Contents
Philosophy & Practice
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sāī Vāhini · Man and God
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
మానవాభ్యుదయమునకు,
మానవ
పరమావధికి
మార్గము
చూపుటకు
మతము
అత్యవసరము.
మతము
జీవునకు
దేవునకు
మధ్యగల
సంబంధ
బాంధవ్యమును
సూచించును.
రెండు
కొండల
మధ్యనున్న
గొప్ప
ప్రవాహమును
దాటుటకు
వంతెన
ఎట్టిదో,
జీవుడను
పర్వతము
నుండి
దేవుడను
పర్వతమునకు
పయనముచేయునపుడు
ప్రకృతి
అనునది
గొప్ప
ప్రవాహము.
ఆద్యంతములులేని
ప్రవాహమును
దాటుటకు
మతము
భద్రమైన
వంతెన.
వంతెనలు
భిన్నభిన్నములుగా
ఉండునటుల
మతములు
కూడనూ
భిన్నభిన్న
రూపములలో
వర్ధిల్లుచున్నవి.
భారతదేశమున
వర్ధిల్లునట్టి
మతమునే
సనాతన
మతమని
పిలుతురు.
అనగా
ఈ
మతమునకు
ఆది
తెలియనందున
సనాతన
మతమనబడెను.
ఇది
ఆది
అంత్యములులేని
వేదములనుండి
వెలువడినది.
కనుక
దీనినే
వేదమతమనికూడా
చెప్పిరి.
దీనినే
ఆర్యమతమనికూడా
పిలిచిరి.
ఈ
మతమునకు
కర్త
ఎవరని
అనేకమంది
అనేక
విధముల
పరిశోధనలు
సలిపిరి.
నేటికినీ
ఆ
కర్తను
అంతుపట్టలేక
పోవుచున్నారు.
అసలు
పట్టలేరు
కనుక
ఇక
మాచేత
కాదని
ఈ
పవిత్ర
సనాతన
మతకర్త
వేదకర్తయే
అని
నిర్ణయించుకొనిరి.
వేదకర్త
పరమేశ్వరుడగుటచే
ఆర్య
మతకర్త
పరమేశ్వరుడే
అని
స్థిరము
చేసికొనిరి.
కాన
ఈ
మతము
దైవ
కృతము.
లోకములో
అనేక
మతములు
కలవు.
అన్ని
మతములూ
పవిత్రములే.
అన్ని
మతములూ
దివ్యములే.
కాని
ఇతర
మతములు
దైవకృతములు
కావని
చెప్పక
తప్పదు.
ఎట్లన
ఒక్కొక్క
మతమునకు
ఒక్కొక్క
దైవదూత
అనబడు
కర్త
మనకు
కనిపించుచున్నాడు.
వారినే
మానవాగ్రగణ్యులని
2
▾
Meaning
Keep
కూడనూ
చెప్పవచ్చును.
బుద్ధుడు,
ఏసుక్రీస్తు,
జోరాష్ట్రియా,
మహమ్మదు
ఇత్యాది
జాతికి
సంబంధించిన
మహనీయుల
పేర్లు
వెలసినవి.
వీరల
సిద్ధాంతములు,
ఆశయములు,
భావములు,
వారల
నామకరణమున
వారివారి
మతములుగా
పరిగణించబడుచున్న
వనుటలో
సత్యము
లేకపోలేదు.
ఎట్లన
ఆదర్శ
మానవాగ్రగణ్యుడని
పించుకున్న
దైవదూత
ఏసుక్రీస్తువలన
సంభవించినదగుటచే
దీనిని
క్రీస్తు
మతమని,
దీనికి
క్రీస్తునామమును
పెట్టిరి.
బుద్ధుని
వలన
ఆవిర్భవించిన
దగుటచే
దీనికి
బౌద్ధమతమని
అతని
పేరు
పెట్టిరి.
దైవదూతగా
వచ్చిన
మహమ్మదు
ఆశయములను,
సిద్ధాంతములను
అనుసరించుటచేత
దానికి
మహమ్మదీయ
మతమని
పేరుపెట్టిరి.
కనుక
ఇట్టివానిని
ఆదర్శ,
అగ్రగణ్య
మానవ
కృతములనుటలో
దోషములేదు.
దైవబుద్ధి
సమగ్రము,
సర్వజ్ఞము.
మానవబుద్ధి
కొంత
హద్దులో
ఇమిడియున్నది.
కించిజ్ఞమని
పిలువవచ్చును.
అన్ని
మత
గ్రంథములునూ
ఒక్క
విషయమునే
చెప్పిననూ,
మార్గములు
వేరువేరుగా
నిరూపించుటచే
పలు
మతములకు
తావేర్పడినది.
పలుమతములుండుటచే
వారి
వారి
సిద్ధాంతములు
వేరు
వేరుగా
ఋజువు
జరుపుచున్నవి.
రామ,
క్రీస్తు,
జోరాష్ట్రియా,
బుద్ధ,
మహమ్మదు
ఇవన్నియు
ఒక్కటి
అని
చెప్పిన
చెల్లదు.
ఈ
శబ్దములు
ఒకే
వస్తువును
తెలుపుచున్నవి.
ఏసుక్రీస్తు
మతమున
జీవులు
సృజింపబడిరి
అని
ఉన్నది.
అల్లా
జీవులను
సృజించెనని
యున్నది.
అటులనే
జోరాష్ట్రియా,
బుద్ధ
మతములుకూడా
ఇంచుమించు
ఇటులనే
తెలుపుచున్నవి.
అయితే
వేదమతము
దీనికి
భిన్నంగా
చెప్పుచున్నది.
జీవుడు
నిత్యుడు.
దేవునియొక్క
ఉనికి
ఈ
జీవునియొక్క
ఉనికికి
సంబంధించియున్నది.
జీవుడే
లేకుండిన
దేవుడే
లేడు
అని
నొక్కి
చెప్పుచున్నది.
ఇతర
మతములవారు
ఇప్పుడిప్పుడే
ఈ
సత్యాన్ని
గుర్తించుచున్నారు.
పూర్వజన్మ,
మీదు
జన్మలమధ్య
ప్రస్తుత
జన్మము
బిగించబడినది.
ఉత్తరగతికి
ఈ
జన్మము
పునాదిగా
నిర్వచింప
బడినది.
ఈ
విషయమునే
వైదిక
మతము
సూచన
ప్రాయముగా
చెప్పుచున్నది.
3
▾
Meaning
Keep
పూర్వాపర
జన్మల
ప్రసక్తి
ఖచ్చితముగా
తెలుపబడెను.
కానీ
ఇతర
మతములలో
ఈ
పూర్వాపర
జన్మలగురించి
అంతగా
తెలుపబడలేదు.
వైదికమతములో
ఉదయము
మొదలు
రాత్రి
పరుండువరకూ
తీరుబడిలేక
చేయవలసిన
కర్మకాండను
విధించియున్నారు.
అందులో
యజ్ఞ,
యాగ,
క్రతువులాదిగా
గల
ప్రక్రియలను
విధించిరి.
ఇంతటితో
విడువక
మానవ
గర్భమందున్న
శిశువునకు
తగిన
సంస్కారములు
మొదలుకొని
మృత్యువు
తదుపరి,
తిరిగి
పరలోక
ప్రాప్తి
కలుగువరకూ
కర్మకాండలను
కల్పించిరి.
ఇట్టివి
ఇతర
మతములందెందునూ
కానరావు.
కనుక
అన్ని
మతములు
ఒక్కటే
అనుట
చెల్లదు.
హైందవమతము
ప్రత్యేక
ప్రక్రియలను
శాసించినందున
సర్వమతములు,
విధులూ
ఒక్కటే
అన్నది
ఒప్పుకున్నది.
ఇట్టి
కర్మసిద్ధాంతములకు
భక్తి,
జ్ఞాన
యోగములే
పునాదులు.
ఈ
మతమను
మహావృక్షమునకు
కూకటివేరు
ధర్మము;
ఇవన్నియూ
మార్గభేదములేకాని
విజాతీయములు
కావు.
ఇందులో
వైరాగ్యాదులు
పత్ర
పుష్పములు.
అందుండి
జనించు
ఫలమే
జ్ఞానము.
ధర్మమను
కూకటి
వేరు
భక్తి
అను
జలముద్వారా
పోషింపబడుచున్నది.
ఈ
పై
వ్యవహారములో
ఏ
ఇబ్బంది
కలిగిననూ
అనగా
ఎట్టి
నీమము
తప్పిననూ
జ్ఞానఫలము
దెబ్బతినును.
ఇది
హైందవశాసనము.
ఇట్టి
ప్రణాళిక
కూడా
మరే
మతముననూ
కానరాదు.
ప్రాచీన
ఋషులు
స్వానుభవముతో
శోధించి,
మధించి
అందించిన
సుధారసము
హైందవ
మతము.
అంతేకాని
ఏదో
బజారులో
అమ్మబడు
పదార్థములవలె
మతము
ఏరుకొని
నిర్ణయించినది
కాదు,
స్వీకరించినది
కాదు.
మతములు
జన్మతః
ఏర్పడినవి.
ఎవరికి
నచ్చిన
మతమును
వారు
స్వీకరించుటకాదు.
ఇట్లు
తలంచుటలో
మతమునకు
స్థానమే
లేదు.
మూడునాళ్ల
జీవితమే
అయిన
నీతి
నియమాలెందుకు?
జీవితము
మూడునాళ్ళ
ముచ్చట
కాదు.
సుదీర్ఘమయిన
ప్రయాణము
జీవితము.
మతమనునది
ప్రస్తుతమునకు
ఉపశాంతి.
ముందునకు
ప్రోత్సాహ
ఉత్సాహములను
పురికొల్పునదై
యుండవలెను.
వెనుక
చేసిన
కర్మఫలమును
ఇప్పుడు
అనుభవించు
4
▾
Meaning
Keep
చున్నామనియు
ప్రస్తుత
పరిస్థితిలో
సమాధానపడుటకు
ఉపశాంతి.
ఇప్పుడు
మంచి
కర్మలాచరించిన
మంచి
మంచి
ఉత్తమ
జన్మము
అందు
కొందురనునది
ఉత్సాహ
ప్రోత్సాహము.
ఈ
రెండు
భావములతో
జీవితమును
మిళితము
చేసినపుడే,
అట్లు
చేయువారలకే
నీతి
నియమాదులకు
స్థానముండును.
నీతి
నియమాదులను
సవ్యముగా
నడుపగలశక్తి,
సమాధాన,
ప్రోత్సాహ,
ఉత్సాహములలోనే
యున్నది.
మతమునకు
మొదలు
ఏది,
కొసయేది?
అనునది
చెప్పుటకు
వీలుకాదు.
అటులనే
జీవులకు
మొదలిది,
కొసయిది
అని
చెప్పుటకు
సాధ్యము
కాదు.
అంతేకాక
హైందవమత
సిద్ధాంతము
ప్రకారము
జీవుడు
అనాది.
ప్రస్తుత
జన్మమెత్తుటకు
పూర్వసంస్కారమే
కారణమైయున్నది.
అంతేకానీ
దేవుని
విలాసముల
నిమిత్తమో
లేక
ఏ
ఆగ్రహ
అనుగ్రహముల
వలననో
ఈ
జన్మము
లభించినదని
తలంచరాదు
అని
సనాతన
హైందవమతము
చాటుచూ
వచ్చుచున్నది.
మరొకటి:
ధర్మార్థ
కామ
మోక్షములనబడు
పురుషార్థములలో
మోక్షమను
దానిని
పలుమతములు
పలురీతులుగా
వర్ణించుచున్నవి.
కానీ,
ఇతర
మతములలోని
ఏయొక్క
సత్యమో
లేక
సిద్ధాంతమో
హైందవమతమున
ఉండినంత
మాత్రమున
రెండు
మతములూ
ఒక్కటే
అని
చెప్పుట
అసంభవము.
కొన్ని
కొన్ని
సిద్ధాంతములు
అన్ని
మతము
లందునూ
కనిపించవచ్చును.
ఆయా
విషయములు
మాత్రము
ఒక్కటి
అగునేమోకాని
అన్ని
సిద్ధాంతములూ
ఏకంగా
ఉండవు.
ఆదియైన,
అనాదియైన
హైందవమతము
అన్నింటికంటే
మిన్న.
దీనినుండియే
మిగిలిన
మతములు
కొన్ని
సిద్ధాంతములను
ఎన్నుకొని
యుండవచ్చును.
ఇతర
మతములలో
నున్నవారికి
వారివారి
సంస్కారవశమున
హైందవ
మతమునందలి
సత్యము
స్ఫురింపవచ్చును.
లేక,
ఇది
మంచిదని
అంగీకరించవచ్చును.
అంత
మాత్రముచేత
ఆ
మతము,
ఈ
మతమూ
రెండూ
ఒక్కటే
అని
చెప్ప
సాధ్యముకాదు.
ఈ
సత్యాన్ని
గుర్తించుటలోనే
హైందవ
సాంప్రదాయము
సాగివచ్చుచున్నది.
5
▾
Meaning
Keep
మతము
ఎన్నటికినీ
వ్యక్తిగతము
కాదు,
ఎవరి
నమ్మకము
వారిదే
అగుటచే,
ఎవరి
ఆచరణ
వారిదే
గనుక,
మతమొక
రీతిగా
వ్యక్తిగతము
కావచ్చునేమో.
ఎంతవరకు
అనగా
సనాతన
సాంప్రదాయములను
ఉల్లంఘించనంతవరకూ;
కానీ
దేవుడు,
మతము,
వర్ణములూ
లేవను
బుద్ధిమంతులు
తాము
విశ్వసించిన
దానితో
తృప్తిపడియుండుట
మనకు
కానరాదు.
ఎందుకన,
దేవుడు
లేడని
కానీ,
కర్మకాండ
మూఢ
విశ్వాసమనికానీ
అను
వారు
అనేకమంది
మనకు
కనిపించుచున్నారు.
అట్టివారు
కేవలము
ఏమీ
తెలియనివారు
కారు.
లేక
విద్యలేనివారలు
కారు.
అన్నీ
తెలిసినవారు,
గొప్ప
విద్యావంతులు.
అట్టివారు
మూఢవిశ్వాసములని
చెప్పుటలో
ఉన్న
అంతరార్థమేమిటి?
అంతమాత్రముతో
ఊరకుండిన
కొంత
నయమే.
మౌనము
వహించిననూ
సంఘమున
కేనష్టమూ
ఉండదు.
కానీ
అట్లు
వారు
ఊరకుండుటలేదు.
చిన్న
ఉదాహరణము:
మత్తుపదార్థములైన
కల్లు,
సారాయి,
త్రాగుట
వ్యక్తిగతములే.
కాని
అవి
వ్యక్తిగతములని
ఇతరులు
హర్షించు
చున్నారా?
హర్షించరు
కదా?
ఎంత
వ్యక్తిగతములని
సమర్థింపబూనిననూ
ఆ
దుశ్చర్యలు
సూక్ష్మముగనో,
స్థూలముగనో
సంఘముపై
తమ
ప్రభావమును
ప్రతి
క్రియారూపముగ
చూపక
మానవు
కదా?
జన
సామాన్యము
ఇట్లు
వ్యవహరించిన
అంత
బాధ
కలుగదు.
కానీ
సంఘములో,
సమాజములో
పేరెన్నికగన్న
పెద్దలిట్లు
వ్యవహరించిన
జనసామాన్యము
వక్రమార్గము
పట్టుదురు.
వ్యాస
వాల్మీకాదులు
రచించిన
గ్రంథములు
బహు
పురాతనములు.
కావుననే
వాటికి
పురాణములని
పేరు
వచ్చినది.
చిరకాల
జననములైననూ
వృద్ధాప్యమనునది
వాటినంట
జాలకున్నది.
అట్లు
కానిపక్షమున
ఆసేతు
హిమాచలము
వానిని
కాంక్షించుచుండెడివారు
కారు.
గ్రంథములన
ఇట్టివి?
యౌవనములో
గతము,
వర్తమానము,
భూతమను
విచక్షణ
రహితముగ
ఎవ్వరు,
ఎప్పుడు,
ఎచ్చట
కావించిననూ
ఆనందసాగరమున
ముంచునవిగ
నుండవలెను.
6
▾
Meaning
Keep
సృష్టియందు,
మనుధర్మశాస్త్రమునుబోలు
గ్రంథము
ఇంకొకటి
కానరాదు.
ఏ
కాలమున,
ఎవ్వరైననూ
అట్టి
గ్రంథమును
సృజింపగలరా?
హైందవ
సిద్ధాంతములుకానీ,
శాస్త్రములుకానీ,
భౌతిక
విజ్ఞానశాస్త్రములకు
లొంగునవి
కావు.
భౌతిక
విజ్ఞాన
శాస్త్రవిజ్ఞానము
దినదినాభివృద్ధి
నందుచున్నది.
కానీ
నిన్నటి
సిద్ధాంతమును
నేడు
ఖండించు
నూతన
సిద్ధాంతములను
లేవనెత్తుచున్నారు.
ఇట్లయిన
నిత్య
సత్యములగు
శాస్త్ర
సిద్ధాంతములను
భౌతిక
విజ్ఞానశాస్త్రముతో
ఎట్లు
పరీక్షింపనగును?
గుడ్డి
నమ్మకముపై
ఆధారపడక
కేవలము
పరీక్షలకు
దిగి
శాస్త్రరీతిగా
పరిశీలించి
సర్వ
విషయములు
శోధించుచుంటిమని
నేటి
శాస్త్రవేత్తల
అభిప్రాయము.
ఇదంతయూ
స్వతంత్రవిచారణ
అని
వారి
భ్రాంతి.
ఇది
సత్యము
కాదు.
మనము
క్రొత్త
సిద్ధాంతమును
లేవతీయనవసరములేదు.
సర్వమూ
సిద్ధమైయున్నది.
గ్రహించుటే
మన
కర్తవ్యము.
పాశ్చాత్య
వేదాంతులైన
కాంటు
మొదలుకొని,
స్పెన్సర్వరకు
విచారించిన
అంశములు
ద్వైత,
అద్వైత,
విశిష్టాద్వైత
సిద్ధాంతములలోని
తుంపరలు.
హిందువులు
సర్వవిషయములను
ఇదివరకే
విచారించి
సిద్ధాంతీకరించిరి.
వైదికమతము,
హైందవమతము
వర్ణాశ్రమాచార
ధర్మములపై
ఆధారపడియున్నది.
కానీ,
మతమునందు
వర్ణమను
విషయము,
వేదాంతమునందు
మాయయను
పదము
సామాన్యముగ
అలక్ష్యముగను,
విసుగుగను.
నిరసనమునకును,
విమర్శకును
గురి
అగుచున్నవి.
వర్ణభేదములు
మానవ
కృతములనియు,
ప్రత్యక్షముగా
దృశ్యగోచరమై
అనుభవనీయమగు
జగత్తు
మాయయని
అనుటయు
శుద్ధ
అవివేకమని
కొందరు
తీర్మానించుట,
విమర్శించుట
జరుగుచుండును.
"చాతుర్వర్ణ్యం
మయా
సృష్టం
గుణకర్మ
విభాగశః"
అను
స్మృతియు,
"బ్రాహ్మణోఽస్య
ముఖమాసీత్,
బాహూరాజన్యః"
అను
శ్రుతియు
పరమేశ్వర
కృత
వర్ణ
విభాగసూచితములని
చెప్పుట
తటస్థించినయెడల
వాని
అర్థ
తాత్పర్యములు
వేరొక
విధముగ
అన్వయింపబడుట
తటస్థించుచున్నది.
కావున
అసలు
7
▾
Meaning
Keep
వర్ణములనునవి
యున్నవా,
వర్ణమనగా
ఏమి
అను
సందేహములను
విచారించుటకైనా
ప్రయత్నించుచున్నారా?
లేదు.
వర్ణమనునది
ఒక
పదము.
ప్రతి
పదమునకూ
ఒక్కొక్క
అర్థము
కలదు.
అందువలన
వర్ణమను
పదమునకు
కూడా
ఒక
అర్థము
ఉండవలెనుకదా?
వృక్షమునకు
వృక్షమను
శబ్దమే
ప్రమాణము.
పదమనగా
శబ్దము.
ఏనుగునకు
ఏనుగను
శబ్దమే
ప్రమాణము.
అదే
విధముగ
పిల్లి,
కుక్క,
నక్క
అను
మాటలను
తెలుపగనే
ఆయా
శబ్దముల
యొక్క
అర్థములని
ఆయా
రూపములను
గ్రహింతుము.
ఆ
శబ్దములు
మనకు
పూర్వమే
యున్నవి.
శబ్దజాలములోనే
మనము
పుట్టితిమి
కానీ
శబ్దాన్ని
మనము
పుట్టించలేదు.
శబ్దమును
సృజించుకొనెదమనిననూ
నలుగురు
చేరవలెను
కదా!
ఇందులకు
ముందుగ
ఇట్టి
మాటలుండి
యుండవలెను
కదా!
ఇట్టి
మాటలకు
అర్థములు
కూడా
ఉండి
యుండవలెను
కదా!
కాన
పదములనూ
వాటి
అర్థములనూ
మనము
నిర్ణయించుకొంటిమను
మాట
అసంభవమని
గ్రహింతురుగాక!
మాటలు,
వాటి
అర్థములు
మనము
పుట్టకపూర్వమే
కలవు.
అందులో
మనకు
కావలసిన
మాటలను
ఉపయోగించు
కొనుచున్నాము.
వాక్కనగా
మాట,
లేక
పదమన
పదములయొక్క
అర్థములే
సృష్టిలోని
విషయములు.
అందులకే
సృష్టిలోని
వస్తుజాలములకు
పదార్థములు
అని
పేరు
వచ్చినది.
పదార్థములు
అనగా
పదములు,
వాని
అర్థములు.
గుట్ట
అను
పదము
దానికి
ఎదురుగా
వున్న
కొండయే.
కుండ
అను
ఒక
పదమునకు
మట్టితో
చేయబడిన
ఒక
ఆకారము,
దాని
అర్థము.
అటులనే
బ్రాహ్మణ,
వైశ్య,
శూద్ర
అను
పదముల
అర్థ
సూచితములగు
మానములు
ఉండవలదా?
ఎవరు
బ్రాహ్మణులు,
ఎవరు
కాదు
అను
ప్రశ్న
ఇచట
అసందర్భము.
పదము,
దాని
అర్థము
కలదని
నిరూపించు
ఘట్టమిది
అని
గ్రహించవలెను.
కావున
ప్రపంచమంతయూ
పదములు
వాని
అర్థములు
అని
తెలుతున్నది.
పదమునకు
పర్యాయపదము
నామము,
అర్థమనగా
రూపము.
ఏతావాతా
ప్రపంచ
మనగా
నామ
రూపములన్నమాట.
కనుకనే
ప్రపంచ
మంతయూ
నామ
రూపములు
తప్ప
అన్యము
లేదు.
8
▾
Meaning
Keep
శ్రుతికూడా
అటులనే
తెలిపినది.
"వాచారంభణం
వికారో
నామధేయం"
అనగా
వాక్కు
దానియొక్క
అర్థము.
శివపార్వతులవలే,
జడ
చైతన్యములవలే,
బింబ
ప్రతిబింబములవలే,
చంద్రుడు.
చంద్రికవలే
ఈ
రూపనామములు
అవినాభావ
సంబంధములు.
రెండునూ
విడదీయరానివై
యున్నవి.
లోకవ్యవహారమునకు
వాక్కే
ప్రభావము.
అదే
మూలము.
ఈ
వాక్కునకు
ఆధారము
భావము.
భావమునకు
ఆధారము
అనుభవము.
అనుభవమునకు
ఆధారము
కోరిక.
కోరికకు
ఆధారము
అజ్ఞానము.
అజ్ఞానమన్ననూ,
మాయ
అన్ననూ,
అవిద్య
అన్ననూ.
ప్రకృతి
అన్ననూ
ఒక్కటే.
అయితే
ఈ
అవిద్య
మాయ,
అజ్ఞానము,
ప్రకృతికి
పరమాత్మయే
ఆధారము.
పరమాత్మా
పరంజ్యోతి,
జ్ఞానజ్యోతి,
దివ్యజ్యోతి,
స్వయంజ్యోతి.
అట్టి
స్వరూపుడైన
పరమాత్మను
ఆధారము
చేసుకొన్న
అజ్ఞానము,
మాయ
ఇత్యాది
అవిద్యలు
మనలను
ఆవరించవు.
జ్యోతి
ఉన్నచో
చీకటికి
స్థానము
లేదుకదా!
జ్ఞానమున్న
అజ్ఞానము
ఆవరించదు
కదా!
కనుక
అతడే
"బహుస్యాం"
అను
మనోభావముతో
జగత్తును
రచించినాడు.
శ్రుతిననుసరించి
నామరూపములు
ఏర్పాటు
చేసినాడు.
మానవుడు
శబ్దములను,
అర్థములను
సృజించుట
అనునది
హాస్యాస్పదము,
సర్వశక్తివంతుడైన
పరమాత్మయే
ఇట్టి
శక్తినీ,
అర్థమునూ
ఏర్పరచును.
అతనినే
పరమాత్మ
అని
అంటున్నాము.
దేవుడు
కలడా
లేడా
అను
ప్రశ్నకు
ఏకైక
జవాబు
దేవుడు
కలడని
ఋజువు
చేయుటకు
దేవుడను
పదమే,
శబ్దమే
ప్రధాన
ప్రమాణము.
Previous
←
Level and State
Next
Colour and Caste
→