Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2002 · Know for Certain: I Am Sai
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Know for Certain: I Am Sai
20 October 2002, Avatar Day, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His songs 42
Also in his talks
(1)
21 October 2003
I have come only to reveal your true nature
అక్టోబరు
ఆదివారము
ఇరువది
తేదీ
హంపినుండి
వచ్చి
స్కూలు
కరుగుచు
బాబా
కాలరుపిన్నొకటి
జారి
కనబడలేదు
మార్పు
కలిగెను
నాడు
ప్రాపంచిక
సంబంధము
పిన్నై
తొలగెన్
క్షేత్రదర్శనముకూడా
చెల్లెను
హంపిన్
మాయ
తొలగెనని
బాబా
గృహమును
వీడెన్
ప్రేమస్వరూపులారా!
నేనప్పుడు
ఉరవకొండలో
ఉన్నాను.
బళ్ళారిలో
ఉన్న
మున్సిపల్
ఛైర్మన్‌కు
ఒకనాటి
రాత్రి
ఒక
స్వప్నం
వచ్చింది.
ఉరవకొండలో
ఫలానాచోట
ఫలానా
నెంబరుగల
ఇంటికి
వెళ్ళి
‘సత్యం’ను
తీసికొని
రా,
అని
ఎవరో
అతనికి
చెప్పినట్లు
అయింది.
అదే
సమయంలో
అతని
అర్ధాంగియైన
లక్ష్మీదేవికికూడా
ఒక
స్వప్నం
వచ్చింది.
ఆ
స్వప్నంలో,
“అమ్మా!
మీరిద్దరూ
వెళ్ళి
‘సత్యం’ను
తీసికొని
రండి”,
అని
చెప్పడం
జరిగింది.
వారిద్దరూ
ఉరవకొండకు
వచ్చారు.
‘సత్యం’
అంటే
ఎంతటి
పెద్దవాడో
అని
అనుకున్నారు.
ఇప్పుడే
నేను
ఐదడుగులున్నాను.
ఆనాడు
మరింత
పొట్టిగా
ఉండేవాడిని.
నిక్కరు
వేసుకొని,
చొక్కా
తొడుక్కుని
బయటికి
వచ్చాను.
నన్ను
చూసిన
తక్షణమే
ఆ
ఛైర్మను,
ఆయన
భార్య,
“స్వప్నంలో
చూసింది
ఇతనినే”,
అని
గుర్తించి
చాలా
ఆనందించి,
బజారులోనే
నాకు
సాష్టాంగ
నమస్కారం
చేశారు.
నేనప్పుడు
పుస్తకాలు
పట్టుకొని
స్కూలుకి
వెళుతున్నాను.
వాళ్ళు
ఈ
శరీరానికి
అన్నగారైన
శేషమరాజును
కలుసుకొని,
“మీరు
సెలవుపెట్టి
అయినా
సరే,
‘సత్యం’ను
తీసికొని
బళ్ళారికి
రావాలి”,
అని
కోరారు.
మున్సిపల్
ఛైర్మన్
అంతటివాడు
ఈవిధంగా
అడుగుతుంటే
శేషమరాజు
తనకు
వీలుకాదని
చెప్పలేక
పోయాడు.
వెంటనే
హెడ్మాష్టరువద్దకు
వెళ్ళి,
“సత్యంను
బళ్ళారికి
తీసుకు
రమ్మని
ఛైర్మన్గారు
కోరుతున్నారు.
2
▾
Meaning
Keep
నాకు
సెలవు
ఇవ్వాలి”,
అని
కోరాడు.
ఆ
హెడ్మాష్టరుకు
నేనంటే
చాలా
ఇష్టం.
‘సత్యంను
బళ్ళారికే
కాదు,
ఎక్కడికైనా
మీరు
తీసుకు
వెళ్ళవచ్చు.
నన్ను
అడగనక్కర్లేదు’,
అని
చెప్పి
మాకు
తన
కారు
కూడా
ఇచ్చి
పంపించాడు.
విరూపాక్షాలయంలో...
బళ్ళారిలో
మమ్మల్ని
మూడు
దినములపాటు
మున్సిపల్
ఛైర్మన్
తన
ఇంట్లో
పెట్టుకున్నాడు.
తరువాత
అక్కడికి
సమీపంలో
ఉన్న
విరూపాక్షాలయానికి
మమ్మల్ని
తీసుకువెళ్ళాడు.
అక్కడికి
వెళ్ళిన
తరువాత
నేను
లోపలికి
రానని
పట్టుబట్టాను.
అప్పుడు
శేషమరాజు,
అతని
ఇల్లాలు,
“మేము
లోపలికి
వెళ్ళి
విరూపాక్షుని
దర్శించుకొని
వస్తాము.
నీవు
ఇక్కడే
మన
సామానుదగ్గర
ఉండు”,
అన్నారు.
వాళ్ళు
ఆలయంలోనికి
వెళ్ళారు.
గర్భగుడిలో
నేనే
నిల్చుని
ఉన్నట్లుగా
వారికి
కనిపించాను.
శేషమరాజుకు
అనుమానం
వచ్చింది.
“బయట
కూర్చొమ్మని
చెబితే
వీడు
ఇక్కడికెందుకు
వచ్చాడు?”
అనుకొని
బయటికి
వచ్చి
చూశాడు.
నేను
బయటే
కూర్చొని
ఉన్నాను!
మళ్ళీ
లోపలికి
వెళ్ళి
చూశాడు.
నేను
అక్కడకూడా
కనిపించాను.
ఇంకా
అతనికి
అనుమానం
తీరలేదు.
భార్యతో,
“నీవు
బయటికి
వెళ్ళి
సత్యందగ్గర
ఉండు.
వాడిని
ఎక్కడికీ
కదలనివ్వకు,”
అని
చెప్పి
తాను
మళ్ళీ
లోపలికి
వెళ్ళాడు.
అక్కడ
చిరునవ్వులు
చిందిస్తూ
నేను
మళ్ళీ
కనిపించాను.
మమ్మల్ని
తీసుకువచ్చిన
మున్సిపల్
ఛైర్మన్‌కూడా
ఇది
ప్రత్యక్షంగా
చూశాడు.
బయటికి
వచ్చిన
తరువాత
ఆయన
శేషమరాజు
చేతులు
పట్టుకొని,
“శేషమరాజూ!
‘సత్యం’
నీ
సోదరు
డనుకొని
నీవు
చాలా
పొరపడుతున్నావు.
‘సత్యం’
నీ
సోదరుడు
కాడు,
సామాన్యమైన
వ్యక్తి
కాడు.
అతనిలో
పెద్ద
‘డివైన్
పవర్’
ఉంది”,
అన్నాడు.
అవతార
ప్రకటన
సరే,
అక్కడినుండి
బళ్ళారికి
తిరిగి
వచ్చి
భోజనం
చేసి
ఉరవకొండకు
బయల్దేరాము.
ఛైర్మన్
నాకేదైనా
బహుమతి
ఇవ్వాలని
ఆశించాడు.
కాని,
నేనేమీ
పుచ్చుకోనని
చెప్పాను.
నాలుగు
నిక్కర్లు,
నాలుగు
చొక్కాలు
కుట్టిస్తానన్నాడు.
‘నాలుగు
కాదు,
ఒక్కటికూడా
పుచ్చుకోన’న్నాను.
3
▾
Meaning
Keep
ఆయన
భార్య
నాకొక
కాలరుపిన్ను
ఇస్తే
బాగుంటుందని
సలహా
ఇచ్చింది.
ఆరోజుల్లో
కాలరుపిన్ను
వేసుకోవడం
గొప్పతనంగా
భావించేవారు.
ఆయన
వెంటనే
బయటికి
వెళ్ళి
ఒక
బంగారు
కాలరుపిన్ను
తీసుకువచ్చి
నా
కాలరుకు
వేశాడు.
నేను
వద్దన్నాను.
ఎవరి
వస్తువులనూ
ఏనాటికీ
నేను
ముట్టను.
అప్పుడు
శేషమరాజు,
“ఆయన
ఎంతో
ప్రేమతో
ఇచ్చారు.
దానిని
తిరస్కరిస్తే
ఆయనను
అగౌరవపరచినట్లవుతుంది”,
అన్నాడు.
అతని
బలవంతం
మీద
నేనా
కాలరుపిన్ను
వేసుకున్నాను.
నేను
ఉరవకొండకు
తిరిగివచ్చిన
తరువాత
స్కూలుకు
వెళుతుంటే
ఆ
కాలరుపిన్ను
ఎక్కడో
జారిపడిపోయింది.
“ప్రాపంచిక
సంబంధము
పిన్నై
తొలగెన్...”
ఈ
ప్రాపంచిక
సంబంధము
నాకొక
పిన్నుతో
సమానం.
అది
తొలగిపోయింది.
భక్తుల
బాధలను
నివారించే
నిమిత్తం
నేను
వెళ్ళాలన్నాను.
పుస్తకాలను
పారవేశాను.
అక్కడ
ఎక్సైజు
ఇన్స్పెక్టరు
ఆంజనేయులు
ఉండేవాడు.
వాళ్ళ
తోటలోకి
వెళ్ళి
కూర్చున్నాను.
ఆయన
గొప్ప
భక్తుడు.
“ఆహా,
రాజు
వచ్చాడు”,
అని
ఎంతో
ఆనందించి,
తన
భార్యకు
చెప్పి
ఏవేవో
వంటకాలు
చేయించాడు.
కాని,
నేను
ఏదీ
ముట్టలేదు.
శేషమరాజు
వచ్చి,
“సత్యా!
ఇంటికి
పోదాము
రా”,
అన్నాడు.
పెద్దవారికి
ఎదురు
చెప్పడం
నా
స్వభావం
కాదు.
కాని,
‘నేను
రాను’,
అన్నాను.
నేను
ఆరీతిగా
జవాబు
చెబుతుంటే
శేషమరాజుకి
ఆశ్చర్యం
కల్గింది.
“ఈ
సత్యంకి
ఇంత
ధైర్యం
ఎక్కడినుండి
వచ్చింది?”
అనుకున్నాడు.
నేను
చిరునవ్వులు
చిందిస్తూ
ఉంటే
అతనికి
నా
ముఖముచుట్టూ
గొప్ప
తేజస్సు
కనిపించింది.
అతను
ఇంటికి
వెళ్ళాడు;
పుట్టపర్తికి
టెలిగ్రాం
పంపించాలనుకున్నాడు.
ఆరోజుల్లో
ఉరవకొండనుండి
పుట్టపర్తికి
టెలిగ్రామ్
రావాలంటే
ఒక
వారం
పట్టేది.
అందుచేత,
ఒక
స్కూలు
పిల్లవానిద్వారా
ఈశ్వరమ్మ,
పెద్ద
వెంకమరాజు
లిరువురినీ
తక్షణమే
బయల్దేరి
రావలసిందిగా
కబురు
పంపించాడు.
ఇద్దరూ
వచ్చారు.
శేషమరాజు
వాళ్ళను
నాదగ్గరికి
తీసుకొని
వచ్చాడు.
“నాయనా!
అన్నగారింటికి
పోదాం,
రా!”
అని
ఈశ్వరమ్మ
చాలా
ఏడ్చింది.
“నేను
ఎక్కడికీ
రాను.
నేను
రావాలని
మీరంతగా
కోరితే,
మీ
వెంట
పుట్టపర్తికి
వస్తాను.
అక్కడికి
వచ్చి
ఆ
గ్రామస్థులను
ఆనందపరచి,
నా
ఇష్టప్రకారం
నేను
వెళతాను”,
అని
చెప్పాను.
4
▾
Meaning
Keep
ప్రతి
దినము
స్కూల్లో
ప్రార్థనాగీతమును
నేనే
పాడేవాడిని.
“రాజూ!
నీవు
చిన్నవాడవైనప్పటికీ
నీ
ప్రార్థనాగీతము
మా
హృదయాలను
రంజింపజేస్తుంది”,
అని
హెడ్మాష్టరు
మెచ్చుకునేవాడు.
నేను
స్కూలు
విడిచిపెట్టిన
తరువాత
ప్రార్థనాగీతము
పాడటానికి
ఒక
పిల్లవానిని
స్టేజిపైకి
ఎక్కించారు.
కాని,
అతను
పాడటం
ప్రారంభిస్తూనే
నన్ను
తల్చుకొని
గట్టిగా
ఏడ్చాడు.
అందరూ
ఏడ్చారు.
ఈ
ప్రార్థన
మాకక్కర్లేదన్నారు.
నేను
పుట్టపర్తికి
బయలుదేరినప్పుడు
పిల్లలందరూ
తాముకూడా
వస్తామని
పట్టుబట్టారు.
అంతమంది
ఈ
పల్లెకు
వస్తే
ఎక్కడుంటారు?
చాలా
కష్టమౌతుంది.
కాబట్టి,
పిల్లలకు
రావద్దని
నచ్చజెప్పవలసిందిగా
నేను
హెడ్మాష్టర్‌కి
చెప్పాను.
రమేశ్,
సురేశ్‌ల
ఉదంతము
క్లాసురూములో
నేను,
రమేశ్,
సురేశ్
ముగ్గురం
ఒకే
డెస్కువద్ద
కూర్చునేవారము.
నేను
మధ్యలో
కూర్చుంటే
ఒకరు
ఇటువైపున,
ఒకరు
అటువైపున
కూర్చునేవారు.
ఒక
పర్యాయం
మేము
ESLC
పబ్లిక్
ఎగ్జామ్స్
వ్రాయవలసివచ్చింది.
క్లాసు
రూమ్‌లో
అయితే
టీచర్లు
అడిగే
ప్రశ్నలకు
నేను
జవాబులు
చెప్పి
ఆ
పిల్లలకు
సహాయం
చేసేవాడిని.
కాని,
ఆ
ESLC
పరీక్షలో
మేము
ముగ్గురం
ఒకరికొకరం
చాలా
దూరంగా
కూర్చోవలసి
వచ్చింది.
మా
రోల్
నెంబర్లు
ఆవిధంగా
ఉన్నాయి.
రమేశ్,
సురేశ్‌లు,
‘మా
గతి
ఏమౌతుందో’,
అంటూ
చాలా
భయపడ్డారు.
అప్పుడు
నేను,
“మీరేమీ
వ్రాయనక్కర్లేదు,
ఏదో
వ్రాస్తున్నట్లు
నటించండి,
చాలు.
మీ
పేపర్లు
కూడా
నేనే
వ్రాస్తాను”,
అని
వాళ్ళకు
ధైర్యం
చెప్పాను.
పరీక్ష
వ్రాయడానికి
వెళ్ళాము.
రెండు
గంటలు
టైమిచ్చారు.
నా
పేపరును
కేవలం
పదినిమిషాల్లో
పూర్తిచేశాను.
తరువాత
ఇంకొక
పేపరు
తీసుకొని
రమేశ్
హేండ్
రైటింగ్‌తో
అన్ని
జవాబులూ
వ్రాసి,
క్రింద
అతని
పేరు
వ్రాశాను.
ఇంకొక
పేపరుమీద
సురేశ్
హేండ్
రైటింగ్‌తో
జవాబులు
వ్రాసి,
క్రింద
అతని
పేరు
వ్రాశాను.
మా
ముగ్గురికి
మాత్రమే
ఫస్ట్
క్లాస్
వచ్చింది.
రమేశ్,
సురేశ్లకుకూడా
ఫస్ట్‌క్లాసు
రావడం
అందరికీ
ఆశ్చర్యం
కల్గించింది.
వాళ్ళు
నా
పేపరును
చూసి
కాపీ
కొట్టారనుకోవడానికి
వీల్లేదు.
ఎందుకంటే,
మేము
పరీక్షాహాల్‌లో
ఒకరికొకరం
చాలా
దూరంగా
కూర్చున్నాము.
ఒకరిని
చూసి
ఒకరు
కాపీ
కొట్టడానికి
వీలుకాదు.
5
▾
Meaning
Keep
మేము
ఫస్ట్
క్లాస్
సాధించినందుకు
అభినందనపూర్వకంగా
ఉరవకొండలో
ప్రజలు
మా
ముగ్గురినీ
ఎత్తుకొని
ఘనంగా
ఊరేగించారు.
ఆ
పిల్లలిద్దరూ
నాకెంతో
సన్నిహితంగా
ఉండేవారు.
అంత
చిన్న
వయస్సులో
ఆ
పిల్లలకు
నేనంటే
ఎంతో
అభిమానము,
ఎంతో
ప్రేమ.
నాదగ్గర
డబ్బు
లేదని
వారికి
తెలుసు.
కాని,
నేను
ఎప్పుడూ
ఎవరిదగ్గరా
ఏదీ
పుచ్చుకునేవాడను
కాను.
ఒక
పర్యాయం
రమేశ్
తనకు
తల్లిదండ్రులు
గుడ్డలు
కుట్టిస్తే,
రెండు
జతలు
తెచ్చి
నా
డెస్కులో
పెట్టాడు.
“రాజూ!
ఇది
నీవు
తీసుకోకపోతే
నేను
ప్రాణం
విడుస్తాను”,
అని
ఒక
కాగితంపై
వ్రాసిపెట్టాడు.
కాని,
నేను
వాటిని
పుచ్చుకో
లేదు.
“ఇచ్చి
పుచ్చుకునే
సంబంధము
శాశ్వతమైనది
కాదు.
ఇలాంటి
సంబంధంతో
మన
ప్రేమను
పెంచుకోకూడదు.
హృదయానికి
హృదయం;
ప్రేమకు
ప్రేమ
-
ఇదే
మన
సంబంధము”,
అని
చెప్పాను.
నేను
ఏనాడూ
ఎవరిదగ్గరా
ఏమీ
పుచ్చుకోలేదు.
నేను
ఉరవకొండను
వదలిపెట్టడంతో
రమేశ్
నా
వియోగాన్ని
భరించలేక
బావిలో
పడి
మరణించాడు.
సురేశ్‌కి
పిచ్చిపట్టింది.
నిరంతరం
‘రాజూ,
రాజూ’
అని
కలవరిస్తూ
ఉండేవాడు.
తల్లిదండ్రులు
అతనిని
ఎన్నో
పిచ్చాసుపత్రులకు
తీసుకు
వెళ్ళారు.
కాని,
ఎక్కడా
పిచ్చి
నయం
కాలేదు.
చివరికి
నాదగ్గరికి
వచ్చి,
“మిమ్మల్ని
చూస్తే
వాడు
చాలా
ఆనందిస్తాడు.
కాబట్టి,
ఒక్కసారి
వచ్చి
వానిని
చూడవలసింది”,
అని
కోరారు.
వారి
కోరికను
మన్నించి
నేను
పిచ్చాసుపత్రికి
వెళ్ళాను.
సురేశ్
నన్ను
చూస్తూనే,
“రాజూ!
రాజూ!”
అని
ఏడ్చుకుంటూ
నా
పాదాలపై
పడి
ప్రాణం
విడిచాడు.
“మేము
ఎప్పుడూ
మీతోనే
ఉండాలి.
మిమ్మల్ని
వదలి
మేము
క్షణమైనా
ఉండలేము”,
అని
వాళ్ళిద్దరూ
నాతో
అంటూ
ఉండేవారు.
నేను
పుట్టపర్తికి
వచ్చిన
తరువాత
కరణం
సుబ్బమ్మ
సత్తెమ్మగుడి
దగ్గర
ఒక
ఎకరము
భూమి
ఇచ్చింది.
అక్కడొక
చిన్న
మందిరం
కట్టారు.
అప్పుడు
రమేశ్,
సురేశ్లిరువురూ
కుక్కపిల్లలై
నాదగ్గరికి
వచ్చారు.
అవి
చాలా
అందంగా
ఉన్నాయని
మైసూర్
మహారాజా
చెల్లెలు
వాటికి
జాక్
&
జిల్
అని
పేర్లు
పెట్టింది.
మైసూర్
మహారాణి
ఒక
పర్యాయం
స్వామిని
చూడాలని
వచ్చింది.
అప్పుడు
ఈ
పుట్టపర్తికి
రోడ్డు
లేదు.
అందుచేత
ఆమె
కర్ణాటకనాగేపల్లివద్ద
కారు
దిగి
ఇక్కడికి
వచ్చింది.
6
▾
Meaning
Keep
ఇప్పుడు
కళ్యాణమండపం
కట్టిన
చోట
పూర్వం
ఒక
చిన్న
మందిరం
ఉండేది.
ఆ
రాత్రికి
ఆమె
అక్కడే
విశ్రమించింది.
డ్రైవరు
భోజనం
చేసి
కర్నాటనాగేపల్లికి
బయలుదేరాడు.
నేను
జాక్‌ని
పిలిచి,
“మన
మనిషి
వెళుతున్నాడు.
అతని
వెంట
నీవుకూడా
పో”,
అని
చెప్పాను.
జాక్
అతనివెంట
వెళ్ళి
ఆరాత్రంతా
కారు
క్రింద
పడుకుంది.
తెల్లవారి
లేస్తూనే
రాణిగారు
వెళ్ళాలి
కదా!
అందుచేత,
డ్రైవరు
కారును
స్టార్ట్
చేసి
కొంత
ముందుకు
నడిపించాడు.
కారు
టైరు
క్రింద
జాక్
పడుకున్న
సంగతి
అతనికి
గుర్తులేదు.
జాక్
కడుపుపైనుండి
టైరు
పోయింది.
దాంతో
దాని
వెన్నెముక
విరిగిపోయింది.
అది
బాధతో
అరుచుకుంటూ
మందిరానికి
వస్తున్నది
పాపం!
ఇక్కడ
చాకలి
సుబ్బన్న
అనే
చాలా
నమ్మకమైన
వ్యక్తి
ఉండేవాడు.
అతనికి
స్వామి
అంటే
ప్రాణం.
అతను
ఉదయం,
సాయంకాలం
పాత
మందిరాన్ని
చక్కగా
చూసుకునేవాడు.
నాదగ్గరకు
అతను
పరుగెత్తుకొని
వచ్చి,
“స్వామీ!
జాక్
చాలా
బాధతో
అరుచుకుంటూ
వస్తున్నది.
ఏదో
ప్రమాదం
జరిగింది”,
అన్నాడు.
నేను
వెంటనే
బయటికి
వచ్చాను.
అది
ఏడ్చుకుంటూ,
కాళ్ళను
ఈడ్చుకుంటూ
వచ్చి
నా
పాదాలపై
పడి
ప్రాణం
విడిచింది.
దానిని
పాతమందిరము
వెనుక
సమాధి
చేయించాను.
అయితే,
దానిని
సెంటర్లో
కాకుండా
కొంచెం
ప్రక్కకు
కట్టవలసిందిగా
చెప్పాను.
రెండవ
సమాధికికూడా
చోటు
ఉండాలని
చెప్పాను.
జాక్
పోయిందనే
బాధతో
జిల్
తిండి
మానేసి
కొన్ని
దినముల
తరువాత
అదికూడా
ప్రాణం
విడిచింది.
ఆ
రెండింటి
సమాధియే
పాతమందిరం
వెనుక
ఉండిన
బృందావనం.
ఆవిధంగా,
రమేశ్,
సురేశ్‌లు
స్వామిదగ్గర
ఉండాలని
అంత
తపస్సు
చేసి,
కుక్కలుగా
జన్మించి
ప్రశాంతినిలయం
చేరుకున్నారు.
‘పుట్టపర్తిని
వదలిపెట్టను’
కాలరు
పిన్ను
జారిపోవడం,
నేను
స్కూలు
మానివేయడం,
తల్లిదండ్రులు
వచ్చి
నన్ను
ఇక్కడికి
తీసుకురావడం...
ఈవిధమైన
కారణాలను
పురస్కరించుకొని
నేను
ఉరవకొండను
వదలిపెట్టాను.
బెంగుళూరు,
మైసూర్‌లనుండి
కాఫీపొడి
సాకమ్మ,
మైసూర్
మహారాణి,
మైసూర్
మహారాజా
మేనమామ
దేశరాజ్
అర్స్
మొదలైన
భక్తులు
కార్లలో
ఇక్కడికి
వచ్చేవారు.
7
▾
Meaning
Keep
ఒకపర్యాయం
వాళ్ళు,
“స్వామీ!
ఈ
మారుమూల
గ్రామానికి
వచ్చిపోవడం
మాకు
కష్టంగా
ఉన్నది.
మీరే
మైసూర్‌కి
వచ్చేయండి.
మీకు
పెద్ద
భవనము
కట్టిస్తాము”,
అన్నారు.
“నాకు
భవనాలు
అవసరం
లేదు.
నేనిక్కడే
ఉంటాను”,
అన్నాను.
ఆనాటి
రాత్రి
ఈశ్వరమ్మ
వచ్చి,
“స్వామీ!
ఎందరెందరో
వచ్చి
వారివారి
స్వార్థం
కోసం
మిమ్మల్ని
ఇక్కడికి
రండి,
అక్కడికి
రండి,
అంటూ
తీసుకుపోవాలని
ప్రయత్నిస్తున్నారు.
మీరు
పుట్టపర్తిని
వదలిపెడితే
నేను
బ్రతకను.
మీరు
ఇక్కడే
ఉంటానని
నాకు
మాటివ్వండి”,
అని
కోరింది.
“సరే,
ఏనాటికైనా
నేను
పుట్టపర్తిని
వదలిపెట్టను”,
అని
మాటిచ్చాను.
ఇంక,
స్వామి
ఆ
చిన్నకొట్టంలో
ఉండడం
మంచిదికాదని,
భక్తులకు
అనుకూలంగా
ఉండేటట్లు
ఒక
భవనం
కట్టాలని,
అది
పల్లెకు
దగ్గరగా
ఉండరాదని
నిర్ణయించుకొని
మైసూరు
మహారాజా
మేనమామ,
సాకమ్మ
మొదలైనవారు
ఈ
ప్రదేశానికి
వచ్చి
కొలత
వేసుకొని
పదెకరాల
భూమిని
కొన్నారు.
ఈరీతిగా,
ఈశ్వరమ్మ
కోరికమేరకు
నేను
ఇక్కడే
పెద్దమందిరము
కట్టించి,
వచ్చి
పోయే
భక్తులందరికీ
తగిన
సౌకర్యాలను
ఏర్పాటు
చేసి
సేవలు
చేస్తూవచ్చాను.
ఈ
ప్రశాంతి
మందిరం
కట్టే
సమయంలో
విఠల్
రావు
ఎంతో
భక్తిశ్రద్ధలతో
నిర్మాణం
పనులను
పర్యవేక్షిస్తూవచ్చాడు.
ఆయన
చాలా
గొప్ప
ఆఫీసరు,
బ్రిటీషువారి
కాలంలోనే
ఫారెస్ట్
ఆఫీసరుగా
ఉండేవాడు.
ఇంతకు
ముందు
మాట్లాడిన
జయమ్మ
(ప్రొ
॥
జయలక్ష్మీ
గోపీనాథ్)
తండ్రియే
ఆ
విఠల్‌రావు.
ఆయనతోపాటు
మద్రాసునుండి
ఆర్.
నీలాద్రిరావు
(పిఠాపురం
మహారాజా
అల్లుడు),
బరోడా
మహారాజా
అల్లుడుకూడా
వచ్చి
ఈ
మందిర
నిర్మాణాన్ని
చూసుకునేవారు.
అందువలన
ఇది
త్వరత్వరగా
పూర్తి
అయింది.
ప్రపంచయుద్ధ
ప్రభావంచేత
ఆ
రోజుల్లో
ఇనుము
చిక్కడం
చాలా
కష్టంగా
ఉండేది.
అయినప్పటికీ
వాళ్ళు
ఏదోవిధంగా
ఇనుమును
తెప్పించి
ఎంతో
శ్రద్ధతో
దీనిని
కట్టారు.
రాత్రింబవళ్ళు
పనిచేస్తూ,
కూలీలకు
బట్వాడాలు
ఇచ్చుకుంటూ
దీనిని
పూర్తి
చేశారు.
మందిర
నిర్మాణం
పూర్తయ్యేంతవరకు
స్వామి
ఇక్కడకు
రాకూడదని
కోరారు.
స్వామికి
ఇబ్బంది
కల్గించకూడదని
వారి
ఉద్దేశ్యం.
నేను
భక్తులకిచ్చిన
మాట
ప్రకారమే
నడుచుకున్నాను.
8
▾
Meaning
Keep
నాకేదీ
అవసరం
లేదు.
నాకు
ఎలాంటి
ఆశలూ
లేవు.
జన్మాంతర
సుకృత
ఫలితం
కూలీలకు
బట్వాడా
ఇవ్వడానికి
జయమ్మ
తండ్రి
ప్రతి
ఆదివారం
కారులో
పుట్టపర్తికి
వచ్చేవాడు.
అప్పుడు
జయమ్మ
తానుకూడా
వస్తానని
పట్టుబట్టేది.
కూతురంటే
విఠల్
రావుకు
చాలా
ప్రీతి.
బెంగుళూరులోనే
వంటచేసుకొని
కారులో
పెట్టుకొని
ఆమెనుకూడా
తనవెంట
తీసుకు
వచ్చేవాడు.
ఈవిధంగా,
వాళ్ళు
స్వామితో
సంబంధాన్ని
అభివృద్ధి
పరచుకుంటూ
వచ్చారు.
ఈ
జయమ్మ
స్వామిసేవలో
ప్రవేశించి
ఇప్పటికి
60
సంవత్సరాలైంది.
ఈ
దేహానికి
17వ
సంవత్సరంలో
నాదగ్గరకు
వచ్చింది.
ఇప్పుడీ
దేహానికి
77
సంవత్సరాలు.
గత
60
సంవత్సరాలుగా
ఈమె
ప్రశాంతి
నిలయానికి
వస్తూ,
స్వామిభజనలు
పాడుతూ,
మంచివిషయాలు
నేర్చుకుంటూ
ఉత్తమమైన
భావాలను
అభివృద్ధి
పరచుకుంది.
అందువల్లనే
స్వామితో
సంబంధబాంధవ్యము
ఇంత
గొప్పగా
పెరిగిపోయింది.
ఏదైనా
సరే,
ప్రాప్తి
లేకపోతే
ఏ
ఒక్కటీ
లభ్యం
కాదు.
ఇలాంటిది
కోరితే
వచ్చేది
కాదు,
వద్దంటే
పోయేది
కాదు.
ఇది
కేవలం
జన్మాంతర
సుకృత
ఫలితం.
ఈవిధంగా
ఎంతో
గొప్ప
ప్రాప్తిని
సంపాదించుకున్నారు
ఆ
కుటుంబమువారు.
స్వామిసేవలో
తరించిన
ధన్యజీవులు
జయమ్మ
తన
ప్రసంగంలో
వెంకమ్మ
(శ్రీవారి
పెద్దక్కగారు)
తనకు
చెప్పిన
స్వామి
లీలలనుగురించి
ప్రస్తావించింది.
ఆరోజుల్లో
వెంకమ్మ
నాకొరకు
వంటచేసి
తీసికొనివచ్చేది.
వెంకమ్మ
దగ్గర
వంట
నేర్చుకోవాలని
ఈ
జయమ్మ
ఆమెవెంట
తిరుగుతూ
ఉండేది.
వారిద్దరికీ
ఈవిధమైన
స్నేహం
ఉండేది.
తరువాత
కొంతకాలానికి
పార్వతమ్మ
(శ్రీవారి
చిన్నక్కగారు)
కూడా
వచ్చింది.
ఒకరు
ఉదయం,
ఒకరు
సాయంకాలం
స్వామికి
భోజనం
తీసుకువచ్చేవారు.
‘కాల
పరిస్థితి
సరి
లేదు.
కాబట్టి,
స్వామి
ఇతరులు
తెచ్చే
భోజనం
తినకూడదు.
స్వామికి
మేమే
వంటచేసి
పెట్టాలి’,
అని
కోరుకున్నారు.
ఆమేరకు
నానుండి
వాగ్దానం
తీసుకున్నారు.
వారు
ప్రాణం
విడిచేంత
వరకు
నాకు
సేవ
చేశారు.
ప్రాణంపోయే
సమయంలో
ఇద్దరూ
మణిపాల్
ఆసుపత్రిలో
ఉన్నారు.
9
▾
Meaning
Keep
ఇక్కడినుండి
తీసుకు
వచ్చారు
వెంకమ్మను.
ఆమెకు
స్పృహ
లేదు.
కన్నులు
తెరవలేదు.
నేను
ఆసుపత్రికి
వెళ్ళి,
“వెంకమ్మా!”
అని
పిలిచాను.
తక్షణమే
కన్నులు
తెరచి
చూసింది.
నా
రెండు
చేతులనూ
పట్టుకొని
తన
కళ్ళదగ్గర
పెట్టుకొని
నమస్కారం
చేసుకుంది;
కంటిధారలు
కార్చుతూ
ప్రాణం
విడిచింది.
పార్వతమ్మ
విషయంలోకూడా
అదే
జరిగింది.
ఆమెను
కూడా
స్పృహలేనిస్థితిలో
అక్కడికి
తీసుకు
వచ్చారు.
నేను
వెళ్ళి,
“పార్వతమ్మా!”
అని
పిలిచాను.
ఆమె
కన్నులు
తెరచి
చూసింది,
కంటిధారలు
కార్చింది,
ప్రాణం
విడిచింది.
ప్రాణం
ఉండినంతవరకు
ఇద్దరూ
స్వామికి
భోజనం
తీసుకువచ్చేవారు.
ఎంత
అనారోగ్యం
కల్గినా
లెక్క
చేయకుండా
స్వామిసేవ
చేశారు.
ఇదంతా
కేవలం
జన్మాంతర
సుకృతమే
గాని,
ఒకరి
ప్రయత్నంచేత
లభించేది
కాదు.
వారి
జన్మ
సార్థకమైంది.
ఇప్పుడుకూడా
భోజనం
ఆ
ఇంటినుండియే
వస్తుంది.
ఇక్కడ
శేషమరాజు
కొడుకున్నాడు.
ఈశ్వరమ్మ
కొడుకు
జానకిరామయ్య
ఉన్నాడు.
మీకు
తెలుసు.
అతని
భార్యయే
వండుకొని
తెస్తుంది.
పార్వతమ్మ
బిడ్డకూడా
వండుకొని
తెస్తుంది.
ఈవిధంగా
వారు
నిత్యం
స్వామి
సేవలో
పాల్గొంటున్నారు.
నేను
రాత్రిపూట
ఏమీ
తినను.
వాళ్ళు
ప్రతి
రోజు
ఉదయం
వంట
చేసి
తెస్తున్నారు.
ఈ
దేహానికి,
ఆ
కుటుంబానికి
ఈవిధమైన
సన్నిహిత
సంబంధ
బాంధవ్యమున్నది.
ఇట్టి
సంబంధ
బాంధవ్యమును
వారు
భద్రంగా
కాపాడుకుంటున్నారు.
కొన్ని
అవతారములు
వారి
తల్లిదండ్రుల
ప్రార్థనల
ఫలితంగా
రావడం
జరిగింది.
కాని,
ఈ
అవతారములో
-
ఈమె
నా
తల్లిగా
ఉండాలి,
ఈయన
నా
తండ్రిగా
ఉండాలి,
అని
నాకై
నేను
కోరి
వారికి
జన్మను
ప్రసాదించాను.
సామాన్యమైనరీతిగా,
సాధారణమైన
సంబంధముతో
జన్మించినది
కాదు
ఈ
శరీరము.
కరణం
సుబ్బమ్మకూడా
తన
తుదిశ్వాస
వదిలేంతవరకు
స్వామికి
సేవ
చేసింది.
ఆమెకు
ఈ
శరీరముతో
సంబంధము
లేకపోయినప్పటికీ
మానసిక
సంబంధము
చాలా
అధికంగా
ఉండేది;
ఎప్పుడూ
స్వామి
చింతన
చేస్తూ
ఉండేది.
స్వామిని
తన
ఇంట్లోనే
ఉండవలసిందిగా
కోరింది.
తాను
ఇల్లు
ఖాళీ
చేసి
ఇస్తానంది.
ఆమె
బంధువులు
వచ్చి,
“మీరు
బ్రాహ్మణులు,
అతను
క్షత్రియుడు.
అతనిని
మీ
ఇంట్లోకి
ఎందుకు
రానిస్తున్నావు?”
అని
వాదించారు.
10
▾
Meaning
Keep
“నాకు
మీరెవ్వరూ
అక్కర్లేదు.
నేను
మీ
ఇంటికి
రాను,
మీరు
నా
ఇంటికి
రానక్కర్లేదు.
నాకు
స్వామి
ఒక్కరుంటే
చాలు”,
అని
వారికి
గట్టిగా
సమాధానం
చెప్పింది.
ఆమె
ఒకే
ఒక
కోరిక
కోరింది
-
“స్వామీ!
నేను
ప్రాణం
విడిచే
సమయంలో
మీ
సుందర
ముఖారవిందమును
చూడాలి”,
అని.
అట్లే
జరుగుతుందని
మాటిచ్చాను.
ఒకపర్యాయం
కొందరు
భక్తులు
నన్ను
మద్రాసుకు
తీసుకు
వెళ్ళారు.
సుబ్బమ్మ
బుక్కపట్నంలోని
తల్లిగారింటికి
వెళ్ళింది.
నేను
తిరిగి
వచ్చేసరికి
ఆమె
ప్రాణం
విడిచింది.
గ్రామస్థులు
నన్ను
చూసిన
తక్షణమే,
“స్వామీ!
మీ
సుబ్బమ్మ
రాత్రి
ప్రాణం
విడిచింది”,
అన్నారు.
నేను
బుక్కపట్నం
వెళ్ళాను.
ఆమెకు
మాటిచ్చాను
కదా!
ఎలాంటి
పరిస్థితిలోనైనా
నేను
మాట
తప్పను.
సుబ్బమ్మ
దేహాన్ని
వరండాలో
పెట్టి
బట్ట
కప్పారు.
నేను
వెళ్ళి
ఆమె
దేహానికి
కప్పిన
బట్టను
తొలగించాను.
అప్పటికే
చీమలు
పట్టాయి.
Dead
body
కదా!
‘సుబ్బమ్మా!’
అని
పిలిచాను.
కన్నులు
తెరచింది.
ఆ
అద్భుతాన్ని
చూసి
సుబ్బమ్మ
బ్రతికిందన్న
ఆనందంతో
బుక్కపట్నంలోని
ప్రజలంతా
వస్తున్నారు.
ఆ
సుబ్బమ్మ
తల్లికి
నూరు
సంవత్సరాలు.
ఆమెకు
చెప్పాను,
కొంచెం
తులసీతీర్థం
తీసుకు
రమ్మని.
సుబ్బమ్మ
నోట్లో
తులసీదళం
వేసి,
నీరు
త్రాగించి,
“సుబ్బమ్మా!
నీకిచ్చిన
మాటను
నెరవేర్చాను.
ఇప్పుడు
ఆనందంగా
వెళ్ళు”,
అని
చెప్పాను.
“నాకింతకంటే
ఏమి
కావాలి
స్వామీ!
నేను
ఆనందంగా
పోతున్నాను”,
అని
కంటిధారలు
కార్చుకుంటూ,
నవ్వుకుంటూ,
నా
రెండు
చేతులూ
పట్టుకొని,
“పోయి
వస్తాను,
పోయి
వస్తాను”,
అంటూ
ప్రాణం
విడిచింది.
కృష్ణావతారంలో
దేవకీదేవికి
ఎంత
ప్రేమయో
అంతకంటే
ప్రేమ
యశోదకు.
ఈశ్వరమ్మ,
సుబ్బమ్మ
ఒకరిపట్ల
ఒకరు
ఎంతో
ప్రేమగా
ఉండేవారు.
కాని,
మగవారి
మధ్య
మాటలు
లేవు.
ఆమె
ఇక్కడికి
రాకూడదు,
ఈమె
అక్కడికి
పోకూడదు.
అందుచేత,
వాళ్లిద్దరూ
కిటికీనుండి
మాట్లాడుకునేవారు.
ఈ
దేహముయొక్క
తల్లిదండ్రులను
నేనే
సెలెక్ట్
చేసుకున్నాను.
పెద్దవెంకమరాజు
భక్తులకు
ఎంతో
సహాయం
చేస్తూ
ఉండేవాడు;
కొబ్బరికాయలు
కావాలన్నా,
పప్పులు
కావాలన్నా
వెంటనే
బుక్కపట్నం
పోయి
తీసుకువచ్చేవాడు;
భక్తులకు
ఎంతో
సేవ
చేశాడు.
11
▾
Meaning
Keep
మరణించే
రోజున
ఆయన
మందిరానికి
వచ్చాడు.
నేను
అప్పటికే
కొంతమందిని
ఇంటర్వ్యూకోసం
సెలెక్ట్
చేశాను.
ఆయన
వచ్చి
అక్కడ
నిల్చున్నాడు.
‘ఏమి
వచ్చినావు?’
అంటే
‘చిన్న
పని
ఉంది
స్వామీ!’
అన్నాడు.
లోపలికి
పిలిచి,
‘ఏమి
పని?’
అని
అడిగాను.
“స్వామీ!
నేను
పరాధీనములో
పోకూడదు.
నేను
ఎవరికీ
ఋణపడిపోకూడదు.
నాకు
ఋణవిముక్తి
జరగాలి.
నేను
వ్యాపారం
చేసే
సమయంలో
ఎవరికైనా
ఎప్పుడైనా
ఒక
బొట్టో,
అణాయో
ఋణపడి
ఉండవచ్చు.
కనుక,
ఆ
పాపపరిహార
నిమిత్తం
ఈ
డబ్బు
తెచ్చాను.
ఇది
నేను
కష్టపడి
సంపాదించుకున్నాను”,
అని
పలుకుతూ
కొంత
డబ్బు
తీసి
నా
చేతిలో
పెట్టాడు.
“స్వామీ!
ఐదు
మూటల
బియ్యం,
రెండు
మూటల
బెల్లం
తీసిపెట్టాను.
నేను
పోయిన
తరువాత
12వ
రోజున
బీదలకు
అన్నదానం
చేయించండి”,
అని
కోరాడు.
ఇక్కడినుండి
నేరుగా
ఇంటికి
వెళ్ళి
పడుకున్నాడు,
ప్రాణం
వదిలాడు.
ఇదేరీతిగా,
ఈశ్వరమ్మకూడా
అనాయాస
మరణం
పొందింది.
అప్పుడు
బెంగుళూరులో
సమ్మర్
క్లాసులు
జరుగుతున్నాయి.
స్వామి
ఎక్కడుంటే
తానుకూడా
అక్కడుండాలని
ఆమె
ఆశించేది.
అందుచేత,
తాను
సమ్మర్కోర్సుకి
వచ్చింది.
ఆ
క్లాసులకు
హాజరైన
పిల్లలను
చూసి
ఎంతో
ఆనందించింది.
వారందరూ
భోజనంచేసే
సమయంలో
త్రాగడానికి
నీరు
పోసేది.
‘స్వామివలన
మాకీ
అదృష్టం
కల్గింది’,
అని
ఎంతగానో
మురిసిపోయేది.
ఒకనాడు
ఉదయం
యథాప్రకారం
పిల్లలందరికీ
టిఫిన్
వడ్డిస్తున్నారు.
ఆమెకూడా
టిఫిన్
చేసింది,
కాఫీ
తీసుకుంది.
ఆమెకు
కావలసినవి
చూసుకోవడానికి
వెంకమ్మ
ఎప్పుడూ
ఆమెవెంటనే
ఉండేది.
ఆమె
టిఫిన్
చేసిన
తరువాత
తాంబూలం
వేసుకొనే
నిమిత్తం
పోకచెక్కలను
పొత్తరంలో
వేసి
కొడుతుంటే
ఆ
శబ్దం
నాకు
పైకి
వినిపిస్తోంది.
ఉన్నట్లుండి
ఆమె,
‘స్వామీ!
స్వామీ!’
అని
పిలిచింది.
నేను,
‘వస్తున్నాను,
వస్తున్నాను’
అని
చెప్పాను.
క్రిందికి
దిగాను,
ప్రాణం
విడిచింది;
కంటినొప్పీ
లేదు,
కాలినొప్పీ
లేదు;
ఏ
ఒక్క
బాధా
లేదు.
ఈ
దేహంయొక్క
తల్లిదండ్రులు
ఇరువురూ
అట్లాగే
అనాయాసంగా
మరణించారు.
స్వామి
సెలెక్ట్
చేసుకున్నవారు
కనుక,
వారి
జీవితాలు
అంత
పవిత్రంగా
సార్థకమైనాయి.
12
▾
Meaning
Keep
మీరు
ఆనందంగా
ఉన్నరోజే
నా
పుట్టినరోజు
Help
Ever,
Hurt
Never.
ఇతరులకు
మంచి
చేస్తేనే
నాకు
ఆనందము.
“లోకాస్సమస్తాః
సుఖినో
భవంతు”,
అందరూ
క్షేమంగా,
ఆనందంగా,
సౌఖ్యంగా
ఉండాలి.
ఒకరినొకరు
బాధపెట్టుకోకూడదు.
స్వామియొక్క
ప్రేమతత్త్వాన్ని
మీరు
జగత్తులో
చాటుతూరావాలి.
నాకున్న
పెద్ద
ప్రాపర్టీ
కాలేజీ
పిల్లలే.
ప్రైమరీస్కూల్,
హైయర్
సెకండరీ
స్కూల్,
కాలేజీ
పిల్లలందరూ
ఎప్పుడూ
నా
వెంటనే
ఉంటారు.
నన్ను
వదలి
వారు
పోరు,
వారిని
వదలి
నేనుండలేను.
నా
ప్రేమ
అంతా
ప్రజలకోసమే.
ప్రజల
ఆనందమే
నా
ఆనందము.
ఈనాడు
నా
తత్త్వాన్ని
మీకు
పూర్తిగా
వెల్లడి
చేస్తున్నాను.
జన్మదినోత్సవాలు
జరుపుకోవడం
నాకెప్పుడూ
ఇష్టం
లేదు.
కాని,
ఈ
భక్తులు
నన్ను
ఊరకే
ఉండనివ్వరు.
‘ఈ
ఉత్సవం
చేయాలి,
ఆ
ఉత్సవం
చేయాలి’,
అని
అంటారు.
మీరందరూ
ఆనందంగా
ఉన్నరోజే
నా
బర్త్‌డే.
నాకు
ప్రత్యేకమైన
బర్త్‌డే
లేదు.
మీ
పుట్టిన
రోజే
నా
పుట్టినరోజు.
దేహాలు
వేరువేరు
కావచ్చుకాని,
అందరిలో
ఉన్న
ఆత్మ
ఒక్కటే.
కనుక,
మీలో
భేదభావములు
ఉండరాదు.
స్వామికి,
మీకు
మధ్యగల
సంబంధము
లౌకికమైనది
కాదు.
ఇది
ప్రేమసంబంధము.
Previous
←
Satya itself is life
Next
Slay the Naraka in Man with the Weapon of Prema
→