Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · Experience Itself Is Religion
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ఈ
తరంగ
రూపగమనము
అనాది
సిద్ధమై
శాశ్వతరూపమై
అనంత
కాలపర్యంతము
సాగుచుండుననియు
భారతీయుల
విశ్వాసము.
మానవుడు
కేవల
స్థూలశరీర
మాత్రుడు
కాదనియు,
ఈ
స్థూల
శరీరములో
మనస్సనే
సూక్ష్మశరీరము
ఒకటి
కలదనియు,
దాని
లోపల
అంతకన్నా
మహితమైన
వస్తువు
ఇంకొకటి
కలదనియు,
అది
స్థూల
సూక్ష్మశరీరముల
రెండింటికీ
అతీతమై
ఉండునది,
జీవాత్మ
అనునది
కూడా
కలదనియు,
దానికి
ఆద్యంతములు
లేవనియూ,
అది
మరణమనే
మాటనే
ఎరుగదనియూ
భారతీయ
పరమార్థము.
ఇంకొకటి.
జీవుడు
మోక్షమంది
ఇక
జన్మించవలసిన
అవసరము
లేని
స్థితికి
వచ్చువరకు
ఒక
శరీరము
పిదప
మరొక
శరీరమును
దాల్చుచుండునను
అసాధారణ
భావమొకటి
భారతీయులకు
గలదు.
ఈ
భావము
లోకమున
మరే
యితర
జాతులందూ
లేదు.
ఇది
భారతీయ
శాస్త్రములు
ప్రకటించు
సంసార
సిద్ధాంతము.
ఆత్మలయొక్క
నిత్యత్వమును
గూర్చిన
సిద్ధాంతము:
మనలోని
వివిధ
శాఖలవారు
ఏకగ్రీవముగా
అంగీకరించు
విషయములలో
ఇది
ఒకటి.
ఆత్మకును
ఈశ్వరునికిని
గల
సంబంధ
విషయములలో
మన
భావములు
భేదించవచ్చును.
ఒక
మతము
ప్రకారము
ఈశ్వరుడు,
ఆత్మ
సర్వదా
భిన్న
వస్తువులు.
మరొక
మతం
ప్రకారము
ఆ
అనంతవాహినిలో
ఇది
ఒక
కణము.
వేరొక
మతం
ప్రకారము
రెండునూ
అభిన్నములు.
కానీ
ఆత్మ
ఆద్యంతరహితము.
పుట్టుక
లేనిది
కనుక
మరణము
కూడా
లేదు.
అది
మానవ
శరీరమునందు
పరిపూర్తత
2
▾
Meaning
Keep
సాధించుకొనునంతవరకు
ఇతర
దేహములనేకములను
పరిణామ
క్రమమున
ధరించుచుందుననను
మూల
భావమునకు
హాని
లేనిచో
ఈ
అభిప్రాయము
అందరికీ
ఏకీ
భావము.
పారమార్థిక
క్షేత్రమందు
మానవబుద్ధికీ,
అందలి
సత్యము
అన్నిటిలోనూ
మహోత్కృష్టమును,
మహోద్భుతమును
అగుదానికిపుడు
వత్తుము.
ఇది
యేదనగా
మానవులు
శాక్తులైననూ,
శైవులయిననూ,
వైష్ణవులయిననూ,
బౌద్ధులయిననూ,
జైనులయిననూ,
హిందువులు
అందరునూ,
ఆత్మ
స్వతస్సిద్ధముగా
పరిశుద్ధమయిన
దనియు,
పరిపూర్ణమయినదనియూ,
ఆనందమయినదనియూ
నమ్ముదురు.
ద్వైతులు
ఆత్మయొక్క
నైసర్గికానందము,
పురాకృత
కర్మఫలముగా
సంకుచిత
మయ్యెననియూ,
ఈశ్వరానుగ్రహ
లబ్ధివలన
అది
మరల
వికసించు
ననియూ
తలంతురు.
అద్వైతులు,
ఈ
సంకోచ
భావమే
సరికాదనియూ
ఆత్మ
పరిపూర్ణ
తేజోవంతమై
ప్రకాశించు
చున్ననూ
మాయావరణ
కారణమువలన
శక్తి
కోల్పోయినట్లు
మనకు
తోచుచున్నదనియూ
తలంతురు.
ఈ
భావభేద
మెట్లున్ననూ,
మనకందరకునూ
ఏకీభావము
గల
కేంద్ర
సత్యము
వద్ద
నిలచి
చూచినచో
తూర్పు
పశ్చిమ
భావముల
నడుమ
అపారమును
అగాధమును
అగు
సందు
కనిపించును.
ప్రాగ్దేశీయులు
మహితమును,
శ్రేయస్కరమును
అగు
దాని
కొరకై
అంతరంగలోకమున
అన్వేషింతురు.
ఆరాధన
కాలమందు
మనము
కన్నులు
మూసుకొని
ఈశ్వరుని
మన
లోపల
కనుగొన
యత్నింతుము.
పాశ్చాత్యులు
ఊర్ధ్వముఖులై
ఈశ్వరుని
తమ
వెలుపల
కనుగొన
యత్నింతురు.
పాశ్చాత్యులకు
తమ
మత
గ్రంథములు
ఈశ్వర
ప్రేరితముచే
వ్రాయబడినవని
నమ్మకము.
భారతీయులు
వేదములు
ఈశ్వరుని
నుండియే
ఉచ్ఛ్వాస
రూపమున
వెలువడి
మంత్ర
ద్రష్టలగు
మహర్షుల
హృదయముల
ద్వారా
వచ్చినవని
నమ్ముదురు.
మనము
అవగత
పరచుకోవలసిన
విషయము
మరొకటి
కలదు.
ఈ
విషయమును
గూర్చి
మనమెప్పటికినీ
పట్టుపట్టియే
ఉండవలెను.
అది
ఏదన?
తాను
తుచ్ఛుడని,
రాత్రింబగలు
తలంచుచుండువాడు
దేనిని
గానీ
తన
3
▾
Meaning
Keep
జీవితములో
సాధించలేదు,
సాధించజాలడు.
తాను
అధముడనియు,
అల్పజ్ఞాని
అనియు
తలంచు
వాడు
అధముడు.
అల్పజ్ఞానిగనే
అగుట
తథ్యము.
మనము
ఎట్లు
తలంచిన
అట్లు
అగుదుము.
మనము
ఆ
శక్తిసంపన్నుడైన
పరమాత్మ
బిడ్డలము.
ఆ
అమృత
పుత్రులమని
తలంచాలి.
నిజముగా
అమృత
పుత్రులైన
మనము
అల్పజ్ఞులమెట్ల
గుదుము?
తుచ్ఛుల
మెట్లగుదుము?
ఇట్టి
ఉన్నత
స్థితిలో
మనము
తలంచుట
మానవ
సహజత్వమని
భారతీయ
పరమార్థము
ప్రబోధించినది.
పూర్వపు
భారతీయులు
ఇట్టి
విశ్వాసమునే
కలిగి
యుండెడివారు.
ఈ
విశ్వాసముతోనే
సర్వకార్యములయందు
దిగ్విజయము
సాధించిరి.
ఉన్నత
స్థాయిని
చెందిరి.
పురోభివృద్ధి
గాంచిరి.
ఆత్మ
విశ్వాసమును
కోల్పోవుట
చేతనే
ఈనాడు
మనమింతటి
క్షీణదశకు
దిగజారితిమి.
అదే
మన
పతనమునకు
ప్రారంభము.
ఆత్మవిశ్వాసము
కోల్పోవుట
అనగా
దైవమునందు
విశ్వాసము
కోల్పోవుటే.
ఆ
సర్వవ్యాపి,
ఆ
సర్వాంతర్యామి,
ప్రతి
అణువునందును
పడుగు
పేకవలె
నిలచి,
నామము
కాయములందు
నిలచియున్నాడను
నమ్మకమును
బలపరచి
మానవత్వమును
పవిత్రము
గావించునదే
భారతీయ
పరమార్థము.
భారతీయ
పుత్రులారా!
ఈ
జీవ
సంరక్షణమును,
మహితమునూ,
ఔదార్య
ప్రదమునూ
అగు
సత్యమును
మీ
బిడ్డలకు
పుట్టినప్పటి
నుండియూ
నేర్పుడు.
ఆత్మ
పరిపూర్ణమయినది
అను
ఈ
అద్భుత
సిద్ధాంతమే
భారతీయులు
కనుగొన్న
పవిత్ర
దర్శనము.
అది
స్వతస్సిద్ధముగా
పరిపూర్ణమై
యుండనిచో
పిదప
దీనికి
పరిపూర్ణత
సిద్ధించుట
అసంభవము.
నడుమంత్రమున
లభించిన
పరిపూర్ణత
నడుమంత్రముననే
భ్రంశమొందును.
మానవునికి
అపరిశుద్ధతయే
స్వాభావిక
మయ్యెనేని
ఐదు
నిమిషముల
పాటు
పరిశుద్ధత
లభించిననూ
అతడు
అపరిశుద్ధుడుగనే
నుండవలయును.
ఈ
నడుమంత్ర
పరిశుద్ధత
కొట్టుకొనిపోవును.
కావున
భారతీయ
తత్త్వజ్ఞులు
అందరునూ
పరిశుద్ధత
మనకు
స్వాభావ
సిద్ధము,
పరిపూర్ణత
మనకు
స్వభావ
సిద్ధము;
అపరిశుద్ధము
అపరిపూర్ణత
కాదు
అని
బోధించిరి.
ఈ
బోధనను
బలపరచి,
ప్రపంచమునకు
4
▾
Meaning
Keep
చాటినదే
భారతీయ
పరమార్థవాహిని.
తాను
చేసిన
మహాకార్యమును,
తాను
భావించిన
మహాభావమును
జ్ఞప్తికి
తెచ్చుకొమ్మని
తన
మనస్సును
అవసాన
కాలమున
ఆదేశించిన,
మహర్షులు
చూపిన
మార్గమును
జ్ఞప్తికి
తెచ్చుకొనుట,
తన
దోషములను,
తన
అవివేకమును
జ్ఞప్తికి
తెచ్చుకొమ్మని
కాదు.
అవివేక
కార్యములు,
దోషములు
ప్రతి
మానవునియందునూ
ఉండును.
కానీ
సర్వదా
నీ
యథార్థత్వమును
జ్ఞప్తి
యందుంచుకొనుట
ప్రధాన
మననము.
అదే
నీ
పురోభివృద్ధికి
సోపానము.
అన్నింటికన్నా
మనము
ముఖ్యముగా
గమనింపవలసినది
మరొకటున్నది.
భారతదేశములోని
మనకు
మతమనగా
అనుభూతిగానీ
అందుకు
కొరవడిన
దేదియునూకాదు.
ఈ
ముఖ్యవిషయమును
ఎన్నియో
సార్లు
మరచుట
మిక్కిలి
శోచనీయము.
ఈ
సూత్రమును
ప్రతి
ఒక్కరూ
నమ్మవలెను.
అపుడే
మీరు
సురక్షితముగా
నుండగలరు.
అంతేకాదు
స్వయం
కృషివలననే
అన్నియూ
సిద్ధించునను
సంకల్పము
భారతీయులది
కాదు.
అన్నింటికీ
భగవత్కృప
యొకటి
ఆధారముగా
నున్నదను
నమ్మకము
భారతీయులది.
మత
భావములను
అనుభూతము
చేసుకొనవలెను.
వినినంత
మాత్రమున
ఉపయోగము
ఉండదు.
ఏదో
ఒక
సిద్ధాంతమును
చిలుకలవలె
పలుకుట
నేర్చుకొనిన
చాలదు.
మనబుద్ధికి
అది
సమ్మతముగా
నుండిన
చాలదు.
అది
మనలో
చేరిపోవలెను.
కావుననే
ఈశ్వరుడు
కలడనుటకు
భారతీయులకుగల
మహోత్కృష్ట
నిదర్శనము;
అది
యుక్తి
సమ్మతంగా
ఉండుటకాదు.
పూర్వపుకాలము
వారునూ,
ఇప్పటి
కాలము
వారునూ
అతనిని
దర్శించిరనుట,
భారతీయులు
ఆత్మకలదని
నమ్ముట,
దాని
ఉనికికి
ప్రబల
నిదర్శనములుండుటచేత
మాత్రమేకాదు.
అందుకు
ముఖ్యము
భారత
దేశములో
అనేకులు
తమ
ఆత్మను,
అనుభూత
మొనర్చుకొన్నవారుండుటే.
అట్టివారు
పూర్వకాలమున
వేనవేలు
ఉండిరి.
ఇపుడునూ
అట్టివారు
లేకపోలేదు.
భవిష్యత్తున
కూడనూ
లేకపోరు.
ఈశ్వర
సాక్షాత్తును
బడసిన
గానీ
ఆత్మానుభూతి
నందినగానీ
మానవుడు
పూర్ణుడు
కాజాలడు.
5
▾
Meaning
Keep
మానవుడు
మొదట
సత్యమును
గ్రహించవలెను.
దానిని
మనమెంత
చక్కగా
గ్రహింతుమో
అంతగా
మన
మత
కలహములునూ
శాఖా
భేదములునూ
తరిగిపోవును.
ఏలయన
ఆస్తికధర్మపరుడను
పేరు
ఈశ్వరానుభూతి
నంది
ఈశ్వర
సాక్షాత్కార
సిద్ధిబడసిన
వారికి
మాత్రమే
చెల్లును.
ఆ
పరాత్పరుని
సమీప
వస్తువులన్నింటిలో
ఆ
పురుషుని
దర్శించిన
వారికే
హృదయ
గ్రంథులు
విచ్ఛిన్నముకాగలవు.
ఒట్టి
వదరుబోతు
మాటలునూ
మత
సత్యములుగావు,
అనుభూతికి
మాత్రమే
ఆస్తికధర్మనామము
చెల్లునని
మనము
ఎప్పుడు
గ్రహింతుమో
అప్పుడే
మన
హృదయ
పరిశోధన
మొనర్చుకొని
మత
సత్యానుభూతి
దెస
మన
మెంత
దూరము
సాగినది
కనుగొనగలుగుదుము.
మనము
చీకటిలో
చిక్కి
కన్నులు
గానక
తడువులాడుచున్నామనియు,
ఆ
చీకటిలోనికి
ఇతరులను
కూడా
తీసుకొని
వచ్చి
వారు
కూడా
తడువులాడునట్టు
ఒనర్చుచున్నామనియు
మనమప్పుడు
గ్రహింతుము.
అప్పటికిగానీ
మత
భేదములు
పెట్టుకొనుటయూ,
కలహించుటయూ,
యుద్ధము
లొనర్చుటయూ
మనము
మానుకొనము.
మీరు
మతకలహ
ప్రారంభము
చేయు
వారిని
ఈ
విధముగా
ప్రశ్నించుడు.
నీవు
భగవంతుని
చూచితివా?
ఆత్మను
దర్శించితివా?
లేనిచో
ఈశ్వర
నామమును
బోధింప
నీ
కెట్టి
అధికారమున్నది?
చీకటిలో
చిక్కి
తడువులాడు
నీవు
నన్ను
కూడా
అదే
చీకటిలోనికి
లాగజూచుచున్నావా?
గుడ్డివాడు
మరొక
గుడ్డి
వానికి
దారి
చూపగలడా?
అనుభవము
కాని
మొదట
నీ
సత్యాన్ని
నీవు
కనుగొమ్మని
చెప్పవచ్చును.
Previous
←
Fundamental Belief
Next
Be Yourself
→