలు
మాట్లాడకూడదనుకున్నాను
గాని
మిమ్మల్ని
నిరాశపర్చడం
ఇష్టం
లేక
ఇంతసేపు
మాట్లాడినాను.
మీరు
స్వామి
వాక్యాలను
వ్యర్థం
చేయరని
నాకు
తెలుసు.
వీటిని
ఆచరణలో
పెట్టి,
అనుభవించి,
పదిమందికి
అందించడానికి
ప్రయత్నిస్తారని
నేను
ఆశిస్తున్నాను.
Previous
←
By God's Grace Anything Can Be Achieved
Next
Prema Alone Is the Path, Prema Alone the Goal
→