Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · Values in the Later Scriptures
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
వేదాంతము
తరువాత
స్మృతులు
బయలుదేరెను.
అవి
పవిత్ర
తపశ్శక్తి
సంపన్నులైన,
అనుభవజ్ఞులైన
ఋషుల
విరచితములే.
అయితే
వేదాంతమునకు
ఉండునంతటి,
ఉండినంతటి
ప్రామాణికత
స్మృతులకు
లేదనే
చెప్పవచ్చును.
తక్కిన
మతములవారికి,
వారి
శాస్త్రములకును
ఎట్టి
సంబంధము
ఉన్నదో
అటులనే
స్మృతులకును,
భారతీయులకునూ
అట్టి
సంబంధము
కలదు.
వారి
వారి
శాస్త్రములు
ఎట్లు
మహాపురుషుల
నిర్మితములో
అటులనే
భారతీయ
స్మృతులు
కూడనూ
మహాపురుషుల
నిర్మితములే
అని
అంగీకరించక
తప్పదు,
అంగీకరించవలెను.
ఇతర
మత
ములకునూ,
భారతీయ
మతములకును
ఉన్న
సామ్యమిదియే.
అయితే
ఈ
ఋషి
నిర్మితములైన
స్మృతులు
కాలక్రమమున
మారుతూ
వచ్చినవి.
ఒక
స్మృతి
కృతయుగమునకును,
ఒక
స్మృతి
త్రేతాయుగమునకునూ,
మరొకటి
ద్వాపరయుగమునకు,
కొన్ని
స్మృతులు
కలియుగమునకు
ప్రమాణికములై
ఉండవలెనని
చెప్పబడియున్నవి.
కాలగతులు
మారగా,
పలువిధములగు,
క్రొత్త
సందర్భములు
జాతిని
ఎదుర్కొనగా
ఆయా
జాతియొక్క
మర్యాదలు,
ఆచారములూ,
మార్పుచెందుకొంటూ,
చెందవలసి
వచ్చుచుండెను.
దానికి
అనుసారముగా
ఈ
స్మృతులను
కూడా,
ముఖ్యముగా
జాతియొక్క
ఆచార,
మర్యాద,
వ్యవహారములను
గూర్చినవే
కనుక
అప్పుడప్పుడు
మార్పుచెందుట
అవసరమయ్యెను.
పాఠకులు
ముఖ్యముగా
గమనించవలసిన,
జ్ఞప్తిపెట్టుకొనవలసిన
విషయమిది.
వేదాంతమునందలి
ఆస్తిక
ధర్మసూత్రములు
సుస్థిరములు,
2
▾
Meaning
Keep
మార్పుచేయుటకు
వీలుకానివి;
ఏల
యనగా
అవన్నియూ
మానవుని
యొక్కయు,
ప్రకృతియొక్కయు
నిత్య
ధర్మములపై
ఆధారపడియున్నవి,
పడియుండునవి.
అందుచేత,
అవి
మార్పునకు
అతీతమైనవిగా
రూపొందినవి.
ఆత్మను
గూర్చిన
భావములు
ఎన్నటికినీ
మారునవి
కావు.
వేలాది
వర్షములకు
పూర్వము
ఎట్లుండెనో
నేడునూ
అట్లనే
ఉన్నవి.
ఇకముందు
ఎన్ని
వేల
సంవత్సరములు
గడచిననూ
అట్లే
ఉండును.
భూత,
భవిష్యత్తు,
వర్తమాన
కాలములలో
ఒకే
తత్త్వాన్ని,
లక్ష్యాన్ని,
నీమాన్ని
కలిగియుండునది
వేదాంతము.
అయితే
మన
మతాచార
మర్యాదలు,
మన
సాంఘిక
స్థితిమీదను
ఇతర
సంఘములతో
మనకుగల
పరస్పర
సంబంధముల
మీదను
మాత్రమే
ఆధారపడి
ఏర్పడినవగుటచే
సాంఘిక
స్థితితోపాటు
అవికూడా
మార్పును
పొందియేతీరును.
అవియొక
కాలమున
సముచితములై
ఉండియు
మరొక
కాలమున
అట్లుండవు.
కావుననే
ఒక
కాలమున
విధింపబడిన
ఆహారము
ఇంకొక
కాలమున
నిషేధింపబడి
యుండును.
ఆ
కాలమున
అది
అర్థమై
యుండెను.
కాని
దేశపు
శీతోష్ణస్థితియు
ఇతర
విషయములును
మార్పుచెందుటచేతను,
నూతన
స్థితిగతులెన్నియో
ఏర్పడుటచేతను
ఆ
మార్పుల
కనుకూలముగా
స్మృతియందలి
ఆహార
విషయములందును,
ఇతర
విషయములందును
మార్పులు
విధించెను.
దీనిని
పట్టి
ఈ
ఆధునిక
కాలానుసారముగా
మన
సంఘమునకు
మార్పులవసరము.
అవి
చేసియే
తీరవలెను.
ఇంత
మాత్రముచేత
మన
మత
ధర్మములందు
అణుమాత్రమూ
మార్పులు
ఉండబోవు.
అవి
చెక్కుచెదరవు.
కట్లు
కదలవు.
ఇక
పురాణములను
తెలిసికొనుటకు
ప్రయత్నించవలెను.
"పురాణం
పంచ
లక్షణమ్"
అందురు,
అనగా
అందు
చారిత్రక
సంబంధములైనవి,
సృష్టిక్రమ
సంబంధములైనవి.
తాత్త్విక
సిద్ధాంతములను
విశదీకరించు
సాంకేతికోదాహరణ
రూపమైనవి
యెన్నెన్నియో
విషయము
లుండును.
వేదవిషయమును
సామాన్య
మానవులకు
అర్థమగు
రూపమున
ప్రదర్శించుటకై
ఇవి
రచించబడెను.
వేదభాష
అత్యంత
ప్రాచీన
రూపమైనది.
3
▾
Meaning
Keep
మహామహా
విద్వాంసులలో
కూడా
ఏ
కొలదిమందియో
మాత్రము
వీని
రచనా
కాలమును
కనుగొనగలరు.
పురాణములు
ఆ
కాలపు
జనసామాన్యము
వాడుచుండిన
భాషలో
వ్రాయబడినవి.
మనమిప్పుడు
ఆధునిక
సంస్కృతమను
పేర
వ్యవహరించు
భాషయే
అది.
అప్పటి
విద్వాంసులకేకాక
ఆ
భాష
సామాన్య
ప్రజలకై
ఉద్దేశింపబడినది.
కనుక
ఆ
భావమునకు
ఆ
భాషతోనే
రూపకల్పన
మొనర్చిరి.
మహాపురుషుల
యొక్కయు,
రాజన్యుల
యొక్కయు,
సుప్రసిద్ధ
పురుషుల
యొక్కయు,
జీవిత
రూపమునకు,
జాతి
జీవితములో
కలిగిన
చారిత్రాత్మక
సంఘటనల
రూపమునను
ఇట్టి
ఇతర
స్థూల
రూపమునకును
అందు
ప్రదర్శింప
బడెను.
హిందూమత
సనాతన
ధర్మముల
ఉదాహరణ
రూపముగా
వర్తించుటకై
మహాఋషులు
ఈ
విధముగ
పురాణములు
నిర్మించిరి.
ఇపుడు
పేర్కొనబడిన
గ్రంథము
లన్నింటినికూర్చి,
చేర్చి
హిందూ
శాస్త్రములని
అందురు.
ఎన్నియో
వేల
సంవత్సరములుగా
తాత్త్విక
పారమార్థిక
విషయ
విచారమున
తమ
శక్తిలో
అత్యధిక
భాగమును
వినియోగించి,
ఇంత
అపారమగు
శాస్త్ర
వాఙ్మయమును
నిర్మించిన
జనులందును,
జాతియందును
శాఖాంతరములు
ఎన్నియో
ఏర్పడి
ఉండుట
చిత్రము
కాదు.
ఇవన్నియూ
కాక
ఇంకనూ
వేల
వేలు
శాఖలు
లేక
పోలేదు.
కొన్ని
విషయములందు
ఈ
శాఖలకు
అపారమగు
పరస్పర
భేదములు
కలవు.
వానికిగల
భేదములన్నియు
వానియందలి
పారమార్థిక
భావ
విశేషములన్నియూ
గ్రహించుటకు,
మనకు
ఇప్పుడు
వ్యవధి
చాలదు;
కావున
ఈ
అన్నిటిలో
గల
సర్వసమ్మత
భావములను,
వాని
అన్నిటికినీ
మూలసూత్రములై
యుండు
వానిని
అనగా
హిందువగు
ప్రతి
మనుష్యుడును
అంగీకరించి,
విశ్వసించి
తీరవలసిన
వాటిని
తెలిసికొనవలెను.
సృష్టికి
కారణ
వస్తువేది?
కారణభూతమేది?
అన్న
విషయము
ఇది
భారతీయులకే
కాక
ఆలోచించగల
ప్రతి
మానవునకు
ఇది
అత్యంత
ప్రధాన
ఆధార
సమస్య.
కారణములేని
కార్యము,
ఆధారములేని
ఆధేయము
అవనిలో
ఉండదు
కదా!
4
▾
Meaning
Keep
ఈ
గోచర
రూపమైన
ప్రపంచమంతటికీ,
బ్రహ్మమే
సామాన్య
మూలము
అని
చెప్పవచ్చును.
బ్రహ్మమనగా
నేమి?
అతడు
నిత్యుడు;
శుద్ధుడు,
నిత్య
జాగరూకుడు,
సర్వజ్ఞుడు,
నిరవయవుడు,
నిరాకారుడు.
ఈ
జగత్తు
నంతటికీ
అతడే
సృష్టికర్త.
ఈ
జగత్తును
సర్వదా
సృష్టించుచూ,
కాపాడుచూ
ఉండును.
ఇందు
కొంత
అనుమానమునకు
స్థానము
కనిపించును.
ఈ
జగత్తులో
పక్షపాత
భావము
కానవచ్చును.
ఒకడు
సుఖియై
జన్మించును,
మరొకడు
అసుఖియై
జన్మించును.
ఒకడు
భాగ్యవంతుడై,
మరొకడు
పరమ
దరిద్రుడై;
ఇట్టివి
పక్షపాతమునకు
నిదర్శనములు.
ఈ
లోకమున
జీవమంతటగా
మరణము
పైననే
ఆధారపడియున్నది.
ఒక
జీవి
మరొక
జీవిని
భక్షించును.
బలవంతుడు
బలహీనుని
అణచి
త్రొక్కును.
ఈ
ఘోరము
రేయింబగలు
జరుగుచునే
యున్నది.
ఇదియే
ఈ
లోకమున
గల
స్థితి.
ఇది
నిర్మించినది
ఒక
ఈశ్వరుడయ్యెనేని
'ఆ
ఈశ్వరుడు
క్రూరుడై
ఉండవలెను'
అని
ఊహింతురు.
ఇవి
సామాన్య
మానవుని
సహజ
భావములు.
కానీ
ఈ
పక్షపాతపు
ఉనికికి,
ఈ
స్పర్థల
ఉనికికినీ
కారణ
భూతుడు
ఈశ్వరుడు
కానేకాదని
పరమార్థ
వాహిని
ప్రబోధించినది.
అందు
ఈశ్వరుని
అపరాధమేమియూ
లేదని
నిరూపించినది.
అట్లయిన
వానిని
కల్పించిన
వాడెవడు?
మనమే.
మేఘము
అన్ని
పొలముల
మీదా
సమముగానే
వర్షించును.
కానీ
చక్కగా
దుక్కి
చేయబడిన
పొలము
మాత్రమే
ఆ
వర్షమువలన
ఉపకారము
నొందును.
దున్నక
బీదుగా
పడవేసి
పెట్టబడిన
పొలమునకు
ఆ
ఉపకారము
లభింపదు.
ఇది
మేఘముల
తప్పా?
లేక
వర్షము
తప్పా?
భూమిని
దున్నక
బీదుగా
పెట్టుకున్నవాని
తప్పా?
ఈశ్వర
కృప
సర్వదా
ఉండునదే.
దానియందు
మార్పులే
ఉండవు.
భేద
కల్పన
చేయునది
మనమే.
కానీ
కొందరు
సుఖులుగా,
కొందరు
అసుఖులుగా
జన్మించుటకు
ఏమికారణము
ఈవ్యత్యాసములు
కల్పించు
కార్యములు
వారేమీ
చేయలేదే?
నిజమే.
ఈజన్మమున
చేయకపోవచ్చును.
కానీ
పూర్వ
జన్మమున
చేసిరి.
ఆ
పురాకృత
కర్మయే
భిన్నతకు
కారణము.
మనకందరికీ
ఏకీభావముగల
5
▾
Meaning
Keep
రెండు
సిద్ధాంతములను
ఇప్పుడు
గైకొందుము.
ఈ
విషయమున
హిందువులు
మాత్రమేకాక,
బౌద్ధ
మతమువారు,
జైనులు
కూడా
అంగీకారము
కలిగియున్నారు.
జీవము
నిత్యమనియే
మన
అందరి
భావము.
అది
ఆవిర్భావము
నుండి
ఉత్పత్తి
కాలేదు.
అట్లగుట
అసంభవము.
జీవమట్టిదైనచో అది పనికిమాలినదై యుండును.
జీవము
కాలాతీతము.
కాలపరిమితమై,
ఎదో
ఒక
కాలమున
పుట్టిన
వస్తువులన్నిటికీ
ఎదో
ఒక
కాలమున
అంత్యము
ఉండితీరును.
జీవము
నిన్ననే
ప్రారంభమయి
ఉండెనేని
రేపే
అది
అంతమొంది
తీరును.
దానికి
సమూల
వినాశము
సిద్ధము.
జీవము
అట్లుకాక
అనాదియై
సాగి
వచ్చుచుండవలెను.
ఈ
సత్యమును
కనుగొనుటకు
అంత
అసాధారణ
బుద్ధి
కుశలత
అక్కరలేదు.
ఆధునిక
శాస్త్రములన్నియూ
భౌతిక
ప్రపంచ
పరిశీలన
ఫలముగా
మన
శాస్త్రములలో
ప్రతిపాదించిన
సిద్ధాంతములను
క్రమక్రమముగా
అంగీకరించి
మనకు
తోడ్పడ
నారంభించినవి
కదా?
అంగీకరించక
తప్పదు.
అద్వైత
వేదాంతమొక్కటే
సరియైన
వేదాంతమని
అనేకులు
భారత
దేశమున
భావింతురు.
ఇది
సరికాదు.
మత
సిద్ధాంతముల
నవగాహన
పరుచుకొన
జూచువారి
కందరకును
ప్రస్థానత్రయములనబడు
శ్రుతులు,
బ్రహ్మసూత్రము,
భగవద్గీత
ఈమూడును
ముఖ్యమే
అను
సత్యమును
మరువరాదు.
ఈశ్వరవాణి
అయిన
శ్రుతులు,
ఉపనిషత్తులు,
రెండవదైన
బ్రహ్మసూత్రములు
వ్యాసునిచే
ప్రతిపాదించబడిన
తత్వ
సిద్ధాంతములన్నిటి
యొక్క
పరమ
స్వరూపము.
ఇది
తత్వ
వాఙ్మయమునందు
అత్యంత
ప్రాముఖ్యము
గలిగినది.
ఆ
అపూర్వ
సిద్ధాంతములు
పరస్పర
విరుద్ధములు
కావు.
అందు
ప్రతిదీ
పూర్వ
సిద్ధాంతముల
పై
ఆధారపడియున్నది.
వ్యాస
సూత్రములలో
వాటికి
పరిపూర్ణస్వరూపము
సిద్ధించినది.
నడుమ
వేదాంతమునకు
ఈశ్వర
నిర్మిత
వ్యాఖ్యానరూపమగు
భగవద్గీత
ఇమిడియున్నది.
ఆస్తిక
మతములని
చెప్పుకొను
హైందవ
మతములన్నియూ
ద్వైతముకానీ,
విశిష్టాద్వైతముకానీ,
అద్వైతముకానీ,
ఉపనిషత్తులను,
వ్యాససూత్రములను,
భగవద్గీతమ
6
▾
Meaning
Keep
ప్రమాణములుగా
అంగీకరించుచున్నవి.
వాటన్నిటికీ
ప్రస్థానత్రయమే
ఆధారము.
నూతన
సిద్ధాంతమును
ఒకదానిని
ప్రతిపాదింప
సంకల్పించినవారందరునూ
అనగా
శంకర,
రామానుజ,
మధ్యాచార్య,
వల్లభాచార్య,
చైతన్య
ఇత్యాది
వారందరునూ
ఈ
ప్రస్థాన
త్రయమునకు
ఇంకొక
భాష్యమును
రచించవలసివచ్చెను.
కావున
ఉపనిషత్తుల
ఆధారముపై
నిర్మింపబడిన
ఒక్క
సిద్ధాంతమునకు
మాత్రమే
వేదాంత
శబ్దము
వర్తించునని
చెప్పుట
కేవలము
పొరపాటు.
అన్నియూ
వేదాంత
మతములే.
వేదాంత
నామమును
వహించుటకు
అద్వైతికెంత
అధికారము
కలదో
అంత
అధికారము
విశిష్టాద్వైతికి
కూడా
కలదు.
అంతేకాదు
ద్వైతికి
కూడా
కలదు.
ఇదియే
పవిత్ర
అపురూప
అంతరార్థముతో
కూడినది.
ఏకాత్మ
భావన
నిరూపించునది
భారతీయ
పరమార్థవాహిని.
ఆవు
శరీరమునందు
పాలున్నాయి.
ఆ
పాలలో
నెయ్యి
ఉన్నది.
అయినా
ఆ
నెయ్యితో
బలమురాదు.
ఆ
పాలను
ఆవునుండి
వేరుచేసి,
అనగా
పితికి,
కాచి,
తోడుపెట్టి,
పెరుగు
అయిన
తరువాత
దానినే
చిలికి
వెన్న
వేరుచేసి,
దానినే
తిరిగి
కాచిన
నెయ్యి
కాగలదు.
ఆ
నెయ్యినే
మళ్ళీ
ఆవునకు
త్రాపించిన
ఆవుకు
చక్కని
బలము
కలుగును.
అలాగే
సర్వేశ్వరుడు
సర్వాంతర్యామి
అయినా,
సాధనోపచారములు
లేకుండా
మానవులలో
హితము
చేయజాలడు.
నువ్వులలో
నూనె,
పెరుగులో
వెన్న,
భూమిలో
నీరు,
కట్టెలో
నిప్పు
కలసి
యుండినటుల,
సర్వాంతర్యామి
మానవ
శరీరములోను,
మనస్సులోను
కలిసియున్నాడు.
అతనిని
వేరు
చేయాలంటే
ప్రయత్నము,
సాధన
చేయాలి.
అపుడు
ఆ
రెంటి
అభేదత్వము
అద్వైతంలో
తెలుస్తుంది.
అదే
మోక్షము
అని
శంకరులవారు,
దీనినే
అద్వైతోపాసన
అని
అన్నారు.
7
▾
Meaning
Keep
ఇక
విశిష్టాద్వైతోపాసన:
ఉపాసించతగిన
పరమాత్మ
తనకు
వేరుగా
ఉన్నట్లు
భావించాలా?
లేక
తనతో
కలిసి
ఉండినట్లు
భావించాలా
సాధకుడు?
ఇదీ
ప్రశ్న.
8
▾
Meaning
Keep
ఇక
జవాబు
:
జీవుడు
శరీరానికి
ఆత్మ.
అలాగే
దేవుడు
జీవునకు
ఆత్మ.
అలా
భావించి
ఉపాసించుటే
రామానుజాచార్యుల
విశిష్టాద్వైతోపాసన.
ఈ
సమస్త
భూతజాలము
ఎవనిలో
ఉన్నాయో,
ఎవడు
ఈ
సమస్తానికి
అంతర్యామిగా
వ్యాపించియున్నాడో
ఆ
పరమపురుష
పరమాత్మ
అనన్యభక్తి
(ప్రపత్తి)తోనే
లభ్యమవుతాడు,
అని
పరిజ్ఞాన
ప్రపత్తి
పూర్వకంగా
పరమ
పురుషోపాసన
చేయుటయే
విశిష్టాద్వైతము.
"త్వమేవ
సర్వం
మమ
దేవదేవా"
నీవే
నా
గతి,
నీవే
నా
పతి,
అనే
అనన్య
భావముతో
ఉపాసించుట.
ద్వైతోపాసన,
పతి
పత్ని
సంబంధమే.
జీవాత్మ
పరమాత్మ
సంబంధం
కూడను.
అవ్యయుడై
విష్ణుభగవానుని
తన
పతిగా,
భర్తగా,
భరించే
వానిగా,
తాను
భరింపబడే
వానిగా,
ద్వైతభావముతో
ఉపాసించుటయేయని
మధ్వాచార్యులు
ప్రబోధించిరి.
భగవంతుని
చరణాసక్తి
లేనిదే
జీవన్ముక్తి
మాట
అటుంచి,
కనీసం
బుద్ధిశుద్ధి
కావటం
కూడా
అసంభవము
అంటారు
మధ్వాచార్యులు.
మునులూ,
ఆత్మారాములు
అయినవారికి
లౌకిక
గ్రంధాలు
లేకపోయిననూ
సూదంటు
రాయిలాంటి
శ్రీహరి
కల్యాణగుణముల
విశేషంవల్లా,
భక్తి
పారవశ్యం
వారికి
కలుగుతూ
వస్తుందనియూ,
ఆ
పారవశ్యములో
సిగ్గూ,
బిడియములు
వదిలి
శ్రీహరిలో
ఐక్యతకు
సంసిద్ధుడగుననియూ,
నృత్యము
చేయుననియూ,
బిగ్గరగా
కీర్తనలు
చేయుననియూ,
అసలైన
ఆనందాన్ని
అనుభవిస్తాడనియూ,
ఈ
విశ్వాసాన్ని
ఉపాసనం
చేస్తూ
ఉంటారు.
ఈ
విధంగా
పరానురక్తితో
ప్రధానత
కలిగి
ఉపాసనను
జరుపుటే
మధ్వాచార్యులవారి
అభిమతమని
వేనోళ్ళ
చాటేరు.
పతిని
పొందు
నిమిత్తమై
సతీపతి
పరితాపమే
అద్వైతోపాసన
అన్నారు.
9
▾
Meaning
Keep
భారతగీతోపాసన
:
భారతం
పంచమ
వేదము.
అది
ఐహిక,
అముష్మిక
ధర్మాల
నిధి.
మాధవుడు
భారత
ధర్మక్షేత్ర
రంగస్థలములో
తన
నాటక
సామాగ్రి
దింపుకొని
ఆడిన
అద్భుతమైన
ఆట
మహాభారతము.
భారత
నాటకానికి
పాత్రధారులను,
మాటలను,
పాటలను,
సమకూర్చిన
రచయిత,
నటకుడు,
10
▾
Meaning
Keep
దర్శకుడు,
నిర్మాత,
అంతా
ఒక్క
మాధవుడే.
ఒక
వైపున
అధర్మవృద్ధమైన
అపార
భౌతిక
బలం,
మరొకప్రక్క
ధర్మవృద్ధమైన
పరిమిత
ఆత్మబలము.
ఈ
రెంటి
ఘర్షణలో
పర్యవసానరూపమైన
ధార్మిక
విజయజ్యోతిగా
తనను
నిర్దేశించుట
ఇదే
భారతామృత
సర్వస్వం.
అదే
భగవద్గీత.
మహాభారత
సారాంశమంతయూ
భగవద్గీతలో
ఉన్నది.
"కరిష్యే
వచనం
తవ"
నీవు
చెప్పినట్లే
చేస్తాను.
"స్వధర్మే
నిధనం
శ్రేయః"
ఇదే
ఐహిక
ధర్మానికి
గీటురాయి.
సర్వశ్రేయస్సులను
ప్రసాదించే
నీ
భక్తిని
నిర్లక్ష్యము
చేసిచేసి
కళ్ళు
మూసుకుని
"అహం
బ్రహ్మాస్మి"
అనే
అహంకారముతో
బాధపడే
నకిలీ
బ్రహ్మలకు
క్లేశమే
ఫలితము.
పొట్టు
దంచితే
బియ్యము
రావుకదా?
అసలు
కృష్ణుని
మాటను
నమ్మక,
బుద్ధికి
తోచినట్లు
పోవుట
బ్రహ్మతత్వమునకు
మార్గము
కాదని,
ఉపమేయాదులతో
నిరూపించి,
నిదర్శనమొసగి,
ప్రబోధించిన
సర్వవేదాంతసారము
భగవద్గీత.
సమస్త
శాస్త్రములలోనూ
మథించి,
అందించిన
సుధానిధి,
భారతీయ
పరమార్థ
వాహిని.
దానిని
కాదనువారుందురా?
ప్రకృతి,
కాల,
కర్మలు
మూడునూ
ఈశ్వరుని
పరతంత్రములు.
సత్య
స్వరూపుడగు
భగవంతుడు,
అసత్యములను
దేనినీ
కల్పింపజాలడు.
కనుక
ఒక
విధంగా
చూస్తే
ప్రకృతికూడా
సత్యమనే
చెప్పవచ్చును.
ప్రళయావస్థయందు
చేతన
అచేతనములు
ఈశ్వరునిలో
లీనమైయుండును.
కాలము
ఆద్యంత
రహితము
అగు
ఈశ్వరశక్తి.
కర్మసహితము
ప్రధాన
సత్యమే.
ఈశ్వరుడు
నియమహీనముగా
తోచినట్లు
ప్రవర్తించువాడు
కాదు.
కచ్చితముగా
జీవుల
పూర్వకర్మానుసారము
అతడు
జగమును
సృజించును.
ప్రకృతి
కాలకర్మములు
మూడునూ
ఈశ్వరునిలో
సహసత్యములే.
ఈశ్వర
పరతంత్రములు.
ఈశ్వరుడు
వాటిని
ఉపయోగించును.
ఈశ్వరుడు
సాధారణముగా
ఇంద్రియ
గోచరుడు
కాకున్ననూ,
నిరుగ్మతను
గలిగించు
గాఢ
భక్తియందు
భక్తున
కతడు
ఇంద్రియ
గోచరమగుచున్నాడు.
బాహ్యా
వస్తువులను
దర్శించినటులనే,
భక్తుడు
భగవంతుని
దర్శించుచున్నాడు.
ఈశ్వరుడు
నిరాకారుడన్నపుడు
అతడు
ఏ
రూపమున
కనిపించును?
అతడు
11
▾
Meaning
Keep
అనంతరూపుడు.
భక్తుని
అభిరుచి
ఏ
రూపమున
అభివ్యక్తి
నందును.
అవియే
అతని
అవతారములు.
ఈ
రూపములవలన
ఈశ్వరుడు
సోపాధికుడు
కాకున్ననూ
వీనిలో
ప్రతి
రూపమందునూ,
అతడు
సంపూర్ణముగా
అభివ్యక్తుడు.
అనగా
ప్రతి
అవతారమునందునూ
పరిపూర్ణశక్తిమయుడైన
అభివ్యక్తుడు.
అవతారములలో
కొన్ని
అంశావతారములు,
కొన్ని
పూర్ణావతార
ములు.
అవేకాక
ఆదేశావతారములు
కూడా
కలవు.
వారే
నారద,
సనత్కుమారులవంటి
మహాత్ములు.
ఈశ్వర
సమస్తగుణములూ
వారలకు
లేవు.
కనుక
వారలను
ఆరాధించరు.
జీవుడు
స్వభావములుగా
నిత్యుడు
అనగా
ఆద్యంతరహితుడు,
జనన
మరణములు
లేనివాడు.
స్వప్రకాశకుడు.
జ్ఞానమును,
జ్ఞాతయును,
భోక్తయును,
కర్తయునూ
అతడే.
ఏమైననూ
జీవుడు
ఈశ్వరునివలె
స్వతంత్ర
కర్తకాదు.
ప్రతి
కర్మమునందూ
ఆత్మ,
శరీరము,
నానా
ప్రకారములగు
శ్రోత్రాదులగు
ఇంద్రియములు,
ప్రాణాపాదులైన
వివిధ
చేష్టలు,
దైవమును
కలిసియున్నవి.
ఏమైననూ
జీవుడు
సంకల్పరహితుడుగా
వ్యవహరించు
యంత్రము
వంటివాడు
కాడు.
పూర్వ
జన్మమందలి
కర్మములు,
ప్రస్తుత
జన్మమందలి
కర్మములను,
నిర్ణయించునట్లు
ప్రస్తుత
కర్మలవలన
కర్తయగు
జీవుడు
భవిష్యత్తును
రూపొందించుకొనగలడు.
ఈశ్వరుడు
వాని
స్వభావానుసారముగా
నిర్ణయించును.
వాని
స్వభావాలను
మార్చుశక్తి
ఈశ్వరునికున్ననూ,
తానట్లు
చేయడు.
జీవుని
స్వతంత్రేచ్ఛకే
ఈశ్వరుడు
వదలును.
శిలాశకలము,
శిలయందు
భాగమైనట్లు
జీవుడు
ఈశ్వరునియందు
భాగము
కాదు.
ఒక
విషయమున
జీవ
జగత్తులు
రెండును
బ్రహ్మముకంటే
భిన్నములు,
మరొక
విషయమున
బ్రహ్మముతో
అభిన్నములు.
ఈ
భేదాభేద
సంబంధము
బుద్ధికి
తోచునదికాదు.
శ్రుతుల
వలన
మాత్రమే
వేద్యమగుచున్నది.
ఇది
పరమార్థ
వాహిని
ప్రధాన
సారము.
Previous
←
The Values in the Vedas
Next
The Avatar Alone as Guru
→