Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · Level and State
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
హైందవమతము
అనేక
దేవతల
నారాధించుచున్నదనియు,
మత
భేదములలో
పెనుగులాడుచున్నదనియు,
దేశములోని
కలహములకూ
కల్లోలములకూ
ఈ
విధమైన
మతభేదములే
మూలకారణమనియూ
కొందరు
భ్రమించుచున్నారు.
ఇది
సత్యము
కాదు.
వివేకశూన్యులాడు
విలాసవచనములు.
పాశ్చాత్య
దేశీయులందరూ
ఇంచుమించు
ఒక్క
క్రీస్తుమతమునకు
జెందియుండియూ,
ఒక్క
దైవమునే
ఆరాధించువారై
యుండియూ
అడవులలోని
మృగములకన్నా
ఘోరముగ
దేశాభిమానమును
పేర
యుద్ధపు
నెపమున
ఒకరినొకరే
కాక
నిరపరాధులగు
ఇతర
జనానీకమును
సహితము
స్త్రీ
బాలవృద్ధులను
సహితము
భస్మీభూతము
చేయుచున్నారే,
ఇట్టి
ఘోరచర్యలకు
భీభత్స,
కారణరహిత,
బుద్ధిహీనమగు
పైశాచిక
ప్రవృత్తులకు
మతములే
కారణములా?
ఏకమతమువారలై
ఏకారాధకులైన
ఈ
క్రూరులకు
మతమునకు
వెనుకదాగినదేదైనా
యున్నదా?
కల్లోలముకు,
కలహములకు
మతములేమాత్రమూ
కారణము
కాదు.
జర్మనీ
దేశములో
జాతి,
మత,
కుల,
గోత్రాది
భేదములకు
తావులేదు.
వైజ్ఞానిక,
విజ్ఞానములందు
అసమాన
ప్రజ్ఞ
సాధించుకొన్న
దేశము
బల,
శౌర్య,
పరాక్రమములందు
అగ్రస్థానము
నందుకొన్నది.
అట్టి
దేశము
ద్వితీయ
ప్రపంచ
యుద్ధానంతరము
నాలుగు
దేశముల
వారిచే
నాలుగు
భాగములుగా
చీల్చబడి
వారలచే
పరిపాలింపబడుచున్నది.
ఎట్టి
విభేదములు
లేని,
ఎట్టి
మతభేదములు
2
▾
Meaning
Keep
లేని,
ఎట్టి
అనేక
దేవారాధనలులేని
జపానుదేశము
కూడా
అన్యదేశీయుల
ఆధిపత్యము
క్రింద
కొంతకాలము
మ్రగ్గవలసివచ్చెను.
కారణమేమి?
దేశములయొక్క
అధోగతులకు
మత
విభేదములు
మాత్రమే
కారణము
కాదు
అని
జర్మనీ
గుణపాఠము
నేర్పించుటలేదా?
భేదములులేని
ప్రపంచమును
ఎవ్వరూ
ఊహించలేరు.
భేదములు
ప్రాణులయొక్క
ఆంతరంగిక
బుద్ధి
సంస్కార
జనితములు.
ఒక్కొక్క
జన్మము
ఒక్కొక్క
బుద్ధి
సంస్కారపు
బాహ్యస్వరూపము.
సృష్టిలోనున్న
జడములు,
అజడములు
అన్నియూ
బుద్ధిభేదములయొక్క
పరిణామ
కారణము.
చిలుక
చూపు
ఒకవిధముగ
ఉండును,
కాకి
చూపు
మరొక
విధముగ
ఉండును.
జంతు
ప్రకృతి
వేరు,
మానవ
ప్రకృతి
వేరు.
మానవునకు
మానవునకూ
జ్ఞానమున
తారతమ్యము
కలదు.
అంతేకాదు
మానవుల
దేహచ్ఛాయ,
అందచందములందు
కూడా,
అవయవములందు
కూడా,
వారల
అభిమానములూ,
భావములు
మొదలగు
గుణములన్నియూ
బుద్ధి
ఆధార
విషయములే
కాక
వ్యక్తిగతములును
కూడా
అయి
ఉండును.
అంతవరకూ
మనము
పోవనక్కరలేదు.
ఒకే
గర్భమున
పుట్టిన
కవలపిల్లలు
సహితము
ఒక్క
పోలికనుండరు.
ఒకే
గుణములతో
నుండరు.
దీనికి
కారణమేమి?
బుద్ధి
సంస్కారమే.
కావున,
సృష్టిలో
అభేదమును
మానవకోటియందు
సర్వసమానత్వమును
ఏనాటికినీ
చూడలేరు,
సాధ్యముకాదు.
చూడవలెనన్నది
ఊహాగానమే,
గగన
కుసుమమే.
మృగము
తాను
మృగమునను
జ్ఞానముతోను,
పక్షి
తాను
పక్షినను
జ్ఞానముతోను,
స్త్రీ
తాను
స్త్రీనను
జ్ఞానముతోను,
పురుషుడు
తాను
పురుషుడనను
జ్ఞానముతోను
వ్యవహరించుచున్నారు.
నిద్రకు
పూర్వమున్న
జ్ఞానముతోనే
జీవుడు
నిద్రానంతరము
కూడా
తన
పని
మొదలిడును.
మానవుడు
క్రిందటి
దినమున
ఒక
పనిని
ఎంతవరకు
చేసి
విడిచిపెట్టి
ఉండునో
మరుదినమున
నిద్రనుండి
లేచిన
పిమ్మట
ఆయా
పనులను
అచ్చటనుండియే
తిరిగి
ప్రారంభించును.
అటులనే
మానవుడు
వెనుకటి
జన్మమున
వ్యవహారము
ఎచ్చటివరకు
చేసి
వదలి
3
▾
Meaning
Keep
మరణించునో
అచ్చటి
నుండియే
తిరిగి
మరుజన్మమున
వ్యవహరింప
మొదలిడును.
ఈ
విషయమును
"యం
యం
వాపే
స్మరన్
భావం
త్యజత్యంతే
కళేబరం".
"తం
తమేవైతి
కౌంతేయ
సదా
తద్భావ
భావితః"
అన్న
గీతాచార్యుని
వాక్యమును
స్మరించిన
తెలియును.
జీవుని
మృతదేహమును
వదలిపోవు
సమయమున
కలుగుభావము
ననుసరించి
ఉత్తమజన్మ
కలుగును.
ఎట్టి
భావము
కలుగునన,
లోగడ
జన్మలో
ఎట్టి
భావముతో
వ్యవహరించు
కొనుచుండెనో
అట్టి
భావమునకు
అనుకూలమగు
భావమే
మృత్యు
సమయమున
కలుగుచుండును.
దీనిని
సూక్ష్మముగా
విచారించిన
బుద్ధి
సంస్కారముల
ననుసరించియే
కలుగుచున్నదన్నది
పరమసత్యమని
తెలుసు.
రూపసామాన్యములందు
మానవులందరూ
సమానముగా
గోచరించినా
అంతర్భేదములు
అనేకములుండును.
జాతి
అనగా
ఆకారములు,
బుద్ధుల
యొక్క
బాహ్యరూపములు
అంతకంటే
వేరొకటికాదు.
వ్యక్తి
అనగా
ఆకారముగల
వస్తువు.
మనిషి,
చెట్టు,
గుట్ట,
పిట్ట,
నక్క,
కుక్క,
గోవు,
పాము
ఇత్యాది
శబ్దములు
ఆయా
ఆకారమున
గల
జాతిని
చెప్పును.
వ్యక్తికి
నాశము
కలదు.
జాతికి
నాశము
లేదు.
మనిషి
నశించిననూ,
మానవజాతి
నశించదు.
వృక్షము
కూలి,
కాలి,
భస్మమయిననూ
వృక్షజాతి
ఏనాటికీ
నశించదు.
నిత్యమైన
జాతికి
నిర్మూలమేనాటికినీ
జరుగదు,
కాదు.
మన
నిత్యానుభవములో
నున్న
చిన్న
విషయాలను
చక్కగా
విచారించి
చూచిన
ఇట్టి
సత్యము
ప్రత్యక్ష
ప్రమాణముగా
కనిపించును.
మానవత్వమున
మానవజాతి
అంతా
ఒకటే
అయినను
మానవుని
ఎన్నుకొను
సమయమున
అతని
గుణగణములు,
అధికార
స్థితిగతులు
చూతుము.
ఉదాహరణమునకు
ఒక
ఆవు
విషయమున
చూడుడు.
గోత్వమందు
గోజాతి
అంతయునూ
ఒక్కటే.
కానీ
ఆవును
కొనవలెనంటే
దాని
పుట్టుక,
దాని
లక్షణములు
చూచి
తీసుకొందుము
కదా?
అది
మంచి
పాలు
ఇవ్వవలెను.
చూచుటకు
పుష్టిగా
అందముగా
ఉండవలెను.
4
▾
Meaning
Keep
అంతేకాక
అది
సాధువయి
ఉండవలెను.
ఇట్టి
సుగుణములు
కలదానినే
కొందుము
కానీ
గోజాతికదా
అని
ఒక్కపడి
పాలియ్యని
గొడ్డు
గోవును,
సాధుగుణములులేని
దానిని
ఎవ్వరూ
తెలిసి
కొనరు.
ఇక్కడ
గోత్వలక్షణము
గోవులన్నింటియందూ
సమానమే.
మన
ఎన్నిక
ఆకార
సమానత్వముపై
ఆధారపడక
జాతి
వర్ణ
గుణాదుల
మీద
ఆధారపడి
యుండును.
అంతేకదా?
అటులనే
మానవజాతి
ఏకరూపమైననూ
గుణాది
భేదములమీద
ఆధారపడియుండునన్నది
గ్రహించవలసిన
విషయము.
మరొక
విషయమున
మరికొంత
లోతునకు
దిగి
విచారించిన
ఉచ్చ,
నీచ
భావములు
సహజములనక
తప్పదు.
మలమూత్రములలో
భేదమేమాత్రము
లేకున్ననూ
గోవుకు
సంబంధించిన
మూత్రమలములు
మాత్రము
పవిత్రములనియు
ఇతర
జాతికి
సంబంధించిన
మలమూత్రములు
అపవిత్రములనియూ
భావించుచుందురు.
అటులనే
అగ్ని
విషయమున
కూడను.
అగ్ని
అగ్నియే.
అందులోని
గుణములు
ఒక్కటే.
అయిననూ
ఉచ్చనీచ
భేదము
ఉండక
తప్పదు.
మన
ఇంటిలో
దీపమును
వెలిగించుకొందుము,
పొయ్యి
మంటపెట్టుకొందుము,
యజ్ఞయాగాదులలో
హోమమునకై
అగ్నిని
రగుల్చుకొందుము.
అయితే
ఇది
పవిత్రమనియు
దైవస్వరూపము
అనియూ
తలంతుము,
పూజింతుము,
నమస్కరింతుము.
అదే
అగ్ని
స్మశానములో
కళేబరమును
కాల్చుచుండగా
ఆ
నిప్పుతో
ఎట్టి
సహాయమునూ
ఆశించము.
దానికి
నమస్కరించము.
ఆ
అగ్నిలో
రొట్టెలు
కాల్చుకొనము.
దీపము
వెలిగించుకోము.
కారణమేమి?
అది
అపవిత్రము
అని
మన
భావము.
అటులనే
మానవుడు
కూడనూ.
రూపము
లందు
అందరూ
ఒక్కటే
అయిననూ
దేహాది
ఉపాధులననుసరించి
గుణ
ప్రవర్తనల
ననుసరించి
ఇతడు
శ్రేష్ఠుడనియు,
ఇతడు
అశ్రేష్ఠుడనియు
చెప్పకతప్పదు.
విద్యుత్
ప్రవాహము
ఒక్కటే
అయినను
బల్బుల
తార
తమ్యములననుసరించి
వాటి
ప్రకాశమునందు
ఉచ్చ,
నీచ
భేదములు
మనము
చూచుచునే
ఉన్నాము.
పై
విషయములను
5
▾
Meaning
Keep
గుర్తించిన,
విచారించిన
ప్రపంచ
వ్యవహారము
నడచుటకు
భేదములు,
ఉచ్చ
నీచ
స్థాయిలు,
వర్ణ
జాతిమతములు
మొదలగు
తారతమ్యములు
తప్పనిసరిగా
ఉండియే
తీరవలెను.
లేకున్న
కాలచక్రము
సక్రమముగా
పనిచేయజాలదు.
ఇది
భగవత్
నిర్ణయము.
Previous
←
This and That
Next
Man and God
→