Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · Monotheism
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్రప్రథమముననే
మనకొక
వింత
భావము
కానవచ్చును,
ఇవియే
ఋక్కులు.
అనగా
తేజోరూపులను
గూర్చినవి.
ఇట్టి
దేవుళ్ళు
అనేకులు
కలరనియు,
ఇంద్రుడు,
వరుణుడు,
మిత్రుడు,
పర్జన్యుడు
అనునవి
కొందరి
పేర్లు.
వీరు
ఒకరి
వెనుక
ఒకరు
కనిపింతురు.
ఇట్టివాడే
వజ్రాయుధుడగు
ఇంద్రుడు.
భూలోకమునకు
వర్షము
వచ్చునట్లుచేసిన
ప్రతీతుడు.
అందు
వలన
భారతీయులు
ఇంద్రుని
పూజింతురు.
ఇంద్రుడు
అనగా
ఇంద్రియములకు
అధిపతియైన
మనస్సును
ఇంద్రుడని
పిలిచిరి.
ఇతనికి
పురుహూతుడని
రెండవ
పేరు.
పురు
అనగా
అనేక
పర్యాయములు;
హూతుడు
అనగా
ఆహ్వానింప
బడువాడు.
మనస్సనే
ఇంద్రుణ్ణే
రుద్రునిగా
వేదములలో
కీర్తింపబడినది.
ఇంద్రియములద్వారా
అనుభవిస్తున్నప్పుడు
ఆ
మనస్సే
ఇంద్రుడు.
ఇంద్రియములను
జయించి
తాము
వానిలోనికి
సర్వాంతర్యామితత్త్వం
పొందుచున్నప్పుడు
ఆ
మనస్సే
రుద్రుడు.
అందువలననే
వేదములోని
ఇంద్రుడు,
రుద్రుడు
రెండు
నామములుగా
వైభవముగల
ఒకే
దేవతగా
వర్ణించిరి.
తక్కిన
దేవతలను
గూర్చి
కూడా
ఇట్టి
వర్ణనముల
నెన్నియైన
ఉదహరింపవచ్చును.
చివరికొకే
విధమున
అంతా
వర్ణింపబడుచుందురు.
దేవతలుగా
ప్రారంభింతురు.
కడకు
అఖిల
జగత్తు
తమ
యందు
కలవారుగా
సర్వ
హృదయములకూ
సాక్షీభూతులుగా
సర్వలోకాధి
నాధులుగా
2
▾
Meaning
Keep
పరిణమింతురు.
వరుణుని
విషయములో
మరొకభావము
భయభావము
గోచరించును.
ఈ
భావము
అంకుర
రూపమున
పొడచూపెనుగానీ
ఆర్యబుద్ధి
దానిని
వెంటనే
అణగద్రొక్కెను.
మరొకచోట
కొందరు
పాపమొనర్చితిమనెడి
భీతి
కలిగి
క్షమింపుమని
వరుణుని
ప్రార్థించినట్లు
వ్రాయబడెను.
కానీ
వానిని
హైందవ
భూమిలో
అభివృద్ధి
నొందకుండా
చేసిరి.
ఇందుకు
కారణము
ఇది
ఏకేశ్వరారాధనకు
గుర్తు.
ఈ
ఏకేశ్వర
సిద్ధాంతము
చాలా
పురాతన
కాలముననే
హిందూదేశములో
ప్రకాశించెను.
సంహితాభాగమంతటి
లోనూ
ఇదియే
వేదములలో
ప్రథమమును,
ప్రాచీనమును
అయినది.
అయితే
ఆర్యులను
ఇది
తృప్తి
పరుపజాలకపోయెను.
ఇది
మిక్కిలి
అపరిపక్వభావముగా
తోచుటచేత
భారతీయులు
విడనాడిరి.
అంతకన్నా
ఉన్నతమని
భారతీయుబుద్ధికి
తోచు
భావముదెస
వారు
పరాక్రమించిరి.
కానీ
యూరపుదేశస్తులు
భారతీయ
పరమార్థ
సారమైన
వేదములను
గూర్చి
వ్రాసిన
గ్రంథములలోనూ,
వేదవిమర్శన
గ్రంథములలోనూ,
ఋషుల
రచనలలో
ఆ
పురాతన
భావము
నిండియుండినట్లు
గనుపించును.
హిందువుకు
ఇది
పరిహాసాస్పదముగ
తోచును.
సగుణసాకారభావముకన్నా
ఉన్నతమగు
ఈశ్వరభావమే
లేదని
ఉగ్గు
పాలతో
నేర్పిన
వారు
ప్రాచీన
తత్త్వ
విచార
పరులు:
భారతీయ
ఋషులు.
నిజముగా
సంహితా
కాలము
దాటుటతోడనే
సంహితా
భావమున
నిండియున్న
ఏకేశ్వర
భావము
పనికి
మాలినదనియు
వేదాంతులకును,
జిజ్ఞాసులకును
అది
ఆదరణార్హము
కాదనియు
తలచి
అంతకన్నా
తాత్త్వికమును
అంతకన్నా
లోకాతీతమును
అగు
భావమును
సాధించుటకై
భారతీయులు
పాటుపడిరి.
ఏకేశ్వర
భావము
"అతని
యందే
జగత్తంతయునూ
నిలిచియున్నది."
"సర్వచిత్తములకు
నీవే
కాపరివి"
మున్నుగు
వర్ణనలు
ఎన్నియో
చేసిరి.
కేవలము
మానవ
బుద్ధిని
పరిమితమైనదిగా
పాశ్చాత్యులు
భావించిరి.
3
▾
Meaning
Keep
భారతీయులు
తత్త్వ
విచారణ
విషయమున
నిరంకుశ
సాహసమును
చూపిరని
అంగీకరించక
తప్పదు.
వారి
సాహసిక
భావాగ్నిజ్వాలలోని
స్వల్పకణమే
పాశ్చాత్యదేశపు
తత్త్వవిచారపరులలో
ధీరతా
విఖ్యాతినొందిన
వారిని
కూడా
వెరపుగొలుపజాలి
యున్నది.
దీనినే
ప్రొఫెసర్
మ్యాక్స్
ముల్లరు
మనోహరముగా
పలికెను.
సహేతుక
విచారము
ఈ
ధీరులనెంత
అపరిచిత
భావ
క్షేత్రములకు
కొనిపోయిననూ
వారచటికిపోవ
సాహసించిరి.
అందుకైయేమి
పరిత్యజించవలసి
వచ్చిననూ
వారు
వెనుదీయలేదు.
లోకులు
తమ్ము
గూర్చి
యేమి
చింతింతురు?
అని
వారికి
బాధలేదు.
వారికేది
యుక్తమని
తోచునో,
యేది
సత్యమని
తోచునో
దానికై
ప్రొఫెసర్
మ్యాక్స్ముల్లరు
లోకులకు
భారతీయ
పరమార్థ
వాహినిలో
ప్రవేశింపమని
ప్రబోధించెను.
"ఏకం
సత్
విప్రాః
బహుధావదన్తి"
(ఉన్నదొకే
వస్తువు.
దానినే
ప్రాజ్ఞులు
వేర్వేరు
పేర్లతో
వ్యవహరింతురు.)
అని
ఈ
వాక్యము
నందు
ఇమిడియున్నది.
ఈ
కారణము
మహోదాత్త
రూపమైనది.
భారతదేశమున
అనంతకాలమున
ప్రబలిన
ఆధ్యాత్మిక
విచారణమంతయూ
ఈ
మూలసూత్రము
మీదనే
ఆధారపడి
యున్నది.
భావికాలమున
లోకమున
ఎచ్చటనేని
విస్తరణ
మొందనున్న
ఆస్తిక
ధర్మవిచారణమంతయూ
కూడా
దీనిమీదనే
ఆధారపడి
యుండగలదు.
ఈ
వివిధ
దేవతలను
గూర్చి
ఋక్కులు
రచించిన
వారి
దృష్టిపథమున
నిలచి
యున్నది.
ఒక్కడే
దర్శించువాడు.
అనేకమంది
భిన్నతకు
కారణము.
ఒకే
ఏకైక
పురుషుని
గూర్చియే
స్తోత్రకారులు,
ఋషులు,
కవులు
వివిధ
భాషలలో,
వివిధ
వాక్కులతో,
వివిధ
భావములతో
గీతికలు
రచించిరి.
పై
వాక్యమునుండి
అనగా
"ఏకం
సత్
విప్రాః
బహుధావదన్తి"
అను
వాక్యమునుండి
మహోత్కృష్ట
ఫలితము
ఆవిర్భవించినది.
మతమూలకమగు
హింసలు,
మతానుష్ఠానమున
కవరోధము
కల్పించుటలు
కలుగనిది
భారతదేశ
మొక్కదాని
యందే
అగుట
కొందరికి
విచిత్రముగా
తోచవచ్చును.
ఆస్తికులు,
నాస్తికులు,
అద్వైతులు,
ద్వైతులు,
4
▾
Meaning
Keep
ఏకేశ్వరారాధులు
ఈ
దేశమున
కలరు.
ఎన్నడు
కానీ
వారి
కుపద్రవము
కలుగదు.
బ్రాహ్మణుల
ఆరాధనా
దేవాలయముల
మెట్లపై
నిలుచుండి
దేవుణ్ణి
దూషించుచూ,
ఖండించుచూ
జడవాదులు
బోధలు
సలిపిరి.
ఈశ్వరభావము
కేవలము
భ్రాంతి
అనియు,
దేవతలు,
వేదములు,
ఆస్తిక
ధర్మము,
వాటి
సూత్రములు
తమ
స్వప్రయోజనార్థము
బ్రాహ్మణులు
కల్పించిన
మూఢ
విశ్వాసములనియూ,
వారు
దేశమంతయూ
తిరిగి
ప్రచారించిరి.
అట్టివారి
కెవ్వరునూ
ఆటంకము
కల్పింపలేదు.
హిందూసాంప్రదాయములను
తిరస్కరించుచూ
వచ్చిన
బౌద్ధ
మతమునుకూడా
హిందువులు
గౌరవించిరి.
ఈశ్వరభావమును
పరిహసించుచుండిన,
జైనుల
విషయముకూడా
ఇట్టిదే.
"దేవుడొకడు
ఎట్లుండ
గలడు?
అది
కేవలము
మూర్ఖభావమై
ఉండవలెను."
అనివారు
పలికిరి.
ఇట్టి
ఆదర్శములు
అనంతముగా
నుదహరింపవచ్చును.
మహమ్మదీయులు
మహా
కల్లోలముగా
ఎగబారి
వచ్చుదాకా
మత
విషయక
హింస
ఇట్టిదని
కూడా
భారతదేశమున
ఎవ్వరునూ
ఎరుగరు.
విదేశీయులు
వచ్చి
తమపై
ప్రయోగించినపుడే
భారతీయులకు
ఆ
విషయము
పరిచితమైనది.
క్రైస్తవ
చర్చిల
నిర్మాణమున
భారతీయులు
యెంత
తోడ్పడినదీ,
క్రైస్తవులతో
సహకరించుటకు
భారతీయులు
ఎంత
సంసిద్ధత
చూపినదీ,
నేటికి
కూడా
విస్పష్టముగా
కనిపించుచున్నది,
కనిపించును.
రక్తపాత
మెన్నడునూ
సంభవించలేదు.
వీటి
నన్నింటిని
పదిలపరచ
వలెనన్ననూ,
భారతీయుల
పరమార్థవాహినిని
చక్కగా
అర్థము
చేసుకొనవలెనన్ననూ,
విచారణశక్తి,
బుద్ధి
బలము
ఆవశ్యకము.
మత
ప్రచారములు
లోకసంచారమునకు
ఉపక్రమించిన
మతములలో
బౌద్ధమతము
మొదటిది.
అనాగరికమున
పేరొందిన
ఆనాటి
దేశములు
అన్నింటిలోకి
బౌద్ధమతము
చొచ్చుకొని
పోయినది.
చీనాదేశమున
మతప్రచారకులు
హింసింపబడిరి.
కొందరు
చక్రవర్తుల
ఆజ్ఞలచే
వేనవేలు
5
▾
Meaning
Keep
వధింపబడిరి.
కానీ
పిదప
బౌద్ధులకు
అదృష్టకాలము
వచ్చెను.
బౌద్ధమతము
హింసవలదని
ప్రబోధించెను.
అంతయూ
"ఏకంసత్
విప్రాః
బహుధావదన్తి"
అతనినే
ఇంద్రుడని
రుద్రుడని
పేర్కొందురు.
ఈ
వాక్యముయొక్క
ఫలము
కావున
దీనిని
అందరూ
జ్ఞాపకమందుంచు
కొందురుగాక!
భారతీయులలో
సమత్వము
మెండు.
హిందూమతమో,
బౌద్ధమతమో,
మహమ్మదీయమతమో,
జోరాష్ట్రమతమో,
క్రీస్తుమతమో,
ఏదిగానున్ననూ,
దైవారాధనను
ఎవరునూ
పరిహాసించ
కూడదనియునూ,
ఏ
రూపనామమును
పరిహాసించినను
ఒకే
దైవమును
పరిహాసించినట్లగుననియూ
భారతీయ
పరమార్థము
ప్రచారము
చేసెను.
ఈ
సత్యాన్ని
నేర్చిన
వారే
నిజమైన
భారతీయులు.
దీనిని
అందరూ
గుర్తింపజాలరు.
జగత్తును
పరిపాలించువాడు,
జగత్తులో,
దాని
వెలుపల
నిలచి
పరిపాలించువాడు,
జగత్తుయొక్క
ఉనికికి
కారణము
వివరింపగలడా?
వివరింపజాలడు.
ఈ
జగత్తు
ఎక్కడినుండి
వచ్చినది?
ఎట్లు
వచ్చినది?
ఎట్లు
ఉనికిని
దాల్చినది
ఈ
విషయమును
గూర్చిన
ఋక్కులు
భారతదేశమున
అనేకము
కలవు.
సృష్టి
అనగా
వస్తువుల
యొక్క
సంయోగము.
సంయుక్త
పదార్థములన్నియూ
కాలాంతరమున
వియుక్తత
నొందుట
తథ్యము.
అనగా
ఆత్మ
సృజింపబడినదయ్యెనేని
అది
మరణింపవలెను
కదా!
కొందరు
సుఖులై
జన్మింతురు.
పరిపూర్ణ
ఆరోగ్యభాగ్యములనుభవింతురు.
మరికొందరు
నిర్భాగ్యులై
జన్మింతురు.
కొందరికి
కాలుసేతులుండవు.
కొందరు
మతిహీనులు
అయి
పుట్టుదురు.
వారందరినీ
సృజించిన
వాడెవడు?
అతను
న్యాయశీలుడు,
దయామయుడు
అని
అందురు
కదా!
అట్టి
సమదృష్టి
కల
పరమాత్మకు
ఇట్టి
పక్షపాత
బుద్ధి
యేలనని
వాదించినా
వాదించవచ్చును.
ఈశ్వర
పరిపాలనా
రాజ్యములో
ఇట్టి
భేదములు
ఏల
కలుగవలెనని
ఊహించవచ్చును.
అయితే
మానవుని
కష్టసుఖములకు,
దౌర్భాగ్యములకు
కారణము
పరమాత్మ
కాదనియూ,
అతని
ఈ
జన్మమునకు
పూర్వము
చేసిన
కర్మలే
కారణమని
6
▾
Meaning
Keep
స్పష్టపరచునది
భారతీయ
పరమార్థ
వాహిని.
ఇవి
స్వయం
కృతములు.
పూర్వజన్మకర్మలు
మానవులయొక్క
శరీరముల
పోకడలు
వారికి
వంశపరంపరంగా
సంక్రమించిన
లక్షణ
విశేషములుగా
నుండరాదా?
ఇచట
సమాంతర
రేఖలవలె
నిలచియుండు
రెండు
వస్తువులు
కలవు.
ఒకటి
మానసికము.
రెండవది
భౌతికము.
మనస్వభావ
విశేషములన్నింటికినీ
భౌతిక
పదార్థమునందును,
తత్పరిణామము
నందును
తృప్తికరమగు
సమాధానములు
లభించినచో
ఆత్మయనునది
ఒక్కటి
కలదని
ఊహించుటకే
అవసరముండదు.
కానీ,
చింతనాశక్తి
భౌతిక
పదార్థములనుండి
ఉత్పన్నమైనదని
నిరూపించుట
అసంభవము.
ఒక్క
పనినే
మాటిమాటికి
చేయుచుండుటయే
కదా
అభ్యాసము.
కావున
అపుడే
జన్మించిన
ఆత్మయందు
చూపించు
స్వాభావికాభ్యాసములు
పునః
పునరాచరణము
వలననే
సిద్ధించియుండును
అని
చెప్పక
తప్పదు.
ఈ
అభ్యాసములు
ఈ
జన్మమున
ఆర్జించుకోబడినవి
కావు.
కనుక
పునర్జన్మముండియే
తీరును
అని
బోధించునదే
భారతీయ
పరమార్థవాహిని.
Previous
←
From Truth to Truth
Next
The Wonder of Wonders
→