Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · The One Undivided, Perfect Reality
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
జగత్తునకు
ఉపాదానకారణమును,
నిమిత్తకారణమును
కూడా
భగవంతుడే
ననియు,
భగవంతుడు
పరిపూర్ణము
అనియు,
ఆత్మయూ
పరిపూర్ణము,
ప్రకృతి
కూడా
పరిపూర్ణము
అనెడి
వాదమున
అనేక
పరిపూర్ణ
వస్తువు
లేర్పడినవి.
అతడు
అనగా
భగవంతుడు
తనలోనుండియే
ఈ
జగత్తును
ఆవిర్భవింప
చేయుచున్నాడు.
అయితే
భగవంతుడు
ఈ
గోడలుగా,
ఈ
బల్లలుగా
ఎట్లయ్యెను?
అనే
సందేహము
సహజము.
ఇది
ఒక
వాదము.
భగవంతుడు
పరిశుద్ధుడు
కదా
ఈ
దుష్టవస్తువులుగా
ఎట్లయ్యెను?
అని
మరొక
వాదము.
దీనికి
సమాధానము
విచారింతుము.
మానవుడు
ఆత్మ
స్వరూపుడే
అయ్యూ
అతడొక
శరీరమును
ధరించి
ఉన్నాడు
కదా!
ఒక
దృక్పథమున
తాను
ఈ
శరీరముకన్నా
భిన్నము
కాదుకదా!
అయిననూ
నేను
యథార్థ
స్వరూపుడను,
నేను
ఈ
శరీరమునూ
కాదు,
కాను.
నేను
పసివాడను,
వయోవృద్ధుడను,
లేక
స్త్రీ,
పురుషుడనూ
కాదు.
ఈ
శరీర
అవస్థలు
ఎన్ని
మార్పులు
చెందుచున్నప్పటికినీ
ఆత్మమారుట
లేదు.
స్త్రీ
దేహము
నందునూ,
వయోవృద్ధుని
యందునూ,
పసివాని
యందునూ,
పురుషుని
యందునూ
ఆత్మ
యథాస్థితి
యందే
నిలిచియుండును.
అటులనే
అఖిల
జగత్తు,
ప్రకృతి
యంతయూ
భగవంతునియొక్క
అనంతశరీరముగా
పరిగణింపవచ్చును.
అతడీ
సమస్త
జగత్తునందును
చొచ్చి
సర్వాంతర్గతమై
ఉన్నాడు.
అతడు
అవికారుడు
అనగా
మార్పులేని
వాడు,
మార్పురాని
వాడు.
2
▾
Meaning
Keep
ప్రకృతి
సవికారము,
ఆత్మయూ
సవికారమే.
ప్రకృతి,
దాని
రూపములూ
మారును.
అది
వేర్వేరు
రూపములు
దాల్చుచుండును.
కానీ
ఆత్మ
అట్టి
మార్పుల
నొందదు.
నొందజాలదు.
దుష్కర్మములు
దానిని
సంకుచిత
మొనర్చును.
దుష్కర్మములనగా
ఆత్మకు
స్వతస్సిద్ధమగు
సత్యజ్ఞానమును,
పరిశుద్ధతను
సంకుచిత
మొనర్చునవి.
ఆత్మయొక్క
నైసర్గిక
తేజో
వైభవమును
గోచర
రూపమునకు
తెచ్చు
కర్మములు
సత్కర్మములు
అనబడును.
ఆత్మ
మొదట
పరిశుద్ధమై
యుండునది.
కానీ,
ఆ
పిదప
అది
సంకుచితము
అయ్యెను.
సత్కర్మాచరణ
మూలమున
అది
మరల
వ్యాకోచతనొంది
దాని
నైసర్గిక
పారిశుద్ధములను
సాధించును.
ఈ
అవకాశము
సర్వ
జనులకూ
గలదు.
కాల
పరిపాకమున
సర్వులకూ
విమోచనము
లభించును
కానీ
ఈ
జగత్తు
మాత్రము
అంతమొందదు.
ఇది
శాశ్వతము.
ఇది
రెండవ
సిద్ధాంతము.
మొదటి
సిద్ధాంతము
పేరు
ద్వైతము.
ఈ
రెండవ
సిద్ధాంతం
ప్రకారము,
భగవంతుడు,
ఆత్మ,
ప్రకృతి
అనుమూడు
వస్తువులు
కలవు.
అంతా
ప్రకృతి
భగవంతుని
శరీరము
కనుక,
ఆత్మయే
జీవుడగుటచే
ఈ
మూడునూ
చేరి
ఒకవస్తువే,
ఆధ్యాత్మిక
విచారణ
పరిణామమున
ఇది
ఉన్నత
తరమగు
దశ.
దీనిని
విశిష్టాద్వైతమని
అందురు.
ద్వైత
మత
ప్రకారము
ఈ
జగత్తు
భగవంతుడు
సాగించిన
ఒక
మహాయంత్ర
తుల్యమైనది.
విశిష్టాద్వైత
ప్రకారము
అది
భగవదాత్మచే
అంతర్నిబిడమై
యుండు
ఒక
సంఘటనము.
ఇక
చివరిమతము
వారు
అద్వైతులు.
వారి
మతము
ప్రకారము
ఈ
జగత్తునకు
భగవంతుడే
ఉపాదాన
కారణమును,
నిమిత్తకారణమును,
కావున
భగవంతుడే
యావజ్జగ
ద్రూపము
నొందినాడు.
దీనిని
అందరూ
ఒప్పుకొనక
తప్పదు.
ఇది
పరమ
సత్యము.
భగవంతుడు
ఆత్మ
అనియు,
జగత్తు
శరీరమనియు
ఈ
శరీరము
సవికారము
ఆత్మ
మాత్రము
అవికారుడు,
అని
పల్కువారి
వాదమంతయూ
అర్ధరహితము,
అని
అద్వైతులు
చెప్పుదురు.
ఈ
వాదమే
సరియైనచో
ఈ
జగత్తుకు
భగవంతుడు
ఉపాదానకారణము
అని
చెప్పుట
వలన
ప్రయోజనమేమి?
3
▾
Meaning
Keep
ఉపాదానకారణమనగా
కార్యరూపము
నందిన
కారణము.
కార్యము
కారణముయొక్క
రూపాంతరమే
కానీ,
వేరుకాదు.
మనకు
కనిపించు
కార్యములన్నియూ
రూపాంతరము
నందినట్టి
కారణములే.
జగత్తు
కార్యము.
భగవంతుడు
కారణము
అగుచో
జగత్తు
రూపాంతర
మొందునట్టి
భగవంతునిగనే
ఉండితీరవలెను.
జగత్తు
భగవంతునియొక్క
శరీరము.
ఈ
శరీరము
సంకుచితమును,
సూక్ష్మమును
అయి
కారణ
రూపము
నందుచుండును.
దీనిలోనుండే
జగత్తు
పరిణామ
మందుచున్నదనియూ
ఆ
పక్షము
వారు
వాదించినచో
అద్వైతులు
భగవంతుడే
ఈ
జగద్రూపమొందినాడని
జవాబు
చెప్పుదురు.
అట్లయిన
అనగా
భగవంతుడే
ఈ
జగద్రూపమొంది
యుండినచో
మీరందరును,
ఈ
వస్తుజాలమంతయూ
భగవంతునిగనే
ఉండవలెను
కదా!
అవును
నిజమే.
ఈ
దృశ్య
గోచరమైన
వస్తువులూ,
భూతములూ
అన్నియూ
భగవంతుడే.
ఈ
సర్వమునూ
భగవంతుడే.
మన
శరీరము,
మనస్సు,
బుద్ధి,
చిత్తము
అన్నియూ
భగవంతుడే.
అపుడు
భగవంతుడు
ఇన్ని
జీవాత్మలుగా
ఎందుకుండాలి?
అని
మరొక
సంశయము
కలుగుట
సహజము.
ఏక
స్వరూపుడగు
పరమాత్మ
ఇన్నికోట్ల
జీవాత్మలుగా
మారునా?
అగుచో
అది
ఎట్లు
సంభవించెను?
అతడు
జగత్తుగా
మారియుండినచో
సవికారుడుగా
యుండవలెను.
సవికార
పదార్థమంతయూ
ప్రకృతిలోనిది.
ప్రకృతిగానుండి
సవికారమై
యుండినదంతయూ
జననమరణాలకు
లోనయి
ఉండును.
భగవంతుడు
సవికారుడైన,
అతడొకనాడు
మరణించి
తీరును;
మార్పుచెంది
తీరును;
చెందవలెను.
ఈ
విషయమును
జ్ఞప్తి
పెట్టుకొనుడు.
మరొక
విషయము:
భగవంతునిలో
యెంత
భాగము
జగత్తు
అయ్యెను?
అది
ఎంత
భాగమయిననూ
దీనిని
అద్వైతులు
ఇట్లు
పలుకుదురు.
ఈ
జగత్తు
మధ్య
దీనికి
ఉనికియే
లేదు.
అదంతయూ
మాయ.
ఈ
జగత్తు
జన్మించుట,
మరణించుట,
ఈ
అసంఖ్యాక
జీవాత్మలు
ఉత్పన్నమగుట,
అంతరించుట
ఇవన్నియూ
స్వప్న
సంఘటనలు.
జీవాత్మ
అనునదే
లేదు.
ఇక
అనేక
జీవాత్మ
లెట్లుండగలవు?
కలది
ఒకటే
అఖండ
పరిపూర్ణ
పదార్థము.
ఒకే
4
▾
Meaning
Keep
సూర్యుడు
అనేక
జలాశయములలో
ప్రతిఫలించి
అనేకుడుగా
కనిపించినను
కోటానుకోట్ల
జల
బిందువులందు
కోటానుకోట్ల
సూర్యబింబములు
ప్రతిఫలించినను
అందన్నియూ
పరిపూర్ణ
సూర్యబింబములే
అయ్యెను.
కలదొక్క
బింబమైనట్లు,
జీవాత్మలన్నియు
వేర్వేరు
మానసములందు
దీపించు
ప్రతిఫల
రూపములు.
ఈ
విభిన్న
మానసములన్నియు
విభిన్న
జలబిందువులవలే
ఆ
యొక్క
వస్తువునే
ప్రతిబింబించుచుండును.
ఈ
విభిన్న
జీవరూపములలో
ఆ
ఒక్క
భగవంతుడే
ప్రతిఫలించుచున్నాడని,
భారతీయ
పరమార్థమైన
అద్వైతము
సుస్పష్టముగా
చెప్పుచున్నది.
దీనికి
మార్పులేదు,
రాదు.
దానిని
అర్థము
చేసుకొనలేని
జీవులు
మాయకు
లొంగినవారలనే
చెప్పవచ్చును.
స్వప్నము
కూడా
ఒక
సత్యవస్తువుమీదనే
ఆధారపడి
యుండవలెను.
ఆధారవస్తువు
లేక
ఆధేయము
నిలువజాలదు.
మూలాధార
పదార్థమునుండియే
అన్నియూ
ఆవిర్భవించుచున్నవి.
ఆ
మూలాధారము
ఈశ్వరుడు.
అతడే
భగవంతుడు.
అతడే
పూర్ణుడు.
అదే
మనస్సుగా,
జీవునిగా,
దేహముగా,
ఆత్మగా
రూపొందుచున్నది.
నీవు
స్వప్న
మాత్రుడవే.
యథార్థ
దృష్టికి
లోకమంతయూ
సచ్చిదానంద
స్వరూపమే.
స్వప్న
దృశ్యములు
ఎక్కడినుండియో
పుట్టి,
ఎక్కడనో
విలీనమగుటలేదు.
అన్నియు
మనస్సునందే
పుట్టి,
మనస్సులోనే
విలీన
మగుచున్నవి
కదా!
ఇవి
ఎట్లు
పుట్టుచున్నవో
యోచించుచున్నామా!
ఆ
స్వప్నావస్థలో
అది
నిజమే
అని
తలంచి
రోదన,
ఆహ్లాదము,
భయము,
విచారము,
సంతోషమును
పొందుచున్నాము.
తరువాత
అవన్నియు
స్వప్నమని
వీనిని
చింతించ
కున్నాము.
అటులనే
జగత్తు
స్వప్నతుల్యము.
అంతా
ఈశ్వరునినుండియే
పుట్టి
తిరిగి
ఈశ్వరునియందే
లయమొందుచున్నవి.
ఈ
జన్మలు,
పునర్జన్మలు,
ఈ
రాకపోకలు
అన్నియు
మాయా
కల్పితములు.
భ్రమలు,
అసత్యములు.
నీవు
పరిపూర్ణుడవు.
నీవే
ఈశ్వరుడు.
ఈశ్వరుడే
నీవు.
ఈ
జ్ఞానానుభూతి
నొందినవారికి
ఈ
జగత్తులో
ఐక్యసిద్ధి
కలుగును.
Previous
←
Bondage
Next
Yogis
→