Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · The Avatar Alone as Guru
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్రతి
బిడ్డయూ
అపారపురాకృత
కర్మభారము
వహించియే
లోకమునకు
వచ్చుచున్నది.
ప్రకృతిచేతుల్లోనుండి
మంచువలె
మెరిసినట్లు
బిడ్డ
ఊడిపడుటలేదు.
తన
పూర్వకర్మలచే
కల్పించుకొనిన
శుభాశుభ
ఫలముల
ననుభవించుటకొరకే
ఈ
లోకములో
ఆ
బిడ్డ
జన్మించినది.
ఇదియే
మానవులందు
మనకు
కానవచ్చు
భిన్నతలకు
కారణము.
ఇదియే
కర్మసూత్రము.
మనలో
ప్రతివారును
ఎవని
దురదృష్టమునకు
వాడే
కారణము,
వాడే
కర్త.
విధి,
నిర్ణీతగతి.
దైవసంకల్పము
మున్నగు
సిద్ధాంతములన్నింటిని
ఈ
సూత్రమే
కూలదన్నుచున్నది.
ఈశ్వరునకును,
మానవునికిని
సమాధానము
కుదురు
మార్గము
ఈ
సూత్రము
మూలమున
మాత్రమే
యేర్పడుచున్నది,
మనకు
సంభవించు
కష్టములన్నింటికీ
మనమే
కారణము.
మరెవ్వరునూ
కారు.
కార్యకారణములు
రెండునూ
మనమే.
మనము
స్వతంత్రులము.
నీవేమైనా
ఇప్పుడు
అసుఖిగా
బాధలు
పడుచున్నచో
అది
నీ
స్వయంకృత
కర్మఫలమే.
దీనిని
పట్టియే
సుఖానుభూతి
కూడా
నీ
చేతిలోనే
కలదు.
నీవు
సంకల్పించితివేని
అదియును
సాధించుకోగలవని
స్పష్టపడును.
నేనిప్పుడు
పరిశుద్ధుడనై
ఉన్నచో
దానికి
నేనే
కారణము.
కోరితినేని
అపరిశుద్ధుడను
కాగలను.
దీనిని
పట్టియే
తెలియుచున్నది.
మానవేచ్ఛ
సర్వ
స్థితిగతులకును
అతీతము.
అత్యంత
బలిష్టమును,
మహత్తరమును,
అనంతమును
అగు
మానవేచ్ఛ
మానవ
స్వాతంత్ర్యము.
కర్మసూత్రఫలమే
ఇది.
తరువాత
సమస్య
ముక్తి.
ఆత్మయందు
స్త్రీ,
పురుష
విభేదము
లేదు.
ఆ
భేదములు
శరీరమునకు
2
▾
Meaning
Keep
మాత్రమే
సంబంధించినవి.
ఆత్మను
గూర్చి
ప్రసంగించినచో
స్త్రీ
పురుష
భావములు
భ్రాంతి
రూపములైనవి.
శరీరమును
గూర్చిన
ప్రసంగముననే
వానికి
స్థానము
కలదు.
వయస్సు
విషయము
కూడా
ఇంతే.
ఆత్మ
ముదరదు.
ఈ
పురాణ
పురుషుడు
సర్వదా
ఒకటిగనే
ఉండును.
ఆత్మ
ఎట్లు
దిగివచ్చెను?
మన
శాస్త్రమున
ఈ
ప్రశ్నకు
ఒకే
సమాధానము
కలదు.
ఈ
బద్ధత్వమంతటికినీ
అవిద్యయే
కారణము.
అవిద్యాకారణముచేతనే
మనము
బద్ధులమైతిమి.
జ్ఞానమే
దీని
ఔషధము.
అది
మనలను
అవ్వలిదరికి
తీసుకొనిపోవును.
ఆ
జ్ఞానమెట్లు
లభించును?
ప్రేమమూలమున,
భక్తిమూలమున
ఈశ్వరాలయములగు
సర్వజీవులను
ప్రేమించు
మూలమున
వాటి
యన్నిటియందును
అతడు
నివసించును.
అజ్ఞానము
వీడిపోవును.
బంధములు
తెగిపోవును.
ఆత్మ
ముక్తత్వమందును.
ఈశ్వరునిగూర్చి
రెండు
భావములు
మన
శాస్త్రములందు
కలవు.
సగుణభావము,
నిర్గుణభావము.
సగుణదైవమనగా
అతడు
సర్వ
వ్యాప్తియై
సర్వమునకు
సృష్టి,
స్థితి,
లయకారకుడై
జగత్తుకు
తల్లియు
తండ్రియు
అయియుండువాడు
కానీ
మనకును
ఆత్మలన్నిటికినీ
అతడు
శాశ్వతముగా
భిన్నుడై
ఉండడు.
ఆత్మతత్త్వమునే
ముక్తి
అందురు.
అనగా
అట్టి
అభేద
తత్త్వమును
గుర్తించుటే
ముక్తి.
దానియందే
నివసించుటే
ముక్తి.
3
▾
Meaning
Keep
రెండవది
నిర్గుణ
దైవోపాసన
:
దైవభావము,
అందు
ఈ
విశేషము
లన్నియూ
అనావశ్యకములుగా,
అనంతగతములుగా
భావింపబడి
పరిత్యజింప
బడును.
అప్పుడు
నిర్గుణుడు,
సర్వగతుడును
అగు
ఒక
పురుషుడు
మాత్రమే
మిగిలియుండును.
అతనిని
జ్ఞాత
అని
చెప్పవచ్చును.
ఏలయన
జ్ఞానము
మనుష్య
మానసమునకే
సంబంధించింది.
చింతనా
పరుడన
చెల్లదు.
చింతన
అశక్తుల
వ్యాపారము.
తర్కబుద్ధి
అన
చెల్లదు.
తర్కము
అశక్తి
సూచకము.
సృష్టికర్త
అన
చెల్లదు.
బంధమున
చిక్కినవారు
కానీ
సృష్టించరు.
అతనికి
బంధములేవి
కలవు?
కార్యాచరణములన్నియూ,
కోర్కెలు
ఈడేర్చుకొనుటకే
కాని
వేరుకాదు.
పనిచేయు
వారందరునూ
ఏవో
లోపములను
తీర్చుకొనుటకే
కదా!
వేదములందు
అతడు
4
▾
Meaning
Keep
అను
మాటయే
లేదు.
అది
అనియే
అతడు
సూచింపబడునది.
అతడు
అను
మాట
పురుష
వాచక
మగుటచే
లేనిపోని
భేదభావము
కలిగించును.
నిర్గుణ
సూచకమగు
'అది'
శబ్దము
వాడబడి
నిర్గుణత్వమే
బోధింపబడును.
ఇదియే
అద్వైతము.
ప్రతివాడును
పరిపూర్ణత
నందుటయే
విధి.
ప్రతి
ప్రాణియూ
చివరకు
పరిపూర్ణత
నందియే
తీరవలెను.
మన
ప్రస్తుతస్థితి
మన
పూర్వజన్మల
కర్మలయొక్కయు,
పూర్వజన్మల
భావములయొక్కయు
ఫలము.
మన
భవిష్యత్తు
ఇప్పటి
కర్మలయొక్కయు,
భావములయొక్కయు
ఫలమై
ఉండును.
అనగా
మన
అదృష్టమునకూ
దురదృష్టమునకూ
ప్రస్తుత
ప్రవర్తనలే
మూలకారణము.
ఈవిధమైన
ఉజ్జీవన
శక్తి
ఆత్మనుండి
రావలయునే
గాని
మరెచ్చటి
నుండియో
లభించజాలదు.
జీవిత
కాలమంతయూ
మనము
గ్రంథావలోక
నిమగ్నులమై
ఉండవచ్చును.
మనము
అత్యంత
బుద్ధి
పరిణత
నార్జించవచ్చును.
కానీ
చివరకు
మనకు
పారమార్థికాభివృద్ధి
లేశమైనను
ప్రాప్తించి
యుండదు.
మహోన్నతబుద్ధి
పరిపాకము
సాధించిన
మానవునకు
తదనురూపమగు
పారమార్థిక
పరిపాకము
కూడా
అలవడియే
ఉండుననుట
అసత్యము.
గ్రంథపఠనము
చేయునపుడు
మనకు
అందుచే
పారమార్థిక
లాభముకూడా
ప్రాప్తించుచున్నదని
మనమొకప్పుడు
భ్రమ
పడవచ్చును.
కానీ
పుస్తక
పఠన
ఫలమును
జాగ్రత్తగా
పరిశీలించు
కొనినచో,
బుద్ధికి
ఒకవేళ
బలము
చేకూరి
ఉండవచ్చును
గానీ
ఆత్మప్రబోధ
ఏమాత్రము
కలుగలేదని
స్పష్టపడును.
ఈ
పారమార్థ
విషయములను
గూర్చి
మనమందరమూ
అత్యంత
అద్భుతోపన్యాసములు
ఈయగలిగి
యుండియూ
యథార్థమగు
పారమార్థిక
జీవన
మవలంబించుటలో
కేవలము
కుంటుపడి
యుండుటకు
కారణమేమి?
ఇదియే
కేవలము
గ్రంథ
పరిచయముచే
బుద్ధిని
బలపరచుకొని
కూటికోసము
వేషములు
వేసి
వాదోపవాదములు
సలుపవచ్చును.
పాండిత్యమును
ప్రదర్శించవచ్చును,
గీతను
అనేక
విధముల
వ్యాఖ్యానము
గావింపవచ్చును.
ఆచరణలో
నిజమైన
5
▾
Meaning
Keep
పారమార్థికమును
నిరూపించకుండిన
వాని
పాండిత్యము
తలభారమనే
భారతీయ
పరమార్థ
వాహిని
ప్రబోధించినది.
ఈ
ప్రబోధము
ఎవరి
ఆత్మనుండి
వచ్చునో
ఆ
పురుషుని
"గురువ"ని
అందురు.
గ్రంథ
పఠనము
తనలోని
ఆధ్యాత్మిక
భావములను
బలపరచి
ఆచరణ
యందుంచునట్లు
చేయవలెనే
కాని
కేవలము
మెదడుకు
మేతగా
భావించరాదు.
ఆత్మకు
ఆనందముగా
మారవలెను.
అసూయ,
డంబము,
అహంకారము
ఇత్యాది
దుర్గుణములను
తన
నుండి
తరిమి
వేయవలెను.
అది
ఎవరి
ఆత్మకు
ప్రసాదింపబడునో
ఆ
పురుషుని
శిష్యుడని
అందురు.
ఈ
పారమార్థిక
శక్తి
ఒకరి
నుండి
మరొకరికి
లభించవలెనన్నచో
అది
వెలువడు
ఆత్మకు
అనగా
వ్యక్తికి
ప్రధాన
సమర్థతయు,
కైకొను
ఆత్మకు
(అనగా
అందుకొను
వ్యక్తికి)
ప్రతి
గ్రహణార్హతయూ
ఉండుట
అత్యావశ్యకము.
విత్తనము
ప్రాణవంతమై
ఉండవలెను.
చేనుదున్ని
చల్లకమునకు
సిద్ధముగా
ఉండాలి.
ఈ
రెండునూ
సమకూరెనేని
యథార్థమగు
పారమార్థిక
సస్యాభివృద్ధి
అత్యద్భుత
రూపమున
వెలువడును.
నిజమగు
మతబోధకుడు
అత్యద్భుత
ప్రభావవంతుడుగా
నుండవలెను.
శ్రోతయు
బుద్ధి
కుశలత
గలవాడై
ఉండవలెను.
ఇరువురునూ
ఆశ్చర్యమైన
వారుగను,
అసాధారణమైన
వారుగను
ఉన్నచో
తత్ఫలముగా
మహోత్కృష్ట
పారమార్థికోజ్జీవనము
కలుగును.
కానిచో
అట్టిది
కలుగుట
అసాధ్యము.
అట్టివారే
నిజమగు
గురువులు.
గురువులు
చిత్తాపహారులు
కావాలి
గానీ
విత్తాపహరులు
కారాదు.
గురుసేవ,
గురుబోధ
తప్ప
అన్యమనస్కుడు
కాకుండా
ఉండాలి
శిష్యుడు.
గురువేది
చెప్పినా
దానిని
వారు
హృదయములో
ఆచరించుటకు
పూర్ణశ్రద్ధ
కలిగి
యుండవలెను.
అతడే
నిజమైన
శిష్యుడు.
కాలక్రమమున
దానినుండియే
పారమార్థిక
జ్ఞానతృష్ణ
ఉదయించవచ్చును.
అత్యంత
నిగూఢమగు
ప్రకృతి
ధర్మమొకటి
కలదు.
క్షేత్రము
సంసిద్ధమయిన
తోడనే
బీజము
ప్రాప్తించవలెను.
ఆత్మకు
పారమార్థిక
శక్తి
ప్రాప్తించవలెను.
గైకొను
ఆత్మయందు
పారమార్థిక
ధర్మతేజస్సు
ఆకర్షించు
శక్తి
సమగ్రమై
బలిష్టమై
6
▾
Meaning
Keep
ఉండినపుడు
తత్సిద్ధికి
ఆవశ్యకమగు
తేజస్సు
ఈయగల
శక్తి
స్వభావ
సిద్ధముగనే
లభించితీరును.
పాఠకులారా
:
గురువులు,
సామాన్య
గురువులు
అధికము
అయినను
వారికంటే
మహోన్నతులు,
మహోత్తములును
అగు
మరొక
రకపు
గురువులు
కలరు.
వారే
ఈశ్వరుని
అవతారములు.
వారు
పారమార్థిక
బలమును
ఇచ్ఛా
మాత్రమున
ఇతరులకు
ఈయగలరు,
అందించగలరు.
వారి
ఆజ్ఞలచే
అధమాధములు
సహితము
క్షణమాత్రమున
జ్ఞానసిద్ధులు
కాగలరు.
వారు
గురువులందరికీ
గురువులు.
భగవంతునియొక్క
మానవరూపపరమావధులు.
మానవులు
మానవరూపమున
తప్ప
భగవంతుని
చూడజాలరు.
వారిని
ఆరాధించుటే
మానవుల
కర్తవ్యమని
పరమార్థ
వాహిని
మీద
మీద
ప్రబోధించినది.
మనుష్యావతార
మూర్తులందు
తప్ప
మానవుడెవ్వడును
ఈశ్వరుని
నిజముగా
దర్శింపజాలడు.
ఇతర
విధములుగా
మానవులు
దైవమును
దర్శింప
యత్నింతురేని
అత్యంత
వికృతాకారమును
ఒకదానిని
కల్పించుకొందురేగానీ
సాక్షాత్
స్వరూపాన్ని
దర్శించజాలరు.
ఎంత
ప్రయత్నించిననూ
మానవరూపమున
తప్ప
భగవంతుని
మానవులు
సంకల్పింపజాలరు.
భగవంతుని
గూర్చియూ,
ప్రపంచమునగల
సర్వవస్తువులను
గూర్చియూ
అత్యద్భుతములగు
వైజ్ఞానికోపన్యాసములు
ఈయవచ్చును.
తార్కిక
విఖ్యాతి
కాంచవచ్చును.
భగవంతుడు
మానవావతారములు
ఎత్తెనను
గాధలన్నియూ
అర్థరహిత
ప్రలాపములని
నిరూపించుకొని
సంతృప్తులు
గావచ్చును
కానీ
సామాన్యదృష్టితో
నొకించుక
విచారించిన
ఈ
అద్భుత
బుద్ధి
ఏమాత్రము
జ్ఞానము
పై
ఆధారపడియున్నదని
పరిశీలించుకొంటిమేని
అచట
శూన్యమే,
వట్టినురుగే
కానవచ్చును.
Previous
←
Values in the Later Scriptures
Next
Who Am I?
→