Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2005 · Karaṇam Subbamma, a Blessed Soul
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Karaṇam Subbamma, a Blessed Soul
9 March 2005, Mahāśivarātri, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 544
Also in his talks
(1)
21 July 2005
No power is greater than Bhakti for God
కట్టడ
యైనయట్టి
నిజ
కర్మము
చుట్టుచు
వచ్చి
యే
గతిం
బెట్టునొ
పెట్టినట్లనుభవింపక
తీరదు;
కాళ్ళు
మీదుగా
గిట్టక
వ్రేలుడంచు
దలక్రిందుగ
గట్టిరె
యెవ్వరైన
నా
చెట్టున
గబ్బిలంబులకు
జేరిన
కర్మము
గాక
మానవా!
గబ్బిలాలను
ఎవరైనా
పట్టి
తెచ్చి
తల
క్రిందులుగా
చెట్టు
కొమ్మలకు
కట్టివేశారా?
లేదు.
అవి
తమ
కర్మను
తాము
అనుభవిస్తున్నవి.
అటులనే,
ప్రతి
ప్రాణీ,
ప్రతి
మానవుడూ
తమ
కర్మలను
తాము
సహజంగా
అనుభవించక
తప్పదు.
కాని,
ప్రతి
మానవుడుకూడా
తాను
చేయని
నేరానికి
శిక్షను
అనుభవిస్తున్నట్లుగా
భావిస్తాడు.
‘ఏమిటీ
చిత్రము!
నేనేమీ
తప్పు
చేయలేదే!
చేయకపోయినప్పటికీ
ఈ
కష్టమును
అనుభవించవలసి
వస్తున్నదే!’
అని
అనుకుంటాడు.
ప్రాణులు
అనుభవించే
కష్టసుఖములు
రెండుకూడను
తాము
చేసుకున్న
కర్మలయొక్క
ఫలమే!
ప్రతి
మానవుడు
కర్మను
ఆచరిస్తున్నాడు,
దాని
ఫలితాన్ని
అనుభవిస్తున్నాడు.
కాని,
ఇప్పటికి
కూడా
“ఎక్కడినుండి
వచ్చినదీ
కర్మ?
నేను
చేసినదే
వచ్చిందా?
లేక,
మరొకరు
దీనికి
కారణమా?”
అనే
సందేహం
మానవునకు
తీరడం
లేదు.
ఒక్క
మానవుడే
కాదు;
పశు
పక్షిమృగాదులు,
క్రిమికీటకాదులుకూడను
తమ
తమ
కర్మలను
తాము
అనుభవిస్తూనే
ఉన్నవి.
మనం
అనుభవించే
ప్రతి
ఒక్కటీ
మన
కర్మల
ఫలితమే
అని
గుర్తించాలి.
మానవత్వాన్ని
ధరించి
తాను
అన్నింటినీ
గమనిస్తున్నప్పటికీ
ఇంకను
ఈ
సత్యాన్ని
తెలుసుకోలేక
పోతున్నాడు,
మానవుడు.
2
▾
Meaning
Keep
ఆడిన
మాట
తప్పేవాడు
కాదు
సత్యసాయి
కర్మఫల
నిమిత్తమై
ఏర్పడిన
జన్మలనుగురించి
మీకు
బోధించేందుకై
ఈనాడు
నేను
ఈ
విషయాలనుగూర్చి
వెల్లడిస్తున్నాను.
పుట్టపర్తిలో
కరణం
సుబ్బమ్మ
అనే
భక్తురాలు
ఉండేది.
ఆమె
గొప్ప
శ్రీమంతురాలు.
ఆమెకు
బిడ్డలు
లేరు.
తనకున్న
సంపదను
దానధర్మాలకు
వినియోగిస్తూ,
“నాకు
భగవంతుడు
పెట్టిన
భిక్షయే
నేను
ఇతరులకు
అందిస్తున్నాను”,
అనే
పవిత్రమైన
భావంతో,
సమచిత్తంతో
కాలం
గడుపుతూ
వచ్చింది.
ఆమెకు
ఒక్క
కోరిక
మాత్రం
ఉండేది.
ఒకరోజున
“స్వామీ,
నా
అంత్య
సమయంలో
తమ
దివ్యహస్తములద్వారా
నా
నోటిలో
నీరు
పోయాలి”
అని
కోరింది.
తప్పకుండా
ఆమె
కోరిక
తీరుస్తానని
ఆనాడు
నేను
మాటిచ్చాను.
మాట
ఇచ్చిన
అనేక
సంవత్సరముల
తరువాత
నేనొక
పర్యాయం
మద్రాసుకు
వెళ్ళడం
జరిగింది.
ఆ
సమయంలో
ఆమె
ఆరోగ్యంగానే
ఉన్నది.
అది
యుద్ధ
సమయం.
మద్రాసులో
గంటకొక
సైరన్
వినిపించేది.
తక్షణమే
బజార్లన్నీ
ఖాళీ
అయిపోయేవి.
ఆవిధమైన
పరిస్థితిలో
మేము
తిరిగి
రావడానికి
వీల్లేకపోయింది.
ఈలోపల
సుబ్బమ్మకు
సీరియస్
అయింది.
ఆమెను
బుక్కపట్నంలో
తల్లిగారింటికి
తీసుకు
వెళ్ళారు.
అక్కడే
ప్రాణం
పోయింది.
అప్పుడు
కార్లు
పుట్టపర్తికి
వచ్చేవి
కావు.
కారులో
బుక్కపట్నం
వచ్చి
అక్కడినుండి
బండిలో
పుట్టపర్తికి
వస్తున్నాను.
రోడ్డు
ప్రక్కన
చాలామంది
ప్రోగై
వున్నారు.
“ఏం
జరిగింది?”
అని
ఒకరిని
అడిగాను.
“స్వామీ,
క్రిందటి
రాత్రి
కరణం
సుబ్బమ్మ
దేహాన్ని
వదిలింది.
ప్రాణం
పోయేంతవరకు
‘సాయిరాం,
సాయిరాం’,
అని
స్మరిస్తూనే
ఉన్నది.
ఆమె
దేహాన్ని
స్మశానానికి
తీసుకుపోవడానికి
ఏర్పాట్లు
చేస్తున్నారు”,
అని
చెప్పాడతను.
ఆనాడు
పల్లెల్లో
అన్నీ
‘రెడీ
మేడ్’గా
చిక్కేవి
కావు.
ఏదో
అక్కడ
ఇక్కడ
కట్టెలు
సంపాదించి
ఆమెను
స్మశానానికి
మోసుకుపోవడానికి
ఏర్పాట్లు
చేస్తున్నారు.
“ఇప్పుడు
సుబ్బమ్మ
ఎక్కడుంది?”
అని
అడిగాను.
“ఆమె
తల్లిగారింట్లో
వరండాలో
మృతదేహాన్ని
పెట్టారు,
స్వామీ!”
అన్నాడు.
నేను
గట్టిగా
నవ్వాను.
నేను
ఆమెకిచ్చిన
మాటను
మరువలేదు.
3
▾
Meaning
Keep
నేను
ఆ
బండిని
నేరుగా
సుబ్బమ్మ
ఇంటికి
తీసుకు
వెళ్లమని
చెప్పాను.
అక్కడ
వరండాలో
అందరూ
ఏడుస్తున్నారు.
“స్వామీ!
సుబ్బమ్మ
కడపటి
వరకు
తమను
తలుచుకుంటూనే
పోయింది”,
అన్నారు.
“ఎక్కడికి
పోయింది?”
అని
అడిగాను,
నాకేమీ
తెలియనట్లు
నటిస్తూ.
“స్వామీ!
డాక్టర్లు
వచ్చి
చూశారు,
ప్రాణం
పోయిందని
నిర్ధారించారు”,
అని
చెప్పారు.
నేను
దగ్గరకు
వెళ్లి
సుబ్బమ్మమీద
కప్పిన
దుప్పటిని
తొలగించాను.
ఒళ్ళంతా
చీమలు!
‘సుబ్బమ్మా!
సుబ్బమ్మా!’
అని
పిలిచాను.
కనులు
తెరిచింది.
నన్ను
చూసింది.
ఆనందబాష్పాలు
రాలుస్తూ,
“స్వామీ,
ఎప్పుడు
వచ్చారు?”
అని
ప్రశ్నించింది.
“ఇప్పుడే
వచ్చాను
సుబ్బమ్మా!”
అన్నాను.
ఆమె
కనులు
తెరచి
స్వామివైపు
చూస్తూ
మాట్లాడుతుంటే
ఆమె
బంధువులు
గబగబా
ఇంట్లోకి
దూరారు.
“సుబ్బమ్మా!
ఏమని
తలచుకుంటున్నావు?”
అని
అడిగాను.
“సాయిరాం,
సాయిరాం...అనుకుంటున్నాను
స్వామీ!”
అని
చెప్పింది.
నాదగ్గరున్న
కర్చీఫ్‌తో
ఆమె
కంటిధారలు
తుడిచాను.
ఆమె
ఎంతో
ఆనందంతో
నా
చేయిపట్టుకొని,
“స్వామీ!
మీరిచ్చిన
మాటను
నిలబెట్టుకోవడానికి
వచ్చారా?
ఆనాడు
ఇచ్చిన
వాగ్దానం
మీకింకా
జ్ఞప్తికి
ఉందా
స్వామీ!
ఎంతటి
కరుణ
మీకు!”
అన్నది.
ఆడిన
మాట
తప్పేవాడు
కాదు
సత్యసాయి.
తన
పేరే
సత్యము.
తాను
చెప్పేదికూడా
సత్యమే.
ఈలోపల
ఆమె
తల్లి,
తమ్ముళ్ళు,
డాక్టర్లు
అందరూ
లోపలికి
వచ్చారు.
“ఇంతసేపూ
సుబ్బమ్మ
ఎలా
మాట్లాడుతోంది?
రాత్రినుండి
ఈమెకు
శ్వాస
లేదే!
ఏమిటీ
విచిత్రము!
ఇది
సాయిబాబా
శక్తి
యేమో”,
అనుకున్నారు.
సుబ్బమ్మ
నా
చేయి
తీసి
తన
నుదుటిపై
పెట్టుకుంది.
నేనప్పుడు
విభూతి
తీసి
ఆమె
నొసట
రాశాను.
“సుబ్బమ్మా!
నీకు
ఇంతవరకు
ఏ
చింత
ఉండినాదో
ఆ
చింత
తీరినది
కదా!
‘ఈసమయంలో
స్వామి
నాచెంత
లేడే’,
అని
బాధపడుతూ
వచ్చావు.
స్వామిని
చూశావు.
స్వామి
మాటలు
విన్నావు.
స్వామి
చేయి
పట్టుకున్నావు.
ఇంక
నీవు
ప్రశాంతంగా
కన్ను
మూసుకో.
నేను
పుట్టపర్తికి
వెళుతున్నాను”
అని
చెప్పాను.
“మంచిది
స్వామీ,
మంచిది.
నన్నుకూడా
ఎక్కడికి
పంపించాలో
అక్కడికి
పంపించి
మీరు
పుట్టపర్తికి
వెళ్ళండి”
అన్నది.
“సాయిరాం,
సాయిరాం”
అంటూ
తాను
ప్రశాంతంగా
కన్ను
మూసింది.
సుబ్బమ్మ
మృతదేహాన్ని
స్మశానానికి
తీసుకు
వెళ్ళారు.
సుబ్బమ్మను
చితిపై
పెట్టి
ఆమె
తమ్ముడు
నిప్పంటించాడు.
ఆమె
కాలేంతవరకుకూడా
నవ్వు
ముఖముతోనే
ఉండినది.
4
▾
Meaning
Keep
ఆ
ఊర్లో
అందరికీ
అదే
ఒక
పెద్ద
వింత!
నేను
పుట్టపర్తికి
బయలుదేరాను.
చిత్రావతీ
నదిలో
నడుచుకుంటూ
పోవాలి.
నాకోసం
సుబ్బమ్మ
పూర్వమే
రెండెడ్ల
బండిని
తయారు
చేసిపెట్టింది.
ఆ
ఎడ్లబండిలో
కూర్చున్నాను.
గృహం
అమ్మాయి
తమ్ముడు
చంద్రమౌళి
కూడా
ఆ
బండిలో
ఉన్నాడు.
సుబ్బమ్మకు
దహన
సంస్కారం
జరుగుతుంటే
పొగ
కనిపిస్తుండాది.
చంద్రమౌళి,
“స్వామీ,
ఇంతసేపు
ఉండినవారు
ఇంకా
కొద్దిసేపు
చూసి
ఉండకూడదా?”
అని
అడిగాడు.
“చంద్రమౌళీ!
నేను
ఆడిన
మాట
తప్పేవాడను
కాను.
ఆమె
నోట్లో
నీరు
పోసి
ప్రశాంతంగా
పొమ్మని
చెప్పాను.
ఇచ్చిన
మాట
దక్కించుకొని
వచ్చేశాను”,
అన్నాను.
చంద్రమౌళి
చాలా
ఆనందించి,
“స్వామీ,
మీకు
భక్తులపై
ఎంతటి
దయ!
మీ
దయను
వర్ణించుటకు
భాష
చాలదు”,
అన్నాడు.
సుబ్బమ్మపై
స్వామికి
ఉన్న
దయ
ఇంతా
అంతా
కాదు.
అట్లే,
సుబ్బమ్మకు
స్వామిపట్ల
ఉన్న
భక్తిప్రపత్తులు
‘ఇట్టివి,
అట్టివి’
అని
వర్ణించడానికి
వీలుకాదు.
ఆమె
భక్తి
ప్రహ్లాదుని
భక్తికంటే
మించినదిగా
కనిపించింది.
మరణించిన
సుబ్బమ్మను
బ్రతికించి,
ఆమె
నోట్లో
నీరుపోసి
స్వామి
తన
మాటను
నిలబెట్టుకున్నారన్న
వార్త
ఊర్లో
అందరికీ
తెలిసిపోయింది.
రెండవ
దినమే
పుట్టపర్తికి
ఒకదాని
తరువాత
ఒకటి
అనేక
కార్లు
వచ్చినాయి.
“సుబ్బమ్మ
బ్రతికిందట.
ఆమె
నోట్లో
నీరు
పోశారట
సాయిబాబా”,
అని
జనులు
అనేకరకాలుగా
మాట్లాడుతూ
వచ్చారు.
పుట్టపర్తిలో
సుబ్బమ్మ
ఇల్లంతా
జనాలతో
నిండిపోయింది.
ఆమె
అదృష్టాన్ని
అందరూ
కొనియాడారు.
“సాయిబాబా
తన
మాట
దక్కించుకున్నాడు.
సుబ్బమ్మ
జన్మ
తరించింది”,
అని
అందరూ
అనుకున్నారు.
చాలామంది
వయస్సు
మళ్ళినవారు
నాదగ్గరికి
వచ్చి,
“స్వామీ,
మాకుకూడా
మాటివ్వండి.
మేము
మరణించే
సమయంలో
మీ
చేత్తో
మా
నోట్లో
నీరు
పోయాలి”,
అని
అడుగుతూ
వచ్చారు.
“ఇది
అందరికీ
లభ్యమయ్యేది
కాదు.
నీకు
ప్రాప్తి
ఉంటే
అప్పటికి
నేనే
స్వయంగా
వచ్చి
నీ
నోట్లో
నీరు
పోస్తానులే”
అని
వారికి
చెబుతూ
వచ్చాను.
ఆ
గ్రామముయొక్క
ప్రోపర్టీ
అంతా
సుబ్బమ్మ
పేరుమీద
ఉండేది.
ఆమె
ఆ
గ్రామమునకంతా
పెద్ద.
అందరూ
ఆమెను
గౌరవించేవారు.
అయితే,
స్వామిని
చేరిన
తరువాత
ఇంక
ఆమె
ఎవ్వరి
ముఖమూ
చూచేది
కాదు.
5
▾
Meaning
Keep
తెల్లవారి
లేచినది
మొదలు
రాత్రి
పరుండునంత
వరకు
అన్నీ
స్వామి
పనులే,
స్వామి
పనులే!
నేను
అప్పుడప్పుడు
చెప్పకుండా
బయటికి
పోయినప్పుడు
నాకోసం
కొండలంతా
తిరిగేది
పాపం!
ఒక
బ్యాగులో
టిఫిన్
క్యారియర్
పెట్టుకొని
అందులో
ఉప్మా,
దోశె,
వడ,
ఇడ్లీలు
ఇవన్నీ
పెట్టుకొని
తీసికొని
వచ్చేది.
ఒక
పర్యాయం
నేను,
“సుబ్బమ్మా!
నాకోసం
ఏమి
తెచ్చావు?”
అని
అడిగాను.
“స్వామీ,
మీకు
ఏది
ఇష్టమో
అది
తెచ్చాను”
అన్నది.
“నాకొక
దోశె
ఇవ్వు”,
అన్నాను.
వెంటనే
ఒక
తట్టలో
దోశె
పెట్టి
నాకందించింది.
“ఈ
దోశె
బాగా
లేదు.
ఇడ్లీ
పెట్టు”,
అన్నాను.
ఇడ్లీ
పెట్టింది.
“ఈ
ఇడ్లీ
నాకక్కర్లేదు,
ఉప్మా
పెట్టు”,
అన్నాను.
ఉప్మా
పెట్టింది.
ఆమె
తెల్లవారి
లేచినది
మొదలు
నాకోసం
రకరకాల
వంటలు
చేసి
కాచుకొని
వుండేది.
“సుబ్బమ్మా!
నీ
భక్తిప్రపత్తులనుగురించి
ఇతరులకు
తెలియజేయాలనే
ఉద్దేశ్యంతోనే
ఇన్ని
ప్రశ్నలు
వేశాను”,
అన్నాను.
“స్వామీ,
మీరు
తీసుకున్నది
కొంచెం
నాకు
పెట్టండి”,
అని
అడిగింది,
పాపం!
అప్పుడు
ఇడ్లీని
చట్నీలో
అద్ది
ఆమె
నోట్లో
పెట్టాను.
ఈవిధంగా,
ఆమె
తన
అంత్యసమయమువరకు
ఆనందంగా
స్వామిసేవలో
కాలం
గడిపింది.
కొండమరాజుకూడా
మహా
భక్తుడు.
112
సం॥ల
వయస్సులోకూడా
ఆయన
క్రొత్త
మందిరానికి
నడచి
వచ్చేవాడు.
“ఎందుకు
ఇట్లా
వస్తావు?
దారిలో
పశువులు
తిరుగాడుతుంటాయి.
క్రింద
పడితే
ప్రమాదం
కదా!”
అనేవాడిని.
“స్వామీ,
మీరే
నాకు
అండగా
ఉన్నప్పుడు
ఏ
పశువు
వచ్చి
నన్ను
నెట్టగలదు?”
అని
ధైర్యంగా
చెప్పేవాడు.
ఒకరోజు
కొండమరాజు
నా
పాదాలు
పట్టుకొని,
“స్వామీ,
మీరు
మా
వంశంలో
పుట్టారు.
మా
వంశమునకు
గొప్ప
కీర్తిని
అందించారు.
అయితే,
నా
జన్మకూడా
తరించాలి
కదా!
కాబట్టి,
నా
అంత్య
సమయంలో
మీరు
నా
నోట్లో
నీరు
పోయాలి”,
అని
ప్రార్థించాడు.
“తప్పక
పోస్తాను”,
అని
చెప్పాను.
ఎంతో
ఆనందించాడు.
స్వామి
ఒకసారి
మాటిచ్చిన
తరువాత
ఇక
తప్పడు
అని
ఆయనకు
తెలుసు.
ఒకరోజు
నేను
ఆయన
ఇంటికి
వెళ్ళాను.
నేను
రావడాన్ని
గమనించి
ఆయన,
“ఈశ్వరమ్మా!”
అని
పిలిచాడు.
“ఏమి
మామా?”
అని
వచ్చింది.
“ఈ
పొద్దు
ఇంక
నేనుండను.
6
▾
Meaning
Keep
ఒక
హోళిగ
(ఒబ్బట్టు)
చేసి
పెట్టు”,
అన్నాడు.
ఆమె
హోళిగ
చేసి
తట్టలో
పెట్టి
తెచ్చింది.
నేనే
కొంచెం
కొంచెం
త్రుంచి
ఆయన
నోట్లో
పెడుతూ
వచ్చాను.
“ఆహా,
ఎంత
మధురంగా
ఉన్నదీ
హోళిగ!
ఈశ్వరమ్మా,
నీవు
ఏనాడూ
ఇంత
మధురంగా
చేయలేదు
కదా!
ఈనాడెందుకింత
రుచిగా
ఉన్నది!”
అని
ఆయన
మెచ్చుకున్నాడు.
“అందులో
నా
గొప్పతనమేమీ
లేదు
మామా!
స్వామి
మీ
నోట్లో
పెట్టారు
కాబట్టి,
అది
అంత
మధురంగా
ఉన్నది”,
అన్నది
ఈశ్వరమ్మ.
అప్పటికి
ఆయన
కుమారులు
పెద్ద
వెంకమరాజు,
చిన్న
వెంకమరాజుకూడా
వచ్చారు.
వారికి
కూడా
కొంచెం
పెట్టాను.
అంతా
తిన్న
తరువాత
కొండమరాజుకు
కొంత
నీరు
త్రాగించాను.
ఎంతో
ఆనందించాడు.
తరువాత,
‘ఈశ్వరమ్మా,
నాకు
నిద్ర
వస్తున్నది’,
అని
పడుకున్నాడు.
‘అది
నిద్ర
కాదు,
స్వామి
సంకల్పమే!’
అని
గుర్తించింది
ఈశ్వరమ్మ.
నేను
పెద్ద
వెంకమరాజుకు,
చిన్న
వెంకమరాజుకు
చెప్పాను,
“కట్టెలు
సిద్ధం
చేసి
ఉంచండి”,
అని.
అందరూ
తెలుసుకున్నారు,
ఇచ్చిన
మాట
నిలబెట్టుకునే
నిమిత్తమై
స్వామి
వచ్చారని.
ఈవిధంగా
కరణం
సుబ్బమ్మ,
కొండమరాజు
ఇరువురి
జన్మలూ
సార్థకమైనాయి.
కొండమరాజు
నన్ను
‘సత్యా!
సత్యా!’
అని
పిలిచేవాడు.
గృహం
అమ్మాయి
‘సత్యం!
సత్యం!’
అని
పిలిచేది.
మిగిలినవారు
‘సత్య
నారాయణా!’
అనీ,
‘రాజూ!’
అనీ
పిలిచేవారు.
చెప్పిన
మాట
దక్కించుకోవడానికి
నేను
దేనికైనా
సిద్ధంగా
ఉంటాను.
కాని,
చాలామంది
భక్తులు
తామిచ్చిన
మాటను
దక్కించుకోరు.
‘నాయనా!
నేను
నీవెంటనే
ఉంటుంటాను.
యోచన
పెట్టుకోవద్దు’,
అని
నేను
చెబితే
అప్పటికప్పుడు
సరేనంటారు;
ఆ
తరువాత
మరచిపోతారు.
సత్యముతోనే
ఉండేవాడు
సత్యం
ఈ
దేహం
విద్యార్థి
దశలో
ఉండగా
శేషమరాజు
నన్ను
పెద్ద
చదువు
చదివించాలనే
ఆశతో
కమలాపురం
తీసుకు
వెళ్ళాడు.
అయితే,
అక్కడ
నేను
ప్రతి
రోజు
ఎంతో
దూరంనుండి
నీరు
తీసికొనిరావలసి
వచ్చేది.
ఒక
పర్యాయం
అక్కడికి
కొద్ది
దూరంలో
ఉన్న
పుష్పగిరిలో
తిరునాళ్ళు
జరిగింది.
స్కూలు
తరఫున
అక్కడ
నేను
స్కౌటు
సేవలో
పాల్గొనవలసి
వచ్చింది.
పుష్పగిరిలో
స్కౌటుసేవ
అయిన
తరువాత
యింటికి
తిరిగి
వెళ్లాను.
7
▾
Meaning
Keep
ఆ
సమయంలో
శేషమరాజు
రూళ్ళకఱ్ఱతో
రూల్సు
వేసుకుంటున్నాడు.
ఆయనకు
నేనంటే
ప్రేమనేగాని,
ఆ
మూడు
దినములు
తన
భార్య
నీరు
మోసుకొని
రావలసివచ్చిందని
నాపై
కోపం
పెట్టుకున్నాడు.
నేను
వెళుతూనే
రూళ్ళ
కఱ్ఱతో
నా
చేతిపై
గట్టిగా
కొట్టాడు.
చేయి
వాచిపోయింది.
ఒక
పాతగుడ్డతో
కట్టు
కట్టుకున్నాను.
ఇది
జరిగిన
రెండవ
దినమే
శేషమరాజు
కుమారుడొకడు
చనిపోయాడు.
అప్పుడు
గృహం
అబ్బాయి
కమలాపురం
వచ్చాడు.
ఆయన
నా
చేతికి
కట్టిన
కట్టు
చూచి,
“ఇదేమిట్రా?”
అని
అడిగాడు.
నేను
శేషమరాజు
కొట్టాడని
చెప్పలేదు.
“కురుపు
లేచింది”
అన్నాను.
ఒకరిపైన
తంటాలు
చెప్పడంగాని,
అసత్యాలు
చెప్పడంగాని
నాకు
ఎప్పుడూ
అలవాటు
లేదు.
సత్యముతోనే
ఉండేవాడు
సత్యం.
ప్రక్క
ఇంట్లో
ఒక
కోమటమ్మ
ఉండేది.
ఆరోజు
సాయంకాలం
ఆమె
గృహం
అబ్బాయిని
పిలిచి,
‘ఏమి
వెంకమరాజూ!
మీకు
అన్నవస్త్రాలకు
లోటు
లేదు
కదా!
మీ
పిల్లవానిని
ఎందుకింత
అవస్థ
పెడుతున్నారు
మీరు?
అతను
ప్రతి
రోజూ
భుజాలపై
కావడి
మోసుకొని
నీరు
తీసుకు
రావాలి.
అతనిని
చాలా
కష్ట
పెడుతున్నారు’,
అని
చెప్పింది.
చీకటి
పడిన
తరువాత
“నేను
బయటకు
పోవాలి”,
అన్నాడు
గృహం
అబ్బాయి.
కొత్త
కదా,
ఎక్కడికి
పోవలెనో
ఆయనకు
తెలియదు.
నేనొక
చిన్నలాంతరు
పట్టుకొని,
ఒక
చెంబుతో
నీరు
తీసికొని
ముందు
నడిచాను.
కొంతదూరం
వెళ్ళిన
తరువాత
ఆయన,
“సత్యం,
నీ
చేతికున్న
ఆ
కట్టు
ఏమిటో
చెప్పు”,
అన్నాడు.
“కురుపు
లేచింది”
అన్నాను.
“కురుపు
లేదు,
ఏమీ
లేదు.
అది
మీ
అన్నగారు
కొట్టినటువంటి
దెబ్బ
అని
నాకు
తెలుసు”,
అన్నాడు.
“లేదు,
లేద”ని
నేను
ఎంత
చెప్పినా
ఆయన
వినలేదు.
నా
రెండు
చేతులు
పట్టుకొని
కంటిధారలు
కార్చాడు.
ఆరోజున
ఆయన
అన్న
మాటలు
ఇప్పటికికూడా
నాకు
చెవుల్లో
వినిపిస్తుంటాయి
-
“సత్యం!
ఊపిరి
ఉంటే
ఉప్పు
అమ్ముకొని
తినవచ్చు.
నిన్నెందుకిన్ని
కష్టాల
పాలు
చేయాలి?
నేను
నిన్ను
పోషించలేనా?
నీకు
అన్నం
పెట్టలేనా?
తక్షణమే
ఇక్కడినుండి
బయల్దేరి
నావెంట
వచ్చేసెయ్”,
అన్నాడు.
“ఇప్పుడు
బిడ్డ
పోయి
వారెంతో
బాధపడుతున్న
సమయంలో
నేను
వారిని
వదలిపెట్టి
రావడం
మంచిది
కాదు.
నేను
వెళ్ళిపోతే
ఇంట్లో
పని
చేసేవారే
లేరు.
మీరు
వెళ్ళండి.
నేను
తరువాత
వస్తాను,”
అని
ఆయనకు
నేను
నచ్చజెప్పాను.
నా
సమాధానం
విని
ఆయనకూడా
కన్నీరు
కార్చాడు.
8
▾
Meaning
Keep
‘నాయనా!
ఎంత
గొప్ప
గుణమురా
నీది!
నీ
మంచితనమే
నిన్ను
కాపాడుతుంది’,
అని
చెప్పి
ఆయన
వెళ్ళిపోయాడు.
“నన్ను
నేనే
మీకిచ్చుకున్నాను”
ఉరవకొండ
స్కూలులో
నేను
చేరినప్పుడు
అక్కడి
టీచర్లు,
‘సత్యం
కవిత్వం
బాగా
వ్రాస్తాడు.
సత్యాన్ని
బాగా
ఉపయోగపెట్టుకోవాలి’,
అనుకున్నారు.
నాచేత
అనేక
పాటలు
రాయించుకునేవారు.
నాకు
కాలేజీ
లైఫ్
లేదు.
ఆ
చిన్న
స్కూలులోనే
చదివాను.
ఆ
తరువాత
నా
ప్రచార
ప్రబోధలు
దినదినాభివృద్ధి
చెందుతూ
వచ్చాయి.
నేను
పుట్టపర్తిని
వదలిపెడతానేమోనని
గృహం
అమ్మాయి,
గృహం
అబ్బాయి
చేయి
పట్టుకొని
ఏడ్చారు.
“నిన్ను
వదలి
మేముండలేము.
నీవు
ఎక్కడికి
పోతే
అక్కడికి
వస్తాము”,
అన్నారు.
ఈవిధంగా
చిన్నప్పటినుండి
నేను
అందరి
ప్రేమను
గ్రోలినవాడను.
ప్రతి
ఒక్కరూ
నన్ను
ప్రేమతో
చూశారు.
ముఖ్యంగా,
కరణం
సుబ్బమ్మ
భక్తిప్రపత్తులనుగురించి
మీకు
తెలియాలనే
ఉద్దేశ్యంతో
ఈనాడు
ఇదంతా
చెబుతున్నాను.
ఆమె
బ్రాహ్మణ
కులానికి
చెందినది.
ఎవ్వరినీ
లోపలికి
రానిచ్చేది
కాదు.
నన్ను
మాత్రం
తన
స్వంతబిడ్డమాదిరి
చూచుకుంటూ
వచ్చింది.
దాంతో
ఊర్లో
ఉన్న
బ్రాహ్మణులందరూ
ఆమెను
దూషిస్తూ
వచ్చారు.
“నాకు
ఎవ్వరూ
అక్కర్లేదు.
బాబా
ఒక్కరుంటే
చాలు
నాకు.
బాబా
ఏది
చెబితే
అది
చేస్తాను”,
అని
ఆమె
బదులు
చెప్పేది.
ఆమెకు
స్వామిపట్ల
అంతటి
దృఢమైన
విశ్వాసముండేది.
కనుకనే,
నేటికీ
సుబ్బమ్మ
పేరు
భక్తుల
హృదయాలలో
చిరస్థాయిగా
నిలిచిపోయింది.
ఆమె
పేరుతో
పుట్టపర్తిలో
గోకులం
దగ్గర
కొన్ని
ఇళ్ళు
కట్టించి
‘కరణం
సుబ్బమ్మ
నగర్’
అని
పేరు
పెట్టాను.
అంతేకాదు.
తల్లిదండ్రులు
లేని
పిల్లలను
చేరదీసి
వారిని
పోషించి,
వారికి
విద్యాబుద్ధులు
నేర్పించాలని
నాకు
చాలా
ఆశ.
మీరు
చూసే
ఉంటారు
-
పుట్టపర్తికి
దగ్గర్లో
వారికి
ఇళ్ళు
కట్టించి
విద్యాబుద్ధులు
నేర్పిస్తూ,
వారిని
పోషిస్తున్నాను.
ఆ
పిల్లలు
అన్నివిధాలుగా
అభివృద్ధికి
వస్తున్నారు.
వాళ్ళు
చిన్న
చిన్న
పిల్లలు;
ఫస్ట్
క్లాసుకూడా
పాస్
కాలేదు.
అలాంటివారిప్పుడు
టెన్త్
క్లాస్
పరీక్షలు
రాసి
పాసవుతున్నారు.
వాళ్ళు
తెలుగు,
ఇంగ్లీషు
నేర్చుకుంటున్నారు.
9
▾
Meaning
Keep
చక్కగా
పాటలుకూడా
పాడతారు.
‘దిక్కు
లేనివారికి
దేవుడే
దిక్కు’.
ఈవిధంగా
చెప్పటానికి
పూనుకుంటే
ఎన్నైనా
చెప్పవచ్చు.
విద్యార్థులారా!
మీపై
నాకెంతో
ప్రేమ.
మీరందరూ
బాగా
చదువుకొని,
అభివృద్ధికి
వచ్చి
మంచి
పేరు
తెచ్చుకోండి.
అటువంటివారికి
ఏది
కావలసినా
నేను
ఇస్తాను.
నన్ను
నేనే
మీకిచ్చుకుంటున్నాను.
Previous
←
Man is a child of immortality
Next
Jñāna is won through purity of feeling
→