Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · Be Yourself
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
అట్లు
అందరి
యందలి
ఆత్మతత్త్వమును
దర్శించిన
వాడు
అన్య
మతములను
దూషించడు.
మత
కలహములలో
కాలు
పెట్టడు.
పరమతములను
పరిహసించడు.
పరుల
విశ్వాసములకు
అడ్డు
తగలడు.
అనుభూతి
లేని
అమాయకులే,
అజ్ఞానులే,
ఇతరుల
విశ్వాసములను
కాదని
ఖండించటం,
మత
కలహములు
ప్రోత్సాహపరచటం,
వారివారి
ఆరాధనా
పద్ధతులను
పరిహసించటం,
మూఢ
నమ్మకాలని
మూల్గటం,
ఇత్యాది
దుర్బుద్ధులు,
మానవ
మాత్రులకు
తగనివి.
ఎవరి
విశ్వాసములు
వారికి
ఆనందమును
అందించును.
"ఏకం
సత్
విప్రాః
బహుధా
వదన్తి"
ఒకే
పదార్థమును
ఒక్కొక్కరు
ఒక్కొక్క
విధముగ
దర్శింతురు,
వర్ణింతురు.
దీనిని
కాదన
గలవారు
ఎవ్వరూ
లేరు,
ఎవ్వరికీ
అధికారములేదు.
సమత్వమును
పొందగోరువారే
పరహింసకు
ప్రాకులాడకుండు
వారు.
పరులను
బాధించు
వారికి
హిందూశబ్దము
సార్థకము
కాదు.
ప్రేమతో
హృదయముల
కత్తుకుని
ఆలింగనము
గావించుకొను
ఆత్మతత్త్వమును
ఏకత్వముగా
భావించుటే
భారతీయుల
పరమార్థము.
ఇట్టి
సమత్వము
గలవారు
ఏ
భాషను
ఉచ్చరించిననూ,
ఆత్మవిశ్వాసము
అతని
చిహ్నము,
ఇదే
భారతీయుని
ముఖ్యగుర్తు.
అట్టి
వారందరునూ
భారతీయుల
సన్నిహితులే.
మానవుడు
కేవల
భౌతిక
పదార్థ
రాశి
అని
చాటుచు
తమ
ఉన్నతి
కంతయు
అనాత్మ
వాదమునే
ఆధారము
చేసుకొని
యుండిన
2
▾
Meaning
Keep
జాతులనేకములు.
పాశ్చాత్యభాషలో,
మానవుడు
విడనాడునది
తన
జీవుని,
భారతీయ
భాషలో
మానవుడు
విడనాడునది
శరీరమును,
పాశ్చాత్యుడు
తానొక
శరీరమనియు
తనకొక
ఆత్మ
యున్నదనియు
తలచును.
భారతీయుల
భావము
అట్టిదికాదు.
తాను
ఆత్మ
స్వరూపుడనియు,
తనకొక
శరీరమున్నదనియూ
భావించును.
పై
రెండింటికి
అపార
భేదము
కలదు.
కాన
భౌతిక
సుఖము
మున్నగు
ఇసుక
పునాదులపై
నిర్మింపబడిన
నాగరికతలన్నియు
కొలది
కాలము
మాత్రమే
నిలచి
ప్రపంచమునుండే
అదృశ్యమగును.
అయితే
భారతదేశము
యొక్కయు
భారతీయులను
అనుసరించు
దేశములయొక్కయు
నాగరికతలు
నేటికినీ
సజీవములై
ఉండుటేకాక
నూతనోజ్జీవన
లక్షణములు
కూడను
కనిపించుచున్నవి.
ఇతరులను
అనుకరించ
ప్రవర్తింప
చూడకుడు.
భారతీయులు
జ్ఞప్తియందు
ఉంచుకోదగిన
ముఖ్యవిషయమిది.
అనుకరణము
నాగరికత
కానేరదు.
అది
పిరికితనమునకు
చిహ్నము.
పురోగమన
సాధకముకాదు.
నిజమునకు
అది
మానవుని
అధోగతికి
గొనిపోవు
రాజబాట.
మానవుడు
తన్ను
తాను
ద్వేషించుకొన
నారంభించెనేని
వాడిక
కోలుకొనుట
కల్ల.
మానవుడు
భారతీయుడు.
తమ
పూర్వీకులూ,
తమ
గుణములను,
తమ
పెద్దలను
స్మరించుటలో,
చింతించుటలో
లజ్జింపకూడదు.
తమజాతియని
పెద్దలను,
పూర్వీకులను,
గురువులను
తలంచి
గర్వించవలెను.
ఇట్టి
వారిని
నేను
కలిగియున్నాననియు,
ఇట్టి
పవిత్రజాతి
నాదనియు,
ఇట్టి
విశిష్ట
గుణములుకల
దేశము
నాదేశమనీ
తలంచి
గర్వించవలెను.
తన
దేశములో
జ్ఞానసిద్ధులు,
మహానీయులు
జన్మించిరనియూ
అట్టి
మహానీయులు
జన్మించిన
దేశములో,
భూమిలో,
జాతిలో
తాను
జన్మించితినని
గర్వించగల
భారతీయుడుగా
తయారుకావాలి.
భారత
యువకులారా!
స్వప్రయత్నముతో
మీలోనున్న
సత్త్వమును
బయటికి
కొనిరండు.
ఇతరుల
ననుసరింపవలదు.
కానీ
వారిలో
గల
గుణములను
గ్రహింపుడు.
3
▾
Meaning
Keep
మనము
భూమిలో
విత్తనము
నుంతుము.
దానికి
కావలసిన
మట్టిని,
గాలిని,
నీటిని,
దానికి
సమకూర్తుము.
ఆ
విత్తనము
మొక్క
అయి
పిదప
మహోవృక్షమై
అభివృద్ధి
గాంచినపుడు
అది
మట్టిగా
గానీ,
గాలిగా
గానీ,
నీరుగా
గానీ
అగునా?
తమకు
సమకూర్చబడిన
దానినంతయు
గ్రహించి
అది
తన
స్వధర్మానుసారమగు
గొప్ప
వృక్షముగా
అగును.
మీరునూ
అట్లనే
ప్రవర్తింతురుగాక!
మనము
ఇతరుల
వద్దనుండీ
నేర్చుకోవలసిన
దెంతయో
కలదు.
దీనిని
సందేహింప
నక్కరలేదు.
అటు
నేర్చుకొనక
నిరాకరించువాడు
పరమ
మూర్ఖుడు.
శ్రేయస్కరమగు
దానినంతయు
ఇతరుల
యొద్ద
నభ్యసింపుడు.
మీ
స్వధర్మాను
సారము
దానిని
మీలో
నిముడ్చుకొనుడు.
మీరు
మీరుగానే
జీవించాలి.
ఇతరులుగా
మారరాదు.
మీ
స్వభావము
నుండి
మిమ్మెవ్వరునూ
తొలగదీయకుండునట్లు
చూచుకొనవలెను.
అనగా
మీదైవములో,
మీభావములో,
మీపరమానందములో,
మీ
ఆధ్యాత్మిక
మధురములో
మీరు
మునగండి.
దానినుండి
తప్పించుటకు
ఎవరెన్ని
పన్నాగములు
పన్నినను,
మీరు
ప్రాణమును
వీడుటకైననూ
సంసిద్ధులుకండి.
కానీ
ఆ
దివ్యానుభూతిని,
ఆ
దివ్యానందమును
విడచుటకు
ప్రయత్నించకండి
అని
భారతీయ
పరమార్థము
నొక్కి
బోధించుచున్నది.
అట్టి
మహాప్రవాహ
పురోగమనమునకు
అడ్డు
పడుచున్న
కట్టలను
తీసివేయుటకు
పూనుకొనుడు,
తీసివేయుడు.
దాని
మార్గమును
పరిశుభ్ర
పరచుడు.
అప్పుడది
స్వశక్తి
చేతనే
ముందుకు
ప్రవహించును.
భారతదేశమునందు
పారమార్థిక
సాధనము;
ఈ
మార్గమున
సాగింప
వలెననియే
సాయి
సంకల్పము.
ఎంతో
కాలమునుండియూ
ఈ
భారతదేశమున
ఆస్తిక
ధర్మము
స్థితిశీలమైయున్నది.
దాని
నిప్పుడు
గతి
శీలము
చేయవలెను.
అది
ప్రతి
మానవుని
జీవితములో
ప్రవేశించునట్లు
జరుగవలెను.
గొప్పగొప్ప
రాజభవనములు
మొదలు
నిరుపేదల
గుడిసెలలో
కూడనూ
ఈ
ఆస్తిక
ధర్మము
4
▾
Meaning
Keep
ప్రవేశింపవలెను.
ఆస్తిక
ధర్మమను
సంపద
సర్వజనులకును
సమానాధికారముతో
సంక్రమించునది.
అది
ప్రతి
మానవునకు
జన్మహక్కు,
కావున
భారతీయులు
దానిని
ప్రతి
గడపకు
పోయి,
ప్రతి
గృహమునందును
ప్రవేశపెట్టవలెను.
ఈశ్వర
సృష్టిలోని
గాలి
అందరికీ
యెట్లు
అందుబాటులో
నుండునో
ఆస్తిక
ధర్మము
కూడనూ
అందరికీ
అట్లు
అందుబాటులో
నుండవలెను.
ఇట్టి
విశాల
భావమును
భారతీయులు
కలిగియుండిన,
దానిలో
ఏకీభావమును
పెంపొందించుకొనిన
మనలోని
అభిప్రాయ
భేదములు
తమంతట
తామే
సర్దుకొని
పోవును.
శతాబ్దముల
తరుబడి
చీకటిగా
నున్న
గృహమును
ప్రవేశించి
ఆ
చీకటిని
యెంత
ప్రార్థించినను,
లేక
యెంత
దూషించిననూ,
లేక
దానితో
పోరాటము
సలుపుటకు
సంసిద్ధుడయిననూ
ఆ
చీకటిపోదు.
నీకు
చేరువుగా
దీపము
ఒకదానిని
వెలిగించిన
వెంటనే
ఆ
చీకటి
మటుమాయమగును.
మానవులను
సంస్కరించి
బాగుచేయకోరువారు
మొదట
ఈ
సత్యమును
గుర్తించవలెను.
గుర్తించిన
దానిని
ఆచరించుటకు
ప్రయత్నించవలెను.
మానవునియందు
మహానీయత
కలదని
నమ్ముటే
భారతీయ
పరమార్థము.
మానవుడు
పతితుడనియు,
పాపి
అనియూ
ఎందుకు
ఊహింతురో
అర్థమగుటలేదు.
రాక్షసతుల్యునిగా
తోచిన
మానవునియందు
కూడా
ఆత్మ
విశ్వాసమును
ప్రధానముగా
సమముగా
భావించవలెను.
అతనిలో
పొరపాట్లు
పొడచినచో
ప్రవర్తన
లోపముగా
భావించవచ్చునే
కానీ
ఆత్మ
విశ్వాసము
కోల్పోరాదు.
పొరపాట్లు
సహవాసదోషములుగా
భావించవలెను.
అవి
అతని
సహజ
గుణములు
కావు.
అట్టితరి
అతనిని
మంచి
సహవాసములో
ప్రవేశించునట్లు
తగిన
రీతిగా
ప్రయత్నించవచ్చునే
కానీ
అతనిని
నిరసించరాదు.
వేరుచేయరాదు.
శరీరము
అణువులతో
నిర్మింపబడినది.
ఆ
అణువులు
భౌతిక
పదార్థమనబడు
వానికి
సంబంధించినవి.
ఈ
భౌతిక
పదార్థములు
మూఢమును,
జడమును.
వేదాంతుల
సూక్ష్మశరీరము
అనునది
కూడా
ఇట్టిదే.
5
▾
Meaning
Keep
ఈ
సూక్ష్మశరీరముకూడా
భౌతికమే
కాని,
వేరుకాదు.
సూక్ష్మశక్తులకు
అది
నిలయము.
అనగా
సూక్ష్మశరీరము
సూక్ష్మశక్తులుండు
చోటు;
స్థూల
శరీరమెట్లు
స్థూల
శక్తులకు
ఆశ్రయమో
అట్లే
సూక్ష్మ
శరీరము
సూక్ష్మ
శక్తులకు
మనో
వ్యాపారమనబడు
దాని
వివిధ
రూపములకు
ఆశ్రయము.
మొదట
శరీరము
కలదు.
అందు
స్థూల
భౌతిక
పదార్థములును,
స్థూల
శక్తియును
కలవు.
శక్తి
భౌతిక
పదార్థముల
ఆధారము
లేనిదే
ఉండజాలదు.
దాని
ఉనికికి
కొంతభౌతిక
పదార్థము
ఉండియే
తీరవలెను.
ఆ
శక్తులే
సూక్ష్మ
తరములగును
ఏ
శక్తి
స్థూలరూపమున
ప్రవర్తించుచున్నదో
ఆ
శక్తియే
సూక్ష్మరూపవృత్తినంది
చింతనగా
మారును.
ఆ
రెండింటికినీ
భేదమే
లేదు.
ఒకే
వస్తువుయొక్క
స్థూలరూప
మొకటి
సూక్ష్మరూప
మొకటి.
అట్లే
స్థూల
సూక్ష్మ
శరీరములకు
కూడా
భేదము
లేదు.
సూక్ష్మశరీరము
కూడా
భౌతికమే,
కానీ
అందలి
పదార్థము
సూక్ష్మతరమైనది.
ఈ
శక్తులన్నింటికి
మూలమును
వెతికిన
ప్రకృతిలో
రెండు
పదార్థములు
కలవు.
ఇందు
ఒకదానికి
ఆకాశమనియు,
రెండవ
దానికి
ప్రాణమనియు
పేర్లు.
ఇదియే
శక్తి.
నీవు
చూచునదంతయూ,
వినునదంతయూ,
ఈ
భూమి
మున్నగునవంతయూ
భౌతికము.
అదంతయూ
ఆకాశ
జనితమే.
ప్రాణసంయోగ
ప్రభావముచే
ఆకాశ
పదార్థము
క్రమాదిగ
సూక్ష్మముగనో,
స్థూలముగనో
అగుచుండును.
ఆకాశమువలే
ప్రాణము
కూడా
సర్వవ్యాపకము,
సర్వాంతర్గతము.
ఆకాశమును
జలరాసితో
పోల్చ
వచ్చును.
ఆ
నీటివలన
పుట్టి
ఆ
నీటిలో
తేలియాడుచుండు
మంచుగడ్డలతో
లోకము
నందుగల
తదితరమునంతయూ
పోల్చవచ్చును.
ఈ
ఆకాశము
వివిధ
రూపములనుండచేసే
శక్తియే
ప్రాణము.
ప్రాణము
స్థూలరూపములతో
కూర్చొనుట,
మాటాడుట
మొదలగు
రూపములలో
అభివ్యక్తమగును.
సాధనప్రాయమైనది
స్థూలశరీరము.
అది
ఆకాశ
పదార్థకల్పితము,
సూక్ష్మశరీరము
కూడా
ఆకాశకల్పిత
పదార్థమే.
కానీ
అది
6
▾
Meaning
Keep
అతిసూక్ష్మ
రూపమగు
ఆకాశ
పదార్థము.
అందు
ప్రాణము
యొక్క
అత్యంత
సూక్ష్మరూపమగు
చింతనా
వ్యాపారము
కలదు.
అదియూత దాటిన
తరువాత
మానవుని
యదార్ధ
తత్త్వమగు
జీవుడు
కలదు.
మనము
ఎన్నియో
తడవుల
తీసివేస్తుండిననూ
మనగోళ్ళు
యెట్లు
మన
శరీరముతో
అభిన్నములై
తద్యాగములై
ఉండునో
అటులనే
స్థూలశరీరము
కూడా
సూక్ష్మశరీరమునకు
సంబంధించి
ఉండును.
Previous
←
Experience Itself Is Religion
Next
Bondage
→