Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2005 · Man is a child of immortality
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Man is a child of immortality
8 March 2005, Mahāśivarātri, Prasanthi Nilayam
Morning
Evening
1
▾
Meaning
Keep
His poems 374
Also in his talks
(26)
21 May 1973
The Opening Message
10 October 1986
A people that has morality is the true people
21 November 1986
We must regard service to man as service to Mādhava
2 January 1987
Sanātana Dharma is the essence of all the wisdom of the Vedas
2 June 1990
Ascent Of Man
23 November 1990
Restore the glory of Bharat
2 June 1991
Vijnana and Dharma
18 August 1996
Man Must Learn to Live as Man
19 October 1996
When the Home Is Set Right, the World Is Set Right
19 October 1998
Dīpāvali: Its Inner Meaning
22 November 1998
The Education of Bhārata Is What Develops the Divine Human Principle
10 September 2000
God is within you
22 November 2001
True education brings the wealth of character
19 January 2002
Hospitals must not become business centres
19 November 2002
Setting the Home in Order: The Housewife's First Duty
14 April 2003
Remember the Name with Prema
20 October 2003
Restore the ancient culture!
2 July 2004
If you call ‘Sai!’ with Prema, I answer ‘Here I am!’
23 October 2004
Foster the Spirit of Sacrifice
6 May 2006
If you love your parents, the whole world will love you
14 August 2006
Follow the Ātma within you
21 January 2007
All parties must become one for the good of the country
15 August 2007
Win the svātantrya of the heart!
15 January 2008
Revere your mother as God, your father as God
6 August 2008
‘Education’ finds its fulfilment only when it is joined with ‘Educare’
23 November 2008
Foster the feeling of the one Ātma, and unity!
పరమ
పావనమైన
భారతావనియందు
సహనమన్నదె
మనకు
చక్కదనము
వ్రతములన్నిటియందు
వన్నె
గాంచినయట్టి
ఘన
సత్యశీలమే
కఠిన
తపము
మధుర
భావంబేది
మన
దేశమందన్న
మాతృభావముకంటె
మాన్యమెద్ది?
ప్రాణంబుకంటెను
మానంబె
ఘనమను
మన
దేశ
నీతిని
మంటగలిపి
నేటికిచ్చిరి
పరదేశ
నీతులరసి
వెస
విచిత్ర
స్వేచ్ఛయను
విచ్చుకత్తి
ఔర!
ఏమందు
భారతపాలనంబు
ఏనుగెట్టుల
తన
బలమెఱుగలేదొ
అట్టులైనారు
మన
భారతీయులు
నేడు
ప్రేమస్వరూపులారా!
భారతదేశ
విశిష్టతను,
దీనియొక్క
గొప్పతనమును,
పవిత్రతను
ఎవ్వరూ
చవిచూడడానికి
ప్రయత్నించడం
లేదు.
అన్ని
సంస్కృతులకంటే
భారతీయ
సంస్కృతి
ఉత్తమమైనది,
చాలా
పవిత్రమైనది.
ఈ
సంస్కృతి
అణువునుండి
ఘనమువరకు
సర్వత్రా
వ్యాపించియున్న
దివ్యత్వాన్ని
దర్శింపజేస్తుంది.
కాని,
ఇట్టి
పవిత్ర
సంస్కృతిని
ఈనాడు
భారతీయులే
విస్మరించి
పరదేశ
సంస్కృతులను
అనుసరిస్తూ
కాలమును
వ్యర్థం
చేసుకుంటున్నారు.
భారతీయ
సంస్కృతికి
మూలాధారమైనవి
సత్యధర్మములు.
ఈనాడు
సత్యధర్మములు
రెండూ
సమసిపోయినాయని
అంటున్నారు.
ఇది
చాలా
పొరపాటు.
ఇవి
ఆచరణలో
లేకపోవడంవలన
కొంతవరకు
మరుగునపడినాయని
చెప్పవచ్చును.
అంతేగాని,
వీటిని
నిర్మూలించడం
ఎవరి
తరమూ
కాదు.
2
▾
Meaning
Keep
ఎవరు
నిజమైన
భారతీయులు?
సత్యధర్మములు
రెండూ
మానవునికి
రెండు
నేత్రములవంటివి.
కాని,
వీటిని
కోల్పోయి
మానవుడు
అంధుడవుతున్నాడు.
ఈనాటి
విద్యార్థులు
ఎన్ని
చదువులు
చదివినప్పటికీ,
ఎన్ని
డిగ్రీలు
పొందినప్పటికీ
సత్యధర్మములంటే
ఏమిటో
వారికి
అర్థం
కావడం
లేదు.
అనాదికాలమునుండి
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమలను
అనుసరిస్తూ
రావడంవలననే
భారతదేశం
ఆధ్యాత్మిక
రంగములో
యావత్ప్రపంచానికి
నాయకత్వం
వహించింది.
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమలను
పోషించుకున్నప్పుడే
మనము
నిజమైన
భారతీయుల
మవుతాము.
ఇందులో
ఏ
ఒక్కటి
తప్పిపోయిననూ
మనము
భారతీయులమే
కాదు.
భారతీయులకు
త్యాగము
ప్రధానమైనది.
త్యాగమనగా
సర్వసంగ
పరిత్యాగము
చేసి
అడవులకేగడం
కాదు.
సత్యధర్మములను
అనుసరిస్తూ
జీవితాన్ని
గడపడమే
నిజమైన
త్యాగము.
సత్యధర్మములననుసరిస్తూ
శాంతి,
ప్రేమలకు
ప్రయాణము
సల్పాలి.
జనని
గర్భమునుండి
జన్మించినది
మొదలుకొని
మానవుణ్ణి
సత్యధర్మములే
పోషించుచున్నవి.
సత్యధర్మములే
ఈ
జగత్తునకు
ఆధారంగా
నిలిచినవి.
ప్రాచీనకాలంలో
భారతీయ
స్త్రీలు
అనేక
కష్టములకు
ఓర్చి
సత్యధర్మములను
కాపాడుతూ
వచ్చారు.
ఒకవైపున
తమ
ఇంటిపనులన్నీ
తామే
చూసుకుంటూ,
మరొకవైపున
తమ
బిడ్డలకు
సద్బోధలు
సలుపుతూ
వారిని
ఆదర్శప్రాయులుగా
తీర్చిదిద్దుతూ
వచ్చారు.
సత్యధర్మముల
సారమును
గుర్తిస్తే
చాలు!
ముఖ్యంగా
ఈనాటి
విద్యార్థులు
నేర్చుకోవలసింది
ఏమిటి?
గొప్ప
విద్యలు
కాదు,
గొప్ప
డిగ్రీలు
కాదు.
సత్యము,
ధర్మము
-
ఈ
రెండింటి
యొక్క
సారమును
గుర్తించుకుంటే
చాలు!
ఈనాటి
మానవునికి
సత్యమంటే
ఏమిటో,
ధర్మమంటే
ఏమిటో
తెలియడం
లేదు.
ధర్మమనగా
‘డ్యూటీ’
అనుకుంటున్నారు.
కాని,
‘డ్యూటీ’
అనే
ఆంగ్లపదము
ధర్మముయొక్క
పరిపూర్ణమైన
స్వరూపానికి
సంబంధించినది
కాదు.
‘ధారయతీతి
ధర్మః’
అన్నారు.
ధరించినది
ధర్మము.
మన
ధర్మమును
మనం
కాపాడుకోవడం
అత్యవసరం.
ధర్మమును
విస్మరించినవారు
అవమానాలకు
గురికాక
తప్పదు.
3
▾
Meaning
Keep
ఇంక,
సత్యమనగా
ఏమిటి?
పవిత్రమైన
హృదయనాభినుండి
ఏర్పడినటువంటిది
సత్యము.
స
-
అనగా
సాత్త్వికము;
త్య
-
అనగా
త్యాగము.
ఈ
రెండింటితో
కూడినది
సత్యము.
అంతేకాదు.
‘సత్య’
అనే
పదములో
‘స,
త,
య’
అనే
మూడక్షరాలున్నవి.
వీటిని
త్రిప్పి
చదివితే
-
‘య,
త,
స’
అవుతుంది.
దీని
అంతరార్థ
మేమిటి?
యమ
నియమాదులచేత
తపస్సు
ఆచరించినప్పుడు
సత్యస్వరూపుడు
సాక్షాత్కరిస్తాడు.
సత్యమునకు
ఎంతటి
ఘనత
ఉంటున్నదో
దీనిని
బట్టి
మీరు
యోచించుకోవచ్చును.
దైవానుగ్రహముచేత
నొసటివ్రాతను
మార్చుకోవచ్చు
అలనాడు
పంచపాండవులు,
ద్రౌపది
సత్యధర్మాలను
అనుసరించడం
చేతనే
శ్రీకృష్ణుని
అనుగ్రహానికి
పాత్రులు
కాగలిగారు.
కేవలం
పదహారు
సంవత్సరాల
ఆయుష్షు
కలిగిన
మార్కండేయుడు
తన
భక్తిప్రపత్తులచేత
ఈశ్వరుని
అనుగ్రహానికి
పాత్రుడై
చిరంజీవి
అయినాడు.
నొసటివ్రాతను
మార్చడమనేది
ఒక
వ్యక్తివలన
జరిగే
పని
కాదు;
ఒక్క
దైవశక్తిచేతనే
అది
సాధ్యమవుతుంది.
ప్రాణాపాయస్థితిలో
ఉన్న
రోగిని
‘మేము
రక్షిస్తామ’ని
డాక్టర్లు
ప్రామిస్
చేయవచ్చు.
కాని,
దైవానుగ్రహము
లేకపోతే
వారి
ప్రామిస్లన్నీ
మిస్సైపోతాయి.
ఒక్క
దైవము
తప్ప
మృత్యువును
అడ్డుకోగలవాడు
ఈ
ప్రపంచంలో
ఎవ్వరూ
లేరు.
దైవానుగ్రహమున్నప్పుడు
ఎలాంటి
శక్తినైనా
మనము
సాధించవచ్చును.
విద్యార్థులారా!
చిన్నవయస్సునుండియే
మీరు
ఈశ్వరానుగ్రహమునకు
పాత్రులు
కావడానికి
కృషి
చేయాలి.
ప్రారంభమునుండి
భగవంతుని
ప్రార్థిస్తూ
ఉంటే
మీరు
తప్పక
రక్షింపబడతారు.
ఒక్క
దైవబలము
తప్ప
అన్యబలములేవీ
పనికిరావు.
దైవసంకల్పము
మనకు
తోడైనప్పుడు
దేనినైనా
మనం
సాధించవచ్చును.
శివమున్నచోట
శవమునకు
చోటులేదు
ప్రేమస్వరూపులారా!
ఈనాడు
శివరాత్రి.
‘శివము’
అనగా
మంగళకరమైనది
అని
అర్థం.
అట్టి
శివమున్నచోట
శవమునకు
చోటులేదు.
కాబట్టి,
తెల్లవారి
లేచినది
మొదలుకొని
రాత్రి
పరుండునంతవరకు
నిరంతరం
శివనామము
మీ
నాలుకపై
నాట్యమాడుతూ
ఉండాలి.
4
▾
Meaning
Keep
మృత్యువును
జయించినవాడు
కాబట్టి,
ఈశ్వరునికి
‘మృత్యుంజయుడ’ని
పేరు.
తన
కంఠములో
విషమును
నిల్పుకొన్నవాడు
కాబట్టి,
అతనికి
‘నీలకంఠుడ’ని
పేరు.
చింతలు
లేనివాడు
కనుక
అతనికి
‘అచింత్యుడు’
అని
పేరు.
ఎటువంటి
ప్రమాణాలకూ
చిక్కనివాడు
కాబట్టి
అతనికి
‘అప్రమేయుడ’ని
పేరు.
భగవంతుని
నామములు
అనేక
అంతరార్థములతో
కూడివుంటాయి.
ఒకానొక
సమయమున
పార్వతీ
పరమేశ్వరుల
మధ్య
వారి
కుమారునికి
పేరు
పెట్టే
విషయములో
కొంత
అభిప్రాయభేదము
తలెత్తింది.
పరమేశ్వరునికి
గల
అనంతమైన
నామములలో
ఒక
పేరును
తమ
కుమారునికి
పెట్టాలని
ఆశించింది
పార్వతి.
“స్వామీ!
నీవు
సర్వశక్తి
సంపన్నుడవు;
సమస్త
ప్రాణులకూ
నాథుడవు.
నీకున్న
పేర్లలో
ఏ
ఒక్క
పేరైనా
నీవు
చెప్పలేవా?
ఆ
పేరును
ఈ
పిల్లవానికి
పెడతాను”,
అన్నది.
అప్పుడు
ఈశ్వరుడు
ఆ
పిల్లవానికి
‘అమృతపుత్రుడు’
అని
పేరు
పెట్టమన్నాడు.
ఒకరోజున
పార్వతి
తన
పుత్రుని
ఊయలలో
పెట్టి
ఊపుతూ,
‘నిదురపో
నాయనా,
నిదురపోవయ్య...
నీవు
మేల్కొని
ఉంటే
ప్రపంచమే
మేల్కొని
వుంటుంది..’
అని
జోలపాట
పాడుతున్నది.
ఆ
సమయంలో
అక్కడికి
వచ్చిన
లక్ష్మీదేవి,
‘నీ
బిడ్డ
పేరు
ఏమిటమ్మా?’
అని
అడిగింది.
పార్వతి
‘అమృతపుత్రుడు’
అని
చెప్పింది.
‘ఏమిటి,
అమృతపుత్రుడా?
ఎక్కడినుండి
వచ్చిందీ
పేరు?’
అని
ఆమె
అడుగగా,
‘ఈశ్వరుడే
పెట్టాడమ్మా!’
అని
చెప్పింది
పార్వతి.
ఈశ్వరుడు
అమృతస్వరూపుడు.
అట్టి
ఈశ్వరత్వము
నుండి
ఏర్పడిన
ప్రతి
జీవికూడా
ఈశ్వరస్వరూపమే
అవుతుంది.
ప్రతి
మానవుడు
అమృతపుత్రుడేగాని,
అనృతపుత్రుడు
కాదు.
కనుకనే,
వేదము,
‘శృణ్వంతు
విశ్వే
అమృతస్య
పుత్రాః’
అన్నది.
అనృత
పుత్రునికి
మార్పున్నది,
మరణమున్నది.
కాని,
అమృతపుత్రునికి
మార్పూ
లేదు,
మరణమూ
లేదు.
విద్యార్థులారా!
మన
భారతదేశములో
పెద్దలు
పిల్లలకు
పెట్టే
పేర్లు
ఎంతో
పవిత్రమైనవి.
మీరందరూ
వాటి
అంతరార్థాన్ని
గుర్తించి
వర్తించడానికి
ప్రయత్నం
చేయండి.
ఈశ్వరుని
‘కైలాసవాసి’
అంటారు.
కైలాసం
ఎక్కడున్నది?
గాఢమైన
నిశ్శబ్దంలోనే
కైలాసం
కనబడుతుంది.
5
▾
Meaning
Keep
కాబట్టి,
మీరు
మౌనము
పాటించాలి.
ఏవిధమైన
మౌనము?
కేవలం
మాట్లాడడం
మానివేస్తే
లాభం
లేదు;
సంకల్పాలనుకూడా
అరికట్టుకోవాలి.
అమృతపుత్రులుగా
జీవించండి
ప్రేమస్వరూపులారా!
మీరు
ప్రాచీన
గ్రంథములను
ఏమాత్రం
చదవడం
లేదు.
వాటిని
చదివినప్పుడే
ఈనాడు
నేను
చెప్పే
విషయాలు
మీకు
అర్థమవుతాయి.
మీరందరూ
అమృతపుత్రులు.
ఆ
పేరుకు
తగినట్లుగా
మిమ్మల్ని
మీరు
తీర్చిదిద్దుకోవాలి.
కాని,
అమృతత్వమంటే
ఏమిటో
మీకు
అర్థం
కావడం
లేదు.
అమృతపుత్రుడైనవానికి
మృత్యువు
లేదు.
మీరందరూ
అమృతపుత్రులుగా
ఉండాలని
నేను
ఆశిస్తున్నాను.
పేర్లు
పెట్టుకోవడం
తమాషాకోసం
కాదు;
శాశ్వతంగా
నిలిచిపోయేలా
పెట్టుకోవాలి.
పేర్లలో
ఉన్న
పవిత్రతను
గుర్తించుకోవడానికి
మన
ప్రాచీన
గ్రంథాలను
చదవాలి.
ఇటువంటి
సత్యనిత్యమైన
పవిత్రతను
గుర్తించుకోలేక
తప్పుమార్గంలో
పడి
మీ
వాక్కుద్వారా,
మీ
చేతలద్వారా
మీ
శక్తిని
మీరే
క్షీణింపజేసుకుంటున్నారు.
సత్యము,
ధర్మము,
శాంతి,
ప్రేమ,
అహింస
అని
మీరు
నోటితో
పలుకుతున్నారు
కాని,
ఆ
పలికే
పలుకులకు
మీ
హృదయాన్ని
అర్పితం
చేయడం
లేదు.
ప్రతి
మానవుడుకూడా
అమృతపుత్రుడేగాని,
అనృతపుత్రుడు
కాడు.
అనృతత్వాన్ని
మీకు
మీరే
కల్పించుకుంటున్నారు.
ప్రేమస్వరూపులారా!
మీరంతా
అమృతపుత్రులే!
అమృతపుత్రులైన
మీకు
మృత్యువు
రావడానికి
కారణం
ఏమిటి?
మీరు
మృత్యువును
స్మరిస్తున్నారు.
‘మేము
అనృతపుత్రులమ’ని
మీరు
భావిస్తున్నారు.
అదే
పెద్ద
దోషము.
మీరు
మృత్యువు
నేమాత్రం
తలంచకూడదు;
‘మేము
అనృతపుత్రులమ’ని
భావించ
కూడదు.
మీ
పేరుకు
ముందు
‘అమృతపుత్రుడ’ని
చేర్చుకోండి.
‘మేము
అమృతపుత్రులమ’ని
గట్టిగా
విశ్వసించండి.
అప్పుడే
మీరు
మీ
నిజతత్త్వాన్ని
గ్రహించగలరు.
Previous
←
Śivatva is the very consciousness in all beings
Next
Karaṇam Subbamma, a Blessed Soul
→