Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · Who Am I?
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
"కోహం?
ముక్తిః
కథం?
కేన
సంసార
ప్రతిపన్నవాన్?
ఇత్యాలోచన
మర్ధజ్ఞుస్తపశ్శంసన్తి
పండితాః"
నేనెవరు?
ఈ
కర్తృత్వ
మేమిటి?
ఈ
భోక్తృత్వ
మెందులకు?
జనన
మరణాదులెందులకు
కలుగుచున్నవి?
నాకీ
సంసారమెట్లు
ప్రాప్తించినది?
ఇందుండి
ముక్తి
కలదా?
ఇత్యాది
విషయ
విచారణయే
మహాతపస్సని
ఋషులు
చెప్పెడివారు.
ఇత్యాది
విచారణ
ప్రయత్నమను
తపస్సు
జీవునియొక్క
వివేక
ఫలితము.
ఇది
మొట్టమొదటి
మెట్టు.
ఈ
మెట్టు
నెక్కినంతనే
శాస్త్ర
ఉపదేశమను
దూతనాశ్రయించి,
"శ్రోతవ్యో
మంతవ్యో
నిధి
ధ్యాసితవ్యః"
మొదలగు
సోపానాల
క్రమముగా
దాటి
గమ్యస్థానమగు
ముక్తి
పొందనగునని,
అనగా
ఈ
దృశ్యకల్పిత
జగత్తునుండి
విడుదల
మార్గము
శ్రుతి
చూపించుచున్నది.
ఇట్టి
మార్గదర్శకుడు
మార్గోపదేశకుడు
భగవంతుడొక్కడే.
అన్య
గురువులు
చేయజాలరు.
"సగురుమేవాభిగచ్ఛే
శ్రోత్రియం
బ్రహ్మ
నిష్ఠం"
అనగా
శ్రోత్రియుడును,
బ్రహ్మనిష్ఠ
గల
వాడునునగు
గురువును
మాత్రమే
జేరవలెను
అని
శ్రుతి
తెలుపుచున్నది.
ఇక్కడ
శ్రోత్రియుడు
అనుటచే
సదాచార
సంపన్నుడు
అనగా
శ్రుతి
యుక్తాచరణమున
సంప్రదాయానుసారముగ
మెలగువాడు.
బ్రహ్మ
నిష్ఠుడనగా,
సంశయ
విపర్యయరహితుడు,
నిశ్చలాత్మజ్ఞానసంపన్నుడు,
లౌకిక
జగత్తులో
ఎట్టి
సంపర్కములు
లేక
సర్వం
బ్రహ్మస్వరూపముగ
తలంచి,
చరించి,
నిరూపించువాడు,
త్రికాల
వేద్యుడు,
త్రిగుణాతీతుడు,
ఏకాత్మ
భావుడు
2
▾
Meaning
Keep
ఆనందమయుడు,
ద్వంద్వాతీతుడు;
ఇట్టి
గురువును
జేరుదురు
అని
శ్రుతి
తెలుపుచున్నది.
ఇట్టి
పై
గుణములు
కలవాడు
సర్వేశ్వరుడు
ఒక్కడు
మాత్రమే
కానీ
తత్త్వవేత్తలయిన
లౌకిక
గురువులు
కాదు
అని
మనము
విశ్వసించవలెను.
యోగవాశిష్టమున
శ్రీరామచంద్రుడు
వశిష్టుని
అడిగిన
ప్రశ్నకూడనూ
ఇదియే.
"గురుదేవా!
మృత్యువు
బారినుండి
తప్పించుకొను
మార్గము
కలదా?"
గౌతమబుద్ధుని
విరాగోన్ముఖునిగా
చేసి
అతనిచే
సర్వసంగపరిత్యాగము
చేయించి
లోకోత్తమ
పురుషునిగ
ఖ్యాతి
నొందించినది
పై
ప్రశ్నయే
కదా!
పరమ
భక్తాగ్రగణ్యుండైన
ప్రహ్లాదుడు
కూడను
తోడిబాలురను
పిలిచి,
"బాలకులారా!
మనప్రాయపు
బాలురు
కొందరు
లోకమున
కూలి
పోవుట,
కాలిపోవుట,
రాలిపోవుట
చూచితిరా?"
అనుచు
మృత్యు
ఘట్టమునే
బాలురదృష్టికి
తెప్పించెను.
మృత్యువననేమో
జ్ఞానోపదేశము
చేసెను.
కావున
నిశ్రేయస
ప్రాప్తిని
కోరు
వారందరును
మృత్యువిచారము
ప్రప్రథమమున
సలుపుట
అత్యవసరము.
మృత్యువనగ
భయమో
లేక
అమంగళమో
అని
ఊహించరాదు.
మృత్యువు
ఇతరులకే
కాని
తనకు
కాదని
కానీ
తలంచరాదు.
మృత్యువిషయము
ఇప్పుడెందులకు
ఇది
అప్రయోజనకరమని
కానీ
చింతించరాదు.
మృత్యువిచారణ
అనగా
సాక్షాత్
తన
పరమార్థమును
గూర్చియే
యని
మానవుడు
విశ్వసించవలెను.
వివేకమనగా
దృశ్యమును
లెస్సగా
విచారించి
దాని
యథార్థమును,
దాని
స్వస్వరూపమును
తెలిసికొను
ప్రయత్నమే;
"నేను
ఎవరు?
అను
ప్రశ్న
జనించుటకు
మృత్యువిషయమే
మూలకారణము.
కావున
మృత్యువిషయము
విస్మరించరాదు,
అలక్ష్యము
చేయరాదు,
భయపడి
పారిపోరాదు.
ఇదియే
అజ్ఞాన
ప్రప్రథమ
సోపానము.
అమాయకపు
జీవితానికి
అంకురార్పణము.
మాయకు
మహాబలము.
మానవత్వముయొక్క
పరమరహస్యమంతయూ
మృత్యువిచారంతోనే
ముడిపడి
ఉన్నది.
దైవ
చిద్విలాసమంతయూ
మృత్యువుయొక్క
పరిశీలనలోనే
ప్రకాశించుచున్నది.
3
▾
Meaning
Keep
కఠోపనిషత్తునందు
నచికేతుడు
యముని
అడిగిన
మూడు
వరములలో
మృత్యువిషయము
ప్రధానవరముగా
ప్రకాశించినది.
"మనుజుడు
మరణించిన
పిమ్మట
ఉండునా?
కొందరు
ఉండుననియు,
మరికొందరు
ఉండడనియూ
వారికి
తోచినట్లు
చెప్పుదురు.
ఇందులో
సత్యమెయ్యది?
ఈ
రహస్యమును
నాకు
తెలుపమ"ని
నచికేతుడు
పట్టు
పట్టినాడు.
ఇందులకు
సమాధానము
నివ్వక
యముడు,
"నాయనా!
నచికేతా!
ఆ
రహస్యము
అభేద్యము.
శాస్త్రములు
సూక్ష్మాతి
సూక్ష్మములు.
దేవతలకు
కూడా
తెలుపుటకు
సాధ్యముకాని
వరమును
అడిగితివి.
ఇట్టి
కోరిక
నీకెందులకు?
నీవు
బాలుడవు.
లోకమున
ఎన్నియో
సౌఖ్యములననుభవించదగినవాడవు.
నీకు
మహదైశ్వర్యసంపదల
నొసంగుదును.
వాటిని
అందుకొని
సుఖముల
పొందుము.
నీవు
కోరిన
లౌకికభోగభాగ్యముల
నెన్నియైననూ
ఇత్తును
కోరుకొమ్మ"నెను.
అందులకు
నచికేతుడు,
"ధర్మరాజా!
ఎన్ని
సంపదలైననూ
ఎన్ని
భోగములైననూ
తమ
సంపర్కము
లేనిది
సృష్టిలో
నుండలేవు
కదా?
ఇవన్నియూ
మృత్యువుతో
మిళితమై
తాత్కాలిక
ఉపశమనమును
గూర్చు
సుఖములు
నాకెందులకు?
నేకోరిన
వరమును
నాకు
ప్రసాదించమ"ని
ప్రార్థించెను.
మహాభారతమున
"ఈ
ప్రపంచమున
అతి
విచిత్రమైన
విషయమేది?"
అను
ప్రశ్నకు
ధర్మరాజు
"నిత్యమూ
మనము
మృత్యువును
జూతుము;
కాని
మనము
చత్తుమని
తలంచము,
ఊహించము.
ఇంతకన్నా
విచిత్రమేమి
కలదు"
అని
జవాబు
చెప్పెను.
ఇటులనే
యాజ్ఞవల్క్యుడు
సన్యసింపవలయు
నని
నిశ్చయించుకుని
తన
భార్యలయిన
కాత్యాయని,
మైత్రేయిని
పిలిచి
తన
స్థిరచరాస్తినంతయు
ఇరువురకూ
పంచిపెట్ట
ప్రయత్నించెను.
కాని
మహాప్రజ్ఞగల
అతని
మొదటి
భార్య
అయిన
మైత్రేయి,
భర్తను
చూచి
చిరునవ్వు
చిందులు ద్రొక్క
"నాథా!
ఈ
భౌతిక
సిరిసంపదలు
నన్ను
మృత్యువు
బారినుండి
తప్పించి
నిత్యురాలుగ
జేయగలవా?
అట్లు
చేయునని
తమరు
పూచీ
ఇచ్చిన
తప్పక
నేనంగీకరింతును,
శిరసావహింతును."
అని
ప్రశ్నించెను.
అందులకు
4
▾
Meaning
Keep
యాజ్ఞవల్క్యుడు,
"మైత్రేయీ!
లోకమున
సిరిసంపదలే
కదా
ప్రధాన
సుఖశాంతులను
కలిగించును,
ఇట్టి
విత్తాదులను
వలదను
వారుందురా?"
అని
జవాబు
చెప్ప,
మైత్రేయి,
"నాథా!
అట్లయిన
ఈ
విత్తాదులతో
తమరు
కూడా
సుఖశాంతుల
ననుభవించవచ్చుకదా?
సన్యసించు
టెందులకు?
ఈ
భ్రాంతులచే
అబలలను
మోసపుచ్చుట
మంచిది
కాదు.
మీకు
కాని
విత్తాదులు
మాకు
మాత్రము
ఎట్లు
శాంతి
సుఖముల
నందించును?
ఇవి
అనిత్యములు,
క్షణభంగురములు,
బంధకారణములు,
అజ్ఞాన
పోషితములు,
అశాంతి
కీలకములు,
అనాత్మకలుషితములు"
అని
మైత్రేయి
ఉన్న
సత్యమును
విన్నవించగనే
యాజ్ఞవల్క్యుడు
చేయునది
లేక
మైత్రేయియొక్క
సత్యవాక్కులకు
శిరస్సు
వంచెను.
అంత
మైత్రేయి
పతికి
నమస్కరించి
"నాథా!
సర్వరహస్యములను
ఎరిగిన
మీరు
మా
అల్పబుద్ధులను
పరీక్షించగోరి
ఈ
విధముగ
ప్రశ్నించియుందురు,
నాకే
భోగములూ
వలదు.
సిరిసంపదలూ
వలదు.
నిత్యమగు
పరమానంద
పథము
బొందగలుగు
మార్గోపదేశము
చేయుము"
అని
నమస్కరించెను.
యథార్థముగ
ఉన్నది
ఒక
పరబ్రహ్మము.
"బ్రహ్మసత్యం,
జగన్మిథ్యా
జీవోబ్రహ్మైవనాపరః"
అని
అద్వైత
శాస్త్రములు
చాటుచుండగా
ఈ
స్వప్న
దృశ్యములవంటి
ఈ
భోగభాగ్యములు
క్షణభంగురమైన
పదవులు,
ద్వేష
అసూయ,
స్వార్థాది
ఎండమావులు
నిజమని
తలంచి,
భ్రమించి,
వాటికై
పరుగిడెడివారు
గురువులు
ఎట్లగుదురు?
వారిని
జ్ఞానులన
చెల్లునా?
మిథ్యాపీఠములపై
ప్రతిష్ఠలు,
ఆచరణ
లేని
ఉపదేశములు,
అనుష్ఠానములో
లేని
ఆదేశాలు
ఆదర్శవంతమెట్లగును?
గురుత్వముయొక్క
సత్యత్వమునకు
సహజ
స్థాయికాదుకదా?
ఇట్టివారు
గురువులు
కారు.
సర్వేశ్వరుడొక్కడే
జగద్గురువు
అని
తలంచుట
సాధకులకు
సరియైన
మార్గము.
Previous
←
The Avatar Alone as Guru
Next
This and That
→