Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · The Wonder of Wonders
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
భారతీయులు
:
"తానొక
ఆత్మ"
అని
విశ్వసించుదురు.
అట్టి
ఆత్మను
ఖడ్గములు
ఛేదింపజాలవు.
అగ్ని
దహింపజాలదు.
నీరు
తడుపజాలదు.
గాలి
శోషిలచేయజాలదు.
ఆత్మయను
దానికి
పరిధియే
లేదు.
కేంద్రము
మాత్రము
శరీరమున
నుండును.
మరణమను
దానికర్థము
–
ఈ
కేంద్రము
ఒక
శరీరమునుండీ
మరొక
శరీరమునకు
మారుట.
ఇది
భారతీయులయొక్క
విశ్వాసము.
ఆత్మ
భౌతిక
నియమములకు
లోబడినది
కాదు.
స్వతస్సిద్ధముగా
అది
యుక్తము,
నిర్నిబద్ధము,
పావనము,
శుద్ధము,
పరిపూర్ణము.
కాని,
అది
భౌతిక
పదార్థమునకు
అంటగట్టబడి,
తాను
భౌతిక
పదార్థమనియే
భావించుకొను
చుందును.
ఇదియే
దాని
చమత్కారము!
ఈ
చమత్కారమును
తెలిసికొన
ఎట్టి
వారికినీ
వీలుకాదు,
సాధ్యపడదు.
పరిపూర్ణమగు
ఆత్మ
తాను
అపరిపూర్ణమగు
భ్రాంతిలో
ఎట్లు
చిక్కుకోగలదు?
భారతీయులీప్రశ్నకు
ఆస్పదమే
లేదని
చెప్పి,
తప్పించుకో
చూతురని
కొందరు
తలంచవచ్చు.
తమ
అజ్ఞతను
కప్పిపెట్ట
జూతురు;
విశుద్ధమును,
అఖండమును
అగుపదార్థము
అణుమాత్రముగానైనా
తన
స్వభావమును
ఎట్లు
కోల్పోగలదు?
భారతీయుడు
అకృత్రిమ
స్వభావుడు!
కుతర్కముల
నాశ్రయించి
తప్పించుకొనజూడడు;
సమస్యను
పురుషోచిత
విధమున
నెదుర్కొను
ధైర్యము
కలవాడు
భారతీయుడు.
కనుక,
ఆ
సమస్యకది
సమాధానము.
2
▾
Meaning
Keep
పరిపూర్ణ
వస్తువగు
ఆత్మ
తాను
అపరిపూర్ణమైనదని
తలచు
కొనుటయు,
తాను
భౌతికపదార్థముతో
చేరి
దానిచే
నీమింపబడినదని
తలచుకొనుటయు
ఎట్లు
సంభవించును?
అది
సంభవించదు.
తాను
శరీరమునని
తలచుకొనుట
ప్రతివాదునూ
ఎరిగిన
విషయమే;
అతడట్లు
తలచుకొనుటెట్లు
సంభవించెనో
యెవరైనా
చెప్పగలరా?
దీనికి
జవాబిచ్చుటకుకూడా
యెవరూ
పూనుకోరు.
అది
భగవదిచ్చ
అనుట
సమాధానమే
కాదు.
నేను
ఎరుగను,
అని
భారతీయుడు
పల్కు
మాటకన్నా
ఈ
సమాధానమునకు
ఏమియు
ఆధిక్యము
లేదు.
తేలినదిది.
జీవాత్మ
నిత్యము,
అమృతము,
పరిపూర్ణము,
అనంతము.
మరణమనగా
దాని
కేంద్రము
ఒక
శరీరమునుండి
మరొక
శరీరమునకు
మారుటే
అని
ముందు
తెల్పితిని.
మన
ప్రస్తుత
స్థితి
మన
పూర్వజన్మ
కర్మలచేత
నిర్ణయింపబడును.
అట్లే
భవిష్యత్తుస్థితియు
ఇప్పటి
కర్మముచేత
నిర్ణయింపబడును.
జన్మ
జన్మలకు
మధ్య,
మరణమరణములకు
మధ్య
ఆత్మ
వ్యాకోచమొందుటో
లేక
సంకోచమొందుటో
జరుగుచుండును.
కానీ
మనుష్యుడు
తుఫానులో
చిక్కిన
చిరునావవలె,
నొకక్షణమున
నురుగులు
గ్రక్కు
మహాకల్లోల
శిఖరమునకు
ఎగజిమ్మబడును.
అనంతర
క్షణమున
ఆవలించుచుండు
అగాధములోనికి
భీషణవేగముతో
కూలద్రోయబడును.
సత్కర్మ,
దుష్కర్మ
వశుడై
తత్ప్రభావముచే
ఇటునటు
దొరలుచుండు
వాడేనా?
అమృత
పుత్రులారా!
వినుడు.
భ్రాంతికిని,
అంధకారమునకును
ఆవలనుండు
ఆ
పురాణ
పురుషుని
భారతీయ
మహాఋషులు
కనుగొని,
వారు
ఈ
విధముగా
జవాబు
చెప్పిరి.
"మానవ
జీవులారా!
సోదరులారా!
మీ
మరణపరంపరమునుండి
విముక్తులగుటకు
అతని
నెరుగుటొక్కటే
మార్గము.
నిత్యానందమునకు
ఉత్తరాధికారులైన
మీరు
పాపులనుకొని
తలంచకుడు.
మీరు
ఈశ్వర
ప్రతిబింబులు.
అవ్యయానందమును
పాల్గొనువారు,
పావనులు,
పరిపూర్ణులు,
భూమిపై
విహరించు
దేవతలు.
అట్టి
మిమ్ము
పాపులని
పిలుచుట
3
▾
Meaning
Keep
కంటే
వేరొక
పాపమున్నదా?
పాపులమని
అంగీకరించుట
అప్రతిష్ట
లెందు.
మీరు
గొఱ్ఱెలను
భావమును
వీడి,
భ్రాంతిని
వదలి,
మీరు
ఆత్మలు,
ఆద్యంత
రహితులును
అగు
అమృతబిందువులు.
భౌతిక
పదార్థము
మీ
దాసికాని,
మీరు
దాని
దాసులుకారు".
ఇవి
ఋషుల
వాక్యములు.
ఋషులు
వేదవిదితులు.
ఇట్టి
భారతీయ
భావములను
అనుభవము
లేనివారు
ఎట్లు
అర్థము
చేసుకోగలరు?
భగవంతునే
తండ్రిగా,
తల్లిగా,
గురువుగా,
మిత్రునిగా,
ప్రియునిగా
ప్రార్థించి,
భావించి
బలమును
అందుకొన్న
భాగ్యజీవులు
భారతీయులు.
ఇహపరములందుగల
సర్వమున
కన్నను
ప్రియతర
వస్తువుగా
ఏకైకప్రియునిగా
ఆరాధించిన
వారు
భారతీయులు.
కేవలము
ఇంద్రియ
సుఖములనే
ఎరుగు
జనసామాన్యము
అట్టి
పరమసత్యమును
ఏరీతిగా
గ్రహించగలరు?
ఈ
ఇంద్రియ
స్వభావమే
మనకు
సత్యము
గాన్పింపక
మరుగుబడియుండు
కారణములలో
ఒకటని
ఋషులవాదము.
ఇంద్రియ
భోగాసక్తి
వివిధ
సిద్ధాంత
కల్పనము.
ఇది
సత్యమునకు,
మనకు
మధ్యనుండు
ఒక
తెర.
మన
పరిశీలనములలో
ఇది
ఒక
మహాఘట్టము.
ఈ
భావనే
క్రియాభివృద్ధినంది
అద్భుతరూపమగు
వైదాంతిక
మాయా
సిద్ధాంతముగా
కాలాంతరమున
రూపొందుటయు,
ఈ
తెరనే
వేదాంతమున
కానవచ్చు
యథార్థ
వివరణమనియు,
అనాది
కాలమునుండి
సత్యము
మనకంటియెదుటనే
దీపించుచుండియు
ఈ
తెరవలననే
మరుగుబడి
యుండెననియు
భారతీయులు
గనుగొనిరి.
మన
ఈ
సమస్యకు
బాహ్యలోక
అన్వేషణముచే
సమాధానము
లభింపదని
భారతీయుల
కెరుకపడెను.
ఎన్ని
యుగముల
కాలము
బాహ్యలోకమున
వెదికినను
నిష్ఫలమే.
దీనికి
అనుభవము
అత్యవసరమనియు,
అట్టి
పరమానుభవమును
బడయుటకై
భారతీయులు
దీర్ఘతపస్సు
చేసి,
విచారణసలిపి,
కడకు
సత్యాన్ని
గుర్తించి,
లోకానికి
చాటిరని
భారత
శాస్త్రములు
చాటుచున్నవి.
ఇంద్రియ
వాంఛలును,
కర్మకలాపాది
బాహ్యావిషయవాంఛలును,
తమకును,
సత్యమునకును
నడుమ
తెరను
కల్పించినవనియూ,
ఆ
తెరను
4
▾
Meaning
Keep
కర్మకలాపములచే
భేదించుట
కష్టమనియు,
అసాధ్యమనియూ
లోకానికి
బోధించెను.
భారతీయ
పరమార్థము,
దాని
సత్యాన్ని
కనుగొనుటకు
మనస్సే
వారికాధారమయ్యెను.
మనస్సుయొక్క
సూక్ష్మపరిశీలనము
తప్ప
గత్యంతరము
కానరాదయ్యెను.
బాహ్యప్రపంచ
పరిశోధనము
నిరుపయోగమయ్యెను.
గాన
అంతర
ప్రపంచము
దెస
వారు
తమ
దృష్టిని
మరల్చుకొనిరి.
ఇదియే
వేదాంతవిద్యకు
ప్రారంభము,
పునాది.
సత్యమునకై
వేరెక్కడనూ
అన్వేషింప
పనిలేదు.
అద్భుతములలోకెల్లా
అద్భుతమగు
ఈ
జీవునియందు,
మానవునియందు
వెదకుడు.
మానవునియందు
లేనిది
ఎచ్చటనూ
ఉండజాలదు.
వెలుపల
కనిపించునది
లోనున్న
దానికి
బింబ
ప్రతిబింబము
మాత్రమే.
ఈశ్వరుడు
జగత్తు
వెలుపలనుండే
జగత్తును
పరిపాలించుచుండును
అను
పురాతన
భావమును
వారు
గైకొనిరి.
ఆ
ఈశ్వర
జగత్తులోపల
నుండిరి.
భారతీయులు
మొదట
చేసిన
కార్యమిదియే.
అతడు
వెలుపల
నుండు
దేవుడు
కాదు.
లోపల
నుండువాడు.
అచ్చటనుండే
అతన్ని
తీసి
తమ
హృదయ
పీఠికల
నాక్రమింప
చేసిరి.
మన
ఆత్మలకు
ఆత్మయై,
మనలోని
సత్యపదార్థమై
నిలిచియుండును.
వేదాంతతత్త్వశాస్త్రమును
చక్కగా
అర్థము
చేసుకొన
గోరువారు
ఉదాత్తములగు
కొన్ని
భావములను
గ్రహింపవలెను.
తత్త్వశాస్త్రము
ఒక
గ్రంథముకాని,
ఒక్కరిచే
రచింపబడినది
కానేకాదు;
మహామహుడగు
మనువు
'బ్రహ్మవర్తము'
అని
పేర్కొనినదీ
భారత
భూమి.
కాలాంతరమున
ప్రపంచమందంతటనూ
వెల్లివిరియనున్న
ఆత్మాన్వేషణ
మహోద్యమము
ఈ
భూమినుండియే
ఉత్పత్తి
అయినది.
ఈ
భూమి
యందు
మహానదులవలెనే
పారమార్థికోద్యమములు
కూడా
నుద్భవించినవి.
మేఘ
గర్జారావముతో
తమ
ఆధ్యాత్మిక
సందేశమును
లోకమునకు
చాటినది.
5
▾
Meaning
Keep
భారతదేశము
మీదికి
శత్రుదాడి
వెడలివచ్చినపుడెల్లా
ఆ
ధాటీప్రఘాతమునకు
ప్రథమమున
మారొడ్డి
నిలచు
భారమును
ఈ
పవిత్రభూమి
వహింపవలసి
వచ్చెను.
ఆర్యావర్తము
పైకెత్తి
వచ్చు
దుర్వాతముల
కాటుపోటులకీ
ధీరభూమిలోని
దండిమగల
వక్షః
ప్రదేశములే
మొదట
గురి
కావలసి
వచ్చెను.
ఇట్లు
ఎన్నిసార్లో
ఘోరహింసల
ననుభవించియు
ఈభూమి
ఇప్పటికినీ
తన
యశోవైభవమును,
తన
బలమును
పూర్తిగా
కోలుపోలేదు.
ఇచ్చటనుండియే
సాధుమూర్తి
నానక్
మహాశయుడు
అత్యద్భుత
రూపమగు
తన
ప్రేమ
భావమును
బోధించెను.
ఇచ్చటనే
అతని
విశాలహృదయం
వికసించెను.
హైందవ
ప్రపంచమునే
కాక
మహమ్మదీయ
ప్రపంచమును
కూడా
ప్రేమాలింగన
మొనర్చుటకు
భారతీయులు
బాహువులు
చాపిరి.
హైందవ
పురుష
శేఖరులందు
అగ్రస్థానము
వహించిన
చివరివారిలో
గురు
గోవిందసింగు,
ఈ
భూమియందు
నిజమతోద్ధరణార్థము
తన
యొక్కయు,
తమ
ప్రియతమయొక్కయు
రక్తపాతమునకోర్చి,
యెవరికై
తానట్టి
ఘోరహింసల
పాలయ్యెనో
వారు
తమను
విడనాడినను,
తన
దేశీయులను
ఏమాత్రమూ
దూరక
దక్షిణాపథమునకేగి
హృదయము
వ్రీలిన
మృగరాజువలె
ప్రాణములు
విడిచెను.
ఆ
మహానుభావుల
కీర్తిశాశ్వతమై
నిలుచుగాక
అట్టి
మహనీయులు
మానవకోటికెంతయో
ఉపకారము
చేసిరి.
ప్రతి
మానవునియందు
ఒక
ప్రత్యేకత్వమెట్లుండునో
అట్లే
ప్రతిరీతియందును
కూడా
ఒక
ప్రత్యేకత్వముండును.
ప్రతివాడును
కొన్ని
కొన్ని
విషయములందు
ఇతరులందరికన్నా
భిన్నుడై
స్వకీయములగు
కొన్ని
విశిష్ట
లక్షణములు
కలిగి
ఎట్లుండునో,
అట్లే
ప్రతి
జాతియు
ఇతర
జాతులకు
లేనికొన్ని
విశిష్టలక్షణములు
కలిగియుండును.
ప్రకృతియొక్క
నిర్దిష్టక్రమములో
ప్రతివారు
నిర్వహింపవలసిన
ప్రత్యేకపాత్రయు
ఎట్లేర్పడి
ఉండునో
అతని
పూర్వకర్మ
మతనికై
యొక
ప్రత్యేక
మార్గమును
ఏర్పరచి
ఉండునో
అట్లే
జాతుల
విషయముకూడా.
ప్రతి
జాతియు
ఒక
విధి
నిర్దిష్టపాత్రమును
నిర్వహింప
వలసి
ఉండును.
6
▾
Meaning
Keep
ప్రతి
జాతియూ
లోకమునకు
ఒక
సందేశము
నీయవలసి
యుండును.
కావున
మనజాతి
సాధించవలసిన
కార్యమును
అది
నిర్వహింపవలసిన
విధి
నిర్దిష్ట
పాత్రమును
జాతి
సామరస్య
వాద్యమున
అది
పాడవలసిన
స్వరమును
మనము
ప్రప్రథమమునుండియు
గ్రహించి
ఉండుట
ముఖ్యము.
కొన్ని
సర్పముల
పడగలందు
మణులుండుననియు
ఆ
మణులుండు
నంతవరకు
ఆ
సర్పములను
ఏమి
చేసినను
చంపుట
సాధ్యము
కాదనియు
మీరు
చిన్ననాటి
కథలలో
విని
ఉందురు.
దీనిని
జ్ఞప్తి
పెట్టుకొనినచో
చరిత్ర
యందలి
అత్యద్భుత
సంఘటన
నొకదానిని
మనము
గ్రహింపగలము.
Previous
←
Monotheism
Next
Fundamental Belief
→