Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · Bondage
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
నేను
నా
గోళ్లను
ఎన్నిసార్లైననూ
ఎట్లు
ఖండించి
వేయగలనో
అట్లే
నా
స్థూల
శరీరమును
లక్షలాదిసార్లు
విడనాడగలను.
కానీ
నా
సూక్ష్మ
శరీరము
నిలిచియే
ఉండును.
ఇది
మన
భారతీయ
పరమార్థ
వాహిని
తెలుపు
పరమ
రహస్యము.
ఇంకనూ
విచారించిన
మానవుడనగా,
ఒక
స్థూల
శరీరము,
ఒక
సూక్ష్మ
శరీరమును,
ఒక
జీవుడును
కూడియుండు
ఒక
ప్రాణి.
వేదాంత
తత్త్వశాస్త్ర
ప్రకారము
జీవుడు
ఈశ్వరునివలే
నిత్యుడు.
ప్రకృతి
కూడా
నిత్యమే
కాని
మార్పులొందుచు
నిలచియుండును.
ప్రకృతి
మూలమగు
ప్రాణాకాశ
పదార్థము
నిత్యమైనదే,
కానీ
అది
సర్వదా
వివిధ
రూపములుగా
మారుచుండును.
జీవాత్మ
మాత్రము
ఆకాశములో
కానీ
ప్రాణములో
కానీ
నిర్మింపబడినదికాదు.
అది
భౌతిక
వస్తువే
కాదు.
కావున
అది
శాశ్వతము.
అది
ప్రాణాకాశసంయోగము
వలన
కలిగినది
కాదు.
అసంయుక్త
పదార్థమునకు
నాశము
ఉండజాలదు.
ఏలనన
నాశము
అనగా
మూల
వస్తువులుగా
చీలిపోవుటే.
స్థూలశరీరము
ప్రాణాకాశ
సంయోగము
కావున
దానికి
వియోగము
తప్పదు.
అట్లే
సూక్ష్మశరీరము
కూడా
వియోగము
నందును
కానీ
అది
దీర్ఘ
కాలాంతరము.
జీవుడు
అసంయుక్త
వస్తువు
కనుక
దానికి
నాశము,
అనగా
వియోగము
ఉండదు.
అటులనే
దానికి
పుట్టుక
కూడనూ
ఉండదు.
ఉండనేరదు.
అసంయుక్త
వస్తువు
పుట్టుటే
అసంభవము.
లక్షోపలక్షలుగా
కూడియుండు
ప్రకృతి
అంతయు
ఈశ్వరేచ్ఛాధీనమై
ఉండును.
ఈశ్వరుడు
సర్వజ్ఞుడు,
సర్వగతుడునునై
రాత్రి
పగలు
ప్రకృతి
ద్వారా
పనిచేయుచున్నాడు.
2
▾
Meaning
Keep
ప్రకృతి
అంతయూ
అతని
పరిపాలనలోనే
ఉన్నది.
అతని
ప్రభుత్వము
ఆద్యంత
రహితము.
ఇదే
ద్వైతులసిద్ధాంతము.
ఈ
సిద్ధాంతమున
ఒక
ప్రశ్నకు
అవకాశము
కలదు.
ఈ
లోకములో
ఈశ్వరుడే
పరిపాలకుడైనచో
అతడిట్టి
దుష్ట
ప్రపంచమును
ఏల
సృష్టించెను?
ఈ
దుఃఖములకు,
వ్యథలకు
ఈశ్వరుడు
బాధ్యుడుకాదని
వారు
సమాధానము
చెప్పుదురు.
మన
వ్యథలకు
మనము
ఆచరించు
పాపములే
కారణమనియు,
సుఖదుఃఖములకు
తాను
చేయు
మంచి
చెడ్డకర్మలే
కారణమని
చెప్పుదురు.
ఈశ్వరుడు
సాక్షీభూతుడు.
తాను
బాధించుటకానీ,
శిక్షించుటకానీ
చేయడు.
జీవుడు
అనాది
సిద్ధుడు,
అజుడు.
అనగా
పుట్టుక
లేనివాడు.
కాలమంతయూ
అతడు
సర్వవిధ
కర్మము
లొనర్చుచున్నాడు.
కర్మఫలమునంతయూ
అనుభవించుట
మన
మనస్సుయొక్క
అనుభూతి.
అది
ప్రకృతియొక్క
నియమము,
అది
కర్మయొక్క
ప్రతిబింబము,
ప్రతిశబ్దము;
మంచిది
చేసిన
మంచిది,
చెడ్డ
చేసిన
చెడ్డను
అనుభవించుట
మనో
ఇంద్రియముల
కర్తవ్యము.
జీవునకు
రెండింటితోనూ
సంబంధము
లేక
సాక్షీభూతుడై
యుండును.
జీవుడు
స్వతఃసిద్ధముగా
పరిశుద్ధమని
వేదాంత
తత్త్వము,
భారతీయ
పరమార్థము
అంగీకరించింది.
అయితే
దాని
యథార్థతత్త్వము
అవిద్యచే
కప్పబడి
యుండినందున,
అనగా
మాయ
ఆవరించి
యుండినందున
దుష్కర్మ
ఫలముగా
దానికి
అవిద్యాచ్ఛాయ
యెట్లు
లభించునో
అటులనే
సత్కర్మఫలముగా
స్వతత్త్వజ్ఞానము
మరల
లభించును.
అది
నిత్యమైనట్లే
నైసర్గికముగా
పరిశుద్ధము
కూడా.
సర్వప్రాణులు,
సర్వజీవులూ
పరిశుద్ధములే.
సత్కర్మవలన,
దాని
ఫలము
వలన
జీవాత్మయొక్క
సమస్త
పాపములను,
దుష్కర్మలను,
కడిగివేయును.
పిదప
అది
మరల
పరిశుద్ధమగును.
అట్లయిన
పిదప
దేవయానమను
చోటికి
పోవును.
దాని
వాగింద్రియము
మనస్సులో
ప్రవేశించును.
మాటలు
లేనిది
మనము
ఆలోచింపజాలము.
ఆలోచనలు
కల
చోటల్లా
మాటలుండితీరును.
వాక్కు
మనస్సులో
ప్రవేశించినట్లే
మనస్సు
ప్రాణములో,
ప్రాణము
జీవాత్మలో
లీనమగును.
అంత
జీవాత్మ
సత్వరగతితో
3
▾
Meaning
Keep
శరీరమును
విడనాడి
సూర్యలోకమునకు
నిష్క్రమించును.
కడకు
బ్రహ్మలోకమునకు
చేరును.
అచటచేరిన
జీవాత్మకిక
ప్రకృతితో
పనిలేదు.
అచట
అనంతకాలము
అది
జీవించును.
ఆద్యంత
సుఖము
ననుభవించును.
అది
సృజనాశక్తి
ఒక్కటి
తప్ప
సర్వశక్తులు
కూడియుండును.
జగత్
పరిపాలక
పదవి
ఈశ్వరునకు
తప్ప
మరెవ్వరికీ
లభించదు,
లభించునదికాదు.
సర్వవాంఛాదూరుడైన
ఈశ్వరునికి
ప్రేమారాధన
సల్పించు
కార్యముతప్ప
ఇతరమేమియూ
చేయనొల్లకుండునట్టి
మహోన్నత
మానవుని
విషయము
ఇది.
అట్టి
మహోన్నతులు
కాని
వారిదింకొక
తరగతి.
వీరు
కూడనూ
సత్కర్మలొనర్తురు
కానీ
అవి
సకామ
కర్మలు.
వారికి
ఫలాపేక్ష
ఉండియుండును.
మేము
నిరుపేదలకు
సహాయము
చేసితిమి
కనుక
మాకు
మంచి
గతి
లభించును.
లేక
మేము
సేవ
చేసితిమి
కనుక
మాకు
సద్గతి
లభించుననియూ,
పూజలు,
భజనలు
చేసితిమి
కనుక
మాకు
స్వర్గప్రాప్తి
కలుగుననియూ
ఈ
రీతిగా
పలువిధ
ఫలాపేక్షలతో
కర్మలాచరింతురు.
అట్టివారు
మరణాంతరము
అనగా
దేహమును
వీడిన
తరువాత
వారివాక్కు
మనస్సులోనూ,
మనస్సు
ప్రాణములోనూ,
ప్రాణము
జీవునిలోనూ
లీనమై
పిదప
వారి
జీవాత్మ
బహిర్గతమై
చంద్రలోకమునకు
తిరుగును.
అనగా
తిరిగి
మనోలోకమునకే
యేతెంచును.
మనోలోకమున
అనగా
చంద్రలోకమున
కొంతసుఖము
ననుభవించును.
అయితే
జీవాత్మ,
సత్కర్మ
ఫలము
నిలిచి
ఉండునంత
వరకే
ఇట్లు
జరుగును.
దానినే
"క్షీణే
పుణ్యే
మర్త్య
లోకం
విశంతి"
అందురు.
ఆ
ఫలము
వ్యయమయి
పోవటంలోనే
అది
తిరిగి
భూలోకమునకు
వచ్చి
తన
ఇచ్ఛానుసారముగా
ఫలమునకు
తగిన
దేహమును,
ఇంద్రియములను
ధరించి
జీవితములో
ప్రవేశించును.
దీనినే
అనగా
చంద్రలోక
నివాసకాలమును
భారతీయులు,
అనగా
హిందువులు
'వేలుపు'
అనియు,
క్రైస్తవులు,
మహమ్మదీయులు
'దేవదూత'
అనియు
తెలుపుదురు.
ఈ
స్థానమును
పొందిన
4
▾
Meaning
Keep
వేలుపుల
కున్న
పేర్లలో
సురపతియగు
దేవేంద్రుడు
ఇందుకు
ఉదాహరణము.
ఇది
ఒక
పదవి
పేరు
మాత్రమే.
వేలాది
ప్రజలు
ఆ
పదవిని
పొందుదురు.
వేదోక్త
క్రతువులలో
మహోత్తమమైనదాని
నొనర్పినపుడు
అట్టి
సత్పురుషుడు
దేహమును
వీడిన
పిదప
అతడు
దేవేంద్రుడగును.
దానికి
పూర్వము
ఆ
పదవిని
ఆక్రమించిన
వాడు
తిరిగి
భూలోకమునకు
దిగి
మానవాకారమును
ధరించును.
లోకములో
రాజులు
మారుచున్నట్లుగా
వేలుపులు
కూడా
మారుచుందురు.
వారికి
కూడా
మార్పుతప్పనిదికాదు.
స్వర్గలోకవాసులకు
సహితము
మార్పు
అనివార్యము.
మార్పులేనిది,
జనన
మరణములు
లేనిది,
దుఃఖసుఖాదులు
లేనిది
బ్రహ్మలోకమొక్కటి
మాత్రమే.
ఇది
భారతీయ
పరమార్థ
సారము,
అమృతపానము.
దేవతా
రూపమునందున్నపుడు
కర్మము
ఉత్పన్నముకాదు.
కర్మ
మొనర్చునది
మానవ
మాత్రుడే.
కర్మ
అనగా
ఫలాభి
సంధిగల
కార్యము.
మరణించుట
అనగా
దేహమును
విడిచి
వెళ్లగుట.
మానవునకు
అది
కేవల
సుఖకాలము.
ఆ
కాలమున
అతడు
క్రొత్త
కర్మను
కల్పించుకొనడు.
అది
వాని
పురాకృత
సత్కర్మమునకు
ప్రతిఫల
రూపముగా
లభించిన
సన్మానము
లేక
బహుమానము.
ఆ
సత్కర్మయంతయూ
వ్యయమై
పోయిన
పిదప
శేషించియుండు
కర్మము
ఫలానుభవ
రూపమునకు
వచ్చును.
అప్పుడు
మానవ
రూపమును
ధరించును.
మానవాకారమునొందును.
తదుపరి
మహోత్తమ
కార్యాచరణము
చేత
పారిశుద్ధము
నొందెనేని
బ్రహ్మలోకమునకు
చేరును.
అతనికి
ఇంక
పునరావృత్తి
ఉండదు.
వేదములో
నరకమను
మాటే
కానరాదు.
భారతీయ
పరమార్థము
దీనిని
అంగీకరించదు.
అనంతకాలమున
కల్పింపబడి
శాస్త్ర
వాఙ్మయములో
చేరినట్టి
పురాణమును
అనేక
విధముల
నరకములను
సృష్టించెను.
నరకములులేని
మతము
అసమగ్రమని
వారి
భావము.
నరకమున
అనేక
విధముల
హింసలు
కల్పింతురని
దానికి
ఒక
పరిమితి
అనునది
లేక
తెలిపిరి.
అయితే
మరణము
5
▾
Meaning
Keep
మాత్రము
నరకమున
ఉండదని
తెలిపిరి.
ఇది
కేవలము
భయోత్పాతమును
కల్పించుట
మాత్రమే.
ఇదియే
ద్వైత
మత
స్వరూపము.
ఇంతకన్నా
ఉన్నతమైన
వేదాంతము
మరొకటి
కలదు.
Previous
←
Be Yourself
Next
The One Undivided, Perfect Reality
→