Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · Yogis
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
భారతదేశమున
వేదాంత
తత్త్వవిచారము
ఎక్కిన
మూడు
మెట్లు
ఇవియే.
అనగా
ద్వైత,
విశిష్టాద్వైత,
అద్వైతములు.
వీటిని
అతిక్రమించి
పురోగమించుట
ఎవ్వరికీ
సాధ్యముకాదు.
అద్వైత
వేదాంతము
సర్వసామాన్యముగా
అందరునూ
చేపట్టజాలరు.
అది
అంత
సులభముకాదు.
దానిని
బుద్ధిగ్రాహ్యమొనర్చుకొనుటే
కష్టము.
గ్రహణశక్తియూ
ఆవశ్యకము.
అందువలననే
మొదటిదైన
ద్వైతములో
ఆరంభించి
దానిని
చక్కగా
అనుష్ఠానమునననుంచి,
అనుభవించి,
విచారించిన
రెండవది
గోచరముకాగలదు.
జాతి
ఎట్లు
పురోగమించునో
అట్లే
వ్యక్తిగత
మానవులు
కూడా
పురోగమించవలెను.
అవస్థలలో
బాల్య,
యౌవన,
కౌమార,
వృద్ధాప్యములు
ఏవిధముగా
ఒకదానిలో
ఒకటి
ఇమిడియుండునో
-
మొదట
అవి
మనకు
కంటికి
కనిపించక,
అనుభవమునకు
రాక
ఆయా
సమయమున
మాత్రమే
అవి
మనకు
అనుభూతికి
గుర్తించ
వీలగుచుండునో
అటులనే
ద్వైత,
విశిష్ట,
అద్వైతములు
మూడునూ
ఒకదానిలో
ఒకటి
అంతర్భూతమయి
ఉన్నవి.
అవి
అన్నియూ
ఒకపరి
గుర్తించ
వీలుకాదు.
అనుభూతికి
రావు.
ఆయా
సమయమున
మన
సాధన,
అనుభూతులను
ఆధారము
చేసుకొని
గుర్తునకు
వచ్చును.
ఈ
ప్రపంచముండుట
నిజమేకాని
దేవుడు
కలడనుట
కల్ల
అని
పల్కువాడు
మూర్ఖుడు.
ఏలనన
ప్రపంచమున్నచో
దానికొక
కారణము
కలదని
అంగీకరింపక
కార్యము
నంగీకరించుటెట్లు?
ప్రపంచమదృశ్య
మయినపుడే
దేవుడదృశ్యుడగును.
2
▾
Meaning
Keep
అపుడు
నీవే
దేవుడవు.
ఈ
ప్రపంచము
ఒకటి
కలదను
స్వప్నము
-
ఈ
స్వప్నములు
కూడా
అదృశ్యములగును.
మనకిపుడు
ప్రపంచముగా
కనిపించు
వస్తువే
దేవుడుగా
కానిపించును.
ఎన్నాళ్ళనుండియో
మన
వెలుపలనున్న
దేవుడే
మన
లోపల
నున్నట్లును,
అతడే
మన
ఆత్మస్వరూపుడుగా
నుండినట్లునూ
తెలిసిపోవును.
అన్ని
మతములను
తృప్తిపరచు
మనస్తత్వము
కానీ,
వేదాంతము
కానీ
లోకమున
కానరాదు.
'లోకో
భిన్నరుచిః'
వారి
వారి
భావములను,
తలంపులనూ
పురస్కరించుకొని,
వారివారి
బుద్ధి
వికాసమును
విచారణాశక్తిని
పురస్కరించుకొని
ఆయా
మతము
అనగా
ద్వైతమో,
విశిష్టాద్వైతమో,
అద్వైతమో
వారికి
రుచించును,
అభిలషించును.
ఇంత
మాత్రముచేత
మా
మతము
గొప్ప
అనియు,
మా
మతము
అంతకంటే
గొప్ప
అనియూ
వాదోపవాదములకు
దిగుట
జ్ఞానహీనుల
లక్షణము.
భావావేశము
కలవాడు
వచ్చెనేని
మనమును
ఈశ్వరభావా
విష్టులమై
అతనితోకూడి
నవ్వవలెను.
ప్రేమమధువును
గ్రోలి
ఉన్మత్తులము
కావలెను.
కార్యదీక్షాపరుడు
వచ్చెనేని
అతనితోకూడి
మనమును
మన
పరిపూర్ణ
శక్తితో
పని
చేయవలెను.
ఇట్టి
సంయోగమందు
విశ్వమతమునకు
అత్యంత
సన్నిహిత
రూపమగు
ఆదర్శము
కానిపించును.
ఇవి
సమపరిమాణములో
పరిపూర్ణరూపమున
ప్రతి
మనస్సునందును
ఉండునట్లు
మానవజాతి
నిర్మింపబడి
యుండిన
ఎంత
చక్కగా
ఉండెడిదో
కదా?
ఈ
లోకమంతయూ
ఈ
పాక్షిక
స్వభావము
కలవారితోనే
నిండియుండిన
ఎంత
హోయి.
భారత
దేశమున
యోగమువలన
అనగా
కూడికద్వారా
అట్టి
ఆదర్శమతము
సిద్ధింపగలదు.
కార్యశూరుడు
ఈ
యోగముచే
మానవునకు,
మానవలోకమునకు
కూడిక
సాధించును.
తన
పరాప్రకృతికిని,
అపరాప్రకృతికిని
కూడిక
సాధించును.
ప్రేమ
సాధకుడు
దీనిచే
తనకును,
ప్రేమమయుడగు
దైవమునకును
కూడిక
సాధించును.
ఈ
యోగమార్గమునకు
సంస్కృతమున
వేరువేరు
పేర్లు
కలవు.
అట్టి
కూడిక
సాధించువారిని
యోగులని
అందురు.
3
▾
Meaning
Keep
కార్యశూరుడు
"కర్మయోగి",
ప్రేమమార్గానుసారి
"భక్తియోగి"
అంతశ్శక్తి
సాధకుడు
"రాజయోగి",
తత్త్వమార్గసాధకుడు
"జ్ఞానయోగి".
యోగి
అనుమాట
ఈ
నాలుగు
తరగతులవారికి
అన్వయించును.
భారతీయ
పరమార్థమున
ఈ
నాలుగు
విధముల
యోగులు
ప్రధానులు.
మొదటి
"కర్మయోగము"
కర్మాచరణముద్వారా
భగవంతునితోకూడు
మార్గము.
లోకమున
ఏదో
ఒక
కార్యాచరణముకొరకే
జన్మించినట్లుండు
వారిని
ఎందరినో
మనము
చూచుచుందుము.
వారి
బుద్ధి
భావక్షేత్రమున
నిలువనే
నిలువదు.
ప్రత్యక్ష
రూపమున
చూడదగిన
కార్యకలాపమే
వారి
మనస్సునందు
అంతయూ
ఆక్రమించుకొని
యుందును.
అట్టివారి
జీవితములకు
ఉపకరించు
శాస్త్రముకూడ
ఒకటి
ఉండవలెను
కదా!
లోకమున
మానవులందరునూ
ఏదో
ఒక
కర్మను
ఆచరించుచునే
యుందురు,
కానీ
కర్మ
రహస్యమెరుగక
మన
తత్త్వములను
చాలవరకు
వ్యర్థపరచుకొను
చుందుము.
కర్మయోగము
ఈ
రహస్యమును
బోధించును.
ఎచ్చట,
ఎప్పుడు,
ఎట్లు
కర్మ
మొనర్పవలసినది?
చేత
బూనిన
కార్యమును
సాధించుటకు
మన
శక్తిలో
అత్యధిక
భాగమును
అత్యధిక
ఫలము
కలుగునట్లు
వినియోగించుటెట్లో
అది
కర్మయోగము
తెలుపును.
ఇందులో
గొప్ప
ఆక్షేపణకూడా
మనము
జాగ్రత్తగా
గమనింపవలసి
ఉండును.
కర్మాచరణముచే
క్లేశము
కలుగుచుండుననుటే
ఈ
ఆక్షేపము.
మనశ్శరీరములకు
కలుగు
క్లేశములన్నింటికీ
సంగమే
కారణము.
కర్మమొనరించుట
నాకిష్టము.
ఒకరికి
మేలు
చేయగోరెదను.
కానీ
అతడా
మేలు
మరచి
నాకే
అపకారము
చేయు
అవకాశములు
అత్యధికముగా
గలవు.
అట్లు
జరిగినచో
నాకు
మనఃక్లేశము
కలుగును.
ఈవిధమైన
భీతి
కర్మాచరణకు
కొంత
అడ్డు
తగులును.
అది
కార్యోత్సాహమును,
కార్యశక్తిని
చెరచును.
ఎవరికి
తోడ్పడుచున్నది,
ఏల
తోడ్పడుచున్నది
విచారించక
కర్మముకొరకే
కర్మము
చేయమని
కర్మయోగము
గట్టిగా
బోధించుచున్నది.
కర్మయోగి
కర్మాచరణ
నిమగ్నుడై
యుండుటకు
కారణమేమి?
అది
అతని
నైజము;
అది
అతని
హితమని
4
▾
Meaning
Keep
తోచును
గనుక,
అంతియే.
అతనికి
మరొక
ఫలాపేక్ష
ఉద్దేశమేదియూ
ఉండరాదు.
అతడు
నిరంతరమూ
పరులకు
ఇచ్చువాడే
కానీ
పుచ్చుకొనువాడు
కారాదు;
కాడు.
కర్మయోగి
అట్టివాడు,
క్లేశమునకు
అతీతుడు.
ఇక
రెండవది
భక్తి
యోగము.
ఇది
భావావేశ
స్వభావము
కలవాని,
ప్రేమపూరిత
హృదయుని
మార్గము.
భగవంతుని
తన
ప్రేమప్రదముగా
చేసుకొనవలెనని
అతని
అభిలాష.
అందుకై
అతడు
ఏవేవో
కర్మకలాపములు
చేయ
అభిలషించును.
పరిమళ
ధూపమును,
పుష్పములను,
సుందర
మందిరమును,
మనో
ఆకర్షణీయమైన
ఆధారములు
ఆశ్రయించును.
అది
సరియైన
మార్గము
కాదందురా?
కాదుకాదు.
పురాణ
వాఙ్మయ
సమృద్ధి,
కర్మకలాప
సమృద్ధి
అపారముగా
గల
మతము
లందుండియే
లోకములోని
ఆధ్యాత్మిక
మహాపురుషులందరూ
ఆవిర్భవించిరని
పాఠకులు
జ్ఞప్తియందుంచు
కొనవలెను.
భగవద్రూప
రహితముగా,
ఉపచార
రహితముగా
ఆరాధన
మొనర్పజూపిన
శాఖ
లన్నియూ
మతములలోగల
సుందర
వస్తువులను,
మహనీయ
వస్తువులను
కటికడెందముతో
అణగద్రొక్కివైచినవి.
కన్నుగానని
మూర్ఖవిశ్వాసమే
వారి
మతము.
ఇది
కేవలము
శుష్కరూపమైనది.
ప్రపంచ
చరిత్రయే
ఇందుకు
ప్రబలసాక్ష్యము.
కావున
ఈ
కర్మకలాపములను,
పురాణములను
తూలనాడుట
మంచిదికాదు.
వానిని
అభిలషించు
వారికి
వాటిని
ఉండనిండు.
వాటియందక్కర
గలవారికి
అవి
ఉపకరించుగాక!
వాటిని
చులకనచేసి
మూఢులు
పాపమునకు
గురి
కాకుందురు
గాక!
లోకములో
అత్యద్భుత
శక్తిసంపన్నులు,
మహోన్నతులు,
ఆధ్యాత్మిక
పరిపూర్ణత
నొందినవారు,
మనుష్యుల
మానసములపై
వారి
ప్రభావము
చాలా
పనిచేయుచున్నది.
అట్టి
మహనీయులుండుటచేతనే
భారతీయ
పరమార్థము
అన్ని
దేశములను
ఆకర్షించుచున్నది.
అసలు
భారతదేశమునకు
ఇంతటి
గౌరవమర్యాదలు
కలిగినవన్న
ఆధ్యాత్మిక
సంపదయొక్క
అనుగ్రహ
ప్రభావమే.
5
▾
Meaning
Keep
దైవప్రీతి,
పాపభీతి
ఆధ్యాత్మిక
రంగమున
స్థిరస్థాయిగా
ప్రధాన
ఘట్టముగా
నిలుచుటచేతనే
భారతభూమి
పుణ్యభూమిగను,
యోగభూమిగను,
త్యాగభూమిగను
పేరొందినది.
అందులో
మనోహర
ప్రేరణలు
అనేకములు
లభించినవి.
భావోద్రేక
స్వభావములు
కలవారికి
సత్యముయొక్క
తత్త్వరూప
నిర్వచనము
రుచించునా?
భగవంతుడు
వారికి
స్పర్శ
వేద్యుడు,
ఏకైక
యథార్థవస్తువు.
భక్తులకు
అతడు
ప్రేమప్రదము.
కావున
వారి
దేవుడు
వారికుండుగాక!
ఇతరుల
హేతువాదము
వారికి
కథలోని
మూఢునివలె
తోచును.
అనగా
ఒకడు
సుత్తిని
తెచ్చి
ఆ
విగ్రహమును
పగులగొట్టెను.
భక్తియోగము
వారికి
ప్రేమమార్గమును
బోధించును.
అనగా
ఉత్తరోత్తర
లాభములపేక్షించి
ప్రేమించరాదు
అని
తెలుపును.
పరులను
ప్రేమించుటలో
గల
దోషమేమి?
అది
అందరికీ
మంచిది.
ప్రేమయే
పరమాత్ముడు
కనుక
పరమాత్మ
ప్రతి
ఒక్కరియందు
ప్రేమ
స్వరూపుడుగా
నుండును.
కనుక
ప్రేమించుట,
పరునికాక
పరమాత్మనే
ప్రేమించుచున్నటుల
భక్తియోగి
భావించును.
కొందరు
ఈశ్వరుని
తల్లిగను,
మరికొందరు
తండ్రిగను,
ఇంకా
కొందరు
మిత్రునిగను,
అతనే
పతిగను,
గతిగనూ
అన్నివిధములా
ప్రేమించి
తన
ప్రేమ
అతని
ప్రేమతో
కలుపుదురు.
ప్రేమ
ఎచట
ఉన్ననూ
అది
అతడే.
అనగా
భగవంతుడే
మానవజాతిని
ప్రేమించు
మహాపురుషుడు.
ఒకడు
వారి
కుపకారమొనర్ప
జూచునప్పుడతడు
తన
ప్రేమామృతమును
మానవలోకమునకు
ధారాళముగా
పంచిపెట్టుచున్నాడు.
హృదయము
ఎప్పుడెప్పుడు
ఉదారమగునో
అప్పుడు
అతడు
అచ్చట
ప్రసన్నుడై
ఉండును.
ఇదియే
భక్తియోగము.
ఇక
రాజయోగము.
రాజయోగమనగా
మనస్సును
స్వాధీనపరచు
కొనుట.
ఈ
యోగములో
స్వబుద్ధిని
ఎందులోనా
పరిత్యజించు
అవసరముండదు.
ఇతరులచేత
మోసపోవ
అవసరములేదు.
మీ
బుద్ధిని
యెట్టి
మతాచార్యులకు
కానీ
స్వాధీనపరచ
నవసరములేదు.
ప్రతి
దాని
యందును
మీరు
మీ
బుద్ధిమీదే
ఆధారపడి
యుండవలెను.
6
▾
Meaning
Keep
సర్వభూతములకునూ
మూడు
తెరగుల
జ్ఞానోపకరణములు
కలవు.
మొదటిది
సహజ
జ్ఞానము.
ఇది
జంతువులయందు
అత్యంత
పరిణత
రూపమున
కానవచ్చును.
జ్ఞానోపకరణము
లన్నిటిలో
ఇది
చాలా
అట్టడుగుది.
అనగా
అధమమైనది.
ఇక
రెండవది
సకారణ
విచారణశక్తి.
ఇది
మానవులయందు
పూర్ణపరిణత
రూపమున
కానవచ్చును.
సహజ
జ్ఞానము
మిక్కిలి
పరిమితము.
ఆ
పరిమిత
ఆవరణమునందే
అది
వర్తింపగలదు.
మానవునిలో
ఈ
సహజ
జ్ఞానము
చాలావరకూ
విచారణ
శక్తి
రూపము
నొందియుండును.
అతని
కార్యాచరణ
ఆవరణముకూడా
విశాలత
నొందియుండును.
కానీ
ఈ
విచారణశక్తి
కూడా
మిక్కిలి
అసమగ్ర
ప్రభావము
కలదియే.
అది
కొంతదూరమువరకే
పోవును.
ఆమీద
పోజాలదు.
తార్కిక
మార్గము
తిన్నగా
సాగక
వలయాకృతిని
ధరించి
మరల
మరల
మొదటికే
వచ్చును.
మన
విషయజ్ఞానమునకు
మూలమగు
వస్తువులను
భౌతిక
పదార్థములను,
శక్తిని
ఇందుకు
ఉదాహరణముగా
గొనిన
తెలియును.
భౌతిక
పదార్థమనగా
ఏమి?
భౌతిక
పదార్థముపై
ఏది
తన
బలమును
ప్రయోగించునో
అది
ఇంత
మాత్రములో
ఆగిపోదు.
కానీ
ఆవలనుండు
అనంత
పరిపూర్ణమందలి
ఒక్క
చిన్న
అణుశక్తి
మానవ
చైతన్యవీధికి
సోకిన
చైతన్యమనెడి
వలలో
తగుల్కొనియున్న
ఆ
పరిమితావరణము
లోపలనే
మన
సకారణ
విచారణయొక్క
ప్రసారము.
మనము
ఆ
ఆవరణము
దాటిపోవుటకు
ఏదో
ఒక
సాధనము
ఉండవలెను.
ఆ
సాధనమునే
ఈశ్వరప్రేరిత
జ్ఞానము
అందురు.
అనగా
మనకుగల
జ్ఞాన
సాధనలు
మూడు.
సహజ
జ్ఞానము,
యుక్తియుక్త
విచారము,
ఈశ్వర
ప్రేరిత
జ్ఞానము.
ఇందులో
మొదటిది
జంతువులది.
రెండవది
మానవులది.
మూడవది
దివ్యపురుషులది.
కానీ
ఈ
మూడు
అంకురములు
కొద్దిగనో,
గొప్పగనో
వికసించి
ప్రతి
మానవునియందునూ
కానవచ్చును.
ఇవన్నియూ
అంకురరూపమున
నుండిననే
కదా
పరిణత
రూపము
నందగలవు.
మరొక
విషయముకూడా
జ్ఞప్తి
పెట్టుకొనవలెను.
ఇందులో
ఒకదాని
7
▾
Meaning
Keep
పరిణత
రూపమే
మరొకటి
కావున
అవి
పరస్పర
విరుద్ధములు
కావు.
యుక్తియొక్క
పరిణత
రూపమే
ఈశ్వర
ప్రేరిత
జ్ఞానము,
కాన
ఇది
దానిని
పరిపూర్ణత
నొందించును
గానీ
ఖండించదు.
యుక్తికి
అందని
విషయమును
ఈశ్వర
ప్రేరిత
జ్ఞానము
బయలుపరచును.
వృద్ధదశ
అను
దశకు
పరిణత
రూపమువలె
ఇవి
మూడును
ఒకదాని
నొకటి
బలపరచును.
సహజ
జ్ఞానము
ఎన్నియోసార్లు
దివ్యప్రేరిత
జ్ఞానముగా
లోకము
నెదుట
ప్రదర్శింపబడును.
చిత్తచాంచల్య
ప్రేరితులు
తమ
బుద్ధివైకల్య
మంతయూ
దివ్యజ్ఞానమని
భ్రమించి
మానవులు
తమ్మనుసరించవలెనని
తలంతురు.
ఇట్టి
అర్థరహిత
బోధలు
ఈ
లోకమున
చేయబడుచుండుటకు
మూలము
మతిభ్రష్టులాడు
అసంబద్ధ
ప్రలాపములను
దైవప్రేరితములుగా
చెప్పుటే.
యుక్తి
విరుద్ధము
కాకుండుటే
సత్యబోధకు
మొదటి
తార్కాణము.
ఈ
మూలసూత్రము
ననుసరించియే
ఈ
యోగములన్నియూ
నిర్మింపబడినవి.
మనస్సుద్వారా
యోగసిద్ధి
పడయుట
రాజయోగము
కాన
దీనిలోని
కేంద్రభావమును
మాత్రమే
మనము
ప్రధానముగా
గుర్తించాలి.
అధమాధమ
మానవులు
మొదలు
యోగీంద్రులవరకూ
అందరికీ
ఆ
ఏకైక
మార్గమే
శరణ్యము.
దీనిని
ఏకాగ్రత
అని
అందురు.
పరిశోధనాలయములో
పనిచేయువారు
కానీ,
లేక
దారిని
నడచువారుకానీ,
పుస్తకములు
చదువువారుకానీ,
లేక
జాబులు
వ్రాయువారుకానీ,
కారు
డ్రైవు
చేయువారలు
కానీ
తమ
మానసిక
శక్తులన్నింటినీ
కేంద్రీకరించి
తమ
యెదుటి
భౌతిక
పదార్థములను
ఆ
ఏకాగ్ర
బుద్ధితో
పరిశీలింతురు.
వెంటనే
ఆ
పదార్థముల
తత్త్వము
బహిర్గతమై
అతడర్థించు
చుండిన
జ్ఞానమలవడును.
మీ
ఏకాగ్రత
ఎంత
అధికంగా
ఉండునో
అంత
చక్కగా
ఆ
భావము
మీకు
తేటపడును.
నా
ప్రేమను,
నా
మానసిక
శక్తులనూ
నేను
కేంద్రీకరించుకొలదీ
నా
భావమును
మీకు
విశదీకరించు
శక్తి
ఎక్కువగును.
ఈ
కేంద్రీకరణశక్తి
ఎక్కువగుకొలదీ
జ్ఞానార్జన
మధికమగుచుండును.
జ్ఞానార్జనకు
ఇదియే
ఏకైక
మార్గము,
ఎట్టి
వాడైననూ
తను
చేయు
పనిపై
మనశ్శక్తి
8
▾
Meaning
Keep
కేంద్రీకరించినచో
ఆ
పనిని
మిక్కిలి
బాగుగా
చేయగలదు.
లోకవ్యవహారము
నందైననూ
లేక
ఆధ్యాత్మిక
మార్గమందైననూ
ఏ
ఇతర
విషయములందైననూ
ఇతర
కార్యములందైననూ
ఏకాగ్రత
అధికమగుకొలదీ
కార్యమునందు
అంత
అధిక
ఫలమునందుకోవచ్చును.
ఆ
కార్యముకూడనూ
చక్కగా
నిర్వహింపబడును.
జ్ఞాన
ధనాగారమును
తెరువవలసిన
తాళమిదియే.
కేంద్రీకరణ
శక్తియే
రాజయోగమున
మంచువంటిది
ఇది
ఒక్కటే
అని
చెప్పకతప్పదు.
మనకు
అక్కరలేని
తలంపులు
కోట్లకు
బుద్ధిలోనికి
చొరబడి
దానిని
తబ్బిబ్బుచేయును.
దానిని
ప్రతిఘటించి
అట్టి
మనస్సును
స్వాధీనములో
ఉంచుకొనుటకు
రాజయోగమొక్కటే
శరణ్యము.
ఇక
మిగిలినది
జ్ఞానయోగము.
దీనిలో
పూర్తి
తత్త్వవిచారమే
అధికముగా
కానవచ్చును.
దృశ్యకల్పితమైన
లోకమును
అతీతమైన
ఊహలు
కలిగియుండును.
లోకములోని
ఏ
వస్తువును,
ఏ
పనియును,
ఎవ్వరునూ,
అతనిని
తృప్తిపరచజాలవు,
జాలరు.
అసలు
జీవితమునకు
సంబంధించిన
నిత్యకృత్యములను
కూడనూ
అతిక్రమించి
పోవాలని
ఈ
జ్ఞానయోగి
తలంచును.
ఆస్తికత్వమను
మహాసముద్రములో,
లోకవస్తువులన్నియూ
బంధువుల
వంటివిగా
తోచును.
మూలాధారమైన
గమ్యము,
కేంద్రము,
కీలకము
చేర
ఉవ్విళ్ళూరును
జ్ఞానయోగి.
సత్యమే
తాను
కావలెనని
ప్రయత్నించును.
సత్యము
వేరు
తాను
వేరుగా
ఉండనొల్లడు.
దానిని
వేరుగా
భావించడు.
అతనికి
సర్వబంధువూ
భగవంతుడే
అని
భావించును.
అన్య
చింతలుకానీ,
అన్య
బంధములుకానీ,
అన్య
వాంఛలుకానీ
ఉండవు.
అంతా
దైవమే.
కష్టమైననూ,
సుఖమైననూ,
లాభమైననూ,
నష్టమైననూ
అతనికి
భేదములేక
అద్వైత
దర్శనస్థితిని
అనుభవించగోరును.
అదే
సరియైన
జ్ఞానము.
ఇట్టి
భావముకల
వ్యక్తికి
జగత్తంతయూ
నిస్సారమగు
మిథ్యాదృశ్యమను
భావము
కలుగును.
అయితే
ఇంద్రియములు
మధ్య
మధ్య
అట్టి
భావమును
క్రిందికి
లాగును.
ప్రపంచ
వ్యామోహమున
పడత్రోయుటకు
ప్రయత్నించును.
కానీ
అతి
జాగ్రత్తగా
ఇంద్రియములను
అదుపులో
ఉంచుకొని
దానిని
ఎట్లయిననూ
ప్రక్కకు
నెట్టి
క్రమేణా
భగవంతుని
సమీపింపగోరును.
9
▾
Meaning
Keep
అణువులో
అణువుగానూ
ఘనమునందు
ఘనముగాను
ఉండుశక్తి
దైవమొక్కడే
అని
గుర్తించి
ప్రవర్తించును.
పరమార్థ
దృష్టికి
సర్వభూతములూ
ఒకే
వస్తువనియూ
ప్రతీ
ఒకవ్యక్తి
భూలోకములో
రూపమెత్తిన
భగవంతుడేనని
యనుభవించుటకు
ప్రయత్నించును.
అయితే
ఇట్టి
భావములు
ఉండినంతమాత్రమున
జ్ఞానయోగి
కాజాలడు.
వీటిని
అనుభూతిలోనికి
తెప్పించుకొనవలెను.
అనుభవ
సిద్ధములుగా
చేసుకొనవలెను.
ఇది
అత్యంత
ముఖ్యము.
బుద్ధికి
మాత్రము
తెలిసిన
చాలదు.
కడకు
అవి
మన
జీవితరూప
మొందవలెను.
కేవలము
భావసముదాయముగా,
సిద్ధాంత
సముదాయముగా
నుండుట
మాని
మన
ఆత్మలోనికి
ప్రవేశింపవలెను.
నేడు
బుద్ధిసమ్మతముగానున్న
అనేక
విషయములు
కానీ,
వస్తువులు
కానీ,
రేపు
విరుద్ధ
వస్తువులు,
విరుద్ధ
విషయముగా
భావించవచ్చును.
బుద్ధిసమ్మతము
కూడనూ
స్థిరముకాదు,
శాశ్వతము
కాదు.
భావములు
మార్పు
చెందును
కదా!
అవి
సత్య
ధర్మములు
కావు.
ఆత్మ
అంతయూ
తన
విశ్వాసానుసారముగా
ఉండవలెను.
అదే
ఆస్తిక
ధర్మము,
అదే
జ్ఞానయోగము.
భారతీయ
పరమార్థమున
వేదమును
ఈశ్వరవాణి
అని
చెప్పబడెను.
భారతీయులకు
ఇవే
మూలాధారములు;
ప్రధాన
ప్రమాణములు.
ఇవి
ప్రాచీన
ఋషులచే
తెలుపబడెను.
ఇవి
మానవ
భాషితములు
కావు,
రచనలు
కావు.
గురు
శిష్యుల
పరంపరముగా
పోషింపబడినవే.
దీని
పుట్టుక
ఇప్పుడు,
అప్పుడు
అని
ఇంతవరకునూ
ఎవ్వరునూ
కనిపెట్టలేకపోయిరి.
ప్రయత్నించియూ
వారివారి
ఊహాభావములను
కొంత
వెలిబుచ్చిరికానీ,
అంతా
తెలుసుకున్నవారు
ఇంతవరకు
కనిపించలేదు.
ఇకమీదట
కూడను
నిర్ణయించలేరు.
అవి
సనాతనమైనవి
ఊహించి
విశ్వసించుట
ఉత్తమము.
ఈ
సమయమున
మనమొక
ముఖ్య
విషయాన్ని
జ్ఞప్తియందుంచుకొనవలెను.
లోకములోగల
తక్కిన
మతములన్నియూ
తమ
ప్రామాణికతకు
ఆధారముగా,
అందరి
సందేశము,
ఒక
సాకార
దైవమో,
కొందరు
మహాపురుషులో,
దైవాంశ
సంభూతులో
కొందరికి
అందజేసిరని
10
▾
Meaning
Keep
పలుకును.
భారతీయులిట్లుకాదు.
వేదముల
ప్రామాణికత
మానవులపై
ఆధారపడినది
కాదనియు,
అవి
సనాతనములనియు,
ఈశ్వర
జ్ఞానమయములగుటచేత
స్వయం
ప్రామాణికములనియూ
చెప్పవచ్చును.
అవి
రచింపబడినవి
కావని
గుర్తించవలెను.
ఇవి
మనకు
తెలియక
పూర్వము
కూడనూ
ఉన్నవి.
కలకాలమూ
నిలిచియే
ఉన్నవి.
సృష్టింపబడినవి
కావు.
సృష్టి
యెట్లు
అపారము,
శాశ్వతము,
ఆద్యంత
రహితమో
అటులనే
ఈశ్వరవాణి
కూడనూ
శాశ్వతము,
అపారము,
ఆద్యంతరహితము.
వేదము
(విద్
=
ఎరుగుట)
అనగా
జ్ఞానము.
దీనిని
మహాఋషులు
దర్శించి
ప్రకటించిరి.
వారే
మంత్ర
ద్రష్టలు;
అసలు
ఋషులనగా
మంత్ర
ద్రష్టలనే
అర్థము.
ఒకటి
కర్మకాండ.
రెండవది
జ్ఞానకాండము.
మొదటిది
అనగా
కర్మకలాప
భావము.
పారమార్థిక
జ్ఞానమార్గము,
భావము,
కర్మకాండలో
వివిధ
క్రతువులు
పేర్కొనబడినవి.
ఆ
క్రతువులలో
అత్యధిక
భాగము
ఇప్పటి
పరిస్థితిని,
గతిని
అనుసరించి
సాధ్యము
కావని
విడనాడబడినవి.
అయితే
కొన్ని
ఈనాటికినీ
ఏదో
ఒక
రూపమున
నిలిచియే
ఉన్నవి.
కర్మకాండలో
ముఖ్య
భావము
మానవ
ధర్మములు,
గృహస్థ,
వానప్రస్థ,
సన్యాస,
బ్రహ్మచర్యము
లనబడు
ఆశ్రమ
ధర్మములు
వివిధ
పదవీ
ధర్మములు
నేటికినీ
కొంత
కొంత
అంతో
ఇంతో
మార్పు
చెందిననూ
లోకమున
కనిపించుచున్నవి.
ఈ
పారమార్థిక
భావములు
రెండవ
భాగమున,
అనగా
జ్ఞాన
కాండమున,
వీటినే
వేదాంతము,
వేదాగ్రము,
వేదసారము,
వేద
పరమార్థము,
వేద
విజ్ఞానసారము
అనునవి
ఉపనిషత్తులని
పిలువబడుచున్నవి.
ద్వైతులు
కానీ,
విశిష్టాద్వైతులు
కానీ,
అద్వైతులు
కానీ
లేక
శైవులు
కానీ,
వైష్ణవులు
కానీ,
శాక్తులు
కానీ,
పౌరులు
కానీ,
గాణపతులు
గానీ,
ఎవరైననూ
వేదోపనిషత్తుల
ప్రమాణములను
అంగీకరించియే
తీరవలెను.
ఎవరి
ఇష్ట
ప్రకారము
వారు
ఆయా
ఉపనిషత్తులకు
అర్థములు
వేర్వేరుగా
చెప్పుకొనవచ్చును.
వారికి
ఆ
విషయమున
పరిపూర్ణ
స్వేచ్ఛగలదు.
కాని
వాని
ప్రామాణికత
నంగీకరింపకుండు
స్వేచ్ఛ
ఎవ్వరికీ
లేదు.
కావుననే
ఇక్కడ
హిందూ
శబ్దమునకు,
11
▾
Meaning
Keep
భారత
శబ్దమునకు
వేదాంత
శబ్దములను
ఉపయోగించు
కొనుచున్నాము.
ఇప్పుడు
వ్యాప్తిలోనున్న
మతశాఖలన్నియూ
అపరిపక్వముగా
నున్ననూ,
కనిపించిననూ
వాటి
ఉద్దేశములెంత
దురవగాహముగా
తోచిననూ
సావధానముగా
విచారించినచో,
పఠించినచో,
పరిశీలించినచో,
వాటిన్నింటికి
ఉపనిష
ద్భావములే
మూలములని
తెలియవచ్చును.
భారత
జాతిలోనికి
లేక
హైందవ
మతములోనికి
ఉపనిషత్తులంత
పూర్తిగా,
లోతుగా
దిగబడి
పోయినవి.
కావుననే
విగ్రహాది
రూపములందు
అవి
ఆరాధింపబడు
చున్నవి.
నేడును
మన
ఇండ్లయందుకానీ
దేవాలయములందుకానీ
ఉపనిషత్తులు,
అర్చనస్థానమును
అలంకరించుచున్నవి.
మన
జీవితముతో
అవినాభావసంబంధ
మేర్పరచుకొని,
శాశ్వతముగా
నిలచిపోయినవి.
వేదములు
అనంతములు
"అనంతో
వై
వేదః"
కానీ
వీటి
అన్నింటిలోని
సారమును
గైకొని
నాలుగుగా
విభజించి,
లోకకళ్యాణ
నిమిత్తము
ప్రచారము
జరిగెను.
అవే
ఋగ్వేదము,
యజుర్వేదము,
సామవేదము,
అధర్వణ
వేదములని
ఇవి
నాలుగు
భాగములుగా
మానవులను
తరింపజేసి,
ధర్మమును
నిలబెట్టి,
సత్యమును
చాటి
ఆరాధనలతో,
అర్చనలతో,
గానముతో,
అన్య
శాస్త్రములతో
జగత్కళ్యాణమును
గావించినవి.
సమస్త
మానవులకు
నిత్యజీవితములో
ఆదర్శవంతమును
నిరూపించినవి.
ఏ
కార్యము
జరిగిననూ
భారతీయులకు
అది
తెలిసిననూ,
తెలియకపోయిననూ,
ఏదో
ఒక
విధముగా
అది
వేదప్రమాణము
ననుసరించే
ఉండును.
పెండ్లి
మొదలు
శ్రాద్ధమువరకూ
భారతీయులు
వేదప్రమాణమునే
అనుసరించుచున్నారు.
అట్టి
ఆధార
ప్రమాణరూపమైన
వేదమును
విస్మరించుట
భారతీయుల
లక్షణముకాదు.
ద్వైతముననో,
అద్వైతముననో,
లేక
విశిష్టాద్వైతముననో
భారతీయులు
తమ
జీవితమును
ప్రమాణబద్ధముగానే
అనుభవించుచున్నారు.
అయితే
తెలిసి
అనుసరించినా,
ఆచరించినా,
దాని
ఫలము
మరింత
అధికమగును.
ఆనందము
లభించును.
Previous
←
The One Undivided, Perfect Reality
Next
The Values in the Vedas
→