Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · This and That
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
ప్రతిజీవియు
తన్ను
"నేను
నేన"ని
వ్యవహరించుకొనుచున్నది.
నేను
రామయ్య,
నేను
కృష్ణయ్య,
నేను
సీత,
నేను
రాధ
అని
ఎవరికి
వారు
నేను
నేను
అను
పదమును
ఉపయోగించుకొనుచున్నారు.
అసలు
మాటలు
రాని
కారణముచే
పశు,
పక్షి,
మృగాదులు
ఈ
"నేను"
అను
పదమును
వ్యవహరించలేక
పోవుచున్నవి.
కానీ
మాటలే
వచ్చియుండిన
అవి
కూడా
ఈ
నేను
నేను
అను
పదమును
ఉపయోగించి
ఉండెడివి.
అంతేకాక,
కొండలు,
గుట్టలు,
మ్రానులు
కూడనూ
నేను
గుట్ట,
నేను
పుట్ట,
నేను
చెట్టు
అని
వ్యవహరించి
యుండెడివి.
ఇవంతయూ
సూక్ష్మముగా
విచారించి
చూచిన
ఈ
"నేను"
అను
పదములో
ఏదో
గొప్ప
రహస్యము
ఇమిడియున్నది.
పామరుని
మొదలు,
పరమాత్మవరకూ
ఈ
"నేను"
అను
పదముచే
వ్యవహరించుచున్నాడన్న
ఈ
రహస్యమును
ఎవరు
విచారించుచున్నారు?
ఎంతమంది
విచారించుచున్నారు?
పోనీ
విచారించి
అర్థము
చేసుకున్నవారెందరు?
పోనీ
అర్థము
చేసుకొని
ఆచరణ
యందుంచిన
వారెందరు?
మహామహా
మేధావులు,
పండితులు,
పరమ
హంసలు
సహితము
ఈ
నేనను
మంత్రమునకు
అర్థమేమో
గ్రహించగలిగినారా?
లేదు.
భగవద్గీతను
పదునెనిమిది
అధ్యాయములు
700
శ్లోకములూ
పూర్తి
కంఠస్థము
చేసుకొని
ప్రవచనము
చేయుచూ,
ప్రబోధలు
సలుపుతూ
వాటి
భాష్యములు
వ్రాసే
మేధావులు
సహితము
ఈ
"నేను"
అను
పదము
యొక్క
పరమార్థమును
పూర్తిగా
గ్రహించినారా?
గ్రహించి
యుండిన
"అహం
త్వా
మోక్షయిష్యామి"
"మామేకం
2
▾
Meaning
Keep
శరణం
వ్రజ"
"క్షేత్రజ్ఞం
చాపిమాం
విద్ధి"
ఇత్యాది
శ్రీకృష్ణ
వాక్యములలో
నేను
నేను
అనియే
సంబోధించుకొనినాడు
కదా
ఈ
విధమైన
నేను
అను
పదము
సర్వత్రా,
సర్వ
జీవాత్మస్వరూపమే,
అనంతరూపమై,
స్పష్టముగను
గోచరించుచున్నది.
పూసలలో
దారమువలె
నామరూపములు
భిన్నములుగా
కానవచ్చుచున్ననూ
అన్నింటినీ
కూర్చిన
సూత్రమువలె
ఈ
"నేను"
కానబడుచున్నది.
రూపనామములు
ఎన్ని
మారినా
ఈ
"నేను"
అనునది
మారక
శాశ్వతముగా
నిలిచియున్నది.
మొదట
ఈ
సర్వవ్యాపకమైన
నేను
గుర్తించిననే
సర్వమూ
తెలిసికొనినవాడు
కాగలడు.
అతడే
జగద్గురువు,
విశ్వగురువు,
సద్గురువు
లోకమున
ఉపాధి
భేదములచే
భిన్న
భిన్న
భావములను
అభివృద్ధి
చేసికొని
వ్యవహరించుట,
ఒకరు
గొప్ప,
మరొకరు
తక్కువ
అని
వ్యవహరించుట
కూడా
ఇట్టి
దొడ్డబుద్ధికి
లక్షణములు
కానేరవు.
కేవలము
పొట్టకూటి
విద్యలు
అనేకము
నేర్చి
వాదోపవాదములకు
సిద్ధమయినంత
మాత్రమున
పాండిత్యము
అనిపించుకొననేరదు.
"నేను"
అను
పదము
పదార్థములనేకాక
సర్వాత్మయగు
పరమాత్మను
గుర్తించి
విచారించు
చుంటిమన్న
మాట.
"ఇదియే
నీవు"
అని
గుండెలను
తట్టి
చూపించుచున్న
విధమున
"తత్త్వమసి",
అను
మహోపదేశ
వాక్యశబ్దమొకటి
ఒక
చెవిని-వినిపించుచున్నది.
ఎంతటి
శాస్త్రజ్ఞుడయిననూ,
స్వతంత్రించి
బ్రహ్మజ్ఞానమునకు
పూనుకొనరాదు.
అనుభవజ్ఞులయిన,
ఆచరణరూపులైన
మహనీయులవలననే
గ్రహించదగిన
విషయములు.
ఈ
పవిత్రమైన
"నేను"
అను
తత్త్వ
జ్ఞానము
తర్కవ్యాకరణాదులకు
సాధ్యమగునది
కాదు.
అవి
అంతయునూ
శ్రుతిస్మృతుల
హెచ్చరిక
సుమా?
నేను
అను
విషయమును
పూర్తి
స్థూలముగ
చెప్పదలంచిన
యెడల
మూడు
ముక్కలతో
తేలిపోవును.
"నేను
పగలు
వ్యవహరించుచున్నాను,
రాత్రులందు
నిద్రించుచున్నాను.
నిద్రలో
కలలు
కంటున్నాను.
ఇట్లు
చేయుచు
చేయుచు
చనిపోవుచున్నాను"
-
ఇది
వ్యక్తికి
గల
జ్ఞానమునుబట్టి
చూచిన
ఈ
వ్యవహారము
"నేను"
పుట్టిన
పిమ్మటి
నుండీ
ప్రారంభమగును.
అయితే
3
▾
Meaning
Keep
పుట్టకపూర్వము
ఈ
"నేను"
ఉండెనా?
ఉండియున్నచో,
ఉన్నవస్తువుకు
పుట్టుట
అనునది
ఉండదుకదా?
పోనీ
పుట్టకపూర్వము
ఎట్లుండెను?
ఈ
"నేను"
ఎచ్చటుండెను?
దేహాదులకు
భిన్నముగ
నుండెనా?
లేక
ఇంద్రియములకు
అతీతమైయుండెనా?
అను
సంశయములు
అలలుగా
చెలరేగును.
అసలు
"నేను"
అను
పదము
ఒక్క
వస్తువునకు,
ఒక్కవ్యక్తికి,
ఒక్క
రూపనామములకు
సంబంధించినది
కాదని
స్పష్టమగుచున్నది.
కనుక
మొదట
"నేను"
అనునది,
లేక
"నేనెవరు?"
అనునది
గుర్తించిన
సర్వప్రపంచమును
గుర్తించినవాడు
కాగలడు.
సృష్టిలో,
జగత్తులో
తెలిసికోదగిన
విషయములు
అనంతమై
యుండగా
ఈ
"నేను"
గూర్చియే
తెలిసికొనవలసిన
అవసరమేమి?
ప్రపంచమును
తెలిసికొనుటకు
ప్రయత్నించవచ్చునుకదా?
లేక
జీవుని
తెలిసికొనుటకు
పరిశీలన
సలుపవచ్చునుకదా?
పోనీ
దేవునిగూర్చి
విచారించవచ్చునుకదా!
ఇట్టి
ప్రపంచ,
జీవ,
పరమాత్మలు
ప్రధానస్థాయిని
అందుకొన్న
మహావిషయములుండగ
వీటన్నింటినీ
విడచి,
నిత్యజీవితము
లో
అమాయకులైన
పసిపాపలుకూడా
పదేపదే
వినియోగించే
ఈ
"నేను"
"నేను"
అను
ఈ
సామాన్య
విషయమును
తెలుసుకొనిన
వచ్చు
ఫలమేమి?
అని
సందేహించవచ్చును.
పదము
సామాన్యమేకానీ
దానిలోని
అర్థము
అనంతము,
అఖండము.
అందుకే
ప్రతి
మహనీయుడు
చెప్పునదీ
ఇదియే,
"నిన్ను
నీవు
విచారించుకో,
నిన్ను
నీవు
తెలుసుకో,
అప్పుడే
మోక్షప్రాప్తి
కలుగును"
అని
హితోపదేశములు
చేయుచున్నారు.
శాస్త్రములు
హెచ్చరించు
చున్నవి.
"యద్విజ్ఞానేన
సర్వం
విజ్ఞానం
భవతం"
మొదలగు
ఆజ్ఞలను
పట్టి
ఆత్మవిచారణే
ముఖ్యమని
తేలుచున్నది.
ఇట్టి
ఆత్మవు
నీవేనని
"తత్త్వమసి"
మహావాక్యము
ఉపదేశించుచున్నది.
కనుక
నీ
వాంఛితము
ఈడేరుటకు
నిన్ను
నీవు
విచారించుకో.
"నీవు"
నిత్యుడ వనియు,
శాస్త్రములు
నిన్ను
ఆవరించిన
అజ్ఞానమును
పారద్రోలి
నీ
స్వస్వరూపమును
అనుభవమునకు
తెచ్చుచున్నవి,
స్ఫురింపచేయు
చున్నవి.
ఇట్టి
పరమ
4
▾
Meaning
Keep
రహస్యమును,
పరమశ్రేయమును
బోధించుచూ
వచ్చుచున్న
శాస్త్రములను
విశ్వసించక
కేవలము
మూఢాచారములవెంట
ముసుగు
వేసుకొని
పయనము
చేసిన
ఆత్మతత్త్వమెట్లు
అబ్బును?
ఆనంద
రూపమెట్లు
అగుపించును?
శ్రుతి
తాత్పర్యము
గ్రహించుటకు
కేవలము
లౌకిక
ప్రజ్ఞమాత్రమే
చాలదు.
దానిని
భక్తి
ప్రపత్తి
భావముతో
భగవత్కృపను
సాధించి
అతని
కరుణాకటాక్షములచే
తెలుసుకొన
సుసాధ్యము.
మానవుల
శ్రేయో
పేయముల
నిర్ణయించ
సమర్థులు
దైవస్వరూపులే.
అన్యులకు
ఇట్టిది
అసాధ్యము.
తమను
తామే
తరింపచేసుకోలేని
నేటి
గురువులు
ఇతరులను
ఎట్లు
తరింప
చేయగలరు?
ఇల్లు గెలవక రచ్చలకు దిగే నేటి గురువులు అధికమగుట చేతను
అనర్థములు
అధికముగా
బయలుదేరి
వాటికి
నానార్థములు
తోకలుగ
పెంచి
యథార్థమును
అంతుతెలియక
చేయుచున్నారు.
అసలు
శాస్త్రములకు
కూడా
తమతమ
అనుకూలములకు
తగినట్లు
అర్థములను
సృష్టించి,
స్వార్థమునకై
వినియోగించుచున్నారు.
ఈ
పరిస్థితిలో
దైవకటాక్షమే
దివ్య
ఆదర్శము,
అదే దారినిచూపే దేదీప్యము, ధన్యులచేసే దయారసము.
దరికి
చేర్చే
దట్టమైన,
దిట్టమైన
ధర్మనావ.
తన్నుతాను
విచారించుకొనుట
మోక్షమార్గమని
అనేకమంది
పెద్దలు
చెప్పుదురు.
కానీ
ఈ
విషయమునకు
తాము
స్వతంత్రముగా
చూచుకొనుచున్నారా?
"స్వవిమర్శో
మోక్షః"
అన్న
విషయమునకు
అర్థమేమి?
అదే
ఆత్మ,
అదే
నేను.
నేను,
ఆత్మ
వేరుకాదు.
నేను
అను
దారము
సర్వత్రా,
పడుగు,
పేకగా
చేరటముచే
అదే
ఆత్మ
అను
వస్త్రముగా
రూపొందుచున్నది.
ఈ
నేను,
నేను
అను
దారములో
దేనికవి
ఉపాధి
భేదముచే
వేరయిన
ఆత్మ
అను
వస్త్రమే
అదృశ్యమగు
చున్నది.
సరే,
అయితే
ఈ
నేనను
దారము,
ఆత్మ
అను
వస్త్రము
దేనికది
విడిపోవచ్చును.
కానీ
ఆ
రెండింటియందు
చెక్కుచెదరక
ఏకంగా
ఉన్న
ప్రత్తి
-
అదే
పరమాత్మ,
పరమాత్మ
అను
ప్రత్తిలేక
నేనను
దారము,
నేనను
5
▾
Meaning
Keep
దారములేక
ఆత్మ
అను
వస్త్రము
ఉండుటకు
వీలులేదుకదా?
ఏతావాతా
ఈ
మూడు
రూపములు,
మూడు
నామములు
ధరించిన
త్రిమూర్తి
స్వరూపమే
ప్రత్తి
అను
పరమాత్మ,
ఏకాత్మ,
దివ్యాత్మ.
Previous
←
Who Am I?
Next
Level and State
→