Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2002 · Business in the Spiritual Field Is Treason against God
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Business in the Spiritual Field Is Treason against God
22 July 2002, International Seva Conference, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
సర్వజీవస్థితం
యో
మాం
భజ
త్యేకత్వ
మాస్థితః
సర్వథా
వర్తమానోపి
స
యోగీ
మయి
వర్తతే
ప్రేమస్వరూపులారా!
సర్వజీవులయందున్న
ఆత్మ,
తనయందున్న
ఆత్మ
ఒక్కటేయని
గుర్తించిన
వ్యక్తి
నిరంతరము
దైవసన్నిధియందే
జీవిస్తుంటాడు.
అట్టివాడు
రాగియైనా,
విరాగియైనా,
బైరాగియైనా,
సన్యాసియైనా
సర్వకాలసర్వావస్థలయందు
దైవసన్నిధియే
తన
పెన్నిధిగా
భావిస్తాడు.
మానవుడు
చేయవలసిందేమిటి?
“సర్వతః
పాణి
పాదం
తత్సర్వతోక్షి
శిరోముఖమ్”,
సర్వజీవులయందున్న
ఆత్మతత్త్వం
ఒక్కటే
అనే
సత్యాన్ని
గుర్తించాలి.
ఈ
సత్యాన్ని
అర్థం
చేసుకోలేక
మానవుడు
యథార్థమును
మరచి
అనర్థములో
పడిపోతున్నాడు.
“దేహమే
నేను”
అనే
పిచ్చిభ్రాంతిచేత
అనిత్యమైన
దేహతత్త్వాన్ని
విశ్వసించి
తన
నిజస్వరూపాన్ని
విస్మరిస్తున్నాడు;
స్వార్థస్వప్రయోజనములకు
అత్యంత
ప్రాధాన్యతనిస్తున్నాడు.
ఆ
తరువాత
సమాజంపై
దృష్టిపెడుతున్నాడు.
చిట్టచివరికి
ఆధ్యాత్మికమార్గంలో
ప్రవేశిస్తున్నాడు.
కనుకనే,
తాను
తెలుసుకోవలసిన
సత్యాన్ని
తెలుసుకోలేక
అవస్థపడుతున్నాడు.
SAI
(సాయి)
అనే
పదములోని
మూడక్షరాలలో
S
అనగా
Spirituality
(ఆధ్యాత్మికత),
A
అనగా
Association
(సమాజము),
I
అనగా
Individual
(వ్యక్తి).
కనుక,
మానవుడు
మొట్టమొదట
ఆధ్యాత్మిక
తత్త్వమును
అర్థము
చేసుకోవాలి;
తరువాత
సమాజాభివృద్ధికై
పాటు
పడాలి;
స్వార్థస్వప్రయోజనాలను
చివరికి
నెట్టాలి.
SAI
(సాయి)
యొక్క
సందేశమిదియే.
మొట్టమొదట
Spirituality,
తరువాత
Association,
చివరికి
Individual
-
ఇదే
సరియైన
మార్గం.
కాని,
ఈనాటి
మానవుడు
‘రివర్స్’
మార్గాన్ని
అనుసరిస్తున్నాడు.
అనగా,
మొట్టమొదట
Individual,
తరువాత
Association,
చివరికి
Spirituality
-
ఈరీతిగా
వెనుకకు
ప్రయాణం
చేస్తున్నాడు.
2
▾
Meaning
Keep
తత్ఫలితంగా
దైవసన్నిధికి
దూరమైపోతున్నాడు.
మొట్టమొదట
మానవుడు
ఆధ్యాత్మిక
మార్గంలో
ప్రవేశించి,
ఏకత్వాన్ని
అర్థం
చేసుకొని,
సమాజసేవలో
పాల్గొనాలి.
అప్పుడే
తాను
అభివృద్ధికి
రాగలడు.
అట్లుగాకుండా,
ప్రప్రథమంలో
స్వార్థంపై
దృష్టి
పెడితే
తనకు
ఆధ్యాత్మికతత్త్వము
ఏమాత్రం
అర్థం
కాదు.
హిరణ్యాక్షుడు,
హిరణ్యకశిపుడు,
కంసుడు-
వీరందరూ
ఆధ్యాత్మికతను
దూరంపెట్టి,
కేవలం
తమ
స్వార్థంకోసం
పాటుపడ్డారు.
హిరణ్యకశిపుడు
సైంటిస్టులలోకెల్లా
మొదటివాడు.
కాని,
సైన్సును
ఎంత
తెలుసుకున్నప్పటికీ
ప్రయోజనమేమిటి?
‘ఈ
పదార్థము
ఎక్కడి
నుండి
వచ్చింది?
ఎట్లా
పుట్టింది?’
మొదలైన
విషయాలను
తెలుసుకోవడంవల్ల
మనకు
కలిగే
ఆనందమేమీ
లేదు.
హిరణ్యాక్షుడు,
హిరణ్యకశిపుడు
తమ
హృదయము
నిండా
నెగెటివ్
భావములను
నింపుకున్నారు.
కనుకనే,
ఎంత
శక్తిసామర్థ్యములున్నప్పటికీ
వారు
దైవత్వమును
పొందలేకపోయారు.
అదేరీతిగా,
మానవుడు
లౌకికమైన,
ప్రాకృతమైన
వస్తువులనే
ఆశిస్తూ
తన
శక్తిని
దుర్వినియోగము
చేసుకుంటున్నాడు.
తాను
ఎంత
గొప్ప
శక్తి,
సామర్థ్యములు
కలవాడైనప్పటికీ
దైవత్వమును
పొందలేకపోతున్నాడు.
కనుకనే,
ఉపనిషత్తులు
మానవునికి
“ఉత్తిష్ఠత
జాగ్రత
ప్రాప్యవరాన్నిబోధత”
అని
హెచ్చరిక
చేస్తున్నాయి.
“ఓ
పిచ్చివాడా!
అజ్ఞానమనే
నిద్రనుండి
మేలుకో.
ప్రజ్ఞానమనే
సూర్యోదయముపై
దృష్టిమరల్చు.
తమోగుణమును
దూరంచేసుకో.
ప్రాకృతమైన
వాంఛలను
విడిచిపెట్టు.
జగత్తు
అనిత్యము,
అశాశ్వతమని
అర్థం
చేసుకో”,
అని
బోధిస్తున్నాయి.
“ఇందుగలడందు
లేడని
సందేహము
వలదు...”
హిరణ్యకశిపుడు
సృష్టిరహస్యమును
పరిశోధన
చేశాడు,
గ్రహ
గతులను
మార్పుచేయడానికి
ప్రయత్నించాడు.
కాని,
దైవత్వాన్ని
కించిత్తైనా
అర్థం
చేసుకోలేకపోయాడు.
అతని
కుమారుడైన
ప్రహ్లాదుడు
చిన్నపిల్లవాడైనా
దైవత్వాన్ని
చక్కగా
అర్థం
చేసుకోగల్గాడు.
“నాయనా!
గురువులదగ్గర
నీవేమి
నేర్చుకున్నావు?”
అని
తండ్రి
ప్రశ్నించగా
ప్రహ్లాదుడు
చెప్పాడు:
3
▾
Meaning
Keep
Also in his talks
(9)
20 January 1987
Such forbearance we must cultivate
9 January 1988
God in the heart, work in the hands
1 June 1989
Man is the son of immortality!
19 March 1990
Hero becomes zero if he forgets God
16 June 1996
If the Body Is to Be Pure, Remember the Name of God
24 February 2002
God loves the inner feeling
2 June 2003
That is education which liberates
13 August 2006
For the young, mastery of the senses comes first
28 September 2006
No worry troubles those who think of God without ceasing
“చదివించిరి
నను
గురువులు;
చదివితి
ధర్మార్థ
ముఖ్యశాస్త్రంబులు;
నే
జదివినవి
గలవు
పెక్కులు;
చదువులలో
మర్మమెల్ల
జదివితి
దండ్రీ!”
హిరణ్యకశిపుడు
ఎంతో
ఆనందించి
“ఆ
మర్మమేమిటో
చెప్పు
నాయనా!”
అన్నాడు.
అప్పుడు
ప్రహ్లాదుడు,
“తండ్రీ!
సర్వత్రా
దైవత్వమే
వ్యాపించి
యున్నదని
గుర్తించాను.
ఎక్కడ
చూసినా
దైవత్వము
తప్ప
అన్యపదార్థము
నాకు
కనిపించడం
లేదు”,
అన్నాడు.
తండ్రికి
కోపం
వచ్చింది.
“ఇదా
నీవు
నేర్చుకున్నది?
ప్రాపంచిక
సంబంధమైన
అర్థ,
కామములనుగురించి
నేర్చుకోకుండా
దైవత్వాన్ని
గురించి
ఎందుకు
నేర్చుకున్నావు?
ఎక్కడున్నాడు
నీ
దేవుడు?”
అని
గద్దించాడు.
“ఇందుగలడందు
లేడని
సందేహము
వలదు
చక్రి
సర్వోపగతుం
డెందెందు
వెదకిచూసిన
అందందె
గలడు...”
అన్నాడు
ప్రహ్లాదుడు.
“అయితే,
ఈ
స్తంభములో
ఉన్నాడా?”
అని
ప్రశ్నించాడు
తండ్రి.
“ఉన్నాడు”
అన్నాడు.
అతని
భక్తివిశ్వాసములు
అచంచలమైనవి.
కనుకనే,
ఎవరెంత
ప్రయత్నించినప్పటికీ
అతని
మనసును
మార్చలేకపోయారు.
హిరణ్యకశిపుడు
ఆ
స్తంభమును
బ్రద్దలుచేయగా
అందునుండి
భగవంతుడు
ప్రత్యక్షమయ్యాడు.
దీని
అంతరార్థ
మేమిటి?
దేహభ్రాంతిని
బ్రద్దలు
చేసినప్పుడే
దైవత్వము
గోచరిస్తుంది.
కాని,
ఈనాటి
మానవుడు
ఎంతటి
గొప్ప
విద్యావంతుడైనా,
ఎంతటి
శక్తిసామర్థ్యములు
గలవాడైనా
అజ్ఞానమనే
నిద్రలో
మునిగియున్నాడు.
అచంచలమైన
భక్తి,
స్థిరమైన
చిత్తము,
దృఢమైన
విశ్వాసము
-
ఈ
మూడూ
ఉన్నప్పుడే
దైవాన్ని
ప్రత్యక్షం
చేసుకోవడానికి
వీలౌతుంది.
ప్రాకృతవాంఛలే
దుర్వాసనలకు
మూలం
మనం
పాలను
పెరుగుగా
మార్చి
దానినుండి
వెన్న
తీస్తాము.
వెన్నను
కాచి
నెయ్యి
చేస్తాము.
ఇక్కడ
పాలను
బ్రహ్మతత్త్వముతోను,
వెన్నను
జీవ
తత్త్వముతోను
పోల్చవచ్చును.
వెన్నను
కాచేటప్పుడు
అందులో
ఏమాత్రం
నీరుండకూడదు.
అంతో,
ఇంతో
నీరుంటే
కాచేటప్పుడు
దుర్వాసన
వస్తుంది.
4
▾
Meaning
Keep
నీరున్నంతవరకు
దుర్వాసన
తప్పిందికాదు.
ఆ
నీరంతా
ఆవిరైపోవాలి.
అప్పుడే
పవిత్రమైన
నెయ్యి
చిక్కుతుంది.
అదేరీతిగా,
మానవుడు
సాధన
చేసే
సమయంలో
కొన్ని
స్థాయిలకు
పోయేటప్పటికి
దుర్గుణములనే
దుర్గంధము
వెలువడుతుంది.
మనస్సులో
ప్రాకృతవాంఛలనే
నీరు
నిలిచి
యున్నంతవరకు
ఈ
‘దుర్వాసనలు’
తప్పవు.
వాటిని
నిగ్రహించుకొని
ఆ
‘నీరు’
పూర్తిగా
ఆవిరయ్యేంతవరకు
సాధన
చేయాలి.
హిరణ్యకశిపుడు,
హిరణ్యాక్షుడు
ఎంతో
గొప్పవారు.
కాని,
మనస్సులో
ప్రాకృత
వాంఛలను
చేర్చుకోవడంచేత
వారిలో
‘దుర్వాసనలు’
బయలుదేరాయి.
ప్రహ్లాదుడు
మాత్రం
దేహాభిమానమును
పూర్తిగా
త్యజించి,
మనో
బుద్ధి
చిత్తాహంకారములకు
అతీతమైనస్థితిని
పొంది
పవిత్రమైన
‘వెన్న’గా
తయారయ్యాడు.
ఈనాడు
ఎంతోమంది
భజనలు
చేస్తున్నారు,
ఉపన్యాసము
లిస్తున్నారు.
కాని,
వారి
మనస్సుయందున్న
ప్రాకృతవాంఛలనే
నీరు
ఆవిరైపోలేదు.
ఆ
‘నీరు’
ఉన్నంతవరకు
పవిత్రతను
పొందలేరు.
ఈనాటి
మానవులు
నీరు
కలిసిన
వెన్నవంటివారు.
వాళ్ళు
దుర్వాసనలకే
బాగా
అలవాటు
పడ్డారు.
భజనలు,
జపము,
ధ్యానము
ఇత్యాది
సాధనలు
ఎన్ని
చేస్తున్నప్పటికీ
ప్రాకృతమైన
వాంఛలను
త్యజించలేకపోతున్నారు.
అలాంటివారిని
భక్తులని
ఎలా
చెప్పడానికి
వీలౌతుంది?
నిజంగా
భక్తులైతే
వారిలో
ఈ
‘దుర్వాసనలు’
ఎందుకు
వస్తాయి?
శరీరములో
దుర్గంధమే,
మనస్సులో
దుర్గంధమే,
చేసే
పనులలో
దుర్గంధమే.
తమయందున్న
దుర్గంధాన్ని
తామే
గుర్తించలేకపోతున్నారు.
విశ్వాసం
అచంచలమైనదిగా
ఉండాలి
భక్తులారా!
ఎన్ని
కష్టములు,
ఎన్ని
నష్టములు
సంభవించినప్పటికీ
మీ
మనస్సు
చలించకుండా
చూసుకోవాలి.
దృఢమైన
నమ్మకమును
పెట్టుకోవాలి.
అప్పుడే
మీరు
శాంతిని
పొందగలరు.
ప్రహ్లాదుడు
తనను
తండ్రి
ఎన్ని
బాధలకు
గురిచేసినప్పటికీ
ఏమాత్రం
లక్ష్యం
చేయలేదు.
అతనికి
భగవంతునిపైగల
ప్రేమ
ఏమాత్రం
చలించలేదు.
కాని,
ఈనాటి
భక్తులు
ఏ
కించిత్తు
కష్టం
కలిగినా
ఓర్చుకోలేకపోతున్నారు;
తమ
హృదయంలో
సందేహాలకు
చోటిచ్చి
విశ్వాసాన్ని
కోల్పోతున్నారు.
విశ్వాసాన్ని
కోల్పోతే
శ్వాసను
కోల్పోయినట్లే!
5
▾
Meaning
Keep
కాబట్టి,
ఎలాంటి
పరిస్థితియందైనా
చలించని
మనసుతో,
దృఢమైన
విశ్వాసముతో
సాధన
చేయాలి.
ఇదియే
నిజమైన
భక్తి.
కేవలం
పూజలు
చేయడం,
నామం
చెప్పుకుంటూ
దారులవెంట
తిరగడం
భక్తి
కాదు.
హృదయమందు
దివ్యత్వాన్ని
ప్రతిష్ఠ
చేసుకోవాలి.
మనస్సులో
దుర్వాసనలు
ప్రవేశించకుండా
చూసుకోవాలి.
కోరికలను
పూర్తిగా
కాల్చివేయాలి.
అంతో,
ఇంతో
అవి
శేషించినా
మళ్ళీ
దుర్వాసనలు
ప్రారంభమై
దుశ్చేష్టలకు,
దురభ్యాసములకు
దారి
తీస్తాయి.
కాబట్టి,
మనస్సులో
ఏరకమైన
కోరికలూ
లేకుండా
చూసుకోవాలి.
కాని,
ఈ
కలియుగ
ప్రభావముచేత
భక్తులలోకూడా
ప్రాపంచికవాంఛలు
పెరిగిపోతున్నాయి.
కోరిక
అనేది
పందితో
సమానం.
పంది
అల్లంత
దూరంలో
ఉన్నా
మనకెంతో
దుర్వాసన
వస్తుంది.
అలాంటిదానిని
మానవుడు
తన
మనస్సులో
చేర్చుకొని
ఎలా
భరిస్తున్నాడు?
మానవుడు
చాలా
అదృష్టవంతుడే.
కాని,
తన
చేతులారా
దురదృష్టమును
కూడా
తెచ్చుకుంటున్నాడు.
తద్ద్వారా
దైవసన్నిధికి
చేరే
అర్హతను
కోల్పోతున్నాడు.
కొంతమంది
ఎన్నో
గ్రంథాలు
చదువుతుంటారు,
ఎన్నో
ఉపన్యాసాలిస్తుంటారు.
కాని,
చెప్పేది
ఒక్కటైనా
ఆచరణలో
పెట్టరు.
ఇంక,
ఉపన్యాసాలివ్వడం
దేనికోసం?
పరులను
మోసగించడంకోసమా?
అది
నిజంగా
తమను
తాము
మోసగించుకోవడమే!
తమ
హృదయాన్ని
అసత్యంతో
నింపుకుంటున్నారు,
అధర్మాన్ని
పెంచుకుంటున్నారు,
అశాంతిలో
మునిగిపోతున్నారు.
మొట్టమొదట
అసత్యమును
దూరం
చేయాలి,
అధర్మమును
కాల్చివేయాలి.
“సత్యం
వద,
ధర్మం
చర”
సత్యమే
దైవస్వరూపం.
సత్యాన్ని
దూరం
చేసుకుంటే
ఇంక
మిమ్మల్ని
ఎవరు
కాపాడగలరు?
సాధన
అంటే
చిత్తమును
పరిశుద్ధం
చేసుకోవడం
ప్రేమస్వరూపులారా!
ఏవో
గొప్ప
సాధనలు
చేస్తున్నామని
గర్వించకండి.
మొట్టమొదట
మీ
హృదయంలో
ఉన్న
‘దుర్గంధము’ను
దూరం
చేసుకోండి.
సుగుణములనే
సుగంధమును
పెంచుకోండి.
అవియే
మీకు
శాంతిని
అందించగలవు.
మీరు
పరిశుద్ధులు
కావాలి.
అది
గ్రంథపఠనంవల్ల
సాధ్యం
కాదు,
ఉపన్యాసములను
వినడంవల్ల
అంతకంటే
కాదు.
శ్రద్ధ,
భక్తి
రెండూ
ఉండాలి.
“శ్రద్ధావాన్
లభతే
జ్ఞానం.”
శ్రద్ధ
కల్గినవానికే
జ్ఞానం
లభిస్తుంది.
6
▾
Meaning
Keep
మీరు
ముఖ్యంగా
చేయవలసిన
సాధన
ఏమిటి?
చిత్తమును
పరిశుద్ధం
గావించు
కోవడమే.
ఒక
భక్తుడు
చెప్పాడు:
“చిత్తశుద్ధితో
నిన్ను
‘రామా!
రామా!’
అని
పిలుస్తున్నాను.
చిత్తశుద్ధి
లేకపోతే
నిన్ను
‘రామా!’
అని
పిలిచే
అధికారముకూడా
నాకు
లేదు.”
మలినమైన
మనస్సుతో
ఏ
నామము
తలచినా
ప్రయోజనం
లేదు.
ఈనాటి
మానవుని
మనస్సు
Pollute
(కలుషితం)
అయిపోయింది.
ఇంక,
వీనికి
భక్తి
ఎక్కడి
నుండి
వస్తుంది?
అనేకమంది
భక్తి
అనే
బురఖా
ధరించి
మోసాలు
చేస్తున్నారు.
ఎవరినీ
మనం
మోసం
చేయకూడదు.
ఎవరిని
మోసగించినా
మనల్ని
మనమే
మోసగించుకున్నవారమౌతాము.
మన
హృదయములో
ఉప్పొంగే
భావాలను
పరిశుద్ధం
చేసుకోవాలి.
ఇది
మాటలతో
అయ్యే
పని
కాదు,
చేతలలో
చూపించాలి.
మనస్సు,
మాట,
క్రియ
ఒక్కటి
కావాలి.
The
proper
study
of
mankind
is
man
అన్నారు.
భక్తిలో
వ్యాపారం
ప్రవేశించకూడదు
ఈనాడు
అనేకమంది
సాయినామమును
అడ్డుపెట్టుకొని
వ్యాపారం
చేస్తున్నారు,
అనేకవిధాలుగా
మోసాలు
చేస్తున్నారు.
ఏఏ
దేశాలకో
వెళ్ళి,
ఏఏ
ప్రాంతాలకో
వెళ్ళి
సాయినామమును
అమ్ముకొని
పొట్ట
నింపుకుంటున్నారు.
ఇది
చాలా
తప్పు.
సాయి
ఎప్పుడూ
కాసులకు
లొంగడు.
అలాంటప్పుడు
తానెవరినైనా
ఈరకమైన
వ్యాపారంలో
ప్రవేశపెడతాడా?
ఇట్టి
వ్యాపారం
చేసేవారిని
మీ
దగ్గరకుకూడా
రానివ్వకుండా
‘గెటౌట్’
అని
చెప్పండి.
భక్తిలో
వ్యాపారం
ప్రవేశించకూడదు.
మీ
సంసారమును
పోషించుకునే
నిమిత్తం
మీ
పనులు
మీరు
చేసుకోవచ్చు.
కాని,
సాయినామాన్ని
అడ్డుపెట్టుకొని
వ్యాపారం
చేయకూడదు.
ఈనాడిట్టి
వ్యాపారం
దినదినానికీ
పెరిగి
పోతున్నది.
ఈ
దేశంలోనేకాదు,
ఇంగ్లాండు,
అమెరికా,
జర్మనీ,
సింగపూరు,
మలేషియా
మొదలైన
అనేక
ఇతరదేశాలలో
కూడా
ఈ
వ్యాపారం
బయలుదేరింది.
ఇలాంటి
వ్యాపారంలో
మనం
ప్రవేశించకూడదు.
హృదయాన్ని
పరిశుద్ధంగా
పెట్టుకోవాలి.
పరిశుద్ధమైన
హృదయం
లేనివాడు
జీవచ్ఛవంతో
సమానం.
అలాంటివానికి
తద్దినాలు
పెట్టాలిగాని,
సత్కారాలు
చేయకూడదు.
వాడు
మీ
దగ్గరికి
వస్తుంటే
మీరు
దూరంగా
పోవాలి.
“త్యజ
దుర్జన
సంసర్గం,
భజ
సాధుసమాగమం,
కురు
పుణ్యమహోరాత్రం,
స్మర
నిత్యమనిత్యతాం.”
7
▾
Meaning
Keep
ఇదే
మీరు
చేయవలసింది.
పాములనైనా
మీరు
దగ్గర
పెట్టుకోవచ్చుగాని,
ఇలాంటి
దుర్మార్గులను
చేరదీయకూడదు.
ఇక్కడ
ఎన్నో
కార్యక్రమాలు
జరుగుతున్నాయి.
అయినా
నేను
ఎక్కడా
ఎవ్వరినీ
ఒక్క
నయాపైసా
అడగలేదు.
మీకు
తెలుసు
-
ఇంతవరకు
ఏనాడూ
నేను
డబ్బు
విషయంలో
ప్రవేశించలేదు.
కాని,
ఈనాటి
భక్తులకి
డబ్బే
దైవము.
డబ్బుకోసం
గడ్డి
తింటున్నారు.
ఇంతటి
దుర్మార్గాన్ని
పాల్పడేవారు
భక్తులెలా
అవుతారు?
పూర్వం
మీకు
చెప్పాను
-
తల్లి,
తండ్రి
లేని
పిల్లలను
చేరదీసి,
ఒక్కొక్కరి
పేరుతో
ఒక
లక్షరూపాయల
చొప్పున
బ్యాంకులో
డిపాజిట్
చేసి
వారిని
అభివృద్ధికి
తీసుకురావడానికి
ప్రయత్నం
చేస్తున్నాము.
కాని,
ఈనాడు
కొంతమంది
ఈ
పిల్లలనంతా
తాము
సాకుతున్నామని
చెప్పుకుంటూ
చందాలు
వసూలు
చేస్తున్నారు.
స్వామి
కోసం
చందాలు
వసూలు
చేస్తున్నామంటున్నారు.
ఇంతకంటే
స్వామికి
చేసే
మోసం
మరొకటుందా?
ఇలాంటివారు
దైవద్రోహులు.
స్వామి
పేరుతో
డబ్బు
వసూలు
చేయడాన్ని
నేనంగీకరించను.
భిక్షమైనా
ఎత్తుకోవచ్చుగాని,
డబ్బుకోసం
నాపేరు
ఉపయోగపెట్టుకోకూడదు.
స్వామికి
పూర్వవిద్యార్థుల
అభ్యర్థన
ఈరోజు
ఉదయం
కొంతమంది
‘ఓల్డ్
స్టూడెంట్స్’
నాదగ్గరికి
వచ్చారు.
మీకు
తెలుసు
-
బెంగుళూరులో
ఉండే
సి.
శ్రీనివాస్
మన
కాలేజీలోనే
చదువు
పూర్తిచేసుకున్నాడు.
తరువాత
హాస్టల్
వార్డెన్గాకూడా
పనిచేశాడు.
స్వామిసేవ
చేయాలనే
ఉద్దేశ్యంతో
అతను
బయట
ఉద్యోగం
చేయడానికి
ఇష్టపడలేదు.
స్వామికి
ఏది
ఇష్టము,
ఏది
అవసరము,
ఏ
కార్యము
చేయాలి,
అని
చక్కగా
విచారణ
చేసి,
దానికి
తగినట్లు
పనిచేస్తూ
వచ్చాడు.
ఇప్పుడు
బెంగుళూరులో
ఉన్న
హాస్పిటల్‌ను
తానే
చూసుకుంటున్నాడు.
ఈరోజు
ఉదయం
అతను
నాదగ్గరికి
వచ్చి
“ఈ
కాలంలో
స్వామి
ఇస్తున్నట్లుగా
ఉచితవిద్య,
ఉచితవైద్యము
ఎవరిస్తారు?
ఎక్కడా
ఏమాత్రం
డబ్బు
తీసుకోవడం
లేదు.
ఇది
స్వామికి
తప్ప
మరొకరికి
సాధ్యం
కాదు.
మాకు
విద్యాబుద్ధులు
నేర్పి,
మమ్మల్ని
పోషించి
ఇంతగా
అభివృద్ధికి
తెప్పించిన
స్వామికి
కృతజ్ఞతాపూర్వకంగా
మేము
ఏదైనా
సేవ
చేయాలను
కుంటున్నాము”
అన్నాడు.
ఎక్కడెక్కడ
ఏఏ
పల్లెలో
స్కూలు
లేదో
అక్కడొక
స్కూలు
కట్టించాలని
దానికి
తగిన
ప్లాను
వేసుకొని
తెచ్చాడు.
8
▾
Meaning
Keep
దానిని
ఈనాడు
స్వామి
ప్రారంభం
చేయాలని
కోరాడు.
“నాయనా!
తొందర
పడవద్దు,
తొందరపడవద్దు,”
అని
నేను
చెప్పాను.
ఈనాటి
యువకులకు
‘స్పీడు’
ఎక్కువ.
కనుకనే,
నేను
Start
early,
Drive
slowly,
Reach
safely
అని
చెబుతుంటాను.
“స్వామీ!
మేము
ఎంతోమంది
పూర్వవిద్యార్థులం
ఇక్కడున్నాము.
మమ్మల్ని
ఇంత
చదివించి,
పెంచి
పెద్దచేసినందుకు
మేము
కించిత్తైనా
సేవచేయనక్కర్లేదా?
స్వామికి
ఈరీతిగా
మేము
కృతజ్ఞత
చూపించుకోవాలనుకుంటున్నాము.
కాబట్టి,
ఈనాడు
సాయంకాలం
దీనిగురించి
‘అనౌన్స్’
చేయాలి”
అని
కోరాడు.
“మంచిది”
అని
అంగీకరించాను.
మంచిపనులు
చేస్తుంటే
నేను
వద్దని
చెప్పను.
ఈవిధంగా
చేయాలనుకున్నవాళ్ళు
బాధ్యత
తీసుకొని
కార్యక్రమంలో
ప్రవేశించాలి.
అప్పుడే
వాళ్ళు
ఎంతో
అభివృద్ధికి
వస్తారు.
మద్రాసులోను,
హైదరాబాదులోను
చాలామంది
‘ఓల్డ్
స్టూడెంట్స్’
ఉన్నారు.
నాకు
మందిరాలక్కర్లేదు,
భూములక్కర్లేదు.
మీరు
ఆనందంగా
సేవలు
చేస్తూరండి.
దిక్కులేనివారికి
సహాయం
చేయండి.
ఆహారము
లేక
అల్లాడేవారికి
ఆహారము
నందించండి.
పరోపకార
సంబంధమైన
పనులు
చేయండి.
వారికోసం,
వీరికోసం
మీరు
కాచుకోనక్కర్లేదు.
మీకేదైనా
అవసరమైతే
నన్ను
అడగండి.
నేనిస్తాను.
అంతేగాని,
మీరెక్కడా
నయాపైస
కూడా
చందా
వసూలు
చేయకూడదు.
‘అడ్వర్టైజ్మెంట్’
మనకక్కర్లేదు.
దినదినానికీ
దొంగభక్తులు
ఎక్కువైపోతున్నారు!
ఎవరైనా
స్వామిపేరును
అమ్ముకుంటున్నారంటే
నాకు
చాలా
బాధనిపిస్తుంది.
‘డివోషన్’
(భక్తి)ని
అమ్ముకోకూడదు.
‘ఓషన్’
(సముద్రము)
అయినా
మంచినీరు
ఇస్తుందేమోగాని,
ఇలాంటి
‘డివోషన్’
ఏమాత్రం
ఫలితమివ్వదు.
ఎవరైనా
సరే,
డబ్బు
అడిగేవారిని
దగ్గర
చేరనివ్వకండి.
ఇప్పటికే
ఎంతో
ఆలస్యమైంది.
నేను
ఎవ్వరినీ
ఏమీ
అడగటం
లేదు
కదా!
ఇలాంటి
ఏజెంట్స్‌ను
నేనెలా
పెడతాను?
ఈ
దొంగ
ఏజెంట్స్‌ను
ఏమాత్రం
దగ్గరకు
రానివ్వకండి.
నాకు
డబ్బుతో
అవసరం
లేదు.
నాకు
ప్రేమతోనే
అవసరం.
ప్రేమ
ఒక్కటి
ఉంటే
చాలు
నాకు.
9
▾
Meaning
Keep
ప్రేమచేత
మీ
జీవితాన్ని
సార్థకం
చేసుకోండి.
ప్రేమను
మించిన
భక్తి
లేదు.
ప్రేమతో
మీరు
ఏ
చిన్న
సేవచేసినా
అది
సార్థకమౌతుంది.
దప్పిగొన్నవానికి
ప్రేమతో
ఒక
టంబ్లరు
నీరిచ్చినా
చాలు.
ఈనాటి
భక్తులలో
చాలామంది
దొంగలున్నారు.
పూర్వం
భక్తులందరూ
చేరి
ఎంతో
సంతోషంగా
కాలం
గడిపేవారు.
కాని,
ఇప్పుడు
దినదినానికీ
దొంగభక్తులు
ఎక్కువైపోతున్నారు.
అలాంటివారిని
మీరేమాత్రం
దగ్గరకు
రానివ్వకండి.
నాకు
మీ
హృదయమందిరం
చాలు!
ప్రేమస్వరూపులారా!
మీరు
ప్రేమను
పెంచుకోండి.
నాకు
ఎక్కడా
ఏ
మందిరాలూ
మీరు
కట్టనక్కర్లేదు,
ఏ
సత్రాలూ,
చావిళ్లూ
నాకు
అవసరం
లేదు.
నాకు
మీ
హృదయమందిరం
ఒక్కటివ్వండి
చాలు,
అక్కడ
నేనెంతో
హాయిగా
ఉంటాను.
దైవము
పేరుతో
ఎవ్వరూ
చెడ్డపనులు
చేయకూడదు.
మీకు
మంచి
చేయడానికి
శక్తి
లేకపోతే
నోరు
మూసుకొని
కూర్చోండి.
అంతేగాని,
చేస్తానని
‘ప్రామిస్’
చేయకండి.
దైవత్వాన్ని
నిశ్శబ్దంగా,
ప్రేమతో
అనుభవించాలి.
బిజినెస్‌కోసం
మీతో
స్నేహం
చేయాలని
వచ్చేవారికి
నమస్కారం
పెట్టి
‘గుడ్‌బై’
చెప్పండి.
అలాంటి
మూర్ఖులతో
మీరేమాత్రం
స్నేహం
చేయకూడదు.
మీకు
ఏదైనా
కావాలంటే
నన్ను
అడగండి.
దైవము
ఏనాటికీ
ఎవ్వరినీ
వదలడు.
ఏమాత్రం
భేదం
లేకుండా
అందరినీ
ఆదరిస్తాడు.
దైవానికి
ఏమాత్రం
ద్వేషం
లేదు.
అంతా
ప్రేమ,
ప్రేమ....
ఈ
ప్రేమను
మీరుకూడా
పెంచుకోండి.
ఈ
హాలంతా
భక్తులతో
నిండిపోవాలనే
ఆశ
నాకు
లేదు.
నేను
కోరేది
క్వాలిటీయేగాని,
క్వాన్టిటీ
కాదు.
Why
barrels
of
donkey's
milk?
One
teaspoonful
of
cow's
milk
is
better.
మంచిభావం
గలవారు
నాకు
ఒకరిద్దరు
చిక్కినా
చాలు.
భక్తిని
‘బిజినెస్’గా
మార్చకండి
సత్యసాయి
సంస్థల
సభ్యులు
సత్యమైన,
నిత్యమైన
మార్గాన్ని
అవలంబించాలి.
కేవలం
పుట్టపర్తికి
వచ్చినప్పుడు
మాత్రం
మంచివారుగా
నటించి,
పొలిమేరలు
దాటిపోతూనే
పాతఆటలు
ప్రారంభించడం
మంచిది
కాదు.
ఇలాంటి
దుర్బుద్ధులను
ఈనాడే
ఇక్కడ
భస్మం
చేయండి.
10
▾
Meaning
Keep
దైవముపట్ల
మీరేమాత్రం
సందేహాలు
పెట్టుకోకండి.
దైవము
ఎప్పుడూ
మీవెంటనే,
జంటనే,
కంటనే
ఉన్నాడు.
దైవము
ఏనాటికీ
ఎవరికీ
దూరం
కాడు.
మీలో
దైవత్వమును
పెంచుకోవడానికి
తగిన
కృషిచేయండి.
భక్తిని
ఒక
బిజినెస్‌గా
మార్చకండి.
అసత్యముతో
జీవితాన్ని
పాడు
చేసుకోకండి.
సత్యమే
దైవము.
కాబట్టి,
మీ
జీవితాన్ని
సత్యముతో
గడిపి,
సత్యముతోనే
అంత్యం
గావించుకోండి.
ముఖ్యంగా
దుస్సంగమును
దూరం
చేసుకోండి.
అప్పుడు
మీరు
నాకెంతో
గొప్ప
ఉపకారం
చేసినవారౌతారు.
నాకోసం
మిమ్మల్ని
ఏ
పనీ
చేయమని
నేను
చెప్పడం
లేదు.
నాకేమీ
అక్కర్లేదు.
నా
పనులన్నీ
ఎవరు
చేస్తున్నారు?
చిన్నపనికూడా
నాకు
నేనే
చేసుకుంటాను.
ఎవరినీ
ఈ
పని
చేసిపెట్టమని
నేనడగను.
తలుచుకుంటే
ప్రపంచమంతా
నాకు
సహాయం
చేస్తుంది.
కాబట్టి,
మీరు
నాకు
సహాయం
చేయనక్కర్లేదు.
సమాజసేవలో
పాల్గొని
మీ
జీవితాలను
సక్రమంగా
తీర్చిదిద్దుకోండి.
ప్రేమస్వరూపులారా!
గత
కొద్దిరోజులుగా
నేను
ఎవరిదో
నొప్పి
(గవదబిళ్ళ)
తీసికొని
బాధపడుతున్నానని
భక్తులు
బాధపడుతున్నారు.
నేను
దీనిని
ప్రేమతో
తీసుకున్నాను.
అలాంటప్పుడు
నాకు
Pain
(బాధ)
ఎక్కడినుండి
వస్తుంది?
అయితే,
ఇక్కడ
కొన్ని
Rules
and
regulations
(నియమనిబంధనలు)
ఉన్నాయి.
నేను
ఎవరిదో
బాధ
తీసుకున్నాను.
కాబట్టి,
వారు
ఈ
బాధను
ఎంతవరకు
అనుభవించాలని
ఉన్నదో
నేనుకూడా
అంతవరకు
అనుభవించాలి.
ఇది
వారికి
తప్పిందిగాని,
నేను
అనుభవించక
తప్పదు.
అయితే,
నాకు
ఎట్టి
కష్టమూ
లేదు.
నిజంగా
నాకు
కష్టంగా
ఉంటే
ఇంతసేపు
మాట్లాడటానికి
వీలౌతుందా?
No.
కాబట్టి,
నాకు
ఆ
బాధయే
లేదు.
అందరూ
క్షేమంగా
ఉండాలి,
అందరూ
సౌఖ్యంగా
ఉండాలి.
ఇదే
నా
ఆశయం.
స్వామికి
బాధగా
ఉందని
మీరు
బాధపడకండి.
ఇంకా
మీ
బాధలేవైనా
ఉంటే
నాకివ్వండి,
తీసుకుంటాను.
మీరందరూ
ఆనందంగా
ఉండండి.
అదే
నాకు
కావలసింది.
Previous
←
We Must Journey from Vyaṣṭi to Samaṣṭi
Next
Only He Who Has Forgotten the Mind Can Attain Nirvāṇa
→