Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2007 · Love others, and the Paramātma will love you
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Love others, and the Paramātma will love you
27 January 2007, Ati Rudra Mahā Yajña, Chennai
1
▾
Meaning
Keep
Also in his talks
(9)
21 May 1979
Niṣkāma Karma
6 October 1986
Serve the Lord of all in the form of society!
5 July 2003
Give up attachment to the body and develop attachment to God
11 April 2005
Develop self-confidence!
22 October 2005
Sāttvic Food and Good Company Are Essential
28 September 2006
No worry troubles those who think of God without ceasing
15 January 2007
Only a life that brings joy to many is a true life
7 March 2008
Do the deeds that please God
9 October 2008
That great Viṣṇu Himself is this Viṣṇu on earth
కర్మమున
పుట్టు
జంతువు
కర్మముననె
వృద్ధి
పొంది
కర్మమున
చనున్
కర్మయె
నరునకు
దైవము
కర్మయె
సుఖదుఃఖములకు
కారణమిలలో!
భగవంతుణ్ణి
ఎక్కడో
వెతుకనక్కర్లేదు.
భగవద్గీతయందు
“మమైవాంశో
జీవలోకే
జీవభూతస్సనాతనః”,
“అందరూ
నా
అంశములే”
అన్నాడు,
కృష్ణ
పరమాత్మ.
మీలో
ప్రతి
ఒక్కరియందు
భగవంతుడే
ఉన్నాడు.
మీ
వెంటనే,
జంటనే
ఉన్న
భగవంతుణ్ణి
వెతికేదెక్కడ!
మీరు
ఏ
పని
చేసినప్పటికీ
అది
భగవంతుని
కార్యమే!
భగవంతుడు
మానవునికి
దేహము,
మనస్సు,
బుద్ధి,
చిత్తము
అనే
నాలుగు
అంశములను
ఏర్పరచినాడు.
యువకులకు
ఈ
వయస్సులో
దేహము
చాలా
పుష్టిగా
ఉంటుంది;
మనస్సు
చాలా
శక్తిమంతంగా
ఉంటుంది.
బుద్ధియొక్క
విచారణాశక్తి
చాలా
పటుత్వంతో
కూడి
ఉంటుంది.
కాని,
వీటిని
దుర్వినియోగం
చేస్తున్నారు.
మనస్సులో
దైవాన్ని
చింతిస్తూ
సర్వాంగములను
సద్వినియోగ
పరచుకోవలసినదిపోయి
తమ
ఇంద్రియాలను
పెడమార్గం
పట్టిస్తున్నారు.
ఇది
చాలా
పొరపాటు.
ఈ
వయస్సులో
మనము
దేహశక్తిని,
మనోశక్తిని,
బుద్ధిశక్తిని
సద్వినియోగపరచుకోవాలి;
అనగా,
పవిత్ర
మార్గములో
ప్రవేశపెట్టాలి.
కన్నులు
ఉన్నవి
కదా
అని
అన్నింటినీ
చూడకూడదు.
ఏది
మంచిదో
దానినే
చూడటానికి
ప్రయత్నించాలి.
చెడ్డచూపులను
చూసి
చెడును
సంపాదించుకోకూడదు.
సూరదాసుకు
కన్నులు
లేవు.
కాని,
నిరంతరము
‘కృష్ణా!
కృష్ణా!
కృష్ణా!’
అని
కృష్ణ
నామమునే
స్మరిస్తూ
వచ్చాడు.
కనుకనే,
కృష్ణ
పరమాత్మ
సూరదాసుకు
దర్శనమిచ్చి
సంతృప్తిపరచాడు.
2
▾
Meaning
Keep
చెవులతో
అనవసరమైన
విషయాలను,
పరదూషణను
వినకూడదు.
చెడ్డచూపులు
చూడటం,
పరదూషణ
వినటం
మహాపాపం.
భగవద్విషయాలను
మాత్రమే
శ్రవణం
చేయడం
చాలా
మంచిది.
భగవంతుడు
నాలుకను
దేనికోసం
ఇచ్చాడు?
రుచి
చూసేకోసమనా?
లేక
పరులను
దూషించే
కోసమనా?
కాదు,
కాదు.
నోటితో
భగవన్నామాన్ని
ఉచ్చరించాలి,
ఇతరులకు
వినిపించాలి,
వారిని
తరింపజేయాలి.
మనం
కీర్తన
దేనికోసం
చేస్తున్నాము?
రాగంకోసమా?
కాదు,
కాదు.
మన
రోగనివారణకోసం
చేస్తున్నాము.
ఒక్క
పర్యాయము
‘రామా’
అని
పిలిచితే
ఎంతో
ఆనందము
కలుగుతుంది.
అయితే,
అది
మనసారా
చేయాలి.
‘రామా!
నన్ను
బ్రోవరా!’
అని
పద్యరూపంలో
చెబితే
అది
అంత
ఆనందాన్ని
కలిగించదు.
దీనిని
రాగంతో
చేర్చి
‘రామా
నన్ను
బ్రోవరా’
అని
గానం
చేస్తే
అది
హృదయాన్ని
ఆకర్షిస్తుంది.
హృదయ
పూర్వకంగా
‘రామా!’
అని
పిలిస్తే
చాలు.
కృష్ణనామంకూడా
అంత
మహత్తరమైనదే!
ఐతే,
మనమిప్పుడు
చేయవలసింది
ఏ
రామనామమో,
కృష్ణనామమో,
సాయినామమో
ఉచ్చరించడం
కాదు.
ఎవరైనా
కష్టంలో
ఉన్నవారు
మన
కంటికి
కనిపిస్తే
వారిని
దగ్గరకు
చేర్చుకొని
ప్రేమతో
సహాయం
చేయాలి.
“నాయనా!
నీకేమి
కావాలి?
ఆకలవుతున్నదా?
ఇదిగో,
అన్నం
తీసుకో!”
అని
నీ
శక్తి
మేరకు
అన్నం
పెట్టవచ్చు.
చిన్నచిన్న
పిల్లలుంటారు.
వాళ్ళ
తల్లిదండ్రులు
పనులకు
వెళుతుంటారు.
ఆ
పిల్లలు
బజార్లలో
తిరుగుతూ
ఉంటారు.
ఒక్కొక్కసారి
వాళ్ళు
ప్రమాదాలకుకూడా
గురి
అవుతుంటారు.
అట్టి
పిల్లలను
మనము
దగ్గరకు
చేర్చుకొని
వాళ్ళు
బాధలకు
గాని,
ప్రమాదాలకుగాని
గురికాకుండా
సంరక్షిస్తూ
రావాలి.
ప్రమాదాలకు
గురియైన
పిల్లలను
హాస్పిటల్‌కు
తీసుకువెళ్ళి,
మందులిచ్చి
వారికి
సహాయపడాలి.
బీదలను
ఆదరించాలి.
రోగులకు
రోగనివారణ
గావించాలి.
శక్తిహీనులకు,
నడువలేని
వారికి
చేయూత
నందించి
సహాయపడాలి.
ఈవిధమైన
సేవలను
మనం
స్వయంగా
ఆచరిస్తూ
ప్రబోధించినప్పుడు
ప్రజలలో
ఒకవిధమైన
చైతన్యం
బయలుదేరుతుంది.
“ఈ
పిల్లలు
ఇంత
మంచిపనులు
చేస్తున్నారే!
వీరికి
మనము
కూడను
తగిన
సహాయము
చేయాలి”
అని
వారుకూడా
మీకు
తోడ్పడతారు.
అందరూ
భగవంతుని
బిడ్డలే!
మనం
పిల్లలకు
మంచిమాటలు
చెప్పాలి.
‘రండి
నాయనా!
రండి,
రండి’
అంటూ
మంచిమాటలతో
వారిని
పిలవాలి.
“ఏయ్,
ఇక్కడికి
రారా”
అని
కోపంగా
పిలువకూడదు.
మృదుమధురంగా,
వారి
హృదయాన్ని
నొప్పించకుండా
మాట్లాడాలి.
వారికి
కోపం
రాకుండా
చూసుకోవాలి.
మన
మాటలద్వారా,
చేతలద్వారా
వారిపట్ల
ప్రేమను
వ్యక్తం
చేయాలి.
ప్రేమ
అన్నింటి
కంటే
గొప్ప
శక్తి.
కాబట్టి,
అందరినీ
‘బ్రదర్!
రండి,
రండి’
అని
ప్రేమతో
పలుకరించాలి.
‘మీకు
ఆర్థిక
బాధలున్నాయా?
రోగబాధలున్నాయా?’
అని
ప్రేమతో
విచారించి
వారికున్న
సమస్యలను
తెలుసుకొని
మనము
తగిన
సహాయము
చేయాలి.
3
▾
Meaning
Keep
కొంతమంది
దిక్కులేని
వారుంటారు;
తల్లిదండ్రులు,
బంధుమిత్రులు
ఎవరూ
లేకుండా
ఒంటరిగా
జీవిస్తుంటారు.
అట్టివారికి
మనమే
బ్రదర్స్‌గా
ఉండాలి.
వారితో
ప్రేమగా
ముచ్చటించాలి.
‘నాయనా!
నీకు
బ్రదర్స్
లేరా?
సిస్టర్స్
లేరా?
నేనున్నాను
నీకు
బ్రదర్‌గా.
నేనున్నాను
నీకు
సిస్టర్‌గా’,
అంటూ
వారికి
ఉత్సాహ
ప్రోత్సాహముల
నందించాలి.
మనమందరంకూడను
ఒకే
తండ్రి
బిడ్డలమే!
ఆ
తండ్రియే
దైవము.
కనుక,
మానవ
సోదరత్వమును,
దైవపితృత్వమును
గుర్తించి
వర్తించాలి.
దైవముయొక్క
బిడ్డలమైన
మనం
బ్రదర్స్,
సిస్టర్స్
మాదిరి
మెలగాలి.
అలాగని
మనమేమీ
ప్రోపర్టీ
ఇవ్వనక్కర్లేదు.
ఎదుటి
వ్యక్తిని
మంచిమాటలతో
పలుకరించాలి;
హృదయ
పూర్వకంగా
ప్రేమించాలి.
భగవంతుడు
ప్రేమస్వరూపుడు.
తన
ప్రేమచేతనే
ప్రజలను
కాపాడుతున్నాడు.
ప్రేమ
ఒక్కటి
ఉంటే
చాలు,
అందరం
ఏకమైపోతాం.
ఎవ్వరినీ
దూరం
చేసుకునే
మాటలకుగాని,
చేష్టలకుగాని
మనము
అవకాశమివ్వకూడదు.
ప్రేమచేత
అందరినీ
దగ్గరకు
చేర్చుకోవాలి.
అప్పుడు
మిమ్ములను
భగవంతుడు
దగ్గరకు
చేర్చుకుంటాడు.
నీవు
పరులను
ప్రేమతో
చూసినప్పుడు
భగవంతుడు
నిన్ను
ప్రేమతో
చూస్తాడు.
ఎలాంటి
పరిస్థితులయందుకూడను
మనము
క్రోధము,
అసూయ,
డంబము,
ఆడంబరము
ఇలాంటివి
చూపకూడదు.
పరులు
మనలను
అసహ్యించుకునేటట్లుగా,
వారికి
క్రోధము
కలిగేటట్లుగా
మనము
ప్రవర్తించ
కూడదు.
మన
ప్రేమను
చవిచూచి
ఇతరులు
తమలో
ప్రేమను
అభివృద్ధి
చేసుకోవాలి.
మనము
వారిని
ప్రేమిస్తూ
ఉంటే
వారు
మనలను
ప్రేమిస్తూ
వస్తారు.
వారిపట్ల
కోపాన్ని
ప్రదర్శిస్తే
వారుకూడా
మనయెడల
కోపం
చూపుతారు.
భిక్షమడిగేవాడు
మన
ఇంటి
ముందుకు
వచ్చి
“భవతీ
భిక్షాం
దేహి”
అన్నప్పుడు
మనము
ప్రేమతో
“నాయనా!
ఉండు”
అని
చెప్పి
లోపలికి
వెళ్ళి
ఇంత
అన్నం
తెచ్చిపెడితే
తాను
ఎంతో
ఆనందిస్తాడు.
ఒకరినొకరు
పోషించుకోవడంకోసమే
భగవంతుడు
మనకీ
జన్మనిచ్చాడు
ఒకానొక
సమయంలో
రంగూన్లో
యుద్ధం
జరిగింది.
ఆ
యుద్ధంలో
అనేకమంది
మరణించారు.
ఒక
కుటుంబంలో
తల్లి,
కుమారుడు
ఇద్దరు
మాత్రమే
మిగిలారు.
వాళ్ళు
అక్కడినుండి
తప్పించుకొని
మద్రాసుకు
వచ్చి
చేరారు.
కుమారుణ్ణి
ఒకచోట
కూర్చోబెట్టి
తల్లి
ఇంటింటికీ
పోయి
భిక్షమడిగి
తెచ్చి
కుమారునికిచ్చేది.
4
▾
Meaning
Keep
మిగిలితే
తాను
తినేది,
లేకపోతే
పస్తుండేది.
ఈవిధంగా
కొన్ని
రోజులు
గడిచేసరికి
ఆమె
బలహీనురాలైపోయింది.
అది
గమనించి
కుమారుడు,
“అమ్మా!
నీవు
ఇంతకాలము
నన్ను
సాకినావు,
సంరక్షించినావు.
ఇకమీదట
నీవు
ఇంటిదగ్గర
కూర్చో,
నేను
భిక్షము
తీసికొని
వస్తాను”,
అన్నాడు.
ఆనాటినుండి
అతను
భిక్షాటనకు
బయలుదేరాడు.
“ఏమిటిది,
ఇంత
చిన్నపిల్లవాడు
భిక్షమెత్తుతున్నాడు”,
అని
కొంతమంది
అతనిపై
కోప్పడ్డారు,
మరికొంతమంది
అసహ్యించుకున్నారు.
ఆ
పిల్లవాడు
ఒక
ఇంటిముందు
నిలబడి,
“అమ్మా!
ఆకలి,
ఆకలి”
అన్నాడు.
ఆ
ఇంటి
యజమాని
ఒక
ఆఫీసరు.
ఆయన
వరండాలో
కూర్చుని
పేపరు
చదువుతున్నాడు.
“అమ్మా,
ఆకలి
భరించలేక
పోతున్నాను”
అని
ఆ
పిల్లవాడు
అంటూంటే
ఆయనకు
జాలి
కలిగింది.
“నాయనా!
నేను
నీకు
అన్నం
తెచ్చి
పెడతాను.
ఇక్కడే
కూర్చుని
భుజించు”
అన్నాడు.
ఆయన
లోపలికి
వెళ్ళి
తట్టలో
అన్నం
పెట్టి
తెచ్చాడు.
“సార్,
ఈ
అన్నం
నాకు
కాదు,
నా
తల్లికి
కావాలి”,
అంటూ
పిల్లవాడు
ఆ
అన్నమును
ఒక
బట్టలో
వేసుకొని
బయలుదేరాడు.
“నీకు
ఆకలవుతోందని
అన్నావు
కదా!
ఇక్కడే
కూర్చుని
భుజించు.
నీ
తల్లికి
తరువాత
పెట్టవచ్చు”
అన్నాడాయన.
“సార్,
ఇంతకాలము
నా
తల్లి
నాకు
తెచ్చిపెట్టింది.
ఇప్పుడామెకు
ఆరోగ్యం
చెడిపోయింది.
కాబట్టి,
మొదలు
మా
అమ్మకు
పెట్టాలి”
అన్నాడు.
అప్పటికే
ఆ
పిల్లవాడు
బాగా
నీరసించి
ఉన్నాడు.
“మొదలు
అమ్మకు,
మొదలు
అమ్మకు...”
అంటూ
క్రిందపడిపోయి
ప్రాణం
విడిచాడు.
“అయ్యో,
ఇతనికి
తల్లిపై
ఎంత
ప్రేమ!”
అని
ఆ
ఆఫీసరు
ఆశ్చర్యపోయాడు.
ఇంకొకరి
సహాయము
తీసుకొని
ఈ
పిల్లవాని
తల్లికోసం
వెతుకుతూ
పోయాడు.
ఆ
తల్లి
ఒక
చెట్టు
క్రింద
పడుకొని
ఉంది.
ఆ
తల్లికి
కుమారుడు
మరణించాడని
ఎట్లా
చెప్పేది!
ఒక
సర్వెంటు
సహాయంతో
ఆ
పిల్లవాని
మృతదేహాన్ని
ఎత్తుకొని
తీసుకు
వెళ్ళి
ఆమె
ప్రక్కన
పరుండబెట్టాడు.
ఆ
తల్లి
లేచి
“నాయనా!
నాయనా!”
అని
పిలిచింది.
అప్పుడా
ఆఫీసరు,
“అమ్మా!
నీకోసమే
ఈ
అన్నం
తీసుకువస్తూ
ప్రాణం
విడిచాడు”,
అన్నాడు.
“అయ్యో,
నా
కుమారుడే
పోయింతర్వాత
ఇక
నాకీ
అన్నమెందుకు?”
అంటూ
ఆమెకూడా
ప్రాణం
విడిచింది.
తల్లికి
శక్తి
ఉన్నంతవరకు
కుమారుణ్ణి
పోషిస్తుంది.
కుమారునికి
శక్తి
వచ్చిన
తరువాత
తల్లిని
పోషించాలి.
5
▾
Meaning
Keep
ఒకరినొకరు
పోషించుకోవటంకోసమే
భగవంతుడు
మనకీ
జన్మనిచ్చాడు.
అన్నదమ్ములు,
అక్కచెల్లెళ్ళు
....
ఈవిధమైన
సంబంధ
బాంధవ్యములు
ఎందుకోసం?
కేవలం
ఆస్తిపాస్తులను
పంచుకొనే
నిమిత్తం
కాదు;
ప్రేమను
పెంచుకొని,
పంచుకొనే
నిమిత్తం.
ప్రేమను
పంచుకోవడమే
నిజమైన
సంబంధ
బాంధవ్యమునకు
చిహ్నం.
ప్రేమ
లేనప్పుడు
లౌకికమైన
సంబంధ
బాంధవ్యములన్నీ
నిరుపయోగమే.
బలహీనులైనవారిని
బలవంతులైనవారు
పోషిస్తూ
రావాలి.
కష్టాలలో
ఉన్నవారిని
చూసి
జాలిపడాలి,
వారి
కన్నీరు
తుడవడానికి
ప్రయత్నించాలి.
ఇదియే
దయ.
ఈ
దయనే
ధర్మము
అన్నారు.
ఇదియే
ప్రేమ
అన్నారు.
ఈ
ప్రేమను
మనం
పెంచుకున్నప్పుడు
జగత్తును
ఎంతైనా
మనము
ఆనందపెట్టవచ్చు.
కనుక,
ప్రేమను
పెంచుకోండి.
ఎవరైనా
బీదలను,
రోగులను,
కష్టాలలో
ఉన్నవారిని
చూసినప్పుడు
వారికేదైనా
సహాయం
చేయండి.
వారిని
మనము
పోషిస్తూ
వస్తే,
భగవంతుడు
మనలను
ప్రేమిస్తాడు.
ప్రతి
మానవునియందుకూడను
ప్రేమ
అనే
రూపములో
భగవంతుడు
నిలిచి
ఉన్నాడు.
ఈ
ప్రేమను
మనము
వ్యర్థము
చేయకూడదు.
దీనిని
దుర్వినియోగం
చేయ
కూడదు.
ఈనాడు
మనము
ప్రేమను
ఇష్టమొచ్చినట్లు
ప్రసరింపజేస్తున్నాము.
వస్తువులను
ప్రేమించటం,
వ్యక్తులను
ద్వేషించటం,
అనేకరకములైన
పెడమార్గం
పట్టటంచేతనే
మనము
ఈ
గతికి
వచ్చినాము.
కొందరు
బయటి
ప్రజలపై
ప్రేమను
చూపుతారుగాని
ఇంట్లో
ఉన్న
తల్లిదండ్రులపై
చూపరు.
మొట్టమొదట
ఇంట్లో
తల్లిదండ్రులపై
ప్రేమ
చూపి
తరువాత
బయటి
జనులకు
ప్రేమను
పంచాలి.
మొట్టమొదట
‘సెల్ఫ్’,
తరువాత
‘హెల్ప్’.
మనము
మన
బంధు
మిత్రులనేగాక
సర్వులను
ప్రేమించాలి.
అప్పుడు
భగవంతుడు
మనల్ని
ప్రేమిస్తాడు.
కష్టపడేవారిని,
రోడ్డుపై
తిరుగుతూ
అవస్థలు
పడేవారిని
చూచి
మనము
పట్టించుకోకుండా
ఉండకూడదు.
మనకు
ఎంత
పని
ఉండినప్పటికీ
వారి
బాధలు
తీర్చడానికి
ప్రయత్నించాలి.
అప్పుడే
మనకు
భగవంతుడు
సాక్షాత్కరిస్తాడు;
తగిన
బలమును
అందిస్తాడు.
భగవంతునికంటే
మించిన
ప్రేమగలవారు
ఈ
జగత్తులో
లేరు.
మనము
భజన
చేసినా,
ఇంకేవిధమైన
సేవ
చేసినా
భగవంతుని
ప్రేమకోసమే!
భగవంతుణ్ణి
ప్రేమించినప్పుడు
మనకెంతో
బలము
చేకూరుతుంది.
6
▾
Meaning
Keep
భగవంతుడే
మనకు
ఆ
బలమునందిస్తాడు.
కనుక,
మీరు
భగవంతుణ్ణి
ప్రేమించండి,
భగవంతుని
బిడ్డలైన
ప్రజలను
ప్రేమించండి.
అనాథలైన
పిల్లలను
చేరదీసి
వారి
అవస్థలను
తీర్చండి.
అప్పుడే
మన
జన్మ
సార్థకమవుతుంది.
కష్టపడేవారిని
చూసి
ఏమాత్రము
జాలిచూపకుండా
పోతే
అంతకంటే
మించిన
పాపము
మరొకటి
లేదు.
రేపటి
దినము
నీవు
బాధపడినప్పుడు
జనులు
నిన్ను
చూచి
నవ్వుతారు.
కాబట్టి,
నీవు
ఇతరులను
ప్రేమించి
ఇతరులచేత
ప్రేమింపబడు.
దానము,
ధర్మము
ఈ
రెండూ
చాలా
ప్రధానమైనవి.
“అన్నదానముకన్న
అధికదానంబేది?
తల్లిదండ్రుల
కన్న
దైవమేది?”
చాలామంది
పిల్లలు
తల్లిదండ్రుల
ఆజ్ఞను
ధిక్కరిస్తుంటారు.
“దయ
కంటె
ఎక్కువ
ధర్మమేది?
క్రోధముకన్న
శత్రుత్వమేది?”
మనకు
ఎటువంటి
పరిస్థితులలోనైనా
కోపము
రాకూడదు.
మనలను
ద్వేషించేవారినికూడా
మనము
ప్రేమిస్తూ
రావాలి.
ప్రేమచేతనే
ప్రాణమును
నిలుపుకోవాలి.
ప్రేమచేతనే
జీవితమును
సార్థకం
చేసుకోవాలి.
సేవాదళం
సభ్యులారా!
మీరు
మొట్టమొదట
ప్రేమను
హృదయంలో
ప్రతిష్ఠ
చేసుకోండి.
ఎవరిని
చూసినా
ప్రేమతో
పలుకరించండి.
కష్టాలలో
ఉన్నవారిని
ప్రేమతో
చెంతకు
చేర్చుకోండి.
అప్పుడే
భగవంతుడు
మిమ్మల్ని
ప్రేమిస్తాడు.
మీరు
మీ
సాటి
మనుష్యులను
ప్రేమించకపోతే
భగవంతుడు
మిమ్మల్ని
ఎట్లా
ప్రేమిస్తాడు?
మనము
భగవంతుని
ప్రేమకు
పాత్రులం
కావాలంటే
మొట్టమొదట
ప్రజలయొక్క
ప్రేమకు
పాత్రులం
కావాలి.
మనము
ఇతరులకు
సహాయం
చేసినప్పుడు
భగవంతుడు
మనకు
సహాయము
చేస్తాడు.
‘హెల్ప్
ఎవర్,
హర్ట్
నెవర్’.
ఎవ్వరినీ
మనము
బాధించకూడదు.
అందరినీ
ప్రేమించాలి.
మంచి
హృదయమును
కలిగియుండాలి.
ప్రేమచేత
హృదయము
కరిగి
ప్రవహిస్తుంది.
ప్రేమస్వరూపులారా!
మీరందరూ
ప్రేమస్వరూపులే!
ప్రేమను
మీలో
పెంచుకోండి.
అదే
భగవంతునియొక్క
అంశము.
దీనిని
పురస్కరించుకొనియే
కృష్ణుడు
“మమైవాంశో
జీవలోకే
జీవభూతస్సనాతనః”
అన్నాడు.
నాయనా!
నేను
ప్రత్యేకంగా
లేను.
నేను
మీలోనే
ఉన్నాను.
మీరు
నాలోనే
ఉన్నారు.
నేను
మిమ్మల్ని
ప్రేమిస్తున్నట్లుగా
మీరు
అందరినీ
ప్రేమించాలి.
అప్పుడు
ప్రేమకు,
ప్రేమ
రెండూ
ఏకమైపోతాయి.
ప్రేమకు
ప్రేమను
చేర్చినప్పుడు
అది
మరింత
అధికమైపోతుంది.
ప్రేమను
పెంచుకొనేకొలదీ
మనము
పెద్దవారమవుతాము.
7
▾
Meaning
Keep
ఇదియే
మనము
చేయవలసినటువంటి
సేవ.
ప్రేమను
మనము
పెంచుకున్నప్పుడే
భగవంతుడు
మనవాడవుతాడు;
మనము
భగవంతుని
ప్రేమకు
పాత్రులమవుతాము.
Previous
←
All parties must become one for the good of the country
Next
For this birth to cross over, renounce selfishness
→