Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · The Values in the Vedas
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
"వేత్తి
ఇతి
వేదః"
అనగా
మానవుడు
తన
కర్మకాండను,
జ్ఞానకాండను
వేదబలమునుండే
గ్రహించగలదు.
వేదములు
మానవుని
పుట్టుక
నుండి
మరణమువరకు
అతని
కర్తవ్యమును
బోధించుచున్నవి.
అనగా
మానవుని
అన్ని
ఆశ్రమములను
గురించి
వివరించుచున్నవి.
ఈ
వేదసార
గ్రహణార్థము
కాలానుక్రమముగా
వేదాంగములు,
పురాణ,
ఇతిహాసములు
ఏర్పడెను.
కనుక
మానవులు
యథార్థమగు
మానవత్వమును
గ్రహించవలెనన్న
వేదవేదాంగముల
ప్రాబల్యమును
ముందుగా
తెలుసుకొనవలెను.
కనుకనే
ప్రాచీన
కాలమున
భారతీయులైన
పూర్వీకులు,
వేదాధ్యయనమునకు
ముందుగా
వేదాంగములను
గురుకులములలో
నిర్బంధముగా
బోధించెడివారు.
అనగా
ఆ
కాలములో
భారతీయులు
చతుర్దశ
విద్యలను
అభ్యసించెడివారు.
ఆనాటి
వేదాధ్యయనములో
కంఠస్థీకరణ
విద్యకు
అధిక
ప్రాముఖ్యత
నిచ్చిరి.
వేదాధ్యయన
మొనర్చినవానిని
"జడము"
అని
పిలుచుట
అలవాటు
ఆనాడు.
అనగా
అతనికి
ఏమీ
రాదని
కానీ,
తెలియదని
కానీ
అర్థముకాదు,
అనుకోరాదు.
వేదాధ్యయనము
చేసిన
వారికి
సర్వమూ
అవగత
మగునని
దీని
అర్థము.
వేదాధ్యయనముచే
మానవుడు
సర్వజ్ఞుడు
కాగలడని
చెప్పబడెను.
కావున,
నరుడు
తన
జీవిత
సాఫల్యమునకై
వేదాధ్యయన
మొనర్చుట
ఎంతైననూ
అవసరమనియూ
వేదప్రమాణములే
భారతీయుని
నిత్యజీవిత
ప్రధానములని
భారతీయ
పరమార్థ
వాహిని
తెలుపుచూ
వచ్చెను.
2
▾
Meaning
Keep
ఇందులో
మొదటిది
ఋగ్వేదము.
ఇది
పది
మండలములుగా
విభజించబడినది.
మొదటి
నవమండలములలో
అగ్ని,
ఇంద్రుడు,
మరుత్తు,
ఉషస్సు
మున్నగు
దేవతలను
గురించిన
సూక్తులున్నవి.
చరిత్రకారులు
ఈ
ఋక్కులు
ఎట్లు
ఏర్పడినవి
అను
విషయమును
కొన్ని
ప్రమాణములతో
చెప్పిరి.
ఆనాటి
ఋగ్వేద
మానవులు
తమకంటే
అగ్ని,
వాయువువంటి
దేవతలను
ప్రత్యేకంగా
భావించిరి.
మానవులకన్నా
ఈ
విశిష్ట
దేవతలు
విశిష్టశక్తి
కలవారని
గుర్తించిరి.
అందువలననే
దేవతల
గుణములను
గురించి
విశేషముగా
వర్ణించిరి.
ఇక
రెండవది
యజుర్వేదము.
ఇందులో
కృష్ణ
యజుర్వేదమనియూ,
శుక్ల
యజుర్వేదమనియూ
రెండు
శాఖలున్నవి.
ఈ
వేదములో
గంగానదీ
తీరముకూడా
వర్ణింపబడినది.
ఈ
వేదములోనే
ఉత్తరమీమాంస
విషయములుకూడా
విశదముగా
చెప్పిరి.
ఆనాటికే
ఆరణ్యము,
గ్రామము
అని
విభజించి
గ్రామములలో
నివసించిరి.
ఇట్లు
యజుర్వేదమును
విభజించుటకు
మరొక
ప్రమాణము
కూడా
ఉన్నది.
యజుర్వేదమును
సప్తకాండగా
విభజించి
దానిలో
ఆరణ్యమని
అనగా
అరణ్యములోనే
అభ్యసింపవలసినదని
చెప్పుటచే,
పై
చెప్పిన
గ్రామము,
అరణ్య
విభజనము
వ్యక్తము
అగుచున్నది.
మూడవది
సామవేదము.
ఈ
వేదము
ఋగ్వేదములో
చెప్పబడిన
అనేక
ఋక్కులు,
నస్వరముగా
చెప్పబడినవి.
అందువలననే
సామవేదము
స్వరప్రధానమైనది.
ఈ
వేదము
ఋగ్వేద,
యజుర్వేదములకన్నా
అర్వాచీనము.
ఋగ్వేదకాలములో
సింధూతీరమున
నివసించిన
ఆర్యులు,
యజుర్వేద
కాలమునకు
గంగాతీరమునకు
తరలివచ్చిరి.
సామవేద
కాలములో
భారతదేశము
యొక్క
మధ్య
భాగమునకు
వ్యాపించిరని
అభిప్రాయపడిరి.
ఈ
సామవేదమునకు
గానవేదమని
కూడా
పేరు.
లోకములోని
అన్ని
విధములైన
సంగీతము
ఈ
సామగానమును
ఆధారము
చేసుకునే
అభివృద్ధి
గాంచెను.
గానమునకు
మూలము
సామవేదము.
సమస్తస్వరములూ
దీనిలో
ఇమిడి
ఉండును.
3
▾
Meaning
Keep
నాలుగవది
అధర్వణ
వేదము.
అనేకమంది
అనేక
విధముల
దీనిని
వర్ణించిరి,
తెలిపిరి.
కొందరు
దీని
వేదత్వము
నంగీకరించలేదు.
మరి
కొందరు
మిగిలిన
వేదములలోని
శేషమే
ఈ
అధర్వణ
వేదమని
నుడివిరి.
మిగిలిన
వేదములలో
దేవతలయొక్క
శక్తిసామర్థ్యములే
చెప్పబడినవి.
కానీ
యోగాభ్యాసముచేత
మానవుడు
కొన్ని
అద్భుత
కార్యములను
తన
శక్తి
సామర్థ్యములచేత
చేయవచ్చునని
చెప్పుట
ఈ
అధర్వణ
వేదము
యొక్క
వైలక్షణము;
అష్టయోగము,
హఠయోగము,
తిరస్కరణి
విద్య
ఇత్యాదులు
ఈ
వేదమువల్లనే
సిద్ధించినవి.
దేవతా
ప్రసాదముచే
అసాధ్యమైన
కార్యములనుకూడా
సాధింపగలదు.
కాన
వేదాలు
చాలా
ముఖ్యమైనవనియూ,
వానిలో
అన్ని
విషయములూ
చెప్పబడినవనియూ
భావించవలెను.
వేదములే
భారతీయ
సంస్కృతికి
మూలములు,
ఈ
వేదములు
అపౌరుషేయములు,
స్వయంభువములు.
ఇవి
ప్రపంచ
సంస్కృతిలో
ప్రముఖమైనవనియూ
సర్వులూ
అంగీకరించక
తప్పదు.
ఇవి
గురు
ముఖతః
అభ్యసించి
పరంపరగా
రక్షించుటచే,
ఈనాటివరకూ
అవి
సజీవములై
నిలిచియున్నవి.
వాటిని
మార్పుచేయ
ఎవరికీ
సాధ్యముకాదు.
ఇది
అసాధ్య
విద్య.
ఏది
ఏమైననూ
నాలుగు
వేదముల
సారము
ఒకటే
అని
విమర్శకులు
తెలిపిరి.
ఈ
నాలుగు
కర్మ,
జ్ఞాన
కాండములు.
మానవుడు
తన
పురుషార్థములను
ఈ
వేదములనుండే
పొందగలడు,
పొందవలెను.
అట్టి
నాలుగు
వేదములను
సంపూర్ణముగా
నభ్యసించుట
కష్టమను
కారణముచేత
శ్రుతినొందు
స్మృతి,
పురాణ,
ఇతిహాసములద్వారా
వేదసారమును
పెద్దలు
అందించుచూ
వచ్చిరి.
కర్మ,
జ్ఞాన
కాండములు
పరస్పరము
కార్య,
కారణ
భావముగా
ఉన్నవి.
ఎందుచేతననగా,
కర్మానుగుణముగా
ఫలము,
జ్ఞానానుగుణముగా
కర్మము
సంభవించుట
ప్రకృతి
సిద్ధము.
అందుచేతనే
మానవులు
కర్మానుగుణముగా
ఫలమును
పొందగలరు.
సత్కర్మాచరణకు
జ్ఞాన
మనివార్యము.
ఆ
జ్ఞానము
4
▾
Meaning
Keep
మనము
వేదములనుండే
గ్రహించవలసి
యుండును.
అనగా
వేదముల
నాశ్రయించవలెను.
కర్మ
అనునది
ధర్మాచరణము.
ఏవి
చేయవలయును,
ఏవి
చేయరాదు
అని
తెలిసికొని
తదనుగుణముగా
ప్రవర్తించుట.
ఇవియే
మన
ఉపనిషత్తులయొక్క
సారము.
"సత్యంవద,
ధర్మం
చర,
మాతృదేవో
భవ,
పితృదేవో
భవ,
ఆచార్యదేవో
భవ,
అతిథిదేవో
భవ,
సత్యాన్న
ప్రమదితవ్యమ్,
ధర్మాన్న
ప్రమదితవ్యమ్"
ఇవి
విధులు.
ఇక
నిషేధములు,
"తాని
సేవిత
వ్యాని,
నోఇతరాణి,
యాన్య
స్మాకగ్ం
సుచరితాని,
తాని
త్వయోస్యానోఇతరాణి".
'యథా
రాజా
తథా
ప్రజా'
అన్నట్లు
రాజు
తాను
అధ్యేతయై
ఇతరుల
అధ్యయనముకొరకు
అవసరమగు
ఆర్థిక
సహాయముచేసి
గురుకులమును
వేద
నికేతనముగా
విలసిల్లచేసెను.
వేదములను
రక్షించుట
అనిన
వేదవిదులను
రక్షించుటే.
నేటి
నవ్యసమాజములో
ఇతర
విద్యావేత్తలకు
వలె
వేదవిదులకు
కూడా
ఉద్యోగావకాశములు
కల్పించుట
ఒక
ప్రధానాంశము.
కానీ
అది
జరుగుట
లేదు.
"ధర్మో
రక్షతి
రక్షితః"
ధర్మమును
మనము
రక్షించిన,
మనలను
ధర్మమే
రక్షించును.
ఈనాడు
వేదాధ్యయనమనునది
కేవలము,
ఆర్థికముగా
బలహీనుల
కర్తవ్యముగా
చిత్రింపబడి
మిక్కిలి
అధోగతిలో
ఉన్నది.
అసలు
వేదాధ్యయనము
చేసిన
పంతులే
వేదమును
ఒక
వ్యాపార
రంగమున
దించి,
ధనార్జనకై
వేదమును
అమ్ముకొనుచున్నాడు.
వేదార్థము
నెరిగిన
పండితోత్తములే
ఆచరణ
రూపమైన
ప్రచారమునకు
విరుద్ధముగా
ప్రవర్తించుచున్నారు.
వేదము
పొట్టకూటి
విద్యగా
వినియోగించుకొనుచున్నారు.
ఇదే
అధర్మమునకు,
లోక
అశాంతికి
మూలకారణము.
ఇట్టి
వారలకు
గట్టిగా
నచ్చజెప్పి,
తిరిగి
సక్రమమైన
మార్గమున
ఈ
వేద
ప్రమాణములను
అనుసరించిననే
లోకకళ్యాణము;
లేకున్న
పతనమే
తప్పదు.
భారతీయ
పరమార్థ
వాహిని
నాటినుండీ
నేటివరకూ
ఈ
వేద
ప్రమాణములను
5
▾
Meaning
Keep
పాటించి
పాలించి
పయనింపుడని
పలువిధముల
తెలుపు
చున్నది.
ఎన్ని
వేదాంతములు
చెప్పిననూ,
ఆచరణ
ప్రధానమైన
ఆదర్శమన్నది
పెద్దలు
మరచిపోయినారు.
వారిని
మేల్కొలిపి
ప్రాచీన
వేదవిహిత
సాంప్రదాయములను
కాపాడుదురు
గాక!
Previous
←
Yogis
Next
Values in the Later Scriptures
→