Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · Fundamental Belief
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
శతాబ్దముల
తరబడిగా
"అల్లావో
అక్బర్"
నినాదములు,
మింటిని
అంటినవి.
ఏక్షణము
తన్ను
మృత్యువెదుర్కానునో
భారతీయులైన
వారు
తప్ప
మరెవ్వరూ
ఎరుగరు.
ఇట్టి
ఘోరాపదల
పాలైనదియు
ఇట్టి
దాస్యమనుభవించునదియు
అగు
దేశము
ప్రపంచ
చరిత్రయందు
ఇంకేదియు
లేదు.
అయినను
మనము
ఇప్పటికినీ
ఇంచుమించు
పూర్వకాలపు
జాతిగనే
ఉన్నాము.
ఇంతేకాదు.
ఇటీవల
కానవచ్చు
కొన్ని
చిహ్నములను
పట్టి
మనము
బలిష్ఠులమై
ఉండుటేకాక
విస్తరిల్లుటకు
కూడా
సంసిద్ధులమై
ఉన్నామనియు
స్పష్టమగుచున్నది.
విస్తరిల్లుటే
కదా
జీవచిహ్నము.
నేడు
భారతీయ
సిద్ధాంతములు
భావములు,
భారతదేశపు
సరిహద్దుల
లోపలనే
అణగియుండుట
లేదు.
మనకు
ఇష్టమున్ననూ
లేకున్ననూ
అవి
దేశాంతరములలోనికి
చొచ్చి
పరిభ్రమించుచున్నవి.
ఇతరదేశ
వాఙ్మయములలోనికి
వాని
సారము
దిగబోవుచున్నది.
అందు
కొన్నిటిలో
వారికి
నిరంకుశాధికారపదవి
కూడా
చేపడుచున్నది.
ఇందుకు
కారణమేమనగా
ప్రపంచాభ్యుదయ
సమష్టికి
భారతదేశము
తన
వంతుగా
అర్పించిన
భాగము.
ఈ
దేశమున
గల
తత్త్వపారమార్థిక
జ్ఞానము
తక్కువ
దేశపు
సమర్పణము
లన్నిటికన్ననూ
మహోత్కృష్టము,
మహోజ్జ్వలము,
మహోదాత్తము
అయి
ఉండుటే
అని
విదితమగుచున్నది.
భారతీయుల
పూర్వులు
ఇతర
విషయములు
కూడా
పరీక్షించిరి.
ఇతర
జాతులవలెనే
వీరుకూడా
బాహ్యా
ప్రకృతియందు
గల
2
▾
Meaning
Keep
రహస్యములను
భేదించి
బహిరంగ
పరుపజూచిరి.
ఈ
అద్భుత
జాతియొక్క
మహత్తర
బుద్ధివైభవము
ప్రపంచ
మిప్పటికినీ
కలలోనైన
ఊహింపజాలనట్టి
విచిత్ర
ఫలములను
ఆ
మార్గమున
సాధించియుందును.
ఆ
నిర్వికారుని
మనకెరుక
పరచునదే
విద్యలన్నిటిలో
ఉత్తమమైనది
అని
వేదములలో
ఘంటాఘోషముగా
ప్రకటింపబడిన
విషయమందు
వారు
ప్రవేశించిరి.
ఎప్పుడునూ
మార్పుచెందుతూ
అదృశ్యమగుచుండు
ప్రకృతియొక్క
తత్త్వమును
తెలుపుశాస్త్రము
శ్రేష్ఠమైనదిగా
ఉండవచ్చును.
కాని
ఎవడు
మార్పుల
కతీతుడో,
ఎవడు
నిరతిశయానంద
స్వరూపుడో,
ఎవనియందు
మాత్రమే
శాంతి
సుస్థిరనివాసము
చేయుచుండునో,
ఎవనియందు
మాత్రమే
జీవము
అనంతమో
ఆ
పరాత్పరుని
తత్త్వమును
తెలుప
శాస్త్రము
సర్వాతిశయమగు
మహోత్కృష్ట
శాస్త్రమని
భారతీయ
పూర్వులబోధ.
ప్రకృతితత్త్వశాస్త్రరహస్యములు
మనకు
అన్నవస్త్రములను
మాత్రమే
సమకూర్పగలవు.
ఇతరుల
నోడించి
పరిపాలించుమార్గములు
నేర్పునవియు,
బలహీనుల
ననగద్రొక్కునవియు,
బలవంతులకు
బోధించు
నట్టివియు
అగు
భౌతికశాస్త్రరహస్యములను
వారు
కోరినచో
అవలీలగా
కన్గొని
యుండగలరు.
కానీ
భగవదనుగ్రహముచేత
భారతీయులు
వెంటనే
రెండవపక్షమును
గైకొని
అది
మన
జాతికి
విశిష్ట
లక్షణముకాదని
గ్రహించిరి.
ఇదియే
భారతీయుల
జాతికి
వన్నె
తెచ్చినది.
భారతీయులలో
గల
ఈ
విశేషము
ఇతరులు
స్పృశించుటకు
కూడా
అలవి
కానిది.
ప్రహ్లాదుని
వలె
అగ్నిజ్వాలల
నుండి
చెక్కుచెదరక
బయటకు
వెడలిరి.
పరమార్థదృష్టిలేని
భారతీయులను
భారతీయులుగా
పరిగణింపరైరి.
ఆనాటి
నిజ
భారతీయులు
ఇతర
దేశములందు
మానవుని
దృష్టిలో
మార్గదర్శకులు.
రాజకీయవిషయములకై
నిలిచి
ఒక
స్వల్పాంశము
ఆధ్యాత్మిక
భావముల
మీద
కరుగవచ్చును.
కానీ
భారతదేశమున
పారమార్థిక
జీవితమును
నడుపుటే
ప్రప్రథమ
కర్తవ్యము.
ఆ
పైన
ఇంకేమైన
అవకాశము
లభించినచో
తమకుగల
పారమార్థిక
శక్తులనన్నింటినీ
తాము
వేదికి
సేకరించుట
అత్యావశ్యకమని
3
▾
Meaning
Keep
గ్రహించిరి.
ప్రాచీనకాలమున
ఇదే
జరిగెను.
భారతీయ
పారమార్థికతత్త్వమున
జాతిసమైక్యమనగా
చెల్లాచెదురై
పడియుండు
పారమార్థిక
భావముల
నన్నింటిని
ప్రోగుచేయుట
అనియే
అర్థము.
భారతదేశమున
జాతి
అను
మాటకు
ఒకే
పారమార్థిక
రాగమునకు
తాళరూపమున
నొకటిగా
స్పందించు
హృదయములు
గలవారియొక్క
కూడిక
అనియే
అర్థము.
ఈ
మతమునకు
ఆధారభూతములగు
సూత్రములు
ఆకాశమువలే
విశాలములును
ప్రకృతి
వలె
శాశ్వతములుగా
అయినవి.
ఆ
సూత్రములకెంతో
సూక్ష్మరూప
వివరణము
కల్పింప
బడినను
సూత్రములలోగల
వైశాల్యము
వలన
మతశాఖలెన్నియో
వాని
ఆధారముపై
ఉత్పన్నమగుట
సహజమేకదా!
కావున
ఇచట
శాఖాసంప్రదాయ
బృందములుండియే
తీరవలెను.
దాని
శాఖాసంప్రదాయ
వైరములు
మాత్రము
ఉండనవసరము
లేదు.
శాఖావైరముచే
దేశమునకు
శ్రేయస్సు
చేకూరదు
గాని
శాఖాబృందములుండనిది
లోకము
పురోగమింపజాలదు.
లోకమున
గల
అనంతశక్తి
రాశినంతటిని
ఒక
స్వల్ప
మానవబృందము
పరిపాలింపజాలదు.
కార్యనిర్వహణము
సమర్థముగా
నుండుట
కొరకు
కార్యవిభజన
మొనర్చి
ఒక్కొక్క
భాగము
ఒక్కొక్కరికి
వశపరచుట
ఆవశ్యకమని
బోధించెను.
కావుననే
ఈ
శాఖావిభజన
మొనర్పబడెననియు
మనకిప్పుడు
స్పష్టమగుచున్నది
పారమార్థిక
శక్తుల
ప్రయోగము
కొరకు
శాఖలుండుగాక
కాని
మనము
కలహింప
నవసరమేమి?
ఈ
భిన్నత
అంతయూ
పైకి
కనిపించునదే.
కానీ
యథార్థము
కాదనియు
వాని
యన్నిటిలో
దూరి,
వాని
నొకటిగాగూర్చు
మనోహర
సామరస్య
సూత్రమొకటి
కలదనియు
శాస్త్రములు
ప్రకటించెను.
అదే
"ఏకంసత్
విప్రాః
బహుధావదన్తి"
(ఉన్నది
ఒక్కటే.
ప్రాజ్ఞులు
అనేకములుగా
వర్ణింతురు)
అని
మన
ప్రాచీన
గ్రంథములు
పలికెను.
కాన
మొదటి
నుండియూ
సర్వమతములచే
గౌరవింపబడిన
మతము
భారతీయుల
మతము.
శాఖావైరమున్నచో,
అవి
ఒకదాని
యెదనొకటి
అసూయాద్వేషములు
4
▾
Meaning
Keep
గలిగియున్నచో
ఆ
తండ్రుల
సంతతి
వారమని
చెప్పుకొనుట
మనకిది
అవమానకారణము.
మనము
ఏ
సంప్రదాయ
సిద్ధ
వేదాంత
మతావలంబులమైనను,
ఆధునిక
వేదాంత
మతావలంబులమైనను
అందరము
అంగీకరించు
మహోదారసూత్రములు
కొన్నికలవు.
హిందూనామము
ధరించు
వారందరును
ఆ
సూత్రములను
విశ్వసింతురు
గాక!
ప్రతివాడు
ఒకేభావమునకే
కట్టుబడి
ఉండవలెనను
నియమము
భారతీయులకు
లేదు.
ప్రతివానిని
మన
వ్యాఖ్యానమునే
అంగీకరింపుమని,
మన
పద్ధతులనే
అనుసరించి
జీవించమని
బలాత్కారపరచుట
మహాపాపమని
భారతీయ
పరమార్థము.
ఇందు
ప్రథమ
సూత్రము
వేదములు,
సనాతన
ధర్మమును
బోధించును.
ఈ
పవిత్ర
వాఙ్మయము
ప్రకృతితో
పాటు
అనాది
సిద్ధమై
ఆద్యంతరహితమై
వెలయుచున్నదనియు,
తత్సాన్నిధ్యమున
మత
విషయక
పరిశ్రమములు
అంతమొందితీరవలెననియు
మనము
విశ్వసించక
తప్పదు.
పరమార్థికభావ
భేద
విషయమున
తుది
పరిష్కారము
ఇందే
లభించుననియు
మనము
అందరము
అంగీకరించు
విషయము.
వేదములుగా
పరిగణింపవలసినది
వేనిని,
అను
విషయమున
మన
దృక్పథములు
భిన్నములై
ఉండవచ్చును.
నీవు
బోధించు
ఈశ్వరుడు
ఎట్టి
వాడైనను
కానిమ్ము.
అది
అప్రధానము.
ఆ
భేదభావములను
గూర్చి
మనకు
వివాదము
వలదు.
ఈశ్వరుని
బోధించితిరేని
అదియే
చాలును.
ఆ
భావములో
ఒకటి
మరొక
దానికంటే
మంచిదిగా
నుండవచ్చునుగాని
అందేదియునూ
చెడ్డదికాదని
యెరుగవలెను.
ఒకటి
యోగ్యము,
ఒకటి
యోగ్యతరము,
మరొకటి
యోగ్యతమము
కావచ్చును.
కాని
అయోగ్య
మనునది
భారతీయ
పరమార్థమునందు
లేదు.
కావున
మనకిష్టమగు
ఏ
రూపములోనైననూ
సరే
ఈశ్వర
రూపమును
బోధించువారందరిని
ఈశ్వరుడు
అనుగ్రహించుగాక,
ఈ
విషయము
ఎంత
అధికముగా
జరిగిన
మనకంత
శ్రేయస్కరము.
ఆ
భావము
ఈశ్వరభావమునకు
సంబంధించిన
భావమై
ఉండాలి.
దీనికి
శుష్కదరిద్రుడు,
ధనాధికారి
అను
భేదములేదు.
ఈ
భావమునుకూడ
5
▾
Meaning
Keep
భారతీయ
బిడ్డలకు
బోధించవలెను.
ఆ
బిడ్డలు
ఈ
భావమునందే
పెరగవలెను.
ఈ
జగత్తు
కొన్ని
వేల
సంవత్సరముల
క్రిందటనే
కల్పింపబడెననియు
ఎప్పుడో
ఒకనాడిది
శాశ్వతముగా
అంతరించుననియు
ఇతర
దేశీయులు,
జాతులు
విశ్వసించునట్లు
భారతీయులు
విశ్వసించరు.
జీవాత్మయును,
జగత్తును
శూన్యమునుండి
పుట్టింపబడెననియు
భారతీయులు
అంగీకరించరు.
ప్రకృతి
ఆద్యంత
రహితమైనది.
కానీ
నియమితకాల
పరిమాణ
విధేయమై
ఈ
బాహ్యప్రపంచపు
స్థూలపదార్థమే
తన
పూర్వపు
సూక్ష్మతరాకృతినంది
ఆ
స్థితియందు
కొంత
కాలము
నిలిచియుండి,
మరల
ప్రక్షిప్తమై
ప్రకృతి
అనంత
నానాత్మకముగా
గోచరింప
నారంభించును.
ఒక
శాఖవారు
ఒక
వేదభాగమును,
తక్కిన
వారికన్నా
పవిత్ర
తరముగా
నెన్నుకొనవచ్చును.
కాని
వేదవిధానమునకు
మన
మెల్లరమును
సమానాధికారముగల
సోదరులమనియు,
మనకు
నేడుగల
శ్రేయస్కరమును,
పావనమును,
పరిశుద్ధమును
అగునదంతయు
ఈ
అద్భుత
ప్రాచీనసనాతన
గ్రంథములలో
నుండియే
ప్రాప్తించినదనియు
పలుకునంతకాలము
ఈ
స్వల్ప
భేదములు
మనలనేమి
చేయగలవు?
కావున
వీటిని
మనము
విశ్వసించి
ఈ
సూత్రము
దేశములో
సర్వదిగంత
పరివ్యాప్తమగునట్లు
ప్రకటింపవలెను.
ఈ
జగత్తును
ఎవడు
సృష్టించెనో,
ఎవడు
కాపాడెనో,
ఎవని
లోనికిది
నియమితకాల
పరిణామానుసారముగా
లభించునో,
మరలా
కొంతకాలమునకు
ఈ
అద్భుత
జగద్రూపమున
గోచరించుచుండునో
ఆ
ఈశ్వరుని
తెల్పునది
వేదము.
ఈశ్వరుడు
ఎట్టివాడు
అను
విషయమున
మనకు
భావభేదములుండవచ్చు.
కేవలం
మానవ
లక్షణోపేతుడగు
ఈశ్వరుని
ఒకడు
నమ్మవచ్చును.
మరొకడు
మానవ
లక్షణ
రహితుడయ్యును.
మూర్తిమత్వముగల
ఈశ్వరుని
నమ్మవచ్చును.
ఇంకొకడు
కేవల
నిరాకారుడగు
ఈశ్వరుని
నమ్మవచ్చును.
వీరందరి
భావములకును
వేదములోనే
ప్రమాణము
లభింపవచ్చును.
ఇట్టి
భేద
భావములున్ననూ,
మనకెల్లరకును
ఈశ్వర
విశ్వాసమున్నది.
అనగా
ఒక
6
▾
Meaning
Keep
అత్యద్భుత
ఆద్యంతములు
లేని
శక్తి
కలదనియు
సర్వమూ
అందే
నిల్చియున్నదనియు
చివరకు
అన్నియు,
సర్వము
అందులోనే
మరల
చేరవలెననియూ
విశ్వసించనివాడు
భారతీయుడు
కాదు.
హిందూ
నామమునకర్హుడు
కాదు.
Previous
←
The Wonder of Wonders
Next
Experience Itself Is Religion
→