Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2002 · Slay the Naraka in Man with the Weapon of Prema
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Slay the Naraka in Man with the Weapon of Prema
4 November 2002, Dīpāvali, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
ఈ
జగత్తునందు
సుఖము,
దుఃఖము,
శాంతి,
అశాంతి
...
మొదలైనవన్నీ
మార్పుచెందునవే.
మానవుడు
తన
నిజ
స్వరూపాన్ని
గుర్తించుకోలేక
నశ్వరమైన
దేహమే
నిత్యసత్యమని
భ్రమించి,
దేహాన్ని
నమ్ముకొని
జీవిస్తున్నాడు.
మానవుడు
సమష్టి
జీవియేగాని,
వ్యష్టిజీవి
కాడు.
తాను
ఒంటరిగా
జీవించడానికి
ఇష్టపడడు.
కాని,
తాను
సమష్టి
స్వరూపుడననే
సత్యాన్ని
గుర్తించుకోలేక
వ్యష్టిస్వరూపుడనని,
దేహ
స్వరూపుడనని
భ్రమించి
దుఃఖానికి
గురి
అవుతున్నాడు.
అనేకత్వంలోని
ఏకత్వమే
సత్యము.
ఈ
సత్యాన్ని
గుర్తించడమే
మానవుని
ప్రధాన
లక్ష్యము.
భారతీయ
సంస్కృతికూడా
ఇదే
బోధించింది.
కాని,
మానవుడు
ఏకత్వాన్ని,
సమత్వాన్ని
విస్మరించి
భిన్నత్వాన్ని
ఆలోచిస్తూ,
ఆచరిస్తూ,
అనుసరిస్తూ
అశాంతి
ననుభవిస్తున్నాడు.
వేదములోని
ప్రమాణపూర్వకమైన
సత్యమును,
అంతరార్థమును
ప్రజలకు
విపులంగా
వివరించి
ప్రచారం
చేసేవారు
ఈనాడు
చాలా
అరుదుగా
ఉన్నారు.
కొందరు
గ్రంథములను
చదివి,
పెద్దల
ప్రబోధాలను
శ్రవణం
చేసి
తద్ద్వారా
ఏదో
కొంత
అర్థం
చేసికొనగల్గినప్పటికీ
వారు
కూడా
సత్యమును
పూర్తిగా
గుర్తించుకోవడానికి
ప్రయత్నించడంలేదు.
ప్రాచీనకాలములో
హిరణ్యాక్ష,
హిరణ్యకశిపుల
వంటి
రాక్షసులు
వేదమును
పరిపూర్ణంగా
పఠించి
అర్థము
చేసుకున్నవారైనప్పటికీ
తమయందున్న
సత్యతత్త్వాన్ని
పూర్తిగా
విస్మరించి
అసత్యము,
అనిత్యము,
అప్రమాణమైన
మార్గములను
అవలంబించారు.
ఇరువురూ
గొప్ప
విద్యావంతులే,
గొప్ప
సైంటిస్టులు
కూడా.
కాని,
అధిక
భాగము
‘నెగెటివ్
క్వాలిటీస్’కు
అనగా,
ప్రాకృతమైన
తలంపులకు
చోటిచ్చి
పాజిటివ్
తత్త్వాన్ని
విస్మరించారు.
వారి
కోవకు
చెందినవాడే
నరకాసురుడు.
2
▾
Meaning
Keep
His poems 331
Also in his talks
(6)
3 June 1990
Vedic Wisdom
23 November 2000
My Prema Is Your Good Fortune
2 June 2003
That is education which liberates
12 November 2003
Grow Prema for God and pity for the helpless
16 August 2006
The one who dwells in the body is the God of gods
21 January 2007
All parties must become one for the good of the country
అతనుకూడా
గొప్ప
విద్యావంతుడే,
గొప్ప
శక్తిసామర్థ్యములు
గలవాడే.
కాని,
అతనిలో
నెగెటివ్
గుణాలు
అధికంగా
ఉండడంచేత
అతని
శక్తిసామర్థ్యములన్నీ
నిరుపయోగమై
పోయినాయి.
చైతన్యునికి
తల్లి
చేసిన
హితోపదేశం
ఒకపర్యాయం
చైతన్య
మహాప్రభువు
తల్లివద్దకు
వెళ్ళి,
“అమ్మా!
నేను
విద్యాభ్యాసముకొరకు
వెళుతున్నాను.
అనుజ్ఞ
ఇమ్మ”ని
కోరాడు.
అప్పుడామె,
“నాయనా!
ఈ
ప్రపంచంలో
ఎన్నో
విధములైన
విద్యలున్నవి.
కాని,
అవన్నీ
ఏనాటికైనా
అంత్యమయ్యేవేగాని,
అభివృద్ధికి
తోడ్పడేవి
కావు.
లౌకికమైన
విద్యలన్నీ
పరిమితమైన
ప్రమాణములతో
కూడినవి.
ఆధ్యాత్మిక
విద్యయే
నిజమైన
విద్య.
దానికొక
పరిమితి
లేదు.
దానికి
మరణము
లేదు.
అది
సత్యమై,
నిత్యమై
ప్రకాశిస్తూ
ఉంటుంది.
అట్టి
విద్యను
నీవు
అభ్యసించు”,
అని
బోధించింది.
అందువల్లనే,
చైతన్యుడు
నిరంతరం
కృష్ణనామాన్ని
జపిస్తూ,
గ్రామగ్రామాల్లోను,
వీధివీధిలోను
కృష్ణతత్త్వమును
ప్రచారం
చేస్తూ
వచ్చాడు.
అన్నదానము
కన్న
అధిక
దానంబేది
తల్లిదండ్రుల
కన్న
దైవమేది
జపతపంబులకన్న
సత్యశీలంబేది
దయకంటె
ఎక్కువ
ధర్మమేది
సుజన
సంగతి
కన్న
చూడ
లాభంబేది
క్రోధంబు
కన్న
శత్రుత్వమేది
ఋణముకంటెను
నరులకు
రోగమేది
ధరణి
నపకీర్తి
కంటెను
మరణమేది
సర్వదా
కీర్తి
కంటెను
సంపదేది
స్మరణకంటెను
మించు
ఆభరణమేది
శత్రుత్వమును
దూరము
చేసుకొని
మిత్రత్వమును
అభివృద్ధిపరచుకోవాలి.
ఇదే
ఈనాడు
అన్నింటికంటే
అత్యవసరమైన
విద్య.
3
▾
Meaning
Keep
పురుషసూక్తము,
‘సహస్ర
శీర్షా
పురుషః
సహస్రాక్షః
సహస్ర
పాత్’,
అని
చెప్పడంలో
అంతరార్థ
మేమిటి?
భగవంతుడు
వ్యష్టిస్వరూపుడు
కాడు,
తాను
సమష్టిస్వరూపుడు;
సర్వజీవులయందు,
సర్వప్రాణులయందు
కదలక
మెదలక
స్థిరంగా
ఉన్నాడు.
భగవంతుణ్ణి
తనయందే
ఉంచుకొని
మానవుడు
ఎందుకింత
కష్టపడుతున్నాడు?!
భగవంతుణ్ణి
ఎక్కడైనా
దర్శించవచ్చును,
స్పర్శించ
వచ్చును,
ఆయనతో
సంభాషించవచ్చును.
కాని,
అట్టి
పట్టుదల,
పరమ
ప్రేమ
తనయందు
లేకపోవడంచేతనే
మానవుడు
బాధలకు
గురి
అవుతున్నాడు.
ఒకపర్యాయం
చైతన్యుడు
కృష్ణమందిరానికి
వెళ్ళి,
“కృష్ణా!
నీవు
లోకనాథుడవు,
ప్రాణనాథుడవు.
నాకు
లౌకికమైన
భోగభాగ్యములు
అక్కర్లేదు.
నీ
వైకుంఠము
నాకక్కర్లేదు,
కైలాసము
నాకక్కర్లేదు.
మోక్షము
నాకవసరం
లేదు.
నాకు
ప్రేమ
ఒక్కటే
చాలు.
నిన్ను
ప్రేమించే
ప్రేమను
నాకు
ప్రసాదించు”,
అని
ప్రార్థించాడు.
వెంటనే
‘తథాస్తు!’
అని
అతనికి
వినిపించింది.
దైవాన్ని
ప్రేమించకపోతే
మానవుడు
ఎన్ని
విద్యలు
నేర్చినను,
ఎన్ని
శక్తులు
సంపాదించినను
అవన్నీ
వ్యర్థమే.
భగవంతుడు
ఒక్క
ప్రేమకుమాత్రమే
వశుడౌతాడు.
ప్రేమయే
ప్రాణము.
ప్రేమకు
మార్పు
లేదు,
కూర్పు
లేదు.
ప్రాపంచిక
సంబంధమైనవి
ఎన్ని
ఉన్నప్పటికీ
అవన్నీ
మధ్యలో
జారిపోయేటటువంటివే.
కనుకనే,
చైతన్యుడు
తనకు
నిత్యసత్యమైన
ప్రేమను
అనుగ్రహించవలసిందిగా
కృష్ణుణ్ణి
ప్రార్థించాడు.
స్వర్గము,
కైలాసము,
వైకుంఠము....
ఇవన్నీ
భగవంతుని
బ్రాంచాఫీసు
అడ్రసులు.
హృదయమే
భగవంతుని
నిజమైన
అడ్రసు.
అక్కడే
భగవంతుడు
నిశ్చలుడై
ఉన్నాడు.
నరకాసుర
సంహారం
శ్రీకృష్ణుడు
సత్యభామాసమేతుడై
నరకాసురుని
పైకి
యుద్ధానికి
వెళ్ళాడు.
సత్యభామ
చేతిలో
నరకాసురుడు
హతుడయ్యాడు.
సర్వశక్తిమయుడైన
కృష్ణుడే
అతనిని
ఎందుకు
హతమార్చకూడదు?
సత్యభామచేత
ఎందుకు
చంపించాడు?
అనగా,
భగవంతుని
చేతిలో
మరణించడానికికూడా
కొన్ని
క్వాలిఫికేషన్లుండాలి.
నరకాసురుడు
దయాప్రేమలు
లేని
రాక్షసుడు.
అలాంటి
దుర్మార్గునికి
తన
చేతిలో
మరణించే
అర్హత
లేదని
భావించాడు
కృష్ణుడు.
4
▾
Meaning
Keep
His poems 97
Also in his talks
(2)
24 October 1992
To root out the Ahaṅkāra within humanness, offer pure Prema to God
26 February 2006
All is full of Brahman
నరకుడు
స్త్రీలను
చెఱపట్టి
వారిని
అనేకవిధాలుగా
హింసించాడు.
కాబట్టి,
ఒక
స్త్రీ
ద్వారానే
వానిని
చంపించాలని
నిర్ణయించుకొని,
సత్యభామను
తన
వెంటపెట్టుకొని
కృష్ణుడు
వానిపైకి
యుద్ధానికి
వెళ్ళాడు.
పరమ
భక్తురాండ్రైన
పదహారువేలమంది
రాజపుత్రికలు
ఆ
రాక్షసుని
చేతిలో
చిక్కుకొని
నరకబాధలను
అనుభవిస్తూ
వచ్చారు.
కృష్ణుడు
వారికి
స్వేచ్ఛను
ప్రసాదించాడు.
దీనిని
పురస్కరించుకొని
త్యాగరాజు
కృష్ణుని
దివ్యలీలలను
కీర్తిస్తూ
ఇలా
గానం
చేశాడు:
వాచామగోచరుండవు
నీ
చరితములు
పొగడ
బ్రహ్మాదులకైన
తరమా!
హే
కృష్ణా!
కాచుకున్నాను
నా
మొర
ఆలకించి
బ్రోవుమయ్య
కాలుడుగొనిపోయిన
గురుపుత్రుని
తెచ్చి
యిచ్చినావు
కాళీయుని
మదమణచినావు
వసుదేవదేవకీ
చెర
విడిపించినావు
వెలదియొంటియైన
ఆ
ద్రౌపది
‘హా
కృష్ణా!
కృష్ణా!’
యని
మొరలిడ
బ్రోచినావు
మేలు
మేలు
పాండవులను
గాచినావు.
కుచేలుని
ఆర్తిదీర్చినావు
కురూపియైన
కుబ్జ
వక్రములను
పోగొట్టినావు
పదహారువేల
రమామణులను
బ్రోచినావు...
నరకాసుర
వధ
అనగా
ఏమిటి?
నరులయందున్న
అసురుడే
నరకాసురుడు.
నరుడనగా
ఆత్మస్వరూపుడని
అర్థం.
అలాంటి
నరునిలో
దుర్గుణములు,
దురాలోచనలుగల
అసురుడు
ప్రవేశించాడు.
అలాంటివాడు
దుర్మార్గులతోనే
సహవాసము
చేస్తాడుగాని,
సత్యవంతులతో
సహవాసము
చేయడు;
పరమాత్ముని
చేరుటకు
ప్రయత్నించడు.
జన్మజన్మల
పాపఫలముచేత
వాని
మనస్సు
ఈవిధంగా
పెడమార్గం
పడుతుంది.
నేటి
మానవుడు
తాను
గొప్ప
విద్యావంతుడనని
భ్రమిస్తున్నాడు.
కాని,
నిజంగా
తాను
నేర్చినది
విద్య
కానేకాదు,
అది
కేవలం
అవిద్య.
సద్గుణములు,
సత్ప్రమాణములు
నేర్పించనిది
విద్య
ఎట్లవుతుంది?
రాముడు
నేర్చిన
విద్యలను
రావణుడుకూడా
నేర్చుకున్నాడు.
5
▾
Meaning
Keep
కాని,
రాముడు
సద్భావములు,
సత్కర్మలతో
కాలము
గడిపితే
రావణుడు
మాత్రం
దురాలోచనలు,
దుష్ప్రవర్తనలతో
తన
జీవితాన్ని
వ్యర్థం
గావించుకున్నాడు.
కనుకనే,
ప్రజలు
రామునికి
నమస్కరిస్తున్నారు,
రావణుణ్ణి
దూషిస్తున్నారు.
కీర్తి,
అపకీర్తులు
వ్యక్తియొక్క
ప్రవర్తనపైనే
ఆధారపడియున్నవి.
కొంతమంది
ఒంటరిగా
కూర్చొని
ధ్యానము,
తపస్సు
ఇత్యాది
సాధనలు
చేయాలని
ఆశిస్తున్నారు.
ఇది
అవివేకం.
ఎక్కడ
మంచి
జరుగుతున్నదో
అక్కడికి
వెళ్లండి.
ఎక్కడ
భగవత్ప్రార్థన
జరుగుతున్నదో
అక్కడికి
వెళ్ళండి.
ఎక్కడ
భజన
జరుగుతున్నదో
అక్కడికి
వెళ్ళండి.
ఎక్కడ
పవిత్రమైన
పురుషు
లున్నారో
అక్కడికి
వెళ్ళండి.
సర్వజీవులయందు
పరమాత్ముడున్నాడని
గుర్తించి
వర్తించడమే
మీ
ప్రధాన
కర్తవ్యము.
దివ్యత్వాన్ని
స్మరించడమే
కాకుండా
భజించడము
అత్యవసరము.
నరకాసుర
సంహారమనగా
నరునిలో
దాగిన
అసురుని
చంపడం.
ప్రతి
వ్యక్తియందు
ఒక
అసురుడున్నాడు.
వానిని
చంపాలంటే
ఎక్కడికో
పోయి
అస్త్రశస్త్రములను
సంపాదించనక్కర్లేదు.
హృదయమునందే
ఉన్న
ఆత్మస్వరూపాన్ని
చింతిస్తూ
రావాలి.
అదియే
ప్రేమస్వరూపము.
ప్రేమచేతనే
నరునిలో
ఉన్న
అసురుని
సంహారము
చేయవచ్చును.
వీడు
అస్త్రశస్త్రములతో
చచ్చేవాడు
కాడు.
ఈ
లోకంలో
ఎన్ని
అస్త్రశస్త్రములు
లేవు?
అవేమి
చేయగల్గుతున్నాయి?
నిజం
చెప్పాలంటే,
ఈ
అస్త్రశస్త్రములద్వారా
మానవుడు
తనను
తానే
హింసించుకుంటున్నాడు.
మొట్టమొదట
తాను
ఆత్మాభిమానమును
అభివృద్ధిపరచుకోవాలి.
అప్పుడే
తనలో
ఉన్న
నరకుడు
చచ్చిపోతాడు.
ఈ
సత్యాన్ని
గుర్తించి
వర్తించడమే
నిజమైన
భక్తి.
దైవముతో
సంబంధము
ఏర్పర్చుకోండి
నరకాసుర
సంహారంతో
అతని
రాజ్యంలో
గొప్ప
పండుగ
వాతావరణం
నెలకొంది.
వాని
చావుతో
ద్వేషము,
రాక్షసత్వము
నిర్మూలమైనాయి;
అజ్ఞానమనే
అంధకారం
తొలగిపోయింది.
ప్రజలు
ఆనందోత్సాహాలతో
ఇళ్ళను
చక్కగా
అలంకరించుకొని
దీపాలు
వెలిగించారు.
ఆ
దుర్మార్గు
డున్నంత
కాలము
ఇళ్ళలో
ఒక్క
దీపము
కూడా
కనిపించ
లేదు;
అసలు
ఎక్కడా
వెలుతురే
లేదు.
చీకట్లో
ఏముంటాయి?
గబ్బిలాలుంటాయి.
అదేరీతిగా,
అజ్ఞానాంధకారంతో
నిండిన
హృదయంలో
దుర్గుణాలు
ప్రవేశిస్తాయి.
6
▾
Meaning
Keep
అటువంటి
దుర్జనులతో
సహవాసం
చేస్తే
మీరుకూడా
‘గబ్బిలాలు’గా
తయారౌతారు.
కనుక,
దుర్జనులతో
ఒక్క
క్షణంకూడా
చేరకూడదు.
దానవులయొక్క
సంబంధమును
దూరంచేసుకొని
దైవత్వంతో
సంబంధము
ఏర్పర్చుకోవాలి.
ప్రహ్లాదుడు
తన
హృదయంలో
భగవంతునికి
తప్ప
అన్యులకు
చోటివ్వలేదు;
భగవన్నామస్మరణలో
తాను
లీనమైపోయాడు
కనుకనే,
భగవత్ప్రేమకు
పాత్రుడయ్యాడు.
మీరుకూడా
ప్రహ్లాదునివలె
నామస్మరణతో
కాలమును
సార్థకం
గావించుకోండి.
ఈనాడు
లోకంలో
కళ్ళతో
చూడడానికి,
చెవులతో
వినడానికి
వీలుకానటువంటి
రాక్షస
కృత్యములు
జరుగుతున్నాయి.
అలాంటివాటికి
మనమెందుకు
అవకాశ
మివ్వాలి?
“ఈశ్వర
స్సర్వ
భూతానాం”.
సర్వజీవులయందున్నది
భగవంతుడే
అని
విశ్వసించండి.
దైవమును
మీ
హృదయంలో
ప్రతిష్ఠ
చేసుకోండి.
కొందరు
చూడడానికి
చాలా
సాత్వికంగా
కనిపిస్తారుగాని,
వారి
హృదయంలో
చాలా
క్రూరమైన
భావాలుంటాయి.
“యద్భావం
తద్భవతి”,
ఎవరి
దుష్టభావాలు
వారినే
హతమారుస్తాయి.
అలాంటివారితో
మనం
ఏమాత్రం
సంబంధము
పెట్టుకోకూడదు.
వ్యష్టి
జీవితమనేది
వ్యర్థ
జీవితము!
దివ్యాత్మస్వరూపులారా!
దీపావళి
పేరుతో
మీరు
పాయసం
వండుకొని
పండుగ
జరుపుకుంటున్నారుగాని,
పవిత్రమైన
దీని
యొక్క
అంతరార్థమును
గుర్తించుకోవడానికి
ప్రయత్నిస్తున్నారా?
పండుగలను
సరియైనరీతిగా
జరుపుకోవాలంటే
సత్సంగములో
ప్రవేశించాలి.
ఒంటరిగా
జీవించవద్దు.
వ్యష్టి
జీవితము
‘వేస్ట్’
జీవితమనే
చెప్పవచ్చు.
సమష్టి
జీవితమే
సర్వేశ్వరసన్నిధి.
కనుక,
సమష్టితో
చేరి
మీ
జీవితాన్ని
ఆనందంగా
గడపాలి.
సమష్టి
స్వరూపమే
భగవత్స్వరూపము.
“సహస్ర
శీర్షా
పురుషః
సహస్రాక్షః
సహస్రపాత్...”
అంటూ
వేదము
బోధిస్తున్నదికూడా
ఇదే.
మానవ
జీవితము
దేనికోసం
వచ్చింది?
పశుపక్షిమృగాదులవలె
తిని
తిరగడానికి
కాదు.
మీరు
తిన్నట్లు
అవికూడా
తింటున్నాయి.
మీరు
అనుభవించే
విషయవాసనలను
అవికూడా
అనుభవిస్తున్నాయి.
ఇంక
మీకు,
పశుపక్ష్యాదులకు
తేడా
ఏముంది?
కనుక,
ఇది
కాదు
మీరు
చేయవలసింది.
మీయందున్న
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమలనే
మానవతా
విలువలను
మీరు
బహిర్గతం
చేయాలి.
7
▾
Meaning
Keep
వాటిని
మీరు
ఆచరించాలి,
ప్రబోధించాలి,
ప్రచారం
చేయాలి.
ఆచరణలో
అనుభవించక
కేవలం
ప్రచార
ప్రబోధలు
చేస్తే
లాభం
లేదు.
నిజంగా
మానవుడెంతో
అదృష్టవంతుడు.
మానవజన్మ
చాలా
పవిత్రమైనది.
“జంతూనాం
నరజన్మ
దుర్లభం”,
అన్నారు.
మానవుడంటే
పవిత్రమైనవాడని
అర్థం.
ఇటువంటి
పవిత్రమైన
జన్మను
మీరెందుకు
అపవిత్రం
గావించుకుంటున్నారు?
నోటితో
పవిత్రమైన
విషయాలను
చెప్పినంతమాత్రాన
సరిపోదు,
వాటిని
ఆచరణలో
పెట్టడానికి
ముందంజ
వేయాలి.
ప్రేమస్వరూపులారా!
మీలో
దుర్గుణములు
తలెత్తినప్పుడు
వాటిని
ధిక్కరించి
పవిత్రమైన
మార్గములో
వెళ్ళడానికి
ప్రయత్నం
చేయాలి.
దుర్గుణములు
కల్గిన
వ్యక్తులకొక
నమస్కారం
చేసి,
వారిని
దూరంగా
పొమ్మని
చెప్పాలి.
త్యాగరాజు
ఒక
పర్యాయము,
“రామా!
నిన్ను
విశ్వసించే
వారికొక
నమస్కారం.
నిన్ను
దూషించేవారికికూడా
ఒక
నమస్కారం”,
అన్నాడు.
శిష్టులకు,
దుష్టులకు
ఇరువురికీ
నమస్కారం
చేశాడు.
సజ్జనులకు
నమస్కారం
చేయడంలో
న్యాయం
ఉంది
కాని,
దుర్జనులకుకూడా
ఎందుకు
నమస్కారం
చేయాలి?
అని
మీకు
సందేహం
కల్గవచ్చు.
సజ్జనులకు
నమస్కరించడమెందుకంటే,
వారు
మనకెప్పుడూ
దూరం
కాకుండా
ఉండాలని.
మరి
దుర్జనులకెందుకు
నమస్కారం
చేయాలి?
“మీ
సంపర్కము
మాకెప్పుడూ
కలుగకూడదు.
దయచేసి
మానుండి
దూరంగా
పొండి”,
అనే
భావనతో
వారికి
నమస్కరించాలి.
దుర్జనులకు
నమస్కారం
చేసి
వారిని
దూరంగా
పంపాలి.
సజ్జనులకు
నమస్కారం
చేసి
వారికోసం
మన
జీవితాన్ని
అర్పితం
చేయాలి.
సత్సంగములో
చేరి
సద్గుణములను
పోషించుకొని,
సరియైన
మార్గంలో
నడచి
జన్మను
సార్థకం
గావించుకోవాలి.
రాక్షస
విశ్వాసము
దేవకీదేవికి
వసుదేవునితో
వివాహం
జరిగింది.
ఆమె
సోదరుడైన
కంసుడు
వారిరువురినీ
రథంలో
కూర్చుండబెట్టుకొని
తానే
స్వయంగా
రథము
నడుపుతూ
తీసుకువెళుతున్నాడు.
ఆ
సమయంలో,
“కంసా!
నీ
చెల్లెలి
అష్టమగర్భమున
నిన్ను
చంపేవాడు
పుడతాడు”,
అని
ఆకాశవాణి
హెచ్చరించింది.
8
▾
Meaning
Keep
Also in his talks
(4)
1 April 1995
Make God your true friend
7 July 1996
Faith Alone Is Man's Eyes
23 November 2000
My Prema Is Your Good Fortune
19 November 2001
Only when parents are ideal do children become virtuous
కంసుడు
ఉగ్రుడై
తక్షణమే
దేవకీదేవిని
చేయిపట్టి
బయటికి
లాగి
చంపడానికి
ప్రయత్నించాడు.
వసుదేవుడు
అడ్డుపడి,
“కంసా!
ఈమె
అష్టమ
గర్భములో
పుట్టేవాడు
కదా
నిన్ను
చంపేది.
అంతవరకు
కాచుకొని
ఉండు.
పుట్టిన
తక్షణమే
ఆ
శిశువును
తెచ్చి
నీ
చేతిలో
పెడతాను.
నీ
చెల్లెలిని
అన్యాయంగా
చంపవద్దు”,
అని
ప్రాధేయపడ్డాడు.
వసుదేవుని
మాటను
మన్నించి
కంసుడు
ఆమెను
వదలిపెట్టాడు.
కాని,
అతనికి
మనశ్శాంతి
కరవైంది.
తనను
చంపేవాడు
ఎప్పుడైనా
ఎక్కడైనా
పుట్టవచ్చుననే
భయంతో
గ్రామంలో
పుట్టిన
పిల్లలందరినీ
చంపుతూ
వచ్చాడు.
రాక్షసులకు
ఒక
మాటపై
నిలకడ
ఉండదు.
అది
భగవంతుడు
చెప్పిన
మాట
అని
తెలిసినప్పుడు
ఒకదానిని
మాత్రమే
విశ్వసించి
రెండవదానిని
ఎందుకు
విశ్వసించకూడదు?
అతనిని
చంపేవాడు
దేవకీగర్భములో
పుడతాడని
చెప్పాడేగాని,
గ్రామస్థులకు
పుడతాడని
చెప్పలేదు
కదా!
మరి
గ్రామస్థుల
పిల్లలందరినీ
ఎందుకు
చంపడం?
భగవద్వాక్యముపైన
అతనికి
విశ్వాసమున్నట్లా?
లేదు,
లేదు.
అది
రాక్షస
విశ్వాసము.
ఇలాంటి
రాక్షసవిశ్వాసంచేతనే
మనిషి
బలహీనుడైపోతున్నాడు.
దైవాన్ని
నమ్మితే
దైవము
చెప్పే
మాటలపై
తనకు
పూర్తిగా
నమ్మకముండాలి.
తనకు
ఇష్టమైన
మాటలను
నమ్మటం,
ఇష్టం
లేని
మాటలను
నమ్మకపోవడం...
ఇది
సరియైన
విశ్వాసము
కాదు.
ఒక
చిన్న
ఉదాహరణ:
పది
సంవత్సరాలకు
పూర్వం
ఒక
పెద్దమనిషి
వచ్చి,
“సత్యసాయిబాబా
భగవంతుడు.
ప్రతి
జీవియందు
భగవంతుడు
ఉన్నాడు”,
అని
చాటుతూ
వచ్చాడు.
తరువాత
తన
అభీష్టానికి
కొంత
విరుద్ధంగా
జరిగేటప్పటికి,
“He
is
not
God
(ఆయన
భగవంతుడు
కాడు)”,
అని
చెప్పాడు.
అవునని
చెప్పింది,
కాదని
చెప్పింది
ఒకే
నోరే!
ఆనాడు
‘యెస్’
అన్నాడు,
ఈనాడు
‘నో’
అన్నాడు.
అది
నిజమా?
ఇది
నిజమా?
ఇలాంటి
రెండు
మాటలు
మాట్లాడేవానిని
ఏమని
భావించాలి?
దీనినే
రాక్షసవిశ్వాసమంటారు.
‘యెస్’
అనువారికి
‘యెస్’
అనురా
‘నో’
అనువారికి
‘నో’
అనురా
‘నో’,
‘యెస్’లు
మీ
నోటికెగాని
సాయికి
సర్వం
‘యెస్,
యెస్,
యెస్’
9
▾
Meaning
Keep
లౌకికమైన
నెగెటివ్
భావాలతోకూడినవారు
మంచి,
చెడ్డలను
విచారించుకోకుండాపోతే
తమ
జీవితాన్నే
నాశనం
చేసుకుంటారు.
కనుకనే,
ఈనాడు
మీకు
కొన్ని
విషయాలను
చెప్పవలసివస్తోంది.
నాకందరూ
మంచివారే,
ఎవరూ
చెడ్డవారు
లేరు.
నాకు
అందరూ
ప్రీతిపాత్రులే.
నేను
అందరినీ
ప్రేమిస్తాను.
అర్థంలేని
సందేహాలకు
చోటివ్వకండి.
అవి
ప్రమాదానికి
దారితీస్తాయి.
సందేహాలను
నిర్మూలించుకోనంతవరకు
అవి
మిమ్మల్ని
అనేకవిధాలుగా
అశాంతికి
గురిచేస్తాయి.
కనుక,
ప్రేమను
పెంచుకోండి.
హృదయంలో
ప్రేమను
నింపుకున్నప్పుడు
మీకు
సర్వమూ
ప్రేమమయంగానే
గోచరిస్తుంది.
ప్రేమ
ఉన్నచోట
ద్వేషమే
ఉండదు.
ద్వేషము
లేనప్పుడు
క్రోధమే
రాదు.
క్రోధము
లేనప్పుడు
హింసలకు
పాల్పడరు.
విశ్వాసమెక్కడో
ప్రేమ
అక్కడ.
ప్రేమ
ఎక్కడో
సత్యమక్కడ.
సత్యమెక్కడో
శాంతి
అక్కడ.
శాంతి
ఎక్కడో
ఆనందమక్కడ.
ఆనందమెక్కడో
దైవమక్కడ.
కనుక,
మొట్టమొదట
విశ్వాసమును
పెంచుకోండి.
మనస్సులో
ఒకటి,
మాటలో
మరొకటి,
క్రియలో
వేరొకటి...
ఇది
రాక్షసత్వమనే
చెప్పవచ్చు.
త్రికరణశుద్ధి
గలవాడే
నిజమైన
వ్యక్తి.
తనయందున్న
దివ్యశక్తిని
వ్యక్తం
చేసేవాడే
నిజమైన
వ్యక్తి.
ప్రియమైన
విద్యార్థులారా!
ముఖ్యంగా
మీరు
ప్రేమను
అభివృద్ధి
పరచుకోండి.
చైతన్యుడు
ఏమని
ప్రార్థించాడు?
“కృష్ణా!
నీ
స్వర్గము,
కైలాసము,
వైకుంఠము
నాకక్కర్లేదు.
నీ
ప్రేమసామ్రాజ్యంలో
నాకు
చోటివ్వు.
అదొక్కటే
చాలు
నాకు”,
అన్నాడు.
ప్రేమతో
సాధించలేనిది
ఈ
లోకంలో
ఏదీ
లేదు.
ప్రేమ
ఒక్కటుంటే
చాలు,
సర్వమూ
సిద్ధిస్తుంది.
మానవునిలో
ఉన్న
దుర్గుణములు,
దురాచారములను
సంహరించడమే
నరకాసురవధ.
ఆ
తరువాత
సద్గుణములు,
సదాచారములను
పెంచుకోవాలి.
“త్యజ
దుర్జన
సంసర్గం”.
అయితే,
మీరు
దుర్జన
సంసర్గమును
త్యజించినంతమాత్రాన
చాలదు.
“భజ
సాధుసమాగమం”.
సత్సంగంలో
చేరాలి.
“కురు
పుణ్య
మహోరాత్రం”
ఎల్లప్పుడు
మంచి
కార్యములాచరించాలి.
అందుకోసమే
మానవ
జన్మ
వచ్చింది.
మీరు
మానవులుగా
పుట్టింది
పశుపక్షిమృగాదులవలె
తిని,
తిరగడానికి
కాదు.
మానవుడు
చాలా
ఉత్తముడు,
పవిత్రుడు.
కనుక,
మానవునికి
దుర్బుద్ధులు
రాకూడదు.
రాక్షస
కృత్యములను
దూరం
గావించుకోవాలి.
10
▾
Meaning
Keep
తనలో
ఉన్న
దైవత్వాన్ని
ప్రకటించే
మార్గమును
వెతుక్కోవాలి.
దానిని
ప్రచారం
చేస్తూ
ఆనందాన్ని
అనుభవించాలి.
ప్రేమస్వరూపులారా!
సద్భావములను
పెంచుకోండి,
సత్ప్రవర్తనను
కల్గియుండండి.
ఇతరులు
చెప్పే
మాటలకు
లొంగిపోకండి.
ఆత్మ
విశ్వాసమును
సమృద్ధిగా
అభివృద్ధి
చేసుకోండి.
ఆత్మవిశ్వాసమువలన
ఆత్మసంతృప్తి
కల్గుతుంది.
ఆత్మసంతృప్తి
స్వార్థత్యాగానికి
దారితీస్తుంది.
స్వార్థత్యాగంవలన
ఆత్మసాక్షాత్కారం
లభిస్తుంది.
పునాది
లేకుండా
గోడలు
కట్టలేము.
గోడలు
కట్టకుండా
పైకప్పు
వేయలేము.
పైకప్పు
వేయకుండా
అందులో
నివసించలేము.
మీ
జీవిత
భవనానికి
ఆత్మవిశ్వాసమే
పునాది;
ఆత్మసంతృప్తియే
గోడలు;
స్వార్థత్యాగమే
roof
ఆత్మసాక్షాత్కారమే
life.
కాబట్టి,
ఈనాటి
నుండైనా
‘పునాది’ని
భద్రం
చేసుకుంటూ
రండి.
Start
early,
drive
slowly,
reach
safely
అని
నేను
చెప్పడం
ఇందుకోసమే.
ఎవరేమనుకుంటారో
అని
ఏమాత్రం
భయపడకండి.
పవిత్రమైన
జీవితాన్ని
ప్రపంచానికి
అందించండి.
ఈరోజుల్లో
ఒకరినొకరు
‘గుడ్
మార్నింగ్’,
‘గుడ్
నైట్’
అని
పలుకరించుకోవడం
ఒక
ఫ్యాషన్‌గా
తయారైంది.
ఈ
‘గుడ్‌మార్నింగ్’,
‘గుడ్
నైట్’
అనే
పదాలు
మన
సంస్కృతికి
సంబంధించినవి
కావే!
‘నమస్కారము’
అనండి,
ఎంత
ఆనందం
కల్గుతుంది!
ఈ
రోజుల్లో
నిరక్షరాస్యులైనా
నమస్కారమని
చెబుతారుగాని,
విద్యావంతులకు
నమస్కారమని
చెప్పడం
కూడా
చాలా
బరువైపోయింది.
నిజంగా
సైన్సు
ప్రకారం
చూస్తే,
‘మార్నింగ్’
లేదు,
‘ఈవినింగ్’
లేదు.
సూర్యోదయం
లేదు,
సూర్యాస్తమయం
లేదు.
భూమి
తిరగడంచేత
ఈవిధమైన
మార్పులు
కల్గుతున్నాయి.
ఈనాటి
మానవుడు
లేనిదానిని
చెబుతున్నాడుగాని,
ఉన్నదానిని
ఉచ్చరించడం
లేదు.
విద్యార్థులారా!
తల్లిదండ్రులను
గౌరవించండి,
ప్రేమించండి.
వారి
ప్రేమకు
పాత్రులు
కండి.
తల్లిదండ్రుల
ప్రేమను
అనుభవించిన
వారికి
చక్కని
భవిష్యత్తు
ఉంటుంది.
తల్లి
ఆశీర్వాదము
అత్యవసరం.
మీ
తల్లిదండ్రులను
మీరు
ఆనందింపజేస్తే
భవిష్యత్తులో
మీ
పిల్లలు
మీకు
ఆనందమునందిస్తారు.
ఆనందము
నివ్వకుండా
ఆనందమును
పుచ్చుకోవాలంటే
ఎలా
సాధ్యమౌతుంది?
11
▾
Meaning
Keep
ఇది
‘వన్
వే
ట్రాఫిక్’
కాదు.
Give
and
take.
ఇచ్చి
పుచ్చుకోండి.
మీ
జీవితము
సార్థకం
కావాలంటే
మంచి
మాటలు
మాట్లాడండి,
మంచిదృశ్యాలను
చూడండి,
పవిత్రమైన
విషయాలను
వినండి,
పవిత్రమైన
జీవితాన్ని
గడపండి.
Previous
←
Know for Certain: I Am Sai
Next
Setting the Home in Order: The Housewife's First Duty
→